English | Telugu

ఫామ్‌లో లేని డైరెక్టర్‌తో మరో సినిమాకి ఓకే చెప్పిన పవర్‌స్టార్‌!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఈరోజు ‘ఒజి’ గ్లింప్స్‌ రిలీజ్‌ అయి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఒజి, ఉస్తాద్‌, హరి హర వీరమల్లు సినిమాలు పవన్‌కళ్యాణ్‌ చేతిలో ఉన్నాయి. ఇవి పూర్తి చేయకుండానే మరో సినిమాకి ఓకే చెప్పారు పవన్‌. గతంలో సైరా, ఏజెంట్‌ సినిమాలతో స్లో అయిపోయిన సురేందర్‌రెడ్డికి పవన్‌ మరో ఛాన్స్‌ ఇస్తున్నారు. రామ్‌ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇప్పటికే పవన్‌ చేస్తున్న మూడు సినిమాలు మూడు రకాల జోనర్స్‌లో ఉన్నాయి. మరి సురేందర్‌రెడ్డితో చేసే సినిమా ఏ జోనర్‌లో ఉంటుంది? అసలు దాని కథా కమామీషు ఏమిటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఒక్క విషయం మాత్రం తెలుస్తోంది. అదేమిటంటే ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి లాస్ట్‌ మూవీ ఏజెంట్‌కి కూడా వంశీనే కథ ఇచ్చాడు. మరి పవన్‌ కళ్యాణ్‌కి ఎలాంటి పవర్‌ఫుల్‌ కథ ఇస్తాడో చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జరిగాయి. మరో సినిమా పవన్‌ చేతికి వచ్చిందన్న ఆనందం పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌లో ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇప్పటికే మూడు సినిమాలు పూర్తి కావాల్సి ఉంది. మళ్ళీ ఓ కొత్త సినిమా ఏమిటనే షాక్‌లో ఉన్నారు. ముందు చేతిలో వున్న సినిమాలు పూర్తి చేస్తే చాలు అనేది వారి అభిప్రాయం. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత సురేందర్‌రెడ్డి సినిమా చేస్తాడా లేక మధ్యలోనే మొదలవుతుందా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.