English | Telugu
ఇండస్ట్రీపై పడతారేంటి అంటూ జగన్ సర్కార్‌కి చిరంజీవి మాస్ వార్నింగ్!
Updated : Aug 8, 2023
మెగాస్టార్ చిరంజీవి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.అయితే సినిమాల పరంగా కాదు.. రాజకీయాల పరమైన కామెంట్స్‌తో. అదేంటి? ఇప్పుడు చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కదా. అన్నీ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఆయనతో సన్నిహితంగానే ఉంటున్నారు కదా. ఇప్పుడు మళ్లీ ఏమైంది? ఆయన మళ్లీ పొలిటికల్‌గా చేసిన కామెంట్స్ ఏంటి? సందర్భమేంటనే వివరాల్లోకి వెళితే, సోమవారం సాయంత్రం చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు సంబంధించిన 200 డేస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ ఇన్‌డైరెక్టగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పర్టికులర్‌గా చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారని చెప్పటానికి కారణం ప్రత్యేక హోదా గురించి మాట్లాడటమే.
‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి’’ అంటూ ‘వాల్తేరు వీరయ్య’ 200 డేస్ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి చేసిన కామెంట్స్, దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి దీనిపై పొలిటికల్ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయనేది చూడాలి. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇందులో చిరంజీవి తమ్ముడి పాత్రలో రవితేజ నటించిన సంగతి తెలిసిందే.
తాజాగా చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ఆగస్ట్ 11న రిలీజ్ అవుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. మెహర్ రమేష్ సినిమాకు దర్శకత్వం వహించారు.