కోవిడ్ ఇక ఎండమిక్.. అయినా జాగ్రత్తలు తప్పని సరి!

కోవిడ్ ఇంక ఎంత మాత్రం పెండమిక్ కాదని, అది ఎండమిక్ స్టేజికి చేరుకుందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. గత ఆరు వారాలుగా కొవిడ్‌ కేసుల సంఖ్య   గణనీయంగా పెరిగిందనీ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.  కోవిడ్ ఎండమిక్‌ దశకు చేరుకుందని,   కొవిడ్‌ కూడా ఓ సీజనల్‌ వ్యాధిగా మారిపోయిందని ఆయన వివరించారు. ఒక వేళ ఎవరిలోనైనా కోవిడ్ లక్షణాలు ఉంటే  5 రోజులు క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందన్నారు. కరోనా లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేద స్పష్టం చేశారు.  డబ్ల్యూహెచ్‌వో కొత్త నిబంధనల ప్రకారం లక్షణాలు లేనివారికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదన్నారు.  కొవిడ్‌ సోకి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే ఆస్పత్రిలో చేరాలన్నారు. ప్రస్తుతం భారీవర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.  ఆహారం, నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన  బ్యాక్టిరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని..  వర్షాలు పడే సమయంలో అత్యంత అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.  

స‌ల్మాన్  పెళ్లి  త‌ర్వాతే  నాదీ!

మీరు ఫోటోలో చూస్తున్న చిన్న క‌ళ్ల  లావుపాటి వ్య‌క్తి  పేరు తెంజెన్ ఇమ్నా అలాంగ్‌. ఆయ‌నేమీ  ఫైట‌ర్ కాదు.  ఆయ‌న నాగాలాండ్ విద్యాశాఖ మంత్రి! పాపం ఇంకా పెళ్లి కాలేదు! ఆయ‌న‌కు వొళ్లంతా వెట‌కార‌మే.  నాలుగు మాట‌లు మాట్లాడితే మూడు మాట‌లు ఎదుటివాడు పొట్ట‌చెక్క‌ల‌య్యేట్టు స‌ర‌దా క‌బురే వుంటుంది.   ఇంత‌టి స‌రదా లావుపాటి వ్య‌క్తి కి నిజంగానే అంతే స‌ర‌దా స‌తీమ‌ణి వుంటుంద‌ని చాలామంది భావించా రు. అంత‌టితో ఆగ‌లేదు..గూగుల్లో ఆమె ఎవ‌ర‌ని తెగ సెర్చ్ చేశార‌ట‌! ఈ  సంగ‌తి తెలిసి,  అలాంగ్‌.. అబ్బే వెత‌క్కండి, నాకింకా పెళ్లే కాలేదు  నేనూ త‌గిన అమ్మాయి కోసం వెదుకుతున్నా! అని ట్వీట్ చేశారు.  చిత్ర‌మేమంటే అలాంగ్ ట్వీట్ షాదీ డాట్ కామ్ నిర్వాహ‌కుడు అనుప‌మ్ మిట్ట‌ల్ దృష్టిలో  ప‌డింది. అయ్యో.. ఈయ‌న‌కు మ‌నం త‌ప్ప‌కుండా ఓ అమ్మాయిని చూడాల్సిందే అనుకున్నారు. అదే  హిందీలో ట్వీట్ చేశారాయ‌న‌. దీనికి మామూలుగా యువ‌కులైతే ఎగిరి గెంతేసి. మీ పుణ్యం వుంటుంది మంచి అమ్మా యిని చూడండి.. ఇవీ నా వివ‌రాలు అంటూ తెగ ఆవేశ‌ప‌డేవారు. కానీ అలాంగ్ మ‌రో విధంగా స్పందించా రు.  బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ భాయ్ పెళ్లాడిన త‌ర్వాత‌నే నేనూ చేసుకుంటాను.. అని ట్వీట్  చేశారు నాగాలాండ్ మంత్రిగారు. ..భాయ్ ఫిల్హాల్ బిందాస్ హై.. భాయ్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నా.. అన్నారు అలాంగ్‌.   ఇంకాస్త స‌ర‌దాగానూ అన్నారిలా.. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, జనాభా పెరుగుదల సమస్య ల పట్ల వివేకంతో ఉండి, సంతాన సాఫల్యతపై సమాచార ఎంపికలను పెంపొందించుకుందాం. లేదా నాలాగే ఒంట‌రిగా క‌లిసి వుందాం,  కలిసి మనం స్థిరమైన భవిష్యత్తుకు తోడ్పడవచ్చు. ఈరోజే  సింగిల్స్ ఉద్యమంలో చేరండి అని రాశారు. అంతకుముందు,  ఒక బహిరంగ ప్రసంగంలో  చిన్న కళ్ళు కలిగి ఉండటం వల్ల  కలిగే  ప్రయోజనాలపై అలాంగ్ చేసిన వ్యాఖ్య  సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈశాన్య ప్రాంత ప్రజలు  ఇప్పటికీ ఎదు ర్కొంటున్న సాధారణ  జాత్యహంకారాన్ని పిలుస్తూ అతని వ్యాఖ్య చిరునవ్వులను పంచింది. నా  కళ్లలోకి తక్కువ ధూళి చేరుతుంది. అలాగే, నేను వేదికపై ఉన్నప్పుడు, సుదీర్ఘ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను సులభంగా నిద్రపోతాను, అని అలోంగ్ చెప్పాడు.

సొంత ఓటు ఒక్కటీ లేదు.. ఆయినా ఓట్లన్నీ ఆమెకే!

చిత్రం. నిజంగా ఇదొక విచిత్రం. ఆంధ్ర ప్రదేశ్’ అసెంబ్లీలో బీజేపీకి చోటు లేదు. ఒక్క ఎమ్మెల్యే అయినా లేరు, అసెంబ్లీలో ఆ పార్టీ  బలం సున్నా. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ, ఏపీ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేదు, నిన్నమొన్నటి వరకు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన రాజ్యసభ సభ్యులు ఇద్దరు ముగ్గురున్నా, ఇప్పడు వారి పదవీ కాలం ముగిసిపోవడంతో, పార్లమెంట్ ఎగువ దిగువ సభల్లో, ఏ సభలోనూ  ఏపీ బీజేపీకి ఎంట్రీ లేదు.  రాష్ట్రంలో ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ ఏదీ లేదు. అధికార, ప్రతిపక్షాలలో  (వైసీపీ, టీడీపీ)ఏదీ బీజేపీ మిత్ర పక్షం కాదు, మిత్ర పక్షం జనసేన పార్టీది   కూడా బీజేపీ పరిస్థితే .. ఒక్క ఎంపీ లేరు. ఒక్క ఎమ్మెల్యే లేరు. రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజిలో బీజేపీ, జనసేన పార్టీలలో దేనికీ ఓటు లేదు.   అయినా, రాష్ట్రపతి ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజిలోని ఓట్లలో ఒక్క ఓటు బీరు పోకుండా, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ కూటమి ఖాతాలో చేరుతున్నాయి. అధికారికంగానా, అనదికారకంగానా అనేది పక్కన పెడితే అధికార వైసీపీ, ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్మకు అడగక ముందే మద్దతు తెలిపింది. ఇప్పుడు తాజాగా, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కూడా ఎన్డీఎ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. సో ... రాష్ట్రం నుంచి పోలయ్యే ప్రతి ఓటు ముర్ము ఖాతాలో చేరుతుంది. భారత రాజకీయాల్లో ఇదొక విధంగా విచిత్ర పరిస్థితి. గతంలోనూ, ఒక రాష్ట్రంలో ఉన్నమొత్తం ఓట్లు ఒకే అభ్యర్ధికి పోలైన సందర్భాలు ఉంటే ఉండవచ్చును, కానీ, రాష్ట్రంలో ఓటే లేని పార్టీ / కూటమి అభ్యర్ధికి గంప గుత్తగా ఓట్లన్నీ పోలుకావడం, బహుశా రాష్ట్రపతి ఎన్నికల చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చును.  అదొకటి అలాఉంటే, జూలై 18 జరిగే ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికలకు సమబందించి కొన్ని ఆసక్తి కర పరిణామాలు అయితే, చోటు చేస్కున్నాయి, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జూన్ 14 న, కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూలు ప్రకటించింది. అయినా, ఎన్డీఅభ్యర్ధి ఎవరైనా గెలుపు ముందుగానే ఖరారై పోవడం వలన, గెలుపు ఓటముల గురించి, పెద్దగా చర్చ జరగలేదు. అయితే, అధికార, విపక్షాల అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలైన తర్వాత చిత్ర విచిత్ర పరిణామాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక ఒక ప్రహసంగా సాగింది. ఒకటో కృష్ణుడు, రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు ఇలా ఒక్కొక్క పేరు తెర మీదకు వచ్చి తప్పుకుంటూ పోయింది. చివరకు, యశ్వంత్ సిన్హా ఉమ్మడి అభ్యర్ధిగా తెర మెడకు వచ్చారు.   అయితే, బీజేపీ/ఎన్డీఎ గిరిజ మహిళ, ద్రౌపతి ముర్ముపేరును ప్రకటించిన తర్వాత, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్న పార్టీలు ఒకటికటిగా సారీ అంటూ చేయి వదిలేస్తున్నాయి. ముర్ముకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ముందుగా అనుకున్న విధంగానే ఏ కూటమిలోనూ లేని వైసీపీ, బీజేడీ (కారాణాలు ఏవైనా) ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. కానీ ప్రతిపక్ష కూటమిలోని పార్టీలో కూడా ఒకటొకటిగా జారిపోతున్నాయి, చివరకు యశ్వంత్ సిన్హా స్వరాష్ట్రం ఝార్ఖండ్’ లో అధికారంలో ఉన్న యూపీఏ భాగస్వామ్య పార్టీ  జేఎంఎం ముర్ముకు మద్దతు ప్రకటించింది. యశ్వంత్ సిన్హా స్వరాష్ట్రమే కాదు, సొంత పార్టీ, టీఎంసి కుడా, ఆయనను దూరంగానే ఉంచుతోంది.  ఆయన పేరును వెనకుండి ముందుకు తెచ్చిన టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ కూడా, యశ్వంత్ సిన్హాకు హ్యాండ్ ఇచ్చే సంకేతాలు ఇచ్చారు. ద్రౌపతి ముర్ము పేరు ముందే ప్రకటించి ఉంటే, అసలు యశ్వంత్ సిన్హాను బరిలో  దించక పోదుమని, పరోక్షంగా, ముర్ముకు మద్దతు ఇచ్చే సంకేతాలు ఇచ్చారు. అంతే కాకుండా గెలిచే అవకాశాలు ఎండీఎ అభ్యర్ధికే ఉన్నాయని, యశ్వత్ సిన్హాను పోటీ నుంచి గౌరవప్రదంగా తప్పుకుంటే ఉత్తమం అనే సలహా ఇచ్చారా అన్నట్లుగా, మరో విధంగా సిన్హాను అవమానించే విధంగా ఓ ప్రకటన చేశారు. ప్రచారం పేరున బెంగాలుకు రావద్దని అన్నారు. చివరకు శివసేన రెండు వర్గాలు, బీజేపీ హార్డ్కోర్ శత్రు పక్షం  ఎస్పీ, ఎస్పీ చీలిక వర్గం ఎస్బీఎస్పీ , బీఎస్పీ, గోవాలో కాంగ్రెస్ చీలిక వర్గం ఇలా ఒకటికటిగా పార్టీలు, ముర్ముకు మద్దతు తెలుపుతున్నాయి. చివరకు కాంగ్రెస్ పార్టీలోనూ యశ్వంత్ సిన్హా కు సంపూర్ణ మద్దతు లభించే పరిస్థతి లేదని అంటున్నారు.  తెలంగాణలో పర్యటనలో యశ్వంత్ సిన్హా  తెరాస, కాంగ్రెస్ రాజకీయ వైరుధ్యాల కారణంగా కాంగ్రెస్ పార్టీని కలవకుండానే వెనక్కు వెళ్ళిపోయారు.  ఇలా ఓ వంక ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు క్యూకట్టి ఎన్డీఎ అభ్యర్ధు ద్రౌపతి ముర్ముకు జై కొడుతున్నాయి. మరోవంక మద్దతు ఇస్తున్నపార్టీలు ఏవీ కూడా ఆయన్ని సొంతం చేసుకుంటున్నట్లు లేదు. తెరాస వంటి కొన్ని పార్టీలు ఇంకా యశ్వంత్ సిన్హా’కు మద్దతు తెలుపుతున్నా,చివరకు ఆత్మ ప్రభోధమే అందరి నినాదం అయ్యేలా వుందని అంటున్నారు. నిజానికి  యశ్వత్ సిన్హాకు గెలుపు మీద ఎప్పుడూ ఆశలు లేవు.. కానీ, ఓటమి ఏ స్థాయిలో ఉంటుంది అనేదే, ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

వలసలు, అసంతృప్తి రాగాలు.. టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి

ఎనిమిదేళ్లు ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు వలసలు, అసమ్మతి రాగాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఒక వైపు పార్టీని వీడుతున్న నేతలు, మరో వైపు తమ అసమ్మతిని బహిర్గతం చేస్తున్న నాయకులతో టీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముందు వెనుకలాలోచించకుండా  ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఇతర పార్టీల వారికి తలుపులు బార్లా తెరిచేసిన ఫలితమే ఇప్పుడు ఈ పరేషాన్ అని తెరాస వర్గాలే అంటున్నాయి. పార్టీ నిర్మాణం నుంచీ తెరాలలో ఉండి ఆటుపోట్లు తట్టుకుని రాటు తేలిన టీఆర్ఎస్ నేతలకు ఇప్పడు పార్టీలో పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. అసహనం, అసంతృప్తి వారిలో పెల్లుబుకుతోంది.  ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి పెద్ద పీట వేసి, కేసీఆర్  తమను నిర్లక్ష్యం చేశారన్న ఆవేదనలో ఉన్న వారు పార్టీ తరఫున గట్టిగా నిలబడే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా అని ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి టీఆర్ఎస్ లో అందలం ఎక్కి పదవులు అనుభవిస్తున్న వారు రేపు ఎన్నికలలో పార్టీ అటూ ఇటూ అయితే టీఆర్ఎస్ ను అంటిపెట్టుకు ఉంటారా అంటే అదీ అనుమానమేనని వారు అభిప్రాయపడుతున్నారు.   ప్రస్తుతం మొదటి నుంచీ టిఆర్ఎస్ లో ఉన్న నాయకులకు.. మధ్యలో వచ్చి చేరి పదవుల అందలాలు అందుకున్న నాయకులకు మధ్య సయోధ్య కొరవడింది. అదే సమయంలో పార్టీ అగ్రనాయకత్వం వీరిని సమన్వయపరచడంలో పూర్తిగా విఫలమైంది.  ఫలితంగా రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం తీసుకున్నా.. అక్కడ రెండు మూడు గ్రూపులు ఏర్పడి.. ఒక గ్రూపుతో మరో గ్రూపునకు వైరుధ్యం, విభేదాలతో పార్టీలో సఖ్యత కొరవడిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతానికి చాలా చోట్ల ఈ అసంతృప్తి, అసమ్మతి నివురు గప్పే ఉన్నా.. ఎన్నికల నాటికి నివురు తొలగిపోయి అసంతృప్తి జ్వాలలు, అసమ్మతి అగ్ని రాజుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  అసెంబ్లీ టిక్కెట్టు ఆశావాహులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు తమతమ వర్గాలను బలోపేతం చేసుకోవడానికే పరిమితం కావడం లేదనీ, తమకు పోటీ వస్తారని భావిస్తున్న వారిని బలహీన పరిచేందుకు వ్యూహాలు పన్ను తున్నారనీ, అందుకే నియోజకవర్గాలలో గ్రూపు తగాదాలు రోడ్డున పడుతున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ప్రత్యర్థులు పార్టీలో తమను ఎదగనివ్వరన్న నిర్ధారణకు వచ్చేసిన వారు మాత్రం ఎన్నికల సమయం వరకూ ఆగడం ఎందుకన్న భావనతో పార్టీని వీడుతున్నారు.  ముఖ్యంగా తాండూరు, కొల్లాపూర్, మహేశ్వరం, భువనగిరి, నకిరేకల్, జనగాం, ఉప్పల్, మేడ్చెల్, ఆర్మూర్, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోనూ పార్టీలోని ఆశావాహులు శరవేగంగా పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీదారుడిని వెనుకకు నెట్టి టిక్కెట్టు తెచ్చుకోవడంపైనే దృష్టిసారించారు. ఈ మారు అసెంబ్లీ టిక్కెట్టు కోసం ఆశావాహుల్లో పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నది. దీంతో ఈ పాటికే తాండూరులో నేనే పోటీచేస్తానని, తనతో  పాటు తన  సోదరుడు కూడా పోటీ చేస్తారనే ధీమాను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. భువనగిరిలోనూ చింతల వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారు. నకిరేకల్ లో వేముల వీరేశం కూడా టిక్కెట్టు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు బహిరంగంగా చర్చకు రావాలని సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉప్పల్ నియోజకవర్గంలో బొంతు రామ్మోహన్ తానే అభ్యర్థినంటూ విస్తృత ప్రచారం ప్రారంభించేశారు. ఇలా చాలా నియోజకవర్గాల్లోని ఆశావాహులు పోటీదారులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా తామే అభ్యర్థులమంటూ బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు.  ఇవిలా ఉంటే.. దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, రెండు మార్లు టీఆర్ఎస్  నుంచి కార్పొరేటర్ గా గెలిచి కూడా పార్టీలో గుర్తింపు దక్కడం లేదంటూ సొంత గూటికి అంటే కాంగ్రెస్ గూటికి చేరారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కూడా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.  మొత్తం మీద టీఆర్ఎస్ లో ఆల్ ఈజ్ వెల్ కాదు.. ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న వాతావరణం కనిపిస్తున్నది. ముందు ముందు రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ముర్మూకి టిడీపి మ‌ద్ద‌తు.. సందిగ్ధంలో బిజెపి

సామాజిక న్యాయం విషయంలో రాజకీయపార్టీలు  కట్టుబడి వుండాలి.  రాజకీయపార్టీలు తమ సిద్ధాంతా న్ని ప్రచారం చేసుకోవడంతోపాటు అభ్యర్ధి  ఎన్నిక విషయంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి తమ ప్రత్యేకతను చాటుకుంటాయి. ఇపుడు తెలుగు దేశం పార్టీ తాను సామాజిక న్యాయానికి కట్టుబడి వుందన్న ది మరోసారి రుజువు చేసుకుంది. రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్దిగా బిజెపి కూటమి ప్రకటించిన  ద్రౌపది ముర్ముకి తెలుగు దేశంతో పాటు వైసీపీ కూడా మద్దతు తెలపాల్సి వచ్చింది. కారణం ముర్మూ సామాజికంగా వెనుకబడిన గిరిజన తెగకు చెందినవారు  కావడమే. ఆమెను రాష్ట్రపతిగా చూడాలన్న ఆకాంక్ష క‌లిగి వుండ‌డ‌మే తెలుగుదేశం మ‌ద్ద‌తు నిచ్చి వుండ‌వ‌చ్చు.  ఒక్క‌సారి గ‌తంలోకి వెళితే, 2014 లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదంటూ ఆగ్ర‌హించి తెలుగుదేశం ఎన్‌డిఏ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చింది. బిజెపి వ‌ర్గాలు టిడిపిని అప్ప‌టి నుంచి శ‌తృవుగానే చూస్తున్నాయి. కానీ ముర్మూ అభ్య‌ర్ధిత్వం విష‌యంలో చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం బిజెపి వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచి వుండ‌వ‌చ్చు. త‌మ‌తో అనేకాంశాల్లో విభేదించిన బాబు ఇప్ప టి నిర్ణ‌యం బిజెపి వ‌ర్గాల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. బిజెపితో అంట‌కాగుతున్న వైసీపీ మ‌ద్ద‌తు నిచ్చిన అభ్య‌ర్ధిని టిడీపీ అంగీక‌రించ‌డం వూహించ‌ని ప‌రిణామ‌మే. ఎన్డీయే లేదా విపక్ష కూటమి తమ మద్దతు కోరిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని టీడీపీ  భావిస్తూ వచ్చింది. లేకుంటే తటస్థంగా ఉండాలనే ఆలోచన ఒక దశలో చేసింది.  కానీ, ఎన్నికలకు కేవలం వారం మాత్రమే సమయం ఉన్న తరుణంలో రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము అమరావతికి రానున్న‌ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ప్రతి పాదించిన గిరిజిన మహిళ ముర్ముకు మద్దతు గా నిలవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ ముర్ముకు మద్దతు ప్రకటిం చింది. రాష్ట్రపతి ఎంపిక సమయంలో ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్  సీఎం జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని పేర్ని నాని  అధికారికంగా వెల్లడించారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో  వైసీపీ మద్దతు కోరలేదంటూ కొందరు బీజేపీ రాష్ట్ర నేతలు చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని ఈ విధంగా  సమా ధానం ఇచ్చారు. అయితే కేంద్ర మంత్రి షెకావత్ సైతం వైసీపీ మద్దతు కోరామని స్పష్టత ఇచ్చారు. కానీ చంద్రబాబు మద్దతు మాత్రం బీజేపీ కోరలేదు.అయినా చంద్రబాబు ఎన్డీఏకు మద్దతు తెలిపింది.  ఇది బిజెపి నాయ‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కానీ సామాజిక న్యాయం ప‌ట్ల ఎంతో న‌మ్మకాన్ని టిడీపీ ఈ విధంగా ప్ర‌క‌టించింద‌న్న‌ది ప్ర‌జ‌లు గుర్తించారు.  2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏయేకు దూరం అయిన చంద్రబాబు తిరిగి ఇప్పుడు ఎన్డీయే అభ్యర్ధికి మద్ద తు ప్రకటించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గతంలోనూ ఏపీలో కీలకంగా ఉన్న టీడీపీ, వైసీపీ ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన రామ్ నాధ్ కోవింద్ కు మద్దతిచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. టీడీపీ తొలి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో చెప్పా రు. 2014 ఎన్నికలు సమయంలో టి.డి.పి.,బి.జె.పి జనసేన కలిసి పోటిచేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా తెలుగుదేశం పార్టీ కూట‌మి  నుంచి  బయటకి  వచ్చేసింది. 

పేర్ని నానిది ఫస్ట్రేషనేనా?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తాజా మాజీ  మంత్రి పేర్ని నానీ  వ్యాఖ్యలు, వాటికి కౌంటర్‌గా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు,  ట్వీట్  కౌంటర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.  వైసీపీలోని కొందరు మరీ ముఖ్యంగా  పేర్ని నాని  వంటి వారు నోటి విరోచనాలతో బాధపడుతున్నారని నాగబాబు ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. పేర్నికి ఇప్పుడు కావలసింది తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమేననీ, బందరులో   వైద్యుడు ఉంటే.. ఆయన నోటి విరోచనాలకు మందు ఇవ్వాలని కోరుతున్నాననీ నాగబాబు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.   అదే సమయంలో జనసేనానిపై పేర్ని నాటి వ్యాఖ్యలపై కూడా  నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్లీనరీలో ఇష్టారీతిన మాట్లాడి జగన్ వద్ద మార్కులు కొట్టేయడానికి చేసిన ప్రయత్నం ఫ్లాప్ అయ్యిందని పేర్ని నానిని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఎంత తాపత్రేయపడినా నానికి మార్కులు పడలేదనీ, మరో తాజా మాజీ మంత్రి అనీల్ కుమార్ జగన్ వద్ద గుడ్ విల్ సంపాదించేశాడన్న దుగ్ధతోనే, ఫ్రస్ట్రేషన్ తోనే   ప్లీనరీ ముగిసిన 24 గంటల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చి మరీ పవన్ కల్యాణ్ మీద ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.    2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో నవరత్నాలంటూ ఇచ్చిన హామీలు నకిలీవని ఇప్పుడు తేలిపోవడం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. మీడియా సమావేశంలో పేర్ని నాని జనం జగన్ ను నమ్మారు, నమ్మారంటూ పదేపదే చెప్పడాన్ని కూడా ప్రశ్నించి ఎద్దేవా చేస్తున్నారు. నిజంగా జగన్ ను జనం నమ్మి ఉంటే  ప్రశాంత్ కిశోర్ వ్యూహాల అవసరమేమిటని ప్రశ్నించారు.  ఇటీవల బందరులో స్థానిక ఎంపీ బాలశౌరి పర్యటనను అడ్డుకొనేందుక నీ రైట్ హ్యాండ్ స్థానిక కార్పొరేటర్‌, నీ కుమారుడి జాన్ జిగ్రీ దోస్త్‌ను ఎగదోసి... ఆ తర్వాత జగన్, సజ్జల చేత అక్షింతలు వేయించుకొన్న పేర్ని నాని,   తాడేపల్లి ప్యాలెస్ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వద్ద ఘొల్లు మని ఏడ్చింది నిజంకాదా అని నిలదీస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో బందరులో తన గెలుపు సాధ్యం కాదని ముందే తెలుసుకున్ననాని, ఓటమి బలిపీఠంపై కుమారుడు  పేర్ని కిట్టును నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు 

విదేశీచ‌దువు ఆశావ‌హుల‌కు జ‌గ‌న్ అడ్డంకి

చ‌క్క‌గా చ‌దువుకునేవారికి ప్ర‌భుత్వం ఆర్ధిక సాయం అందించ‌డం, విదేశీ చ‌దువుల‌కు వెళ్లేవారికి ఆర్ధిక మ‌ద్ద‌తుతో ధైర్యాన్నివ్వ‌డం ఏ ప్ర‌భుత్వ‌మైనా చేస్తుంది, చేయాలి. కానీ జ‌గ‌న్ స‌ర్కారు ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. విదేశీ విద్యా దీవెన అని గొప్ప పేరు పెట్ట‌డంతోనే స‌రిపెట్టుకుంది. బిసీ, ఎస్సీ, ఎస్టీ విద్యా ర్ధుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని స‌మాచార‌శాఖ ద్వారా భారీ ప్ర‌చార‌మే చేయించుకుంది. అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. కానీ నిబంధ‌న‌ల‌ను ప‌రిశీలిస్తే అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది. గ‌తంలో చంద్ర బాబు హ‌యాంలో వున్న విదేశీ విద్యాప‌థ‌కాన్ని జ‌గ‌న్ స‌ర్కారు పూర్తిగా అట‌కెక్కించింది. ఈ పథకం ద్వారా ఎవ రికీ ప్రయోజనాలంద కుండా నిబంధనలు కఠినతరం చేసింది. 200 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ యూనివర్సిటీ ల్లో సీట్లు పొందిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ఉత్తర్వుల్లో మెలిక పెట్టింది. ఒకప్పుడు పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కలగా ఉన్న విదేశీ విద్యను చంద్రబాబు ప్రభుత్వం సాకా రం చేసింది. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, స్వీడన్‌, నెదర్లాం డ్స్‌, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, రష్యా, ఫిలిప్పీన్స్‌, కజకిస్థాన్‌, చైనా దేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిం చారు. ప్రారంభంలో రూ.10 లక్షలు ఉన్న సాయాన్ని ఆ తర్వాత రూ.15 లక్షలకు పెంచారు. ఏడాదిలో రెండుసార్లు విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చి, 2016-17 విద్యా సంవత్సరం నుంచి విద్యా ర్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. ఎన్టీఆర్‌ విదేశీ విద్యా దరణ పథకం కింద 2016-17 నుంచి మూడేళ్ల పాటు 1707 మంది బీసీ విద్యార్థులకు రూ.104 కోట్ల సాయం చేశారు. 2017-18 నుంచి ఈబీసీ విద్యార్థులకు పథకం వర్తింపజేసి, 783 మందికి రూ.16 కోట్లు చెల్లించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు శాచురేషన్‌ విధానంలో అమలు చేశారు. మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా క్రిస్టియన్‌, ముస్లిం మైనారిటీలకు, కాపు కార్పొరేషన్‌ ద్వారా కాపు విద్యార్థులకు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందించారు కానీ ప్ర‌స్తుత  ప్రభుత్వం ప్రచారం కోసమే తప్ప, ఈ పథకం పేద వర్గాలకు ప్రయోజనం కల్పించేందుకు కాదనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా మెరిట్‌ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్‌ కల్పిస్తుంది. వంద‌ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ లోపు వర్సిటీల్లో సీట్లు పొందితే 100 శాతం ఫీజు చెల్లిస్తుం ది.  వంద‌ నుంచి 200 ర్యాంకింగ్స్‌ యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ చేస్తుంది. ప్రతిఏటా సెప్టెంబరు-డిసెంబరు, జనవరి-మే మధ్య అర్హులను గుర్తిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.   తాజాగా జగన్‌ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 200 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యా దీవెన పథకం వర్తిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 200 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ వర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకే  అంటూ మెలిక పెట్టింది. నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ప్రభుత్వం అందించే సాయం బడుగులకు అందదని చెబుతున్నారు. ఆ స్థాయి వర్సిటీల్లో సీట్లు పొందే విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం వర్తించే పరిస్థితి లేదని విమర్శిస్తున్నా రు. 200 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ వర్సిటీల్లో సీట్లు సంపా దించుకునే విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్ షిప్‌లు అందించాల్సిన అవసరం లేదని, పలు కార్పొరేట్‌ సంస్థలు, యూనివర్సిటీలే స్కాలర్‌షిప్‌లు అందిస్తా యని అభిప్రాయపడుతున్నారు. 

బాతుల‌కు తిండిపెట్టి కొంప‌మీద‌కి తెచ్చుకున్నారు!

ఒక్క‌క్క‌ళ్ల‌కి ఒక్కో స‌ర‌దా. కొంద‌రు కుక్క‌పిల్ల‌ల్ని, మ‌రికొంద‌రు ప‌క్షుల్ని పెంచుకుంటూంటారు. కానీ  పదవీ విరమణ చేసిన ఒక  జంట టెక్సాస్‌లోని సైప్రస్‌లో ఏకంగా తమ ఇంటిని కోల్పోయే ప‌రిస్థితి ఏర్పడింది.  ఎందుకంటే వారు తమ పొరుగున ఉన్న బాతులను పోషించినందుకు దావాను ఎదుర్కొంటు న్నారు. జార్జ్, కాథ్లీన్ రోవ్‌లపై లేక్‌ల్యాండ్ కమ్యూనిటీ హోమ్ ఓనర్స్ అసోసియేషన్ వారి పొరుగువారి నుండి ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత వారి నివాసాలకు బాతులు నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించిన తర్వాత దావా వేసింది, హ్యూస్టన్ క్రానికల్ నివేదించింది. సమాజంలోని ఏదైనా వన్యప్రాణులకు ఆహారం ఇవ్వడం మానేయమని దంపతులను ఆదేశించాలని దావాలో కోర్టును కోరింది. అటార్నీ ఫీజులకు అనుగుణంగా వారి యూనిట్‌ను తీసుకురావడంలో అయ్యే ఖర్చుల కోసం వారి ఆస్తిపై తాత్కా లిక హక్కును కోరింది. బాతులు తమ నివాసాలపై మలవిసర్జన చేశాయని, వాటి ముక్కులతో తోటలను చిందరవందర చేసినట్లు ఫిర్యాదు చేసిన ఇంటి యజమానులు పేర్కొన్నారు. కమ్యూనిటీ అసోసియేషన్ యొక్క పిటిషన్ 250,000 డాల‌ర్ల‌ కంటే ఎక్కువ జ‌రిమానా కోరుతోంది. రోవ్స్ అపరిశుభ్రమైన, అనారోగ్యకరమైన లేదా అపరిశుభ్రమైన ప‌నుల్లో నిమగ్నమై ఉన్నారని దావా పేర్కొంది. వారి చర్యలు పొరుగువారి  నిబంధనను ఉల్లంఘించాయని  ఇది హానికరమ‌ని లీగల్ పేపర్ పేర్కొంది. కమ్యూనిటీలో, ఉమ్మడి ప్రాంతంలోని వన్యప్రాణులకు నిరంతరం లేదా అలవాటుగా ఆహారం ఇవ్వడం ద్వారా ప్రతివాదులు  నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు అని దావా పేర్కొంది.  ఇంకా , కాథ్లీన్ ఎ. రోవ్, అటువంటి కార్యకలాపాలు నిషేధించామ‌ని తెలియజేసినప్పటికీ అటువంటి ప‌నులను నిలిపి వేయడా నికి అంగీకరించినప్పటికీ, సాధారణ ప్రాంతంలో పదే పదే బాతులను తింటాడని దావా పేర్కొంది. జరిగిన నష్టాన్ని సరిచేయడానికి సరిపడా డబ్బును అభ్యర్థించడంతో పాటు, బాతులకు ఆహారం ఇవ్వడం మానేయమని ఆ జంటను ఆదేశించాలని లేక్‌ల్యాండ్ కమ్యూనిటీ గృహయజమానుల సంఘం కోర్టును కోరుతోంది. రుసుము చెల్లించడంలో విఫలమైతే, ప్రతివాదుల ఆస్తిని జప్తు చేయడానికి కూడా అసోసియే షన్ అధికారాన్ని కోరుతుంది. అయితే, హ్యూస్టన్ క్రానికల్ ప్రకారం, ఈ జంట దావా కోసం పోరాడుతున్నం దున అసోసియేషన్ ఆరోపణలను తిరస్కరించారు.

అన్నా డీఎంకేలో చీలిక వెనుక బీజేపీ

అన్నాడీఎంకేలో ఇరువురు నేతల మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడడానికి వెనుక బీజేపీ ఉందా అన్న అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య విభేదాల కారణంగా పార్టీ నిట్టనిలువుగా చీలిపోయినట్లేనని అంటున్నారు. ఆ ఇరువురి మధ్యా విభేదాల కారణంగా అన్నాడీఎంకే పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందనీ, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదనీ అంటున్నారు. ఈ స్థితిలో రాష్ట్రంలో అధికార డీఎంకే కు దీటుగా నిలిచే పార్టీ కానీ, స్టాలిన్ కు దీటైన నాయకుడు కానీ లేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయితే అన్నాడీఎంకే దయనీయ స్థితికి చేరడానికి కారణం బీజేపీయేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయలలిత మరణానంతరం పార్టీకి దిశ, దశ లేని స్థితిలో కూడా పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు సమన్వయంతో, సంయమనం పాటించి పార్టీని చీలిక ముప్పు నుంచి కాపాడారు. శశికళ పార్టీని చీలిక వైపుగా నడిపినా ఈ ఇరువురి వల్లా ఆ పరిస్థితి తలెత్తలేదని, అయితే ఇప్పుడు మాత్రం పార్టీ విపక్షంలో ఉన్న నేపథ్యంలో ఇరువురూ విభేదాలతో విడిపోయే పరిస్థితి రావడం వెనుక ఉన్నది కచ్చితంగా బీజేపీయేననీ చెబుతున్నారు. ముఖ్యంగా పన్నీర్ సెల్వం ను పార్టీ నుంచి బహిష్కరించడమంటే జయలలిత విధేయులను పార్టీకి దూరం చేసే వ్యూహానికి తెరతీయడమేనని అంటున్నారు. అమ్మ (జయలలిత)కు వీరవిధేయుడైన పన్నీర్ సెల్వంకు  పార్టీలో మంచి పలుకుబడే ఉంది. సంయమనం పాటించడం, పార్టీ ప్రయోజనాల కోసం తగ్గి ఉండటంతో పార్టీలో ఆయన పట్ల సానుభూతి కూడా ఉంది. ఇప్పుడు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆ కారణంగానే పన్నీర్ సెల్వం బహిష్కరణకు గురి కాగానే వారంతా పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో అన్నాడీఎంకేలో చీలిక అధికారకంగా ధృవపడినట్లైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీలు పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి విదితమే. ఎన్నికలలో ఓటమి తరువాత అన్నాడీఎంకేలో చీలిక రాజకీయాలకు బీజేపీ తెరతీసిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తమిళ నాట ఏదో ఒక ప్రాంతీయ పార్టీ పంచన నిలవడం వినా బీజేపీకి ఇప్పటి వరకూ ఒక ఉనికి, ఒక స్థానం లేదన్న సంగతి విదితమే. అయితే జయలలిత మరణం తరువాత నుంచీ అన్నాడీఎంకేలో సంభవించిన ప్రతి పరిణామం వెనుకూ కమలం హస్తం ఉంది. శశికళను పార్టీకి దూరం చేయడం దగ్గర నుంచీ.. పళని స్వామి, పన్నీర్ సెల్వం మధ్య సయోధ్య వరకూ ప్రతి విషయంలోనూ బీజేపీ జోక్యం ఉందన్నది బహిరంగ రహస్యమే.  ఇప్పుడు అన్నాడీఎంకేలో గ్రూపు విభేదాలు తారస్థాయికి చేరి పార్టీ చీలిపోయే పరిస్థితి ఉత్పన్నమైనా బీజేపీ మౌనం వహించడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. గతంలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు అడగకపోయినా జోక్యం చేసుకున్న బీజేపీ ఇప్పుడు మిత్రపక్షంగా ఉండి కూడా చోద్యం చూస్తూ కూర్చోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు ప్రధాన ప్రతిపక్షం గ్రూపు తగాదాలతో కుదేలై.. కొట్టుకు చస్తున్న పరిస్థితిలో ఉంటే.. మరో వైపు బీజేపీ రాష్ట్రంలో తానే ప్రధాన పక్షం అన్న రీతిలో వ్యవహరిస్తున్నది.   మాజీ ఐపీఎస్ అధికారి, అన్నాడీఎంకే నుంచి బీజేపీలో చేరిన   అన్నామలైను తమిళనాడు బీజేపీ చీఫ్ గా నియమించి అన్నాడీఎంకే క్యాడర్ ను కమలం గూటికి ఆకర్షించే ఆపరేషన్ కు తెరలేపింది. త్వరలో రాష్ట్రంలో అన్నాడీఎంకే  బీజేపీ ఆక్రమించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని పరిశీలకులు అంటున్నారు.

ఉక్రేనియన్ శరణార్ధులకు ఇటలీ మాజీ-మాఫియా ఆస్తి

ఎవ‌ర‌యినా ధ‌నికులు త‌మ అనంత‌రం ఆస్తిని అనుభ‌వించ‌డానికి వార‌సుల‌కు రాసేస్తారు. ఇది సాధార ణంగా మ‌నం చూస్తున్న‌ది, వింటున్న‌ది. ఇట‌లీలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జ‌రిగింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆరంభ‌మైన‌ప్ప‌టినుంచీ ల‌క్ష‌మంది శ‌ర‌ణార్ధులకు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌త ఇట‌లీ ప్ర‌భుత్వం మీద ప‌డింది. మున్ముందు మ‌రింత‌మంది రావ‌చ్చున‌ని అంటున్నారు. అయితే వీరంద‌రికి నివాసాలు, తిండి, నీరు స‌మ‌కూర్చ‌డానికి ప్ర‌భుత్వం కొత్త ఆలోచ‌న చేసింది. ఇట‌లీలో మాజీ మాఫీయా లకు చెందిన 40వేలకుపైగా నివాసాలను ప్ర‌భుత్వం లాగేసుకుని శ‌ర‌ణార్ధ కేంద్రాలుగా మార్చింది. మాఫియా డాన్‌ల వ‌ల్ల దేశానికి  ప్ర‌యోజ‌నం లేక‌పోగా భారీ న‌ష్ట‌మే వుంటుంది. ఈ కార‌ణంగా వారి ఆస్తులు, నివాసాల‌ను అక్క‌డి ప్ర‌భుత్వం తెలివిగా శ‌ర‌ణార్ధుల‌ను ఆదుకోవ‌డానికి ఉపయోగించ‌డానికి త‌ల పెట్టింది. ఇటీవ‌లి కాలంలో ఇంత‌టి గొప్ప నిర్ణ‌యం ఏ దేశ ప్ర‌భుత్వమూ తీసుకున్న దాఖ‌లాలు లేవు.  తెతియానా ఉక్రెయిన్ బుచా నుంచి యుద్ధ భ‌యంతో పారిపోయింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆరంభ‌మైన వెంట‌నే ఆమే ఉత్త‌ర మిలాన్ రెస్కాల్డినాలో శ‌ర‌ణార్ధిగా త‌ల‌దాచుకుంది. వచ్చిన కొత్త‌ల్లో అక్క‌డా ఇక్క‌డా త‌ల‌దాచుకుని, భ‌యం భ‌యంగానే వుంది. క్ర‌మేపీ ఇటలీ ప్ర‌భుత్వం రాన్‌ఘెటా అనే  క‌లాబ్రియాన్ మాఫియా నివాసాన్ని ఆక్ర‌మించి దాన్ని శ‌ర‌ణార్ధ శిబిరంగా మార్చింది. దీంతో ఆమె ఇపుడు ప్ర‌శాంతంగా ఆ నివాసంలో వుంటోంది. ఆమెను అక్క‌డి ప్రాంతీయ మేయ‌ర్ గిల్లెస్ ఆండ్రె లెలో ఎంతో గౌరవంగా ఆహ్వా నించి అన్ని స‌దుపాయాలు స‌మ‌కూర్చారు. ఆమె కుటుంబం ఇపుడు ఆమెతోనే వున్న‌ది, నిర్భ‌యంగా. ప్ర‌భుత్వం 2020లో మాజీ మాఫీయాల‌కు సంబంధించిన 1.5 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంది. సొర్బోలో మెజానీలో 144 పెద్ద పెద్ద నివాసాల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుని శ‌ర‌ణార్ధుల‌కు నీడ నిస్తోంది. ఇటువంటి గొప్ప నిర్ణ‌యాలు ప్ర‌పంచ దేశాల్లో కూడా పాటించితే ఎంత బావుంటుందో క‌దా!

ఏపీలో బీజేపీ వ్యూహం ఇదేనా?

దక్షిణాదిలో పాగా వేయాలన్న బీజేపీ ఆకాంక్షలకు ఇక్కడి ప్రాంతీయ పార్టీలు పెద్ద అవరోధంగా నిలిచాయి. దక్షిణాదిలో ఒక్క కర్నాటక  తప్ప మరే ఇతర రాష్ట్రంలోనూ బీజేపీ తన ఉనికిని బలంగా చాటుకోవడంలో విఫలం అయ్యింది.  ఇప్పుడిప్పుడు తెలంగాణ ఒకింత బలోపేతమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయినా అక్కడ అధికారం చేపట్టేందుకు ఆ పార్టీ ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా బీజేపీకి గట్టి పోటీనిచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు   తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అడ్డుపడటమే కాకుండా కేంద్రంలోని మోడీపై తీవ్ర స్థాయి విమర్శలతో కాలుదువ్వుతున్నారు. అదే సమయంలో మరో తెలుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎలాంటి ఉనికి, పునాదీ లేకపోయినా.. కేంద్రంలో అధికారంలో ఉన్నదన్న ఏకైక కారణంతో.. అవసరాలేమైతేనేం సీఎం జగన్ మాత్రం మోడీ ప్రతి కార్యక్రమానికి, ప్రతి విధానానికీ మద్దతు ఇస్తున్నారు.  తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో అధికారంలో ఉన్న  టీఆర్ఎస్ తో బీజేపీ ఎలాగూ ఢీ అంటే ఢీ అనే విధానాన్నే అనుసరిస్తోంది. అయితే ఏపీలో మాత్రం అధికార వైసీపీ మోడీ సర్కార్ తో బహిరంగంగానే రహస్య మైత్రిని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో అధికారం కోసం మోడీ షా ద్వయం ఎటువంటి వ్యూహ రచన చేస్తున్నదన్న విషయంలో పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ మోడీ షా ద్వయం నేతృత్వంలోని బీజేపీ చెబుతున్నప్పటికీ ఇక్కడి అధికార పార్టీతో రహస్య మైత్రి కొనసాగించడంలోని ఆంతర్యంపై పరిశీలకుల అంచనాలు పలు విధాలుగా ఉంటున్నాయి. ఏపీ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల ఆస్త్రాలు సంధిస్తున్నా, వాటికి వైసీపీ నాయకత్వం నుంచి దీటుగా బదులు రావడం లేదు. వైసీపీ సర్కార్ పై యుద్ధమే అంటే ఏపీ బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం అవసరమైన ప్రతి సందర్భంలోనూ జగన్ సర్కార్ కు అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్న ఏపీ సర్కార్ కు నిబంధనల చట్రాలను దాటి మరీ అప్పులకు అనుమతులు ఇస్తోంది. అయితే ఇదంతా మోడీ, షా ద్వయం వ్యూహం మేరకే జరుగుతోందన్నది విశ్లేషకుల బావన. 2019 ఎన్నికలలో ఏపీ నుంచి ఒక్క అసెంబ్లీ సీటు, ఒక్క లోక్ సభ స్థానంలోనూ గెలవలేకపోయిన బీజేపీ, పోటీ చేసిన ఏ స్థానంలోనూ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన బీజేపీ, వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యం అన్న స్థాయిలో బిల్డప్ ఇవ్వడం వెనుక మోడీ, షాల పటిష్ట, పకడ్బందీ వ్యూహమే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.  ఒక పక్కన హస్తినలో దోస్తీ  కలర్‌ ఇస్తూనే మరో పక్కన గల్లీలో మాటల యుద్ధానికి బీజేపీ నేతలు కాలుదువ్వడం వెనుక మోడీ, షాల వ్యూహమే ఉందని అంటున్నారు.   వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఏపీలో బీజేపీకి అధికార పీఠం అందడం అనేది దాదాపు అసాధ్యం, అయినా.. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఎందుకు అంతలా వైసీపీపై రెచ్చిపోయి మాట్లాడగలుగుతున్నారనే సీక్రెట్‌ అందరికీ తెలిసిందే అంటున్నారు. మొన్నామధ్యన కడప జిల్లా బద్వేల్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నకల్లో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టింది. ఇటీవలే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో కూడా అభ్యర్థిని నిలబెట్టింది. కేంద్రంలో తనకే మద్దతిస్తున్న జగన్‌ పార్టీపై రాష్ట్రంలో ఇలా పోటీకి దిగడం వెనుక మోడీ రహస్య ప్రణాళికే ఉందంటున్నారు. అయితే ఆ రెండు ఉప ఎన్నికలలోనూ బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు అది వేరే సంగతి. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే బరిలో దించిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ బేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్థానిక బీజేపీ నాయకత్వం మాత్రమే వైసీపీపై, జగన్‌ పై దూకుడుగా ఉన్నా.. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత జగన్‌ కు కేంద్రం నుంచి కూడా వరుస ఝలక్ లు తప్పవని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.   కాగా.. వరుసగా రెండు సార్లు జాతీయ స్థాయిలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి ఈ సారి ఎన్నికల్లో గతంలో కంటే ఎంపీ స్థానాలు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. ఆ లోటును పూడ్చుకునేందుకు బీజేపీ అధినాయకత్వం దక్షిణాదిపై దృష్టి సారించిందంటున్నారు. తమిళనాడులో బీజేపీ ఆటలు ఎలాగూ సాగవు. కేరళలో కూడా ఇంచు మించు అదే వాతావరణం ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్‌ తో విభేదించే వైఖరితో ఎన్నికలకు వెళ్లేందుకే సిద్ధమైంది. తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో కచ్చితమైన అంచనా లేకపోవడంతో ఇక.. మిగిలి దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.   అందుకే ఇక్కడ అటు  జనసేనతోనూ.. ఇటు అదికార వైసీపీతోనూ కర్ర విరగాకూడదు. పాము చావా కూడదన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయానికి ఏ పార్టీతో కలిసి పోటీ అన్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించే వరకూ వైసీపీతో హస్తినలో దోస్తీ, ఏపీలో కుస్తీ అన్న విధానాన్నే అవలంబిస్తుందనీ, అలాగే జనసేనతో కూడా మైత్రికి కటీఫ్ చెప్పకుండా కొనసాగిస్తుందనీ అంటున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి ఏ పార్టీ అధిక ఎంపీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తుందో ఆ పార్టీలో కలిసి రంగంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు. కేసుల కారణంగా జగన్ బలహీనతను అడ్డు పెట్టుకుని అత్యథిక స్థానాలు బేరం ఆడే అవకాశం ఉంటుందన్నది బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచనగా కనిపిస్తుందంటున్నారు. ఎంపీ సీట్లతో పాటు చెప్పుకోదగ్గ అసెంబ్లీ స్థానాలలో కూడా జగన్ బలహీనతను అడ్డు పెట్టుకుని సాధించుకోవచ్చన్న వ్యూహంతోనే బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్రం ఏపీ సర్కార్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని అంటున్నారు. 

గూడు మ‌రిచిన పావురం!

ఒక డెబ్బ‌య్యేళ్ల పెద్దాయ‌న త‌న స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. చాలాసేపు క‌బుర్లాడుకున్నారు. త‌ర్వాత ఇంటికి అని బ‌య‌లు దేరాడు. కానీ దారి మ‌ర్చిపోయాడు. ఆ సంగ‌తి గ్ర‌హించి ఆయ‌న స్నేహితుడి కొడుకు కార్లో ఇంటి ద‌గ్గ‌ర దింపి మ‌రీ వెళ్లాడు. ఇది మ‌తిమ‌రుపున‌కు ప‌రాకాష్ట‌.. అంటూ మ‌న‌వ‌రాలు అంద‌రికీ చెబుతూ తెగ న‌వ్వుకుంది ఓ పూటంతా. పిల్ల‌ల‌కు, విన్న‌వాళ్ల‌కు స‌ర‌దాగా, న‌వ్వులాట‌గానే వుంటుంది. కానీ వ‌య‌సు పెరిగే కొద్దీ వ‌చ్చే మ‌తిమ‌రుపు తాలూకు బాధ అనుభ‌విస్తేగాని వివ‌రించ డం చాలా క‌ష్టం. మ‌నిషంటే మ‌ర‌చిపోయాడు, పావురం మ‌ర‌చిపోవ‌డ‌మేమిటి?  ప‌క్షులు చాలా దూర‌మూ వెళుతూంటాయి, మ‌ళ్లీ అదే దారిలో తిరిగి వ‌స్తూంటాయి. అది వాటి స‌హ‌జ లక్ష‌ణం. కానీ బ్రిట‌న్‌కి చెందిన ఒక పావురం ఒక‌టీ రెండు కాదు ఏకంగా నాలుగు వేల మైళ్లు దూరం వెళ్లి ఇంటికి దారి మ‌ర్చిపోయింది! ఒక బ్రిట‌న్‌ పావురం యుఎస్‌లో 4,000 మైళ్ల దూరంలో ఎగురుతూ చాలా దూరం వెళ్లింది. చాలాసేప‌టికి అది బ్రిట‌న్‌లోని టైన్‌సైడ్ ప్రాంతానికి వ‌స్తూ ఇంటి దారి కోల్పోయింది. దాన్ని ఆ  తర్వాత ప‌క్షుల సంర‌క్ష‌ణ నిపుణులు గుర్తించి ప‌ట్టుకున్నారు. ఈ రేసింగ్ పక్షి విలువ 1,000 పౌండ్ల కంటే ఎక్కువ అని అధికారులు చెప్పారు. మూడు వారాల క్రితం, ఛానల్ దీవులలోని గ్వెర్న్సీ నుండి హోమింగ్ పావురం బయలుదేరింది. అది ఇంగ్లాండ్ ఈశాన్య ప్రాంతం లోని తన ఇంటికి తిరిగి పోటీ చేయవలసి ఉంది  ప్రయాణం అతనికి 10 గంటలు పట్టింది. అయితే, బహుమతి పొందిన పావురం తప్పిపోయింది  దానికి ఏమి జరిగిందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. బాబ్ అనే పేరున్న ఈ రేసింగ్ పావురం వారం రోజుల క్రితం ఛానెల్ ద్వీపం నుంచి వెళ్లింది. గ‌ట్టిగా ప‌ది గంట‌లు ప‌ట్టింది ఆ  ప్ర‌యాణం. అయితే ఆ పావురం క‌నిపించ‌క‌పోవ‌డంతో చాలామంది అది ఎక్కువ‌గా క‌నిపించే ప్రాంతాల‌న్నీ వెతికార‌ట‌. అది వాస్త‌వానికి ఇంగ్లండ్ ఈశాన్య‌ప్రాంతానికి తిరిగి రావాలి. అది త‌న గూడు వున్న ప్రాంతం. అది వెళ్లిన సంగ‌తీ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అది క‌న‌ప‌డ‌టం లేద‌న్న వార్త గుప్పుమంది. అంతే రోజూ దాన్ని చూస్తూ ఆడుకునే పిల్ల‌లంతా దిగులుప‌డ్డారు.  ఈ మిస్ట‌రీని జూలై ఆరో తేదీన ప‌రిష్క‌రించారు. ఆ రోజు అల‌బామాలోని మాన్రో అనే వూళ్లో ఓ పెద్దాయ‌న తోట‌లో క‌న‌ప‌డింద‌ట‌. ఆ తోట దానికి ఎంతో న‌చ్చిన‌ట్టుంది. అక్క‌డే వుండ‌డానికి ఇష్ట‌ప‌డింది. బాబ్ అని పిలిచే ఈ పావురం కాళ్ల‌కి ఏదో బ్యాండ్ క‌ట్టి వుంది. దానితో ఇది స‌ముద్రానికి అవ‌త‌ల వేపు యునైటెడ్ కింగ్‌డ‌మ్‌కి చెందిన‌ది అని ప‌క్షుల సంర‌క్ష‌ణ విభాగం వారు క‌నుగొన్నారు. అంత దూరం నుంచి వ‌చ్చినా బాబ్ ఆరోగ్యంగానే వుంద‌ని అధికారులు గుర్తించారు. వాస్త‌వానికి ఈ పావురం యుకెలోని విన్ టా లోన్ నివాసి అలాన్ టాడ్‌కి చెందిన‌ద‌ని తేలింది. బాబ్ కొంత దూరం ప్ర‌యాణించిన త‌ర్వాత పొర‌పాటున అట్లాంటా వెళ్లే ఓడ మీద వాలి అలా స‌ముద్రానికి అవ‌త‌లి తీరం వేపు వెళ్లింద‌ట‌! 

సిరిసిల్ల సభలో నిరుద్యోగ డిక్లరేషన్.. వ్యూహాత్మకంగా రేవంత్ అడుగులు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో దూకుడు పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు సీనియర్ల మద్దతు అంతంత మాత్రంగానే లభించింది. లభిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన దూకుడుకు కళ్లెం వేయడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీలో సీనియర్లు చేయని ప్రయత్నం లేదు. అయితే వాటిని పట్టించుకోకుండా ముందుకే సాగుతున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభ విజయంతో పార్టీ హై కమాండ్ కూడా రేవంత్ పై విశ్వాసాన్ని ఉంచింది. సీనియర్ల ప్రయత్నాలను పట్టించుకోకుండా ముందుకు సాగమని భరోసా ఇచ్చిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నారు. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ కు వచ్చిన భారీ స్పందనతో ఈ సారి నిరుద్యోగ డిక్లరేషన్ తో యువతకు దగ్గరవ్వాలన్న వ్యూహంతో రేవంత్ ఉన్నారని చెబుతున్నారు. వరంగల్ సభ విజయవంతం అయిన సందర్భంలోనే రాహుల్ గాంధీ స్వల్ప వ్యవధిలోనే మరో సారి రాష్ట్ర పర్యటనక వస్తానని రేవంత్ కు హామీ ఇచ్చారు. అప్పట్లోనే హై కమాండ్ అండ ఉంటుంది.. దూకుడు తగ్గించొద్దు అన్న హామీని రాహుల్ రేవంత్ కు ఇచ్చారనీ, గో ఎహెడ్ అంటూ భుజం తట్టి ప్రోత్సహించారనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ ఉత్సాహంతోనే ఈ సారి రాహుల్ పర్యటనలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కేసీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహణకు రేవంత్ తలపెట్టారు. కుంభస్థలాన్నే ఢీ కొనే సత్తా రాష్ట్ర కాంగ్రెస్ కు ఉందని చాటడమే లక్ష్యంగా ఆయన సిరిసిల్లను ఎన్నుకున్నారని పరిశీలకులు అంటున్నారు. సిరిసిల్ల సభ వేదికగా నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా యువత కాంగ్రెస్ కు చేరువ అవుతారని రేవంత్ భావిస్తున్నారు. కేసీఆర్ తరువాత పార్టీలో వాగ్థాటి ఉన్న నేతగా.. అలాగే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతున్న కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ టీఆర్ఎస్ ను ఈ సారి ఎన్నికలలో బలంగా ఢీ కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందని చాటడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు. ముందస్తు సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం రాజకీయ డ్రామాలాడుతున్నాయని రేవంత్ విమర్శించారు. ఆ రెండు పార్టీలూ కాదు.. తాము తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన రేవంత్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ కు బీజేపీ అనుమతి ఎందుకు అని ప్రశ్నించారు. దమ్ముంటే ముందస్తుకు వెళ్లాలని ఆయన బీజేపీ, టీఆర్ఎస్ లకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సమయంలోనే మేనిఫెస్టో ప్రకటించి ఊరుకోవడం కాకుండా ముందుగానే మేనిఫెస్టోలో ఏం ఉండబోతున్నాయో డిక్లరేషన్ ల ద్వారా ప్రకటించి ప్రజలలో నమ్మకాన్ని కలిగించే కొత్త వ్యూహానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ తెరలేపారు. వరంగల్ డిక్లరేషన్ ను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా రచ్చబండలు నిర్వహిస్తున్నారు.  సిరిసిల్ల సభలో నిరుద్యోగ డిక్లరేషన్‌ను ప్రకటించి దానిపై కూడా ప్రజాభిప్రాయాన్ని ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని రేవంత్ ఉద్దేశంగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  తెలంగాణ సర్కార్‌పై రైతులు, నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని ఈ డిక్లరేషన్ల ప్రకటనతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేయడమే రేవంత్ వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి

ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం వద్ద వరద నీటితో గోదావరి పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తి వస్తుండటంతో అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వాహక బృందాలను అప్రమత్తం చేశారు.  ఇక కృష్ణా నదికీ వరద ప్రవాహం పెరుగుతుండటంతో కృష్ణా బ్యారేజి నుంచి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నదిలో ప్రయాణాలను నిషేధించారు. వరద నీటిలో స్నానాలు చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. 

పొంగుతున్న వాగులు, వంకలు..గోదావరి మహోగ్రరూపం

తెలంగాణను ముసురు కమ్మేసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో ఎండ పొడ కనిపించనంతగా మబ్బులు కమ్మేశాయి. నింగినీ నేలనూ ఏకం చేస్తున్నట్లుగా వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు వారికి పునరావాస కేంద్రాలలో బస ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులూ, వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఇటీవలి కాలంలో జులై నెలలో ఈ స్థాయిలోవర్షాలు కురిసిన సందర్భం లేదని అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది.   ఎస్సారెస్పీ సహా పలు రిజర్వాయర్లకు   వరద పోటెత్తుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. వరద నీటిని ఎప్పటికప్పుడు కిందికి వదలాలని  ఆదేశించారు. మరో రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల వ్యాప్తంగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో, అప్రమత్తతతో ఉండాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్ననేపథ్యలో ఆయన సోమవారం కూడా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి , అంజయ్య యాదవ్ , కృష్ణ మోహన్ రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి, నోముల భగత్, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, పీసిసిఎఫ్ డోబ్రియాల్, సీఎంఓ కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీఎం వోఎస్డి ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఇఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిజి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం  సిద్దంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై మంత్రులు, ప్రజా ప్రతి నిధులకు ఫోన్ చేసి ఆరా తీశారు. వరద ముప్పు ఉన్న జిల్లాల అధికారులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని.,గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు.  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఎం తగు సూచనలు చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. వరదల నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పాటు జిహెచ్ఎంసీ, మున్సిపల్ ప్రాంతాల పరిధిలో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీములు సహా హెలికాప్టర్ లను సిద్దం చేసుకోవాలని   సీఎస్‌ను ఆదేశించారు.   ప్రాణహిత, ఇంద్రావతి, వంటి గోదావరి ఉపనదులు పొంగి ప్రవహిస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో మూడవ ప్రమాద హెచ్చరిక ప్రకటించిన పరిస్థితిలో రేపు కూడా భద్రాచలం లోనే వుండి పరిస్థితులను ఎప్పడికప్పుడూ పర్యవేక్షించాలని, భద్రాచలం పర్యటనలో వున్న స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఫోన్లో ఆదేశించారు. వరంగల్, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, జనగాం తదితర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు వారి వారి జిల్లా కేంద్రాలు స్థానిక ప్రాంతాలను విడిచి ఎక్కడికీ వెళ్ళొద్దని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు  సీఎం ఆదేశించారు. గోదావరి వరదల నేపథ్యంలో నిజామాబాద్ అదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని, స్ధానిక మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లకు సీఎం ఆదేశించారు. గడ్డెన్న వాగు, స్వర్ణ వాగుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 70 శాతం మేరకు నిర్వహిస్తూ అధిక వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని సీఎం అధికారులను ఆదేశించారు

సినిమాలు, ధార్మిక దీక్షలు, రాజకీయాలు.. జనసేనాని ప్రాధాన్యతలేమిటి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియనేనా?   రాజకీయాలతో పాటు సినిమాలు, ఇప్పుడు ధార్మిక దీక్షలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారా? ఒక వైపు జనసేన కార్యక్రమాలతో ప్రజలలోకి వస్తానంటూనే మరో వైపు సినిమాలతో యమా బిజీగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ధార్మిక దీక్ష చేపట్టి జనాలకు ఏ సంకేతం ఇవ్వాలని భావిస్తున్నారంటూ రాజకీయ వర్గాలలో ఓ చర్చ ఓ లెవల్ లో సాగుతోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. అలాగే భవదీయుడు భగత్ సింగ్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభించడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. అలాగే సముద్ర ఖని దర్శకత్వంలో మరో సినిమాకు సైతం ఓకే చెప్పారు. అదే సమయంలో దసరా నుంచి పూర్తిగా రాజకీయాలకే పరిమితమౌతానంటూ పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు ఉరుము లేని పిడుగులా  పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ధార్మిక దీక్ష చేపట్టారు. తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో పవన్ ఈ దీక్షలో ఉంటారు. ఈ నాలుగు నెలలు కూడా పవన్ చాలా నిష్టగా ఉంటారు. దీంతో ఈ దీక్షలో ఉంటూ పవన్ ఏం చేయబోతున్నారు, షూటింగ్స్, రాజకీయాలు ఎలా నడపబోతున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.   ఈ నాలుగు నెలలపాటు ఒక్కపూట మాత్రమే భోజనం చేయనున్నారు పవన్‌ కల్యాణ్‌. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు, పండ్లను ఆహారంగా తీసుకుంటారు. రాత్రికి శాకాహారం భోజనంతో ఆరోజుకు దీక్షను ముగిస్తారు. ఇలా ప్రతిరోజూ, నాలుగు నెలలపాటు దీక్ష చేయనున్నారు పవన్‌ కల్యాణ్‌. ఆహార నియమాలను అదుపులో ఉంచుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ దీక్ష ఉపయోగపడనుందని చెబుతున్నారు.

బీజేపీ, వైసీపీ లవ్ స్టొరీలో .. ఓ సిల్లీ ట్విస్ట్

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అద్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ స్నేహ సంబంధాలు, అదో రకంగా, కొంచెం చాలా చిత్రంగా ఉంటాయి. అ రెండు పార్టీలు మిత్ర పక్షాలు కాదు. అలాగని శతృ పక్షాలు అసలే కాదు. బీజేపీ సారధ్యంలోని అధికార ఎన్డీఎ కూటమిలో వైసీపీ భాగస్వామ్య పక్షం కాదు. అయినా, బీజేపీ సహా ఎన్డీఎ భాగస్వామ్య పార్టీల నాయకులకంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నాయకులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా’కు ఎక్కువ గౌరవం ఇస్తారు. ఎందుకు ఏమిటీ, అన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి మెడ మీద వెళ్ళాడుతున్న అక్రమాస్తుల కేసులే, అందుకు కారణం.  అందుకే,ఆ రెండు పార్టీల శత్రుమిత్ర సంబంధాల విషయంలో, అప్పుడప్పుదు ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే, ఎవరి రాజకీయం వారిది అయినా, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే విషయంలో మాత్రం, ఎలాంటి మొహమాటం లేకుండా, నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగుతున్నా,అన్న పద్దతిలో రెండు పార్టీలు ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లాగా కలవకుండానే  కలిసి ప్రయాణం చేస్తున్నాయి.అందుకే, రెండు పార్టీలను రాజకీయ విశ్లేషకులు, రహస్య ప్రేమికులుగా అభివర్ణిస్తుంటారు.  వైస్సీపీ ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ కాదు, కానీ, రాష్ట్రపతి ఎన్నికల ప్రకటనకు ముందు నుంచి కూడా, రాజకీయ విశ్లేషకులు వైసీపీ ఓటును ఎన్డీయే ఖాతాలో కలిపే లెక్కలు వేశారు. ఎన్డీయే గెలుపునకు అవసరమైన స్వల్ప వ్యత్యాసాన్ని, వైసీపీ, ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజేడీ భర్తీ చేస్తాయని, సో.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి గెలుపుకు ఢోకా లేదని విశ్లేషకులు బహిరంగ చర్చల్లో పేర్కొన్నారు. అయినా, ఉభయ పార్టీల నాయకత్వం అవునని కానీ, కాదని కానీ, తమ మధ్య ఇంకా చర్చలే జరగలేదని కానీ, ఒక ప్రకటన చేసిన పాపాన పోలేదు. ముఖ్యంగా వైసేపీ నాయకత్వం, అంతేగా, అంతేగా   అన్నట్లుగా మౌనంగా ఉండిపోయింది. మాములుగా అయితే మౌనం అర్ధాంగీకారం అయితే కావచ్చునేమో కానీ, ఈ విషయంలో మాత్రం సంపూర్ణ అంగీకారంగానే అంతా భావిస్తున్నారు.  అయితే ఇప్పడు, ఎన్డీయే  రాష్ట్రపతి అభ్యర్ధి, ద్రౌపతి ముర్ము రేపు ( జులై12), అన్ని పార్టీల మద్దతు కోరేందుకు విజయవాడ వస్తున్నసమయంలో. రెండు పార్టీల మధ్య ఓ చిలిపి తగువు తెరపై కొచ్చింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ముఖ్య నేతలు ఎవరూ వైసీపీ మద్దతు కోరలేదని, అయినా వైసీపీ నేతలే మద్దతు ఇస్తామని వెంట పడుతున్నారు అన్న అర్థం వచ్చేలా కొంచెం ఘాటు  వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా, బీజేపీ దృష్టిలో వైసీపీ అంటరాని పార్టీయేననీ, అయితే, తాము బీజేపీతో కలిసే ఉన్నామనే భ్రమను సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  బీజేపీ జాతీయ నాయకులు, వైసీపీ మద్దతు కోరారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, వైసీపీ మద్దతు తెలిపింది అనేది మాత్రం నిజం. ఎందుకంటే, రాష్ట్రంలో ప్రచారానికి వస్తున్న ముర్ము వైసీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ముర్ముకు ముఖ్యమంత్రి జగన్  తన నివాసంలో తేనేటి విందు ఏర్పాటు చేశారు. అంటే, రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ, ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ఇస్తోంది. అందులో మరో అభిప్రాయనికి తావు లేదు.   అయితే, సత్యకుమార్ ఈ సమయంలో వైసీపీ నాయకత్వాన్ని నొప్పించే వ్యాఖ్యలు ఎందుకు చేశారు ? అంటే, అది కూడా, రెండు పార్టీల మధ్య  సీక్రెట్ ఒప్పందంలో భాగమే అంటున్నారు. నేను కొట్టినట్లు చేస్తాను, నువ్వు ఏడ్చినట్లు చేయి అన్నచందంగా, బీజేపీ, వైసీపీ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ ప్లీనరీలో జగన్ రెడ్డి  కేంద్ర ప్రభుత్వంపై, మొక్కుబడిగా కొన్ని విమర్శలు చేశారు. ఆయన చేసిన  విమర్శలకు సమాధానం అన్నట్లుగా సత్యకుమార్ ప్రతి విమర్శలు చేశారు. అయితే, ముఖ్యమంత్రి ప్లీనరీ వేదికగా చేసిన విమర్శలు. సత్యకుమార్ చసిన ప్రతి విమర్శలు  ఉత్తుత్తి  విమర్శలే తప్ప, మరొకటి కాదని, మరొకరు, మరొకరు కాదు, రెండు పార్టీల నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. బీజేపీ, వైసీపీ లవ్ స్టొరీ లో ఇదో ట్విస్ట్ అంటున్నారు.  అదీ సంగతి.

ఇక  బిజెపి ఆప‌రేష‌న్ గోవా!

మ‌హారాష్ట్రలో ఉద్ధ‌వ్ థాక్రే ప్ర‌భుత్వాన్ని చాలా వ్యూహాత్మ‌కంగా కూల్చిన బిజెపి ఇపుడు గోవాలో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఎస‌రు పెట్టేందుకు సిద్ధ‌ప‌డింది.  ప‌ద‌కండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆరుగురు వారాంతంలో గైర్హాజ‌రు కావ‌డంతో కాంగ్రెస్‌కు విధేయత చూపుతూ ప్రముఖుల‌ సంతకం చేసిన అఫి డవిట్‌లు ,  దేవాలయాలు , చర్చిలలో చేసిన ప్రమాణాలు చర్చనీయాంశమయ్యాయి. ఒక్క సారిగా, కాంగ్రెస్ విపక్ష నేత మైఖేల్ లోబోను తొలగించి, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి దిగాంబర్ కామత్‌ను బహి రంగంగా నిందించింది. కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల చీలిక కోసం బిజెపి ఏజెంట్లు  ప్రయ త్నిస్తున్నార‌ని, ఎమ్మెల్యే లను అడ్డగించడానికి బిజెపి ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ గోవా ఇన్ ఛార్జ్ దినేష్ గుండూరావు అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోకుండా  ఉండా లంటే బీజేపీకి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవసరం. రెబల్స్‌కు చుక్కలు చూపించే మైఖేల్ లోబో కాంగ్రెస్‌లో పూర్తిగా కొత్త వ్యక్తి కావడం గమనార్హం. ఎన్నికలకు ముందు ఈ ఏడాది జనవరిలో మాత్రమే ఆయన పార్టీలో చేరారు; చాలా మంది స్థానిక  గోవా  కాంగ్రెస్ నాయకుల రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అతను ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా చేయబడ్డాడు.  గోవా అసెం బ్లీ సమావేశాలు  నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బీజేపీ  ప్రస్తుత వ్యూహకర్త, కేంద్ర మంత్రి భూపేం ద్ర యాదవ్  గోవాలో ఉండటం పూర్తిగా యాదృచ్ఛికం కాదు. కాంగ్రెస్ శ్రేణుల్లోని తిరుగుబాటు సింహాన్ని బీజేపీలో విలీనం చేసే దిశగా నడిపించేందుకు ఆయన అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్య మంత్రి ప్రమోద్ సావంత్, అయితే,  యాదవ్ కేబినెట్ మార్పులు చేర్పులు నిర్వహించడానికి గోవాలో ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కాంగ్రెస్‌కు బిజెపి ఒక షిండేని లాగిందని భారీ ఊహాగానాలతో ప్రారంభమైంది, ఒక్క ఎమ్మెల్యే తప్ప అందరినీ దూరం చేసింది. రోజంతా, ప్రత్యర్థి శిబిరాలు మీడియాకు సమాచారం అందిం చడానికి మలుపులు తీసుకున్నాయి.  యాదవ్ దిగిన తర్వాత, కాంగ్రెస్ కృంగిపోయినట్లు అనిపించింది, ప్రత్యేకించి పార్టీ తప్పిపోయిన ఎమ్మెల్యేలను పట్టుకోలేకపోయింది. రిసార్ట్ రాజకీయాలు - శాసనసభ్యులు పక్కకు మారడానికి ప్రేరేపణలను అందజేస్తున్నప్పుడు  ఈ రోజు నుండి అసెంబ్లీ సమావేశాలు  ప్రారం భం కావటంతో, బిజెపి విలీనాన్ని విజయవంతం చేయాలని కోరుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను  రిసార్ట్‌ కేంద్రమైన గోవాకు తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లను ఎక్కడికి తీసుకెళ్తారు? బీజేపీలో కాంగ్రెస్‌ విలీనానికి సంబంధించిన పుకార్లను తిప్పికొట్టిన దినేష్ గుండూరావు మీడియా ముందు ఐక్యతను చాటుకుంటానని హామీ ఇచ్చారు. విలేఖరులు  వేచి ఉన్నారు, రావ్ ఢిల్లీ లోని  లెజిస్లేటర్‌లు డయల్ చేయడంతో ఒత్తిడి  ఆలస్యం అవుతూ వచ్చింది. ఒక శాసనసభ్యుడు  విలేక‌రుల‌వ‌ద్ద‌కు  వెళుతు న్నప్పుడు కారు బ్రేక్‌డౌన్‌ అయిందని పేర్కొన్నారు. అతను చర్చిలో ప్రార్థన చేస్తున్నాడని మరో ఎమ్మెల్యే సాకుగా చెప్పాడు. ఇంతకీ ఈ గోవా పరిణామాలు రెండు పార్టీలకు అర్థం ఏమిటి? ఫిబ్రవరిలో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి, కాంగ్రెస్ శాసనసభ్యులను పార్టీలో విలీనం చేయడం ద్వారా తన పట్టును బలోపేతం చేసు కోవాలనుకుంటోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు విలీనానికి యోచించడంతో  బీజేపీ కాంగ్రెస్ పార్టీలో నిలువునా చీలికను తెచ్చిపెట్టింది.  అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు విలీనానికి యోచించ డంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలో నిలువునా చీలికను తెచ్చిపెట్టింది. గోవా ఆపరేషన్ లోటస్  వెర్షన్  నిజంగా ట్రాక్‌లో ఉంది. ఇది త్వరలో మహారాష్ట్ర లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, లా ఉద్ధవ్ ఠాక్రే సేనపై గగ్గోలు పెడు తుంది. కాంగ్రెస్-ముక్త్ గోవా (కాంగ్రెస్-ముక్త్  గోవా (కాంగ్రెస్ లేని గోవా)పై బిజెపి పని చేస్తున్నందున, కాంగ్రెస్ కు ఇది గోవాలో సుపరిచితమైన అస్తిత్వ సంక్షోభం. తమ ఆరుగురు శాసనసభ్యులు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉండగా, వారిని పట్టు కుని విధేయులకు ప్రతిఫలం దక్కేలా చూడాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. గోవా శాసనసభ్యుల కోసం రాహుల్, సోనియా గాంధీలతో  పెప్-టాక్ ప్లాన్ చేస్తున్నా రు. బీజేపీ కాంగ్రెస్‌కు నోటీసులిచ్చింది. మహారాష్ట్ర  విజయం  తర్వాత  ఏ రాజకీయ ఎత్తుగడకు పరిమి తులు లేవు.  

ఇపిఎస్‌కే ప‌ట్టం..ఓపిఎస్‌కు ఉద్వాస‌న‌

త‌మిళ‌నాట ఏఐఎడిఎంకే ర‌భ‌సకి తెర‌ప‌డింది. మొత్తానికి ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి(ఇపిఎస్‌)కే పార్టీ వ‌ర్గాలు ప‌ట్టం గ‌ట్టాయి. కాగా పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందుకు పార్టీ రెబెల్  ఓ.ప‌న్నీర్ సెల్వ‌మ్‌ (ఓపిఎస్‌)ని పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. అన్నా డిఎంకె జ‌న‌ర‌ల్ కౌన్సిల్ పార్టీ కోఆర్డినేట‌ర్‌, జాయింట్ కోఆర్డినేట‌ర్ ప‌ద‌వుల‌ను ర‌ద్దుచేయ‌డంలో స‌భ్యుల నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌తల‌ను ఎదుర్కొన‌డంలో స‌మ స్య‌లు ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌చ్చింది. 2,500 మంది స‌భ్యులున్న కౌన్సిల్ ఎట్ట‌కేల‌కు ఇపిఎస్‌కు మ‌ద్ద‌తు నిచ్చింది.  ఓపిఎస్ పార్టీలోనే వుంటూ పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు తేల్చారు. ఆయ‌న డిఎంకె కి మ‌ద్ద‌తుగా మాట్లాడుతూ పార్టీని బ‌ల‌హీన‌ప‌రిచేవిధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏఐఎడిఎంకె పార్టీలో మ‌రికొం ద‌రు సీనియ‌ర్ నాయ‌కులూ అభిప్రాయప‌డ్డారు. కాగా ఈ అభియోగానికి స్పందిస్తూ, అస‌లు త‌నను ఇపి ఎస్‌గానీ మ‌రెవ్వ‌ర‌యినా పార్టీ నుంచి తొల‌గించలేర‌ని, తాను 1.5 కోట్ల పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌ద్ద‌తుతో పార్టీ కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వికి ఎన్నిక‌యిన‌వాడిన‌ని, త‌న‌ను ఎలా తొల‌గిస్తార‌ని ప‌న్నీర్ సెల్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీన్నిగురించి త‌ప్ప‌కుండా కోర్టులో తేల్చుకుంటాన‌న్నారు.  పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్నిక నాలుగు నెల‌ల్లో చేప‌డ‌తామ‌ని సోమ‌వారం జ‌రిగిన పార్టీ స‌మావేశంలో నిర్ధా రించారు. పార్టీ ఉన్న‌త‌ప‌ద‌వికి పోటీ చేయ‌డానికి నిబంధ‌న‌ల అంశంతో స‌హా అనేక బై లా ల‌ను ఈ స‌మా వేశంలో స‌వ‌రించారు. పార్టీలో ప‌దేళ్ల ప్రాధ‌మిక స‌భ్య‌త్వం పూర్తిచేసుకున్న‌వారు పార్టీ ప‌ద‌వుల‌కు పోటీ చేయవ‌చ్చ‌న్న‌ది స‌వ‌రించిన నిబంధ‌న‌ల్లో ఒక‌టి స్ప‌ష్టం చేసింది.  సోమ‌వారం ఉద‌యం మ‌ద్రాసు హై కోర్టు అనుమ‌తి పొందిన త‌ర్వాత‌నే పార్టీ జ‌న‌ర‌ల్ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఇపిఎస్ నాయ క‌త్వంలో ఆయ‌న వ‌ర్గం పార్టీ స‌మావేశం నిర్వ‌హించ‌డాన్ని ఓపిఎస్ కోర్టులో స‌వాలు చేశారు. కానీ ఆయ‌న పిటిష‌న్‌ను హై కోర్టు తిర‌స్క‌రించింది.  హైకోర్టు తీర్పు రావ‌డానికి ముందు చెన్నైలో సోమ‌వారం ఉద‌యం పార్టీ కార్యాల‌యం వ‌ద్ద ఇరుపార్టీల వారు కొట్లాడుకున్నారు, రాళ్లు రువ్వుకున్నారు, వాహ‌నాలు ధ్వంస మ‌య్యాయి. దీంతో త‌మిళ‌నాడు రెవెన్యూ శాఖ పార్టీ కార్యాల‌యానికి తాళాలు వేసింది.  చట్ట ప్రకారం కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ మాత్రమే సమావేశాన్ని ఏర్పాటు చేయగలరని ఓపీఎస్ శిబిరం కోర్టు ముందు వాదించింది. కొత్తగా నియమితులైన ప్రిసీడియం ఛైర్మన్‌చే ఈ సమావేశం సాంకేతి కంగా చట్టవిరుద్ధం. అయితే, జూన్ 23న జరిగిన మునుపటి సమావేశం ఇద్దరు నేతల ఎన్నికను ఆమోదిం చనందున ద్వంద్వ నాయకత్వం అమలులో లేదని, అందువల్ల సమావేశాన్ని ప్రిసీడియం ఛైర్మన్ ఏర్పా టు చేయడం, ఆఫీస్ బేరర్లు ఆహ్వానాలు పంపడం చట్టబద్ధమైనదని టీమ్ ఇపిఎస్ వాదించింది. గత వారం, చట్టానికి అనుగుణంగా సమావేశాన్ని నిర్వహించేందుకు ఈపీఎస్‌ బృందానికి  సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఇపి ఎస్‌ ఏక నాయకత్వాన్ని కోరుకుంటుండగా, ఓపిఎస్ ప్రస్తుత ద్వంద్వ నాయకత్వ నమూనాను కొనసాగించాలని కోరుకున్నారు. 2016 డిసెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మర ణించిన తర్వాత ఐదేళ్ల క్రితం కుదిరిన సంధి ప్రకారం ఇద్దరు నేతలు  ద్వంద్వ నాయకత్వ నమూనా లో పనిచేస్తున్నారు.