ఏపీలో ప్రభుత్వ కనుసన్నల్లో ప్రకృతి విధ్వంసం!

ప్రకృతి సమతుల్యం దెబ్బతింటే జరిగే విధ్వంసం ఊహకు అందనిది. అందుకే ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు.ప్రపంచదేశాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చలు జరుపుతున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలో కూడా ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టేందుకు, అందుకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఉంది. అయితే ఏపీలో ప్రభుత్వం కనుసన్నలలో యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. విపత్తులను సహజ రక్షణగా నిలుస్తున్న అడవులు నరికేస్తున్నారు. కొండలు తవ్వేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం కనుసన్నలలో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో వారి పర్యవేక్షణలో సాగుతోంది. ఈ విధ్వంసం అంతా ప్రభుత్వ పెద్దల స్వ ప్రయోజనం కోసమే జరుగుతోంది. భారతీ సిమెంట్స్ కోసం లేటరైట్‌, బాక్సైట్‌ ఖనిజాల దోపిడీ జరుగుతుంటే.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతోంది. దీనిపై తెలుగుదేశం  ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. కొండలను తవ్వేస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. భవిష్యత్ తరాలకు భద్రత లేకుండా చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. ఐదేళ్ల పాటు ప్రజల సంపదకు ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు స్వయంగా దోపిడీ దొంగలుగా మారి దోచుకుంటున్నారు. కొండలను పిండి చేసేస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. ఖనిజాలను తవ్వేస్తున్నారు. ఇది నిజంగా దారుణం, దౌర్భాగ్యం అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైసీపీపై ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో ప్రభుత్వం పాల్పడుతున్న ప్రకృతి విధ్వంసానికి సంబంధించి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన సందర్శించారు. జగన్ ప్రభుత్వం పాల్పడుతున్న ఈ ప్రకృతి విధ్వంసం.. కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతోందన్నారు. రుషి కొండను బోడి కొండ చేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ తవ్వకాలను ఆపాలని స్టే ఇచ్చినా లెక్క చేయలేదు. చివరికి సుప్రీం కోర్టు కూడా అక్షింతలు వేసింది. అప్పటికే పూడ్చలేని నష్టం జరిగిపోయింది. ఇక కర్నూలులో రవ్వల కొండను పిండి చేశారు. కొండను తవ్వేసిన వారిని వదిలేసి తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై కేసులు పెట్టి వేధించిందీ ప్రభుత్వం అంటూ విమర్శించారు.మన్యంలోని భమిడికలొద్ది నుంచి రోజూ వెయ్యి లారీల్లో లేటరైట్‌ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి భారతీ సిమెంట్స్‌కు పంపిస్తున్నారు.   కుప్పం పరిధిలోని శాంతిపురంలో విలువైన గ్రానైట్‌ కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారు.    తెలుగుదేశం ఆ స్థలాన్ని యూనివర్సిటీకి ఇచ్చి అందులో మూలికల మొక్కలు పెంచాలని భావించింది. ఇప్పుడు ఆ వర్సిటీ రిజిస్ట్రారే దగ్గరుండి అక్రమతవ్వకాలు జరిపిస్తున్నారు. ఇవేమీ తెలుగుదేశం చెబుతున్న మాటలు కావు. ఎక్కడ ఏ కొండను తవ్వేసింది. ఎక్కడెక్కడ అడవులను నరికేసింది అన్నీ గూగుల్ మ్యాప్ లో స్పష్టంగా తెలుస్తుందని చంద్రబాబు అన్నారు.   కాకినాడలో మడ అడవుల నరికివేత ఇష్టానుసారంగా సాగుతుంటే అటవీ శాఖ ఏం చేస్తోందని నిలదీశారు.   అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏకంగా 62 మంది మరణించడానికి కారణం అక్రమ ఇసుక తవ్వకాలు కాదా. ఇసుక మాఫియా విచ్చలవిడి గా ఇసుకను తవ్వేయడమే అందుకు కారణమని బాబు ధ్వజమెత్తారు.  చిత్తూరు జిల్లా బండపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, కాకినాడలో ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి కొండలను చెరువులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం 75 చోట్ల ఇటువంటి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు తాను చేసిన ప్రతి ఆరోపణనూ నిరూపించడానికి సిద్ధమన్నారు.ఇప్పటికైనా వీటిని అడ్డుకోకుంటే చరిత్ర హీనులుగా మారిపోతారని ఆయన అధికారులను హెచ్చరించారు. మైనింగ్‌, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులూ, సీఎస్ సహా తప్పు చేసిన ఏ అధికారనినీ వదలబోమనీ, అందరినీ చట్టం ముందుకు తీసుకువస్తామని చంద్రబాబు అన్నారు. కూడా ముందుకు రావాలి. చర్యలు తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎవరెక్కడున్నా తప్పు చేసిన అందరినీ చట్టం ముందుకు తెస్తాం’ అని చెప్పారు.    

మహోగ్రంగా గోదావరి వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అయితేనేమీ.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న వర్షాలు వల్ల అయితేనేమీ.. వేదంలా ఘోషిస్తూ.. ప్రవాహించే గోదావరి.. ఉగ్రరూపంలోకి మారి దిగువ ప్రాంతాలకు ఉరకలేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలే కాదు.. గోదావరి పరివాహక ప్రాంతాలు సైతం నీట మునుగుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో.. భద్రాచలం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.   భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి.. పలు చోట్ల కొండ చరియలు  విరిగిపడ్డాయి. అయితే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షపు నీరంతా గోదావరిలో కలిసి.. దిగువకు ప్రయాణిస్తోందీ. దీంతో తెలుగు రాష్ట్రాలకు గోదావరి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా.. రెండు రాష్ఱాల్లోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. తెలంగాణలో బాసర నుంచి  భ్రదాచలం వరకు.. ఆపై ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి బీభత్స స్థాయిలో ప్రవహిస్తూ... ఆయా ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.   అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌తోపాటు భద్రచాలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.   ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి వద్ద గల రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్ వద్ద   గోదావరి భారీ స్థాయిలో ప్రవహిస్తోంది.  కోవ్వూరులోని గోష్పాద క్షేత్రం  నీట మునిగిపోయింది.   కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే ఏటూరునాగరం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా ఆయా పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతోంది. ఆ క్రమంలో పోలవరం స్పిల్ వే గేట్ల ద్వారా 12 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగవకు వదిలారు. మరోవైపు.. గోదావరికి భారీగా వరద నీరు పొటెత్తడంతో.. ఆయా పరివాహక ప్రాంతాలతోపాటు లంక గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వరదలతో నిరాశ్రయలైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి... వారికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను గోదావరి జిల్లాలో ఎటువంటి పరిస్థితినైనే ఎదుర్కొనేందుకు సిద్ధం చేశారు.  . ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ నుంచి 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు  విడుదల చేశారు.

సంక్షేమం గీత దాటితే సంక్షోభమే!

శ్రీ లంకలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపధ్యంలో చెలరేగిన ప్రజాందోళనలు, హింసాత్మక సంఘటనలపై మన దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో, అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంపై విభిన్న కోణాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అధికార పీఠాన్ని అందుకునేందుకు, రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలు, ఉచిత వరాలను నిచ్చెనలుగా చేసుకుని, అధికారానికి అడ్డ దారిగా, దగ్గరి దారి (షార్ట్కట్) గా భావిస్తున్న నేపధ్యంలో, ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతోందనే, వాదన బలాన్ని పుంజుకుంటోంది.  నిజమే. సంక్షేమం గీత దాటితే సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలలో, ప్రభుత్వాలు, ‘ఓటు బ్యాంక్’ పథకాలకు పెద్ద పీట వేస్తున్నాయి. అప్పులు చేసి మరీ  పతకాలు అమలు చేస్తున్నాయి. మీటలు నొక్కి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. అందుకే ఇటీవల ఏపీ ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి, నొక్కిన మీటల లెక్కలు చెప్పి, మొత్తం 175 సీట్లు తమవే అన్న ధీమాను వ్యక్తపరిచారు. ఇలా ప్రజలను ఓటర్లుగా, ఓటర్లను అమ్ముడుపోయే సరుకుగా భావించి అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.  ఫలితంగా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకు పోవడంతో పాటుగా,ప్రభుత్వ ఉద్యోగులకు  సకాలంలో  జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. అలాగే, అప్పుల భారం పెరిగే కొద్దీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయలేక పోతున్నాయి. కోతలు విధిస్తున్నాయి. చేతులేత్తెస్తున్నాయి. మరో వంక అభివృద్ధి, దీర్ఘకాల సుస్థిర ప్రయోజనాలపై ప్రభుత్వాలు దృష్టి నిలపలేక పోతున్నాయి. శ్రీ లంకలో జరిగింది అదే, అందుకే మన దేశంలోనూ శ్రీ లంక తరహా పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఘటికలు వినిపిస్తున్నాయని, హెచ్చరికలు వినవస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి నత్రి నరేద్ర మోడీ, షార్ట్కట్ రాజకీయాలు.. దేశానికి అతిపెద్ద సవాలుగా మారాయని, చేసిన వ్యాఖ్యాలు ఇప్పడు దేశంలో ప్రధాన చర్చనీయంశాలు అయ్యాయి. ప్రధాన మంత్రి మోడీ, ప్రత్యేకించి ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయక పోయినా, షార్ట్కట్ రాజకీయాలపై ఆధారపడితే,  షార్ట్ సర్క్యూట్ ఖాయమని చేసిన హెచ్చరిక మాత్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా అందరికీ వర్తిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఝార్ఖండ్లోని దేవ్గఢ్లో రూ.16,800 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు  ఏపీ, తెలంగాన స్టేట్ గవర్నమెంట్స్’ సీరియస్’గా తీసుకోవాలని  అంటున్నారు. ప్రధాని మోడీ ఎక్కడా ఎవరి పేరూ ప్రస్తావించక పోయినా, ఓట్ల కోసం అమలు చేసే ప్రజాకర్షక పథకాలు దేశాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు అలాంటి పథకాలు ప్రకటించడాన్ని షార్ట్కట్ రాజకీయాలుగా అభివర్ణించారు. వీటిపై ఆధారపడితే షార్ట్ సర్క్యూట్ తప్పదని స్పష్టం చేశారు.. షార్ట్కట్ రాజకీయంతో దేశమే ధ్వంసం అవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి.. మనమంతా కఠోర శ్రమతో నవభారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రజాకర్షక పథకాలతో ఓట్లు సంపాదించడం సులువే. కానీ.. అలాంటి షార్ట్కట్లు అవలంబిస్తే దీర్ఘకాలిక దుష్పరిణామాలు ఉంటాయి" అని హెచ్చరించారు. నిజానికి ప్రధాని  మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితి గతులు, అప్పులు ఆదాయాలపై దృష్టిని కేంద్రేర కరించింది. ముఖ్యంగా, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు ఉల్లంఘించి, కార్పొరేషన్ల పేరిట అడ్డదారిలో చేస్తున్న అప్పులకు సంకెళ్ళు  బిగించేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా అప్పులు చేయకుండా రాష్ట్రాల రుణ పరిమితిని ఎప్పటికప్పుడ్డు సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే, కేంద్ర తేసుకున్న కటిన చర్యలు సహజంగానే రాష్ట్ర  ప్రభుత్వాలకు రుచించడం లేదు. అయితే, ఆర్థిక నిపుణులు, చివరకు రాష్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారులు కూడా, దీర్ఘకాల ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి సాధించాలంటే,ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరని, బెల్ట్స్ బిగించిక తప్పదని అంటున్నారు. అలాగే, శ్రీ లంక పరిణామాల నేపధ్యంలో, ప్రజలు కూడా, సంక్షేమం గీతదాటితే సంక్షోభమే, అనే వాస్తవాన్ని గుర్తిస్తున్నారని అంటున్నారు. ఒక విధంగా శ్రీ లంక పరిణామాలను ఒక గుణపాఠంగా తీసుకోవాలని అంటున్నారు.

ముగ్గురు అక్క‌చెల్లెళ్లు.. పుట్టిన తేదీ ఆగ‌స్టు 25!

పూర్వం క‌వ‌ల పిల్ల‌ల్ని చూసి ఆశ్చ‌ర్య‌ప‌డేవారు, ఆ త‌ర్వాత ఒకేలా వ్య‌వ‌హ‌రించే పిల్ల‌ల్ని చూసి ఆశ్చ‌ర్య‌ప‌డేవారు, మ‌నిషిని పోలిన మ‌నుషులు లోకంలో ఏడుగురు వుంటార‌ని ఓ చిత్ర‌మైన సిద్ధాంతం చాలా ప్ర‌చారంలో వుంది. ప్లారిడాకు చెందిన క్రిస్టిన్ లామ‌ర్ట్ ఆనందం మ‌రో ర‌కం. ఆమెకు ముగ్గురు పిల్ల‌లూ మూడేళ్ల తేడాతో జ‌న్మించారు.. అదీ  ఒకే తేదీన‌! త‌న ముగ్గురు పిల్ల‌లు సోఫియా, గ్యులియానా, మియాలు ఆగ‌స్టు 25నే పుట్ట‌డం చిత్రంగా వుంద‌ని, దైవ కృప‌గా భావిస్తున్నాన‌ని అన్న‌ది త‌ల్లి క్రిస్టిన్‌. ఆమే కాదు చుట్టుపక్క‌ల‌వారూ ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌డుతున్నారు. ఇదెలా సాధ్యం?.. ప్ర‌తీవారూ వేసుకుంటున్న ప్ర‌శ్న‌. ఆరేళ్ల సోఫియా 2015 ఆగ‌స్టు 25న పుట్టింది. మూడేళ్ల గ్యులియానా 2018లో అదే తేదీన పుట్టింది.  చిన్నారి  మియా 2021 లో అదే తేదీన జ‌న్మించింది! అంటే ఆగ‌స్టు 25వ తేదీ ఆ యింట, ఆ వీధి వీధంతా  పుట్టిన‌రోజు పండ‌గే.. ప్ర‌తీ సంవ‌త్స‌రం! పెద్ద పిల్ల సోఫియాని క‌డుపుతో వున్న‌పుడు త‌న‌కు ఆగ‌స్టు 23న బిడ్డ పుట్ట‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్లు క్రిస్టిన్ తో అన్నారు. కానీ సోఫియా 25వ తేదీన పుట్టింది. రెండో బిడ్డ స‌మ‌యంలో డాక్ట‌ర్లు చెప్పిన‌ట్టే జ‌రుగుతుంద‌ని ఆశించింది. కానీ చాలా చిత్రంగా ఆగ‌స్టు 25నే జ‌న్మించి డాక్ట‌ర్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 

అందరికీ ఉచితంగా బూస్టర్ డోసు .. ఆజాదీకా కానుక

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం  మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ' పేరుతో  నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగగాగా 75 రోజుల పాటు దేశ ప్రజాలందరికీ, కొవిడ్ వాక్సిన్ మూడవ  డోసు (బూస్టర్ ) ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రస్తుతం 60ఎళ్ల పైబడిన వారికీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మాత్రమే ఉచితంగా బూస్టర్ డోసు ఇస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేటు కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నారు. దీంతో, ఈవయస్సు వారిలో రెండు కేవలం ఒక శాతం మంది మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో, మహమ్మారి మరో మారు విజృంభించక ముందే సాధ్యమైనంత ఎక్కువ మందికి బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభమవుతుంది  ఇందులో భాగంగా 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటోన్న ఆజాదీకా అమృత్‌ మహాత్సవ్‌ లో భాగంగా ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అధికార వర్గాలు తెలిపాయి. దేశం మొత్తంలో మెజారిటీ ప్రజలు తొమ్మిది నెలల క్రితం రెండు డోసులు తీసుకున్నారు. అయితే, రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్‌ల వల్ల పొందే యాంటీబాడీలు క్రమంగా క్షీణించిపోతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి, ఐసీఎంఆర్ తోపాటు ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో బూస్టర్‌ డోసు ఇవ్వడం వల్ల రోగనిరోధక స్పందనలను మరింత పెంచవచ్చని శాస్త్ర వేత్తలు చేసిన సూచన ఆధారంగా 18ఏళ్ల వయసు పైబడిన వారికి ప్రత్యేక కార్యక్రమం ద్వారా బూస్టర్‌ డోసును ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.  జులై 15 నుంచి ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం, దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారిలో 96 శాతం మంది ఒకడోసు తీసుకోగా.. 87శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ప్రికాషన్‌ డోసుగా పిలుస్తోన్న మూడో డోసును మాత్రం 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేటు కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నారు. దేశంలో 77 కోట్ల మంది ఈ వయసు వారు ఉండగా అందులో కేవలం ఒకశాతం మాత్రమే ఇప్పటివరకు ప్రికాషన్‌ డోసును తీసుకున్నారు. 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మాత్రం బూస్టర్‌ డోసును ఉచితంగా అందిస్తున్నారు. వీరి సంఖ్య 16 కోట్లు ఉండగా వారిలో 26శాతం మాత్రమే మూడో డోసు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో వైపు కరోనా వ్యాక్సిన్‌ రెండు, మూడు డోసుల మధ్య వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించింది. దీంతో రెండో డోసు తీసుకొని ఆరు నెలలు పూర్తైన వారు మూడో డోసును తీసుకోవచ్చునని అధికారులు తెలిపారు. 

విక్కీ.. మ‌న‌సున్న అదృష్ట‌వంతురాలు

ఊహించ‌ని మంచి జ‌రిగితే  అంత‌టి అదృష్ట‌వంతులు లేరంటారు. అదృష్టానికి సంబంధించి  అనేక క‌థ‌నాలు, సంఘ‌ట‌న‌లు మ‌నం చాలా వినే ఉంటాం, చూసే ఉంటాం. కానీ  ఆ అదృష్ట‌వంతుల‌కు మంచి మ‌న‌సు వుంటే ఊహించ‌ని మేలు అవ‌త‌లివారికీ జ‌రుగుతుంది. ఈ మాట విక్కీ ఉమోడుకి స‌రిగ్గా  స‌రిపో తుంది. ఆమె త‌క్కువలో వ‌స్తోంద‌ని రెండు సోఫాల్ని ఇంటికి తెప్పించింది. తీరా దాని కుష‌న్‌లు స‌రి చేస్తుంటే ఏకంగా 27 ల‌క్ష‌ల డ‌బ్బుతో ఉన్న రెండు క‌వ‌ర్లు దొరికాయి. అదృష్ట‌మంటే ఇదేరా అనుకున్నా రంతా. ఇత‌రులెవ‌రైనా అయితే ఆ డ‌బ్బును గుట్టుచ‌ప్పుడు కాకుండా  లాక‌ర్‌లో పెట్టేసుకుంటారు. కానీ  విక్కీ అలా చేయ‌లేదు.  ఆమె వెంట‌నే ఆ డ‌బ్బును నిజంగా ఆ డ‌బ్బు ఎవ‌రిదో క‌నుక్కుని తిరిగి ఇచ్చే సింది.  ఇలాటివారు ఈ  రోజుల్లోనూ  వుంటారా అనిపించ‌వ‌చ్చు. కాలిఫోర్నియాకు చెందిన విక్కీ త‌న కొత్త ఇంటికి ఫ‌ర్నీచ‌ర్ కొనాల‌నుకుంది. ఆన్‌లైన్‌లో సోఫాలు  బుక్ చేయడానికి ఒక వెబ్‌సైట్ వెతికింది. ఆమెకు కావాల్సిన ధ‌ర‌లో రెండు మంచి సోఫాలు, వాటికి  త‌గిన కుర్చీల‌ను వెతికింది. కానీ వాటిని ఒక వ్య‌క్తి పైసా చెల్లించ‌కుండానే ఇస్తాన‌ని త‌న  వ‌ద్ద  వున్నాయ‌ని  ఓ పెద్ద‌మ‌నిషి  ఒక  ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. అది ఆమె దృష్టిలో ప‌డింది. ముందు న‌మ్మ‌లేదు. త‌ర్వాత ఫోన్ చేసి ఆ వ్య‌క్తితో మాట్లాడింది.  ఆ వ్య‌క్తి త‌మ బంధువు ఒక‌రు చ‌నిపోవ‌డంతో అత‌నికి సంబంధించిన వ‌స్తువు ల‌న్నీ ఉచితంగా ఇచ్చేసి ఇల్లు ఖాళీ చేయ‌ద‌ల‌చిన్న‌ట్టు తెలిసింది. విక్కీకి త‌న కొత్త నివాసంలో ఏమీ లేవు గ‌నుక విడిగా కొనే బ‌దులు ఆయ‌నను క‌లిసి వాటిని తీసుకోవాల‌ని అనుకుంది. వెంట‌నే ఆయ‌న్ను క‌లిసి రెండు సోఫాల‌ను, వాటికి త‌గిన రంగులోని రెండు కుర్చీల‌ను కూడా తీసుకుంది. వాటిని ఇంటికి తెచ్చింది.  కొత్త సోఫాల‌ను చూసి ఎంతో మురిసిపోయింది విక్కీ. తీరా వాటిని స‌ద్దుతుంటే సోఫాలో ఇరుక్కుని రెండు క‌వ‌ర్లు క‌నిపించాయి. అదేమిటా అని చూస్తే వాటిలో డ‌బ్బు క‌ట్ట‌లు వున్నాయి! చిన్నా, చిత‌కా కాదు..ఏకంగా మ‌న లెక్క‌ల ప్ర‌కారం 27 ల‌క్ష‌లు! ఆమె ఆశ్చ‌ర్యానికి అంతే లేదు. కానీ వాటిని తాను తీసి దాచుకోలేదు. దేవుడు మాకు జీవితానికి త‌గినంత ఆర్ధిక బ‌లాన్ని, వృత్తి వుద్యోగాల‌నిచ్చాడు, ఈ డ‌బ్బు వుంచుకోలేన‌ని అనుకుందామె. వెంట‌నే సోఫాలు ఇచ్చిన వ్య‌క్తిని క‌లిసి ఆయ‌న‌కి క‌వ‌ర్‌ని అలానే ఇచ్చేసిందామె. ఆయ‌న కూడా ఆమె గొప్ప‌త‌నాన్ని గ్ర‌హించి కొత్త ఫ్రిజ్ కొనుక్కోమ‌ని రెండువేల డాల‌ర్లు ఇచ్చాడు.  ఇంత‌కంటే గొప్ప వ్య‌క్తుల‌ను మ‌నం చూడ‌గ‌ల‌మా?

ముప్పు ముంగిట కడెం ప్రాజెక్టు..వరద ఉధృతి పెరిగితే డ్యాం డ్యామేజ్!

భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి మరింత పెరిగితే డ్యామ్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని  అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ దిగువన ఉన్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎటువంటి పరిస్థితినైనా  ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి డ్యామ్ వద్దకు చేరుకుని అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కడెం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న వరదనీటి ప్రవాహంపై ఆరా తీసేరు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి అక్కడే ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. భారీ వరద కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఇన్ ఫ్లో 2లక్షల 35 వేల క్యూసెక్కులు ఉండగా లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు   కాగా ప్రస్తుతం 1087 అడుగులకు చేరింది.

వర్షాల ప్రభావం- తెలంగాణ ఎంసెట్ వాయిదా

తెలంగాణలో కుండపోత వర్షాల  నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలను వాయిదా వేస్తూ  ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి  ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను తరువాత  ఖరారు చేస్తామని తెలిపింది.  అయితే, అదే సమయంలో  ఈ నెల 18,19, 20 న జరగాల్సిన ఎంసెట్ ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని ఒక ప్రకటనలో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్‌ ,18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న ఎ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికీ ఎంసెట్  పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి కాలేదు.  ఈ పరిస్థితుల్లో  విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారనీ, ఎంసెట్ ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్ ను పరిగణనలోనికి తీసుకుని  గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను ఉన్నత విద్యా మండలి వాయిదా వేసింది.

మీ  బ‌డిని అలా వదిలేస్తారా  సీఎం సార్! 

చ‌దువుకుని ఉన్న‌తోద్యోగాల్లో స్థిర‌ప‌డిన‌వారిలో చాలామంది త‌మ వూరికి ఏదో చేయాల‌న్న ఆకాంక్ష బాగా వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగానే చాలామంది వూళ్ల‌లో రోడ్డు వేయించ‌డ‌మూ, చ‌దువుకున్న పాఠశాలకు ఆర్ధిక సాయం చేయ‌డం, వీల‌యితే భ‌వ‌నాన్ని బావుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇటీవ‌ల  బాగా జ‌రుగుతోన్న హ‌ర్షించ‌ద‌గ్గ ప‌ని. ఈ జాబితాలోకి  తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా వ‌చ్చారు. ఆయ న దుబ్బాక‌లో చ‌దువుకున్న ఉన్న‌త పాఠ‌శాలను పున‌ర్నించ‌డానికి పూనుకున్నారు. అంతేకాదు 2016 లో  ఏకంగా కొత్త భ‌వ‌నాన్నేనిర్మించారు. ఇంత‌వ‌ర‌కూ హ‌ర్ష‌ణీయ‌మే. కానీ అక్క‌డితో చేతులు  దులి పేసుకు న్నారు సీఎం. భ‌వ‌నం దిట్టంగా బావుండ‌డంతో ఇంకా ఆరంభోత్స‌వ‌మూ కాక‌పోవ‌డంతో దుబ్బాకలో మందుబాబుల‌కు పైసా చెల్లించ‌కుండానే అది స‌రికొత్త బార్‌గా మారింది!  కేసీఆర్‌ దుబ్బాక ఉన్నత పాఠశాలలో 1974-78 మధ్య చదువుకొన్నారు. ఆ బడి శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరించాలని నిర్ణయించారు. అధికారులను ఆదేశించారు. 2016లో బడిని కూలగొట్టి  కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూనియర్‌ కాలేజీని కూడా అదే భవనంలో నిర్వహించాలన్న ఉద్దేశంతో మూడంతస్తుల భవన నిర్మాణం ప్రారంభించారు. 2018లో నిర్మాణం పూర్తైంది. అప్పటి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యవేక్షణలో గెలాక్సీ సంస్థ ఈ భవనాన్ని నిర్మించింది.   పది కోట్ల రూపాయలు పెట్టి కట్టిన భవనం పేకాటకు స్థావరమైంది. రాజమహల్‌ను తలపించే  రీతిలో రెండేళ్ల  క్రితం నిర్మించిన భవనం నిరుపయోగంగా మిగిలిపోయింది. కేసీఆర్‌ చేతుల మీదుగా కొత్త  భవనా న్ని ప్రారంభించాలని దుబ్బాక నేతలు భావించడం.. భవన నిర్మాణం పూర్తై రెండేండ్లైనా బడిని  ప్రారం భించకపోవడమే ఈ దుస్థితికి కారణమైంది. సీఎం కేసీఆర్‌ పాఠశాలను ప్రారంభిస్తారని రామలింగారెడ్డి అప్పట్లో ప్రకటించారు. అయితే,  ఆ ప్రకటన చేసిన నెల రోజులకే రామలింగారెడ్డి కరోనా తో 2020 ఆగస్టు లో చనిపోవ‌డంతో  పాఠశాల ప్రారంభోత్సవం ఆగిపోయింది.   సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తే నియోజకవర్గానికి  ఏమైనా అభివృద్ధి ప్రాజె క్టులు రావొచ్చని స్థానిక నేతలు భావిస్తున్నారు. దీంతో కార్పొరేట్‌ స్థాయిలో కట్టిన బడి  నిరుపయోగంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు కిటికీలకు ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. బడిలో ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. 2016లో బడిని కూల్చివేయడంతో దుబ్బాక పాత జూనియర్  కాలేజీ భవనం లోనే బడిని కూడా నిర్వహిస్తున్నారు. కొత్త భవనం ప్రారంభించకపోవడంతో ఇరుకు గదుల్లోనే  విద్యా బోధ న చేస్తున్నారు.  ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ 18,787 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించా రు. బడి కోసం 14 గదులు, జూనియర్‌ కాలేజీ కోసం 14 గదులు కేటాయించారు. సిబ్బంది, ప్రయోగశాలలు, స్టోర్‌ రూమ్‌, ఆడిటోరియం వీటికి అదనం. బడికి, కాలేజీకి వేర్వేరుగా వాటర్‌ ట్యాంకులు, కరెంటు కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. 250 మంది ఒకేసారి వినియోగించుకొనేలా మరుగుదొడ్లు నిర్మించారు. అన్నీ బాగానే వున్నాయి.  కానీ  తాను చ‌దువుకున్న బ‌డిని అలా పేకాట‌రాయుళ్ల‌కి వ‌దిలే య‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అని దుబ్బాక ప్ర‌జ‌లు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. 

నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి

ఒక పక్క వానలు, వరదలతో  అతలాకుతలం అవుతుంటే మరో పక్క భూమి కంపించి జనాలను భయభ్రాంతులను చేసింది.    నెల్లూరు జిల్లాలో భూమి కంపించింది.  బుధవారం ఉదయం నెల్లూరు జిల్లాలో  భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.   ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో భూ ప్రపంకపల ప్రభావం కనిపించింది.  జిల్లాలోని నాలుగు మండలాలలో భూమి కంపించిందని అధికారులు ధృవీకరించారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై   3.6గా నమోదైంది. దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు  మర్రిపాడు మండలాల్లో భూమి కంపించింది.  మూడు  నుంచి ఐదు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.  భూ కంపం  కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ఠం సంభవించలేదని అధికారులు తెలిపారు.   గతంలోనూ పలుసార్లు నెల్లూరు జిల్లాలో పలుసార్లు భూమి కంపించింది. వరుసగా వస్తున్న ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. 

ఒత్తిడిని వ‌దిలించే  కౌగిలింత‌!

మ‌న‌సు బాగోబోతే త‌ల్లి ద‌గ్గ‌ర‌కో, తండ్రి ద‌గ్గ‌ర‌కో వెళ్లి కాసేపు స‌మ‌యం గ‌డ‌ప‌డం అనాదిగా మ‌న ఇళ్ల‌ల్లో వున్న గొప్ప థెర‌పీ. కానీ ఈ మ‌ధ్య కాలం వ‌ర‌కూ అది నిజంగానే గొప్ప థెర‌పీ అన్న సంగ‌తి మ‌న‌కు తెలియ లేదు.  ఇప్పుడు విదేశాల్లో కొత్త‌గా  అదే  కొత్త‌గా క‌డ్లింగ్ థెర‌పీ అనే పేర విన‌ప‌డుతోంది. వృత్తి, ఉద్యోగాల్లో మాన‌సిక వొత్తిడికి గుర‌వుతున్న‌వారి సంఖ్య ఈ రోజుల్లో క్ర‌మేపీ పెరుగుతోంది. వీరిలో తొంభై శాతం మంది ఆస్ప‌త్రులు, డాక్ట‌ర్లు, నిపుణుల చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేస్తున్నారు.  ఆరోగ్య రంగంలో అనేకమంది నిపుణులు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్ని దూరం చేస్తుంటారు. వాళ్లంతా స‌మాజం లో గౌర‌వాన్ని అందుకునే ప్రొఫెష‌న‌లిస్టులు.  కొంద‌రు బాడీ మ‌సాజింగ్‌, మ‌రికొంద‌రు ఫిజియో థెరపిస్టు లు, ఇంకొంద‌రు సైకాల‌జిస్టులు. కానీ చిత్రంగా ట్రెవ‌ర్ హూట‌న్ వృత్తి వేరు. వింటే మీరే  ఆశ్చ‌ర్య‌పోతారు. ఈయ‌న్ని క‌డ్ల‌ర్ అంటారు. అంటే శారీర‌క‌, మాన సిక వొత్తిడికి గుర‌యిన‌వారిని కౌగిలించుకుని వారి బాధ‌ని నివృతి చేస్తార‌ట‌! ఇద్ద‌రి కౌగిలింతని ఖ‌చ్చితం గా సెక్స్‌ప‌రంగానే చూసే ఈ రోజుల్లో ఇలాంటి థెర‌పీ కూడా వుందా అంటే వుంద‌నే అనాలి. దీనికి సెక్స్‌కి అస్స‌లు సంబంధం లేదంటున్నారు ప్ర‌ముఖ క‌డ్ల‌ర్ హూట‌న్‌.  క‌డ్ల‌ర్ అనే ప్రొఫెష‌న్ విదేశాల్లో ఇటీవ‌లే విన‌ప‌డుతోన్న కొత్త థెర‌పీ. దీన్నే థెరాప్టిక్ అనీ అంటారు. ఇపుడు దీనికి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. దీని వల్ల చాలామంది త‌మ వ‌ర్క్ స్ట్రెస్ నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నా మ‌నీ అంటున్నారు. ఇవాళిటిదాకా సాధార‌ణంగా మాన‌సికంగా, శారీర‌కంగా అల‌సిపోయిన‌వారిని  క‌నీసం అర‌గంట మెడిటేష‌న్ చేయ‌మ‌ని టీవీల్లో, బ‌య‌ట ప్ర‌సంగాల్లో చాలామంది ఊద‌ర‌గొడుతున్నారు. మ‌న దేశంలోనే కాదు విదేశాల్లోనూ ధ్యానానికి డిమాండ్ అమాంతం పెరిగింది. కోట్ల‌మంది తూ.చ త‌ప్ప‌క పాటి స్తున్నారు. ఎంతో మంచి ఫ‌లితాల‌నిస్తున్నాయంటున్నారు.  ఇప్ప‌టి తాజాగా వ‌చ్చిన థెర‌పీ క‌డ్ల‌ర్ థెర‌పీ. అస‌లీ పేరు వింటేనే ఏదో చిత్రంగానూ వుంది. అబ్బే అదెలా చేస్తార‌ని మొహం చిట్లించుకోవ‌డ‌మూ జ‌రుగుతోంది. కార‌ణం మ‌నం పుట్టి బుద్ధెరిగి ఇలాంటి కౌగిలి థెర‌పీల మాటే విన‌లేదు మ‌రి. కానీ ఇది అంద‌రూ అనుకుంటున్న‌ట్టు, అనుమానిస్తున్న‌ట్టుగా  ఏమీ వుండ‌దు. దీన్ని ఒక‌రిద్ద‌రి స‌మ‌క్షంలోనే, దుస్తుల‌తోనే చేసే థెర‌పీ అంటున్నారు హూట‌న్‌. అయితే ఇది కూడా ధ్యానంతో స‌మాన‌మేనంటున్నారాయ‌న‌. మాట‌లు వుండ‌వు, కేవ‌లం సున్నిత కౌగిలి మాత్ర‌మే. అదీ ఒక గంట‌సేపు. కేవ‌లం ఒంట‌రిగా  క‌ళ్లు మూసుకుని సేద తీర‌డం లాంటిది. అయితే దీనివ‌ల్ల ఎంతో ప్ర‌యో జ‌నం వుంటుందిట‌. అన్న‌ట్టు ఈ థెరపిస్టు గంట‌కు ఏడువేల రూపాయ‌లు ఛార్జ్ చేస్తున్నాడ‌ట‌. అదొక్క‌టే ఇబ్బంది క‌రం. గంట ప‌ట్టుకుని వున్నందుకు అంత చెల్లించాలా అనే అనుమానాలు మ‌న‌లానే  హూట‌న్ పేషెంట్లు ముందు ఇబ్బందిగా ప్ర‌శ్నించారు. కానీ ఆయ‌న థెర‌పీ చాలా గొప్ప‌గా వుంద‌ని గ్ర‌హించిన‌వారు ఆ ఫీజు త‌ప్ప‌నిస‌రిగనుక ఓకే అనేస్తున్నారు. దీనివ‌ల్ల ఇత‌రుల‌తో స్నేహ‌సంబంధాలు కూడా బ‌ల‌ప‌డుతు న్నాయ‌నే అభిప్రాయాలుయి.  ఇప్ప‌టి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల‌తో యువ‌త ఎంతో మాన‌సిక‌, శారీర‌క శ్ర‌మ‌కు గుర‌వుతున్నారు. ఈ రోజుల్లో ఆహార ప‌ద్ద‌తులు, జీవన‌విధానంలో వ‌చ్చిన‌, వస్తున్న మార్పుల‌తో ఎంద‌రో మంచి ఆరోగ్యానికి ఆస్ప‌త్రు లు, డాక్ట‌ర్ల మీదా, నిపుణుల మీదా ఆధార‌ప‌డుతూనే వున్నారు. అందులోనూ అనేక ర‌కాల వైద్య విధానా ల‌ను అనుస‌రించ‌డం చూస్తున్నాం. అయితే  ఈ  క‌డ్ల‌ర్  నిపుణులు ఎంత‌వ‌ర‌కూ నిజంగా మ‌న దేశ  ప్ర‌జ ల‌కు యువ‌త‌కు ఉప‌యోగ‌ప‌డ‌తార‌న్న‌ది అనుమాన‌మే.

వెంకయ్యకే మళ్ళీ.. నాగపూర్ ఆదేశం ?

రాష్ట్రపతి ఎన్నికల సందడి చివరాఖరు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో అంటే జులై 18 పోలింగ్ జరుగుతుంది. 21 న కౌంటింగ్, 25 న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. ఇక  అక్కడితో నెల రోజులకు పైగా రాష్ట్రపతి  ఎన్నికల  చుట్టూ సాగుతున్న రాజకీయ సందడి సర్డుమణుగుతుంది. అయితే ఆ వెంటనే, నిజానికి ఇంకా ముందుగానే, ఉప రాష్ట్రపతి ఎన్నిక  ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం 2022, ఆగస్టు 10 వతేదీతో ముగుస్తోంది. ఈ నేపధ్యంలో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక  ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విడుదల చేసిన న్నికల షెడ్యూలు ప్రకారం, జూలై 5 న నోటిఫికేషన్ విడుదలైంది. అదే రోజున మొదలైన నామినేషన్ల గడువు, జూలై 19 తో ముస్తుంది. అవసరమైతే ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.  అయితే, ఇంత వరకు అధికార, విపక్ష పార్టీలు/ కూటములు అభ్యర్ధుల ఎంపికపై, అంతగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. నిజానికి, రాష్ట్ర పతి ఎన్నికలలో విపక్షాలకు, అంతా కలిసి, పోటీ చేస్తే గెలిచే అవకాశం, ఆశ ఓ చిగురంత అయినా వుంది. కానీ, ఉపరాష్ట్ర పతి ఎన్నికలలో చిగురంత కాదు, కనీసం చీమ తలంత చిరు అవకాశం, చిన్ని ఆశకు కూడా అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో పాటుగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభ్యులకు కూడా,ఓటు హక్కు ఉంటుంది. కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలో, ఎమ్మెల్యేలకు ఓటుహక్కు ఉండదు, కేవలం, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలకు మాత్రమే ఓటు హాక్కు ఉంటుంది.  పార్లమెంట్ ఉభయ సభల్లో  బీజేపీ/ ఎన్డీఎ కూటమికి సంపూర్ణ ఆధిక్యత వుంది. పార్లమెంటు ఉభయ సభల ప్రస్తుత బలం 780 కాగా.. మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసేందుకు  390 మంది ఎంపీల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ఒక్క బీజేపీకే పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి 394 మంది ఏంపీలున్నారు. ఎన్డీఎ బలం 390(ఎల్ఎస్) ప్లస్ 144 (ఆర్ ఎస్) మొత్తం 534 వరకు  వుంది. ఎన్డీఎకి మద్దతు ఇస్తున్న వైసీపే, (22)  శివసేన చీలిక వర్గం (14) బీజేడీ ఇతర పార్టీల సఖ్యాబలన్ని కలుపుకుంటే మొత్తం 780 ఎంపీలలో ఎన్డీఎ అభ్యర్ధికి ఇంచుమించుగా 600 మంది మద్దతు లభించే అవకాశం వుంది. అంతే కాకుండా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎదురైనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను, రాజ్య సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గేకి అప్పగించింది.  అంతే కాకుండా బలబాలతో సంబంధం లేకుండా, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను బరిలో దించే అవకాశం ఉందని అంటున్నారు. అదలా ఉంటే బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి విషయంలో ప్రస్తుతాని సస్పెన్స్ కొనసాగుతోంది.  అయితే మొదటి నుంచి కూడా  మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకే  ఆయన్ని రాజ్య సభకు తిరిగి నామినేట్ చేయలేదని ప్రచారం జరిగింది. కాగా, ఆయన రాజ్యసభ పదవీ  కాలం జులై  10 తేదీతో ముగిసింది. అందుకు ఒక రోజు ముందే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, తాజగా, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడినే మరో మారు కొనసాగించాలని, పార్టీ  హై కమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రానున్న రెండేళ్లలో , బీజేపీ కోర్ ఐడియాలజీకి సంబందించిన కీలక బిల్లులు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో, ఇలాంటి సమయంలో వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ గా ఉండడం అవసరమని, హై కమాండ్ అలోచిస్తునట్లు తెలుస్తోంది. అయితే వెంకయ్య నాయుడు నో’ అనే పక్షంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో, కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ తో పాటుగా కేంద్ర మాజీ మంత్రులు సురేశ్‌ ప్రభు, ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌ పురీ, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ తదితరులు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, విశ్వసనీయ సమాచారం మేరకు వెంకయ్య నాయుడిని ఒప్పించే ప్రయత్నం గట్టిగా సాగుతోందని తెలుస్తోంది. కాగా, ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థిని నిర్ణయించనున్నట్లు సమాచారం. బోర్డులో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్‌ సంతోష్‌ సభ్యులుగా ఉన్నారు.

వానలు.. వరదలు.. తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం..

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండ పొడను చూసి నాలుగు రోజులైంది. నింగీ నేలా ఏకమయ్యాయా అన్నట్లుగా ఏకథాటిగా వాన పడుతూనే ఉంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపు భయంతో కంటిమీద కునుకు తీయడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలూ భారీ వర్షాలూ, వరదలతో అతలాకుతలమైపోతున్నాయి. జులై నెలలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం, ఇంతటి భారీ వరదలు సంభవించడం వందేళ్ల చరిత్రలో ఇదే మొదటి సారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని భద్రాచలం వద్ద రికార్డు స్థాయికి నీటి మట్టం చేరుకుంది.   ఇక కాళేశ్వరం వద్ద గోదావరి   మహోగ్రంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.   దీంతో అధికారులు  ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.   ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్లం ప్రమాద స్థాయికి చేరింది.  ఇప్పడో ఇహనో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.  ఇక పోలవరం వద్ద గోదావరి నది  వరద నీటితో పోటెత్తుతోంది.   పోలవరం స్పిల్ వే గేట్ల ద్వారా 12 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.   ఇప్పటికే గోదావరి పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా పోలవరం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి అంతకంతకు పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.  15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.  ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో తెలుగు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు.  ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తునప్పటికీ, మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.   

జమా ఖర్చు లెందుకు.. జేబు నిండితే చాలు.. జగన్ మద్యం పాలసీ

అవునంటే కాద‌నిలే కాదంటే అవున‌నిలే అన్న రీతిగా ఉంటుంది ఏపీ సీఎం జగన్ తీరు. ఆయన మద్యం పాలసీలో వింత పోకడలకు పోతున్నారు.  మ‌ద్య‌పాన నిషేధం గురించి ఉప‌న్యాసాలు ఇచ్చి త‌న స్వంత జె బ్రాండ్‌తో జ‌నానికి మ‌త్తెక్కించే విధానాన్ని అవలంబిస్తున్నారు. మ‌త్తెక్కించడమే కాదు.. జనం జేబులు గుల్ల చేసి మరీ వారికి అనారోగ్యాన్ని బోనస్ గా ఇస్తున్నారు.  అంద‌రికీ అందుబాటులో వుండే ధ‌ర‌ల్లో అందిస్తున్నామంటున్న మ‌ద్యంలో ర‌సాయనాలు అనారోగ్య హేతువుగా మారి ప్రాణాంత‌కంగా మారాయ‌ని విమ‌ర్శ‌లు రాష్ట్ర‌మంత‌టా  వెల్లువెత్తుతున్నాయి.  పైగా, జ‌బ్బులు, అనారోగ్యాలు జ‌నాల‌కి, అమ్మ‌కాల‌పై ప‌న్ను సొమ్ము జ‌గ‌న్‌కి వెళుతోంది.  ఈ అమ్మకాల‌పై ముప్ఫ‌యి శాతం సాధార‌ణ ఎక్సైజ్ ప‌న్ను రూపేణా జగన్ జేబుల్లోకి అక్రమ మద్యం ఆదాయం వెళ్తోంది. కాబట్టే డిజిటల్ లావాదేవీలు పెట్టలేదని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. అయినా జగన్ పాలసీయే వేరు. అందులో మద్యం పాలసీ వెరీ స్పెషల్. జమా ఖర్చులు ఎందుకు జేబు నిండితే చాలన్నట్లుగా జగన్ మద్యం పాలసీ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా సీఎం పెడ చెవిన పెడుతున్నారు. మ‌ద్య‌పానం నిషేధించాల‌ని గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్న‌వారే మ‌ద్యం నుంచి వ‌చ్చే ఆదాయాన్ని కోరుకుం టూ త‌మ త‌ర‌ఫున ప్ర‌త్యేక బ్రాండ్ల‌ను విక్రయిస్తున్నారు.  ప్ర‌భుత్వం ఇలాంటి ప్ర‌త్యేక  అమ్మకాలు, దుకాణాల‌వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దెబ్బ‌తింటోందన్న  విమ‌ర్శ‌లు రాష్ట్ర‌ మంత‌టా విన‌వ‌స్తు న్నాయి.   ఈ అమ్మకాల‌పై ముప్ఫ‌యి శాతం సాధార‌ణ ఎక్సైజ్ ప‌న్ను రూపేణా జగన్ జేబుల్లోకి అక్రమ మద్యం ఆదా యం వెళ్తోంది. కాబట్టే డిజిటల్ లావాదేవీలు పెట్టలేదని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.  మద్యం ఆదాయ కుంభకోణంపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నామని టీడీపీ నేత డోలా బాల వీరాం జనేయ స్వామి అన్నారు. బుధవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ   30 శాతం సాధార‌ణ ఎక్సైజ్ ప‌న్ను రూపేణా జగన్ జేబుల్లోకి అక్రమ మద్యం ఆదాయం వెళ్తోంది కాబట్టే డిజిటల్ లావాదేవీలు పెట్ట లేదన్నారు. మద్యంలో విషపూరిత రసాయనాలు ఉన్నాయని తాము నివేదికలు విడుదల చేస్తే ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు. అవసరం అయితే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ సర్కారు వచ్చిన తరువాతే రాష్ట్రంలో 106 మద్యం బ్రాండ్స్ వచ్చాయని డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఇదిలా వుండ‌గా,  కొత్త బార్ పాలసీ ద్వారా 800 బార్‌లకు రెండేళ్లు అనుమతించిన  జగన్ రెడ్డి  మద్య నిషేధం ఎలా చేస్తారని  పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు  ప్రశ్నించారు. బుధవారం మీడియా తో మాట్లాడుతూ, మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని తాము బయటపెట్టిన నివేదికపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మద్యం తయారు చేయించేది జగన్, ప్యాపారం చేయించేది ప్రభుత్వం, అమ్మేది వైకాపా కార్యకర్తలు అని ఆరోపించారు. ముఖ్యమంత్రే మద్యం వ్యాపారం చేయటం ప్రజలు చేసుకున్న దుర దృష్టమన్నారు. ఎంపిక చేసుకున్న కొంతమంది బినామీలతో మద్యం వ్యాపారం చేయిస్తూ, ఆ డబ్బునే తిరిగి ఎన్నికల్లో ఖర్చు చేయనున్నారని తెలిపారు. మొబైల్ బెల్టుషాపులు పెట్టి మరీ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని మండిపడ్డారు. దేశం మొత్తానికి మాదకద్రవ్యాల సరఫరా ఏపీ నుంచే జరుగుతోందన్నారు. వాటాల్లో తేడా లొచ్చేయి గ‌నుకే  కేసులు బయటకు వస్తున్నాయని ఏలూరు సాంబశివరావు పేర్కొన్నారు.

పారిశుధ్య ప్రాధాన్య‌త తెలుసుకోవాలి!

కంటి కింద పులిపిరికాయ, గీర‌ల టీ ష‌ర్టు, లుంగీతో బెదిరించి మ‌రీ వ‌సూలు చేసేది దాదాగిరీ తాలూకు ఫీజు. చేయించుకున్న వెధ‌వ ప‌నికి ఆ వ‌చ్చిన‌ వాడికి అడిగినంతా ఇవ్వ‌క త‌ప్ప‌దు స‌ద‌రు ధ‌నికుడికి.. ఇది పాత సినిమాల్లో, క‌థ‌ల్లో  విల‌న్ అసిస్టెంట్ల తీరు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న‌ తీరు ఇందుకు పూర్తి వ్య‌తిరేకంగా  వుంది. మున్సిప‌ల్ కార్మికుల‌చేత న‌డుం విరిగేలా ప‌నిచేయించుకుంటూ వారికి జీతాలు ఇవ్వ‌క‌పోగా చెత్త‌ మీద ప‌న్ను విధించి వ‌సూలు చేయ‌డానికి హెచ్చ‌రిక‌లూ చేయ‌డం. రాష్ట్రంలో క‌నీసం మున్సిప‌ల్ వ్య‌వ‌స్థా స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌న్న‌దానికి ఇదే పెద్ద ఉదాహ‌ర‌ణ‌.  అధికారంలోకి రాగానే నూత‌నోత్సాహంతో ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ పారిశుధ్య‌ కార్మికుల జీతాలు పెంచుతు న్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇన్నాళ్ల‌కు ప్ర‌భుత్వానికి త‌మ‌పై కాసింత ప్రేమ‌, ద‌యా క‌లిగింద‌ని పాపం వారంతా తెగ ఆనంద‌ప‌డ్డారు. ఆ ఆనందంలో మూడు షిఫ్ట్‌లూ ప‌నిచేసి రోడ్ల‌ను అద్దంగా చేయ‌డానికి శ్ర‌మిస్తు న్నా రు. కానీ రాజుగారి నీతి వాక్యాల‌న్నీ అమ‌లు కావ‌న్న సంగ‌తి కార్మికుల‌కు బ్యాంకుల‌కు వెళ్లి డ‌బ్బులు అడి గితేగాని తెలియ‌లేదు. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్దెనిమిది వేలు కాకుండా ముందు ఇస్తున్న ప‌దిహేను వేలే అందుకుంటున్నారు.  క‌నీసం ఇవ్వాల్సిన జీతం కూడా ఇవ్వ‌క‌పోగా, వారి గోడు వినిపించుకొన‌క‌పోవ‌డంతో  ప్రస్తుతం ఏపీ వ్యాప్తం గా పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని.. మరింత పెంచాలని  వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల విషయంలో ఇంత కాలం ఓపిక పట్టిన వారు ఇప్పుడు  రోడ్డెక్కి  సమ్మె ప్రారంభించారు.  ప్రస్తుతం ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా చెత్తపన్నును  ముక్కు పిండి  మరీ వసూలు చేస్తోంది. ఈ ప్రకారం పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తోంది. చెత్త పన్ను ఇవ్వకపోతే   చెత్త ఇంటి ముందు పోయ్యాలనే  హెచ్చరికలు కూడా మంత్రుల స్థాయి నేతలు చేశారు.  పారిశుద్ధ్య కార్మికుల జీతాల విషయం మాత్రం మాట్లాడటం లేదు. అస‌లు అన్నింటికీ మించి మ‌రీ విచిత్ర‌మేమంటే.. మళ్లీ అధి కారంలోకి వస్తే జీతాలు పెంచుతామని మం త్రులు చెప్ప‌డం. ప్ర‌జ‌లు, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు ఈ మాట‌లు విని న‌వ్వాలో, ఏడ‌వాలో అర్ధం గాని సందిగ్ధంలో వున్నారు. అధికారంలో వున్న‌వారు, జీతాలు ఇవ్వాల్సిన‌వారు ఇలాంటి జోకులు వేస్తే త‌ట్టుకునే శ‌క్తి సామాన్య కార్మికుల‌కు ఎలా వుంటుంద‌న్న ధ్యాస స‌ద‌రు మంత్రుల‌కు లేక‌పోవ‌డ‌మే విచిత్రం. మ‌రి పారిశుధ్యం ఎవ‌రికి అవ‌స‌రం?

వినియోగంలోకి పోలవరం స్పిల్ వే గేట్లు

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. కానీ దానిని సత్వరమే పూర్తి చేయడానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పనులను పరుగులు పెట్టించారు.   ప్రపంచంలోనే అతిపెద్దదైన పోలవరం ప్రాజెక్టు పనులు వైసీపీ అధికారంలోకి వచ్చాకా నత్తనడకన సాగుతున్నాయి.  అయితే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల పనులు పూర్తయ్యాయి. ఆ ఫలితం ఇప్పుడు తెలిసింది. చంద్రబాబు దార్శనికత ఫలితం రాష్ట్ర ప్రజలకు మరో సారి అర్దమైంది.  వరదనీటి విడుదల స్పిల్ వే వ్యవస్థ   సమర్థవంతంగా పనిచేసింది. ప్రాజెక్టు గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే విధంగా అమర్చారు. ఈ స్పిల్ వేలోని  48 హైడ్రాలిక్ గేట్లు తొలిసారిగా   పూర్తిగా వినియోగంలోకి వచ్చాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు గేట్లు విజయవంతంగా అన్నీ ఒకేసారి అతి తక్కువ సమయంలోనే 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ చానెల్ మీదుగా గోదావరి నది దిగువకు విడుదల చేశాయి. ప్రాజెక్టులోని మొత్తం 48 గేట్లను ఏకకాలంలో ఎత్తడం ద్వారా వాటి పని తీరు సమర్థంగా ఉందని నిరూపించడంతో పాటు వరదనీటిని సులువుగా 6 కిలోమీటర్ల మేర అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేయడంలో గేట్లు కీలకపాత్ర వహించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వర్షాకాల సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీ ఎత్తున వరదలు వస్తున్నాయి. గోదావరి నదికి ఇలా పెద్ద ఎత్తున వరదలు రావడం వందేళ్ళ చరిత్రలో ఇదే తొలిసారి అని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎగువ నుండి వచ్చే భారీ వరదలను తట్టుకోవడానికి పోలవరం ప్రాజెక్టును అధికారులు ముందుగానే సిద్ధంగా ఉంచారు. స్పిల్ వే నుండి వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. వందేళ్ళ చరిత్రను ఆధారం చేసుకుని పోలవరం స్పిల్ వేను, గేట్లను   డిజైన్ చేశారు. వందేళ్ళలో గోదావరికి 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని అందుకే 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను, గేట్లను డిజైన్ చేశారని మేఘా ఇంజనీరింగ్ సంస్ద సీజీఎం చెప్పారు. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే గేట్ల నుండి 15 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు.. టాప్ ఫైవ్ లో కేసీఆర్

రాజకీయ నాయకులూ అన్న తర్వాత కేసులు ఉండడం సహజం. అందులోనూ, పుష్కర కాలం పైగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పై క్రిమినల్ కేసులు ఉండడం, విశేషం కాదు. కానీ, తెలంగాణ ఉద్యమం ముగిసి, రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా, ఇంకా, అయన పై  అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అదలా ఉంచితే..  దేశంలో, అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదైన‌ టాప్ ఫైవ్  ప్రజా ప్రతినిధుల్లో కేసీఆర్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) విడుదల చేసిన నివేదికలో, అత్యధిక క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల్లో కేసీఆర్ పేరు ఐదవ స్థానంలో వుంది.   ఈనెల 18న  జరిగే రాష్ట్ర పార్టి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో ఓటు హక్కున్న ఎమ్మెల్యేలు, ఎంపీల నేర చరితను, వారిపై ఉన్న కేసుల వివరాలను, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు విడుదల చేశాయి. ఈ రెండు ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థలు విడుదల చేసిన నివేదికల ప్రకారం  ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తొలి ఐదుగురిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉంది.. ఏడీఆర్ నివేదొక ప్రకారం, కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, అందులో ఇంచుమించుగా సగానికి పైగా (37)  తీవ్ర నేరాలకు పాల్పడిన కేసులున్నాయి. అందులో కొన్ని కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో.. మహిళా ఉద్యోగిని విధులను అడ్డుకోవడం, గాయ పరిచే ప్రయతనం చేయడం (ఐపీసీ సెక్షన్-506)కి సంబంధించి నాలుగు కేసులతో పాటుగా హత్యాయత్నానికి సంబంధించి  13 నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన కేసులున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు అడ్డుకోవ‌డం, గాయపరచడానికి ప్ర‌య‌త్నించ‌డానికి సంబంధించిన 4 అభియోగాలు, హత్య ప్రయత్నానికి సంబంధించిన 3 అభియోగాలు, ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా గాయపరచడానికి సంబంధించిన 3 ఆరోపణలు, ఎవరైనా ఒక వ్యక్తి నుండి దొంగతనంగా లేదా దాడి ద్వారా లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించి దొంగతనానికి పాల్పడి, ఆ వ్యక్తికి హాని కలిగించినా లేదా అతని ప్రాణానికి హాని కలిగించిన, 'స్నాచింగ్స‌ నేరాలకు సంబదించి మూడు అభియోగాలు ఉన్నాయి. మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు సంబంధించిన ఆరోపణలు, ఇలా కేసీఆర్ పై మొత్తం 13 కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులే ఉన్నాయి.  ఇక ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ నివేదికల ప్రకారం అత్యధిక క్రిమినల్ కేసులున్న టాప్ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో కేరళ ఎంపీ డీన్ కురియకోస్ 204 కేసులతో మొద‌టి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్‌ కేసులతో తమిళనాడుకు చెందినా డీఎంకే ఎంపీ ఎస్‌.కతిరవన్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజం ఖాన్‌ 87 కేసుల‌తో మూడో స్థానంలో ఉన్నారు. మరో తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్‌ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో ఉండగా, 64 క్రిమినల్ కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.

రాజ‌మార్గం.. ఒక‌రికి గ‌రుకు, ఒక‌రికి మెరుగు

కొంప‌లు అంటుకుంటేనే రాజుగారికి మంత్రి, సైన్యాధిప‌తి బాగా గుర్తుకు వ‌చ్చేది. వారి మాట‌, అవ‌స‌రం అప్పుడే శిరోధార్య‌మ‌వుతుంది. ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప‌రిస్థితీ అంతే. మూడేళ్ల పాల‌న తాలూకు రిపోర్టు ఏమాత్రం బాగోలేద‌న్న‌ది ప్ర‌జ‌లే మార్కులేసి మ‌రీ చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల‌ను  పిలిచి టిఫిన్లు పెట్టి చిన్న‌పాటి హెచ్చ‌రిక‌లూ చేశారు జ‌గ‌న్‌. తొలి విడ‌త‌లో మంత్రిప‌ద‌వులు ఇవ్వ‌ని వారికి మూడేళ్ల త‌ర్వాత వారికి ప‌ద‌వులు ఇవ్వ‌డానికి కొంద‌రిని ప‌దవి నుంచీ దించేశారు. అయినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. అంత‌టా నిర‌స‌నే వెల్లువెత్తుతోంది. మ‌రో వంక ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షం తెలుగు దేశంలో నూత‌నో త్సాహం వెల్లువెత్తుతోంది. వైసీపీ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌ల విముఖ‌తను టీడీపీ అనుకూలం చేసుకోవ డంలో  ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. స‌భ‌లు, స‌మావేశాలు, రోడ్డు షోల‌తో ప్ర‌భుత్వం ఎంత ప‌నికి మాలినిదిగా మారింద న్నది ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేస్తున్నారు. ఈసారి జ‌గ‌న్‌ను ఇంటికి పంప‌డానికి తెలుగు త‌మ్ముళ్లు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఈ ప‌రంగా త‌మ అధినేత ఆదేశాలు తూ.చ త‌ప్ప‌క పాటిస్తూ మంచి జోరులో ముంద‌డుగు వేస్తున్నారు.  ఈ నేప‌థ్యంలో  వైసీపీ గత ఎన్నికలలో అనుసరించిన వ్యూహాల తో పాటు కొత్త వ్యూహలు, కొత్త పద్దతుల కోసం అన్వేషిస్తోంది. తెలుగుదేశం పార్టీ గ‌త‌ ఎన్నికలలో జరిగిన తప్పులని సరిద్దిద్దుకుంటూ, సరికొత్త వ్యూహాలతో ముందుకి వెళ్తోంది. అలాగే  కొత్త వ్యూహకర్తలని, సలహాదారులని తీసుకుంటున్నాయ్.  ఎన్ని కలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. అయినా పార్టీలు మాత్రం అందుకోసం సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండమని  క్యాడర్ ను కోరుతున్నాయి. అదే సమయంలో వైసీపీ పాత వ్యూహంతో ఈ సారి కూడా ముందుకెళ్లే పరిస్ధితులు లేవు. అప్పట్లో చంద్రబాబును  అధికారంలో నుంచి దింపడమే లక్ష్యంగా పీకే సాయంతో పలు వ్యూహాలు రచించిన వైసీపీ ఇప్పుడు  మాత్రం కేవలం తన సంక్షేమ పధ‌కాలని నమ్ముకుని  బరిలోకి దిగాల్సిన పరిస్ధితి. అయితే సంక్షేమంలో లోటు పాట్లు  కొంప ముంచుతాయనే భయం వెంటాడుతోంది.   సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌త్యేకించి  ఒరిగేదేమీ లేద‌న్న అభి ప్రాయంలో వుంది. అందుకే ఇంతకు మించిన కొత్త వ్యూహాన్ని తయారు చేయాలని వ్యూహకర్త  రిషి రాజ్ సింగ్ ను జగన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం  కొత్తగా  రిక్రూట్ మెంట్లు కూడా  భారీ ఎత్తున చేపడుతోంది. ఏపీలో 2019 ఎన్నికల్లో  పరాభవం తర్వాత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీడీపీని  నామ రూపాల్లేకుం డా చేసి తిరిగి లేవనీయకుండా చేయాలన్న‌ జగన్ ప్రయత్నాల‌న్నీ విఫ‌ల‌మ‌వుతున్నాయి.  దీనికి  ప్రధాన కారణం రాష్ట్రంలో టీడీపీ కంటే బలమైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడమే. అలాగే  క్షేత్ర స్ధాయిలో ఆ పార్టీకి ఉన్న క్యాడర్ తో పాటు నేతలు కూడా ఆ పార్టీకి ఊపిరి. అయితే వ్యూహం మాత్రం ఖరారు కాకపోవ డంతో టీడీపీ తీవ్రంగా పాట్లు పడుతోంది. అయినా తెలుగుదేశం పార్టీ కి సంక్షోభాలు  కొత్త కాదు, ఇలాంటి సందర్బాలలో చంద్రబాబు తన రాజనీతి తో పార్టీ ని గ‌ట్టెక్కించారు. చంద్రబాబు  పరిపాలనా దక్షత ని చూసిన వారికీ ఎవరికైనా తెలుస్తుంది. సంక్షోబాన్ని అవకాశంగా మార్చుకోవడంలో చంద్ర బాబు దిట్ట.  ఈ విషయం ఆయనే చాల సందర్బాలలో చెప్పారు. ఏపీలో మారుతున్న పరిస్ధితుల్లో ఇన్నాళ్లూ వైసీపీకి అండగా నిలిచి, ఆ పార్టీ సాయం తీసుకున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనసు మార్చు కునేలా కనిపిస్తోంది. వైసీపీని మాత్రమే నమ్ముకుంటే రేపు టీడీపీ వైపు జనం మొగ్గితే పరిస్ధితి ఏమిటన్న భయం బీజేపీలో మొదలైంది. దీంతో తాజాగా తమ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు మద్దతిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పా టు చేసిన ఆత్మీయ భేటీకి బీజేపీ నేతలు సోము వీర్రాజు, కిషన్ రెడ్డి హాజరయ్యారు.చంద్రబాబుకు ధన్యవా దాలు కూడా తెలిపారు.చంద్రబాబు కూడా మోడీని  అభి నందించారు. దీంతో మోడీ మద్దతు వైసీపీకా, టీడీపీకా అన్న ప్రశ్న తలెత్తింది.   రాష్ట్రపతి  ఎన్నికల్లో ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం పార్టీ బేషరతుగా మద్దతు ప్రకటించిన విషయం  తెలి సిందే. అత్యున్నత పదవిలో ఓ గిరిజన మహిళకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తాము ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.  ఇప్పటికే చంద్రబాబు నియజక వర్గాలలో తిరుగుతూ కార్యకర్త లలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. పని చేసిన వారికే పదవులని,యువతకి 40 % అవకాశాలు ఇష్టం అని, కష్టపడిన వాళ్ళని పార్టీ గుర్తిస్తుందని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు.చంద్రబు కూడా తన కొత్త వ్యుహలతో వచ్చే ఎన్నికలలో బరిలోకి వస్తున్నారు అని రాజకీయ విశ్లేషకుల మాట.