కాలనుగుణంగా శరీర తత్వంలో కూడా మార్పు వస్తుంది.  వేసవికాలంలో ఉక్కపోత భరించలేక శరీరం మీద చెమట కాయలు, వడ గుల్లలు వంటివి వచ్చినట్టే.. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. చలి గాలుల కారణంగానూ,  చలి చర్మాన్ని దెబ్బ తీయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి.  అయితే  ఇలా పొడిబారడానికి చలి మాత్రమే ప్రధాన కారణం కాదు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. చలికాలంలో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇది చర్మం నుండి తేమను లాగేసుకుంటుంది.  పొడిగా కఠినంగా మారుస్తుంది.  దీని వల్లనే చాలా వరకు పొడి చర్మం సమస్య వస్తుంది. చలికాలంలో పొడిచర్మం ఉన్నవారికి సమస్య పెరుగుతుంది. చలికాలంలో  చలికి తాలలేక చాలా మంది వేడి నీటి స్నానమే చేస్తుంటారు.  అది కూడా చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తారు.  దీని వల్ల చర్మం దెబ్బతింటుంది.  చర్మం పొడిబారుతుంది. దీనికి కారణం.. చర్మంలో ఉండే సహజ నూనెలు తొలగిపోవడమే. చలికాలంలో చలి కారణంగా చాలా మంది నీరు తాగరు, పైగా చలి కారణంగా దాహం కూడా వేయదు. అందుకే శరీరంలో తేమ లోపించి చర్మం పొడిబారుతుంది. కేవలం పొడిబారడమే కాకుండా చర్మం నిర్జీవంగా మారుతుంది. చలి నుండి ఉపశమనం కోసం ఉన్ని బట్టలు వేసుకుంటారు.  ఇవి చర్మాన్ని రుద్దుతాయి.  చర్మానికి అలెర్జీ చర్యను ప్రేరేపిస్తాయి.  దీని కారణంగా చర్మం మీద దురద, దద్దుర్లు వస్తాయి.  ఇది కూడా చర్మం పొడిబారడానికి కారణం అవుతుంది.  చలిని భరించలేక చాలామంది ఇళ్లలో వేడి హీటర్ లు ఏర్పాటు చేసుకుంటారు.  ఈ హీటర్ నుండి వచ్చే గాలి చర్మాన్ని సున్నితంగా మార్చి చర్మం మీద తేమను లాగేస్తుంది.  ఇది చర్మం పొడిబారేలా చేస్తుంది. థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారికి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.  ఈ సమస్యలు ఉన్నవారి చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది.                       *రూపశ్రీ.

ఈ ఈజీ ట్రిక్స్ నేర్చుకుంటే పెద్ద మేకప్ ఆర్టిస్ట్ లను తలదన్నేలా రెఢీ అవ్వచ్చు..   అందంగా కనిపించడం అమ్మాయిల టార్గెట్.  అందానికి ప్రతిరూపంగా అమ్మాయిలను పోల్చడం, పువ్వులతో సమానంగా అమ్మాయిలను ప్రస్తావించడం చూస్తుంటాం.  ఇదంతా అందం మహిమే.. అయితే చాలామంది అందంగా కనిపించాలంటే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిందే అనే ఆలోచనలో ఉంటారు. దీనికి తగినట్టే ఏ చిన్న ఈవెంట్ .. ఏ చిన్న పార్టీ ఉన్నా పార్లర్ కు వెళ్ళి వందలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే కొన్ని ఈజీ ట్రిక్స్ ఫాలో అయితే పెద్ద మేకప్ ఆర్టిస్ట్ లు చేసిన మేకప్ కూడా చిన్నబోతుంది.  మేకప్ ను ఇష్టపడే ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన ఆ ట్రిక్స్ ఏంటంటే.. ఐ షాడో.. అమ్మాయిలను చూడగానే మొదటగా ఆకట్టుకునేవి కళ్లు. ఒకప్పుడు కళ్లకు కాటుక పెట్టి సహజంగా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కళ్లను ఆకర్షణగా ఉంచుకునేవారు.  అయితే ఇప్పట్లో కళ్లకు ఐ లైనర్,  ఐ షాడో తో మెరుగులు దిద్దుతున్నారు.  ఐ షాడో ఫర్పెక్ట్ గా పెడితే కళ్లను చూసి ఇతరులు కళ్లు తిప్పుకోలేరు. అంత అందంగా కనిపిస్తారు.  అందుకే ఐ షాడో ను టేప్ సహాయంతో ఈజీగా అప్లై చేయడం నేర్చుకోవాలి. ఐ లైనర్.. ఐ షాడో మాత్రమే కాదు..  ఐ లైనర్ వేసుకుంటూ ఉంటారు.  రెండు కళ్లక వేర్వేరు ఐ లైనర్ వేసుకునేవారు కూడా ఉంటారు. అలాంటి వారు ఐ లైనర్ ను ఈజీగా అప్లై చేసుకునే విధానం ఉంది.   చూపుడు వేలిపై ఒక చుక్క ఐ లైనర్ ఉంచాలి. వేలిని కళ్ల మూలలో నుంచి చెవి వైపుకు నెమ్మదిగా ఒక గీతను గీసినట్టు అప్లై చేయాలి.  అంతే.. కష్టం లేకుండా కేవలం సెకెన్ల వ్యవధిలో అందంగా ఐ లైనర్ అప్లై చేసుకున్నట్టే. కలర్ ఫుల్ షాడో.. టేప్ సహాయంతో ఐ షాడో అప్లై చేయడం తెలుసుకున్నారు కదా.. ఇప్పుడు ఐ షాడోను మరింత ఆకర్షణగా మార్చడానికి ఇయర్ బడ్ తీసుకోవాలి. ఈ ఇయర్ బడ్ సహాయంతో కలర్ ఫుల్ షాడ్ ను అప్లై చేయాలి.  ఇయర్ బడ్ తో రుద్దాలి.  ఇలా చేస్తే మిక్స్డ్ కలర్ లో ఐ షాడో ఔరా అనిపిస్తుంది.                             *రూపశ్రీ.  

ఎర్ర కందిపప్పు ఇలా వాడితే.. మచ్చలేని చర్మం మీ సొంతం..! మచ్చలేని చర్మం కావాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. ఇందుకోసం చాలా రకాల టోనర్లు,  సీరమ్ లు, ఫేస్ ప్యాక్ లు, క్రీమ్ లు వాడుతుంటారు. అయితే అవన్నీ కాదు.. వంటింట్లో ఉండే ఎర్ర కందిపప్పును వాడితే ముఖం మీద మచ్చలు మాయమవుతాయట. మచ్చలేని చర్మం సొంతమవుతుందని అంటున్నారు. చర్మాన్ని నేచురల్ గా మెరిపించే పేస్ ప్యాక్ లను ఎర్ర కందిపప్పుతో తయారు చేసుకుని వాడవచ్చు.  అవెలా చేయాలో తెలుసుకుంటే.. కందిపప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కందిపప్పులో ప్రోటీన్,  ఫైబర్ తో పాటు చాలా పోషకాలు ఉంటాయి.  అయితే ఎర్ర కందిపప్పును పేస్ ఫ్యాక్ గా ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించాలో తెలుుకుంటే.. ఎర్రకందిపప్పు.. పాలు.. పొడి చర్మంతో ఇబ్బంది పడేవారు ఎర్రకందిపప్పు,  పాలతో పేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడవచ్చు. ఇది ముఖానికి తేమను అందిస్తుంది.  చాలా సేపు చర్మం తేమను నిలిపి ఉంచుకుంటుంది.  చర్మం మృదువుగా ఉండటంలో సహాయపడుతుంది. కావసిన పదార్థాలు.. తయారీ విధానం.. ఎర్ర కందిపప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి.  మరుసటి రోజు పప్పును గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.  తరువాత 2 చెంచాల పాలు వేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.  ఇది మరీ జారుడుగా ఉండకూడదు. కాస్త పేస్ట్ లా ఉండాలి.   మొదట ముఖాన్ని శుభ్రం చేసుకుని ముఖం మీద దుమ్ము, ధూళి మలినాలు లేకుండా చేసుకోవాలి. తరువాత ముఖాన్ని తుడుచుకుని శుభ్రం గా ఉన్న ముఖానికి  ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.  15 నుండి 20 నిమిషాలు ఈ పేస్ట్ ను అలాగే ఉంచి తరువాత నీటితో ముఖం కడుక్కోవాలి. ఎర్ర కందిపప్పు నానబెట్టుకోలేని పక్షంలో దీన్ని మెత్తని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి.  ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి 15 నుండి 30 నిమిషాల ముందు కొద్దీగా పొడిని పాలలో నానబెట్టి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.   మెరిసే చర్మం సొంతమవుతుంది. ఎర్రకందిపప్పు,  ముల్తానీ మట్టి,  తేనె.. ముల్తానీ మట్టి ముఖానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది.  ఎర్ర కందిపప్పు లో ముల్తానీ మట్టిని కలపాలి. అందులో ఒక స్పూన్ తేనెను కలపాలి.  దీన్ని పేస్ ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.  దీన్ని వారానికి రెండు సార్లు వేసుకుంటే చర్మం మెరుస్తూ ఉంటుంది.  ఈ ఫేస్ ప్యాక్ లు రెండూ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.                                       *రూపశ్రీ.

రెండు చుక్కల నెయ్యి ముఖానికి రాయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!   చలికాలం చర్మానికి పరీక్ష కాలం అని చెప్పవచ్చు.   చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఈ కాలంలో చాలా రకాల చిట్కాలు పాటిస్తుంటారు. వందలు, వేలాది రూపాయలు వెచ్చించి  ఫేస్ క్రీమ్ లు, లోషన్లు, మాయిశ్చరైజర్లు కొనుగోలు చేస్తుంటారు.  మరికొందరు ఇంట్లోనే చిట్కాలు ట్రై చేస్తుంటారు. అయితే ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులను వదిలి కేవలం రెండు చుక్కల నెయ్యిని ముఖానికి రాసుకోమని చెబుతున్నారు  చర్మ సంరక్షణ నిపుణుల నుండి వైద్యుల వరకు. అసలు నెయ్యిని ముఖానికి రాయడం వల్ల జరిగేదేంటి? ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులను మించి నెయ్యి చేసే మ్యాజిక్ ఏంటి? తెలుసుకుంటే.. ముఖం పై మచ్చలు, ముడతలు, పొడిబారడం వంటి వాటిని పోగొట్టుకోవడానికి చాలా మంది ఖరీదైన ఉత్పత్తులు వాడతారు. అలాగే చలికాలంలో వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా వాడతారు. అయితే వీటి బదులు నెయ్యి వాడవచ్చు. నెయ్యిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి మ్యాజిక్ జరుగుతుంది.  నెయ్యిని ముఖానికి రాస్తుంటే చర్మంలో తేమ నిలిచి ఉంటుంది. ఇది చర్మం చలి కారణంగా  పొడిబారడం, పగుళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.  నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. నెయ్యిలో అరాకిడోనిక్, లినోలెనిక్ ఆమ్లం వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి దెబ్బతిన్న చర్మానికి పోషణను ఇస్తాయి. ఫలితంగా వాడిపోయి పగుళ్లు ఏర్పడిన చర్మం తిరిగి యవ్వనంగా, ఆరోగ్యంగా మారుతుంది. ముఖ చర్మం వాడిపోయి రంగు కోల్పోయినట్టుగా ఉన్నప్పుడు రెండు చుక్కల స్వచ్చమైన నెయ్యిని ముఖానికి అప్లై చేసి కాస్త మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల  ముఖం చర్మం కాంతివంతంగా మారుతుంది.  చర్మ కణాల నష్టం తగ్గుతుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు వంటివి వస్తుంటే రెండు చుక్కల నెయ్యిని ముఖానికి అప్లై చేయాలి.  ఇలా ప్రతిరోజూ రెండు చుక్కల నెయ్యి ముఖానికి పూస్తుంటే  చర్మం పై మచ్చలు,  మొటిమలు వదులుతాయి.  చర్మం మీద అన్ని రకాల మచ్చలు లేకుండా క్లిస్టర్ క్లియర్ అవుతుంది. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయనే విషయం తెలిసిందే.  ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ముఖం మీద ముడతలను తొలగించి ముఖ చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది.  ప్రతిరోజూ నెయ్యిని ఇలా ముఖానికి రాసుకుంటూ ఉంటే ఎంత వయసు పెరిగినా చర్మం యవ్వనంగా ఉంటుంది.                                        *రూపశ్రీ.  

జుట్టు పెరుగుదలను టార్గెట్ గా పెట్టుకున్నారా...అవిసె గింజలు ఇలా వాడండి!   అవిసె గింజలు.. ఆరోగ్యకరమైన విత్తనాలలో ఒకటి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్,  విటమిన్లు, ప్రోటీన్ అన్నీ ఉంటాయి.  ప్రతి రోజూ కొన్ని అవిసె గింజలను తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం ఎంతో బావుంటుందని అంటారు.  అయితే అవిసె గింజలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సంరక్షణలోనూ, కేశ సంరక్షణలోనూ చక్కగా సహాయపడుతుంది. ముఖ్యంగా అవిసె గింజలతో జెల్ తయారు చేసి దాన్ని జట్టుకు పట్టిస్తుంటే జుట్టుకు మ్యాజిక్ రిజల్ట్ పక్కాగా ఉంటాయట. ఇంతకీ అవిసె గింజల జెల్ ఎలా తయారు చేయాలి? ఈ జెల్ వాడటం వల్ల జుట్టుకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. అవిసె గింజల జెల్.. అవిసె గింజల జెల్ లో ప్రోటీన్లు,  విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు,  మెగ్నీషియం  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మానికి, జుట్టుకు అందాన్ని- ఆరోగ్యాన్ని ఇస్తుంది.  ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల అవిసె గింజలు వేసి స్టౌ పైన ఉంచి ఉడికించాలి. ఈ అవిసె గింజలు ఉడికి దానిమీద నురుగు వచ్చి అది కాస్త జిగటగా ఉడకడం గమనించినపుడు స్టౌ ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తరువాత దీన్ని వడగట్టి జెల్ ను సేకరించాలి.  ఈ అవిసెగింజల గింజల జెల్ ను జుట్టును పాయలుగా తీస్తూ కుదుళ్లకు పట్టేలా బాగా అప్లై చేయాలి.  తరువాత  జుట్టు పొడవు ఉన్నంత మేర పట్టించాలి. కనీసం అరగంట సేపు అయినా దీన్ని అలాగే ఉంచుకుని తరువాత సాధారణ నీటితో తల శుభ్రం చేసుకోవాలి. ప్రయోజనాలు.. అవిసె గింజల జెల్ ను ఉపయోగించడం వల్ల  జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  ఈ జెల్ లో విటమిన్లు,  పోషకాలు,  ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. జుట్టు స్టైయిట్ అవుతుంది.. అవిసె గింజల జెల్ జుట్టును స్ట్రైయిట్ గా మారుస్తుంది.  చాలామంది రింగురింగుల జుట్టుతో ఇబ్బంది పడుతూ ఉంటారు.  జుట్టు ఎక్కువగా రింగులు ఉండటం వల్ల చిక్కులు పడుతుంది.  ఇలాంటి వారు అవిసె గింజల జెల్ ను జుట్టుకు రాసుకుంటే జుట్టు రింగులు తగ్గి స్ట్రైయిట్ గా మారుతుంది. జుట్టును తేమగా, మృదువుగా ఉంచుతుంది.  జుట్టుకు సహజంగా మెరుపును ఇస్తుంది. జుట్టు రాలడం.. జుట్టు రాలే సమస్య ఉన్నవారు అవిసె గింజల జెల్ ను రాస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.  ఇది జుట్టుకు మాయిశ్చరైజ్ చేసుంది.  జుట్టు చిక్కులు పడకుండా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. డ్యామేజ్.. జుట్టు డ్యామేజ్ అయినప్పుడు  జుట్టును తిరిగి రిపేర్ చేయడంలో అవిసె గింజల జెల్ సహాయపడుతుంది.  అవిసె గింజలలో విటమిన్-ఇ సమృద్దిగా ఉంటుంది.  ఇది జుట్టు వ్యాల్యూమ్ పెంచడంలోనూ,  జుట్టును బలంగా మార్చడంలోనూ సహాయపడుతుంది. జుట్టుకు మెరుపు ఇస్తుంది.  జుట్టు కుదుళ్ల మంటలు తగ్గిస్తుంది.                                         *రూపశ్రీ.  

చలికాలంలో ఇలా డై కాఫీ స్క్రబ్ వాడి చూడండి.. మెరిసిపోతారు..! ​ చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మ సంరక్షణ పెరుగుతుంది. దీనికి తగ్గట్టే మార్కెట్ లో చర్మ సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు కూడా పెరుగుతాయి.  ఈ కాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం కేటాయించాలి.  అయితే ఇంట్లోనే ఈజీగా చలికాలంలో చర్మ సంరక్షణ కోసం డై కాఫీ స్క్రబ్ తయారుచేసుకోవచ్చు.  ఇదెలా తయారు చేయాలో.. దీని కోసం కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుంటే.. ముఖ చర్మాన్ని లోతుగా  క్లీన్ చేయడానికి కాఫీని ఉపయోగించడం చాలా బెస్ట్ ఆప్షన్.  ఇది చనిపోయిన చర్మ కణాలను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది.  అందుకే చలికాలంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. కాఫీ స్క్రబ్ ఎలా చేయాలి? కాఫీ స్క్రబ్ కు కావలసిన పదార్థాలు.. కాఫీ పొడి.. 1 స్పూన్.. తేనె.. కొద్దిగా.. ఒక స్పూన్ కాఫీ పొడిని తగినంత తేనెతో కలిపి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి సుమారు 20 నిమిషాల పాటు ముఖానికి మసాజ్ చేయాలి.  తరువాత సాధారణ నీటితో ముఖాన్ని కడిగేయాలి. ముఖం మీద ఉబ్బిన కళ్లు, చర్మం ముడతలు, ముఖం వాడినట్టు ఉండటం వంటి అన్ని  సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కాఫీ, పాలతో.. కాఫీ, తేనె తో మాత్రమే కాదు.. కాఫీ, పాలతో కూడా ముఖాన్ని మెరిపించవచ్చు. కాఫీ పొడిలో పాలు కొద్దిగా వేసి చిక్కగా  చేసుకోవాలి. ఈ పేస్ట్ తో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి.  ఇది చర్మంలో మురికిని తొలగిస్తుంది.  ముఖానికి మెరుపును ఇస్తుంది.   కాఫీ, పెరుగు.. కాఫీ, పెరుగు కాంబినేషన్ కూడా ముఖానికి చాలా మంచి చిట్కా.  1 టీస్పూన్ పెరుగులో కాసింత కాఫీ పొడి, అందులోనే చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  అందంగా, మృదువుగా ఉన్న చర్మం సొంతమవుతుంది. కాఫీ, నిమ్మరసం.. కాఫీ, నిమ్మరసం స్ర్కబ్ తో ఇన్స్టంట్ గ్లో తీసుకురావచ్చు. ఇది నిజంగా మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. కాఫీ పొడిలో కాస్త నిమ్మరసం పిండి దీన్ని ముఖానికి పట్టించి బాగా మసాజ్ చేయాలి.  తరువాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. కాఫీ, అలోవెరా.. కాఫీ పౌడర్ లో అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ తో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇది ముఖాన్ని మెరిపిస్తుంది.                                        *రూపశ్రీ.

గులాబీ రంగు పెదాలు.. ఒత్తైన కనురెప్పలు.. ఇదిగో ఈ చిట్కాలతో మీ సొంతం..!     అందంగా కనిపించడం అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం.  ముఖ్యంగా అందంగా కనిపించడం కోసం వందల నుండి వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ చిన్న చిన్న ఇంటి చిట్కాల సహాయంతో అందాన్ని పెంచుకోగలిగినప్పుడు డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి?  కనురెప్పలు మందంగా ఉండాలన్నా లేదా పెదాలను గులాబీ రంగులోకి మార్చాలన్నా. చాలా రకాల ఆయిల్స్, సీరమ్ లు,  లిప్ బామ్ లు, లిప్ స్క్రబ్ లు వాడుతుంటారు.  వీటి కోసం చాలా  ఖర్చు చేస్తుంటారు.  అయితే ఇంట్లోనే కొన్ని ఈజీ టిప్స్ తో గులాబీ పెదాలను,  ఒత్తైన కనుబొమ్మలను సొంతం చేసుకోవచ్చు. బొద్దుగా, లేతగా ఉండే పెదాల కోసం.. ప్రతి అమ్మాయి తన పెదవులు చిన్నపిల్లల లాగా మృదువుగా,  గులాబీ రంగులోకి మారాలని కోరుకుంటుంది. ఇందుకోసం పెదవులకు వివిధ రకాల లిప్ బామ్‌లను అప్లై చేస్తుంటారు. ఇలా చేసిన తర్వాత కూడా నల్లగా,  పగుళ్లతో ఉంటే పెదవులకు కింద ఇవ్వబడిన  స్ర్కబ్ ను ఉపయోగించాలి. కొద్దిగా పెట్రోలియం జెల్లీ, విటమిన్ ఇ ఆయిల్, కొబ్బరి నూనె,  బేబీ ఆయిల్‌ను చిన్న సీసాలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని రోజూ మీ పెదాలపై అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఇది పెదాలను మృదువుగా,  బొద్దుగా మార్చుతుంది. మందంపాటి కనుబొమ్మలు, కనురెప్పలు.. మందపాటి కనురెప్పలు,  కనుబొమ్మలు కావాలని కోరుకునే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇవి ముఖ సౌందర్యానని మరింత ద్విగుణీకృతం చేస్తాయి.  కనుబొమ్మలు,  కనురెప్పలు పలుచగా ఉంటే వాటిని మందంగా మార్చడానికి ఒక మ్యాజిక్ టిప్ ఉంది. పెట్రోలియం జెల్లీ,  ఆలివ్ నూనెను ఒక కంటైనర్‌లో కలపాలి. మీ దగ్గర ఖాళీ మాస్కరా బాటిల్ ఉంటే ఆయిల్ మిశ్రమాన్ని  బాలిల్ లో నింపాలి.  ఆ తరువాత  దాన్ని ఉపయోగించాలి. పొడవాటి గోర్లు.. గోర్లు పొడవుగా మంచి ఆకారంలో ఉంటే చేతి వేళ్లు చాలా అందంగా కనిపిస్తాయి.  వీటికి గోరింట లేదా నెయిల్ పాలిష్ వంటివి పెడితే ఆ చేతి అందం అంతా ఇంతా కాదు. కానీ చాలా మందికి గోర్లు పదే పదే విరిగిపోతుంటాయి.  గోర్లు పొడవుగా, మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే రెండు వస్తువులు ఉపయోగించి మంచి నెయిల్ మసాజ్ జెల్ తయారు చేయవచ్చు.  ఇందుకోసం పెట్రోలియం జెల్లీ,  బేబీ ఆయిల్ రెండూ మిక్స్ చేయాలి.  దీన్ని ఒక కంటైనర్ లో నిల్వ చేయాలి.  ఈ మిశ్రమాన్ని గోర్ల మీద రాసి రోజూ సున్నితంగా మసాజ్ చేయాలి.  గోర్లు బలంగా మారతాయి.  పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతాయి. క్లియర్ స్కిన్ కోసం.. ప్రతి ఒక్కరూ శుభ్రమైన మచ్చలు  లేని మెరిసే చర్మాన్ని కోరుకుంటారు.  మార్కెట్ ఉత్పత్తులు క్లియర్ స్కిన్ ను చేకూరుస్తాయని అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే.. వీటిలో రసాయనాలు కాలక్రమంలో చర్మాన్ని చాలా దెబ్బతీస్తాయి.   అందుకో ఇంటి చిట్కాలు ఉత్తమం.   ఒక గిన్నెలో పసుపు, తేనె, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.  దీన్ని ముఖంపై అప్లై చేసి  10 నిమిషాలు అలాగే ఉంచాలి.  సమయం ముగిసిన తర్వాత ముఖం కడిగేయాలి. ఈ టిప్ చాలా బాగా సహాయపడుతుంది.  చర్మానికి మెరుపు ఇస్తుంది. చర్మం మీద మచ్చలు, మొటిమలు పోగొడుతుంది.  ఈ ఫేస్ ప్యాక్ మాత్రమే కాకుండా  పుష్కలంగా నీరు త్రాగాలి.  చక్కగా  నిద్ర ఉండేలా చూసుకోవాలి.  ఇలా చేస్తుంటే ముఖం క్లిస్టర్ క్లియర్ గా మారుతుంది.                                          *రూపశ్రీ.

వాహ్.. చలికాలంలో కొబ్బరి పాలు ఇలా వాడితే.. మెరిసిపోతారు..!   చలికాలం చర్మానికి పరీక్షా కాలం.  చలికాలంలో వచ్చే సమస్యల వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది.  చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడుతుంది.  చర్మం పొలుసులుగా లేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే నొప్పి, మంట కూడా పెడుతుంది.  చలికాలంలో ముఖ్యంగా పొడిచర్మం ఉన్నవారికి,  సున్నితమైన చర్మం ఉన్నవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.  అయితే కొబ్బరి పాలను వాడితే చలికాలంలో చర్మం సాఫ్ట్ గా మారడమే కాకుండా కాంతివంతంగా మెరిసిపోతుందట. కొబ్బరి పాలు  చర్మానికి చాలా లోతుగా తేమను అందిస్తాయి.  ఈ కారణంగా పొడి చర్మం ఉన్నవారు కొబ్బరిపాలు రాసుకుంటే చర్మం పొడిబారడం తగ్గుతుంది.  చర్మం మృదువుగా మారుతుంది.  రోజులో ఒకసారి అయినా కొబ్బరి పాలను ముఖానికి రాస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో చర్మానికి సోప్,  ఫేస్ వాష్ కఠినమైన క్రీములు రాయడం వల్ల చర్మం దెబ్బతినడమే కాకుండా చర్మం నల్లగా కూడా మారుతుంది.  ముఖ్యంగా మార్కెట్లో కొనుగోలు చేసే మాయిశ్చరైజర్ క్రీములు, లోషన్లు చర్మాన్ని డార్క్ గా మారుస్తాయి. కానీ కొబ్బరి పాలను ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తుంది.  కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి పాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మం చికాకును, మంటను తగ్గించడంలో సహాయపడతాయి.  సున్నితమైన చర్మం ఉన్నవారికి కొబ్బరిపాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు ఉన్నవారికి కొబ్బరి పాలు మేలు చేస్తాయి.  చర్మాన్ని లోతుగా తేమగా ఉంచడమే కాదు. చర్మాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది కూడా.  కొబ్బరి పాలలో ఉండే పోషకాలు నల్ల మచ్చలు,  తెల్ల మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరిపాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చిన్న వయసులోనే వృద్దాప్యాన్ని దరికి రానివ్వవు. చర్మాన్ని ముడుతలు, గీతల నుండి రక్షిస్తుంది.  చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. కొబ్బరి పాలను చలికాలంలో రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది.  చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది.  ముఖ్యంగా చలికాలం వల్ల ఏర్పడే అసౌకర్యం రానివ్వదు.                                               *రూపశ్రీ.

ఒత్తైన జుట్టు రహస్యం ఈ ఆయిల్ సొంతం! అమ్మాలకు ఒత్తైన, పొడవైన జుట్టు అంటే చాలా ఇష్టం. జుట్టు పెరగదు కాబట్టి అలా ఉంటారు కానీ.. అందంగా ఒత్తుగా, పొడవుగా, నల్లగా ఉన్న జుట్టు పెరుగుతుంటే ఎవరు మాత్రం మాకొద్దు అని అంటారు చెప్పండి.  నడుము వరకు పొడవాటి మందపాటి జుట్టు కావాలనుకుంటే మంచి హెయిర్ ఆయిల్ వాడాలి. మార్కెట్లలో బోలెడు హెయిర్ ఆయిల్స్ ఉంటాయి. ఇంత పెద్ద జుట్టు, ఇంత ఒత్తైన జుట్టు అంటూ ఒకటే ప్రమోషన్లు ఊదరగొట్టేస్తాయ్. వాళ్లకు మార్కెట్ పెరుగుతుంది తప్ప.. మీ తలలో జుట్టు కనీసం ఒక ఇంచ్ అయినా పెరగదు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడం కోసం కొంచెం ఓపిక తెచ్చుకుని ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారుచేసుకుంటే..  చాలా చక్కని ఆలోచన కానీ.. యూట్యూబ్ లలో చూపించే బోలెడు చిట్కాల కారణంగా ఈ హెయిర్ ఆయిల్ సొంతంగా తయారుచేసుకోవడంలో కూడా కాస్త కన్ఫ్యూజనే.. అలాంటి కన్ఫ్యూజన్ తప్పించి ఒక క్లారిటీతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకునేవిధానం మీకోసం… ఈ హెయిర్ ఆయిల్ గురించి చెప్పే ముందు.. అసలు ఇది ఎందుకు వాడాలి. చాలామందికి జుట్టు పలుచగా.. పొట్టిగా ఎందుకు ఉంటుంది?? అనే విషయం కూడా తెలుసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రెండు రకాలుగా పోషకాలు అందాలి. ఒకరి ఆహారం ద్వారా కడుపుకు తీసుకోవడం అయితే.. రెండవది బయటి నుండి జుట్టుకు పోషకాలు అందించడం. హెయిర్ ప్యాక్ లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ మసాజ్ ఇవన్నీ జుట్టుకు పోషకాలు అందించేవే.. కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఏమాత్రం తేడా వచ్చినా జుట్టు మరింత సమస్యలొకి జారుకుంటుంది. జుట్టుకు ఇలాంటి సమస్యలన్నీ తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు.. కొలతలతో సహా కావలసిన పదార్థాలు.. తయారీ విధానం ఇదిగో ఇక తెలుసుకోండి. కావలసిన పదార్థాలు..  2 టేబుల్ స్పూన్లు మెంతులు  2 టేబుల్ స్పూన్లు నల్ల విత్తనాలు(కలోంజి సీడ్స్) 20 బాదంపప్పులు 10 నుండి 20 మందార ఆకులు  2 మందార పువ్వులు -20 నుండి 25 కరివేపాకు రెండు తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు కొబ్బరి నూనె. ముందుగా బాదం, మెంతి, కలోంజి గింజలను మిక్సీలో గ్రైండ్ చెయ్యాలి, ఆ తర్వాత మందార ఆకులు, మందార పువ్వులు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద చిన్న పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడి అయ్యాక అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో మిక్సీ పట్టిన పౌడర్ వేయాలి. ఆ తరువాత పేస్ట్ చేసిన ముద్ద వేసి కాస్త సిమ్ మీద  ఉడికించాలి. మిశ్రమం అంతా ఉడికి నూనె పైకి తేరిన మూమెంట్లో  గ్యాస్ ఆఫ్ చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచాలి.  తర్వాత, ఒక చిన్న ప్లాస్టిక్, లేదా గాజు సీసా  తీసుకుని, దానిపై కాటన్ క్లాత్ వేసి వడగట్టుకోవాలి. దీన్ని డబల్ ఫిల్టర్ చేస్తే నూనె చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఇక ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ రెడి అయినట్టు. ఇది మీకు వాసన వస్తుంది అనిపిస్తే దీంట్లొకి రోజ్ మేరీ ఎసెంటియల్ ఆయిల్ లేదా లావెండర్, రోజ్ ఇలా ఏదైనా వాడచ్చు. ఈ ఆయిల్స్ కలపడం వల్ల ఈ నూనె జుట్టుకు అప్లై చేసినప్పుడు తలలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. వారానికి ఒకసారి తలకు బాగా మసాజ్ చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో.. గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు ఎంతో అద్భుతంగా పెరుగుతుంది.                                      ◆నిశ్శబ్ద.

ఈ టిప్ ఫాలో అయితే.. ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు సాఫ్ట్ గా మారతాయి..!     చలికాలం మొదలవగానే పాదాల మడమలు పగలడం మొదలవుతాయి, అలాంటి పరిస్థితుల్లో  పాదాలకు నూనె రాసుకున్నా లేదా వేరే క్రీములు రాసుకున్నా పగిలిన మడమలు మానడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల చలికాలంలో చాలా రోజులు ఈ మడమల వల్ల ఏర్పడిన పగుళ్ల నొప్పితో బాధపడతారు.  కానీ  పగిలిన మడమల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలుసా..? కింద చెప్పుకోబోయే చిట్కాను పాలో అయితే ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయమవుతాయి. ఇందుకోసం కేవలం రెండు పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది. ఇంట్లోనే క్రాక్ క్రీమ్ చేయడం ఎలాగో తెలుసుకంటే.. క్రాక్ క్రీమ్ కోసం కావలసిన పదార్థాలు.. కొబ్బరి నూనె - 2 టీస్పూన్లు గ్లిజరిన్ - 1 టీస్పూన్ విటమిన్ ఇ క్యాప్సూల్ - 1 (పై పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకుని క్రాక్ క్రీమ్ తయారు చేసుకుంటే క్రీమ్ ఎక్కువ తయారవుతుంది. దీన్ని నిల్వ చేసుకోవచ్చు కూడా.) తయారీ విధానం.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 చెంచాల కొబ్బరి నూనె, 1 చెంచా గ్లిజరిన్,  ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి బాగా కలపాలి. పగిలిన మడమలను నయం చేసి  పాదాలను అందంగా మార్చే క్రీమ్  సిద్ధంగా ఉన్నట్టే. ఈ క్రీమ్ ను  రాత్రిపూట ఉపయోగించాలి. క్రాక్ క్రీమ్ ను ఉపయోగించే ముందు  ఒక బకెట్‌లో వేడి నీళ్లు పోసి అందులో పాదాలను  10 నిమిషాలు నానబెట్టాలి. 10 నిమిషాల సమయం ముగిసిన తర్వాత నీటి నుండి పాదాలను తీసి పొడ టవల్ తో శుభ్రంగా  తుడవాలి. పాదాలు పొడిగా మారిన తరువాత  సిద్ధం చేసిన క్రీమ్‌ను అప్లై చేసి, ఆపై కాటన్ సాక్స్ వేసుకుని  నిద్రిపోవాలి. ఉదయానికల్లా  పగుళ్లు ఏర్పడిన మడమల స్థానంలో  మృదువుగా మారిన మడమలు ఉంటాయి.  మొదటిసారే చాలా మార్పు కనిపిస్తుంది.  ఈ విధంగా వరుసగా ఒక మూడు నాలుగు రోజులు చేశారంటే పాదాలు కోమలంగా మారిపోతాయి.  ఈ క్రాక్ క్రీమ్ ఇచ్చే ఫలితాలు చూసి  పక్కాగా షాకవుతారు.                                          *రూపశ్రీ.

చలికాలంలో చర్మానికి భలే ప్రొటెక్షన్.. ఇంట్లోనే బాతింగ్  పౌడర్ ఇలా..!   వాతావరణానికి తొందరగా ఎఫెక్ట్ అయ్యేది మొదట చర్మమే.. ప్రతి సీజన్ లోనూ దాని పర్యావసానం చూస్తూనే ఉన్నారు ప్రజలు. వేసవి అంటే భగ్గున మండటం ఎలా ఉంటోందో.. చలికాలం అలా మొదలయ్యిందో లేదో చాలా దారుణంగా  చలి ఉంటోంది. దీని కారణంగా చర్మం చాలా తొందరగా పగుళ్లు వచ్చి ఇబ్బంది పెడుతుంది.  పగిలిన చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే  చర్మ సంబంధ సమస్యలు మొదలవుతాయి. సాధారణంగా చలికాలం రాగానే సోప్,  ఫేస్ వాష్ అన్నీ మార్చేస్తుంటారు.  వాటికి బదులు ఇంట్లోనే బాతింగ్ పౌడర్ తయారు చేసుకుంటే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.  ఇది నేచురల్ పౌడర్ కావడంతో ఎలాంటి సైడ్  ఎఫెక్ట్స్ ఉండవు. బాతింగ్ పౌడర్.. కావలసిన పదార్థాలు.. శనగపిండి.. లేదా శనగపప్పు.. పెసరపప్పు.. పసుపు.. 2 స్పూన్లు బియ్యం.. నాలుగు స్పూన్లు. షీకాయ పొడి లేదా కుంకుడు పొడి.. రెండు స్పూన్లు. తయారీ విధానం.. శనగపిండి  ఒక కప్పు తీసుకోవాలి.  లేదంటే ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో నాలుగు స్పూన్ల బియ్యం వేసి  ఈ మూడింటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.   పొడి అయిన పిండిలో రెండు స్పూన్ల పసుపు,  రెండు స్పూన్ల షీకాయ పొడి లేదా కుంకుడు కాయల పొడి వేసి మరొక్క సారి మిక్సీ తిప్పాలి.  ఇలా చేస్తే  అన్ని పదార్థాలు బాగా కలుస్తాయి. ఇలా మిక్సీ వేసుకున్న పిండిని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఎలా వాడాలంటే.. తయారు చేసుకున్న పిండిని ఒక చిన్న కప్పులో ఒకటి లేదా రెండు స్పూన్లు తీసుకోవాలి.  ఇందులో కొద్దిగా నీరు కలిపి మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ఉన్న పేస్ట్ లాగా చేసుకోవాలి.  ఈ పేస్ట్ ను చేతిలోకి తీసుకుని తడి శరీరం మీద రుద్దుతూ సోప్ లాగే రాసుకోవాలి.  ఈ పిండిలో కాస్త రవ్వలాగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది.  సాధారణ చర్మం ఉన్నవారికి ఇది చక్కగా పనిచేస్తుంది.  సున్నితమైన చర్మం ఉన్నవారు ఇందులో నీటికి బదులు పాలు కలిపి పేస్ట్ చేసుకోవచ్చు.   చర్మ సంబంధ సమస్యలు పోవాలన్నాచర్మం సహజంగా నిగారింపు రావాలన్నా కూడా ఈ పొడి చక్కగా పనిచేస్తుంది.  కనీసం వారానికి ఒకసారి శరీరానికి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె రాసుకుని గంట ఆగిన తరువాత ఈ పొడితో స్నానం చేస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది.  చర్మం మీద మృత కణాలు తొలగిపోతాయి.  ఈ పొడిలోకి కాస్త పాలు,  కొంచెం తేనె వేసి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.  అయితే ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ఇందులో షీకాయను మినహాయించడం మంచిది.                                         *రూపశ్రీ.  

బంగాళదుంప గురించి మీకు తెలియని నిజం.. ఇలా ముఖానికి రాస్తే..!     బంగాళదుంప ఎంతో రుచిగా ఉంటుంది.  ఇది ఏ కర్రీలోకి అయినా ఇట్టే ఇమిడిపోతుంది.  బంగాళదుంపల చిప్స్, ఫ్రెంచ్ ప్రైస్ మొదలైనవి కూడా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే బంగాళదుంపలను ముఖానికి కూడా ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా బంగాళదుంపను కింద చెప్పుకున్నట్టు ముఖానికి రాస్తే ముఖం మెరిసిపోతుందట.   బంగాళదుంపల స్టార్చ్.. బంగాళదుంపల నుండి పిండిని తయారు చేసి దాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం మెరిసిపోతుందట.  వందలు, వేలు ఖర్చు పెట్టిన క్రీములు ఇవ్వని ఫలితాన్ని బంగాళదుంపల స్టార్చ్ వల్ల లభిస్తుందట. బంగాళదుంప ముఖానికి ఎందుకంత ఎఫెక్ట్.. బంగాళాదుంపలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది  చర్మంపై మచ్చలను తేలికపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్లు  చర్మం  ఛాయను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.  బంగాళాదుంప పిండి   బంగాళాదుంప రసం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి, నల్లటి వలయాలను తగ్గించడానికి, టానింగ్, పిగ్మెంటేషన్,  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. కావసిన పదార్థాలు.. బంగాళదుంప రసం - 1 గిన్నె నిమ్మరసం - 1/2 టీస్పూన్ పాలపొడి - 1 టీస్పూన్ తయారు విధానం.. ముందుగా కొన్ని బంగాళదుంపలను తీసుకుని తురుముకోవాలి.  రసం తీసి ఆ రసాన్ని గిన్నెలో ఉంచుకోవాలి. ఒక గాజు గిన్నెలో 1-2 గంటలు పక్కన పెట్టాలి. తర్వాత గిన్నె అడుగున తెల్లగా  పేరుకుపోయినట్లు మీరు కనిపిస్తుంది. ఇప్పుడు బంగాళాదుంప రసాన్ని గిన్నె వంకరగా వంచుతూ రసాన్ని  వేరే గిన్నెలో పోయాలి. గిన్నె దిగువన తెల్లటి పదార్థం కనిపిస్తుంది.  దానిలో ఒక చెంచా బంగాళాదుంప రసాన్ని అలాగే ఉంచాలి. అడుగున ఉన్న ఈ తెల్లని పిండే బంగాళదుంప స్టార్చ్. ఇప్పుడు ఈ గిన్నెలో కొన్ని చుక్కల నిమ్మకాయ రసం,   ఒక చెంచా పాలపొడి వేసి బాగా కలపాలి. ముఖాన్ని కాంతివంతం చేసి డార్క్ స్పాట్‌లను లైట్ చేసే ఫేస్ ప్యాక్  రెడీ  అయినట్టే. దీన్ని  ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖం కడుక్కోవాలి.  మొదట సారి వాడన తరువాతే చాలా మార్పు కనిపిస్తుంది.                                                          *రూపశ్రీ.  

  బాబోయ్.. తెల్ల జుట్టును నల్లగా మార్చడం ఇంత సులువా!   తెల్లజుట్టు ఇప్పట్లో చాలా మందికి సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలామంది ఈ సమస్యకు బాధితులు అవుతున్నారు.  అయితే తెల్లజుట్టును వదిలించుకోవడం అంత సులువు ఏమీ కాదు.. దీని బాధ భరించలేక కొందరు హెయిర్ డైతో సరిపెట్టేస్తుంటారు. కానీ తెల్లజుట్టును కవర్ చేసే ఈ  హెయిర్ డై వల్ల జుట్టు మరింత తెల్లగా మారుతుంది. రంగు వెలిసిపోయినప్పుడు అది చాలా దారణంగా కనిపిస్తుంది.  పైగా ఇందులోని రసాయనాల వల్ల మెదడు లోపలి నరాలు చాలా బలహీనం అవుతాయి. చిన్నతనంలోనే మతిమరుపు సమస్యలు వస్తాయి.  అయితే ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా చాలా నేచురల్ గా తెల్ల జుట్టును మాయం చేసే చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి.   అలాంటి చిట్కా ఒకటి ఇప్పుడు చెప్పుకుంటే.. ఆయుర్వేదంలో చాలా మంది మహర్షులు, ఋషులు చాలా రకాల వైద్య విధానాలను,  మొండి రోగాలను కూడా పోగొట్టే చికిత్సలను తెలియజేశారు.  వీరిలో బాలరాజ మహర్షి ఒకరు.  తెల్లజుట్టును నల్లగా మార్చడానికి బాలరాజ మహర్షి చెప్పిన సింపుల్ చిట్కా ఉంది.  దీనికి ఖర్చు కూడా తక్కువ. కానీ ఫలితం మాత్రం ఉహించనంత అద్భుతంగా ఉంటుంది.   చిన్న పిల్లల నుండి పెద్దవారు కూడా తెల్లజుట్టును తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారడానికి బాలరాజ మహర్షి చెప్పిన నూనె చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు.   ఈ నూనె తయారీ కోసం కావలసిన పదార్థాలు.. ఆవాల నూనె.. ఒక కప్పు.. గోరింటాకు.. ఒక కప్పు.. తయారీ విధానం.. ఒక మందంగా ఉన్న కడాయి తీసుకుని దాన్ని స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. ఇందులో కప్పు ఆవాల నూనె పోయాలి. కప్పు గోరింటాకును కచ్చాపచ్చాగ దంచుకోవాలి.  కచ్చాపచ్చాగ దంచుకున్న గోరింటాకును ఆవాలనూనెలో వేయాలి. దీన్ని సన్న మంట మీద బాగా ఉడికించాలి.  నూనెలో గోరింటాకు బాగా ఉడికి ఆకులు నల్లగా మారిపోయిన తరువాత  స్టౌ ఆఫ్ చేయాలి.  ఆ తరువాత దీన్ని వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను వారంలో రెండు సార్లు తలకు పెడుతుంటే చాలా గొప్ప మార్పులు ఉంటాయి.  తలకు పెట్టుకుని వీలును బట్టి గంట సేపు.. వీలున్నవారు రెండు గంటల సేపు తలకు ఉంచుకుని కెమికల్స్ లేని షాంపూ లేదా షీకాయతో స్నానం చేయాలి.  లేదంటే రాత్రి సమయంలో ఈ నూనెను తలకు పెట్టుకుని మరుసటి రోజు ఉదయాన్నే తల స్నానం కూడా చేయవచ్చు.  ఈ నూనెను వాడుతూ  నువ్వులు, పల్లీలు, బెల్లం, పాలు, గుడ్లు, గుమ్మడి విత్తనాలు మొదలైనవి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. వీటిని ఆహారం నుండి మిస్ చేసుకోకుండా ఉంటే ఎంత వయసు పెరిగినా జుట్టు తెల్లబడటం అనే సమస్య చాలా వరకు ఉండదు.                                            *రూపశ్రీ.

వేలాది రూపాయల ఖరీదైన  క్రీమ్ కూడా దీని ముందు దిగదుడుపే..!   చర్మ సంరక్షణ ఎప్పటికీ పాతబడని అంశం. కాలం మారే కొద్ది చాలామంది చర్మం సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఇంటి టిప్స్ నుండి మార్కెట్లో దొరికే వాణిజ్య ఉత్పత్తుల వరకు చాలా రకాలు ఉపయోగిస్తారు. వీటిలో రెటినోల్ కూడా ఒకటి.  రెటినోల్ అంటే  విటమిన్-ఎ1.  ఇది చర్మంలో కొల్లాజెన్ నష్టాన్ని నిరోధిస్తుంది.  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.  అయినప్పటికీ ఇది చాలా ఖరీదైనది.  వేలాది రూపాయలు ఖర్చు చేసి ఇలాంటి క్రీములు కొనే బదులు ఇంట్లోనే దానికి సమానమైన ఫలితాలు ఇచ్చే క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు.  దీనికి కావలసిన పదార్థాలు.. తయారీ విధానం గురించి తెలుసుకుంటే.. విటమిన్ ఎ  చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.  విటమిన్ ఎ  మరింత ప్రభావవంతమైన రూపం రెటినోల్. వృద్దాప్యం కనిపించకుండా చర్మం యవ్వనంగా ఉంచడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఇంట్లోనే రెటినోల్ వంటి క్రీమ్.. ఇంట్లోనే సాలిసిలిక్ యాసిడ్ ఎలా తయారు చేయాలో కింద చెప్పబడింది. వంటగదిలో లభించే వస్తువుల నుండి రెటినోల్‌ను ఎలా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. బియ్యం పిండి - 2 స్పూన్లు తాజా కలబంద జెల్ - 1 టీస్పూన్ రైస్ సీరం - 3-4 చుక్కలు(రైస్ సీరమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు) నీరు - 1 గ్లాసు తయారీ విధానం.. ముందుగా పాన్ తీసుకుని అందులో నీటిని పోసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో బియ్యప్పిండి వేసి చిక్కని పేస్ట్ తయారయ్యే వరకు ఉడికించాలి. దీని తర్వాత ఆ పేస్ట్‌లో రైస్ సీరమ్,  కలబంద జెల్  వేసి బాగా కలపాలి. ఇలా చేస్తే  తెల్లటి పేస్ట్ సిద్ధం అవుతుంది.  హోమ్ మేడ్ రెటినోల్ క్రీమ్ తయారైనట్టే.. దీన్ని ఉపయోగించడం వల్ల  చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటుంది. ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే.. బియ్యంతో తయారు చేసిన ఈ రెటినోల్ క్రీమ్‌ను ఉపయోగించడం వల్ల  చర్మం కాంతివంతం అవ్వడమే  కాకుండా గ్లాస్ స్కిన్ లభిస్తుంది.  చర్మం అద్భుతంగా మారుతుంది. చర్మం మీద ఉండే  పెద్ద రంద్రాలను తగ్గించి చర్మపు రంగును సమం చేస్తుంది.                          *రూపశ్రీ.  

మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలంటే.. ఇలా చేయండి..!   అమ్మాయిల అందాన్ని మరింత పెంచడంలో సహాయపడేది మేకప్. ఇప్పట్లో చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వారి వరకు ప్రతి ఒక్కరూ కొద్దో, గొప్పో మేకప్ అప్లే చేస్తూనే ఉన్నారు.  ఇక పార్టీలు, పంక్షన్ల సమయంలో మేకప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మేకప్ అనేది చాలా వరకు ముఖ చర్మాన్ని దెబ్బతీస్తుంది. మేకప్ వాడకుండా అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మంచి క్లెన్సర్ తో ముఖాన్ని కడుక్కోవాలి.  చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి మాయిశ్చరైజర్ క్రమం తప్పకుండా అప్లై చేయాలి.  మాయిశ్చరైజర్ కూడా హానికరమైన రసాయనాలు లేకుండా ఉన్నదే వాడాలి.   వారానికి ఒకసారి ముఖాన్ని పూర్తీగా, లోతుగా శుభ్రం  చేసుకోవాలి.  ఇది మృతకణాలను తొలగించడంలోనూ, చర్మంలో పేరుకున్న మలినాలు తొలగించడంలోనూ సహాయపడుతుంది. ఇందుకోసం ఫేషియల్, స్ర్కబ్బింగ్,  ఎక్స్పోలియేషన్ చేసుకోవాలి.  ఇంటి చిట్కాలతో దీన్ని ఆరోగ్యకరమైన రీతిలో చేసుకోవచ్చు. ఎండలోకి వెళ్లైముందు సురక్షితమైన సన్ స్క్రీన్ ను అప్లై చేయాలి.  నీరు పుష్కలంగా తాగాలి.  ప్రతిరోజూ 2 నుండి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.  దీని వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాి.   సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి.  ఇది చర్మం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  పండ్లు, కూరగాయలలో ఫైబర్,  నీటి శాతం బాగా ఉన్నవి తీసుకోవాలి. ఇవి చర్మానికి మెరుపును ఇస్తాయి.  శరీరం డీహైడ్రేషన్ కు లోను కాకుండా ఉంటుంది. జుట్టు సంరక్షణ కూడా ముఖం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  తలలో చుండ్రు,  పుండ్లు, జుట్టు పొడిబారి ఉండటం,  లేదా జిడ్డుగా ఉండటం వంటివి జరిగితే అది ముఖ చర్మం మీద ర్యాషెస్,  గుల్లలు,  మొటిమలు,  దద్దుర్లు వంటివి రావడానికి కారణం అవుతుంది. చర్మం పైన మచ్చలు, వడదెబ్బలు,  వేడి గుల్లలు వంటివి వస్తే వాటిని తగ్గించుకోవడానికి అలోవెరా జెల్, విటమిన్-సి సీరమ్ వంటి తేలికపాటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడాలి. ఇవి చర్మానికి హాని చేయకుండా సమస్య తగ్గిస్తాయి.                                              *రూపశ్రీ  

  చలికాలంలో కాలి మడమల పగుళ్లు తగ్గించే సూపర్ టిప్స్..! వింటర్ సీజన్ దగ్గరయ్యే  కొద్దీ చర్మం పొడిబారడం,  పగుళ్లు ఏర్పడటం మొదలవుతుంది. ముఖ్యంగా మడమలు చాలా పగుళ్లు వస్తాయి. పగిలిన మడమలు అసహ్యంగా  కనిపించడమే కాకుండా వాకింగ్ చేసేటప్పుడు బట్టలు,  కార్పెట్‌తో పదేపదే తగలడం వల్ల   నొప్పి పెరుగుతుంది. ఈ పరిస్థితి అనుభవించే ప్రతి మహిళ   శీతాకాలంలో తన పాదాలు సాధారణ సీజన్ లో లాగా మృదువుగా ఉండాలని కోరుకుంటుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కూడా వాడతారు. కానీ వీటి వల్ల ఫలితాలు పెద్దగా ఉండవు. అయితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోని వస్తువుల సాయంతో వాటిని చక్కదిద్దుకోవచ్చు. పగిలిన మడమలను నయం చేయడానికి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు.  ఇందుకోసం ఏ టిప్స్ ఫాలో కావాలి తెలుసుకుంటే.. కొబ్బరినూనెతో మడమలకు క్రీమ్ తయారుచేయడం.. కొబ్బరి నూనె  చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ నూనె శతాబ్దాలుగా చర్మ సంరక్షణకు ఉపయోగించబడుతోంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్,  మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తాయి. ఇంట్లోనే క్రాక్ క్రీమ్ చేయడానికి  కిందిపదార్థాలు అవసరం. కొబ్బరి నూనె - 4 టీస్పూన్లు పెట్రోలియం జెల్లీ - 1 టీస్పూన్ విటమిన్ ఇ క్యాప్సూల్- 1 కర్పూరం పొడి - 1/2 టీస్పూన్ తయారు విధానం.. ముందుగా ఒక గిన్నెలో 4 చెంచాల కొబ్బరి నూనె వేసి వేడి చేసి అందులో ఒక చెంచా పెట్రోలియం జెల్లీ వేసి బాగా కలపాలి. దీని తరువాత  కరిగించిన నూనెలో విటమిన్ ఇ క్యాప్సూల్,  అర టీస్పూన్ కర్పూరం పొడి వేసి బాగా కలపాలి. ఇది పేస్ట్ లాగా మారేవరకు కలపాలి.   ఈ మిశ్రమాన్ని ఒక జాడీలో నింపి చల్లారనివ్వాలి. పాదాల పగుళ్లను నయం చేయడానికి ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ పాదాలకు రాసుకుంటే మంచిది. స్క్రైబ్.. మడమలు రీసెంట్ గానే పగుళ్లు ప్రారంభమైనట్లయితే, వాటిని ఎప్పటికప్పుడు స్క్రబ్ చేయడం చాలా ముఖ్యం. స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి.  ఇందుకోసం  ఓట్స్ స్క్రబ్‌ని ఉపయోగించవచ్చు.  ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. దీన్ని తయారు చేయడానికి కింది పదార్థాలు అవసరం. ఓట్స్ - 3 స్పూన్లు పాలు - 1 చిన్న గిన్నె గ్లిజరిన్ - 1 టీస్పూన్ తయారీ విధానం.. ముందుగా ఓట్స్ గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పాలు, గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.  హీల్స్ డెడ్ స్కిన్‌ను శుభ్రం చేసే స్క్రబ్ రెడీ అయినట్టే. దీన్ని  మడమల మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 10-15 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో  పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఈ స్క్రబ్ పగిలిన మడమలను నయం చేయడంలో మాత్రమే కాకుండా చర్మాన్ని మృదువుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.                                *రూపశ్రీ.

మేకప్ రిమూవర్ లేకుండా మేకప్ తొలగించడానికి సింపుల్ టిప్స్ ఇవీ..! మేకప్ ఇప్పటి అమ్మాయిలకు చాలా సాధారణ విషయం.  పార్టీలు,  ఫంక్షన్లు, పెళ్లిళ్ళలో మాత్రమే కాకుండా   సాధారణంగా బయటకు వెళ్లేటప్పుడు కూడా ఫౌండేషన్, లిప్స్టిక్,  కాజల్, ఐ లైనర్ వంటివి అప్లై చేస్తారు.  అయితే వీటిని శుభ్రంగా తొలగించాలంటే మేకప్ రిమూవర్ అవసరం అవుతుంది.  మేకప్ రిమూవ్ చేయకుండా అలాగే ఉంచి పడుకుంటే చర్మం పాడైపోతుంది. కానీ మేకప్ రిమూవ్ చేయడానికి మేకప్ రిమూవర్ లేకపోతే  కొన్ని సింపుల్ మార్గాలలో మేకప్ తొలగించవచ్చు. కొబ్బరినూనె.. ముఖం మీద మేకప్ తొలగించడానికి కొబ్బరినూనె ఉపయోగించడం ఉత్తమ మార్గం.  మేకప్ రిమూవర్ లేదు అనే చింత లేకుండా కొబ్బరినూనెతో మేకప్ ను తొలగించవచ్చు.  కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇది చర్మాన్ని మెరుస్తూ, మృదువుగా చేస్తుంది.  అదే సమయంలో చర్మం మీద మేకప్ ను కూడా చాలా క్లియర్ గా తొలగిస్తుంది. బాదం నూనె.. బాదం నూనె కూడా మేకప్ తొలగించడంలో బాగా సహాయపడుతుంది.  కాకపోతే బాదం నూనె చాలా ఖరీదైనది.  కానీ ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఇవి ముఖ చర్మం మీద ఉండే డల్ నెస్ ను తొలగించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనె.. ఆలివ్ ఆయిల్ వంటల్లోనే కాదు జుట్టు సంరక్షణ, చర్మ సంరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది.  ముఖం మీద దుమ్ము, ధూళిని మాత్రమే కాకుండా.. వాటర్ ఫ్రూఫ్ మేకప్ ను కూడా సులభంగా తొలగించడంలో ఆలివ్ నూనె సహాయపడుతుంది. సన్ ఫ్లవర్ ఆయిల్.. ఈ నూనె ముఖం నుండి మేకప్ తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది.  సన్ ఫ్లవర్ ఆయిల్ ల విటమిన్-ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా చేస్తుంది. ముఖానికి మేకప్ వేసుకున్నప్పుడు రిమూవర్ లేకపోతే.. పై నూనెలను ఉపయోగించి ముఖానికి మేకప్ ను తొలగించవచ్చు.  ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి కూడా.  చర్మానికి ఎలాంటి హాని చేయవు.                                                    *రూపశ్రీ.

హెర్బల్ స్కిన్ కేర్ రొటీన్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా..     హెర్బల్.. దీన్ని తెలుగులో మూలిక అని అంటారు.  మూలికలు ఆయుర్వేదంలో భాగంగా చెబుతారు. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. పూర్తీగా సహజమైన పదార్థాలు , చర్మానికి నష్టం కలిగించని పదార్థాలు ఉంటాయి. అందుకే హెర్బల్ ఉత్పత్తులకు కూడా ఆదరణ పెరిగింది.  ఇప్పటి కాలంలో అమ్మాయిలు స్కిన్ కేర్ రొటీన్ బాగా ఫాలో అవుతుంటారు. అయితే హెర్బల్ స్కిన్ కేర్ ఫాలో అయితే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుందట. ఇంతకీ ఇందులో ఏమేమి వాడాలో తెలుసుకుంటే.. రోజ్ వాటర్ చర్మానికి చాలా మంచిది.  కానీ దీన్ని ఎక్కువగా వాడరు. రోజ్ వాటర్ లేదా పసుపుతో చేసి ఫేస్ వాష్ వంటి తేలికపాటి హెర్బల్ ఫేస్ వాష్ తో చర్మాన్ని శుభ్రపరచాలి. ఇది ఉదయాన్నే చేయాలి. రోజు ఉదయం దీనితో చర్మాన్ని శుభ్రం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.  రాత్రి వరకు చర్మానికి కలిగిన అలసట పోతుంది. చర్మం మీద మురికి, జిడ్డు వంటివి పోతాయి.  చర్మం తాజాగా ఉంటుంది. చర్మానికి టోనర్ వాడటం చాలా మంచిది. చర్మ రంధ్రాలను కవర్ చేసి చర్మాన్ని తాజాగా ఉంచే రోజ్ వాటర్ లేదా కీర దోసకాయ వంటి పదార్థాలతో తయారు చేసిన హెర్బల్ టోనర్లను వాడాలి. ఫేస్ సీరమ్ కూడా చర్మానికి మేలు చేస్తుంది.  అలోవెరా, విటమిన్-సి, వేప వంటి హెర్బల్ సీరమ్ లు ఎంచుకోవాలి.  ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. చర్మం మీద మచ్చలు,మొటిమల తాలూకు గుర్తులు ఉంటే పసుపు, వేప, తులసి రసం వంటివి అప్లై చేయాలి.  ఇవన్నీ మచ్చలు, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో మాయిశ్చరైజర్ చాలా బాగా సహాయపడుతుంది.  ఇందుకోసం తేనె,  అలోవెరా, ఆర్గాన్ ఆయిల్ వంటి హెర్బల్ మాయిశ్తరైజర్లను ఎంచుకోవాలి. బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ ను వాడటం తప్పనిసరి.  అయితే సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి గ్రీన్ టీ లేదా జియోలిన్ వంటి హెర్బల్ సన్ స్క్రీన్ లను ఉపయోగించుకోవాలి. పై హెర్బల్ స్కిన్ కేర్ ఫాలో అయితే చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.  ఇది చర్మానికి లోతుగా పోషణ ఇస్తుంది.  చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది.                                          *రూపశ్రీ.