English | Telugu

'ప్రేమ్ కుమార్' పబ్లిక్ టాక్.. బాబూ శోభన్ ఇంకెన్నాళ్ళీ దండయాత్ర!

'వర్షం'దర్శకుడు శోభన్ తనయుడు అనే ట్యాగ్ తో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు సంతోష్ శోభన్. కథానాయకుడిగా విభిన్న ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడీ యంగ్ హీరో. ఈ క్రమంలోనే.. అతని నుంచి వచ్చిన తాజా చిత్రం 'ప్రేమ్ కుమార్'. 'కళ్యాణం కమనీయం', 'శ్రీదేవి శోభన్ బాబు', 'అన్నీ మంచి శకునములే' తరువాత 2023లో శోభన్ నుంచి వచ్చిన నాలుగో చిత్రమిది. ఆసక్తికరమైన ప్రచారాలతో ఆకట్టుకున్న ఈ సినిమా.. శుక్రవారం (ఆగస్టు 18) జనం ముందుకు వచ్చింది.

కథేంటి: పీటల మీద పెళ్ళి ఆగిపోవడంతో పాటు మరెన్నో పెళ్ళి ప్రయత్నాలు విఫలమవడంతో.. ఫ్రస్ట్రేషన్ లోకి వెళతాడు పీకే అలియాస్ ప్రేమ్ కుమార్. దీంతో ప్రేమలు, పెళ్ళిళ్ళు బ్రేకప్ చేయడమే లక్ష్యంగా చేసుకుని 'పీకే డిటెక్టివ్ ఏజెన్సీ' నడపడం ప్రారంభిస్తాడు. ఈ నేపథ్యంలోనే.. ప్రేమ్ కుమార్ చెడగొట్టడానికి ప్రయత్నించిన ఓ పెళ్ళి.. తన జీవితాన్ని ఊహించని విధంగా మలుపులు తిప్పుతుంది. మరి.. చివరకి పీకే ఒక ఇంటివాడయ్యాడా? లేదా? అనేది మిగిలిన సినిమా.

పబ్లిక్ రెస్పాన్స్ ఏంటంటే: 'ప్రేమ్ కుమార్' ఇంట్రెస్టింగ్ పాయింట్ తోనే తెరకెక్కినా.. పూర్తిస్థాయి వినోదాన్ని అందించలేకపోయిందన్నది ప్రేక్షకుల మాట. దర్శకుడు అభిషేక్ మహర్షి సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడని అంటున్నారు. సాంకేతికంగానూ మూవీ చాలా వీక్ గా ఉందంటున్నారు. అలాగే ఎలాగైనా హిట్టు కొట్టాలని వరుస సినిమాలతో పలకరిస్తున్న శోభన్ ని ఉద్దేశించి.. "బాబూ ఇంకెన్నాళ్ళీ దండయాత్ర" అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఓవరాల్ గా.. ఇది కమర్షియల్ గా వర్కవుట్ అవడం కష్టమేనంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.