English | Telugu
'భోళా శంకర్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఏడో రోజు మరీ ఘోరం బాసూ!
Updated : Aug 18, 2023
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ రీమేక్ మూవీ 'భోళా శంకర్'.. ఆగస్టు 11న జనం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. గురువారంతో వారం రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. రూ. 80.50 కోట్ల షేర్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన 'భోళా శంకర్'.. తొలి వారంలో కేవలం రూ. 27.16 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఆరో రోజు రూ. 20 లక్షల షేర్ కి పరిమితమైన ఈ సినిమా.. ఏడో రోజు మరీ ఘోరంగా రూ. 8 లక్షల షేర్ రాబట్టింది. ఏదేమైనా రూ. 50 కోట్లకి పైగా నష్టంతో 'భోళా శంకర్'.. థియేట్రికల్ రన్ ముగించబోతోందన్నది ట్రేడ్ వర్గాల మాట.
'భోళా శంకర్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 6.92 కోట్ల షేర్
సీడెడ్: రూ. 3.27 కోట్ల షేర్
ఉత్తరాంధ్ర: రూ. 3.22 కోట్ల షేర్
ఈస్ట్ గోదావరి : రూ. 1.98 కోట్ల షేర్
వెస్ట్ గోదావరి : 2.21 కోట్ల షేర్
గుంటూరు: రూ. 2.67 కోట్ల షేర్
కృష్ణ: రూ. 1.64 కోట్ల షేర్
నెల్లూరు: రూ. 1.20 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్: రూ. 23.10 కోట్ల షేర్ (రూ. 33.30 కోట్ల గ్రాస్)
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.86 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ. 2.20 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్: రూ. 27.16 కోట్ల షేర్ (రూ. 43.40 కోట్ల గ్రాస్)