మహిళలు చలికాలంలో ఇవి తింటే.. మెనోపాజ్ తర్వాత ఆరోగ్యం సేఫ్..!   మెనోపాజ్ మహిళలు ఎదుర్కోనే కీలక దశ.  ఈ దశలో మహిళలకు తమ నెలచక్రం ఆగిపోతుంది. దీని కారణంగా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత  ఏర్పడుతుంది. మెనోపాజ్ తర్వాత స్త్రీల శరీరం మునుపటిలా ఉండదు. అకస్మాత్తుగా స్థూలకాయం పెరిగి ముఖంపై ముడతలు రావడం మొదలవుతుంది. ఈ స్థితిలో మహిళలు భయము, అశాంతి,  విచారాన్ని అనుభవిస్తారు.  ఎముకలు బలహీనంగా మారతాయి. చలికాలం మొదలవ్వగానే  కీళ్ల నొప్పులు పెరుగుతాయి. స్త్రీ శరీరంలో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ హార్మోన్లు లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. అదే చలికాలంలో కొన్ని ఆహారాలు తీసుకుంటే మెనోపాజ్ తర్వాత మహిళల ఆరోగ్యం చాలా బెటర్ గా ఉంటుందట. వయసు పెరిగే కొద్దీ జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ వయస్సులో శరీరం భారీ వస్తువులను జీర్ణించుకోలేకపోతుంది. మెనోపాజ్ తర్వాత మహిళలు ప్రతిరోజూ పండ్లు,  కూరగాయలను తీసుకోవాలి. పండ్లు,  కూరగాయలు తినడం వల్ల మహిళలు హాట్ ఫ్లాషెస్,  మూడ్ స్వింగ్స్ నుండి ఉపశమనం పొందుతారు. ఊబకాయం పెరగదు. మంచి నిద్ర వస్తుంది. పండ్లు,  కూరగాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మెనోపాజ్  తర్వాత స్త్రీల ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. చలికాలంలో కీళ్ల నొప్పులు మొదలవుతాయి. ఎముకలు దృఢంగా ఉండటానికి,  చలికాలంలో కీళ్ల నొప్పులను నివారించడానికి, పాల ఉత్పత్తులను  ఆహారంలో ప్రతిరోజూ చేర్చుకోవాలి. పాల ఉత్పత్తులలో ఉండే కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ డి,  కె.. ఎముకలు బలహీనపడకుండా చేస్తాయి. మెనోపాజ్  తర్వాత మహిళలు సాధారణం కంటే ఎక్కువగా   పాలు, పెరుగు,  జున్ను తీసుకోవాలి. చలికాలంలో జొన్నలు, బార్లీ, రాగులు వంటి తృణధాన్యాలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. తృణధాన్యాలు తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు దరిచేరవు. బరువు కూడా పెరగదు. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తృణధాన్యాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్,  షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దీనివల్ల గుండె సమస్యలు, మధుమేహం రాకుండా ఉంటాయి. మెనోపాజ్ సమయంలో స్త్రీల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. తృణధాన్యాలు తీసుకోవడం  ద్వారా మహిళలు హార్మోన్ల అసమతుల్యత నుండి ఉపశమనం పొందుతారు. ఇది మెనోపాజ్  సమయంలో ఏర్పడే మూడ్ స్వింగ్స్,  హాట్ ఫ్లాషెస్ నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. 40 ఏళ్ల తర్వాత, మెనోపాజ్ సమస్యలను నివారించడానికి మహిళలకు 3 విటమిన్లు అవసరం . శరీరంలో విటమిన్ల లోపం లేకుంటే వృద్ధాప్యం త్వరగా జరగదు, ఎముకలు దృఢంగా ఉంటాయి. మెనోపాజ్  తర్వాత, స్త్రీల ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే మహిళలు తమ ఆహారంలో ప్రొటీన్‌ను పెంచుకోవాలి. చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పుల సమస్య రాకుండా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం ఎముకల బలాన్ని పెంచుతుంది. పాలు, పెరుగు, జున్ను, బీన్స్, పప్పులు, సోయాబీన్, డ్రై ఫ్రూట్స్, గుడ్డు,  చికెన్ వంటి ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన కొవ్వులలో విటమిన్ ఎ, డి,  ఇ పుష్కలంగా ఉంటాయి. మెనోపాజ్ తర్వాత, మహిళలు తమ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవడం ద్వారా బోలు ఎముకల వ్యాధి,  రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. నువ్వులు, వాల్‌నట్‌లు, వేరుశెనగ, అవిసె గింజలు, చియా గింజలు, నెయ్యి, చేపలు, గుడ్లు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు మహిళలకు మేలు చేస్తాయి. మెనోపాజ్ సమయంలో మహిళల్లో ఊబకాయం వేగంగా పెరుగుతుంది. 40 సంవత్సరాల వయస్సు నుండి యోగా,  వ్యాయామం చేయడం ద్వారా మహిళలు మెనోపాజ్ వల్ల వచ్చే స్థూలకాయాన్ని నివారించవచ్చు. శారీరక దృఢత్వం వల్ల స్త్రీల ఎముకలు త్వరగా బలహీనపడవు. సుదీర్ఘ జీవితం కోసం ఆరోగ్యంగా ఉండటానికి శారీరక వ్యాయామం కోసం ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాలు కేటాయించుకోవాలి.                                          *రూపశ్రీ.

రోజూ ఈ డ్రింక్ తాగితే చాలు.. ముఖం మీద ముడతలు మంత్రించినట్టు మాయమవుతాయట..!   ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి, ఇతర చర్మ సమస్యలను దూరం చేసుకోవడానికి ఎన్నో రకాల క్రీములు, మందులు వాడుతూ ఉంటాం. కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.  అలాంటి వాటిని దూరంగా ఉంచి సహజ పదార్ధాలను ఉపయోగించడం ద్వారా  చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం  ముఖానికి అప్లై చేసే ఇంటి టిప్స్ తో పాటు ఇంట్లో తయారు చేసుకుని తాగే పానీయాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి.  కేవలం రెండు రకాల విత్తనాలు ఉపయోగించి చేసుకునే ఈ డ్రింక్ తాగితే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుందట. కొల్లాజెన్ చర్మానికి ఎలాస్టిక్ గుణాన్ని ఇస్తుంది.  చర్మం వదులుగా మారకుండా బిగుతుగా ఉండేలా చేస్తుంది. గ్లోయింగ్ స్కిన్ డ్రింక్..  ముఖానికి సంబంధించిన సమస్యలకు ప్రధాన మూలం  పొట్ట,  శరీరం. చర్మానికి ఏవేవో అప్లై చేయడం వల్ల ఈ సమస్య అస్సలు తగ్గదు. దీనికి లోపలి నుండి వైద్యం అవసరం అవుతుంది. చర్మం  అవసరాలు, దాని  సమస్యలను అర్థం చేసుకోవడం..  శరీరానికి ఏమి అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  చర్మం వదులుగా కనిపించడం ప్రారంభించినప్పుడు.. దాని రంగు క్రమంగా తగ్గడం  ప్రారంభించినప్పుడు కింద చెప్పబోతున్న డ్రింక్ తాగాలి.  ఇది కొల్లాజెన్ లోపాన్ని భర్తీ చేయడంలో.. చర్మాన్ని బిగుతుగా చేయడంలో  ప్రయోజనకరంగా ఉంటుంది. కావలసిన పదార్థాలు.. అవిసెగింజలు.. 1 టీ స్పూన్ సబ్జా గింజలు.. 1 టీస్పూన్ నీరు.. 1 గిన్నె నారింజ రసం.. 200మి.లీ(ఆరెంజ్ రసం కు బదులు సిట్రస్ జ్యూస్ ఏదైనా వాడచ్చు) నిమ్మరసం.. 1 టీస్పూన్ తయారీ విధానం.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 1 స్పూన్ సబ్జా గింజలు వేసి 10 నిమిషాలు నానబెట్టాలి.  పాన్‌ను కొద్దిగా వేడి చేసి అందులో అవిసె గింజలను వేయించి మెత్తగా  పౌడర్‌లా చేసుకోవాలి.  ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ లేదా సిట్రస్ జ్యూస్  తీసుకుని అందులో అవిసె గింజల పొడి, నానబెట్టిన సబ్జా గింజలు వేసి బాగా కలపాలి. ఈ పానీయం రోజూ తాగాలి. క్రమంగా  ముఖంలో సహజమైన మెరుపు ఎలా కనిపించడం ప్రారంభిస్తుందో చూసి ఆశ్చర్యపోతారు. . ఎలా పనిచేస్తుందంటే.. ఈ డ్రింక్  మొదటి పదార్ధం అవిసె గింజలు..  వీటిలో ఒమేగా-3,  లిగ్నాన్స్‌ పుష్కలంగా ఉంటాయి.  ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి,  చర్మపు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న ఈ పానీయం చేయడానికి సబ్జా విత్తనాలను కూడా ఉపయోగించారు. ఇవి  చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి, చర్మాన్ని  హైడ్రేట్ గా ఉంచుతాయి. మూడవ పదార్ధం నారింజ లేదా నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది  సహజ కొల్లాజెన్ సంశ్లేషణను మెరుగుపరచడంలో,  చర్మాన్ని కాంతివంతం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది .                                       *రూపశ్రీ.

  పెదవులు పగులుతున్నాయా..ఈ విటమిన్ లోపమే కారణం!     పెదవులు పగలడం చాలా మంది ఎదుర్కునే సాధారణ సమస్య.  చలికాలంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.  పెదవులు పగిలినప్పుడు తినడంలోనూ, తాగడం లోనూ, కొన్ని సార్లు మాట్లాడటంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి.  అయితే ఇలా పెదవులు, పెదవుల మూలాలు పగలడం అనేది  వాతావరణ మార్పుల వల్ల జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలా జరగడం  విటమిన్  లోపం వల్లనే అని అంటున్నారు ఆహార నిపుణులు, చర్మ సంరక్షణ నిపుణులు.  ఇలా విటమిన్ లోపం వల్ల పెదవులు పగిలితే ఎన్ని క్రీములు రాసినా,  ఎన్ని చిట్కాలు ఫాలో అయినా అది తగిన ఫలితాలు ఇవ్వదట. విటమిన్ లోపం.. కొన్ని సార్లు పెదవులు పగలడం,  పెదవులు చివర్లు చీలడం జరుగుతుంది.  దీని వల్ల కొన్ని సందర్భాలలో   రక్తం కారడం కూడా జరుగుతుంది. ఇది విటమిన్-బి, విటమిన్-సి లోపం వల్ల జరుగుతుందని అంటున్నారు. విటమిన్-బి, విటమిన్-సి లోపిస్తే శరీరం చాలా తొందరగా పొడిబారుతుంది.  దీని వల్ల చర్మం మీద దురద,  పొలుసులు ఏర్పడటం, మొటిమలు రావడం జరుగుతాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఈ విటమిన్ -బి లోపం వల్లనే జుట్టు రాలే సమస్య, జుట్టు బలహీనంగా మారడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.  ఇవన్నీ జుట్టును బాగా దెబ్బతీస్తాయి. విటమిన్-బి లోపాన్ని భర్తీ చేయాలంటే గుడ్లు, చేపలు, గింజలు, తృణధాన్యాలు, పాలకూర, బచ్చలి కూర,  మాంసం.. ముఖ్యంగా చికెన్.. మొదలైనవి తినాలి. ఇవి తింటే విటమిన్-బి భర్తీ అవుతుంది. ఇక విటమిన్-సి లభించాలి అంటే నిమ్మరసం,  నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్  పండ్లు తీసుకోవాలి.  ఇవన్నీ విటమిన్-సి ని భర్తీ చేస్తాయి.  ఇవి పుష్కలంగా తీసుకుంటే పెదవుల పగుళ్లు, పెదవుల మూలలు చీలడం వంటివి ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా మెల్లగా తగ్గిపోతాయి.                                          *రూపశ్రీ

ఎముకల ధృడత్వం కోసం ఏం చెయ్యాలో తెలుసా...? ఎముకలు దృఢం ఉండాలన్నా, వృద్దాప్యంలో ఆస్టియోపోరోసిస్ కి దూరంగా ఉండాలన్నా శరీరానికి తగినంత కాల్షియం చాలా అవసరం. అయితే కేవలం ఎక్కువ కాల్షియం తీసుకోవడమే కాదు, దానికి తగినట్లుగా వ్యాయామం కుడా చెయ్యాలని అంటున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ సిన్ సినాటి మెడికల్ సెంటర్ కి చెందిన పరిశోధకులు తాజాగా చేపట్టిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. కాల్షియం తీసుకోవడంతో పాటు సరైన వ్యాయామం చేస్తేనే ఎముకలు దృడంగా రూపొందుతాయని, పాతికేళ్ళు దాటినా వారు రోజుకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా రోజులో కనీసం 20 నిముషాలు నడవడం, మెట్లెక్కడం, స్టెప్ ఏరోబిక్స్ లాంటివి చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని వీరి పరిశోధన చెప్తోంది. మరి కాల్షియం మన శరీరానికి ఎంత ముఖ్యమో... వ్యాయామం కూడా అంతే ముఖ్యం.

కూర్చున్న చోటే ఎక్సర్ సైజ్ రోజూ వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా.. ఈ ఉరుకుల పరుగుల రొటీన్ జీవితంలో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోం. అయితే కదలకుండా ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాల్లో స్టిఫ్ షోల్డర్ వంటివి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈమధ్య. ఆ ఇబ్బందులని అధిగమించాలంటే... ఎప్పుడు, ఎక్కడ, ఏ కాస్త సమయం దొరికినా కూడా కూర్చున్న చోటనే చిన్న చిన్న కదలికల్ని చేయటం మంచిది అంటున్నారు నిపుణులు. ఎలా అంటే ... 1. ప్రతి అరగంటకి ఒకసారి కూర్చున్న భంగిమను మార్చాలి. అలాగే కళ్ళు ఆర్పి, తెరవటం చేయాలి. 2. ప్రతి గంటకి ఒకసారి కుర్చీలోంచి లేచి అటు, ఇటు నడవాలి. వీలు కాకపొతే ఓ ఐదు నిముషాలు నిల్చోవాలి. 3. అలాగే కుర్చీలో కూర్చుని మెడని పైకప్పు కేసి సాగదీయాలి. అంటే పైకప్పు వైపు చూస్తుండాలి అన్నమాట. 4. ఇక అప్పుడప్పుడు మెడని ఒక పక్కనుంచి మరో పక్కకి అడ్డంగా తిప్పాలి. 5. భుజాలని అప్పుడప్పుడు గుండ్రంగా తిప్పాలి. అలాగే మణికట్టు దగ్గర చేతుల్ని తిప్పాలి. ఇలా ఆఫీసులో, ఇంట్లో, బయట ఎక్కడ వున్నా మోచేతులు, మోకాళ్ళు, భుజాలు, మణికట్టు, మెడ ఇలా జాయింట్స్ ని కదుపుతూ చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేస్తే ... పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలనుంచి బయటపడచ్చు అంటూ సూచిస్తున్నారు నిపుణులు. - రమ

సన్నబడాలనుకుంటున్నారా   " అర్జంటుగా సన్నబడాలి" అనుకుంటే, ఎం చెయ్యాలో  తెలీక  అవస్థాపడుతుంటాం. అయితే తీసుకునే ఆహారాన్ని తగ్గించటంలో పాటు క్రమం తప్పని వ్యాయామం మాత్రమే అధిక బరువును ఆడుతూ,పాడుతూ తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు. అయితే వ్యాయామం ద్వారా ఎన్ని కెలోరీలు ఖర్చు చేయొచ్చో తెలిస్తే చక్కగా ప్లాన్ చేయొచ్చు కదా! ఇదిగో ఆ వివరాలు చదవండి- పాటించండి- సన్నబడండి.   నడక: బరువు తగ్గాలనుకునే వారికీ అందరూ చెప్పే సలహా నడవమని నడక వాళ్ళ అంత లాభం ఉంటుందా అని అనుమానం వస్తుంటుంది కదా మనకి కాని నిజంగా చాలా లాభం వుంటుందట. ఎందుకంటే ఒక గంట నడిస్తే చాలు 300 కెలోరీలు ఖర్చవుతాయి. ఇంకాస్త ఓపిక ఉంటె కాస్త ఎత్తైన ప్రదేశాలవైపు నడిస్తే చాలు 400 దాకా కెలోరీలు కరిగిపోవడం ఖాయం.     ఇక నడుము కింద భాగం నాజుకుగా, ఉండాలంటే రోజు హాయిగా సైకిల్ తొక్కండి చాలు 350 కెలోరీలు  వద్దన్నా కరిగిపోతాయి.400 వందలకు పైగా కెలోరీలు ఖర్చు కావాలంటే పరుగుకు మించిన వ్యాయామం లేదు.   అలాగే మంచి మ్యూజిక్ పెట్టుకుని  నచ్చిన డ్యాన్స్ చేస్తే చాలు కెలోరీలు ఇట్టే కరిగిపోతాయంటే ఎవరు మాత్రం డ్యాన్స్ చేయకుండా ఉంటారు చెప్పండి. అలా డ్యాన్స్ చేస్తే చేస్తే గంటకు మూడొందల కెలోరీలకు పైగా ఖర్చవుతాయి. నచ్చిన మ్యూజిక్ పెట్టి సాల్సా, రాక్ఎన్రోల్ , బెల్లి డ్యాన్సింగ్ ఇలా వచ్చినది చేసేయండి.చాలు ఇక , స్కిప్పింగ్, స్పీడ్ జాగింగ్ , ఈత, ఆటలు, ఇవన్ని కూడా మానసిక ఆనందాన్నిచ్చెవె. వీటిలో గంటపాటు ఏ ఒక్కటి చేసినా 400  పైగా కెలోరీలు ఖర్చవటం ఖాయం. కాబట్టి కష్టంగా కాక ఇష్టంగా శరీరాన్ని కదిలించి బరువు తగ్గించండి అంటున్నారు నిపుణులు ఆలోచించండి ఆచరణలో పెట్టండి.   - రమ.

ఈ నాలుగు తింటే యవ్వనంగా ఉండటమే కాదు తెల్లజుట్టు నల్లగా మారిపోద్ది!   తెల్లజుట్టుతో కనిపించాలని ఎవరూ కోరుకోరు. కానీ వద్దంటే రాకుండా అది ఆగనే ఆగదు. కొందరిలో చిన్నవయసులోనూ, మరికొందరిలో ఒక వయసు దాటిన తరువాత తెల్లజుట్టు వచ్చే తీరుతుంది. పెద్ద వయసులో తెల్లజుట్టు వస్తే కాసింత కాంప్రమైజ్ అయ్యి దానికి హెన్నానో, హెయిర్ డై వంటివి పెట్టి కవర్ చేస్తారు. కానీ చిన్నవయసులోనే తెల్లజుట్టు వస్తేమాతం వయసు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తారు. రసాయనాలతో కూడిన హెయిర్ డైలు పెడితే మెదడు ఆరోగ్యానికే ప్రమాదం. అందుకే వివిధ రకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ ప్రయత్నిస్తుంటారు. కానీ తెల్లజుట్టుకు నివారణకు చెయ్యాల్సింది నూనెలు పూయడం కాదు. లోపలినుండి జుట్టు నల్లబడేలా చెయ్యాలి. ఆ పనిని ఈ కింద చెప్పుకోబోయే నాలుగు ఆహారాలు సమర్థవంతంగా చేస్తాయి. అవేంటో తెలుసుకుని పాటించడమే తరువాయి.. ఉసిరికాయలు.. ఉసిరికాయలు  నవంబర్, డిసెంబర్ నెలల్లో అందుబాటులోకి వస్తాయి. ఫిబ్రవరి, మార్చి నెలల వరకు దొరుకుతాయి. పచ్చి ఉసిరికాయలను మిక్సీ వేసి జ్యూస్ చేసుకుని దాన్ని కాసిన్ని నీళ్లలో కలుపుకుని తాగాలి.  లేదంటే పచ్చి కాయలు అయినా తినచ్చు. ఉసిరికాయను ఎండబెట్టి పొడిచేసుకుని ఏడాది పొడవునా ఉపయోగించుకోవచ్చు. రోజూ ఉసిరికాయను తీసుకుంటూ ఉంటే తొందరలోనే తెల్లజుట్టు తగ్గిపోతుంది. నల్ల ద్రాక్ష.. ద్రాక్షలో రెండు రకాలున్నాయి. వీటిలో నల్ల ద్రాక్ష తెల్లజుట్టుకు భలే మ్యాజిక్ చేస్తుంది. తాజా నల్ల ద్రాక్ష లేదా.. ఎండిన నల్లద్రాక్షను ప్రతిరోజూ తింటూ ఉంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఎండిన నల్ల ద్రాక్షను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినవచ్చు కూడా. నల్లనువ్వులు.. నల్లనువ్వులు ఆడవాళ్లకు చాలా మంచిది. అమ్మాయిలు రజస్వల అయినప్పుడు. మహిళలు డెలివరీ అయిన తరువాత, ఆపరేషన్లు అయినవాళ్లు నల్లనువ్వులు తింటే నడుము బలపడుతుందని, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతారు. ఇందులో కాల్షియం, ఐరన్ సమృద్దిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య కూడా అస్సలుండదు. కరివేపాకు.. కరివేపాకును నూనె తయారీలో ఎక్కువగా వాడతారు. కానీ కరివేపాకును ప్రతిరోజూ తింటూ ఉంటే జుట్టు భలే నల్లగా మారుతుంది. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, విటమిన్-బి12 మొదలైనవి మెండుగా ఉంటాయి. కరివేపాకుతో వివిధ రకాల వంటలు చేసుకుని తింటే రుచికి రుచి, తెల్లజుట్టు మటాష్.                                            *నిశ్శబ్ద.

ప్రాణాయామం చేసేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు   మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని, కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి. గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు. మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు. ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి. నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు. నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి. ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది. ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

మహిళలు ఫిట్ గా ఉండాలంటే కీ పాయింట్స్ ఇవే! ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు. అయితే దురదృష్టవశాత్తు ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడే మహిళలు అధికం. ఆడవారి జీవితంలో పెళ్లి తరువాత పిల్లలు, వారి బాగోగులు, భర్త, అత్తమామలకు సపర్యలు చేయడం. వీటితో కాలం గడిచిపోతూ ఉంటుంది. తలనొప్పో.. నడుమునొప్పో వస్తే ఓ నొప్పి మాత్ర వేసుకుని సమస్యను బుజ్జగించడం మహిళలకు వెన్నతో పెట్టిన విద్య. తరచుగా పిల్లల ఆరోగ్యం వారి జీవితాలకు సంబంధించిన ప్రతిదానిని తల్లులు జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ స్వంత ఆరోగ్యం విషయానికి వస్తే, చాలా  నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా సార్లు, పిల్లలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు, తల్లి ఎంతో గాభరా పడుతుంది. , ఆమె ఇంటి చిట్కాల  నుండి డాక్టర్ ఇచ్చే చికిత్స వరకు అన్నీ పాటిస్తుంది.  భర్త అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. కానీ తన విషయంలో మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యమే. ఆడవారి ఆరోగ్యం తొందరగా పాడవ్వడానికి అసలు కారణాలు ఈ నిర్లక్ష్యమేనంటున్నారు వైద్యులు. మహిళలు ఫిట్ గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.  ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేవరకు కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగినట్టు ఉంటుంది ఆడవారి పరిస్థితి. భర్తకు, పిల్లలకు వేడివేడిగా కాఫీని, పాలను అందించడం మొదలు రాత్రి వారు నిద్రపోయేవరకు పరుగులే. ఉద్యోగం చేసే మహిళలకు ఈ సమస్య మరింత అధికం. మహిళలు ఫిట్ గా ఉండాలంటే వీటిని పాటించాలి. ముందు మీరే ముఖ్యం.. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైన కీ ఏదైనా ఉందంటే అదే ప్రాధాన్యత. పిల్లలకు, భర్తకు, అత్తమామలకు చివరికి  అతిథులకు కూడా ప్రాధాన్యత ఇస్తారేమో కానీ తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకోవడం తక్కువ. ఖరీదైన చీరల్లోనో.. నగల్లోనో ఆరోగ్యం దాగుంటుందా?? వెన్నపూసి వదిలే మాటల్లోనూ.. ఖరీదైన వస్తువుల్లోనూ ఆరోగ్యం ఉంటుందంటే ఒప్పుకుంటారా?? ఇవన్నీ కాదు ఆడవారు తమకు తాము ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. ఏ విషయంలో ప్రాధాన్యతలు ఇవ్వాలంటే..  ఆహారం.. వేడివేడిగా అందరికీ వడ్డించి చివరగా తాను తినే మహిళ.. ఆ ఆహారం తనకెంతమాత్రం పోషకాలను అందిస్తోందో ఆలోచించాలి. భర్త పార్టీలో తిన్నానని, పిల్లలు బయట తిన్నారని ఇంట్లో తినడం మనేసినప్పుడు.. రాత్రి, మరుసటిరోజు ఉదయం కూడా మిగిలిన దాంతో కడుపు నింపుకుంటారు కానీ పోషకాలను మాత్రం అందించలేరు. అందుకే తాజాగా, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.  వ్యాయామం.. ఉదయం నుండి రాత్రి వరకు ఇంటి పని చేస్తున్నాం సరిపోదా అని అందరూ అనుకుంటే పొరపాటు. ఆడవారికి వ్యాయామం ఉండాలి. ముఖ్యంగా మహిళలకు గర్భసంచి బాగుంటే ఎన్నో రకాల సమస్యలు దరిచేరవు. హార్మోన్ల సమతుల్యత ఉంటే అన్ని విధాలా బాగుంటారు. వ్యాయామం ఆడవారి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. బ్రేక్ లు భలే చిట్కాలు.. ఇంటి పని కావొచ్చు, ఆఫీసు పని కావొచ్చు.. రెండింటినీ డీల్ చేయడం పెద్ద టాస్క్ అనిపిస్తుంది. కానీ ప్రతి పనిలో గంటకోసారి 5 నిమిషాల రిలాక్సేషన్ మనిషిని అలసిపోనీయదు. అలాగని 5 నిమిషాల కోసం బ్రేక్ తీసుకుని అరగంట కూర్చుంటే మాత్రం పనులు నడవవు.  ఆత్మవిశ్వాసం.. వంట దగ్గర నుండి ఇంట్లో పనుల వరకు మీరు సమర్థవంతంగా చేయగలరనే ఆత్మవిశ్వాసంతో మొదలిపెట్టాలి. ఇలా మొదలుపెడితే అరగంట పని కాస్తా 15 నుండి 20 నిమిషాల్లో తెగ్గొట్టేయచ్చు.  మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి.                                 ◆నిశ్శబ్ద.

పొట్ట తగ్గాలంటే...బ్రేక్ ఫాస్ట్‎లో ఇవి చేర్చుకోవాల్సిందే!     కొందరికి పొట్ట తగ్గడం పెద్ద సమస్యగా మారుతుంది. బెల్లీ ఫ్యాట్ అనేక కారణాల వల్ల కలుగుతుంది. ఈ సమస్యను ఒక్కసారిగా అదుపు చేయడం కష్టం. ఆహారాలలో కొన్ని మీరు బరువు తగ్గడానికి, బొడ్డు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.   మనం తీసుకునే అల్పాహారం కొవ్వును అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. బ్రేక్ ఫాస్టులో ఎలాంటి ఆహారం తీసుకుంటే పొట్ట తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహారంలో ప్రోటీన్ ప్రాముఖ్యత: కేలరీలు, చక్కెర, శుద్ధి చేసిన పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు మీ ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. తక్కువ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. అదనంగా, మీరు మీ భోజనం తినే విధానం కూడా చాలా ముఖ్యమైనది. మీ ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూడాలని పోషకనిపుణులు చెబుతున్నారు. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని అణచివేస్తుంది: ప్రోటీన్ ఆకలిని అణిచివేస్తుంది. తరచుగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనం జీవక్రియను పెంచుతుంది. మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది పొట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.  దీనికి విరుద్ధంగా, అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న భోజనం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది.  కొవ్వు నిల్వకు దారితీస్తుంది. కాబట్టి, మన అల్పాహారాన్ని "ప్రోటీన్"గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రోటీన్ కంటెంట్‌ను పెంచే సాధారణ బ్రేక్‌ఫాస్ట్‌లు: పోహా: పోహాలో 7 నుండి 8 వేరుశెనగ లేదా బఠానీలను జోడించండి. ఉప్పిట్టు: ఈ ఆరోగ్యకరమైన వంటకంలో బీన్స్ , 7 నుండి 8 వేరుశెనగలను వేయండి. పరాఠాలు: పరాఠాలు చేయడానికి గోధుమ పిండి, చిక్‌పా పిండిని ఉపయోగించండి. సగ్గుబియ్యానికి చిక్‌పీస్, పనీర్ లేదా బఠానీలను జోడించండి. దోస/ఇడ్లీ: త్వరిత, రుచికరమైన ప్రోటీన్ బూస్ట్ కోసం మీ దోస లేదా ఇడ్లీని వేరుశెనగ చట్నీతో జత చేయండి. వేరుశెనగ, బఠానీలు, పనీర్, చిక్‌పీస్‌తో సహా ఈ పదార్ధాలలో ప్రతి ఒక్కటి శాఖాహార ప్రోటీన్ యొక్క మంచి మూలాలు. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వేరుశెనగలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండు: అరటిపండ్లలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. అరటిపండ్లు చక్కెరతో కూడిన అల్పాహార తృణధాన్యాలకు గొప్ప ప్రత్యామ్నాయం.  ఇవి ఉదయం మీ తీపి కోరికలను తీర్చగలవు. పండ్లు,  కూరగాయల నుండి ఫైబర్ తీసుకోవడం బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అధికబరువు, బెల్లిఫ్యాట్ తో బాధపడుతున్నవారు ఉదయం అల్పాహారంలో పైన పేర్కొన్న ఆహారాలను చేర్చినట్లయితే..కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు.  

మహిళల ఫిట్నెస్ మొత్తం పాడుచేసే ఒకే ఒక్క సమస్య ఇదే! ఆహారం అమృతం అనే మాట అందరికీ తెలిసిందే. మనం తినే ఆహారమే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే అతి అన్నది అన్ని విషయాలలో అనర్థాన్నే మిగులుస్తుంది. చాలామంది మహిళలు అతిగా తినే సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాగని తాము అతిగా తింటున్నాం అనే విషయం వారికి మింగుడు పడదు. ఎంత తిన్నా కడుపు నిండినట్టు అనిపించకపోవడం, తిన్న కొంతసేపటికే మళ్లీ ఆకలికావడం. వంటి పరిస్థితులు పదే పదే ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల అతిగా తినడం జరుగుతుంది. అతిగా తిని లావైపోయిన వారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. తిండి తగ్గించాలని అనుకుంటారు కానీ అది సాధ్యం కాదు. బరువు తగ్గడానికి వాకింగ్ చేయడం, వ్యాయామాలు చేయడం మొదలుపెడతారు. కానీ అది కూడా సత్పలితాలను ఇవ్వదు. ఇలా  భీభత్సంగా ఆకలి కావడానికి, అతిగా తినడానికి  కారణం డిప్రెషన్ ఈటింగ్ అనే సమస్య. డిప్రెషన్ ఈటింగ్ మూలాన మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయం మహిళలను కలవరపెడుతుంది. కానీ ఈ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకుని అధిగమించడం వల్ల దీని కారణంగా ఎదురయ్యే ఇతర సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మహిళల్లో తినడం అనేది భావోద్వేగ విషయాలతో సంబంధం కలిగి ఉంటుందని చాలామంది చెబుతారు. అందుకే చాలామంది మహిళలు  కోపం, ఆవేశం, బాధ మొదలయిన పరిస్థితులలో ఉన్నప్పుడు సాధారణంగా తినేదానికన్నా ఎక్కువగా తింటుంటారు. ఇది నాణేనికి ఒక కోణం అయితే మరొక కోణంలో మహిళలు డిప్రెషన్ ఈటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎంత తిన్నా సాటిసిఫాక్షన్ లేకపోవడం ఒకటైతే, భావోద్వేగాల కారణంగా తినడంలో తృప్తి లభించకపోవడం మరొకటి. ఇవి రెండూ ఒకదానికొకటి సంబంధమై ఉంటాయి. వీటిని సాటిసిపై చేసే ఉద్దేశంలో తినడమనే ప్రాసెస్ సాగుతూ ఉంటుంది. నిజానికి ఇలా జరగడానికి కారణం కార్టిసాల్ హార్మోన్.   శరీరంలో ధీర్ఘకాలిక ఒత్తిడి కొనసాగినప్పుడు ఈ కార్టిసాల్ విడుదల వేగం అవుతుంది. ఇది ముఖ్యంగా ఆకలిని పెంచుతుంది. ఎంత తిన్నా సాటిసిపై కాకపోవడానిక ఇదే కారణం. అధికశాతం మంది మహిళలు ఉబకాయం, అధికబరువు సమస్యకు  గురికావడానికి ఇదే ప్రధాన కారణం. చాలామంది ఆకలైన ప్రతిసారి తినడమనే పని చేసి తృప్తి పడుతూ ఉంటారు. మరికొందరు తమ ఆకలిని గమనించుకుని దాన్ని కంట్రోల్ చేయలేక ఆహారానికి లొంగిపోతుంటారు. కానీ ఎవరూ దీనికి మూలాన్ని గురించి ఆలోచించరు. మూలాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించరు.  అందుకే ఈ సమస్య కష్టమైనదిగానూ, అధిగమించలేనిది గానూ అనిపిస్తుంది. డిప్రెషన్ ఈటింగ్ అధిగమించాలంటే.. డిప్రెషన్ ఈటింగ్ కు ప్రధాన కారణం ఒత్తిడి. మానసిక ఒత్తిడి ద్వారా మొదలయ్యే ఈ సమస్య శారీరక సమస్యగా మారుతుంది. దీన్ని అధిగమించాలంటే మానసికంగానూ, శారీరంకగానూ నియంత్రణ సాధించడం చాలా  ముఖ్యం. తిండి మీద నియంత్రణ సాధించాలంటే ఆకలిపేరుతో ఎడా పెడా తినేయకుండా తినేముందు నిజంగానే ఆకలిగా ఉందా? లేక కేవలం మనసుకు అలా అనిపిస్తోందా? అనే విషయాన్ని ఆలోచించడం చాలా ముఖ్యం. దీని వల్ల మానసికంగా కాస్త నియంత్రణకు ఓ మార్గం దొరికినట్టవుతుంది.  ప్రతి రోజూ ఏ సమయంలో ఏ ఆహారం ఎంత మొత్తంలో తింటున్నారో ఒక చిన్న నోట్ లో రాసుకోవడం మంచిది. దీనివల్ల ఆహారం మీద అవగాహన కలుగుతుంది.  తినే ఆహారంలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్ మొదలయినవి లేకుండా జాగ్రత్త పడాలి. వాటిని అందుబాటులో ఉంచుకోకూడదు. ఆకలి వేసినప్పుడల్లా పచ్చిగా తినగలిగే కూరగాయలు, పండ్లు, ఫైబర్ అధికంగా ఉన్న  ఆహారాలు, కేలరీలు ఎక్కువలేకుండా ఉండే ఫుడ్స్ తినడం మంచిది. ఇవి చేస్తూ కార్టిసాల్ హార్మోన్ ను నియంత్రించడానికి ప్రయత్నించాలి. హార్మోన్లను నియంత్రించడం అనేది ఎప్పుడూ  మనిషి చేతుల్లో చాలావరకూ ఉంటుంది. ప్రతిరోజు ధ్యానం, వ్యాయామం, యోగా, ఉదయం , సాయంత్రం  చిన్నపాటి నడక  మొదలయినవి ఫాలో అయితే  క్రమంగా శరీరంలోని హార్మోన్లను నియంత్రణలోకి తీసుకురావచ్చు.  సాధారణ వైద్యుల నుండి ఆయుర్వేదం వరకు.. పోషకాహార నిపుణుల నుండి ఫిట్నెల్ ట్రైనర్ల వరకు  చాలామంది ఆహారనికి, మహిళలలో ఒత్తిడికి చాలా దగ్గర సంబంధముందని చెబుతున్నారు. మహిళలలో వివిధ దశలలో మారే హార్మోన్లు, ఆ సమయాల్లో మహిళల శరీరంలో కలిగే మార్పులు ఇందుకు ఉదాహరణ.                                                          *నిశ్శబ్ద.

మంచం దిగకుండానే కొవ్వు దులిపేద్దాం! ఒంట్లో సులువుగా చేరిపోయే రాక్షసి కొవ్వు. ఏమి తింటున్నాం అనేది కాస్త ఆలోచించుకోవడం మానేసి తినడంలో రెచ్చిపోతే శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయి శరీర షేప్ మార్చేసి మనల్ని ఒకానొక అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. అయితే ఆ కొవ్వు తగ్గించుకోవాలి అంటే వ్యాయాయం లేదా ఆసనాలు చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు వణికిస్తున్న చలికి ఉదయం లేవబుద్ది  కాదు, సాయంత్రం అడుగు బయటపెట్టబుద్ది కాదు. అలా వెచ్చగా దుప్పటి కప్పుకుని పడుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. చలికి మన తీరు ఇలాగుంటే ఇక వ్యాయామాలు, యోగాసనాలు ఏమి వేస్తాం?? మనలో చేరిపోయిన కొవ్వును ఎలా మాయం చేస్తాం?? అందుకే కాస్త విభిన్నంగా ఆలోచించాలి.  విభిన్నత ఎలా?? శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే వ్యాయామం అవసరమే కదా?? అలాంటి వ్యాయామాన్ని ఉదయం లేవగానే అలాగే మంచం దిగకుండా హాయిగా చేసేస్తే ఎలా ఉంటుంది. ఇదే విభిన్నంగా చెప్పుకుంటున్న విషయం. లేచిన వెంటనే వ్యాయామం కోసం ప్రత్యేకంగా అన్ని సిద్ధం చేసుకుని రంగంలోకి దిగడానికి ఓపికతో పాటు చలి తెచ్చిపెట్టే బద్దకం చాలా ఉంటుంది. అందుకే లేవగానే అలా మంచం మీదనే శరీరంతో విన్యాసాలు చేసేయండి. టిప్ 1:-  ఇప్పుడు చెప్పుకోబోయే ప్రయోగం కాస్త ధనురాసనంను పోలి ఉంటుంది. కాకపోతే కాళ్ళను చేతులతో బంధించాల్సిన అవసరం ఉండదు.  లేచిన వెంటనే అలాగే మంచం మీదనే బోర్లా పడుకోవాలి. ఇలా పడుకున్న తరువాత కడుపును ఆధారంగా చేసి కాళ్ళను, చేతులను ఒకేసారి మెల్లగా పైకి లేపాలి. ఇలా పైకి లేపిన తరువాత కొన్ని సెకెన్ల పాటు అలాగే ఉండాలి. తిరిగి మాములు స్థితిలోకి రావాలి. ఇలా సెట్ లో ఇరవై సార్లు చేయాలి. ఇలాంటివి అయిదు సెట్లు చేయాలి. దీన్ని చేయడం వల్ల వెన్నెముక భుజాలు బలపడతాయి. నడుము దృఢంగా మారుతుంది. పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.  టిప్:-2 ఈ రెండవ విధానంలో మంచం మీద చివరలో కూర్చోవాలి. కాళ్ళు నేలకు ఆనుతూ ఉంటాయి. బలాన్ని కాళ్ళ మీద, చేతుల మీద ప్రయోగించి చేతులను మంచం మీద గట్టిగా పట్టుకుని మెల్లగా మంచం మీద నుండి కిందకు దిగాలి. కాళ్ళను ఒంచకూడదు. మంచానికి చేతులు వెనుకగా అలాగే ఆనించి మెల్లిగా కూర్చోవడం లేవడం చేయాలి. దీనివల్ల కాళ్ళు దృఢంగా మారతాయి, చేతులలో బలం పుంజుకుంటుంది. తొడల కండరాలు గట్టి పడతాయి.  టిప్:- 3 పుషప్స్ తీసే బంగిమను ప్లాంక్ అని అంటారు. మంచం మీద బోర్లా పడుకుని కాలి మునివేళ్ళ మీద, మోచేతులు ఆధారంగా శరీరాన్ని పైకి లేపాలి. ఆ పొజిషన్ లో కనీసం 40 నుండి 45 సెకెన్ల పాటు ఉండాలి. ఆ తరువాత కొన్ని సెకెన్లు విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ తిరిగి ప్లాంక్ చేయాలి. ఇలా నాలుగు నుండి ఐదు సార్లతో మొదలుపెట్టి వాటి సంఖ్య పెంచుకుంటూ పోవాలి. దీనివల్ల శరీరం మొత్తం దృఢంగా మారుతుంది. ముఖ్యంగా భుజాలు, మెడ దృఢమవుతాయి. పక్కటెముకల సామర్థ్యం పెరుగుతుంది. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు ఐస్ లాగా కరుగుతుంది. కీళ్ల నొప్పులు క్రమంగా తగ్గిపోతాయి. బట్టి మెటబాలిజం మెరుగవుతుంది. పైన చెప్పుకున్నట్టు ముచ్చటగా మూడు ప్రయోగాలు చేశారంటే బద్దకాన్ని కూడా కాదని శరీరంలో కొవ్వు ఫటాఫట్ అంటూ పారిపోతుంది.                                      ◆ నిశ్శబ్ద.

బరువు తగ్గాలా...మీకు తెలియని రహస్యం ఇదే! మహిళలు సాధారణంగా ఎదుర్కునే పెద్ద సమస్య అధిక బరువు. పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక చాలామంది శరీరం నమ్మలేనంతగ షేపవుట్ అవుతుంది. అయితే అందరూ చేసే ఒక పొరపాటు బరువు పెరగడానికి, బరువు తగ్గకుండా ఉండటానికి కారణం అవుతుంది. అదేంటో తెలుసుకుంటే.. మన శరీరం  పనితీరు శరీరంలో అన్ని అవయవాల ఆరోగ్యానికి సంబంధించినది. అంటే శరీరంలోని ఏదైనా భాగంలో ఏదైనా సమస్య ఉంటే, అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియకు బరువు పెరగటానికి ఉన్న  లింకు కూడా ఇదే. సాధారణంగా, బరువు పెరిగిన వారు దానిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.  ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బరువు తగ్గడంతో లేదంటే శరీరంలో మెటబాలిజం తక్కువ ఉందని అర్థం.  జీవక్రియ  ఆహారాన్ని శక్తిగా మార్చే ఒక రసాయన ప్రక్రియ. ఇది శరీరంలో కేలరీలను బర్నింగ్  చేసే రేటును కూడా ప్రభావితం చేస్తుంది. తక్కువ జీవక్రియ ఉంటే శరీరంలో కేలరీల బర్న్ కూడా తగ్గిపోతుంది, ఇది బరువుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జీవక్రియను ఎలా పెంచవచ్చో.. ఇది బరువు తగ్గించడంలో  ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే.. బరువుపై జీవక్రియ ప్రభావం.. జీవక్రియ రేటు సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు, కేలరీలు బర్న్ అయ్యే ప్రక్రియ కూడా మందగిస్తుంది, అంటే శరీరంలో కొవ్వు పరిమాణం పెరిగిపోతుంది.  అదే జీవక్రియ వేగంగా ఉంటే ఎక్కువ కేలరీలు  బర్న్ చేయగలుగుతారు.  ఎక్కువగా తింటున్నప్పటికీ, అది శక్తి రూపంలో సరిగ్గా ఉపయోగించబడుతుంది.  శరీరంలో కొవ్వు పరిమాణం పెరగదు. అందుకే ప్రతి ఒక్కరూ జీవక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీవక్రియ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎలాంటి ఏమి చెయ్యాలో తెలుసుకుంటే.. ఎక్కువ నీరు త్రాగాలి.. రోజంతా ఎక్కువ నీరు త్రాగే వ్యక్తులు బరువును తగ్గడంలో, బరువును నియంత్రించడంలో చక్కని  ప్రయోజనాలు పొందుతారు. నీరు  జీవక్రియను తాత్కాలికంగా వేగవంతం చేస్తుంది. 500 మి.లీ.ల నీటిని తాగడం వల్ల సాధారణం కంటే జీవక్రియ రేటు 30% వరకు పెరుగుతుంది.  బరువును తగ్గించుకోవాలనుకుంటే, ఎక్కువ నీరు త్రాగటం ప్రయోజనకరంగా ఉంటుంది.  వర్కవుట్‌ లు.. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) వర్కవుట్లు  జీవక్రియను పెంచడంలో,  బరువు తగ్గించడంలో  ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది జీవక్రియ రేటును పెంచడం ద్వారా  కొవ్వును బర్న్ చేయడంలో  సహాయపడుతుంది. ఇతర రకాల వ్యాయామాల కంటే జీవక్రియను పెంచడంలో,  బరువు తగ్గించడంలో ఈ వ్యాయామాలు ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటాయి.  చక్కని చిట్కా.. బరువు పెరగడానికి ప్రధాన కారణం ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం. మహిళలు, ఆఫీసుల్లో పనిచేసేవారు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. ఇది బరువు పెరగడంలో ప్రభావం చూపిస్తుంది. అందుకని వీలైనంత వరకు కూర్చోవడాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించండి. నడవడం, నిలబడటం వంటి పనుల్ ద్వారా శరీరంలో కొవ్వు పేరుకునే వ్యవస్థను బ్రేక్ చేయొచ్చు.  *నిశ్శబ్ద.

మహిళలకు ఫిట్నెస్ కావాలంటే ఈ పని చేయొద్దు.. ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కాలంలో. ఏమి తినాలి?? ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటాం అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ పాటించడమే చేతకాదు. నిజాన్ని నిజంగా చెప్పుకుంటే ఇదే నిజం. చాలా మంది ఆరోగ్యంగా ఫిట్నెస్ గా ఉండాలంటే పోషకాలు తగిన మోతాదులో లభించాలని అనుకుంటారు. శారీరక దృఢత్వానికి సరిపడిన పోషకాలు అవసరమే అయినా వాటిని ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. కోవిడ్ వచ్చిన సమయాలు గుర్తు చేసుకుంటే ఎంతోమంది తమకు సరిపడా పోషకాలు అందట్లేదని, ఇమ్యూనిటీ తక్కువగా ఉందనే కారణంతో కృత్రిమంగా పోషకాలను తీసుకున్నారు. అంతకు ముందు విటమిన్స్ లోపం అనే సమస్య వస్తే డాక్టర్లు విటమిన్ లోపానికి తగిన పండ్లు, కూరగాయలు వాడమని సలహా ఇచ్చేవారు. కోవిడ్ తరువాత ఈ తీరు మారింది. పండ్లు, కూరగాయలు స్థానంలో విటమిన్ సప్లిమెంట్స్ వచ్చి చేరాయి. ముఖ్యంగా మహిళలకు అంతకు ముందు వరకు కేవలం కాల్షియం టాబ్లెట్స్ మాత్రమే వాడమని సలహా ఇచ్చేవారు. కోవిడ్ తరువాత ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఫిట్టా.. ఫట్టా..  ఫిట్నెస్ కోసం మార్కెట్లో ఉన్న సప్లిమెంట్స్ అన్ని నిజంగానే ఫిట్నెస్ ను ఇస్తున్నాయా?? అనే ప్రశ్న వేసుకుంటే.. ఫిట్నెస్ ఏ మూల ఉందో వెతుక్కోవాల్సి వస్తోంది.  సామాజిక మాధ్యమాల్లో కనిపించే యాడ్ లు, ఫేక్ ప్రమోషన్లు చూసి పొరపడేవాళ్ళు ఎక్కువ. మహిళల చర్మం యవ్వనంగా ఉండటానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, చర్మం రంగు మారడానికి విటమిన్ సప్లిమెంట్లు విరివిగా తీసుకుంటుంటున్నారు గత రెండేళ్ల నుండి. ఆహారం ద్వారా భర్తీ కావాల్సిన పోషకాలను ఇలా భర్తీ చేసుకుంటున్న వీళ్లను ప్రశ్నిస్తే చాలామంది చెప్పే సమాధానం రోజుకు అవసరమయ్యే పోషకాలు, విటమిన్స్ ఆహారంలో దొరకడం కష్టం కదా అని.  ఈ మాటలో నిజమెంత??  మనకు రోజులో అవసరమయ్యే పోషకాలు మనకు లభ్యం కావు అనే మాట కాస్త ఆత్మ విమర్శ చేసుకుని నిర్ణయిస్తే బాగుంటుంది.  ప్రతిరోజూ సరిపడిన మోతాదులో ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటే 90% పోషకాలు సులభంగానే మనకు లభిస్తాయి. పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, పాల ఆధారిత పదార్థాలు మొదలైన వాటి నుండి, మాంసం, చేపలు మొదలైన వాటి నుండి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే వీటన్నిటిని తీసుకునే అవసరం లేకుండా కేవలం విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుని పోషకాలను భర్తీ చేస్తే శరీర వ్యవస్థ దెబ్బతింటుంది. విటమిన్ బి12, బయోటిన్, విటమిన్ ఇ, విటమిన్ సి మొదలైనవన్నీ ఇలా సప్లిమెంట్స్ లా తీసుకుంటే శరీర కంధర వ్యవస్థ నుండి కణజాల వ్యవస్థ వరకు అన్నీ దెబ్బ తింటాయి. ఇవి మహిళల్లో ఋతు చక్రానికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే ఇలాంటి సప్లిమెంట్లకు దూరంగా ఉండండి. ఆహారం నుండే పోషకాలను పొందండి.                                   ◆నిశ్శబ్ద

ప్రీక్లాంప్సియా.. గర్భవతులకు అతిపెద్ద గండం ఇంతకూ ఈ సమస్య ఏంటంటే?   గర్భం  ప్రతి స్త్రీకి చాలా ప్రత్యేకమైన దశ. ఇదెంత ప్రత్యేకమో.. అంతే సవాలుగా ఉంటుంది కూడా. సాధారణ సమయాలలో కంటే గర్భవతులుగా ఉన్న సమయాల్లో స్త్రీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే గర్భవతుల ఆరోగ్యం పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది. మహిళలు తినడం, త్రాగడం, యోగా, వ్యాయామం  తప్పకుండా చేయాలి.  చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో మధుమేహానికి గురవుతారు, దీనిని గర్భధారణ మధుమేహం అంటారు. అదేవిధంగా, కొన్ని పరిస్థితులు అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి, దీనిని వైద్య భాషలో ప్రీక్లాంప్సియా అంటారు. ఈ సమస్య గురించి తెలుసుకుంటే..  ప్రీక్లాంప్సియా అంటే.. ప్రీక్లాంప్సియా అనేది గర్భం వచ్చిన 20వ వారం తర్వాత లేదా డెలివరీ తర్వాత ఎదురయ్యే  పరిస్థితి, దీనిని ప్రసవానంతర ప్రీక్లాంప్సియా అని కూడా పిలుస్తారు. అధిక రక్తపోటుతో పాటు, మూత్రంలో ప్రోటీన్ అధిక స్థాయిలు ఉండవచ్చు, ఇది మూత్రపిండాల నష్టం (ప్రోటీనురియా) , శరీరంలో అవయవ నష్టానికి దారితీస్తుంది. ప్రీక్లాంప్సియా ఎక్లాంప్సియా ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటుంది, ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలను కలిగించే ప్రమాదకర పరిస్థితి, అరుదైన సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుంది.  ఈ సమస్య గురించి తెలుసుకోవడం, చికిత్స పొందడం ద్వారా తల్లి,  బిడ్డ ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవచ్చు. లక్షణాలను ఎలా గుర్తించాలి? ప్రీఎక్లాంప్సియా ప్రాథమికంగా అధిక రక్తపోటు, ప్రోటీన్యూరియా లేదా మూత్రపిండాలు, ఇతర అవయవాలకు హాని కలిగించవచ్చు. గర్భధారణ పరీక్షల సమయంలో ప్రీక్లాంప్సియా లక్షణాలు తరచుగా స్పష్టంగా కనిపిస్తాయి, అయితే కొన్ని సాధారణ సమస్యల ఆధారంగా కూడా సమస్యను గుర్తించవచ్చు.  మూత్రంలో అధిక ప్రోటీన్ లేదా మూత్రపిండాల సమస్యల ఇతర సంకేతాలు. రక్తంలో ప్లేట్‌లెట్ స్థాయిలు తగ్గడం (థ్రోంబోసైటోపెనియా). కాలేయ సమస్యలను సూచించే కాలేయ ఎంజైమ్‌ల పెరుగుదల. తీవ్రమైన తలనొప్పి - దృష్టిలో మార్పులు, అస్పష్టమైన దృష్టి లేదా వెలుగు భరించలేకపోవడం. ఊపిరితిత్తులలో ద్రవం కారణంగా శ్వాస ఆడకపోవడం. పొట్ట పైభాగంలో నొప్పి, సాధారణంగా కుడి వైపున ఉన్న పక్కటెముకల క్రింద. ఈ సమస్య ఎందుకు వస్తుంది? ప్రీక్లాంప్సియా అనేక కారణాల వల్ల వస్తుంది. గర్భధారణ సమయంలో పిండాన్ని పోషించే అవయవమైన ప్లాసెంటాలో ఇది ప్రారంభమవుతుంది. గర్భధారణ ప్రారంభంలో, కొత్త రక్త నాళాలు అభివృద్ధి చెందుతాయి. మావికి ఆక్సిజన్, పోషకాలను సరఫరా చేయడంలో సహాయపడతాయి.  ప్రీక్లాంప్సియా ఉన్న స్త్రీలలో, ఈ రక్త నాళాలు అభివృద్ధి చెందవు లేదా సరిగా పనిచేయవు. గర్భిణీ స్త్రీ రక్తపోటులో అసమానతలు మావి ద్వారా రక్త ప్రసరణను తగ్గించడం లేదా ప్రభావితం చేస్తాయి. ఇది శిశువు ఆరోగ్యానికి మంచిది కాదు. దీర్ఘకాలిక అధిక రక్తపోటు, గర్భధారణకు ముందు మధుమేహంతో సమస్యలు, మూత్రపిండాల వ్యాధి లేదా స్వయం ప్రతిరక్షక రుగ్మతలు ఈ సమస్యలను కలిగిస్తాయి. శిశువు ఆరోగ్యంపై ప్రభావాలు, నివారణ పద్ధతులు ప్రీక్లాంప్సియా మాయకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులను ప్రభావితం చేస్తుంది కాబట్టి, పిండానికి తగినంత రక్తం లభించకపోతే, అది అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అనేక వ్యాధుల ప్రమాదానికి గురవుతుంది. అకాల ప్రసవానికి కారణమవుతుంది.  ఈ సమస్యను నివారించడానికి, మీరు గర్భిణీల జీవనశైలి, ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, చాలా వరకు ప్రమాదాలను తగ్గించవచ్చు.                                        ◆నిశ్శబ్ద.

మహిళలు వర్కౌట్స్ చేయడం మంచిదే కానీ.. ఈ పొరపాట్లు మాత్రం చేయకండి! మహిళలు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని, కేవలం ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే అది శరీరాన్ని దృఢంగా ఉంచదని ఈ మధ్య కాలంలో తెలుసుకుంటున్నారు. ఇందుకోసం చాలామంది మహిళలు వర్కౌట్స్ చేస్తుంటారు. ఇలా వర్కౌట్స్ చేయడం మంచిదే.. కొందరు జిమ్ లలో శిక్షకుల సమక్షంలో వర్కౌట్స్ చేస్తే అధిక శాతం మంది ఆన్లైల్ లో వివిధ ఆసనాలు, ఎక్సర్సైజులు చూసి వాటిని ఫాలో అవుతుంటారు. అయితే అవహాహన లేకుండా వీటిని ఫాలో అవ్వడం చాలా తప్పు. దీనివల్ల శరీరం ఫిట్ గా మారడం కథ దేవుడెరుగు, ఉన్న ఫిట్నెస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంతకీ వర్కౌట్స్ విషయంలో అందరూ తెలియకుండానే చేస్తున్న పొరపాట్లు ఏమిటో తెలుసుకుంటే.. బరువు తగ్గాలనే ఆలోచనతో చాలా మంది ఎక్కడైనా ఎవరైనా ఒక ఆసనం లేదా వ్యాయామం గురించి ప్రస్తావిస్తే దాన్ని చాలా భీభత్సంగా ఫాలో అవుతారు. అందుకే దేన్నైనా మొదట తేలికగా మొదలుపెట్టడం ఉత్తమం. వర్కౌట్లు చేయడానికి ముందు వార్మప్ ఫాలో కావాలి. దీనివల్ల శరీరంలో కండరాలు, వివిధ అవయవాలు వ్యాయామానికి తగిన విధంగా సిద్దమవుతాయి. వార్మప్ వల్ల శరీరం సాగదీయబడుతుంది. ఇది లేకుండా వ్యాయామం చేస్తే శరీరంలో కండరాలు, వివిధ భాగలు ఎక్కడివక్కడ పట్టుకుపోతాయి. ముఖ్యంగా కాళ్ల కండరాలు, నడుము, పిక్కలు, తొడలు, భుజాలు వంటివి  పట్టుకుపోతాయి. వర్కౌట్స్ చేసి శరీరాన్ని మార్చుకోవాలని అనుకునేవారు నెలల తరబడి వ్యాయామం ఫాలో అవ్వాలి . అన్నిరోజులూ ఒకే రకమైన వ్యాయామం పాలో అవ్వడం  చాలా బోరింగ్ గా ఉంటుంది. అందుకని విభిన్న రకాల వ్యాయామాలను ఎంచుకోవాలి. వీటిని మార్చి మార్చి చేస్తుండాలి. మరీ ముఖ్యంగా వ్యాయామాలు ప్రతిరోజు ఒకే సమయానికి పాలో కావడం మంచిది. దీనివల్ల శరీరం వ్యాయామానికి తగిన విధంగా యాక్టీవ్ అవుతుంది. శరీరంలో మార్పు ఒక క్రమపద్దతిలో సాగుతుంది. బరువు తగ్గడానికో, ఫిట్నెస్ గా ఉండటానికో వ్యాయామం ఫాలో అవుతుంటే అది శరీరం మీద గణనీయంగా ప్రభావం చూపిస్తుంది, వ్యాయామం చేసేటప్పుడు ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గడానికి డైటింగ్ ఫాలో అవుతూ, వ్యాయామం కూడా చేయడం మంచిది కాదు. దీని వల్ల శరీరం దారుణంగా దెబ్బ తింటుంది. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. శరీరంలో కేలరీలు బర్న్ చేయడానికి వ్యాయామాలను కూడా ఫాలో అవ్వాలి వ్యాయామం తరువాత అందరూ ఇక పనులలో మునిహిపోవడం చేస్తుంటారు. కానీ వ్యాయామానికి ముందు శరీరాన్ని ఎలాగైతే వార్మప్ చేశారో, అలాగే శరీరాన్ని కూల్ డౌన్ కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాయామం వల్ల ఉత్తేజితమైన కండరాలు, శరీర అవయవాలు మెల్లిగా సాధారణ స్థితికి వస్తాయి. మహిళలు తెలిసీ తెలియక ఈ పొరపాట్లు అన్నీ చేస్తుంటారు. వీటిని సవరించుకుంటేనే శరీరం ఫిట్నెస్ గా మారుతుంది.                                                    *నిశ్శబ్ద.

మహిళలు రోజూ ఇవి ఫాలో అయితే అద్భుతమైన ఫిట్నెస్ సొంతమవుతుంది! ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుందని అంటారు. కానీ దురదృష్టవశాత్తు మహిళలే ఇంట్లో అందరికంటే పేలవమైన ఆరోగ్యాన్ని కలిగున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఉరుకులు పరుగుల నీద సాగిపోతుంది సగటు మహిళ జీవితం. పిల్లలు, భర్త, అత్తమామలు వీరికి కావల్సినవి సమకూర్చి పెట్టడంలో సగటు మహిళ తనని తాను పట్టించుకోదు.  మరీ ముఖ్యంగా ఇప్పటి కాలంలో మహిళలు చాలా వరకు ఉద్యోగాలు చేసేవారే. ఇంటి పనులకు తోడు ఉద్యోగాలు మహిళలను తొందరగా అలసిపోయేలా చేస్తాయి. అందుకే మహిళలు ఆరోగ్యపరంగా దృఢంగా ఉండటం చాలా ముఖ్యం. రోజంతా పనిచేస్తూనే ఉన్నాం కదా ఇదే పెద్ద వ్యాయామం అనుకునేవారు తమ ఆలోచనలను మార్చుకోవాలి. రోజంతా చేసే పనులలో శరీరంలో శక్తి మొత్తం తగ్గిపోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం ప్రతి ఒక్కరికీ ముఖ్యం. కేవలం ఆహారం ద్వారా లభించేది శక్తి అనిపించుకోదు.  దీనికోసం శరీరానికి శక్తి కూడదీసుకునే వ్యాయామాలు, యోగా అవసరం. ఈ కింది వాటిని రోజులో భాగం చేసుకుంటే శారీరకంగా ఫిట్ గా ఉండొచ్చు. యోగ భారతీయులకు అందిన గొప్ప ఐశ్వర్యం అని చెప్పవచ్చు. యోగా సాధన కోసం కనీసం 30-45 నిమిషాలు,  వారానికి కనీసం 3 సార్లు కేటాయించడం ద్వారా అద్భుతం జరుగుతుంది. ఉదయాన్నే చేసే యోగ చాలా అనువైనది. యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన అభ్యాసాలతో రోజును ప్రారంభించడం ద్వారా మిగిలిన రోజంతా ఉల్లాసంగా గడిచిపోతుంది. శక్తి తిరిగి పుంజుకుంటుంది.   ఇందుకోసం సూర్య నమస్కారాలు బెస్ట్ ఆప్షన్. సూర్య నమస్కారంలో మొత్తం 8 ఆసనాలు ఉంటాయి. కుడి, ఎడమకు వైపులు కలిపి మొత్తం  12 దశలతో ఇది ఉంటుంది. . సూర్య నమస్కారాన్ని ప్రారంభించినప్పుడు, కుడి వైపు నుండి ప్రారంభించాలి, ఎందుకంటే సూర్యుని శక్తి ఈ వైపు ద్వారా ప్రతీకాత్మకంగా సూచించబడుతుంది, అయితే చంద్రుడు ఎడమ వైపున ప్రాతినిధ్యం వహిస్తాడు. రెండు వైపులా కవర్ చేసినప్పుడు ఒక చక్రం పూర్తవుతుంది. ఇది 24 గణనలతో తయారు చేయబడి ఉంటుంది.  సూర్య నమస్కారంలో ఇమిడిపోయిన ఆసనాలు.. ప్రాణం ఆసనం  హస్త ఉతానాసన  పాదహస్తాసనం  అశ్వ సంచలనాసన  సంతోలనాసనం  అష్టాంగ నమస్కార ఆసనం  భుజంగాసనం అధో ముఖ స్వనాసన  అశ్వ సంచలనాసన  పాదహస్తాసనం  హస్త ఉతానాసనం ప్రాణం ఆసనం  ఇవన్నీ వేస్తే ఒక చక్రం పూర్తవుతుంది. ఇలాంటివి 11 చక్రాలు ప్రతిరోజూ చేస్తుంటే శరీరం చాలా దృడం అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా విశ్రాంతి స్థితిలో ప్రాణాయామం, కపాల బాతి వంటివి రోజులో కొన్ని నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలో జరిగే అద్భుతం చూసి ఎవరికి వారు ఆశ్చర్యపోవాల్సిందే..                                     ◆నిశ్శబ్ద.

మహిళల్లో మైగ్రేన్ సమస్యకు మూడు సింపుల్ ఆసనాలు.. మ్యాజిక్ చేస్తాయివి.. అసలు ఏ జబ్బు లేదు అనే మనుషులు ఈ కాలంలో లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మహిళల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మైగ్రేన్.  తలపై ఎవరో ఒకవైపు సుత్తితో మోదుతున్నట్టు, వికారంగానూ, అసహనాన్ని అనుభవిస్తున్న మహిళల శాతం ఎక్కువగానే ఉంది.  మైగ్రేన్ ఉన్నవారు లైటింగ్ చూసినా, శబ్దాలు విన్నా నరకం అనుభవించినట్టే ఉంటుంది. అయితే మూడు మోగాసనాలు వేయడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి ఉపశమనం పొందవచ్చు. అసలు మైగ్రేన్ సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా నయం చేయాలి? మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత రుగ్మత, ఇది తీవ్రమైన తలనొప్పి . దీని వల్ల కొన్నిసార్లు వికారం, వాంతులు ఉంటాయి. కానీ  ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా దీనిని నయం చేయవచ్చు. యోగా వల్ల  శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం అవుతుంది.  కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఈ  కారణంగా మైగ్రేన్ లక్షణాలు మెల్లిగా తగ్గడం ప్రారంభిస్తాయి. అధోముఖ స్వానాసనం.. ఈ ఆసనం వేయడానికి మొదట బోర్లా పడుకోవాలి.  చేతులను భుజాల క్రింద ఉంచాలి. ఇప్పుడు  చేతులను కొద్దిగా ముందుకు తీసుకెళ్లండి. తర్వాత కాలి వేళ్లపై బరువు తీసుకొచ్చి, శ్వాస వదులుతూ తుంటిని పైకి లేపాలి. మోకాళ్లను నిటారుగా ఉంచి తలను చేతుల మధ్య ఉంచాలి. ఇప్పుడు నడుము నిటారుగా ఉంచి, నెమ్మదిగా  చీలమండలతో నేలను తాకాలి. మార్జాలాసనం.. ఈ యోగా ఆసనం చేయడానికి ,  మోకాళ్ల మీద కూర్చోవాలి. మీ చేతులను  ముందుకు చాచి వెన్నెముకను సమాంతరంగా ఉంచాలి.  శ్వాసను వదులుతున్నప్పుడు ఛాతీని, కడుపును లోపలికి తీసుకుంటూ వెన్నెముకను వంచాలి. ఆ తరువాత మళ్ళీ సాధారణ శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజీషన్ కు రావాలి. ఇది సాధారణమైన తర్వాత మళ్లీ అదే విధానాన్ని రిపీట్  చేయాలి. పద్మాసనం.. పద్మాసనం చిన్నప్పటి నుండి అందరికీ అనుభవంలో ఉన్నదే. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఉద్యోగాల నుండి భోజనం చేయడం వరకు అన్ని పనులు  కుర్చీలలో కూర్చుని చేసుకుంటున్నాం. కానీ పద్మాసనం ఇప్పుడు మైగ్రేన్ సు చక్కని మందుగా మారింది. కాళ్ళను మడిచి అటూ ఇటూ చేసుకుని కూర్చోవాలి. ఇప్పుడు కుడిపాదాన్ని  బయటికి తీసి ఎడమ తొడ మీద ఉంచాలి. తరువాత ఎడమ పాదాన్ని బయటకు తీసి కుడి తొడ మీద ఉంచాలి. ఈ స్థితిలో కొద్దిసేపు సాధారణంగా శ్వాస తీసుకోండి. ఈ  పొజిషన్ ను కాళ్లు అటూ ఇటూ మార్చి మళ్లీ వేరుగా చేయాలి. ఈ మూడు ఆసనాలు రోజూ వేస్తుంటే మహిళల్లో మైగ్రేన్ సమస్య చాలా వరకు కంట్రోల్ అవుతుంది.                                                         *నిశ్సబ్ద