చిన్నవయసులోనే పీరియడ్స్ వస్తే డేంజరా...ఆడపిల్లల తల్లులు తెలుసుకోవాల్సిన విషయం..!   పీరియడ్ అనేది సహజమైన ప్రక్రియ. ప్రతి అమ్మాయి ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఈ దశలోకి చేరడం సహజం.  భారతదేశంలో మొదటిసారి రజస్వల అయ్యే అమ్మాయిల  సగటు వయస్సు 12 సంవత్సరాలు. అయితే ఈరోజుల్లో ఆడపిల్లలు 7-8 ఏళ్ల వయసులోనే రజస్వల అవుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయస్సులోనే రజస్వల  కావడం ఆరోగ్యకరం కాదట. దీని వల్ల భవిష్యత్తులో స్థూలకాయం, మధుమేహం వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎముకల పెరుగుదల ఆగిపోతుందట.  దీని కారణంగా పిల్లల ఎత్తు సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లీ దీని గురించి పూర్తీగా తెలుసుకోవాలి. సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఆడపిల్లలలో తొందరగా రజస్వల కావడానికి  కారణం. సోషల్ మీడియాలో అడల్ట్ కంటెంట్, ప్రకటనలు లేదా ఫిల్మ్‌లను చూసే పిల్లలలో పిట్యూటరీ గ్రంధిపై చాలా ప్రభావం ఉంటుంది. ఇది హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ఆడపిల్లలో తొందరగా రజస్వల కావడానికి  కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిల జీవనశైలి,  ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు ఉన్నాయి. బాల్యంలో నాన్-వెజ్ లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే అమ్మాయిలకు చిన్న వయస్సులో రజస్వల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయట. ఇది ఆరోగ్యానికి హానికరం. చిన్నప్పటి నుండి పిల్లలు చాలా తీపి పదార్థాలు తింటారు. అది స్వీట్లు, చాక్లెట్లు లేదా ప్యాక్డ్ ఫుడ్ ఇలా చాలా ఉంటాయి.  వీటిలో ఉండే చక్కెర హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు ఆడపిల్లలు రెగ్యులర్ గా తీసుకుంటే త్వరగా  రజస్వల  రావచ్చు. రోజువారీ జీవితంలో సోమరితనం,  చురుకుగా లేని అమ్మాయిలకు  పీరియడ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా 30-40 నిమిషాల పాటు ఎటువంటి శారీరక వ్యాయామం చేయని అమ్మాయిలకు నిర్ణీత వయసు కంటే  ముందే రజస్వల ప్రారంభమవుతుంది. పిల్లల మీద అతిప్రేమతో చాలా రకాల ఆహారాలు వద్దనకుండా కొనిపెట్టడం వల్ల  బరువు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు మరింకొంత మంది బరువు తక్కువగా ఉంటారు.  వీటి వల్ల కూడా  ప్రీమెచ్యూర్ పీరియడ్స్ రావడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన బరువు శరీరంలో  హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అయితే అనారోగ్యకరమైన బరువు  హార్మోన్లలో మార్పులకు కారణమవుతుంది.  ఇది ఆడపిల్లలలో తొందరగా రజస్వల కావడానికి కారణం అవుతుంది.  ప్రారంభ కాలాల అవకాశాలను పెంచుతుంది.                                                *రూపశ్రీ.

మెనోపాజ్ తరువాత మహిళలలో దంతాలు ఊడిపోతుంటే ఈ వ్యాధి ఉండవచ్చు..! రక్తం నుండి వ్యర్థాలను తొలగించడం ద్వారా శరీరం  ఆరోగ్యంగా ఉండటంలో  మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని ప్రమాదకరమైన పదార్థాలను  సమర్థవంతంగా ఫిల్టర్ చేయడంలో వైఫల్యం అయితే అది  తీవ్రమైన,  ప్రాణాంతకమైన  పరిస్థితులకు దారి తీస్తుంది.  మహిళలలో మెనోపాజ్ తరువాత దంతాలు ఊడిపోవడం అనేది మహిళలలో మూత్రపిండాల సమస్యను కలిగి ఉండే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది నిజమేనా.. దీని వెనుక ఉన్న కారణాలేంటి? తెలుసుకుంటే.. మహిళలలో మెనోపాజ్ తరువాత మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గుతుంది. మహిళలలో పునరుత్పత్తి హార్మోన్లు తగ్గడం వల్ల ఇది జరుగుతుంది. ఈ పునరుత్పత్తి హార్మోన్లు తగ్గడం వల్ల పొట్ట రావడం,  ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ దీర్ఘకాల మూత్ర పిండ వ్యాధికి కారకాలుగా మారుతాయని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు ఎముక,  గుండె సంబంధ సమస్యలతో పాటూ అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. మెనోపాజ్ తరువాత మహిళలలో దంతాలు ఊడిపోవడం అనేది నోటి ఆరోగ్యానికి కూడా ప్రధాన సంకేతం. మధుమేహం,  థైరాయిడ్, బోలు ఎముకల వ్యాధి మొదలైన సమస్యలతో ఇవి ముడి పడి ఉంటాయి. ముఖ్యంగా 66 నుండి 79 సంవత్సరాల వయసు గల మహిళలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. మహిళలలో ఖనిజాలు,  ఎముక జీవక్రియ రుగ్మతలను నివారించడం దంతాల నష్టాన్ని నివారించడంలో కీలకంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెనోపాజ్ దాటిన మహిళలు నోటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతున్నారు.                                              *రూపశ్రీ.

నెలసరి మూడురోజుల్లో ఈ అయిదు పనులు అస్సలు చేయకండి! ప్రకృతి మహిళలకు మాత్రమే ఏర్పాటు చేసిన వ్యవస్థ ఋతుచక్రం, గర్భధారణ, ప్రసవం మొదలైనవి. అయితే పీరియడ్స్ సమయంలో మహిళల ప్రవర్తనను, అలవాట్లను చూసి కొంతమంది విమర్శిస్తుంటారు. మరికొందరు పెదవి విరుస్తుంటారు. అయితే నెలసరి సమయంలో మహిళలు తమ గురించి  తాము కేర్ తీసుకోవడం చాలా అవసరం. కేవలం మహిళలే కాదు, ఆ సమయంలో మగవారు కూడా మహిళలకు తమదైన సహాయం, సహకారం అందించాలి. ఎందుకంటే  కొన్ని పనులు చేయడం వల్ల పీరియడ్స్ బాధాకరంగా మారుతుంది.  అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు   అయిదు పనులు అస్సలు చేయకూడదు. ఇంతకీ అవేంటి?? ఎందుకు చేయకూడదు?? పూర్తిగా తెలుసుకుంటే.. పీరియడ్స్ సమయంలో ఈ 5 తప్పులు చేయకండి.. యోగా.. పీరియడ్స్ సమయంలో యోగా చేసే అలవాటు ఉన్న మహిళలు  యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరాన్ని తలకిందులు చేసే యోగాసనాలు వేయడం మానుకోవాలి. సర్వంగాసనం, శీర్షాసనం,  హలాసనం మొదలైన వాటిలో కాళ్ళను పైకి లేపాల్సి ఉంటుంది.  దీని కారణంగా రక్తస్రావం యొక్క సహజ గురుత్వాకర్షణ ప్రవాహం చెదిరిపోతుంది.  వర్కౌట్.. యోగా.. వర్కౌట్ వేరు వేరు అయినా అవి శరీరం మీద ఒత్తిడి కలిగించేవే.. ఈ సమయంలో వర్కవుట్ అయినా ఇంటెన్స్ యాక్టివిటీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ పెరగడం మొదలవుతుంది.  శరీరం రిలాక్స్‌గా ఉండదు. హెవీ వర్కవుట్స్ వల్ల పొట్టపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. విశ్రాంతి.. పీరియడ్స్ సమయంలో విశ్రాంతి ఉండాలి అనే నెపంతో చాలామంది రోజంతా పడుకునే ఉంటారు. అయితే ఇలా రోజంతా మంచం మీద పడుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నెలసరి కాలంలో నొప్పి,  తిమ్మిరి చాలా తీవ్రంగా ఉంటుంది. పడుకునే ఉండటం వల్ల కూడా ఇవి అధికమయ్యే అవకాశం ఉంది. నెలసరి  సమయంలో  లైట్ స్ట్రెచింగ్, వాకింగ్  బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. దీని వల్ల మానసిక స్థితిని మెరుగుపరిచే హార్మోన్లు పెరుగుతాయి,  నొప్పి కూడా తగ్గుతుంది. ఆహారం..  పీరియడ్స్ సమయంలో చిప్స్, చాక్లెట్, బర్గర్ లాంటివి తినాలని అనిపిస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ వీటిని ఆపేయడం మంచిది.   వీటిలో పోషకాహారంకు బదులుగా  కేలరీలు ఉంటాయి, దీని కారణంగా శరీరానికి నిజమైన పోషకాహారం లభించదు. పైపెచ్చు బరువు పెరగడానికి దారి ఇస్తుంది.  తలస్నానం.. నెలసరిలో ఉన్నప్పుడు తలస్నానం చేయడం గురించి చాలా వాదనలు ఉన్నాయి. తలస్నానం చేయచ్చని, చేయకూడదని వైద్యులు,  సైన్స్  అంగీకరించడం లేదు, అయితే యోగా ప్రకారం, పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయకూడదు.  తలపై నీటిని పోయడం వల్ల, అపాన వాయువు క్రిందికి ప్రవహిస్తుంది, ఇది హానికరం.  ఈ అయిదు పనులు ఆ మూడు రోజులు చేయకుండా ఉంటే లాభాలే తప్ప నష్టాలేమి లేవు. కాబట్టి వీటిని ఫాలో అయితే మంచిది.                                   *నిశ్శబ్ద.

  పిసిఓయస్ ఉన్న మహిళలకు ఈ మూడు పనులు చాలా డేంజర్..     పిసిఒఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అనేది  వయసులో ఉన్న   మహిళల్లో అత్యంత సాధారణ హార్మోన్ సమస్యలలో ఒకటి. ఈ పరిస్థితిలో స్త్రీలలో నెలసరి సరిగా రాకపోవడం, సంతానోత్పత్తి సమస్యలు,  అవాంఛిత రోమాల పెరుగుదల ఎక్కువగా ఉండటం,  ముఖ్యంగా ముఖంపై  మొటిమలు వంటివి ఎక్కువగా ఎదుర్కుంటారు.   పిసిఓయస్ తో ఇబ్బంది పడే మహిళలకు జీవితం పెద్ద సవాల్ లాగా అనిపిస్తుంది.  దీనికి శాశ్వతమైన నివారణ లేకపోయినా దీన్ని నియంత్రించవచ్చు.  చాలామంది మహిళలు తమ  ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టు  నిజంగా మంచిదో కాదో తెలియకుండానే కొన్ని రకాల ఆహారాన్ని అనుసరిస్తుంటారు. పిసిఓయస్ సమస్యతో ఇబ్బంది పడే మహిళలు మూడు పనులు  అస్సలు చేయకూడదని మహిళా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అవేంటంటే.. ఉపవాసం.. ఉపవాసం చేయడం వల్ల మహిళలలో ఆరోగ్యం చక్కబడుతుందని కొందరు అంటారు.  ఆహారం తీసుకోవడం,  ఉపవాసం అనేవి రెండు ఒకదానికి ఒకటి అనుగుణంగా ఉండాలి. ఇలా ఉంటే ఇది కొందరికి మాత్రమే వర్క్ అవుతుంది.  లేకపోతే  ఇలా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది.  ఇది ప్రోజెస్టెరాన్ ను తగ్గిస్తుంది.  కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. ఇది హార్మోన్లను మరింత గందరగోళంలోకి నెడుతుంది.  కాబట్టి పిసిఓయస్ మహిళలు అసలు ఉపవాసం ఉండకూడదు. కేలరీలు.. తక్కువ కేలరీల ఆహారాలు బరువు తగ్గడానికి గొప్పవి. కానీ PCOS ఉన్నవారికి కాదు. సలాడ్‌ల వంటి తక్కువ కేలరీల ఆహారాలను ఎల్లప్పుడూ తినడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుంది. నిజానికి ఇది పిసిఓయస్   పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. అండోత్సర్గము వంటి అభివృద్ధి చెందుతున్న ప్రక్రియలపై దృష్టి పెట్టడానికి బదులుగా  శరీరం సాధారణ  స్థితిలోకి జారుకుంటుంది.  దీని వల్ల మహిళలలో పీరియడ్స్ వస్తాయి.   రోజుకు 1600 నుండి 2400 కేలరీల ఆహారాన్ని మహిళలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ్రూట్ డైట్.. పండ్లు ఆరోగ్యంగా ఉన్నాయని భావించి ఎప్పుడూ వాటిని తింటే ఆరోగ్యం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది.  ముఖ్యంగా పిసిఓయస్ ఉంటూ ఇన్సులిన్ నిరోధకత ఉంటే ఒకేసారి ఎక్కువ పండ్లు తినడం వల్ల  రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారని  అనుకుంటారు కానీ అది  హార్మోన్లను మరింత దిగజార్చవచ్చు. హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవాలి. పిసిఓయస్ ఉన్నవాళ్లు ఇలా చేయండి.. పిసిఓయస్ ను నియంత్రించాలని అనుకునేవారు అధిక ఫైబర్,  అధిక ప్రోటీన్ ఆహారాలతో  ఆహారాన్ని మెరుగుపరచండి . ఇందులో అన్ని రకాల పండ్లు,  కూరగాయలు,  ఆకు కూరలు ఉండాలి. మరోవైపు, ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ సంతృప్తిని ప్రోత్సహించడంలో,  ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనితో పాటు  ఆహారంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కూడా చేర్చాలి. ఎందుకంటే అవి సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో, హార్మోన్లను నియంత్రించడంలో, అవాంఛిత రోమాలపెరుగుదలను  తగ్గించడంలో సహాయపడతాయి. PCOSని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దృష్టి  సమతుల్య ఆహారాన్ని తీసుకోవడంపై ఉండాలి.                                      *రూపశ్రీ.

తెల్లకుసుమ వ్యాధి వేధిస్తోందా..ఇదిగో చిట్కాలు! మహిళలను వేధించే సమస్యలు చాలా ఉన్నాయి. వాటిలో అధిక రతుస్రావం కావడం ఒకటైతే, అసలు రక్తస్రావం సరిగా కాకపోవడం రెండవ సమస్య. వీటికి విభిన్నంగా మహిళల్లో ఎదురయ్యే మరొక సమస్య ఉంది. అదే వైట్ డిశ్చార్జ్. తెల్లబట్ట అని అందరూ పిలుచుకునే ఈ సమస్యను ఆయుర్వేదం ప్రకారం తెల్లకుసుమ వ్యాధి అని అంటారు. ఈ వ్యాధికి సాధారణ ఇంగ్లీషు వైద్యంలో ఎన్నో మందులు ఉన్నా అవి వాడినన్ని రోజులు ఆరోగ్యం బాగుంటుంది కానీ మందులు వాడటం ఆపగానే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. అదే ఆయుర్వేదంలో సహజ మార్గాల ద్వారా, అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలను ఉపయోగించి సమస్యలను తగ్గించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుసుకుంటే… తెల్ల బట్ట అవుతున్నప్పుడు అందరూ సులువుగా పాటించగలిగే చిట్కా ఒకటుంది.  మొదటి 3 రోజులు వరకు ఒక్కొక్క చెంచా ఆముదాన్ని తాగాలి. ఇలా ఆముదాన్ని తీసుకున్న తరువాత తెల్లబట్టకు వైద్యులు సూచించిన మెడిసిన్ వాడాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.  అలాగే మహిళల్లో ఈ సమస్య ఉన్నప్పుడు ఈ చిట్కా పాటించేటప్పుడు మగవారికి దూరంగా ఉండాలి.   మహిళలకు అందరికీ అందుబాటులో ఎంతో సులువుగా పాటించగలిగే మరొక చిట్కా వంటింట్లో దాగుంది. ప్రతి రోజు అన్నం చేయడానికి మహిళలు బియ్యం కడుగుతూ ఉంటారు. మొదటిసారి బియ్యం కడిగేసాక అందులో దుమ్ము మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. రెండవసారి బియ్యం కడిగిన నీటిని విడిగా తీసుకోవాలి. ఈ బియ్యం కడిగిన నీళ్లలో అయిదు గ్రాముల  జీలకర్ర, అయిదు గ్రాముల పటిక బెల్లముల పొడిని తీసుకుని ఆ పొడిని బియ్యం కడిగిన నీళ్లలో కలిపి త్రాగాలి. ఇలా చేయడం వల్ల తెల్లబట్ట సమస్య నుండి మంచి ఫలితం ఉంటుంది.  గ్రామీణ ప్రాంతాల్లో మోదుగ చెట్లు చాలా విరివిగా పెరుగుతుంటాయి. ఈ చెట్లకు పూలు కాస్తాయి. 10-15 మోదుగ పూలను, తీసుకోవాలి. 100-200 మి.లీ. ల నీటిలో తీసుకున్న మోదుగపూలను నానబెట్టి ఆ తరువాత పూలను తీసేయాలి.  ఆ నీటిని త్రాగటం తెల్లబట్ట సమస్య తగ్గిపోతుంది. లేదంటే మరొక పరిష్కారం కూడా ఉంది.   5 తాజా గులాబీ పూలను తీసుకోవాలి. ఈ పూలను ఉదయం, సాయంత్రం రెండు పూటలా పటిక బెల్లముతో తిని ఆవుపాలు త్రాగాలి. ఇలా చేస్తుంటే తెల్లబట్ట సమస్య క్రమంగా తగ్గిపోతుంది. పైన చెప్పుకున్న ఎంతో సులువైన, అందరికీ అందుబాటులో ఉన్న పదార్థాలతో చిట్కాలు పాటించి తెల్లబట్ట సమస్యను తగ్గించుకోవచ్చు.                                   ◆నిశ్శబ్ద.

  మహిళలు పిసి ఓఎస్ సమస్య నుండి బయట పడాలంటే ఈ ఆహారాలు తినాలి..!   పిసిఓయస్ మహిళలను చాలా ఇబ్బంది పెట్టే సమస్య. ఇది  హార్మోన్ సమస్యల వల్ల వస్తుంది. దీనికి జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఒక నిర్ణీత వైద్యం అంటూ లేకపోవడం వల్ల మహిళలు ఎక్కువగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.  భారతదేశంలో సుమారు 20శాతం మంది మహిళలు పిసిఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.  70శాతం మంది మహిళలకు తాము పిసిఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అని కానీ, పిసిఓఎస్ సమస్య గురించి కానీ తెలియదు. పిసిఓఎస్.. పిసిఓఎస్ సమస్యలో మహిళలు పీరియడ్స్ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. హార్మోన్ల స్థాయిలలో హెచ్చు థగ్గులు ఏర్పడటం వల్ల ఇది పిల్లలు కడగడంలో కూడా ఆటంకాలు కలిగిస్తుంది. పిసిఓఎస్ ఉన్న మహిళలు గర్బం దాల్చడంలో ఇబ్బందులు ఉంటాయి. అందుకే చాలామంది సంతానలేమి సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలంలో. ఈ పిసిఓఎస్ కారణంగా మధుమేహం, రక్తపోటు,  గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం కూడా మహిళలకు పెరుగుతుంది. పాలిసిస్టిక్  ఓవరీ సిండ్రోమ్ ను తగ్గించుకోవడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.   సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.  సాయంత్రం ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.  ఇది కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే గ్లూకోజ్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవు. శరీరంలో చక్కెరల శాతం హార్మోన్ల మీద ప్రభావం చూపిస్తుంది. పిసిఓఎస్ నుండి మహిళలు బయట పడాలి అంటే సీజన్ ను ఫాలో అవ్వాలి. ఇప్పట్లో సీజన్ కాకపోయినా అన్ని రకాల కూరగాయలు, పండ్లు దొరుకున్నాయి.  చాలామంది వీటిని కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ వీటి వల్ల శరీరంలో హార్మోన్ సమస్యలు వస్తాయి.  పిసిఓఎస్ తగ్గాలంటే సీజనల్ పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.  ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో హార్మోన్ల సమస్య తగ్గాలంటే ఒమేగా-3 రిచ్ ఫుడ్స్ లేదా ఒమేగా-3 సప్లిమెంట్లు క్రమం తప్పకుండా తీసుకోవాలి. కేవలం ఇవి మాత్రమే  మాత్రమే కాకుండా, కాల్షియం,  విటమిన్-డి,  విటమిన్-బి12 కూడా సమృద్దిగా తీసుకోవాలి. వ్యాయామం  చాలా సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. ఎంత బిజీ లైఫ్ లో అయినా రోజులో గంటసేపు వ్యాయామానికి కేటాయించుకోవాలి. పిసిఓఎస్ పరిష్కారానికి తగిన వ్యాయామాల గురించి పలుచోట్ల చాలా వీడియోలు అందుబాటులో ఉంటాయి. వాటిని చూసి వ్యాయామాలు కంటిన్యూ చేయవచ్చు. అనూకూలం, అవకాశం ఉన్నవారు నిపుణుల సలహా తో కూడా వ్యాయామాలు చేయవచ్చు. చాలామంది మహిళలలో పిసిఓఎస్ ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది.  ఈ ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత కారణంగా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మధుమేహానికి దారితీయకూడదు అంటే 3 నెలలకు ఒకసారి బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి.  ఇది మధుమేహం రాకుండా ఉండటంలో, జాగ్రత్తలు తీసుకోవడంలో సహాయపడుతుంది.                                                 *రూపశ్రీ.

  గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఉన్నాయా? ఈ నిజాలు తెలుసా?   వివాహం తరువాత ప్రతి జంట తల్లిదండ్రులు కావడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూచ్తారు.  అందుకోసం తమ ప్రయత్నాలు తాము చేస్తారు.  ఆరోగ్యవంతంగా ఉన్న జంట ఎలాంటి సేఫ్టీ పాటించకపోతే ఏడాదిలోపే తల్లిదండ్రులు కాబోతున్నాం అనే వార్త చెప్పగలరు. కానీ వివాహం తరువాత ఏళ్ల సమయం గడిచినా కొందరికి పిల్లలు పుట్టరు.  చాలామంది ఈ సమస్య మొత్తం మహిళలలోనే ఉందని అనుకుంటూ ఉంటారు. అయితే గర్బం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే అది కేవలం మహిళలలో ఉన్న సమస్య మాత్రమే కాదు.. కొన్ని రకాల వ్యాధుల కారణంగా ఆ జంటలకు పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. గర్భం దాల్చడం అనేది కేవలం మహిళలలోనే కాదు.. మగవారి ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది.  మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తి,  కౌంట్  అనేది మగ వంద్యత్వం కారణంగా తగ్గుతుంది.  మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉన్నా మగవారి స్పెర్మ్ నాణ్యతగా లేకపోతే.. వారిలో పిల్లలు కలగడంలో ఇబ్బందులు ఉంటే మహిళలు గర్భం దాల్చలేరు. ఎండోమెట్రియోసిస్ అనే వైద్య సమస్య ఉంటుంది.   ఈ సమస్యలో కణజాల పొర గర్భాశయం వెలుపల పెరుగుతుంది.  ఇది నొప్పికి,  పిల్లలు పుట్టకుండా ఉండటానికి కారణమవుతుంది. భారతదేశంలో 20శాతం మహిళలు పిసిఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  70శాతం మంది మహిళలకు అసలు పిసిఓఎస్ అనే సమస్య గురించి తెలియదు.  పిసిఓఎస్ లో ఆండ్రోజెన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది.  అండాశయాల చుట్టూ చిన్న గడ్డలు ఏర్పడతాయి.  ఈ సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చడం జరగదు.  జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను  అధిగమించవచ్చు. మహిళల శరీరంలో థైరాయిడ్ డిజార్ఢర్ లేదా హైపర్ప్రోలాక్టిినిమియా వంటి వంటి హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీరియడ్ సైకిల్ అస్తవ్యస్తం అవుతుంది. అంతేకాదు అండోత్సర్గములో సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ కారణంగా మహిళలు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఉంటాయి. మహిళల గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు,  పాలిప్స్,  సెప్టెట్ ప్రెగ్నెన్సీ వంటి సమస్యలు ఉన్నప్పుడు గర్బం దాల్చే  అవకాశాలు ఉండవు. ఒకవేళ గర్భం దాల్చినా గర్భస్రావం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మహిళలలో ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి.  ఇవి అండాశయం నుండి గర్భాశయం వరకు అండాలను తీసుకువెళతాయి.  ఈ గొట్టాలు మూసుకుపోయినట్లైతే అండాలు గర్భాశయాన్ని చేరుకోలేవు. దీని కారణంగా మహిళలు ఎంత ప్రయత్నం చేసినా గర్భం దాల్చలేరు. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అనే సమస్య మహిళల పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తుంది.  ఇది ఫెలోషియన్ ట్యూబ్ లను దెబ్బతీస్తుంది.  గర్భధారణకు ఆటంకం కలిగిస్తుంది. ఇప్పట్లో చిన్న వయసులోనే మహిళలు మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు. మధుమేహం,  ఇతర వ్యాధులు,  స్వయం ప్రతిరక్షక జబ్బులు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సంతానోత్పత్తి మీద ప్రభావం చూపిస్తాయి.  ఇలాంటి సమస్యలున్న మహిళలలో గర్బం దాల్చడం కష్టతరంగా ఉంటుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం ఇప్పట్లో జరుగుతోంది.  జీవితంలో గోల్స్,  సెటిల్ కావడం పట్ల దృష్టి పెట్టి వివాహం ఆలస్యంగా చేసుకుంటున్నవారు పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ముఖ్యంగా 35 దాటిన తరువాత మహిళల అండాల నాణ్యత, పరిమాణం తగ్గుతుంది.  దీనివల్ల గర్భం దాల్చడంలోనూ,  పిల్లలు పుట్టడంలోనూ ఇబ్బందులు ఏర్పడతాయి. గర్భం దాల్చకపోవడానికి ఊబకాయం కూడా కారణం అవుతుంది. అధిక బరువు ఉన్న మహిళలలో హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్ వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక బరువు చాలా తక్కువ ఉన్న మహిళలలో పోషకాహార లోపం,  బలహీనత వంటి సమస్యలు ఉంటాయి.   ఇవన్నీ గర్భం దాల్చడానికి మైనస్ పాయింట్లు అవుతాయి.                                                      *రూపశ్రీ.  

 పెళ్ళైన మహిళల్లో నెలసరి స్కిప్ అయినా ప్రెగ్నెన్సీ రాకపోతే ఏమి జరుగుతుంది..   గర్భం దాల్చడం ప్రతి మహిళ జీవితంలో ఎంతో గొప్ప అనుభూతి. ఇషించల ప్రత్యేకమైన దశ కూడా. చాలామంది పెళ్ళైన మహిళలు నెలసరి స్కిప్ అవ్వగానే ఇక ప్రెగ్నెన్సీ వచ్చిందని అనుకుంటారు. కానీ ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ఫలితం నెగిటివ్ గా వస్తుంది. అసలిలా ఎందుకు జరుగుతుంది?? పెళ్ళైన మహిళలలో నెలసరి మిస్సైనా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఏమిటి?? ఇలా నెలసరి మిస్సయ్యే మహిళలు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ఎలా?  ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?? మొదలైన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. పెళ్ళైన తరువాత మహిళలు గర్భం ధరించారనడానికి  మొదటి సిగ్నల్ పీరియడ్స్ మిస్ అవ్వడమే. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ లో కొందరికి నెగిటివ్ వస్తుంది. అప్పటిదాకా ప్రతినెలా సరైన ఋతుచక్రం కొనసాగిన మహిళల్లో అటు నెలసరి రాక, ఇటు గర్భం దాల్చక అయోమయానికి లోనవుతుంటారు. కనీసం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలా వద్దా?? అని సందిగ్ధ పడుతుంటారు.  మహిళలు ఏమాత్రం ఒత్తిడికి లోనైన వారి శరీరంలో హార్మోన్ల స్థాయిలు అసమతుల్యం అవుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ఋతుచక్ర సమస్యలు వస్తాయి.  మహిళలు చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, దీర్ఘకాలిక ఆందోళన కలిగి ఉంటే లేదా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్లయితే, చికిత్స తీసుకోవాలి. ఒత్తిడిని నియంత్రించడానికి,  సమతుల్య ఆహారం, శారీరక శ్రమ  కూడా అవసరం అవుతుంది. దీంతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సాధారణంగా ప్రతినెలా అండాశయం నుంచి అండాలు విడుదల అవుతాయి. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి, ఇది అనోయులేషన్‌కు దారితీస్తుంది. అనోయులేషన్ అంటే అండాలు  విడుదల కాకపోవడం. దీని కారణంగా, పీరియడ్స్ మిస్ కావచ్చు లేదా ఆలస్యం కావచ్చు.  అంతేకాదు ఇది పిల్లలు పుట్టడంలో  సమస్యలకు కారణం కావచ్చు. PCOD, థైరాయిడ్,  బరువు తగ్గడం, పెరగడం అనోయులేషన్‌కు కారణం అవుతాయి.  గర్భనిరోధక మాత్రలు,  రక్తపోటు,  అలెర్జీ మందులు వంటి కొన్ని మందులు కూడా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి, ఇది నెలసరి తప్పిపోవడానికి లేదా ఆలస్యం కావడానికి దారితీస్తుంది. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా ఋతు చక్రంలో ఆటంకం ఏర్పడవచ్చు. ఇలాంటి సందర్భాలలో, గర్భధారణ కోసం మహిళలు  ఆరోగ్యాన్ని  జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక వ్యాధులు, పోషకాహార లోపాలు,  హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువులో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవి ఋతు చక్రం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.  ధ్యానం, యోగ, ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని నియంత్రలోకి తీసుకురావచ్చు. రోజూ చురుగ్గా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం, వీలైనంత వరకు అందరితో నవ్వుతూ మాట్లాడటం. ఇవన్నీ మహిళల నెలసరి తిరిగి సాధారణ స్థితిలోకి రావడానికి కారణం అవుతాయి.                                     *నిశ్శబ్ద.

ప్రెగ్నెన్సీ సమయంలో దానిమ్మ తింటే ఎన్ని లాభాలో తెలుసా! గర్భిణీలు గర్భధారణ సమయంలో పండ్లు తినడం ద్వారా పిండం ఆరోగ్యంగా ఉంటుంది. వివిధ రకాల పోషకాలతో కూడిన పండ్లను గర్భిణీలు రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు దానిమ్మపండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే దానిమ్మలో పొటాషియం, కాల్షియం, విటమిన్లు, సి, కె, బి, ఎ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. గర్భం దాల్చిన మొదటి త్రైమాసికం నుంచి క్రమంతప్పకుండా దానిమ్మను తీసుకున్నట్లయితే..తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. గర్బిణీలు దానిమ్మను తమ డైట్లో చేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. రక్తప్రసరణను పెంచుతుంది: దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు పిండం అభివృద్ధికి ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు. దానిమ్మ రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో విటమిన్ సి లోపం లేదా ఐరన్ సమస్యలు రక్తహీనతకు దారితీస్తాయి. కాబట్టి గర్భధారణ సమయంలో దానిమ్మ తీసుకోవడం చాలా ముఖ్యం. రక్తపోటుకు చెక్: సాధారణంగా గర్భిణీలు అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. ప్రసూతి రక్తపోటు శిశువు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. గర్భస్రావానికి దారితీస్తుంది. మెదడు దెబ్బతినడం, కడుపులోనే బిడ్డ చనిపోవడం వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది. దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఎముకలు గట్టిగా మారుతాయి: దానిమ్మలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలు, గుడ్ల మాదిరిగానే దానిమ్మ ఎముకలకు కూడా మేలు చేస్తుంది. గర్భిణీలు ఎముకలను బలోపేతం చేయడంలో దానిమ్మ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే తల్లి, పిండం ఎముకలు దృఢంగా ఉంటాయి. మెదడు అభివృద్ధి: దానిమ్మ రసంలో పాలీఫెనాలిక్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఇది పిల్లల మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెదడు గాయాలు, ఒత్తిడి నుండి పిల్లలను రక్షిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. కాబట్టి పిల్లల అభివృద్ధిపై దానిమ్మ చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అకాల ప్రసవం: కొంతమంది గర్భిణీలు వారు అనుసరించే జీవనశైలి కారణంగా నెలలు నిండకుండానే ప్రసవిస్తారు. పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణం. కొంతమంది స్త్రీలకు ప్లాసెంటల్ సమస్యలు ఉండవచ్చు. ఇది నెలలు నిండకుండానే ప్రసవానికి, తక్కువ బరువుకు దారి తీస్తుంది. దానిమ్మ యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమస్యలకు పరిష్కారం చూపుతాయి. వీటితో పాటు దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది.

మహిళలలో చిన్నతనంలోనే వచ్చే  బోలు ఎముకల వ్యాధి  నివారణకు ఇలా చేయండి..!     మహిళలు తమ భర్త, పిల్లలు, అత్తమామలు ఇలా కుటుంబం మొత్తాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ తమ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  ఈ అజాగ్రత్తల వల్ల చాలామంది మహిళలు చిన్న వయసులోనే ఎముకలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటిలో ఆస్టియోపోరోసిస్ కూడా ఒకటి. దీన్నే బోలు ఎముకల వ్యాధి అంటుంటారు. మహిళలలో మెనోపాజ్ తరువాత ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్  హార్మోన్లు తగ్గుతాయి.  దీని కారణంగా ఎముకలు బలహీనపడతాయి. బోలు ఎముకల వ్యాధిని నివారించాలంటే మహిళలు 30 ఏళ్ళ తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పురుషుల కంటే చిన్న వయస్సులోనే స్త్రీలలో ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. దీనికి కారణం మెనోపాజ్ ఒకటి అయితే స్త్రీల  జీవనశైలి సరిగా లేకపోవడం మరొకటి. సాధారణంగా 60 ఏళ్ల తర్వాత, ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. కానీ 30 ఏళ్ల తర్వాత ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోని మహిళల్లో ఎముకలు త్వరగా బలహీనపడతాయి.  ఇలాంటి మహిళలు వయసుకు ముందే ఎముకల వ్యాధుల బారిన పడవచ్చు. ఎముకలు బలహీనంగా ఉన్న మహిళలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా స్త్రీలకు 40 ఏళ్ల తర్వాత ఎముకల సాంద్రత సమస్యలు మొదలవుతాయి. మహిళలు ఫ్రీ-మెనోపాజ్ దశలో ఉంటారు.  అంటే వారి పీరియడ్స్ క్రమంగా ఆగిపోవడం ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ హార్మోన్ల లోపం ఉంటుంది. ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ హార్మోన్లు శరీరంలో కాల్షియంను గ్రహించడంలో సహాయపడతాయి. శరీరంలో వీటి లోపం ఏర్పడినప్పుడు ఎముకలు బలహీనపడతాయి. దీని వల్ల రక్తపోటు కూడా ప్రభావితమవుతుంది. మెనోపాజ్ సమయంలో స్త్రీల ఎముకలు బలహీనపడటంతో పాటు రక్తపోటు స్థాయి కూడా అస్తవ్యస్తం కావడానికి కారణం ఇదే. పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయి తగ్గిపోవడం  ప్రారంభించినప్పుడు ఎముకలు మృదువుగా,  బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా బోలు ఎముకల వ్యాధి,  ఆస్టియోమలాసియా సమస్యలు మొదలవుతాయి. ఆస్టియోమలాసియాలో ఎముకలు మృదువుగా మారుతాయి.  బోలు ఎముకల వ్యాధిలో అవి బలహీనమవుతాయి. చిన్నపాటి గాయమైనా, కిందపడినా ఎముక విరిగిపోతుందేమోనని భయం. కీళ్ల ఎముకలు అరిగిపోవడం ప్రారంభించినప్పుడు కీళ్ళు సరిగ్గా పనిచేయవు. వాటి కదలిక ఆగిపోతుంది. దీని వల్ల కీళ్లలో నొప్పి మొదలవుతుంది. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. విటమిన్ డి శరీరంలోని అనేక కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. విటమిన్ డి ఆహారం నుండి కాల్షియంను గ్రహిస్తుంది. విటమిన్ డి లోపం చర్మం ఆకృతిని పాడు చేస్తుంది. చర్మం క్షీణిస్తున్నట్లయితే విటమిన్ డి సప్లిమెంట్లను వైద్యుల సలహాతో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మెనోపాజ్ తర్వాత శరీరంలో విటమిన్ డి లోపం వల్ల స్త్రీల చర్మం మెరుపు తగ్గి ముఖంపై ముడతలు వస్తాయి. సూర్యకాంతి పడని స్త్రీల శరీరంలో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది. ఎముకలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండాలంటే  జీవనశైలిలో 5 మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజూ సూర్యరశ్మిలో  యోగా,  వ్యాయామం చేయాలి. ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారి ఎముకలు కూడా త్వరగా బలహీనపడతాయి, దానిని నివారించాలి. ఆహారంలో కాల్షియం, ఫాస్పరస్,  ప్రోటీన్ల లోపం ఉండకూడదు. శరీరంలో విటమిన్ డి తగినంత మొత్తంలో ఉండటానికి ఆహారంలో విటమిన్ డి ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. నిమ్మ, నారింజ, యాపిల్, స్ట్రాబెర్రీ, పైనాపిల్, గుడ్డు, చేపలు, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, బాదం వంటి వాటిని తినడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం ఉండదు.                                                *రూపశ్రీ.

  ఆడవారు PCOS ను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?      మహిళలకు నెలసరి సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి.  నెలసరి సరిగా రాకపోవడం,  పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, బరువు పెరగడం,  వంటి సమస్యలు చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఈ సమస్యలకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కారణం అవుతుంది.  దీన్నే పిసిఓయస్ అని అంటారు.  భారతదేశంలో ప్రతి 5 మంది మహిళలలో ఒకరు పిసిఓయస్ సమస్యతో పోరాడుతున్నారు.  అంటే.. ఈ సమస్య మహిళలను ఎంతగా ఇబ్బంది పెడుతోందో అర్థం చేసుకోవచ్చు. అయితే చాలామంది మహిళలు తమకు పిసిఓయస్ సమస్య ఉందనే విషయం కూడా తెలియకుండానే కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. మరికొందరు తమకు సమస్య  ఉందని తెలిసినా కుటుంబ విషయాల్లో పడి తమ గురించి తాము పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. కానీ పిసిఓయస్ సమస్యను పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తే నష్టాలు తప్పవని గైనకాలజిస్టులు చెబుతున్నారు. మహిళలలో అకస్మాత్తుగా బరువు పెరగడం,  ముఖం పై మొటిమలు రావడం,  అవాంఛిత రోమాలు అతిగా పెరగడం,  నెలసరి సరిగా రాకపోవడం,  ఆలస్యంగా నెలసరి వస్తే అది తొందరగా తగ్గకపోవడం,  నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం వంటి లక్షణాలు పిసిఓయస్ ను సూచిస్తాయి. నిజానికి పిసిఓయస్ అనేది వ్యాధి కాదు.  ఇది శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది.  ఇది సాధారణంగా పెద్ద తీవ్రత లేకుండా ఉంటుంది.   మహిళలను కొన్ని రోజులు అసౌకర్యానికి గురి చేస్తుంది. కానీ కొన్నిసార్లు మాత్రం ఇది విశ్వరూపం చూపిస్తుంది.  పిసిఓయస్ కారణంగా మహిళలలో ఇతర వ్యాధులు కూడా వస్తాయి.  ఇవి మహిళలకు చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. మహిళలు పిసిఓయస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అవి ప్రాణాంతక వ్యాధులను ప్రేరేపిస్తుంది.  వాటిలో ముఖ్యమైనది మధుమేహం.  చిన్న వయసులోనే మహిళలకు మధుమేహం రావడంలో పిసిఓయస్,  హార్మోన్ల అసమతుల్యత ప్రధాన కారణం.   పిసిఓయస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.  పిసిఓయస్ లో బరువు పెరగడం అనే సమస్య ప్రధానంగా ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది క్రమంగా ఊబకాయంకు దారితీస్తుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా పిసిఓయస్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల వస్తుంది. మహిళలలో మానసిక సమస్యలు కూడా పిసిఓయస్ కారణంగా వస్తాయి.  సాధారణంగానే మహిళలలో హార్మన్ల మార్పు జరిగే పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్,  చిరాకు, కోపం, అసహనం వంటివి వస్తుంటాయి.  అలాంటిది పిసిఓయస్ సమస్యలో ఈ హార్మోన్ల అసమతుల్యత చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇది మానసిక సమస్యలు ఎక్కువగా కలిగిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా పిసిఓయస్ ఉన్న మహిళలు గర్బం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈ సమస్య తగ్గే వరకు గర్భం దాల్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి గర్భం దాల్చే ప్రయత్నాలు చేసే మహిళలు పిసిఓయస్  లేకుండా చూసుకోవాలి. పరిష్కారాలు.. పిసిఓయస్ సమస్యకు ఒక నిర్ణీత వైద్యం అంటూ లేదు. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్య కాబట్టి మహిళలు హార్మోన్లు తిరిగి బ్యాలెన్స్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి.  అదేవిధంగా ఆహారంలో ప్రోటీన్లను చేర్చుకోవాలి. ఆకుకూరలు బాగా తినాలి. ఆహారం విషయంలోనే కాదు.. ఆహారం తినడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తం ఆహారం తినకుండా చిన్న చిన్న మొత్తాలను ఎక్కువ సార్లు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది పిసిఓయస్ తగ్గించడానికి సహాయపడుతుంది.                                              *రూపశ్రీ.

ప్రతి అమ్మాయి తన జీవితంలో బోలెడు సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది, వాడుతుంది కూడా.  అయితే అమ్మాయిల జీవితంలో సాధారణ దశలు వేరు.. గర్బవతులుగా ఉండే దశ వేరు.  ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భానికి హాని కలిగించే ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గర్భవతులకు హాని కలిగించే వాటిలో బ్యూటీ ఉత్పత్తులు కూడా ఉంటాయి. కొన్ని రకాల బ్యూటీ ఉత్పత్తులు గర్బంలో పెరుగుతున్న శిశువుకు హాని కలిగిస్తాయి. పుట్టుక లోపాలు రావడానికి కారణం అవుతాయి.   ఏ బ్యూటీ ఉత్పత్తులు గర్భవతులకు హాని చేస్తాయంటే.. రెటినోల్ కలిగిన ఉత్పత్తులు.. రెటినోల్ ఉత్పత్తులలో విటమిన్-ఎ ఉంటుంది.  ఇది ముడతలు,  మొటిమలు రాకుండా చేస్తుంది.  అయితే ఈ రకమైన ఉత్పత్తులు గర్బధారణ సమయంలో వాడితే కడుపులో బిడ్డకు హాని చేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్.. సాలిసిలిక్ యాసిడ్ అనే రసాయనం  మొటిమలు తొలగించడం కోసం ఉపయోగించే క్రీములలో ఉంటుంది.  డాక్టర్ల సలహా లేకుండా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న క్రీములు వాడటం మంచిది కాదు. హైడ్రోక్వినోన్.. చర్మాన్ని కాంతివంతం చేయడానికి హైడ్రోక్వినోన్ ఆధారిత క్రీములు వాడతారు. గర్భాధారణ సమయంలో దీన్ని వాడితే పిల్లలలో ఎదుగుదల మందగిస్తుంది. థాలేట్స్.. థాలేట్స్ అనే రసాయం ఎక్కువగా నెయిల్ పాలిష్,  సబ్బులు, హెయిర్ స్ప్రే వంటి అనేక ఉత్పత్తులలో ఉంటుంది.  ఇది పిండంలో హార్మోన్ల మార్పులు రావడానికి కారణం అవుతుంది. గర్భవతులు వీటికి దూరంగా ఉండాలి. ఆక్సిబెంజోన్, ఆక్సినోక్సేట్.. ఆక్సిబెంజోన్,  ఆక్సినోక్సేట్ అనే రసాయనాలు సన్ స్క్రీన్ లో ఉంటాయి.  ఇవి హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతాయి.  ఈ రసాయనాలు  లేని సన్ స్క్రీన్ ను గర్భవతులు ఉపయోగించాలి. అసిటోన్.. అసిటోన్ అనే రసాయనం నెయిల్ పాలిష్ లో ఉంటుంది.  గర్భిణీ స్త్రీలు నెయిల్ పాలిష్ వేసుకోవడానికి, దాని వాసనకు దూరంగా ఉండాలి.  ఇది చాలా హానికరం. విటమిన్-ఇ.. వైద్యుల ప్రకారం గర్భధారణ సమయంలో విటమిన్-ఇ టాబ్లెట్లు తీసుకోకూడదు.  ఇది మెదడుపై ప్రబావం చూపిస్తుంది.                                                *రూపశ్రీ.  

మహిళలు గర్బం దాల్చడంలో మరింత గొప్ప ఫలితాలు పొందాలంటే ఈ టెస్ట్ బెస్ట్..   గర్బం దాల్చడం, తల్లి కావడం ప్రతి ఆడపిల్ల కల. కానీ దురదృష్టవశాత్తూ  ప్రస్తుతకాలంలో 12నుండి 15శాతం జంటలు  పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భార్యాభర్తల ఇద్దిరలోనూ పిల్లలు పుట్టడంలో తగినంత సామర్థ్యం లేకపోవడం వల్ల  చాలామంది పిల్లల కోసం వైద్యుల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. లోపం ఎవరిలో ఉన్నా అది ప్రత్యక్షంగా మహిళల మీదే  కనిపిస్తుంది. కానీ చాలామంది మహిళలు గర్భం దాల్చడంలో  అవకాశాలు ఉన్నా కూడా విఫలమవుతుంటారు. దీనికి కారణం మహిళలకు గర్బం ధరించే సమయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో సరిగా అవగాహన లేకపోవడం. అయితే ఇప్పుడు దీన్ని కనుక్కోవడం సులభం. దీని వల్ల మహిళలు గర్బం ధరించే అవకాశాలు 20 నుండి 25శాతం ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎలా కనుక్కోవాలి? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. గర్భం దాల్చడానికి అద్బుతమార్గం.. మహిళలలో గర్బం దాల్చే అవకాశాలు  అండాలు విడుదల అయ్యే సమయంలో ఎక్కువగా ఉంటాయి. మూత్ర పరీక్ష ద్వారా అండోత్సర్గ పరీక్ష చేయించుకోవచ్చు.  ఈ అండోత్సర్గ పరీక్ష కిట్ సాధారణ మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. లేదా దీన్ని వైద్యుల పర్యవేక్షణలో కూడా చేసుకోవచ్చు.  సాధారణంగా మహిళలలో ఋతుచక్రం  28రోజులుగా ఉంటుంది. చివరిసారి ఋతుక్రమం ప్రారంభమైన 11వ రోజున ఈ పరీక్షను చేసుకోవాలి. అండాలు విడుదల కావడానికి మూడు నుండి ఐదు రోజుల ముందు ఈ పరీక్షను చేసుకోవాలి.  ఈ పరీక్షలో టెస్ట్ కిట్ రంగు మార్పు కనబడితే మరొక 24నుండి 36గంటలలో అండాలు విడుదల కావడం ప్రారంభమవుతుందని అర్థం. దీన్ని అర్థం చేసుకుని భార్యాభర్తలు సంభోగంలో పాల్గొంటే ఆ సమయంలో మహిళలు గర్బం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండోత్సర్గానికి ఐదు రోజుల ముందు నుండి అండోత్సర్గము తర్వాత చాలా గంటల వరకు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఈ కాలాన్ని ఫెర్టిలిటీ విండో అంటారు.  అండోత్సర్గము కాలం గురించి తెలుసుకోవడానికి  అల్ట్రాసౌండ్ కూడా  చేయవచ్చు లేదా ఋతు చక్రానికి సంబంధించిన హార్మోన్ల స్థాయిలను తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష చేయించుకోవచ్చు.  ఇంకొక మార్గం ఏమిటంటే  గర్భాశయ శ్లేష్మం పర్యవేక్షణ సహాయంతో  అండోత్సర్గము కాలాన్ని కూడా తెలుసుకోవచ్చు. అండాలు పర్ఫెక్ట్ గా విడుదల అయ్యే సమయాన్ని తెలుసుకోవడానికి ఈ మార్గాలు  ఉన్నాయి. ఇవే కాకుండా  పీరియడ్ ట్రాకింగ్ యాప్ ద్వారా కూడా దీన్ని తెలుసుకోవచ్చు.  గర్భం దాల్చాలనుకుంటే లేదా చాలా కాలంగా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే,  వైద్యుని సలహా,  సహాయంతో ఈ మూత్రం అండోత్సర్గము పరీక్షను చేయవచ్చు. ఈ పరీక్ష సహాయంతో అండోత్సర్గము గురించి సమాచారాన్ని పూర్తీగా అర్థమవుతుంది కూడా.  తద్వారా  తొందరలోనే  గర్భం దాల్చవచ్చు.                                                             *నిశ్శబ్ద. 

మహిళలలో PCOS, PCOD సమస్యలు తగ్గించే మూలికలు ఇవి..!   ఈ రోజుల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOD లేదా PCOS) మహిళల్లో అత్యంత సాధారణ సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహారం,  జీవనశైలి కారణంగా PCOD,  PCOS సమస్యలు పెరగుతున్నాయి. ఇది కాకుండా మహిళల్లో అనేక హార్మోన్ల మార్పులు కూడా కారణమవుతాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య గర్భధారణ సమయంలో మహిళల్లో కనిపిస్తుంది. 16 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. చాలా సార్లు ఈ వ్యాధి గురించి మహిళలకు కూడా తెలియదు. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అండాశయాలలో గడ్డలు ఏర్పడతాయి.  వీటిని  సిస్ట్ అని పిలుస్తాము. ఇవి ఉంటే  గర్భం నేరుగా ప్రభావితమవుతుంది. అయితే జీవనశైలిని మార్చుకోవడం,  కొన్ని మందుల ద్వారా దీనిని నియంత్రించవచ్చు.  అలాగే కొన్ని రకాల మూలికలు తీసుకోవడం వల్ల కూడా  ఈ సమస్యలు తగ్గుతాయి. తిప్పతీగ.. ఈ మధ్యకాలంలో  తిప్పతీగ  మొక్క చాలా వైరల్ అవుతోంది. ఆయుర్వేదంలో తిప్పతీగ  చాలా ప్రభావవంతమైన మూలికగా పరిగణించబడుతుంది. తిప్పతీగ  తీసుకోవడం   PCOSని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఎక్కువ ఆండ్రోజెన్ ఉత్పత్తి అయినప్పుడు మగ హార్మోన్లు పెరగడం ప్రారంభిస్తాయి. అలాంటి పరిస్థితిలో ఈ హార్మోన్లను సమతుల్యం చేయడంలో తిప్పతీగ  సహాయపడుతుంది. దాల్చినచెక్క..   శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగకుండా దాల్చిన చెక్క నిరోధిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో బరువు తగ్గుతారు.  ఇది PCOS రోగులకు సహాయపడుతుంది. పుదీనా.. PCOSలో  పుదీనా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది.  శరీరంలో అధిక జుట్టు పెరుగుదలను తగ్గిస్తుంది. అతిమధురం.. ఆయుర్వేదంలో అతిమధురం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అతిమధురం తీసుకోవడం వల్ల అండోత్సర్గ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది.                                                 *రూపశ్రీ.

45 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి ఫాలో కావాలి..!   ప్రతి మహిళను అడిగినా తన వయసు ఉన్నదాని కంటే 5 నుండి 10 ఏళ్లు తక్కువ గా చెప్తుంది.  అయితే ఇది కొందరికి బాగా సెట్ అవుతుంది. కానీ మరికొందరికి సెట్ కాదు. ఎందుకంటే శరీరాన్ని చూసి కొందరు వయసు తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా చెప్పేస్తుంటారు.  అయితే ఎంత వయసు వచ్చినా యవ్వనంగా కనిపించాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు.. కానీ దానికి తగిన జీవినశైలి,  ఆహారపు అలవాట్లు, యవ్వనంగా కనిపించేలా చేసే చిట్కాలు పాటించకపోవడమే తప్పు.  ఈ కింద ఉన్న టిప్స్ పాటిస్తే 45 ఏళ్లు దాటినా స్కూల్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లలు ఉన్నా హ్యాపీగా యూత్ లాగా కనిపించవచ్చు.   మహిళలు ఇంట్లో ఆహారాన్ని వండినప్పుడు కొన్ని ఆహారాలు మిగిలిపోతాయి. దానిని పారేసే బదులు దానిని మరుసటి రోజు తినడం చాలామంది మహిళల అలవాటు. కానీ  ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటిరోజు  తినడం     రోగనిరోధక శక్తికి,  పేగు ఆరోగ్యానికి చాలా హానికరం.  యవ్వనంగా కనిపించాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ఉదయం నుండి రాత్రి వరకు తాజా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. రోజుకు 4 లీటర్ల నీరు త్రాగితే బరువు తగ్గడానికి,  ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణ కోసం అనువుగా ఉంటుంది.   నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీరు త్రాగవలసిన అవసరం లేదు. కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు త్రాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు.  చర్మాన్ని మెరిచేలా, యవ్వనంగా ఉంచుకోవచ్చు. ఆహారాన్ని తీసుకునే విధానాన్ని ఆయుర్వేదం మూడు ముక్కలలో చెప్పింది.  ఉదయం భోగి లాగా,  మధ్యాహ్నం యోగి లాగా,  రాత్రి రోగి లాగా ఆహారం తీసుకోమని చెబుతుంది.  అంటే ఉదయం బాగా తినవచ్చు. అది రోజంతా పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం బోజనం మితంగా తినాలి. భోజనంలో కార్బోహేడ్రేట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నియంత్రణలో పెట్టాలి. ఇక రాత్రి సమయంలో చాలా తేలికగా తినాలి. రాత్రి నిద్రించే సమయం కాబట్టి బరువుగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. రోజూ 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వ్యాయామం చేయడం వల్ల  ఆరోగ్యంగా యవ్వనంగా ఉండవచ్చు. కానీ చాలామంది  వర్కవుట్ చేయడానికి సమయం ఉండదని చెబుతుంటారు. కానీ  ఈ అలవాటు భవిష్యత్తులో అనేక వ్యాధులకు దారి తీస్తుంది.  మహిళలు ఎంత బిజీగా ఉన్నా, 24 గంటలలో మీ కోసం అరగంట నుండి 45 నిమిషాల సమయం కేటాయించుకోవాలి.  తేలికపాటి వ్యాయామం చేయవచ్చు, వాకింగ్ చేయవచ్చు, యోగా చేయవచ్చు లేదా బరువులను ఎత్తవచ్చు. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.  ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.                                                *రూపశ్రీ.

మహిళలలో మెనోపాజ్ సమయంలో వచ్చే నిద్రలేమికి భలే పరిష్కారాలు.!   ఆడవారి జీవితంలో ప్రతి దశలోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. 10 నుండి 15 ఏళ్ల మద్య మొదలయ్యే ఋతుచక్రం 40ఏళ్లు వచ్చేవరకు ఉంటుంది. ఆ తరువాత ఋతుచక్రం ఆగిపోతుంది. అన్నేళ్లు శరీరంలో క్రమానుసారంగా సాగిన ఈ ప్రక్రియ ముగిసిపోవడం కారణంగా మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యలలో నిద్రలేమి ప్రధానంగా ఉంటుంది. సరిగా నిద్రలేకపోవడం, కలత నిద్ర, తలనొప్పి, శరీరంలో అసౌకర్యంగా అనిపించడం, హార్మోన్ సమస్యల కారణంగా నిద్ర సమస్యలు వస్తాయి. దీన్ని పరిష్కరించడానికి ఈ కింది చిట్కాలు సహాయపడతాయి. మెగ్నీషియం.. శరీరంలో స్కిరాడియన్ సైకిల్ లేదా సహజ గడియారం నియంత్రణ కోల్పోయినప్పుడు కండరాల కదలిక ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. మెగ్నీషీయం తీసుకోవడం ద్వారా కండరాలు సడలించబడతాయి, నిద్ర గడియారం కంట్రోల్ లోకి వస్తుంది. నిద్ర బాగా పడుతుంది. అల్లం, జీడిపప్పు, బాదం, నువ్వులలో మెగ్నీషియం బాగుంటుంది. విటమిన్-ఇ మెనోపాజ్ సమయంలో శరీరంలో వేడి ఆవిర్లు పుడుతుంటాయి. రాత్రి సమయంలో చెమటలు కూడా పడతాయి.  విటమిన్-ఇ  శరీరానికి లభించేలా చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, కొబ్బరి, అవిసె గింజలు, పిస్తాపప్పులలో విటమిన్-ఎ సులభంగా దొరుకుతుంది. ఒమెగా-3 ఒమెగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు మానసిక కల్లోలాన్ని, నిద్రలేమి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.  చేపలు, సజ్జలు, బార్లీ, మొక్కజొన్న, రాగులు  మొదలైన వాటిలో ఒమెగా-3 లభ్యమవుతుంది. సోయా ఉత్పత్తులలో ఐసోప్లేవోన్ లు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ ను అనుసరిస్తాయి. శరీరంలో వేడి ఆవిర్లు తగ్గించడం, ఋతుక్రమం ఆగిపోయినప్పుడు కనిపించే లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల సోయా ఉత్పత్తులు వాడితే నిద్ర నాణ్యత బాగుంటుంది.                                        *నిశ్శబ్ద.

షుగరింగ్, వ్యాక్సింగ్.. అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి  ఏ పద్దతి మంచిదంటే!   అవాంఛిత రోమాలు అమ్మాయిల అందాన్ని పాడుచేస్తాయని నమ్ముతారు. అందుకే ఏదో విధంగా అవాంఛిత రోమాలను తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలా అవాంఛిత రోమాలను తొలగించడానికి ఉపయోగించే పద్దతులలో షుగరింగ్, వ్యాక్సింగ్ కూడా ముఖ్యమైనవి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది? అమ్మాయిలకు ఏదైతే సేప్ గా ఉంటుంది? చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెబుతున్నారో ఓ లుక్కేస్తే.. షుగరింగ్.. షుగరింగ్ అనేది మధ్యప్రాచ్యంలో ఉద్భవించిన పురాతన  పద్దతి. అవాంఛిత రోమాలను తొలగించడంలో  ఇది సహజమైన పద్దతి.  షుగరింగ్ పేస్ట్‌ను రూపొందించడానికి చక్కెర, నిమ్మరసం,  నీటిని  ఉపయోగిస్తారు. దీన్ని చిక్కని పాకంలా సిద్దం చేస్తారు. దీన్ని అవాంఛిత రోమాల మీద ఉంచి గట్టిగా వెంట వెంటనే  లాగడం వల్ల   అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. షుగరింగ్ ప్రయోజనాలు..  ఈ పేస్ట్ సాధారణంగా సహజ పదార్ధాలను కలిగి ఉంటుంది.  ఇది సున్నితమైన చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది. షుగరింగ్ వాక్సింగ్ కంటే తక్కువ చికాకును కలిగిస్తుంది.  ఎందుకంటే ఇది జుట్టును మాత్రమే తొలగిస్తుంది, చర్మానికి అతుక్కుపోదు. ఈ పేస్ట్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. జుట్టు తొలగింపు ప్రక్రియ తర్వాత సున్నితంగా,  మృదువుగా ఉంటుంది. చాలా మందికి  వ్యాక్సింగ్ కంటే షుగరింగ్  తక్కువ నొప్పి కలిగిస్తుంది. షుగరింగ్ గురించి కొన్ని నిజాలు.. షుగరింగ్ చేయడం నైపుణ్యంతో కూడినది. ఇది చేయడం రాకపోతే ఫలితాలు వేరేగా ఉంటాయి.   వ్యాక్సింగ్ తో పోలిస్తే షుగరింగ్ ఖరీదైనది. వ్యాక్సింగ్.. వాక్సింగ్ అనేది చర్మంపై వేడిచేసిన మైనపు పొరను అప్లై చేయడం.   అది గట్టిపడిన తరువాత జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో లాగుతారు.  దీనివల్ల చర్మం మీద అవాంఛిత రోమాలు తొలగించబడతాయి. వాక్సింగ్  ప్రయోజనాలు..  వాక్సింగ్ పెద్ద మొత్తంలో జుట్టును త్వరగా తొలగించగలదు.  ఇది జుట్టు తొలగింపును తొందరగా  తొలగించడంలో సమర్థవంతమైన ఎంపికగా మారుతుంది. వాక్సింగ్ షేవింగ్‌తో పోలిస్తే దీర్ఘకాలిక ఫలితాలను అందిస్తుంది. ఎందుకంటే ఇది రూట్ నుండి జుట్టును తొలగిస్తుంది. వాక్సింగ్ కిట్‌లు వాడుకోవడానికి సులభంగా అందుబాటులో ఉంటాయి. వ్యాక్సింగ్ గురించి కొన్ని నిజాలు.. వాక్సింగ్ అనేది షుగరింగ్  కంటే ఎక్కువ బాధాకరంగా ఉంటుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి మంచిది కాదు. ఇది జుట్టుకు ,  చర్మానికి  రెండింటికీ అతుక్కుని ఉంటుంది. వ్యాక్సింగ్ వల్ల చర్మం ఎరుపుగా మారుతుంది. దీనివల్ల చికాకు పెట్టి ర్యాషెస్ కూడా వస్తాయి.  కొందరికి  వ్యాక్సింగ్ కు ఉపయోగించే  మైనపులోని పదార్ధాల కారణంగా  అలెర్జీ వస్తుంది.   ఇది చర్మం చికాకు,  అసౌకర్యానికి దారితీస్తుంది.                                             *నిశ్శబ్ద.

ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపం ఉన్నట్టే..! శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల పోషకాలు అవసరం.  వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు తప్పనిసరిగా ఉంటాయి.  భారతదేశంలో చాలామంది మహిళలు అనీమియా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  అనీమియా అనేది హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి.  హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉండటానికి ఐరన్ లోపం ప్రధాన కారణం.  ఆడవారి శరీరంలో ఐరన్ లోపం ఉందా లేదా అనే విషయం వారికి నెలసరి సమస్యలు ఎదురైనప్పుడో లేదా జ్వరం లాంటి సమస్యలు వచ్చి రక్తపరీక్ష చేయించుకున్నప్పుడో బయటపడుతూ ఉంటుంది.  అలా కాకుండా ప్రతి మహిళ తనకు ఐరన్ లోపం ఉందా లేదా తెలుసుకోవాలంటే తమ శరీరంలో కొన్ని లక్షణాలు గమనించుకోవాలి.  ఐరన్ లోపం ఉంటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే.. చాలామంది మహిళలు ఎప్పుడూ అలసటగా ఉందని కంప్లైంట్ చేస్తుంటారు. ఆహారం ఎంత తీసుకున్నా నీరసంగా ఉన్నట్టు,  బలహీనంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు.  దీనికి కారణం ఐరన్ లోపించడమే. ఐరన్ లోపిస్తే శరీరంలో కణజాలాలకు, కండరాలకు ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది.  ఈ కారణంగా బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. మహిళలు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి వైద్యులను కలిసినప్పుడు చాలామంది వైద్యులు చేసే మొదటి పని మహిళల కళ్లు గమనించడం. కనుగుడ్డు కింది భాగంలో కనిపించే చర్మం రంగును బట్టి మహిళలో ఐరన్ లోపాన్ని, హిమోగ్లోబిన్ శాతాన్ని అంచనా వేస్తారు. అంతేకాదు ఐరన్ లోపం ఉన్న మహిళల చర్మం పాలిపోయి, వడలిపోయినట్టు ఉంటుంది. ఏ చిన్న పని చేసినా ఎంతో శ్రమ చేసినట్టు ఫీలయ్యే మహిళలు ఉంటారు.  దీనికి కారణం ఐరన్ లోపించడమే.  ఐరన్ లోపించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది. దీనివల్ల తొందరగా అలసిపతారు.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు. గుండె సమర్థవంతంగా పని చేయాలంటే ఆక్సిజన్ సరఫరా బాగుండాలి. కానీ ఆక్సిజన్ సరఫరా బాగుండేందుకు కావలసిన ఐరన్ లోపించినప్పుడు ఆక్సిజన్ సరఫరా మందకొడిగా సాగుతుంది.  దీని కారణంగా గుండె సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.  ఇది గుండె దడ,  గుండె పనిచేయడంలో ఆటంకాలు, కొన్ని సార్లు రక్తాన్ని పంప్ చేయడంలో అంతరాయం ఏర్పడి గుండె పోటు వంటి సమస్యలు కూడా వస్తాయి. మెదడు సమర్థవంతంగా పని చేయాలంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగుండాలి. కానీ మెదడుకు ఆక్సిజన్ సరఫరా లోపిస్తే అప్పుడు మెదడు నరాల మీద ఒత్తిడి ఏర్పడుతుంది.  ఇది తలనొప్పికి కారణమవుతుంది.  ఐరన్ లోపించడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని సార్లు మైకం కూడా కలగవచ్చు. ఐరన్ లోపం ఉన్న మహిళలలో గోర్లు పెళుసుగా ఉంటాయి.  గోర్లు తెల్లగా కనిపించడం,  సున్నితంగా ఉండటం.  ఏమాత్రం తడి తగిలినా లేదా గోర్లను ఏవైనా తెరవడానికి ఉపయోగించినా గోర్లు చాలా సులభంగా విరిగిపోతుంటాయి. చాలామంది మహిళలకు తమ జుట్టు ఎందుకు రంగు మారుతోందో,  ఎందుకు పలుచగా అవుతోందో తెలియని గందరగోళంలో ఉంటారు. ఐరన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అంతేకాదు జుట్టు బాగా రాలిపోవడం, రాగి రంగులో ఉండటం,  తొందరగా తెల్లబడటం కూడా జరుగుతుంది.                                                    *రూపశ్రీ.