English | Telugu

అత్యంత భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా లెవెల్ లో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్

'కన్నప్ప' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మంచు విష్ణు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ సినిమా చేయడానికి మంచు విష్ణు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. చాలా రోజులుగా ఈ కథ మీద పని చేస్తున్న విష్ణు, తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని ఈ రోజు శ్రీ కాళహస్తి లో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారు.

విష్ణు తండ్రి ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్టార్ ప్లస్ లో మహాభారత సిరీస్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే సీనియర్ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథకి మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమా రూపొందనుందని.. ఈ సినిమా ద్వారా భక్త కన్నప్ప,అతని భక్తి యొక్క గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేస్తాం అని విష్ణు అన్నారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్ లో ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం అని చెప్పారు. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి టాప్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తామని విష్ణు పేర్కొన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.