ఈ దేవుళ్లకు దయే లేదు..
posted on Jul 11, 2022 @ 3:48PM
ఆస్పత్రులు దేవాలయాలు, డాక్టర్లు దేవుళ్లు, ఆస్పత్రుల్లో పనివాళ్లు మానవత్వానికి చిరునామాలు.. ఏదో తెలుగు పాఠం చెబుతున్నట్టుగా వుందిగదూ. నిజంగానే అదంతా పుస్తకాల్లో, ప్రసంగాల్లో వుంటుంది. వాస్తవంలో అంత వుండదు. అక్కడక్కడా అందుకు పూర్తి భిన్నంగా, అరాచకంగానూ వుంటుంది. అం దుకు తాజా వుదాహరణ మధ్యప్రదేశ్ మోరెనా పట్టణంలోని ఈ పిల్లాడి దుస్థితి. మీరు ఫొటోలో చూస్తు న్నది ఓ పిల్లాడు మరో పిల్లాడిని పడుకోబెట్టుకుని వున్నది. వాడేమీ జనాన్ని మోసం చేసి డబ్బులకు అలా కూచో లేదు. జీవితాంతం తనతో వుంటాడనుకున్న తమ్ముడి మృత దేహం అది. అవును. వాడి పేరు గుల్హన్, ఒళ్లో మృతదేహం వాడి తమ్ముడు రెండేళ్ల రాజాది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరెనా పట్టణంలో జరిగింది. అంబాహ్ లోని బద్ ఫ్రా గ్రామానికి చెందిన పూజారామ్ జాతవ్ తన కొడుకు వైద్యం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. రెండేళ్ల పిల్ల వాడు తీవ్రమైన రక్తహీనత, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న సమ యంలో మరణించాడు. కుమారుడు మరణించడంతో సొంత గ్రామానికి తీసుకెళ్లే స్తోమత లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బందిని అంబులెన్స్ సమకూర్చాలని అడిగినా.. ఆ నిరుపేద తండ్రి మాటలు పట్టించుకునే వారు కురువయ్యారు. 30 కిలోమీటర్లు ఉన్న సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు వాహనం కోసం వెతికేందుకు తండ్రి వెళ్లాడు. తన ఎనిమిదేళ్ల కుమారుడు గుల్షాన్ ను మరణించిన తన కొడుకు రెండేళ్ల రాజాను స్థాని కంగా ఉన్న నెహ్రూ పార్క్ ముందు వదిలిపెట్టాడు. తన ఒళ్లో తమ్ముడి శవాన్ని పెట్టుకుని, ఈగలు వాలకుండా చూసుకుంటున్న ఆ పిల్లాడి నిస్సహాయత అందర్ని కంటతడి పెట్టిస్తోంది.
ఇది నిజంగానే హృదయవిదారకం. దేశంలో ప్రభుత్వం ఆస్పత్రులు, సదుపాయాలను ప్రశ్నించే ఘటన. పేదోళ్లకు కనీస వైద్యం, సౌకర్యాలు అందుతున్నాయో లేదో తెలిపే ఓ సన్నివేశం. ప్రస్తుతం దేశంలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని సమకూర్చకపోగా.. బయటకు వెళ్లి డబ్బు చెల్లించి వాహనాన్ని మాట్లాడు కోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న అంబులెన్స్ రూ.1500 చెల్లించితే సొంతూ రుకు తీసుకెళ్తా అని చెప్పాడు. అయితే అది కూడా చెల్లించే స్తోమత పూజారామ్ జాతవ్ దగ్గర లేదు. అరగంట పాటు అక్కడే తన తండ్రి కోసం ఒడిలో తమ్ముడి శవాన్ని పెట్టుకుని గోడ పక్కన కూర్చుండి పోయాడు గుల్షాన్. ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ అధికారి యోగేంద్ర సింగ్ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి అంబులెన్స్ ఇచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.