English | Telugu
‘పుష్ప 2’ రిలీజ్ ప్లానింగ్.. షూటింగ్ అప్‌డేట్
Updated : Aug 7, 2023
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాను పూర్తి చేయటంతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అందుకు కారణం ‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా ‘పుష్ప 2 ది రూల్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్, ప్రేక్షకులు సహా ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు కలెక్షన్స్ వసూలు చేయనుందనే దానిపై ఇప్పటి నుంచే లెక్కలు మొదలయ్యాయి. ఓ వైపు బన్నీ, సుకుమార్ అండ్ టీమ్ షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. ఆ మధ్య అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఇచ్చిన వీడియో, ఫస్ట్ లుక్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
పుష్ప 2పై అంచనాలు ఎలా ఉన్నాయనే సంగతి అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీమ్‌కు బాగానే తెలుసు. అందుకనే వారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను భారీగానే తెరకెక్కించే పనిలో ఉన్నారు. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు ఈ సినిమా ఇప్పటి వరకు 40 శాతం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారట. అది కూడా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా. ఇప్పటి వరకు షూటింగ్ జరిగినంత వరకు ఔట్ పుట్‌పై సుకుమార్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారట. అందుకనే వచ్చే ఏడాది బన్నీకి బర్త్ డే ట్రీట్‌గా పుష్ప 2 ను ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తే ఆ రేంజ్ మరోలా ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు టాక్.
అల్లు అర్జున్ జతగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న పుష్ప 2లో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ శ్రీలీలను స్పెషల్ సాంగ్ కోసం అప్రోచ్ అయినట్లు కూడా న్యూస్ వైరల్ అవుతోంది మరి.