ఐదేళ్లూ కొనసాగే ధైర్యం తగ్గు! ముందస్తుకే జగన్ మొగ్గు?

ఏపీ సీఎం జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతున్నారా? వాగ్దానాల అమలు నుంచి ప్రతి విషయంలోనూ వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత ఆయనకు ఊపిరి సలపనివ్వడం లేదా? మిగిలిన రెండేళ్లు అధికారంలో కొనసాగితే ప్రజాగ్రహం మరింత ప్రజ్వరిల్లుతుందని భయపడుతున్నారా? అంటే పరిశీలకులు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నారు. కేంద్రంతో అంటకాగి అప్పులు సంపాదించుకుని ఏదోలా నెట్టుకొస్తున్నా... అది మరింత కాలం కొనసాగే పరిస్థితి కనిపించడం లేదని పార్టీ శ్రేణులు సైతం అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఇక ప్రజా నిరసనల సెగలో మాడిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రులలో అత్యధికులు పార్టీ అధినేత తీరు పట్ల తమ వ్యతిరేకతను బాహాటంగా వెళ్లగక్కడానికి సంకోచించడం లేదు. పోనీ ప్లీనరీలోనైనా ప్రజా వ్యతిరేకతను తగ్గించడానికీ, తిరిగి ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి ఏమైనా వ్యూహరచన లేదా కార్యాచరణపై చర్చ జరిగిందా అంటే అదీ లేదు. పైగా రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలలో వైసీసీ విజయం కష్ట సాధ్యం కాదు.. సులభ సాధ్యమే అంటూ అధినేత పాత పాటే పాడటంతో వైసీపీ శ్రేణుల్లో ఈయన సీతయ్యే ఎవరి మాటా వినడంటూ పెదవి విరుస్తున్నారు. అమరావతి నుంచి ఆరంభిస్తే.. ఈ మూడేళ్లలో ఆయన మాట తప్పని అంశం లేదు. మడమ తిప్పనిసందర్భం లేదన్న విమర్శలు రాజకీయ వర్గాలలోనే కాదు సామాన్య జనంలోనూ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని నిరుపేదలకు 25 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని ఎన్నికల ముందు గొప్పగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారు. రైతన్నలకు చెప్పిన ఉచిత బోర్లు మాట పూర్తిగా విస్మరించారు. మూడేళ్లుగా ఏపీలోని రోడ్ల దుస్థితిని పట్టించుకున్న పాపాన పోలేదు. అమ్మ ఒడికి కొర్రీలు, కోతలతో లబ్ధిదారుల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ క్యాలెండర్‌ ఊసే లేదు. డీఎస్సీ హామీకి తిలోదకాలొదిలేశారు. ఆర్థిక అరాచకత్వాన్ని పరాకాష్టకుతీసుకుపోయారు.   ఇలా చెప్పుకుంటూ పోతే.. జగన్ మూడేళ్ల పాలన అంతా మాట తప్పడం, మడమ తిప్పడం వినా మరో ఘనత లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో  ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకూ ఇదే విధానంలో కొనసాగితే  ఎన్నికలలో విజయం సులభ సాధ్యం కాదన్న అనుమానం అధినేతలోనే వ్యక్తం అవుతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అందుకే ముందస్తుకే జగన్ మొగ్గు చూపుతున్నారంటున్నారు.  ప్లీనరీ సందర్భంగా వచ్చే ఎన్నికలలో విజయం గురించి జగన్ మాట్లాడడమే ఆయన ముందస్తుకే మొగ్గు చూపుతున్నారన్న సంగతి అవగతమైపోయిందని పరిశీలకులు అంటున్నారు. లేకుంటే ఎన్నికలకు మరో  రెండు సంవత్సరాలు సమయం ఉండగా అన్ని స్థానాలలోనూ విజయమే లక్ష్యం  అన్న ప్రకటన పార్టీ ప్లీనరీ వేదికగా చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. అంతే కాకుండా ముందు ముందు పరిస్థితిని బేరీజు వేసుకుంటే ముందస్తే బెటరని జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా సలహా ఇచ్చారని చెబుతున్నారు.  ఒక పక్కన ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని,  మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ముందస్తు ఎన్నికలకు తొందరపడటం జగన్ లో ఓటమిపై గూడుకట్టుకున్న భయానికి తార్కాణమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపె పార్టీలో పెచ్చరిల్లుతున్న అసంతృప్తి, అసమ్మతి, మరో వైపు ప్రభుత్వంపై ప్రజలలో రోజు రోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతతో జగన్ ఇవి మరింత పెరిగి పార్టీ పుట్టి ముంచేలోగానే.. ఏదో విధంగా సంక్షేమ కార్యక్రమాలను నెట్టుకువస్తున్న సమయంలోనే ముందస్తుకు వెళ్లి ఎలాగోలా వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  ‘గడప గడపకు మన ప్రభుత్వం’ సామాజిక న్యాయ భేరి పేర మంత్రుల బస్సు యాత్రలలో ఎదురైన ప్రజా వ్యతిరేకత అదే సమయంలో తెలుగుదేశం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాలకు, పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న జిల్లాల పర్యటనలకు వస్తున్న స్పందనతో జగన్ ఈనఫ్ ఈజ్ ఇనఫ్.. మనపై వ్యతిరేకత మరింత పెరిగే లోగా, అలాగే తెలుగుదేవం పట్ల ప్రజాభిమానం మరింత ఎక్కువ కాకుండా ముందస్తుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. జగన్ ఉద్దేశానికి అనుగుణంగానే పీకే బృందం ఇప్పటికే జిల్లాల వారీగా నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలెట్టేసిందని చెబుతున్నారు.  సిటింగ్‌ వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న స్పందన పసిగట్టేందుకే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని  పీకే టీమ్‌ రూపొందించింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు సిటింగ్‌ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి నిరసన సెగలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అలా జనం నుంచి వ్యతిరేకత వచ్చిన సిటింగ్‌ ల జాబితాను పీకే టీమ్‌ ఇప్పటికే రెడీ చేసిందని తెలుస్తోంది.    జనం నుంచి మరింత వ్యతిరేకత మూటకట్టుకోక ముందే.. ఓటమి భయం నుంచి గట్టేందుకు సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.

ఈ దేవుళ్ల‌కు ద‌యే లేదు..

ఆస్ప‌త్రులు దేవాల‌యాలు, డాక్ట‌ర్లు దేవుళ్లు, ఆస్ప‌త్రుల్లో ప‌నివాళ్లు మాన‌వ‌త్వానికి చిరునామాలు.. ఏదో తెలుగు పాఠం చెబుతున్న‌ట్టుగా వుందిగ‌దూ. నిజంగానే అదంతా పుస్త‌కాల్లో, ప్ర‌సంగాల్లో వుంటుంది. వాస్త‌వంలో అంత వుండ‌దు. అక్క‌డ‌క్క‌డా అందుకు పూర్తి భిన్నంగా, అరాచ‌కంగానూ వుంటుంది.  అం దుకు తాజా వుదాహ‌రణ మ‌ధ్య‌ప్ర‌దేశ్ మోరెనా ప‌ట్ట‌ణంలోని ఈ పిల్లాడి దుస్థితి. మీరు ఫొటోలో చూస్తు న్న‌ది ఓ పిల్లాడు మ‌రో పిల్లాడిని ప‌డుకోబెట్టుకుని వున్న‌ది. వాడేమీ జ‌నాన్ని మోసం చేసి డ‌బ్బుల‌కు  అలా కూచో లేదు. జీవితాంతం త‌న‌తో వుంటాడ‌నుకున్న త‌మ్ముడి మృత దేహం అది. అవును. వాడి పేరు గుల్హ‌న్‌, ఒళ్లో మృత‌దేహం వాడి తమ్ముడు రెండేళ్ల రాజాది.  మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరెనా పట్టణంలో జరిగింది. అంబాహ్ లోని బద్ ఫ్రా గ్రామానికి చెందిన పూజారామ్ జాతవ్ తన కొడుకు వైద్యం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. రెండేళ్ల పిల్ల వాడు తీవ్రమైన రక్తహీనత, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ  చికిత్స తీసుకుంటున్న సమ యంలో మరణించాడు. కుమారుడు మరణించడంతో సొంత గ్రామానికి తీసుకెళ్లే స్తోమత లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బందిని అంబులెన్స్ సమకూర్చాలని అడిగినా.. ఆ నిరుపేద తండ్రి మాటలు పట్టించుకునే వారు కురువయ్యారు. 30 కిలోమీటర్లు ఉన్న సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు వాహనం కోసం వెతికేందుకు తండ్రి వెళ్లాడు. తన ఎనిమిదేళ్ల కుమారుడు గుల్షాన్ ను మరణించిన తన కొడుకు రెండేళ్ల రాజాను స్థాని కంగా ఉన్న నెహ్రూ పార్క్ ముందు వదిలిపెట్టాడు. తన ఒళ్లో తమ్ముడి శవాన్ని పెట్టుకుని, ఈగలు వాలకుండా చూసుకుంటున్న ఆ పిల్లాడి నిస్సహాయత అందర్ని కంటతడి పెట్టిస్తోంది.  ఇది నిజంగానే హృదయవిదారకం. దేశంలో ప్రభుత్వం ఆస్పత్రులు, సదుపాయాలను ప్రశ్నించే ఘటన. పేదోళ్లకు కనీస వైద్యం, సౌకర్యాలు అందుతున్నాయో లేదో తెలిపే ఓ సన్నివేశం. ప్రస్తుతం దేశంలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని సమకూర్చకపోగా.. బయటకు వెళ్లి డబ్బు చెల్లించి వాహనాన్ని మాట్లాడు కోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న అంబులెన్స్ రూ.1500 చెల్లించితే సొంతూ రుకు తీసుకెళ్తా అని చెప్పాడు. అయితే అది కూడా చెల్లించే స్తోమత పూజారామ్ జాతవ్ దగ్గర లేదు. అరగంట పాటు అక్కడే తన తండ్రి కోసం ఒడిలో తమ్ముడి శవాన్ని పెట్టుకుని గోడ పక్కన కూర్చుండి పోయాడు గుల్షాన్. ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ అధికారి యోగేంద్ర సింగ్ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి అంబులెన్స్ ఇచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తెలంగాణలో ముందస్తు ఇక లేనట్లే!

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికల చర్చ, చాలాకాలంగా సాగుతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి అయితే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ముడి పెట్టి, వచ్చే సంవత్సరం మే నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు,  జూన్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఖాయమన్నరీతిలో పార్టీని, క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు. ఆలశించిన ఆశా భంగం అన్న తీరున ఇతర పార్టీల నుంచి అభ్యర్ధులను పట్టుకొచ్చుకుంటున్నారు.  అలాగే, బీజేపీ నాయకులు కూడా  ముందస్తుకు సిద్ధమన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప  సభలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పరోక్షంగానే అయినా, ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఎన్నికలకు ఎప్పుడు వెళతారో మీ ఇష్టం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, విజయం మాత్రం బీజేపీదే అని  కేసీఆర్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్, బీజేపీ ఇతర కీలక నేతలు కూడా ఈ రోజుకు ఈ రోజు  ఎన్నికలు వచ్చినా .. ఢీ అంటే ఢీ అనేందుకు, రెఢీగా  ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు.  అయితే, ముందస్తు ఎన్నికల ఆలోచన, అవసరం రెండూ తెరాసకు లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇంతకు ముందు అనేక మార్లు స్పష్టం చేశారు. కానీ, తాజాగా, ముఖ్యమంత్రి కేసేఅర్ ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే.. అసెంబ్లీని రద్దు చేయడానికి తాను కూడా సిద్ధమేనని సవాలు విసిరారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు  ముందస్తుకు వెళ్లే ధైర్యముందా..? అని కేసీఆర్ ప్రతిపక్ష పక్ష పార్టీల నాయకులను ఎద్దేవా చేశారు. అయితే, చాంతాడంత రాగం తీసి చివరకు అదేదో పాట పాడినట్లు, ముఖ్యమంత్రి సవాలు చేసి, ప్రతిపక్షాలను ఎద్దేవ చేసి, చివరకు, తానూ అసెంబ్లీ రద్దు చేయాలంటే, అందుకు షరతులు వర్తిస్తాయి అన్నారు. బీజేపీ ముందుగా ఎన్నికల తేదీలను ఖరారు చేసి, ముందస్తుకు వస్తే, తాను అసెంబ్లీ రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమని స్పష్టం చేశారు. ఆంటే ముందస్తుకు వెళ్ళడమా అలేదా అనేది నిర్ణయించే అధికారం తమ చేతుల్లో లేదని కొంచెం ఆలస్యంగానే అయినా ముఖ్యమత్రి గుర్తించారని, పరిశీలకులు అంటున్నారు. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి, ముందస్తుకు షరతులు వర్తిస్థాయనే మాట అన్నారో, అప్పుడే ఆయన, ముందస్తు ఎన్నికల ఆలోచన నుంచి వెనకడుగు వేశారనే విషయం స్పష్టంగా తెలిసి పోయిందని,  విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 లో ముందస్తుకు వెళ్లేముందు, ఆయన ప్రతిపక్షాల అనుమతి తీసుకుని ముందస్తుకు వెళ్ళారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, రోజు రోజు కు ఇంటా బయట సమస్యలు చుట్టుముట్టి, ఇబ్బందులు  పెడుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నారని, అయితే, అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం, వెంటనే ఎన్నికలు ప్రకటించక పోయినా, కేంద్ర ప్రభుత్వం ఏదో వంకన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా, పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం లేక పోలేదని, ముఖ్యమంత్రి సందేహిస్తున్నారని అంటున్నారు. సో .. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఇక లేనట్లేనని, పరిశీలకులు భావిస్తున్నారు.

శ్రీలంక అధ్యక్షుడు రాజీనామా

ప్రజాగ్రహం మహామహులనే దహించేసింది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్షే ఎంత. గొటబాయ రాజీనామా చేసే వరకూ అధ్యక్ష భవనం వీడేది లేదని ఆందోళనకారులు భీష్మించారు. శనివారం నుంచీ అధ్యక్ష భవనంలోనే తిష్ట వేశారు. వారి ఆగ్రహానికి తలవంచి అధ్యక్ష పదవికి గొటబాయ దిగివచ్చి రాజీనామా చేయడానికి అంగీకరించారు.   బుధవారం అంటే ఈ నెల 13న తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతకు ముందే ప్రధాని విక్రమ సింఘేకు ఈ విషయం తెలియజేశారు. అంతకు ముందే స్వీకర్ మహీంద్రయాపాకు కూడా తెలియపరిచారు. కాగా ఇప్పటికే అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి కారణం గొటబాయ రాజపక్సే అతిని సోదరులే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఆరోపణలు వెల్లువెత్తినా, ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్నా ఇంత కాలం రాజీనామాకు ససేమిరా అంటున్న రాజపక్సే ఎట్టకేలకు ప్రజాగ్రహ జ్వాలలకు తలవంచారు. రాజీనామాకు అంగీకరించారు. అధ్యక్షుడి రాజీనామా ప్రకటన తరువాత శ్రీలంకలో పరిస్థితులు క్రమంగా కుదుటపడే దిశగా సాగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. రాజపక్స రాజీనామా ప్రకటన తరువాత అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు అఖిలపక్షం సుముఖత వ్యక్తం చేసింది. తదుపరి ప్రధాని, అధ్యక్షుడు ఎవరన్న దానిపై చర్చలు సాగిస్తున్నారు. శ్రీలంక స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించిన తరువాత ఇంతటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడం ఇదే ప్రథమం. 

సుప్రీంలో ఉద్ధవ్ కు చుక్కెదురు.. అనర్హత పిటిషన్ పై అత్యవసర విచారణకు నో!

కష్టాలు ఒకే సారి కట్టకట్టుకుని వస్తాయంటారు. ప్రస్తుతం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పరిస్థితి అలాగే ఉంది. ఒక వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే శిబిరంలోకి చేరిపోవడం, శివసేన పార్టీ, గుర్తు కూడా తన నుంచి దూరమయ్యే ప్రమాదం వంటి కష్టాలలో కొనసాగుతున్న ఆయనకు సుప్రీంలో కూడా చుక్కెదురైంది. షిండే వర్గంలోకి జంప్ అయిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రేకు అక్కడా చుక్కెదురైంది. అనర్హత పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీం అభిప్రాయపడింది.  మహారాష్ట్రలో ప్రస్తుతం యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సోలిసిట్ జనరల్ కు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు తెలియజేయాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసు విచారణకు ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉందనీ, ధర్మాసనం ఏర్పాటుకు సమయం పడుతుందని సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పేర్కొన్నారు. అంత వరకూ యథాతథ స్థితి కొనసాగించాలని సోమవారం ఈ కేసు విచారణ సందర్శంగా జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నిర్ణయంతో షిండే వర్గానికి   ఊరట లభించింది.

పయ్యావుల కేశవ్ భద్రత తొలగింపు

జగన్ సర్కార్ ఒకరి తరువాత ఒకరిగా తెలుగుదేశం నాయకులను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సహించేది లే.. అన్నట్లుగా జగన్ సర్కార్ తీరు ఉందనడానికి మరో తాజా ఉదాహరణే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రజాపద్దుల సంఘం చైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రత తొలగింపు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పయ్యావుల కేశవ్ కు ఇప్పటి వరకూ వన్ ప్లస్ వన్ భద్రత ఉంది. అయితే సోమవారం పయ్యావుల కేశవ్ గన్ మన్ లను వెనక్కు పిలిపించింది.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకే పయ్యావుల సెక్యూరిటీని తొలగించిందని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి కొద్ది రోజుల కిందటే పయ్యావుల కేశవ్ తనకు భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆలా కోరిన పయ్యావుల కేశవ్ కు భద్రత పెంచకపోగా... ఉన్న సెక్యూరిటీని తొలగించడంపై తెలుగుదేవం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తెలుగు దేశం నాయకులను భౌతికంగా, మానసికంగా వేధించడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. తక్షణం పయ్యావులకు భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాగా తెలుగుదేశం ఆరోపణలను ప్రభుత్వం కొట్టి పారేసింది. నిబంధనల మేరకు ప్రతి మూడేళ్ల కోసారి ప్రజాప్రతినిథుల వ్యక్తిగత భద్రతా సిబ్బందిని బదలీ చేయడం సహజమని, అందులో భాగంగానే పయ్యావుల భద్రతా సిబ్బంది బదలీ జరిగిందనీ వివరించింది. త్వరలోనే ఆయనకు భద్రతా సిబ్బందిని నియమిస్తామని వివరణ ఇచ్చింది. అయితే తెలుగుదేశం మాత్రం భద్రతా సిబ్బందిని బదలీ చేస్తే.. వారు రిలీవ్ అయ్యే సమయానికే కొత్త సిబ్బందిని నియమించాలి కదా అని నిలదీస్తున్నారు. 

తెలంగాణలో టార్గెట్ రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్ధ ప్రధాని అంటూ నేరుగా మోడీని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీయేమో నియంత, అవినీతి, కుటుంబ పాలన అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ కేసీఆర్ నూ, కేంద్రంలో బీజేపీ పాలననూ ఏక కాలంలో టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి అంతకంతకూ పెరిగిపోతోంది. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడినా రాజకీయ ఉష్ణోగ్రతలు మాత్రం రోహిణీకార్తెను మించి పోతున్నాయి. ఏప్రిల్ లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలతో మొదలైన ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల.. మేలో వరంగల్ లో జరిగిన రాహుల్ బహిరంగ సభతో మరింత పెరిగి.. తాజగా గత వారం హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాలతో తార స్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత కూడా రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోందే కానీ తగ్గే పరిస్థితే కనిపించడం లేదు. సభలు, సమావేశాలు,మీడియా సమావేశాల ద్వారా ప్రధాన రాజకీయ పార్టీలు మూడూ తమతమ బలప్రదర్శనలకు దిగుతుండటంతో రాజకీయ వేడి పరిమితుల్లేకుండా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు తెలంగాణలో ‘టార్గెట్’ రాజకీయాలు జోరుమీద ఉన్నాయి.  టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో దాదాపు 13 తీర్మానాలు చేసింది. వరంగల్ లో జరిగిన సభలో రాహుల్ గాంధీ తెలంగాణకు ఓ డిక్లరేషన్ ఇచ్చారు. బిజెపి సంకల్ప సభలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం అందిస్తున్న సహాకారం, చేస్తున్న అభివృద్దిని వెల్లడించింది. ఇలా తెలంగాణ ప్రజల దృష్టిని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలను మూడు ప్రధాన పార్టీలూ శక్తి వంచన లేకుండా చేశాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ తెలంగాణలో మరో భారీ బహిరంగ సభకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ లో జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేంద్రంపై,  బిజెపి పాలనపై సిఎం కెసిఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అనంతరం వరంగల్ సభలో టిఆర్ఎస్ పై, సిఎం కెసిఆర్ పై రాహుల్ గాంధీ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆ తరువాత బిజెపి విజయ సంకల్ప సభలో తెలంగాణ ప్రభుత్వంపైనా, సిఎం కెసిఆర్ పైనా పలు రాజకీయ అస్త్రాలను సంధించారు. మోడీ మాత్రం తన ప్రసంగంలో తెలంగాణకు కేంద్రం అందించిన సహాయాన్ని ప్రస్తావించడానికే పరిమితమై వ్యూహాత్వకంగా వ్యవహరించారు. ప్లీనరీ అనంతరం  మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూటిగా సిఎం కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయనపైనే పోటీ చేసి ఓడిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనపై రాజకీయ చర్చోపచర్చలు సద్దుమణగక ముందే.. సిఎం కెసిఆర్ ఆదివారం మీడియా  సమావేశంలో   నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ  అసమ్మర్థ పాలన అంటూ దుయ్యబట్టారు. ఇలా ఒకరి పార్టీ తరువాత మరో పార్టీ రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతలను పెంచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.  తేదీ చెప్పండి అసెంబ్లీ రద్దుకు రెడీ అంటూ సీఎం సిఎం కెసిఆర్ బంతిని బీజేపీ కోర్టులో పడేయడంతో రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువగా  ముందస్తు ఎన్నికలు  చర్చ జోరందుకుంది. కేసీఆర్  పార్టీ సవాల్ ను బీజేపీ స్వీకరించి సై అంటూ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా తానే ముందుగా ముందస్తు నగారా మోగిస్తే.. అసెంబ్లీ రద్దు వరకూ మౌనంగా ఉండి ఆ  తరువాత ముందస్తుకు కాకుండా బీజేపీ రాష్ట్రపతి పాలనకు మార్గంసుగమం చేస్తుందన్న అనుమానం  కేసీఆర్ దిఅని పరిశీలకులు చెబుతున్నారు. ముందస్తు వచ్చినా, రాకున్నా.. ప్రస్తుత రాజకీయ వేడి ఎన్నికల వరకూ కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చే నెలలో మంత్రి కేటీఆర్ ఇలాకాలో రాహుల్ గాంధీ బహిరంగ సభ అనంతరం  రాజకీయ వేడి, విమర్శల దాడి మరింత పెచ్చరిల్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

2023 నాటికి చైనాను మించ‌నున్న భార‌త్ జ‌నాభా.. యు.ఎన్‌

భార‌త దేశ జ‌నాభా వ‌చ్చే ఏటికి చైనాను మించి అత్య‌ధిక జ‌నాభాగ‌ల దేశంగా నిలిచే అవ‌కాశాలున్నాయ‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదిక వెల్ల‌డించింది. 2022 న‌వంబ‌ర్ 15 నాటికి ప్ర‌పంచ జ‌నాభా ఎనిమిది బిలియ‌న్ల‌కు చేర‌వ‌చ్చ‌ని ఆ నివేదిక పేర్కొన్న‌ది. 1950 నుంచి గ‌మ‌నిస్తే ప్ర‌పంచ జ‌నాభా పెరుగుద‌ల రేటు త‌క్కువ‌గానే వుంది, 2020 లో ఒక్క శాతానికి ప‌డిపోయింద‌ని నివేదిక తెలియ‌జేసింది.  జ‌నాభా పెరుగుద‌ల అంశాన్ని ప్ర‌స్థావిస్తూ,  2030లో ప్ర‌పంచ జ‌నాభా సుమారు 8.5 బిలియ‌న్‌మేర‌కు పెర‌గ వ‌చ్చని, అదే 2050లో 9.7 బిలియ‌న్ల‌కు పెర‌గ‌వ‌చ్చ‌ని యు.ఎన్‌. నివేదిక పేర్కొన్న‌ది. అలాగే, 2080 నాటికి ఈ పెరుగుద‌ల 10.4 బిలియ‌న్ల‌కు చేరుకుని 2100 వ‌ర‌కూ నిల‌క‌డ‌గా వుండవ‌చ్చ‌ని సూచించింది. ఈ సంవ త్సరం ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) ఒక మైలురాయి సంవత్సరంలో వచ్చింది,  భూమి పై ఎని మిది బిలియన్ల మంది  జననాన్ని వూహించిన‌ట్టు యు.ఎన్‌. సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుట్రెస్ తెలి పారు. ఇది మన వైవిధ్యాన్ని, మన ఉమ్మడి మానవత్వాన్ని గుర్తించడానికి , ఆయుర్దాయం పొడిగించిన మాతా , శిశు మరణాల రేటును నాటకీయంగా తగ్గించిన ఆరోగ్యంలో పురోగతిని చూసి ఆశ్చర్యపోవడానికి ఒక సందర్భమ‌ని ఆయ‌న అన్నారు. అలాగే, మ‌న భూమి గురించిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంలో బాధ్య‌త ల‌ను పంచుకోవ‌డం గుర్తుచేస్తుందని, అంతేగాక మ‌న నిబ‌ద్ధ‌త‌లో పొర‌పాట్ల‌ను తెలుసుకోవ‌డానికి  ఇది స‌ర‌యిన స‌మ‌య‌మ‌ని ఆయ‌న అన్నారు.  అంతేగాక‌, 2022లో అత్య‌ధికంగా 2.3 బిలియ‌న్ జ‌నాభా క‌లిగిన ప్రాంతాలుగా తూర్పు, ఈశాన్య ఆసియా ప్రాంతాలు వున్నాయి. అంటే ప్ర‌పంచ జ‌నాభాలో 29 శాతం ఈ ప్రాంతాల్లో వున్నది. సెంట్ర‌ల్‌, ద‌క్షిణా సియా 2.1 బిలియ‌న్ జ‌నాభాతో అంటే ప్ర‌పంచ జ‌నాభాలో 26 శాతం జ‌నాభా వున్నార‌ని యు.ఎన్‌. నివేదిక స్ప‌ష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో చైనా, భార‌త్ అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన ప్రాంతాలుగా గుర్తించ‌బ‌డ్డాయి. రెండు దేశాల్లోనూ 2022లో 1.4 బిలియ‌న్ జ‌నాభా న‌మోద‌యింది. 2050 నాటికి ప్ర‌పంచ జ‌నాభా ప్ర‌స్తుతం వున్న జ‌నాభాకంటే స‌గం ఎక్కువ పెరగ‌వ‌చ్చ‌ని, అది కూడా కాంగో, ఈజిప్టు, ఇథోపియా, భార‌త్‌, నైజీరియా, పాకిస్థాన్‌, ఫిలిప్పైన్స్‌, టాంజానియాల‌లో ప్ర‌ధానంగా జ‌ర‌గ‌వ‌చ్చ‌ని నివేదిక తెలియ‌జేసింది. 

కేసీఆర్ భయం.. దాచేస్తే దాగేది కాదు!

ముచ్చటగా మూడో సారి అధికారం కేసీఆర్ కు అందని ద్రాక్షగా మిగిలిపోనుందా? ఓటమి భయం కేసీఆర్ ను వెంటాడుతోంది. పార్టీ నుంచి వలసలతో ఆయన ఆందోళన చెందుతున్నారా? ఈ ప్రశ్నలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఔననే సమాధానం ఇస్తున్నారు. ఎంత దాచుకుందామని ప్రయత్నించినా కేసీఆర్ లో ఓటమి భయం దాగడం లేదంటున్నారాయన. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో చేసిన ప్రసంగమే ఆయనలోని బయాన్ని పట్టిచ్చిందని అంటున్నారు బండి. అందుకు ఉదాహరణగా ఆయన మీడియా సమావేశంలో పదే పదే షిండే పేరు ప్రస్తావించడాన్ని బండి ఎత్తి చూపారు. వాస్తవానికి మహారాష్ట్రీయులు కూడా షిండే పేరును అన్ని సార్లు తలుచుకుని ఉండరనీ, షిండే తిరుగుబాటుతో పదవీ చ్యుతుడైన ఉద్ధవ్ ఠాక్రే నోట కూడా షిండే పేరు అన్ని సార్లు రాలేదని, కానీ కేసీఆర్ కు టీఆర్ఎస్ లో ఒకరూ, ఇద్దరూ కాదు అనేక మంది షిండేలు కనబడుతున్నారనీ అందుకే ఆయన షిండే నామస్మరణ చేస్తున్నారనీ ఎద్దేవా చేశారు. సీఎం మోడీని పదవి నుంచి దింపేస్తామనడం తన లోని భయాన్ని దాచుకునేందుకేనన్న బండి సంజయ్ దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని సవాల్ చేశారు. ఉడత ఊపులంటూ కేసీఆర్ మోడీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందనీ, వాస్తవానికి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ కేసీఆర్ చేస్తున్న ప్రగల్భాలే ఉడుత ఊపులనీ, వాటికి బీజేపీ భయపడదనీ స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లలో, బాషలో, బాడీ లాంగ్వేజిలో కనిపిస్తున్న తేడా ఆయనలోని ఓటమి భయాన్ని ఎత్తి చూపుతోందని అన్నారు. టీఆర్ఎస్ లో తిరుగుబాటు అనివార్యమని ఊహిస్తున్న కేసీఆర్.. ముందుగానే టీఆర్ఎస్ లో ముందు ముందు జరగనున్న వలసల నెపాన్ని ఇప్పుడే బీజేపీపై నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. 2018 ఎన్నికల తరువాత ఆయన విపక్షాలపై ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు బూమరాంగ్ అవుతుందన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోందన్నారు. జాతీయ రాజకీయాలు అంటే ఆయన నేల విడిచి సాము చేస్తున్నారనీ, ఆయన వైఖరిని తెరాస శ్రేణులే తప్పుపడుతున్నాయనీ బండి పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన మూర్ఖుడిగా బండి కేసీఆర్ ను అభివర్ణించారు.

ఖాకీల నేరాల వెనక కనిపించని దోషులు...?

ఈ నగరానికి ఏమైంది.. కాదు, కాదు  ఈ రాష్ట్రానికి ఏమైంది? ఒక్కప్పుడు ఉత్తమ పోలీసు వ్యవస్థగా అంతో ఇంతో పేరున్న తెలంగాణ పోలీసు వ్యవస్థ, ఎందుకిలా, వంకరలు పోతోంది? ఒకప్పుడు జాతీయస్థాయిలోనే శభాష్ అనిపించుకున్న నగర పోలీసు అధికారులు ఎందుకిలా రోజు రోజుకు తమ స్థాయిని దిగాజార్చు కుంటున్నారు? ఖాకీలు కొందరు ఎందుకు కీచకులుగా మారుతున్నారు? రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని, భాగ్యనగరంలో నేరాలు, ఘోరాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎందుకు, పోలీసు వ్యవస్థ నేరాలకు కొమ్ముకాసే స్థితికి చేరిందనే విమర్శలు వస్తున్నాయి? చివరకు ఖాకీలే, తుపాకి ఎక్కు పెట్టి, అత్యాచారాలు చేసే దౌర్భాగ్య స్థితికి పోలీసు వ్యవస్థ ఎందుకు దిగజారింది? మంచి అధికారులుగా రివార్డులు, అవార్డులు అందుకోవడంతో పాటుగా ప్రజలలోనూ పోలీసు వ్యవస్థ పట్ల  విశ్వాసం నింపిన అధికారులు కూడా, కథా రచయితలుగా మారి కట్టు కథలతో వాస్తవాలను కప్పెడుతున్నారనే  అపవాదును ఎందుకు మోస్తున్నారు?  ఈ ప్రశ్నలు అన్నిటికీ ఒకటే సమాధానం. రాజకీయం. అవును, మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగానే పోలీసు వ్యవస్థ దినదిన ప్రవర్థమానంగా దిగజారి వస్తోందనే విశ్లేషణ/విమర్శ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వుంది. ముఖ్యంగా  పోస్టింగులు, బదిలీల విషయంలో రాజకీయ జోక్యం పెరిగి పోవడం, ఒక కారణం అయితే, హోం మంత్రి అసమర్ధత, అనాసక్తి కూడా ... అందుకు కారణమని అంటున్నారు. అంతే కాకుండా గడచిన ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్, హోం శాఖను తమ గుప్పిట్లో ఉంచుకున్నారనే విమర్శలు కూడా లేక పోలేదు. అందుకే, హోం శాఖను తమ చెప్పుచేతల్లో ఉండే, ‘సీనియర్ల’ చేతిలో పెట్టారు. అప్పుడు నాయని నరసింహ రెడ్డి అయినా ఇప్పడు ,ముహ్మదాలీ అయినా, ముఖ్యమంత్రి వీర విధేయుల జాబితాలో ముందు వరసలో ఉంటారని,అందుకే వయసు రీత్యా, ఇతరత్రా వారి సామర్ధ్యం ఏమిటో తెలిసి కూడా ముఖ్యమంత్రి వారికి కీలక హోం శాఖ బాధ్యతలు అప్పగించారని, అందుకే హోం శాఖ అభాసుపాలవుతోందని, పోలీసు అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    రౌతు కొద్దీ గుర్రం అన్నట్లుగా మంత్రులు మెత్తగా ఉండడం వలన  కూడా అధికారులలో అలసత్వం, అరాచకం పెరిగిపోతున్నాయని అంటున్నారు. అలాగే,కొందరు అవినీతి అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి తప్పటడుగులు వేస్తున్నారు. పోలీసు వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు. కంచే చేను మేసిందన్న విధంగా, పోలీసు స్టేషన్లలోనూ మహిళలకు రక్షణ లేని పరిస్థితి,  వచ్చిందంటే, పరిస్థితి ఏ స్థితికి చేరిందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఒకటి రెండు కాదు, వరసగా  పోలీసుల  అరాచకాలు, అఘాయిత్యాలకు సంబదించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి వెలుగు చూస్తున్న సంఘటనల కంటే, వెలుగు చూడని  పోలీసు నేరాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.   తాజాగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధుల్లో ముగ్గురు పోలీసు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. అందులో మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు వివాహితపై కన్నేసి లోబర్చుకోవాలని యత్నించాడు. విఫలమవటంతో బెదిరించి తాను అనుకున్నది చేశాడు. ప్రశ్నించిన భర్తను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. చందానగర్‌ ఎస్సై శ్రీనివాసులు ప్రొబేషనరీ సమయంలోనే  చెలరేగాడు. ఠాణాకు వచ్చిన వారి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపుల కేసులో బాలిక తండ్రిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడు. నిందితులకు వత్తాసు పలికేలా వ్యవహరించాడని బాధితులు ఫిర్యాదు చేయటంతో అంతర్గతంగా విచారించారు. వాస్తవమని తేలటంతో సైబరాబాద్‌ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేసి సస్పెండ్‌ చేశారు. తాజాగా మల్కాజిగిరి సీసీఎస్‌ ఎస్సై విజయ్‌కుమార్‌ ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. అంతర్గత విచారణలో వాస్తవమని తేలడంతో చర్యలు చేపట్టారు. ఇప్పటికే సస్పెన్షన్‌, మెమోలు ఇచ్చినా ఆ ఎస్సై తీరులో మార్పు రాలేదు. చోరీ కేసులో అరెస్టయిన నిందితుడి ఏటీఎం కార్డు నుంచి రూ.లక్షలు కొట్టేసిన ఎల్బీనగర్‌ సీసీఎస్‌ సీఐని ఇటీవల విధుల నుంచి తప్పించారు. సివిల్‌ వివాదాల్లో తలదూర్చిన మేడ్చల్‌ సీఐ ప్రవీణ్‌రెడ్డి, ఎస్సై అప్పారావులను గత నెల 11న సైబరాబాద్‌ సీపీ సస్పెండ్‌ చేశారు. నిజానికి, ఇవి వెలుగు చుసిన పోలీసు నేరాలలో కొన్ని మాత్రమే..వెలుగు చూడని నేరాలు ఇంకా ఎన్నున్నాయో అన్న అనుమనాలు వ్యక్తమౌతున్నాయి.  సంసారాల్లో చిచ్చు పెట్టడం,  ఖాకీ జులుంతో మహిళలను లొంగదీసుకోవడం వంటి నేరాలు మాత్రమే కాదు, భూ వివాదాలు. ఆస్తి పంపకాలు, భార్యా భర్తల తగాదాల్లో తలదూర్చుతూ పోలీసులు వందలు, వేలల్లో కాదు, ఏకంగా లక్షల రూపాయలు, డిమాండ్‌ చేస్తున్నారు. దండుకుంటున్నారు. నిజానికి, అనేక మంది పోలీసు అధికారాలు, ప్రైవేటు వ్యక్తులను మధ్య వర్తులుగా నియమించుకొని దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, ఇది మొత్తం పోలీసులే చేస్తున్నారా? అంటే లేదు, కనిపించేది ఖాకీలే అయినా కార్పొరేటర్ మొదలు కనిపిచని ‘పెద్దలు’ ఎందరో ఉన్నారని  అంటున్నారు.

ఎలీసా బాధ ఎవ‌రు తీర్చ‌గ‌ల‌రు?

పిల్ల‌లు చ‌క్క‌గా ఆడుతూపాడుతూ తిర‌గాలి. త‌ల్లిదండ్రుల‌కే కాదు చుట్టుప‌క్క‌ల‌వారికీ పిల్ల‌లంటే ప్ర‌త్యేక ప్రేమ వుంటుంది. క‌నిపించ‌గానే ఏదో ఒక‌టి తిన‌డానికి పెడ‌తారు, క‌నీసం ముద్ద‌యినా పెడ‌తారు. పిల్ల‌ల్లో అదో అందం, ఆక‌ర్ష‌ణ స‌హ‌జం. అలాంటి ఆడుతూ పాడుతూ తుళ్లుతూండాల్సిన పిల్ల‌లు వూహించ‌ని అనారోగ్యానికి గుర‌యితే? ప‌క్క‌వాళ్లేమోగాని త‌ల్లిదండ్రుల బాధ‌ను ఎవ‌రు తీర్చ‌గ‌ల్గుతారు. స‌గం జీవితం కోల్పోయినంత బాధ‌. ఎవ‌రికీ చెప్పుకోలేరు, అలాగ‌ని పిల్ల‌ని వ‌దులుకోలేరు. దేవుడినైనా ఎదిరించి మ‌ళ్లీ మామూలు పిల్ల‌గా చేసుకోవ‌డానికి విశ్వ‌య‌త్నాలు చేస్తారు. ఇపుడు ఎలీసా బాధ లోకం తీర్చ‌లేనిది.   ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఎలీసా నాలుగేళ్ల  కూతురు క్లారా క్లార్క్ ఇతర పిల్లల మాదిరిగా రోజువారీ జీవితాన్ని గడపలేని అరుదైన పరిస్థి తులతో బాధపడుతోంది. క్లారా  అనేక అరుదైన పరిస్థితులతో బాధ పడుతూ ఆమెను విడిచిపెట్టలేకపోయింది. క్లారాకు గాలితో సహా బయటి ప్రపంచం అంటే ఎలర్జీ. క్లారా తల్లిదండ్రుల ప్రకారం, వారి నాలుగేళ్ల పాప ప్రత్యేక బేబీ ఫార్ములాతో జీవిస్తోంది. ఆమె ఆకలిగా ఉన్న ప్పుడు ఐస్ క్యూబ్స్‌ను స్నాక్స్‌గా తీసుకుంటోంది. క్లారా మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. అతి చ‌ల్ల‌ద‌నానికి ప్రాణాపాయ‌స్థితికి వెళ్లే ప్ర‌మాద కారక‌మవుతుంది. క్లారా గాలిలోని రసాయనాలు, చల్లని వాతావరణం, దోమల కాటుకు ప్రతిస్పం దించడానికి కారణమయ్యే నాలుగు అరుదైన పరిస్థితులను కూడా కలిగి ఉంది. 2021లో క్లారా లక్షణాలు తీవ్రరూపం దాల్చడంతో, ఆమె కిండర్ గార్టెన్‌కు హాజరు కాలేక పోయింది, ఆమెకు అవసరమైన సహాయం అందకపోతే ఆమె పాఠశాలను శాశ్వతంగా వదిలివేయవలసి ఉంటుంది. క్లారా పుట్టుకతో వచ్చే సుక్రేస్-ఐసోమాల్టేస్ లోపం (CSID) ఫుడ్ ప్రొటీన్-ప్రేరిత ఎంట్రోకోలిటిస్ సిండ్రోమ్ (FPIES)తో కూడా బాధపడు తోంద‌ని క్లారా త‌ల్లి ఎలిసా అన్నారు.  అనేక రుగ్మతల కారణంగా, క్లారా తీవ్రమైన కడుపు నొప్పి వ‌ల్ల ఎంతో అస‌హ‌నంతో సంబంధం ఉన్న ఇతర లక్షణాలను అనుభవి స్తుంది. తన కుమార్తె యొక్క అధ్వాన్నమైన పరిస్థితి, లక్షణాల కారణంగా, క్లారాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నం దున ఎలిసా తన పిల్లల బట్టలు,  ఉపకరణాల వ్యాపారాన్ని వదులుకోవలసి వచ్చింది.  క్లారా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని  కోరుకుంటున్నారు, తద్వారా ఆమె ఒక రోజు తినవచ్చు లేదా పాఠశాలకు వెళ్లవచ్చు ఇంకా సాధారణ జీవితంలో భాగం కావాలి అని ఎలీసా కోరుకుంటున్నారు.

కాపుల స‌మావేశం  సందేశ‌మేమిటి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ‌ప‌రిణామాలు వేగం పుంజుకుంటున్నాయి. జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోని వైసీపీ ప్ర‌భు త్వం విఫ‌ల‌మ‌యి, వైసీపీ నేత‌ల భ‌విష్య‌త్తు అగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌నాలి.  మ‌రో వంక  నారా చంద్ర బాబు నాయుడు నాయ‌క‌త్వంలో టిడిపీ మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌న్న ఆకాంక్ష జ‌నంలో వ‌స్తున్న స్పంద న‌తో  బాగా తెలుస్తోంది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతున్న టిడిపీకి జ‌నంలో మ‌ళ్లీ మ‌ద్ద‌తు ల‌భిస్తోం ది. గ‌ట్టిగా అనుకుంటే 2024లో అధికారంలోకి రావ‌డానికి అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నా రు టిడీపీ శ్రేణులు.  ఈ నేప‌థ్యంలో  రాష్ట్రంలో కాపు సామాజిక వ‌ర్గం కూడా త‌మ అధికార ఆకాంక్ష‌ల‌ను వ్య‌క్తం చేస్తూ స‌మావేశమై  ఒక  గ‌ట్టి నిర్ణ‌యానికి రావ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. తిరుపతిలో  ఒక ప్రయివేట్ ఫంక్షన్ హాల్‌లో గ్రేటర్ రాయలసీమ బలిజ ఆత్మీయ సమావేశం జరిగింది.  ఈ భేటీకి  రాయల సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బలిజ సామాజికవర్గానికి చెందిన నేతలు హాజయ్యా రు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య,  మాజీ ఎమ్మెల్సీ చెంగల రాయులు, మాజీ ఎమ్మెల్యే మనోహర్, సుగణమ్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొ న్నారు. గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాలలో బలిజల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. తగిన ప్రాతినిధ్యం దక్కలేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మా సామాజికవర్గం నుంచి ఎంపీలు లేరు. రాజ్యసభకు ప్రాతినిధ్యం లేదు. మిగతా ఏడు జిల్లా ల్లోని  కాపులకు తగిన ప్రాతినిధ్యం లభించింది. వారు రాజకీయంగా ముందంజ వేశారు. అందుకు విరుద్ధం కాదు కానీ వాళ్లకు మేం సరైన బలం ఇవ్వలేక పోతు న్నామ‌ని కాపులు భావిస్తున్నారు. ఎక్కువ జనాభా ఉన్న బలిజలకు కనీసం 20-30 ఎమ్మెల్యే లు, 4-5 ఎంపీలు, 4-5 ఎమ్మెల్సీ పదవులు దక్కాల్సి ఉంది. కాపు కులస్తులు రాజకీయంగా ఎదగడానికి ఏ పార్టీ అయినా సరే సహకారం అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించామ‌ని అన్నారు. ఓసీలైన బలిజ లకు రిజర్వేషన్ లేకపోవడం తో వెనుక బడ్డారు, దాన్ని ఎలా అధిగమించాలనే విషయమై తిరుప‌తి స‌మా వేశం చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ ఏదైనా సరే మా వాళ్ల ప్రాతినిధ్యం పెరగాలన్నదే మా ఉద్దేశం. ఈ సమావే శానికి పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చారు. కమ్మ, రెడ్డిలకు కాపుల ఊసే ద్వితీయస్థానం, వారికి దక్కాల్సిన హక్కును నిరాకరిస్తూ రాజకీయంగా అధి కారం చెలాయిస్తున్నా రని ఆరోపిస్తున్నారు. సుమారు నూట ఇరవై సంవత్సరాల క్రితం, బహుశా పంతొ మ్మిదవ శతాబ్దం చివరిలో, వారి సామాజిక స్థితి కమ్మల కంటే ఎక్కు వగా ఉందని కాపులు నమ్ముతారు. కానీ కమ్మలు వ్యాపారం, వాణిజ్యం, విద్యను వేగంగా తీసుకున్నారు. చాలా క‌ట్టుదిట్టంగా  కమ్మలు సామా జిక అభివృద్ధి క్రమంలో అగ్రస్థానానికి చేరుకోవడా నికి వేగంగా అడుగులు వేయగలిగారని వారి చ‌రిత్ర  పేర్కొంది. ఉద్యోగాలు, చదువుల విషయంలో తాము వెనుకబడి ఉన్నామని చెబుతూ కాపు సామాజికవర్గం స్వాతం త్య్రానికి ముందు తమ లాగే వెనుకబడిన కులాల కేటగిరీలో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. 1993 లో కాపు లను ‘వెనుకబడిన కులాల్లో’ చేర్చాలని కోరుతూ మొదటి పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత 1994లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ  ఆదేశాన్ని గౌరవించలేదని కాపు నాయకులు ఆరోపి స్తున్నారు. రాయలసీమలో తమ జనాభా 27 శాతం ఉంటుందని. కానీ ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని బలిజ నేతలు తెలిపారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాలను కూడా కలుపుకుంటే.. తమ వర్గం నుంచి కేవలం ఇద్దరు ఎమ్మె ల్యేలు మాత్రమే ఉన్నారన్నారు. బలిజ సామా జికవర్గం సీట్లను అడిగే స్థాయి నుంచి మరొకరికి  సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఈ సమావేశానికి హాజరైన కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ని కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు, బలిజ తదితర ఉప వర్గాలన్నీ కాపు సామాజిక వర్గం కిందకు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సామాజికవర్గం జనాభా ఎక్కువ. ముఖ్యంగా ఆంధ్రాలో 27 శాతం జనాభా తమ వర్గానిదేనని కాపులు చెబుతుంటారు. అయినా సరే రాజకీయంగా తమకు తగిన ప్రాతి నిధ్యం దక్కడం లేదనే భావన ఈ వర్గంలో ఉంది. కేవలం ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కాపులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వర్గానికి చెందినవారనే సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు చిరంజీవి సైతం తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా కాపులు మ‌ళ్లీ ఉద్య‌మించితే జ‌గ‌న్ అధికార కాంక్ష దెబ్బ తినే అవ‌కాశం దెబ్బ‌తిన‌వ‌చ్చు.

ఈరోజు శ్రీలంక మరి రేపు ..?!

ఇప్పుడు శ్రీలంకలో ఏమి జరుగుతోంది? ప్రజాగ్రహం వెల్లువెత్తి, అరాచకం విలయతాడవం చేస్తోంది. ప్రజలు రాష్టపతి భవనాన్ని ముట్టడించారు. రాష్ట్రపతి గొటబయ రాజపక్స దేశం వదిలి పారిపోయారు. ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె రాజీనామా చేశారు. అజ్ఞాతంలో  ఎక్కడున్నారో కూడా  ఎవరికీ తెలియదు. ప్రధాన మంత్రి అధికార నివాసానికి ప్రజలు నిప్పు పెట్టారు.ఇంతకూ మించిన విధ్వసం, అరాచకం మరెక్కడా ఉందదేమో అనే విధంగా లంకలో పరిస్థితులు దిజారి పోయాయి.  దీనికంతటికీ కారణం, ఆర్థిక సంక్షోభం. ఆర్థిక సంక్షోభానికి కారణం పాలకుల అనాలోచిత  నిర్ణయాలు. సంక్షేమం పేరిట, అప్పులు చేసి మరీ జనాకర్షక పథకాలను అమలు చేయడం వలన, ఆర్థిక క్రమశిక్షణ పట్టాలు తప్పింది. దేశం అప్పుల ఉబిలో కూరుకు పోయింది. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పింది. ప్రజలు తిరగబడ్డారు. దేశం ప్రమాదంలో పడింది. ప్రభుత్వం పలాయనం చిత్తగించింది.ఈ పరిణామాలు శ్రీలంక సంక్షోభాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి.  శ్రీలంక పరిణామాల నేపధ్యంలో, సహజంగానే మన దేశం పరిస్థితి ఏమిటి? అనే, ప్రశ్న చర్చకు వచ్చింది. నిజానికి, శ్రీలంక ఆర్ధిక వ్యవస్థ కంటే, మన దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉందని నమ్మే రాజకీయ ప్రముఖులే కాదు, ఆర్థిక రంగ నిపుణులు కూడా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయితే, ఒకటికి పదిసార్లు శ్రీలంక ఆర్థిక ప్రగతిని, శ్రీలంక పాలకుల ముందు చూపును మెచ్చుకున్నారు. తెలంగాణనే కాదు, మొత్తం దేశాన్నే శ్రీలంక దిశగా తీసుకుపోయేందుకు నడుం బిగించారు. భారత దేశం దశ, దిశ మార్చేస్తానని శపథం కుడా చేశారు.   కేంద్ర ప్రభుతాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆర్థిక విధానలను విమర్శించే క్రమంలో సంతోష సూచీ, స్థూల జాతీయ ఉత్పతి, ఆకలి సూచి, ఆర్థిక అభివృద్ది సూచి ఇలా అనేక, సూచీలలో శ్రీలంక భారతదేశం కంటే చాలా ముందుందని అనేక సందర్భాలలో మీడియా సమావేశాల్లో పేర్కొన్నారు. మన దేశానికి శ్రీ లంక ఆదర్శం కావాలనే ఆకాంక్ష కూడా వ్యక్త పరిచారు. ఇంతవరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల చేత కాని తనం వలన ఈ పరిస్థితి వచ్చిందని, అందుకే జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అఫ్కోర్స్  తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ లో శ్రీలంగ విషయాన్ని ఆ కోణంలో  ప్రస్తావించలేదనుకోండి  అది వేరే విషయం.  అయితే, అదలా ఉంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ వంటి నాయకులు ఏమి మాట్లాడినా అది అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. నిజానికి, ప్రజలు కూడా పట్టించికోవడం లేదు, కానీ, కౌశిక్ బసు వంటి పేరొందిన ఆర్థిక వేత్తలు సూచీలను చూపించి సూచీల అదారంగా చేసిన ఆర్థిక విశ్లేషణలు ఇప్పుడు ప్రశ్నార్ధకం  అవుతున్నాయి. ఆర్థిక నిపుణులు కూడా, రాజకీయ వేత్తల స్థాయికి దిగ జారుతున్నారా, అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  నిజానికి, కౌశిక్ బసు మాములు చిన్నా చితకా  ఆర్థిక వేత్త కాదు.  2012 నుండి 2016 వరకు ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ గా పనిచేశారు. అలాగే, 2009–2012 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. అయితే, ఆయన ప్రపంచ బ్యాంక్ వివిధ దేశాలకు వివిధ ప్రామాణికాల ఆధారంగా ఇచ్చే గ్రేడింగ్ విషయంలో ఆయన, ముఖ్యమంగా భారత దేశం విషయంగా తమ రాజకీయ దృక్పథాన్ని, బయట పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి.  అంతటి విలువైన ఆర్థిక వేత్త, ఎప్పుడో కాదు, కొద్ది నెలల క్రితమే, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా వుందని కితాబు నిచ్చారు. లంక చిన్నదేశమే అయినా ఆ దేశం హ్యాపీనెస్ ఇండెక్స్ ( సంతోష సూచి) భారతక దేశం కేంటే ముందుందని, సంతోషం వ్యక్త పరిచారు. అలాగే ఆకలి సూచి, స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదలలో కూడా శ్రీలంక భారత దేశం కన్నా మెరుగైన  స్థితిని సూచిస్తున్నదని కౌశిక్ బసు తెలిపారు. అలాగే, పాకిస్థాన్ బంగ్లా దేశ్ సహా భారత దేశ ఇరుగు పొరుగు దేశాలు అన్నీ అద్భుతంగా సూచీల వెంట పరుగులు తీస్తున్నాయని, ఒక్క భారత దేశం మాత్రమే మెల్లగా అడుగులో అడుగులు వేస్తూ నత్తనడక సాగిస్తోందని,  తమ, మేధావిత్వం  మొత్తం వొలక పోశారు. ఆ వొలక పోతలను పట్టుకునే కావచ్చును, కేసీఆర్ వంటి రాజకీయ మేథావులు, శ్రీలంక, పాక్, బంగ్లాదేశ్ బాటాలో అప్పులు చేసి సూచీలను సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. అయితే, సూచీల సోకుల  కంటే ప్రజల వాస్తవ పరిస్థితులు భిన్నంగా  ఉంటాయని శ్రీలంక తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. సో .. ఇప్పటికైనా ఆర్థిక వేత్తల మేధావిత్వం ( డంబ్ ఇంటలెక్టువల్స్)  అసలు రంగును,  కేసీఆర్ వంటి రాజకేయ మేథావులు గుర్తిస్తే మంచిది, లేదంటే ఈ రోజు శ్రీలంక రేపు తస్మాత్ జాగ్రత్త అని  క్షేత్ర సూచీలు హెచ్చరిస్తున్నాయని అంటున్నారు.

తగ్గేదేలే.. ఎవరొచ్చినా.. రాకున్నా నా దారి జాతీయ రాజకీయాల వైపే!

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తగ్గట్లే.. తగ్గేదే లే అంటూ పుష్పలా ముందుకే సాగుతున్నారు. ఎవరు కలిసి వచ్చినా, రాకున్నా తన అడుగు ముందుకేనని స్పష్టం చేస్తున్నారు. అంతే కాదు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసన మోడీ ప్రధాని కాగా లేనిది..  తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న నేను ప్రధాని ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా మోడీ గుజరాత్ ను అభివృద్ధి చేసిన దాని కన్నా వంద రెట్లు తాను తెలంగాణను ప్రగతి పథంలో నడిపించానని చెప్పుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఎనిమిదేళ్ల కాలంలోనే దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రాలలో ఒకటిగా నిలిపిన తనకు.. దేశాన్ని ఎలా ముందుకు నడపాలో మోడీ కాంటే బాగా తెలుసునని అంటున్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైన రోజుల మీడియా సమావేశంలో మోడీకి   ప్రశ్నలూ సంధించి వాటికి సమాధానాలు చెప్పమని సవాల్ చేసి.. ప్రధాని ప్రసంగానికి అజెండా నిర్ణయించేశానని చెప్పుకున్న కేసీఆర్.. ఆ తరువాత మోడీ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావనే తీసుకురాకపోవడంతో దిగాలు పడ్డారు. అందుకే బీజేపీ జాతీయ కార్గవర్గ సమావేశాలు ముగిసిన వారం రోజుల తరువాత తనను తాను కూడదీసుకుని మరోసారి మోడీ పాలనపై ధ్వజమెత్తడానికి మీడియా ముందుకు వచ్చారు. ఒక వైపు రాష్ట్రం కుండపోత వర్షాలతో అతలాకుతలమై ఉన్న సమయంలో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షా సమావేశాన్ని క్లుప్తంగా ముగించేసిన కేసీఆర్.. కేంద్రంపై, మోడీ పాలనపై ధ్వజమెత్తేందుకు మీడియా సమావేశంలో ఎక్కువ సమయమే తీసుకున్నారు. బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడమేనని ఉద్ఘాటించారు. మోడీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం జరగిన బహిరంగ సభలో తానడిగి ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేకపోయారని నిందించారు. మోడీ ప్రసంగం పూర్తయిన వారం రోజుల తరువాత కేసీఆర్ తాను మోడీకి సంధించిన ప్రశ్నలు కొత్తవేమీ కాదని వెల్లడించారు. 2014 ఎన్నికలకు ముందు మోడీ అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ను ఏ ప్రశ్నలైతే అడిగారో వాటినే తాను మోడీని అడిగానని అసలు రహస్యం చెప్పేశారు. తన జాతీయ అజెండా కొత్తదేమీ కాదనీ.. ఎనిమిదేళ్ల నాడు యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మోడీ ఏ అజెండానైతే ప్రజల ముందుకు తీసుకువచ్చారో అదే అజెండాతో తాను మోడీని ఎదుర్కొంటానని చెప్పారు. ఈ సందర్భంగా రూపాయి పతనంపై  మోడీ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శల వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించి చూపారు.   దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ప్రత్యర్ధులపై దాడులకు ఉపయోగించుకుంటున్నారనీ.. అలా వారిని బెదరించి  బీజేపీలో చేర్చుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రప్రభుత్వాలను కూల్చేయడమే కేంద్రం పాలనా తీరుగా మారిపోయిందన్నారు.    సీబీఐ కేసులు ఎదుర్కొని.. ఆ తర్వాత బీజేపీలో చేరి కేసుల ఊసే లేకుండా తిరుగుతున్న నేతల జాబితాను ఈ సందర్బంగా ఆయన బయటపెట్టారు. ప్రధానంగా సుజనా చౌదరి పేరును పలు మార్లు ఉదహరించారు. ప్రధాని మేకిన్ ఇండియా అట్టర్ ప్లాప్ అని విమర్శలు గుప్పించారు. పతంగుల మాంజా నుంచి ప్రతిదీ మేడిన్ చైనాయే అని ఎద్దేవా చేశారు. దేశానికి పాకిస్థాన్ కన్నా చైనాతోనే ప్రమాదం ఎక్కువ అని తనతో పలువురు మాజీ మేజర్లు, లెఫ్టినెంట్ జనరళ్లు చెప్పారనీ, అటువంటి చైనా సరిమద్దుల్లో మోడీ సర్కార్ దేశ భక్తి పేరిట ఆర్మీతో ప్రయోగాలు చేస్తోందని ఆరోపించారు. అగ్నిపథ్ అనేది ఒక పనికి మాలిన పథకమని చెప్పారు. జవాన్లకు శిక్షణ ఇవ్వడానికే ఆరేళ్లు పడుతుందన్నారు. అటువంటి శిక్షణ లేకుండా కేవలం నాలుగేళ్లలో జవాన్ల కెరీర్  పూర్తి చేసేయడమంటే ఆర్మీ సామర్థ్యాన్ని నీరుగార్చడమేనని దుయ్యబట్టారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోడీ వారి బతుకులను ఆగంఆగం చేశారని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు రెండు రోజుల పాటు రైతు ఉద్యమ నేత రాకేశ్  తికాయత్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని రెండు రోజుల పాటు కేసీఆర్ చర్చించారు. అంతే కాకుండా ఆయన మాటలను బట్టి ఆర్మీ మాజీ మేయర్లు, లెఫ్టినెంట్ జనరళ్లతో కూడా ఆయన చర్చించారని అవగతమౌతోంది. మొత్తం మీద కేసీఆర్ బీజేపీపై విసుర్లు, విమర్శలతో మరో సారి రాజకీయ చర్చలకు తనను తాను కేంద్ర బిందువుగా చేసుకోగలిగారు.

క‌మ‌ల‌నాధుల జాతీయ‌త‌త్వం కేవ‌లం బోధ‌నల‌కేనా?

తెలిసిందే చెప్పాలి. తెలిసిందే బోధించాలి. స్వ‌యంగా అమ‌లుచేసిన అనుభ‌వంతో ప్ర‌చారం చేయాలి. వీట‌న్నింటికీ విరుద్ధం బిజెపి.  ఈమ‌ధ్య‌కాలంలో దేశంలో జ‌రుగుతున్న అనేక తీవ్ర‌వ‌వాద దాడుల్లో దొరి కిన తీవ్ర‌వాదులకు, మ‌రీ ముఖ్యంగా ఉద‌య్‌పూర్‌, అమ‌రావ‌తి హ‌త్య‌ల్లో ప‌ట్టుబ‌డిన‌వారంద‌ర‌కి  ఏదో విధంగా బిజెపి పార్టీతో సంబంధాలు వుంటున్నాయ‌ని కాంగ్రెస్ న‌మ్మ‌కంగా చెబుతోంది. తీవ్రవాదం వంటి తీవ్రమైన జాతీయ సమస్యలపై రాజకీయాలు చేయడంలో తమకు నమ్మకం లేదని, అయితే భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉగ్రవాద కార్యకలాపాల్లో చిక్కుకున్న వ్యక్తుల మధ్య  సన్నిహిత సంబంధాలను ప్రశ్నించేలా  చేస్తుందని కాంగ్రెస్  తెలిపింది. జాతీయవాదం గురించి భారతీయులకు బోధించే  ప్ర‌తీ అవ కాశాన్ని వ‌ద‌ల‌ని పార్టీ బిజెపి. ఏది ప్ర‌చారం చేస్తున్నామో, బోధిస్తున్నామ‌న్న ధ్యాస బిజెపి నాయ కుల‌కు లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ హత్యకేసు నిందితుల్లో ఒకరైన మహ్మద్ రియాజ్ అత్తారీ బీజేపీ కార్యకర్త  అని  ఆయన ఆరోపిం చారు. స్థానిక సీనియర్‌ నేత సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బిజెపి సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన అనేక పార్టీ కార్య క్రమాలకు హాజరవుతున్నట్లు కనిపించారు అని కుమార్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో స్థానికుల చేతిలో పట్టుబడిన లష్కరే తోయిబా ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ షా అక్కడ బీజేపీ ఆఫీస్ బేరర్ అని ఇటీవల వెల్లడైంది. అరెస్టుకు ముందు అమర్ నాథ్ యాత్రపై దాడు లకు ప్లాన్‌ చేశార‌ని తెలిపారు. అమరావతి రసాయన శాస్త్రవేత్త ఉమేష్ కోల్హే హత్యకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇర్ఫాన్ ఖాన్‌కు స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణాతో సన్నిహిత సంబంధాలు ఉన్నా యని కూడా ఆరోప‌ణ‌లు వున్నాయి. ఖాన్ ప్రచారం చేసి రాణాల కోసం ఓట్లు కోరినట్లు తెలిసింది. అయితే, కెమిస్ట్ హత్య కేసు నిందితులకు సంబంధం ఉందన్న ఆరోపణ లను రాణా దంపతులు గతంలో ఖండిం చారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నవీద్ బాబు కోసం ఆయుధాలు సేకరించినం దుకు కాశ్మీర్‌కు చెందిన మాజీ బిజెపి నాయ కుడు తారిక్ అహ్మద్ మీర్ 2020లో అరెస్టయ్యాడు. నవీద్ బాబు గతంలో  డీ ఎస్పీ దవీందర్ సింగ్‌తో కలిసి ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేశాడనే ఆరోపణలతో అరెస్టయ్యా డు. మీర్ దేవిందర్ సింగ్ సహచరుడిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారించింది. దేవిందర్ సింగ్ విచారణను ముగించి ఉంటే నిజం బయటకు వచ్చేది, కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. 2017లో, మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎ టి ఎస్‌) పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐ ఎస్ ఐ) డైరెక్టరేట్ కోసం గూఢచర్యం చేసినందుకు బిజెపికి చెందిన ఐటి సెల్ సభ్యుడు ధ్రువ్ సక్సేనాతో పాటు ప‌దిమంది సహచరులను అరెస్టు చేసింది. గూఢచర్యం సులభతరం చేసేందుకు గూఢచారి రింగ్ అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేసిందని, రెండేళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌కు చెంది న బజరంగ్ దళ్ నాయకుడు బలరామ్ సింగ్ తీవ్రవాద నిధుల కేసులో అరెస్టయ్యాడు. అదే ఏడు ప్రత్యేక ఎన్ ఐఎ కోర్టు అస్సాం బీజేపీ నాయకుడు నిరంజన్ హోజాయ్‌కి జీవిత ఖైదు విధించింది. వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, వాటిని ఉగ్రవాద సంస్థకు మద్దతుగా మళ్లించారని తేలింది. ఈ నిధులను ఆయుధాల కొనుగోలుకు, మన భద్రతా బలగాలపై దాడులకు వినియోగించారు. శ్రీనగర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మసూద్ అజార్ సహచరుడు మహ్మద్ ఫరూఖ్ ఖాన్‌కు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది. ఖాన్ గతంలో జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ మరియు హర్కత్-ఉల్-ముజాహిదీన్ సభ్యుడు అని కుమార్ ఆరోపించారు. కాందహార్ హైజాకింగ్ సమయంలో 1999లో భయం కరమైన ఉగ్రవాది మసూద్ అజర్‌ను విడుదల చేయడంలో బిజెపి ప్రభుత్వం సందేహాస్పదంగా ఉందని ఆయన అన్నారు. 2001 పార్లమెంటు దాడి , వందలాది మంది మరణాలకు కారణమైన 2008 ముంబై దాడులకు కారణమైన జైష్-ఎ-మహ్మద్ ఉగ్ర వాద సంస్థను అజర్ స్థాపించాడు. 2019 పుల్వామా దాడికి కూడా జైష్ సూత్రధారి, దీనిలో 200 కిలోల అధిక పేలుడు పదా ర్థాల తర్వాత 44 మంది సిఆర్‌పి ఎఫ్‌ సిబ్బంది మరణించారు, ఆర్‌డిఎక్స్‌ కూడా బహుళ భద్రతా తనిఖీ కేంద్రాలను దాటింది. పుల్వామా పై విచారణ ఎందుకు జరగ లేదు అనేది మిస్టరీగా మిగిలిపోయింది.  తీవ్రవాదం వంటి తీవ్రమైన సమస్యలపై రాజకీయాలు చేయ డంలో కాంగ్రెస్‌కు నమ్మకం లేదు, అయితే బీజేపీకి, ఉగ్రవాద కార్య కలాపాల్లో చిక్కుకున్న వ్యక్తులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వెల్లడి అధికార పార్టీకి జాతీయవాదం గురించి బోధించే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది. జాతీయ వాదం ముసుగులో బీజేపీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులతో పార్టీ సంబంధాలు దేశ భద్రతకు ముప్పు అని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

కేసీఆర్ ను ఏకాకిగా మారుస్తున్న యాంటీ సెంటిమెంట్!

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నారు. అలాగే కాలం కలిసి రాకపోతే తాడే పామౌతుందనీ అంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా కాలం కలిసి రాకపోతే.. అన్నట్లు ఉంది. జాతీయ రాజకీయాలంటూ ఆయన ఎంత హడావుడి చేసినా పెద్దగా మద్దతు రావడం లేదన్నది పక్కన పెడితే.. ఆయనతో రాజకీయంగా సన్నిహితంగా వచ్చిన వారందరికీ ఏదో రూపంలో  ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ (పీకే) నుంచి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ వరకూ అందరూ ఏదో విధంగా ఇబ్బందులు పడ్డవారే. సినిమా పరిశ్రమ తరువాత సెంటిమెంట్లను ఎక్కవగా నమ్మేది రాజకీయ రంగంలోనే అంటుంటారు. అంతెందుకు స్వయంగా తెరాసయే సెంటిమెంట్ అస్త్రాన్నే రాజకీయ సోపానంగా చేసుకుని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత మరో సారి తెరాసను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి సెంటిమెంటునే ఆశ్రయిస్తున్నారు. అటువంటి కేసీఆర్ కు ఇప్పుడు జాతీయ రాజకీయ అరంగేట్రం వద్దకు వచ్చే సరికి అన్నీ యాంటీ సెంటిమెంట్ ఉదంతాలే ఎదురౌతున్నాయి. గత రెండు ఎన్నికలనూ టీఆర్ఎస్ సొంత బలంతో ఎదుర్కొని తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయానికి వ్యూహరచన, పథకాల రూపకల్పన దగ్గర నుంచి ప్రచార సారథ్యం వరకూ అన్ని కేసీఆర్ తన భుజస్కంధాలపై మోశారు. ఒంటి చేత్తో పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గట్టెక్కించడానికి ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ను ఆశ్రయించారు. పీకే కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పలు మార్లు కేసీఆర్ తో ప్రగతి భవన్ లోభేటీ అయ్యారు. అక్కడే మకాం వేసి మరీ చర్చలు జరిపారు. అక్కడి వరకూ బానే ఉంది. ఆ తరువాతే వ్యూహకర్తకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. పీకే రాజకీయ ఆకాంక్షలకు గండి పడింది. ఏదో ఓపార్టీ పంచన చేరి రాజకీయంగా చక్రం తిప్పుదామనుకున్నా ఆయన చేరదీసే వారూ, దగ్గరకు రానిచ్చే వారే కరవయ్యారు. తెలుగు రాష్ట్రాలు తప్ప ఎన్నికల వ్యూహాల కోసం పీకే వైపు చూసే వారే కరవయ్యారు. ఏ పార్టీ దరికి చేరనీయకపోవడంతో అని వార్యంగా సొంత రాష్ట్రానికి వెళ్లి అక్కడ ప్రాంతీయ పార్టీ ప్రకటన చేసి.. అక్కడకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది.  ఆ తరువాత వంతు రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్. రాకేశ్ టికాయత్ పరిస్థితి కూడా కేసీఆర్ తో సాన్నిహిత్యం తరువాతే అగమ్యగోచరంగా మారిపోయింది. మోడీ తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన బ్రహ్మాండమైన ఆందోళనకు నాయకత్వం వహించిన టీకాయత్.. ఆ ఆందోళనకు మోడీ దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పి మరీ ఆ చట్టాలను ఉపసంహరించుకునేలా చేశారు. ఆ తరువాత కూడా ఆయన రైతు నాయకుడిగా తిరుగులేని ఆధిపత్యాన్నే అనుభవించారు. హైదరాబాద్ వచ్చి మరీ రైతు సభలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల నిప్పులు చెరిగారు. అక్కడి వరకూ ఆయనకు  తిరుగేలేని పరిస్థితి ఎదురైంది. ఆ తరువాతే ఆయన సీఎం కేసీఆర్ తో హస్తినలో వేదిక పంచుకున్నారు. అక్కడ నుంచీ ఆయన కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ తో జత కట్టిన తరువాతే ఆయనకు అంత వరకూ సహచరులుగా ఉన్న రైతు నాయకులే ఆయనపై తిరుగుబాటు చేశారు. రాజకీయ పార్టీలతో, రాజకీయ నేతలతో అంటకాగుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆయనపై దాడికి సైతం దిగారు. దీంతో ఇప్పుడు ఆయన వెంట రైతులు లేని పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఆయనే కేసీఆర్ వెంట తిరుగుతున్న పరిస్థితి. దేశంలో రైతుల పరిస్థితి, కేంద్రానికి వ్యతిరేకంగా వారికి మరోసారి ఉద్యమ కార్యోన్ముఖులను చేయడం తదితర అంశాలపై ఇటీవల ఆయన కేసీఆర్ ప్రగతి భవన్ లో రెండు రోజులు బస చేసి మరీ ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పుడు తికాయత్ కు కేసీఆర్ వెంట నడవడం వినా మరో మార్గం కనిపించడం లేదా అని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు.  ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా కేసీఆర్ బీజేపీయేతర కూటమి, జాతీయ స్థాయిలో మరో పార్టీ ప్రతిపాదనలకు ఇసుమంతైనా స్పందించని సమయంలో కేసీఆర్ తో కలిసి అడుగు వేయడానికి ముందుకు వచ్చారు హేమంత్ సొరేన్. హైదరాబాద్ వచ్చి మరీ కేసీఆర్ తో రెండు రోజులు మంతనాలు జరిపారు. పనిలో పనిగా తన సన్నిహిత బంధువు వైద్యం కోసం కూడా కేసీఆర్ సలహాను, సహాయాన్ని అందుకున్నారు. రాజకీయంగా కేసీఆర్ తో కలిసి అడుగులు వేయనున్నట్లు చెప్పకనే చెప్పారు. అంత వరకూ బానే ఉంది. ఆ తరువాతే పరిస్థితి ఆయనకు ప్రతి కూలంగా మారింది.  మైనింగ్ లీజు, అలాగే ఒక ప్లాట్ ఆయ‌న భార్య‌పేరున రిజిష్ట‌ర్ చేయించుకున్నార‌న్న అవినీతి ఆరోపణలపై ఆయన నివాసం, ఆయన సన్నిహితుల నివాసాలపై ఈడీ దాడులు జ‌రిగాయి. ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి సోరేన్ స‌న్నిహితుడు, సాహిబంజ్ ఎమ్మెల్యే పంక‌జ్ మిశ్రా సంబంధించిన నివాసాల‌పై దాడులు నిర్వహించింది. అలాగూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుల ఇళ్లల్లో సైతం ఈడీ దాడులు నిర్వహించింది. మొత్తం18 ప్రదేశాల్లో ఈడీ దాడులు జరిగాయి. ఈ దాడులు కూడా హేమంత్ సొరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ అయిన తరువాత జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కేసీఆర్ తో రాజకీయంగా ఎలాంటి సాన్నిహిత్యమైనా తమను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందన్న ఆందోళన రాజకీయ నాయకులలో వ్యక్తం అవుతోంది. కేసీఆర్ తో సాన్నిహిత్యం తరువాతే ఒకరి తరువాత ఒకరుగా ఇబ్బందుల్లో పడటం కాకతాళీయమే అయినా సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ రంగంలో ఇది కేసీఆర్ ను ఏకాకిగా మార్చే అవకాశాలే మిక్కిలిగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.   

వానలే వానలు.. తడిసి ముద్దైన తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నింగీ నేలా ఏకమైందా అన్నంతగా గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం, శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక  భారీ వర్షాలకు బోధన్‌ నియోజకరవ్గంలోని రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర.. గోదావరి పోటెత్తి ప్రవహిస్తోంది. గ్రామాల్లో చెరువులు అలుగు పారుతున్నాయి. నవీపేట మండలంలో కాలువకు గండి పడటంతో .. జాన్నేపల్లి నుంచి నలేశ్వర్‌ వరకు పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో భారీ వర్షాలకు రేకుల ఇల్లు కూలిపోయిం  ముగ్గురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న  సత్తుపల్లి మండలం కిష్టాపురం-చెరుకుపల్లి, కిష్టాపురం-జగన్నాధపురం గ్రామాల మధ్య .. చౌటువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.  పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో .. భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.   నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తగూడెంలో ఓపెన్ కాస్ట్ గునుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు చేరడంతో బొగ్గు వెలికితీత నిలిచిపోయింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం అంతర్‌ రాష్ట్ర వంతెన దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది. ఇలా ఉండగా తెలంగాణలో భారీ వర్షాల కారణంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో వర్షాలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. 

పోలీసాయ‌న మాన‌వ‌త్వం

మ‌డిస‌న్నాక కూసింత క‌ళా పోస‌న వుండాల‌.. అంటాడు ముత్యాల ముగ్గు సినిమాలో కూసింత హాస్య‌ప్రియ‌త్వ‌ం ఉన్న విల‌న్‌. మ‌డిస‌న్నాక కాస్తంత మాన‌వ‌త్వ‌మూ చూపాలి అంటున్నాడు ఓ పోలీసాయ‌న‌. ఎర్ర‌టి ఎండ‌లో మ‌నం చాలా జాగ్ర‌త్త‌లు పాటిస్తుంటాం. బ‌య‌టికి వెళ్లేటప్పుడు మంచిచెప్పులు, గొడుగూ కూడా ప‌ట్టుకుంటాం. అస‌లు సాధ్య‌మైనంత‌ వ‌ర‌కూ ఎండ‌పొడ త‌గ‌ల‌కుండానే జాగ్ర‌త్త ప‌డుతూంటాం. కూల్‌డ్రింక్‌లు, ఐస్ క్రీమ్‌ల మ‌ద్ద‌తు ఎలాగూ తీసుకుంటాం. కానీ ఇవేవీ లేకుండానే ప‌నిచేస్తుండే వారూ వుంటారు. ప‌ని మీద దృష్టితో ఎండ‌కీ, వాన‌కీ భ‌య‌ప‌డ‌రు. ఎండా కాలంలో త‌ల‌కి క్యాప్ మాట దేవుడెరుగు అస‌లు కాళ్ల‌కి మామూలు స్లిప్ప‌ర్ల‌యినా లేకుండా ప‌నులు చేసే కార్మికులు వుంటారు. సామాన్ల‌ను ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తీసికెళ్లే రిక్షా బండి వారు రోజు గ‌డిచాక వ‌చ్చే నాలుగు డ‌బ్బులు లెక్కేసుకోవ‌డానికి సూర్యుడి వేధింపుల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అలా తిరుగుతూనే వుంటారు. సోడా తాగుతారు, కాస్తంత ఓ క్ష‌ణం సేద‌ తీరుతారంతే. పూర్తి స్థాయి ఎండ‌వేడిమి నుంచి ర‌క్ష‌ణ గురించిన ఆలోచ‌న వారిలో చాలా మందికి వుండ‌దు. ఔను మరి రెక్కాడితేనే డొక్కాడే బతుకులు వారివి. అలాంటి శ్రామికుడి అవ‌స్థ‌ను కళ్లారా చూశాడు ఓ పోలీసు. వెంట‌నే ద‌గ్గ‌రున్న చెప్పుల దుకాణానికి వెళ్లి స్లిప్ప‌ర్లు కొనిచ్చాడు. బ‌హుశా ఆ బండి వాడిని చాలా రోజులుగా గ‌మ‌నిస్తున్నాడేమో. అత‌ని అవ‌స్థ‌ను చూస్త న్నాడేమో.. మ‌న‌సు క‌దిలింది. వెంట‌నే తాను చిన్న సాయ‌మైనా చేయాల‌నుకుని చెప్పులు కొనిచ్చాడు. బండి వాడికి ప‌ర‌మ సంతోషం క‌లిగింది. చ‌క్క‌గా న‌వ్వేడు. అదే భ‌గ‌వ‌దాశీర్వాదం అనుకున్నాడు ఆ పోలీసాయ‌న‌. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగు తూంటాయి. మాన‌వ‌త్వం అనేది పెద్ద పెద్ద ప‌నుల్లోనే చూపాల‌ని లేదు.. ఇలాంటి బ‌హు చిన్న‌ ప‌నితోనూ చూప‌వ‌చ్చు. కావ‌డానికి స్లిప్ల‌ర్లు కొనివ్వ‌డం చిన్న‌ప‌నే కావ‌చ్చు.. కానీ దాని వ‌ల్ల ఆ బండివాడిలో క‌లిగిన ఊర‌ట లెక్క‌లేనంత‌. పోలీసాయ‌న తృప్తికీ విలువ‌క‌ట్ట‌లేము. ఈ దృశ్యాన్ని ఓ వ్య‌క్తి వీడియో తీసి నెటిజ‌న్ల‌కు అందించాడు. పోలీసాయ‌న‌పై  ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. మ‌నమూల శ‌భాష్ అందామా!

బాణోత్ చంద్రావ‌తికి టీఆర్ ఎస్ పెద్ద‌ల మ‌ద్ద‌తు ?!

రాజ‌కీయాల్లో చిత్ర‌విచిత్రాలు జ‌రుగుతుంటాయి. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని వ‌స్తారు. కొంద‌రు త‌ప్ప‌నిస్థితిలో వ‌స్తారు. ఇంకొంద‌రు సీనియ‌ర్ల స్పూర్తితో వ‌స్తారు. బాణోత్ చంద్రావ‌తి త‌ప్పని స్థితిలో రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం చేశారు. ఆమె మెడిసిన్ చ‌దివారు. ప్రాక్టీస్ కూడా ఆరంభించాక వూహించ‌ని విధంగా ఆమె రాజకీయాల్లోకి వ‌చ్చారు. 2009లో సీపీఐ అభ్య‌ర్ధిగా ఖ‌మ్మం జిల్లా వైరా నుంచి పోటీ చేసి గెలిచారు. అప్ప‌ట్లో విద్యాధికురాలుగా అంద‌రి అభిమానం చూరగొన్నారు. అందువ‌ల్ల సునాయాసంగానే గెలిచారామె. త‌ర్వాత తెలం గాణా ఏర్ప‌డిన‌పుడు ఆమె టిఆర్ ఎస్‌లో చేరారు. తెలంగాణా ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ స‌భ్యురాలయ్యారు.   2014లో వైసీపీ నుంచి వైరా అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌లాల్‌ విజయం సాధించిన అనంతరం తెరాసలో చేరారు. ఇక 2018 డిసెంబర్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన రాములునాయక్‌ అనూహ్యంగా విజయం సాధించి అనంతరం తెరాసలో చేరారు. ఇలా మాజీలు అందరూ ఒకే గూటికి చేరి, టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. గత జూన్‌ 11న ఖమ్మంలో పర్యటించిన తెరాస కార్య నిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్‌లకు టికెట్‌ దక్కదన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. దీంతో తీవ్రమైన నిరాశా నిస్ఫృహలకు గురైన ఎమ్మెల్యే రాములునాయక్‌ , అనంతరం జరిగిన పలు సభల్లో కాంగ్రెస్‌ పార్టీని, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని పొగడ్తల్లో ముంచెత్తారు. తనకు టిఆర్ ఎస్ టికెట్‌  దక్క దన్న ఆవేదన రాములు నాయక్‌ మాటల్లో వ్యక్తమైంది. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ సైతం అనుకున్నంత ఉత్సా హంగానూ కనిపించడం లేదు.  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరునిగా 2014లో వైసీపీ టికెట్‌ సంపాదించి, అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచారు. అయితే టీఆర్ ఎస్‌లో చేరాక తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయంగా అండగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దూరమయ్యా రు. అదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సన్నిహితునిగా మారారు. ఓటమి పాలైనప్పటికీ నియోజక వర్గంలో చురుగ్గా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తెరాస టికెట్‌ తనదేనని, తన గెలుపు నల్లేరుపైన నడకేనని ఆయన చెబుతున్నా రు. దీంతో ఈసారి వైరా అసెంబ్లీ స్థానానికి తెరాస తరపున ముగ్గురు పోటీపడే పరిస్థితి ఉంది. మరి ఎవరికి టికెట్‌ లభిస్తుందో,  ఎవరు మరోసారి ఎమ్మెల్యేగా శాసనసభలోకి అడుగుపెడతారో తేలాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో తరచుగా నియోజకవర్గంలో చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్న బాణోత్‌ చంద్రావతి టిఆర్ ఎస్‌ తరపున వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిని అని చెప్పుకుంటున్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు ఆమె చెప్పుకుంటున్నారు.   దీన్లో భాగంగానే ఆమె తన పర్యటినలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వతహాగా సీపీఐ ఫ్యామిలీగా ముద్రపడిన చంద్రావతి కుటుంబం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్‌ నేత పువ్వాడ నాగేశ్వర్​రావుకు సన్నిహితంగా ఉంటూ వస్తోంది. దీంతో జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మద్దతు సైతం చంద్రవతికి దక్కే అవకాశం ఉంది. బహుశా ఆ ధీమా తోనే చంద్రవతి ఉండవ‌చ్చు.  పార్టీ తరపున ప‌నిచేస్తున్న పీకే ఇటీవల నిర్వహించిన సర్వేలో సుమారు నలభై మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉందన్న నివేదికలు పార్టీ అధినేతకు వెళ్లాయి. ఫలితంగా పార్టీకి భారంగా పరిణమించిన ఆయా ఎమ్మెల్యేలకు అక్కడ  స్థానికంగా సరైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ ధీమాతోనే చంద్రవతి తన పని తాను చేసుకునిపోతున్నారు. ఇలా ఒకే స్థానం నుంచి ముగ్గురు ఆశావహులు బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకోవడం టిఆర్ ఎస్ కు తలనొప్పిగా మారే పరిస్థితి ఉంది.