English | Telugu

ప్రభాస్ కి పోటీగా ఎన్టీఆర్ బావమరిది!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సలార్'. మొదటి భాగం సీజ్‌ ఫైర్‌ సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించగల సినిమా 'సలార్' అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు కూడా బలంగా నమ్ముతున్నాయి. అందుకే ఈ సినిమా విడుదల సమయంలో ఇతర సినిమాలు విడుదల చేయాలంటే కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మాత్రం తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నార్నే నితిన్ తో 'మ్యాడ్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతుండటం విశేషం. నాగ వంశీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సాయి సౌజన్య, హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. అంటే ఏకంగా డైనోసార్ తో బాక్సాఫీస్ వార్ కి సిద్ధమయ్యారన్నమాట. అయితే 'సలార్' సీజీ వర్క్ ఆలస్యమవుతుందని, సినిమా వాయిదా పడే అవకాశముందని ఒక ప్రచారముంది. మరి సలార్ వాయిదా పడుతుందన్న సమాచారంతో వస్తున్నారో లేక కంటెంట్ మీద నమ్మకమో తెలీదు కానీ మ్యాడ్ రిలీజ్ డేట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.