బాబుతో పెనుమలూరు ఎమ్మెల్యే భేటీ... తెలుగు దేశం గూటికేనా ?
posted on Jan 6, 2024 @ 4:24PM
వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథి ఒకటి రెండు రోజుల్లో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో పని చేసిన కొలుసు పార్థ సారథి 2014 నుంచి వైకాపాలో కొనసాగుతున్నారు. ఇటీవలి కాలంలో వైకాపా నుంచి జంప్ అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది.
హైదరాబాద్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుని కలిసిన కొలుసు పార్థసారథి
ఈ నెల 7,8 తేదీల్లో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.
కొలుసు పార్థసారథి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు శాసససభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా కొనసాగుతున్నారు 2004, 2009, 2019 వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004 లో మొదటిసారి వుయ్యూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. తరువాత 2009, 2019 లో పెనమలూరు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. ఆయన కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా)అధ్యక్షునిగా కూడా ఉన్నారు.
వై.ఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక మంత్రిగా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి. పార్థసారథికి తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్,పోర్ట్‌ఫోలియోను కేటాయించారు.జగన్ నియంతృత్వ పోకడలను గతకొంత కాలంగా వ్యతిరేకిస్తున్న పార్థసారథి టిడిపిలో చేరితే కృష్ణా జిల్లాలోని వైకాపా కేడర్ అంతా గంపగుత్తగా ఖాళీ అయ్యే అవకాశం ఉంది.