English | Telugu

పార్టీ లేదా పుష్ప.. షెకావత్‌ లుక్ అదిరిపోయింది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై నార్త్ లోనూ సంచలన వసూళ్లు సాధించింది. ఈ సినిమాలోని బన్నీ మ్యానరిజమ్స్ కి, సాంగ్స్ కి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. దీంతో రెండో భాగంగా రానున్న 'పుష్ప: ది రూల్'పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది.

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏప్రిల్ లో విడుదలైన ఫస్ట్ లుక్, 'వేర్ ఈజ్ పుష్ప' గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తిరుపతి గంగమ్మ జాతర సాంప్రదాయానికి అద్దంపడుతూ అర్థనారీశ్వర రూపంలో ఉన్న బన్నీ ఫస్ట్ లుక్ కట్టిపడేసింది. ఇక తాజాగా పుష్ప-2 నుంచి ఫహాద్‌ ఫాజిల్‌ లుక్ రివీల్ అయింది. 'పుష్ప-1'లో తెరమీద కనిపించింది కాసేపే అయినప్పటికీ 'పార్టీ లేదా పుష్ప' అంటూ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ గా ఫహాద్‌ ఫాజిల్‌ ఎంతలా మ్యాజిక్ చేశారో తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప-2'లో పుష్పరాజ్ ని ఢీకొట్టే పాత్రలో చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఫహాద్‌ ఫాజిల్‌ పుట్టినరోజు(ఆగస్టు 8) సందర్భంగా తాజాగా పుష్ప-2 నుంచి ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సిగరెట్ తాగుతూ.. నల్ల కళ్ళద్దాలు, గుండుతో ఉన్న ఆయన పవర్ ఫుల్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.