English | Telugu

‘OG’తో రికార్డుల ఊచకోత మొదలెట్టిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. సాలిడ్ మూవీతో పవన్ వస్తే.. రికార్డులన్నీ తిరగ రాయటం ఖాయం. ఇందులో ఎలాంటి డౌట్ లేదనేది అందరూ ఒప్పుకునే విషయం. ఆయన్ని పక్కా మాస్ అండ్ యాక్షన్ రోల్ లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి ఆశలను ఆయన తాజా చిత్రం 'OG' తీర్చేయనుంది. వివరాల్లోకి వెళితే, పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న 'OG' సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. పవన్ ను ఎలా చూడాలనుకుంటన్నారో ఫ్యాన్స్ అలా చూపించబోతున్నారు డైరెక్టర్ సుజిత్. ఎందుకంటే ఆయన కూడా పవర్ స్టార్ అభిమానే మరి. పవన్ కళ్యాణ్ ను నెక్ట్ రేంజ్ లో చూపించారు. గ్లింప్స్ లోని ఎలివేషన్ సీన్స్ చూస్తుంటే.. దానికి తగ్గ తమన్ ఇచ్చిన బీజీఎం చూస్తుంటే 'OG' బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొట్టటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తాజాగా ఈ రికార్డుల పరంపరను పవన్ తన గ్లింప్స్ నుంచే స్టార్ట్ చేశారు.

ఇప్పటివరకు మరే సినిమా సాధించని రికార్డ్ ను పవన్ 'OG' గ్లింప్స్ సాధించింది. అదేంటంటే 100 K లైక్స్ ను ఈ సినిమా కేవలం ఏడు నిమిషాల్లోనే టచ్ చేసింది. ఇప్పటి వరకు ఆరికార్డ్ తమిళ హీరో దళపతి విజయ్ నటిస్తోన్న లియో సినిమాపై ఉండింది. కానీ 'OG' దాన్ని దాటేయటం విశేషం. భాషా రేంజ్ స్టోరీతో పవన్ కళ్యాణ్ విలన్స్ భరతం పట్టటానికి వస్తున్నారని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. RRR నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. గ్లింప్స్ నే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు మరి. సినిమా వచ్చే ఏడాదిలో విడుదలవుతుందని టాక్ వినిపిస్తోంది.