English | Telugu
ఆహాలో బేబీ.. వీళ్ళు కాస్త ముందుగానే చూడొచ్చు!
Updated : Aug 18, 2023
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై 14 న విడుదలై యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'బేబీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా దక్కించుకుంది. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్, షోస్, వెబ్ సిరీస్‌లను అందించిన ఆహా తాజాగా మరో బ్లాక్ బస్టర్ 'బేబి' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించటానికి రెడీ అయ్యింది. ఈ సినిమా ఆహాలో ఆగస్ట్ 25న నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే కల్ట్ క్లాసిక్‌గా తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాల పొందిన 'బేబీ' చిత్రం త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరటానికి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో రూ.899లను చెల్లించిన తన గోల్డ్ ప్యాక్ సబ్ స్క్రైబర్స్‌కు మరో అపూర్వ అవకాశాన్ని అందించింది ఆహా. ఈ గోల్ ప్యాక్ సబ్ స్క్రైబర్స్ ఇప్పుడు ఏకంగా 12 గంటలు ముందుగానే బేబి సినిమాను చూడబోతున్నారు.