English | Telugu

'ఓజీ' ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ గ్యాంగ్ స్టర్ మూవీపై పవన్ అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఓజీతో మరోసారి పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా తెలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కేవలం సెట్స్ లోని పవన్ పిక్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసే 'ఓజీ' ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన బర్త్ డే కానుకగా 'ఓజీ' ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో పవన్ లుక్ ఓ రేంజ్ లో ఉండబోతుందని షూటింగ్ లొకేషన్స్ లోని ఆయన ఫోటోలను చూస్తే అర్థమైంది. ఆ ఫోటోలతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఫస్ట్ లుక్ ఏ స్థాయిలో ఉంటుందో, అంచనాలు మరే స్థాయికి వెళ్తాయోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.