English | Telugu
‘భోళా శంకర్’కి తమన్నా డుమ్మా.. లిస్టులో నాలుగో హీరోయిన్!
Updated : Aug 7, 2023
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 11న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈవెంట్‌కి చిరంజీవి, అరవింద్ సహా కీర్తి సురేష్ తదితరులు హాజరయ్యారు. అయితే మూవీ హీరోయిన్‌గా నటించిన తమన్నా మాత్రం హాజరుకాలేదు. నిన్నమొన్నటి వరకు ఇక్కడే ఉన్న తమన్నాకి ఏమైందో ఏమో కానీ ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్‌లో మాత్రం కనపడలేదు. ఇలా చిరంజీవి ఈవెంట్‌కు హీరోయిన్స్ డుమ్మా కొట్టడం ఇది నాలుగోసారి.
వివరాల్లోకి వెళితే.. చిరంజీవి సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌కి నయనతార హాజరు కాలేదు. ఆమె సాధారణంగా ఏ సినిమా ప్రమోషన్స్‌కు కూడా రాదు. కాబట్టి సరేనని అందరరూ అనుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరు, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ కాజల్ కనపడలేదు. అందుకు కూడా కారణాలున్నాయి. ముందుగా కాజల్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినప్పటికీ ఎడిటింగ్‌లో లేకుండా పోయింది. దాంతో ఆమె కూడా ఈవెంట్‌కు రాలేదు. కాగా ఈ ఏడాది రిలీజైన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రీ రిలీజ్‌కి శ్రుతీ హాసన్ రాలేదు.
అంతకు ముందు జరిగిన వీరసింహా రెడ్డి ఈవెంట్‌కు హాజరైన ఆమె వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు రాలేదు. అడిగితే జ్వరం కారణంగా చూపింది. అయితే ఆ సినిమా పాటలను విదేశాల్లో చిత్రీకరించినప్పుడు శ్రుతీ హాసన్ చలి వల్ల అసౌకర్యంగా ఫీలైంది. ఈ విషయాన్ని ఆమె బాహాటంగానే చెప్పుకొచ్చింది. దాని వల్లే ఆమె రాలేదని అందరూ చెవులు కొరుకున్నారు. ఇప్పుడు ఈ చిరంజీవి ఈవెంట్స్‌కి గైర్హాజరయ్య హీరోయిన్స్ లిస్టులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరింది. మరి ఆమె ఏమని వివరణ ఇస్తుందో చూడాలి మరి.