గ‌తం మ‌రిచిన బిజెపి.. గ్యాస్‌ధ‌ర పెంచిన వైనం!

తెల్ల‌వార‌గానే గ్యాస్‌బండ‌తో వ‌చ్చిన కుర్రాడి మీద ఓ గృహిణి విరుచుకుప‌డింది ఇష్టంవ‌చ్చిన‌ట్టు సిలిం డ‌ర్ ధ‌ర పెంచేస్తే ఎలాగ‌య్యా? ఏం త‌మాషాగా వుందా? అని.. ఆ వచ్చిన‌వాడిని ఇద్ద‌రు వ‌చ్చి పంపిం చేశారు. లేక‌పోతే ఆమె ఆగ్ర‌హంతో ఏమ‌న్నాచేసేదేమో! వాస్త‌వానికి ఈ ఆగ్ర‌హం ఆ కుర్రాడి మీద కాదు మ‌న‌ల్ని అద్భుతంగా పాలిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం మీద‌. ప్ర‌తీరోజూ ప్ర‌తీ వేదిక  మీదా హితోప‌దేశాలు ప‌లుకుతుండే ప్ర‌ధాని నరేంద్ర‌మోడీకి ప్ర‌జ‌ల మీద ప్రేమ ఎక్కువ‌యింది. హ‌ఠాత్తుగా మ‌ళ్లీ గ్యాస్ ధ‌ర సిలిండ‌ర్‌కు రూ.50 పెంచేశారు. అంత‌ర్జాతీయ ఇంధ‌న ధ‌ర‌ల‌ను ప‌ట‌టిష్ట చేయ‌డంతో  మే నుండి మూడ‌వ‌సారి ధ‌ర‌లు పెంచారు. ప్ర‌ధానికి మామూలు ప్ర‌జ‌ల జీవనం మీద ఏమాత్రం ధ్యాసాలేద న్న‌ది ఈ ప‌రంగా బ‌య‌ట‌పెట్టుకున్నారు.  దేశీయ 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరలు 50/సిలిండర్‌లు పెరిగాయి. ప్ర‌ధాని నరేంద్రమోడీ భారత దేశ ప్రజలను తన ప్రేమతో మరోసారి ముంచెత్తుతున్నారు అని దేశంలో ప్ర‌తిప‌క్షాలు, సామాన్య ప్ర‌జ‌లు ఇప్ప‌టికే దుమ్మెత్తిపోస్తున్నారు. ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన పేద లబ్దిదారులకే ప్రభుత్వం సబ్సిడీని పరిమితం చేసిన తర్వాత సామాన్య కుటుంబాలు వారు కొనుగోలు చేసే వంట గ్యాస్‌కు సబ్సిడీ లేని రేట్లు చెల్లిస్తున్నారు. వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌ ధరల పెంపుపై ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ మంగ ళవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టి దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఢిల్లీలోని పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించగా, లక్నోలో పోలీసులు విధానసభ వెలు పల బీజేపీ కార్య క్రమాలను చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లను ఉపయోగించారు. నాగ్‌పూర్‌లో పార్టీ కార్యకర్తలు ఎద్దుల బండి ఊరేగింపులు నిర్వహించగా, మహారాష్ట్రలో గోపీనాథ్ ముండే పార్టీ నిరసనలకు నాయకత్వం వహిం చారు. చిత్ర‌మేమంటే,  ఇదే బిజెపీ 2012 , 2014 మధ్య  యుపిఎ ప్ర‌భుత్వాన్ని గ్యాస్ ధ‌ర‌ల‌పై నిల‌దీసింది. ప్ర‌జ లకు ప్ర‌భుత్వం పెనుభారంగా త‌యార‌యింద‌ని విమ‌ర్శ‌ల‌తో బిజెపీ నాయ‌కులు రెచ్చిపోయారు . బీజేపీ నాయకురాలు, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎల్‌పీజీ సిలిండర్ల అధిక ధరపై స్వయంగా గొంతు చించుకున్నారు. మరి కొందరు కూరగాయలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాల్సి వస్తుందని ఎగతాళి చేశారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిపై నరేంద్ర మోడీ కూడా నిప్పులు చెరిగారు. పెట్రోలియం ధరల పెరుగు దల యుపిఎ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థతకు నిదర్శనం. పాలించే నైతిక అధికారాలన్నీ ప్రధాని కోల్పో యారని, రాజీనామా చేయాల్సిందేనని గర్జించారు. పెట్రోల్ ధరల భారీ పెంపు కాంగ్రెస్ నేతృత్వం లోని యుపిఎ వైఫల్యానికి ప్రధాన ఉదాహరణ. దీని వల్ల గుజరాత్‌పై వందల కోట్ల భారం పడుతుందని ఆయన ట్వీట్ చేశారు. కోల్‌కతాలో, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ , వం టగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ-ఎం మద్దతు గల ట్రేడ్ యూనియన్ సిఐటియు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా రవాణా రోడ్లపై నిలిచిపోయింది. మెట్రో సర్వీస్ ఉన్నప్పటికీ 24 గంటల రాష్ట్రవ్యాప్త రవాణా సమ్మె దృష్ట్యా బస్సులు, ట్రామ్‌లు, మినీ బస్సులు  టాక్సీలు నిలిచిపోయాయి. బిజెపి నాయకుడు, మాజీ పెట్రోలియం మంత్రి రామ్ నాయక్ 2014 జనవరిలో వరుసగా రెండు రోజులు ధరలు పెరిగినప్పుడు యుపిఎ ప్రభుత్వం మానసిక సమతుల్యతను కోల్పోయిందని మండిపడ్డారు. సెల బ్రిటీలు కూడా వెనకడుగు వేయలేదు. అమితాబ్ బచ్చన్ ప్రతిరోజూ పెట్రోల్ ధరల పెరుగుదలపై జోక్ చేశారు. ముంబైలో పెట్రోల్ ధర రూ.78.57 గా ఉన్నప్పుడు, బిగ్ బి ట్వీట్ చేస్తూ, “పెట్రోల్ ధర రూ.7.5: పంప్ అటెండెంట్ - 'కిత్నే కా దలూన్?' ముంబైకర్ - '2-4 రూపాయల కా కార్ కే ఊపర్ స్ప్రే కర్ దే భాయ్, జలానా హై !!  అనుపమ్ ఖేర్ ట్వీట్ చేస్తూ, నా డ్రైవర్‌ను ఎందుకు ఆలస్యం?  అని అడిగాడు.  సార్. సైకిల్ మీద వచ్చారు. మోటార్ సైకిల్‌కి ఏమైంది. అతని సమాధానం, సార్, ఇది ఇప్పుడు షోపీస్‌గా ఇంట్లో ఉంచబడింది. అప్పటి నుండి ట్వీట్‌ను తొలగించిన అక్షయ్ కుమార్ అబ్బాయిలు, మీ సైకిళ్లను శుభ్రం చేసి రోడ్డుపైకి రావడానికి ఇది సమయం అని నేను అనుకుంటున్నాను. మూలాల ప్రకారం, మరో పెట్రోల్ ధర పెంపును ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు.  ఎనిమిది సంవత్సరాల తరువాత, స్వరాలు మ్యూట్ చేయబడ్డాయి. గర్జిస్తున్న రాజకీయ నాయకులు మౌనంగా ఉన్నారు. సెలబ్రిటీలు ఇకపై ప్రభుత్వాన్ని ఎగతాళి చేయడం లేదా సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం లేదు. బహుశా చాలా గొప్ప‌ ప్రజాస్వామ్యం అన్న‌ది ఒక  సంకేతం. 2012లో వైరల్ అయిన ఒక జోక్‌ని కొందరు గుర్తు చేస్తున్నారు. సరిహద్దు వద్ద ఒక భారతీయ కుక్క  ఒక చైనీస్ కుక్క ఒకదాని వెంట ఒక‌టి  పరిగెత్తాయి. ఇద్దరూ వేరే దేశానికి వలస వెళ్లాలనుకున్నారు. ఆశ్చర్య పోయిన భారతీయ కుక్క, “అయితే నువ్వెందుకు మీ దేశం విడిచి వెళ్తున్నావ్ బ్రో? మీ జీవితం చాలా మెరుగ్గా ఉంది, మీ ఆర్థిక వ్యవస్థను చూడండి అన్న‌ది.  చైనీయులు ఇలా బదులిచ్చారు, “నిజమే, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నేను మొరగలేను. మొరగని కుక్క ఏది? ఎనిమిదేళ్ల తర్వాత, వీరిద్దరూ ఎక్కడికీ వలస వెళ్లలేదు.

త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఏపీ నుంచి ఒకరికి ఛాన్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరిస్తారా? అలాంటి అవసరం,  అవకాశం ఉన్నాయా? అంటే, ఉందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతున్నట్లు  తెలుస్తోంది. కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్’ రాజీనామా చేసిన నేపధ్యంలో, ఆ ఇద్దరి స్థానాలను భర్తీ చేయడంతో పాటుగా,రానున్న రోజులలో జరగనున్న గుజరాత్ సహా మరికొన్ని రాష్ట్ర  శాసన సభ ఎన్నికలు, అదే విధంగా, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని రాజకీయ. మీడియా వర్గాల్లో గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. అయితే, బీజేపీకి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, జేడీ (యు)కు చెందిన ఆర్సీపీ సింగ్ తమ రాజ్యసభ సభ్యత్వ గడవు  గురువారంతో  ముగుస్తునందున, మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేపధ్యంలో, మంత్రివర్గ విస్తరణ చర్చ మరో మారు ప్రముఖంగా తెర మీదకు వచ్చింది.  అయితే, మంత్రి వర్గ విస్తరణ ఇప్పటికిప్పుడు ఉండే అవకాశం అయితే లేదని, జూలై 18 నుంచి మొదలయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు,  రాష్టపతి, ఉప రాష్టపతి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆగష్టు రెండవ వారం తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని విస్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే, ఇద్దరు మంత్రుల రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, నఖ్వీ స్థానంలో ఆయన నిరహిస్తున్న మైనారిటీ సంక్షేం శాఖను, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి, ఆర్పీ  సింగ్ నిర్వహించిన ఉక్కు శాఖ బాధ్యతలను, జ్యోతిరాదిత్య  సింధియా అదనపు బాధ్యతలుగా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  కాగా, నఖ్వీ రాజీనామాతో, కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేంద్ర మంత్రి వర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యమే లేని పరిస్థితి, బహుశా దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే, సుమారు 400 మంది వరకు ఉన్న బీజేపీ ఉభయ సభల ఎంపీలలోనూ ఒక్క ముస్లిం కూడా లేరు. అయితే, నఖ్వీని ఎన్డీఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలిపే అవకాశం ఉందని అంటున్నారు.  ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగష్టు 6న జారుతుంది.   గురువారం(జూలై 7)తో  నఖ్వీ రాజ్య సభ సభ్యత్వ పదవీ కాలం ముగుస్తున్నందున ఒకటి రెండు రోజుల్లో, బీజీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో   ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నఖ్వీ పేరును ప్రకటించవచ్చని అంటున్నారు. నఖ్వీ రాజీనామాకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డను కలవడంతో , ఆయనే ఉప రాష్ట్రపతి అభ్యర్ధి అనే ఉహగానాలకు మరింత బలం చేకూరింది.  అదలా ఉంటే, రాష్టపతి కోటా రాజ్యసభ సభ్యులుగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన  నలుగురికి అవకాశం  కలిపించడంతో, బీజేపీ దక్షణాది రాష్ట్రాలపై గట్టిగా దృష్టి పెట్టిందని, మరోమారు  స్పష్టం అయ్యిందని అంటున్నారు. సో .. మంత్రి విస్తరణలోనూ దక్షణాది రాష్ట్రాలకు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి,జీవీఎల్ నరసింహారావుకు అవకాశం ఉంటుందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.  అయితే పురందేశ్వరికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అలోచన కూడా ఉందని అంటున్నారు. అలాగే, మెగా స్టార్ చిరజీవి పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. తెలంగాణ నుంచి లక్ష్మణ్ తో పాటుగా, త్వరలో బీజేపీలో చేరనున్న మరో కీలక నేత పేరు కూడా పరిశీలనలో ఉండవచ్చని అంటున్నారు. అయితే,  మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంతవరకు అధికారకంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ,  నాలుగు రోజులు అటూ ఇటుగా అయినా కేంద్ర  మంత్రివర్గ విస్తరణ అనివార్యంగా ఉంటుందని  రాజకీయ పండితులు జోస్యం చెపుతున్నారు.

బిజెపీ తో జ‌గ‌న్ దోస్తానా పై కాంగ్రెస్ మండిపాటు

మంచిప‌ని చేసిన‌వారు ఏ స్థాయిలో వున్న గౌర‌వం అందుకుంటారు. అంద‌రూ అభిమానిస్తారు.  అంత‌గా ప‌రిచ‌యం లేకున్నా వూహించ‌కుండా స‌హాయ‌స‌హ‌కారాలు అందించేవారిని అభిమానిస్తారు. కానీ తెలిసి ద్రోహం చేస్తున్న‌వారి ప‌ట్ల వీరాభిమానం ప్ర‌ద‌ర్శించ‌డం, అడుగుల‌కు మ‌డ‌గులు ఒత్త‌డం కేవ‌లం జ‌గ‌న్ తోనే సాధ్యం. అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ వారికి జ‌గ‌న్ ప‌ట్ల కోపం కట్ట‌లు తెంచుకుంది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపీకి జ‌గ‌న్ మ‌ద్ద‌తునివ్వ‌డంపై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు శైల‌జానాధ్ మండిప‌డు తున్నారు.  రాష్ట్రం విడిపోయిన‌ప్ప‌టి  నుంచి కేంద్రం  చేసిన సాయం ఏమీ లేద‌ని, కేంద్రం మాయ‌మాట‌ల్లో ప‌డి ముఖ్య మంత్రి జ‌గ‌న్ రెడ్డి కేంద్రాన్ని వేనోళ్ల ప్ర‌శంసిస్తుండ‌టం, ఢిల్లీ యాత్ర‌ల్లో ప్ర‌ధాని మోదీని, ఇత‌రు లను క‌లిసి ఫోటోలు తీయించుకోవ‌డం త‌ప్ప రాష్ట్రం గురించి గ‌ట్టిగా ఎన్న‌డూ  అడిగిన పాపాన పోలేద‌ని రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి ఉంచి ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రంతో ఏనాడూ గ‌ట్టిగా విభేదించ‌క‌పోవ‌డం, ప్ర‌శ్నించ‌క‌పోవ‌డం  కేంద్రంప‌ట్ల భ‌క్తి ప్ర‌ప‌త్తులు  రోజు రోజుకీ పెర‌గ‌డ‌మే తెలియ జేస్తోంది. వీరికి వారు వారికి వీరు అన్న‌ట్టుగా కేంద్రంకూడా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. ఇక్క‌డి నాయ‌కులు పైకి తిడుతూ, త‌మ మ‌ధ్య ఎలాంటి గొప్ప స్నేహ‌మేమీ లేద‌ని ప్ర‌చారం చేస్తున్న‌ప్ప టికీ కేంద్రం నుంచీ అలాంటి సంకేతాలైతే ఏమీ లేవు. ప‌క్క‌నే వున్న తెలంగాణా పై కేంద్రం విరుచుకు ప‌డుతున్నంత‌గా ఆంధ్రా ప‌ట్ల విముఖ‌తేమీ క‌న‌ప‌ర‌చ‌డం లేదు. కేంద్రం హామీల‌ను నెర‌వేర్చ‌డం కంటే జ‌గ‌న్‌తో భ‌జ‌న చేయించుకోవ‌డంలోనే ఎక్కువ ఆనందిస్తున్నార‌న్న అనుమానాలే ప్ర‌చారంలో వున్నాయి. కేంద్రంతో జోడీ క‌ట్టి రాష్ట్రానికి ఏమి ఒర‌గ‌బెట్ట‌న‌పుడు ఆ స్నేహం విలువేమిటి అన్న‌ది విప‌క్షాల  ప్ర‌శ్న‌.  రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల‌ను  అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్  గురువారం చేప‌ట్టిన ధ‌ర్నాలో శైల‌జానాద్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భం గా ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా వోటు  వేయాల ని డిమాండ్ చేశారు. 25 ఎంపీలు ఇస్తే హోదా తీసుకువస్తా అని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హోదా, విభజన హామీలను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలందరినీ కలిసి హోదా విభజన హామీ లపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రానికి హోదా విభజన హామీలను అమలు చేసే వరకు  కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శైలజానాథ్ అన్నారు.

ఎందుకోయీ కేసీఆర్ పై ఈ కాషాయ ప్రేమ‌!

చిన్న‌పామునైనా పెద్ద కర్ర‌తో కొట్ట‌మ‌న్నారు. ఇదే సూత్రం బిజెపి టిఆర్ ఎస్‌పై అమ‌లు చేస్తోంది. తెలంగా ణాలో ఎలాగైనా పాగా వేయాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వున్న బిజెపీ కేసీఆర్ ప్ర‌భుత్వ పాల‌న‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎండగ‌డుతూ, లోపాల చిట్టాను ప‌ట్టుకుని వేధించ‌డానికి గ‌ట్టి నిర్ణ‌య‌మే తీసుకుంది.  కేసీఆర్ ప్ర‌భుత్వం తెలంగాణా ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేస్తోంద‌ని ఘాటుగా విమర్శ‌లు ద‌ట్టిస్తూ  ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ప్ర‌జ‌ల్లో క‌ల్పించ‌డానికి బిజెపీ వ‌ర్గీయులంతా తెగ కృషి చేస్తున్నారు.   ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజల్లోకి కమలనాథులు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం  బీజేపీ కార్యాలయంలో ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వ  వైఫ‌ల్యాలపై బీజేపీ అధ్య యన కమిటీ సమావేశం నిర్వహించనుంది. ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ అధ్యయన‌ కమిటీ కన్వీనర్‌గా ఎంపీ‌ ధర్మపురి అర్వింద్ ఉన్నారు. కమిటీ నిర్వహించనున్న సమావేశానికి కమిటీ సభ్యులు, ఇతర నేతలు హాజరు కాను న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి  బలంగా తీసుకెళ్ళేలా బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. కేసీఆర్ సర్కార్ ఎన్నికల హామీలను విస్మరించిందని కమల నాథులు చెబుతున్నారు.   కేసీఆర్ ప్ర‌భు త్వం తెలంగాణాను బంగారు తెలంగాణాగా మారుస్తాన‌ని భారీ హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టు కోవ‌డం త‌ప్ప వాస్త‌వానికి ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్ర అభివృద్ధి శూన్య‌మ‌ని చాలారోజులుగా  బిజెపీ  నాయ కులు విమ‌ర్శ ల‌తో దాడి చేస్తున్నారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నులు వాటి వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప్ర‌యో జ‌నం క‌లుగు తోందన్న‌ది ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌న్నది బిజెపీ నాయ‌కులు  పెద్ద కార్య‌క్ర‌మంగా పెట్టు కున్నారు.  అం దుకే, అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ అనేకానేక అంశాల‌పై వివ‌రాలు తెలుసుకుని ప్ర‌జ‌ల ముందు పెట్టాల‌ని బిజెపీ తెలంగాణా నాయ‌కులు పూనుకున్నారు. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలో  బిజెపీ నాయ‌కులు కొంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  బిజెపి నాయ‌కుల‌కు, ఢిల్లీలోని బిజెపీ పెద్ద‌ల‌కు తెలంగాణా మీద అక్క‌సుతో వ్య‌వ‌హ‌రించ‌డం త‌ప్ప వేరే ప‌నిలేద‌ని టిఆర్ ఎస్ నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై తో  మొన్న‌టి వ‌ర‌కూ ఎలాంటి స‌మావేశాలూ, మాట‌లూ లేకుండా కేసీఆర్ దూరంగా వుండ‌డం, స‌మ‌తా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్ర‌ధాని మోదీ వ‌చ్చిన‌పుడు కేసీఆర్ ప్రోటోకాల్ పాటించ‌క‌పోవ‌డం మొద‌లైనవ‌న్నీ బిజెపీ వ‌ర్గీయులు చాలా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. ప్ర‌తీ చ‌ర్చ‌లోనూ తెలంగాణా కేంద్ర స‌హాయాన్ని విస్మ‌రించిందని ఎదురుదాడులు చేయ‌డమే సిద్ధాంతంగా పెట్టుకున్నారు. ఇపుడు తాజాగా అధ్య‌య‌న క‌మిటీ అనే పేర ఏకంగా ఒక క‌మిటీ ఏర్పాటు చేసి టిఆర్ ఎస్ ప్ర‌భ‌త్వం ఇంత కాలం చేసిన‌వ‌న్నీ పెద్ద జాబితాగా త‌యారు చేయ‌డంలో బిజెపీ నాయ‌కులు నిమ‌గ్న‌మ‌య్యారు. ఆగ్ర‌హం వుండ‌డం కూడా ఒక్కింత ప్రేమ వుండ‌డ‌మే నేమో అందుకే  క‌మ‌ల‌నాధులు కేసీఆర్‌ను త‌మ ధోర‌ణిలో ప్రేమిస్తున్నారు. 

ఎమ్మెల్యే కాపు పై ఎదురుతిరిగిన కాంట్రాక్ట‌ర్లు

రాష్ట్రంలో ఎక్క‌డ‌న్నా అభివృద్ధి ప‌నులు స‌క్ర‌మంగా జ‌రుగుతున్న‌దీ లేనిదీ ఎమ్మెల్యే ప‌రిశీలించ‌వ‌చ్చు. అందులో ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. త‌న ప్రాంతంలో జ‌రిగే ప‌నుల గురించి ఆ మాత్రం శ్ర‌ద్ధ అవ‌స‌రం కూడా. కానీ సంబంధంలేని ప్రాంతానికి వెళ్లి అక్క‌డి వారితో వాదులాట‌కు దిగితే ఎవ‌రు మాత్రం మ‌ర్యాద‌గా వింటారు? వ‌చ్చిన కార‌ణం తెలిసిన‌పుడు అక్క‌డివారికి విసిగెత్తి తిర‌గ‌బ‌డ‌తారు. ఇదే అనుభ‌వం ప్ర‌భుత్వ విప్‌, వైసీపీ అనంత‌పురం జిల్లా అధ్య‌క్షుడు, రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌ చంద్రారెడ్డికి ఎదురయింది.  క‌ర్ణాట‌క రాష్ట్రంలోనూ, క‌ర్నూలు జిల్లా ప‌రిధిలోనూ జ‌రుగుతోన్న తుంగ‌భ‌ద్ర‌ద ఎగువ‌, దిగువ కాలువ‌ల  (హెచ్ ఎల్సీ, ఎల్ ఎల్సీ) ఆధునీక‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయి. బుధ‌వారం క‌ర్ణాట‌క, క‌ర్నూలు జిల్లా ప‌రిధిలో జ‌రుగుతున్న‌ ప‌నుల‌పై పెత్త‌నం చేయ‌డానికి వెళ్ల‌డ‌మే కాకుండా ప‌ర్సంటేజీల కోసం కాంట్రా క్ట‌ర్ల‌పై ఒత్తిడి తేవ‌డంతో వారు ఆగ్ర‌హించి ఎమ్మెల్యేపై ఎదురుతిరిగారు. అస‌లు ఇక్క‌డి ప‌నుల‌తో మీకు సంబంధ‌మేమిట‌ని నిల‌దీయ‌డం కంటే అవమానం వేరొక‌టి వుండ‌దు. తుంగ‌భ‌ద్ర బోర్డు ప‌రిధిలో జ‌రిగే ప‌నుల్లో చాలారోజులుగా ఎమ్మెల్యే కాపు జోక్యం చేసుకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు వున్నాయి.  కాగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే ఆయ‌న‌ను హెచ్చ‌రించార‌ని తెలిసింది.  కాపు రామచంద్రారెడ్డి తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణ పనులను పరిశీలించేందుకు బుధవారం వెళ్లారు. తుంగభద్ర ఎగువ కాలువలో(13 ప్యాకేజీలు) రూ.430 కోట్లు, ఎగువ కాలువలో రూ.500 కోట్లతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఎగువ కాలువ పనుల పరిశీలన అనంతరం దిగువ కాలువ పనులను చూసేందుకు కాపు వెళ్లారు. దిగువ కాలు వ పనులన్నీ కర్ణాటక, కర్నూలు జిల్లా పరిధిలో జరుగుతున్నాయి. అక్కడికి వెళ్లి, పర్సెంటేజీలు అడగటంతో కాంట్రాక్టర్లు ఎదురు తిరిగినట్లు తెలిసింది.  ఒక ప్రజాప్రతినిధిగా పనులు పరిశీలించవచ్చు. కానీ ఆయన వేరే ఉద్దేశంతో వస్తున్నారు. తనకు పనుల్లో పర్సెంటేజీ ఇవ్వాలని ఆది నుంచి డిమాండ్‌ చేస్తున్నారని కొందరు కాంట్రాక్టర్లు మండిపడ్డారు. ఆధునికీ కరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది వైసీపీవారే. దీంతో తాము చేసే పనులపై పెత్తనం ఏమిటని రామచంద్రారెడ్డికి ఎదురు తిరుగుతున్నారు. ఈ వివాదం బుధవారం పతాక స్థాయికి చేరింది. కొందరు కాంట్రాక్టర్లు కాపుపై తిరుగుబాటు చేసి నిలదీశారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. మాదీ వైసీపీనే. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. అని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మరికొందరు అక్కడి నుంచే నేరుగా ప్రభుత్వ సలహాదారుకు(సజ్జల రామకృష్ణారెడ్డి) ఫోన్‌ చేసి విషయం చెప్పినట్లు సమాచారం. ఒక ఎమ్మెల్యే కూడా కాపు రామచంద్రారెడ్డికి బుధవారం గట్టిగా వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇక చేసేది లేక బుధవారం మధ్యాహ్నం కాపు తిరుగుముఖం పట్టినట్లు తెలిసింది.

దేశంలో గోధుమ వినియోగం, కేటాయింపు ఎందుకు త‌గ్గాయి?

దేశంలో గోధుమ వినియోగం రాష్ట్రాల కేటాయింపుల్లో త‌రుగుద‌ల విష‌యమై చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్రా ల‌కు గోధుమ‌ల కేటాయింపు విష‌యంలో అనేక వాద‌న‌లు విన‌ప‌డుతున్నాయి. మేలో జరిగిన రివిజ‌న్‌ తర్వాత, 10 రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ ఎఫ్ ఎస్ ఎ) కింద గోధుమ కేటాయింపులు తగ్గించబడ్డాయి, వీటిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌,  గుజరాత్ ఆ స‌వ‌ర‌ణ‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రాలు ఎంత గోధుమలను వినియోగిస్తాయి, స‌వ‌ర‌ణ‌, మొద‌లైన అంశాల్లో పున‌రాలోచ‌న చేశారు. గుజరాత్ , ఉత్త‌ర ప్ర‌దేశ్‌  రెండు బిజెపి పాలిత రాష్ట్రాలు  బియ్యం స్థానంలో ఎక్కువ గోధుమలను డిమాండ్ చేశాయి.  ఎఫ్ ఎస్ ఎ, 2013 ప్రకారం వాటి అసలు కేటాయింపులను పునరుద్ధరించాలని లేదా గోధుమ, బియ్యం కేటా యింపు నిష్పత్తిని మార్చాలని కేంద్రాన్ని కోరడంతో  మే లో కేంద్ర ఆహార మంత్రి త్వ శాఖ సవరణ చేప‌ట్టింది.  మే 14న,  కేంద్ర ఆహార భ‌ద్ర‌తా శాఖ‌ కార్యదర్శి సుధాన్షు పాండే  రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత ఎన్ ఎఫ్ ఎస్ ఎ కింద గోధుమలు , బియ్యం నిష్పత్తులను మార్చడం ద్వారా కేంద్రం కొన్ని పరిమాణాలను తిరిగి కేటాయించిందని ప్రకటించారు. ఉదాహరణకు, గోధుమలు, బియ్యం 60:40 నిష్పత్తిలో పొందు తున్న రాష్ట్రాలు ఇప్పుడు 40:60 వద్ద పొందుతాయి, అయితే 75:25 వద్ద కేటాయింపులు పొందుతున్న వారు ఇప్పుడు 60:40 వద్ద వీటిని పొందుతారు. బియ్యం కేటాయింపు సున్నా ఉన్న రాష్ట్రాలకు గోధుమలు అందడం కొనసాగుతుంది. చిన్న రాష్ట్రాలు, ఈశాన్య‌ రాష్ట్రాలు అలాగే  ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు, కేటా యింపులో మార్పు లేదు. ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ చర్య వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 10 నెలల (జూన్-మార్చి)లో సుమారు 61 లక్షల టన్నుల గోధుమలు ఆదా అవుతాయి.  కాగా, ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న (పిఎంజికెఎవై) క్రింద మిగ‌తా ఐదు మాసాల‌కు అంటే సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ కూడా  గోధుమ‌ల కేటాయింపుల్లో త‌రుగుద‌ల వుంటుంద‌నీ కేంద్రం ప్ర‌క‌టించింది. దీనివ‌ల్ల 55 ల‌క్ష‌ల ట‌న్నుల గోధుమ ఆదా అవుతుంద‌ని లెక్క‌వేశారు. ఇందుకు స‌మాంత‌రంగా బియ్యాన్ని గోధుమ స్థానంలో కేటాయిస్తారు.  ఈ ర‌కంగా గోధుమ కేటాయింపుల్లో త‌రుగుదల వ‌ల్ల బీహార్‌, ఝార్ఖండ్‌, ఒడిషా, ప‌శ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, ఉత్త ర ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలపై ప్ర‌భావం వుంటుంది. ఎన్ ఎఫ్ ఎస్ ఎ కింద ఉన్న 81.35 కోట్ల మంది లబ్ధిదారులలో ఈ రాష్ట్రాలు దాదాపు 55.14 కోట్ల (67%) మంది ఉన్నారు. గుజరాత్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌లు ప్ర‌ధానంగా గోధుమ ఎక్కువ వాడే రాష్ట్రాలు కావ‌డంతో  వాస్త‌వంగా త‌మ‌కు కేటా యించిన మేర‌కు గోధుమ‌ల‌ను తిరిగి కేటాయించ‌మ‌ని డిమాండ్ చేస్తున్నాయి.  ఇంత‌కుముందు, యుపి ప్ర‌తీ ఒక్క‌రికి  3 కేజీల గోధుమ‌లు, 2 కేజీల బియ్యం ఎన్ ఎఫ్ ఎస్ ఏ క్రింద పొందేది. అదే ఇప్పుడు 2 కేజీ ల గోధుమ‌లు, 3 కేజీల బియ్యం అందుకునేట్టు మార్పు జ‌రిగింది. గుజ‌రాత్ 3.5 కేజీల గోధుమ‌లు, 1.5 కేజీ ల బియ్యం ప్ర‌తీ మాసం అందుకుంటుంటే ఇపుడు మారిన లెక్క‌ల ప్ర‌కారం 2 కేజీల గోధుమ‌లు, 3 కేజీల బియ్యం అందుకుంటున్న‌ది. అలాగే, రివిజ‌న్ త‌ర్వాత ఈ ప‌ది రాష్ట్రాల మొత్తం గోధుమ  కేటాయింపులు 9.39 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు త‌గ్గింది.   కాగా ఈ రాష్ట్రాల‌కు  గోధుమ కేటాయింపుల్లో త‌రుగుద‌లకు స‌మాంత రంగా అద‌నంగా బియ్యం కేటాయింపులు చేప‌డ‌తారు.  ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్ ఎఫ్ ఎస్ ఏ క్రింద వాస్త‌వ కేటాయింపుల కంటే తక్కువ వుంటే, అది 2010-11 నుండి 2012-13 వరకు మునుపటి సాధారణ టిపిడి ఎస్‌ కింద సగటు ఆఫ్-టేక్ స్థాయి వరకు రక్షించబడుతుంది. ఈ అదనపు ఆహార ధాన్యా ల పరిమాణాన్ని ‘టైడ్ ఓవర్’ కేటాయింపు అంటారు. ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు ల గోధుమ టైడ్ ఓవ‌ర్ కేటాయిం పుల్లో త‌రుగుద‌ల‌ను ప్ర‌క‌టించారు. ఇది  సుమారు 1.13 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల మేర‌కు అద‌నంగా వుండ వ‌చ్చు. అయితే రివిజ‌న్ త‌ర్వాత ఆ రాష్ట్రాల టైడ్ ఓవ‌ర్ గోధుమ కేటాయింపులు జీరో స్థాయికి చేరుకుంటాయి.  అస‌లీ కేటాయింపుల్లో త‌రుగుద‌ల వాస్త‌వానికి గ‌త ఏడాది కంటే ఈ ఏడాది  గోధుమ సేక‌ర‌ణ బాగా త‌క్కువ స్థాయిలో జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్న‌ది. ప్ర‌స్తుత ర‌బీ మార్కెట్ సీజ‌న్ (ఆర్ ఎం ఎస్‌-2022-23) లో జూలై 4 వ‌ర‌కూ 187.89 ట‌న్నుల గోధుమ సేక‌ర‌ణ జ‌రిగింది. ఇది ఆర్ ఎం ఎస్ 2021-22 యావ‌త్ గోధుమ సేక‌ర‌ణ 433.44 ట‌న్నుల కంటే 56.65 శాతం త‌క్కువ‌. ఇలా దేశంలో ప్ర‌ముఖ ఆహారోత్ప‌త్తి కేంద్రాలుగా చెప్పుకునే పంజాబ్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, యు.పి ల‌లో ఇదే ప్ర‌మాణం గ‌మ‌నించారు.  సెంట్ర‌ల్ పూల్‌లో గ‌త 14 ఏళ్ల‌లో గోధుమ స్టాక్ త‌ల‌కిందుల‌యింది. జూన్ మొద‌టి రోజు 311.42 ట‌న్నులు వుంది. ఇది 2008241.23 ట‌న్నుల కంటే చాలా త‌క్కువ‌గా చెప్పాలి. గ‌తేడాది జూన్ ఒక‌టో తేదీన ఇది 602.91 మెట్రిక్ ట‌న్నులుగా పేర్కొన్నారు.  ఎఫ్ సి ఐ నిబంధ‌న‌ల  ప్ర‌కారం ఆహార ధాన్యాల నిల్వ‌లు  275.80 ల‌క్ష‌ల ట‌న్నులు ప్ర‌తీ ఏడూ జూలై ఒక‌టో తేదీన వుండేట్టు చూశారు. కానీ  ప్ర‌స్తుత నిల్వల వివ‌రా లు  ఇంకా  అధికారులు  తెలియ‌జేయ‌లేదు.   

సర్కార్ సొమ్ము సాక్షి ఖజానాకు ..!

అవును.. ఆయన చెప్పినట్లు .. డబ్బులు ఎవరికీ ఊరికే రావు, అయితే ఆయనకు ఆ విషయం ఇప్పడు తెలిసిందేమో కానీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, డబ్బులు ఉరికే రావనే కాదు, ఏమి చేస్తే వస్తాయో, అందుకు దారి చూపే అక్రమ మార్గాలు ఏమిటో, కూడా బాగా తెలుసునని, ఆయనేమిటో తెలిసిన వారు అంటుంటారు. అందుకే ఆయన, రాజకీయాలలోకి పూర్తి స్థాయి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే, తండ్రి (ముఖ్యమంత్రి) చాటు బిడ్డగా ఉండగానే రాజకీయ వ్యాపార సూత్రాలను అవపోసన పట్టారని, అధికారుల అండదండలతో ఇంచక్కా ఊరు పేరు లేని సూట్ కేసు కంపెనీల క్విడ్ ప్రో క్రో పద్దతిలో పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడులతో హైదరాబద్ నుంచి బెంగుళూరు వరకు బెంగుళూరు నుంచి ఇంకెక్కడి దాకానో, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని, అంటారు.  ఇదిగో అలా జగన్ రెడ్డి మేథోమధన సాక్షిగా పుట్టిన అక్రమ పుత్రికే ‘సాక్షి’ పత్రిక. జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌, అని అంటారు. చట్టవ్యతిరేకంగా 14 కంపెనీలు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా నిధులు సాక్షి’లోకి మళ్లించారననే ఆరోపణలున్నాయి. ఆరోపణలు చేసింది కూడా ఎవరో  కాదు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. గతంలో సత్యం, మేటాస్ వ్యవహారాలపై చర్చ సందర్భంగా శాసనసభలోనే ఆయన ఈ ఆరోపణలు చేశారు. అంతే కాదు   విదేశీ పెట్టుబడుల పరిమితి చట్టాన్ని ‘సాక్షి’ యాజమాన్యం యధేఛ్చగా ఉల్లంఘించిందని చంద్రబాబు ఆరోపించారు. సత్యం అవకతవకలకు సాక్షీ భూతంగా నిలిచిన ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్‌ ఆధారంగా ప్రభుత్వం ఎలా ప్రకటనలు ఇచ్చిందని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అయితే, పుట్టుక నుంచే ఆరోపణలు ఎదుర్కుంటున్న ‘సాక్షి’ పత్రికకు, వందల కోట్ల రూపాయల ప్రజాధనం ప్రకటనల రూపంలో తరలిపోతూనే ఉందని ప్రతిపక్ష పార్టీలు, ఆరోపిస్తున్నాయి.  ప్రకటనల రూపంలో ప్రజల సొమ్మును, ‘సాక్షి’ పత్రికకు దోచి పెట్టడమే కాకుండా, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు.. గ్రామ, వార్డు సచివాలయాలు.. ఉద్యోగులతో కూడా సాక్షి పత్రికను కొనిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా, గ్రామ వాలంటీర్ల పేరున ప్రభుత్వం నెల‌కు రూ. 5.32 కోట్ల ప్రజాధనాన్ని ‘సాక్షి’ కి సమర్పిస్తోంది. ఇందుకోసంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు దినపత్రిక కొనుక్కునేందుకు నెల‌కు రూ. 5.32 కోట్లు చెల్లించేందుకు, రాష్ట్ర ప్ర‌భుత్వం, జూన్ 29న జీవో నంబరు 12ని విడుదల చేసింది. అయితే, ఇక్కడ ఎక్కడా ‘సాక్షి’ మాత్రమే కొనాలనే నిబంధన అయితే లేదు కానీ, విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఒక పత్రిక కొనుక్కోవాలని వాలంటీర్లకు ప్రభుత్వం సూచించింది. అయితే దాని అర్ధం ఏమిటో వేరే చెప్పనక్కరలేదు.  అంతే కాదు,‘సాక్షి’ కి ప్రకటనల పేరున వైసీపీ నేతల నుంచి కూడా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, అంటున్నారు.. వైసీపీ నేత అయితే స్థాయికి తగ్గట్లుగా ‘సాక్షి’లో సందర్భాన్ని బట్టి ప్రకటనలు ఇచ్చుకోవలసిందే.. వైఎస్ జయంతి,వర్ధంతి, ముఖ్యమంత్రి పుట్టిన రోజు, మరో పండగ పబ్బం, సందర్భం ఏదైనా, ఎవరి స్థాయిని బట్టి వారు, వైసీపీ నేతలు ‘సాక్షి’కి అంతో ఇంతో .. తృణమో ఫణమో సమర్పించుకోవలసిందే, లేదంటే  లెక్కలు మారిపోతాయని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఇతర వ్యాపార సంస్థలు ప్రభుత్వంలో పనులు కావాలంటే, సాక్షి’ రూట్ సెఫెస్ట్ రూట్ అనే స్థాయిలో, ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఇది ప్రచారం కాదు, నిజం, అంటున్నారు. అందుకే, ‘సాక్షి’ పత్రిక పత్రిక కాదు, ముఖ్యమంత్రి కుటుంబం, అవినీతికి, ‘సాక్షీ’ భూతం ‘సాక్షి’ పత్రిక అంటారు.

కోహ్లీ ఉద్వాసనకు రంగం సిద్ధం..?

దేశంలో క్రికెట్ ఉన్న ఆదరణ ఎంత అన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ స్టార్లకు సినీమా స్టార్లతో సమానంగా అభిమానులు ఉన్నారు. అయితే దేశ రాజకీయాలలో ఎన్నిపార్టీలూ, ఆ పార్టీలలో గ్రూపులూ లాగే క్రికెట్ రాజకీయాలలో కూడా అంతకు మించి ఉన్నాయనడంలో సందేహం లేదు. రాణిస్తున్న క్రీడాకారుడిని కిందకు లాగేయడంలో.. విఫలమౌతున్న ఆటగాడిని అందలం ఎక్కించడానికి అవకాశాలు ఇవ్వడంలో ఈ రాజకీయాలదే కీలక పాత్ర. దేశంలో దిగ్గజ క్రికెటర్లకు కొదవ లేదు. అయితే అటువంటి వారికి అవకాశాలు దక్కే విషయంలో మాత్రం క్రికెట్ రాజకీయాలదే పెత్తనం. క్రికెట్ రాజకీయాల కారణంగా ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు కనుమరుగైపోయారు. 1983 లో భారత్ తొలి ప్రపంచ కప్ విజయంలో నాడు జట్టులో ఉన్న ప్రతి ఆటగాడూ కీలకమే. అయితే కెప్టెన్ కపిల్ దేవ్ తరువాత అంతటి ప్రముఖ భూమిక పోషించి.. ఫైనల్స్ లో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచిన ఆల్ రౌండర్ మోహిందర్ అమర్ నాథ్ సరైన అవకాశాలు లభించక కనుమరుగైన సంగతి క్రికెట్ ను ఫాలో అయ్యే ఎవరూ మరచిపోలేరు. ఆగ్రహం పట్టలేక ఒక సందర్భంగా మోహిందర్ అమర్ నాథ్ భారత క్రికెట్ సెలక్షన్ కమిటీని  ‘బంచ్ ఆఫ్ జోకర్లు’ అంటూ విమర్శించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తరువాత కూడా క్రికెట్ రాజకీయాల కారణంగా ఇబ్బందులు పడిన ప్రతిభావంతులైన క్రికెటర్లు, ఒత్తిడికి లోనై ఫామ్ కోల్పోయిన క్రీడాకారులూ ఉన్నారు. ముఖ్యంగా భారత క్రికెట్ లో బ్యాటింగ్ ఆణిముత్యం అయిన సునీల్ గావస్కర్ సెంచరీల వరల్డ్ రికార్డుకు ముందు క్రికెట్ రాజకీయాల కారణంగా ఎంత ఒత్తిడికి గురైనదీ తెలిసిందే. అనవసర విమర్శలు, కామెంట్లతో తీవ్ర ఒత్తిడికి గురైన గావస్కర్ ఫామ్ కోల్పోయాడు. ఒక దశలో ఆయన 30వ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సాధించకుండానే ఉద్వాసనకు గురౌతాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నిటినీ అధిగమించి గావస్కర్ ముందుకు సాగి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గావస్కర్ తరువాత క్రికెట్ దేవుడిగా అభిమానుల నీరాజనాలు అందుకున్న సచిన్ టెండూల్కర్ కూడా క్రికెట్ రాజకీయాల కారణంగా ఇబ్బందులు పడ్డాడు, ఒత్తిడికి గురయ్యాడు. ఫామ్ కోల్పోయి బాధపడ్డాడు. వాటిని అధిగమించాడనుకోండి అది వేరే సంగతి. కానీ క్రికెట్ రాజకీయాలు ఎంతటి వారినైనా, ఎంతటి ప్రతిభావంతుడినైనా కుంగుబాటుకు గురయ్యేంతగా ఇబ్బందులు పెడతాయనడానికి తాజా ఉదాహరణ కింగ్ విరాట్ కోహ్లీ. తన సంచలన ఇన్నింగ్స్ తో భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన విరాట్ కోహ్లీ ప్రస్థుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. పామ్ కోల్పోవడమన్నది ఏ క్రికెటర్ కయినా కెరీర్ లో అతి సహజంగా ఎదురయ్యే ఇబ్బంది. అది తాత్కాలికం. క్రికెటర్ టెక్నిక్ శాశ్వతం.  అద్భుతమైన టెక్నిక్ ఉన్న కోహ్లీ ఫామ్ లేమితో సతమతమౌతున్న సమయంలో క్రికెట్ రాజకీయం అతడిని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. సాధనపై దృష్టి కేంద్రీకరించి ఫామ్ ను దొరకబుచ్చుకునే అవకాశం లేకుండా ఒత్తిడి పెంచుతోంది. కరోనా కారణంగా అసలు క్రికెట్ పోటీలే జరగని రెండేళ్ల కాలాన్నీ కూడా కలుపుకుని ఇన్నేళ్ల నుంచీ పరుగులు చేయడంలేదు. పరుగుల యంత్రం సర్వీస్ అయిపోయిందంటూ బీసీసీఐలోని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కోహ్లీమీద ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. సహజంగా దూకుడుతో ఆడే కోహ్లీ ఒత్తిడి కారణంగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. ఫామ్ లేమిని సాకుగా చూపి జట్టునుంచి అతడికి ఉద్వాసన పలికేందుకు క్రికెట్ రాజకీయం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తొలుత దక్షిణాఫ్రికా పర్యటనకు విశ్రాంతి పేరుతో కోహ్లీని దూరం చేశారు. ఇప్పుడు ఈ నెలలో టీమ్ ఇండియా విండీస్ టూర్ కు కూడా పక్కన పెట్టే యోచన చేస్తున్నారు. ఒక దిగ్గజ ఆటగాడు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు అతడికి సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం ఇవ్వడం ద్వారా ఫామ్ ను దొరకబుచ్చుకునేందుకు సహకరించాల్సిన క్రికెట్ సెలక్షన్ కమిటీ.. బీసీసీఐ అందుకు భిన్నంగా వ్యవహరించడం విచారకరం. గతంలో గంగూలీ అర్ధంతరంగా తన కెరీర్ ను ముగించేయడానికి కూడా ఇదే కారణం. కోచ్ గ్రెగ్ చాపెల్ తో కలిసి బీసీసీఐ చేసిన రాజకీయమే గంగూలీ తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పడానికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కోహ్లీ విషయంలో కూడా బీసీసీఐ అదే పంథాలో నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కామ్రేడ్ల చూపు కారు వైపు!

రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ప్రజా సంఘాలు, విద్యార్ధి, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాలు రాజకీయాలలో కీలక పాత్రను పోషించాయి.ఇందులో విభిన్న భావజాలాల వ్యక్తులు, సంస్థలు ఉన్నా, ప్రధానంగా వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలదే కీలక పాత్ర. నిజానికి, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు, వైఎస్ పాదయాత్ర ఎంతగా ఉపకరించిందో, కాంగ్రెస్ తో కలిసి తొమ్మిది వామపక్ష పార్టీల కూటమి సాగించిన విద్యుత్ ఆందోళన అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్ విజయానికి దోహదం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర కంటే,విద్యుత్ ఆందోళనే ప్రదాన భూమిక పోషించింది. బషీర్ బాగ్ కాల్పుల్లో మరణించిన ముగ్గురు కూడా లెఫ్ట్ పార్టీల కార్యకర్తలే .. అంటే ఆ ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర ఎంత కీలకంగా నిలిచిందో వేరే చెప్పనకరలేదు.  అలాగే, మలి విడత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడంలోనూ, కమ్యూనిస్టు పార్టీల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర కీలకంగానే నిలిచింది. సిపిఎం చివరి వరకు విశాలాంధ్ర (సమైక్య ఆంధ్ర) విధానానికే కట్టుబడి ఉన్నా, సిపిఎం క్యాడర్ సహా వామపక్ష భావజాల ప్రజా సంఘాలు  తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించాయి అనేది కాదన లేని నిజం. నిజానికి సిపిఎం జాతీయ నాయకత్వం కూడా, ఒక విధంగా,  ఊ..అనం, ఉహూ..అనం కేంద్రం ఇస్తామంటే కాదనం అనే  తటస్థ వైఖరినే తీసుకుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, సిపిఎం సాంకేతికంగా మాత్రమే రాష్ట్ర విభజనను వ్యతిరేకించింది. రాజకీయంగా సమర్ధించింది.   నిజానికి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనే కాదు, తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తానికి తలమానికంగా నిలిచే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో రాజకీయ ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష భావజాలం కేంద్ర బిందువుగా నిలిచాయి. అయినా, ప్రజా పోరాటాల నిర్మాణంలో, ప్రజాందోళనలకు నాయకత్వం వహించడంలో అగ్రభాగాన నిలిచినా కమ్యూనిస్ట్ పార్టీలు, ఎన్నికల రాజకీయంలో మాత్రం వెనకబడి పోయాయి. నిజానికి, 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నిర్భంధాల నడుమ పోటీ చేసిన, అవిభిక్త  కమ్యూనిస్ట్ పార్టీ,  గణనీయ సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంది.   ఆ ఎన్నికల్లో   తెలంగాణ ప్రాంతంలో పీడీఎఫ్ పేరుతొ పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ 45 స్థానాలకు పోటీ చేసి, 26.62 శాతం ఓట్లతో 32 స్థానాలు గెలుచుకుంది. అదే సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణ రెడ్డి నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, అనంతర కాలంలో మెల్లమెల్లగా దిగజారుతూ, చివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల శాసన సభల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలూ ఒక్క స్థానం అయినా నిలుపుకో లేని స్థితికి చేరుకున్నాయి. అయితే, ఈ పరిస్థితి ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలో కూడా నెలకొంది. ఒక్క కేరళలో మినహా కమ్యూనిస్ట్ పార్టీలు పూర్వ వైభాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఒకప్పుడు వామపక్ష కూటమికి కంచుకోటలుగా నిలిచి , 30 సంవత్సరాలకు పైగా వామపక్ష కూటమి ఏకచత్రాధిపత్యంగా పాలించిన పశ్చిమ బెంగాల్ శాసన సభాలోనూ లెఫ్ట్ కు ఒక్క సీటు దక్కలేదు.అలాగే, ఒకప్పుడు వామపక్ష కూటమికి కంచుకోటగా నిలిచిన త్రిపురలోనూ లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. ఆ రాష్ట్ర శాసన సభలోనూ నామమాత్ర ప్రాతినిధ్యమే కానీ, పెద్దగా సంఖ్యా బలం లేదు. ఒక్క కేరళలో మాత్రమే కమ్యూనిస్టులు ఇంకా అధికారంలో ఉన్నారు.  అదలా ఉంటే, తెలంగాణను ... పోరాటాల పురిటి గడ్డ గా చరిత్ర పుటల్లో నిలిపిన  కమ్యూనిస్ట్ పార్టీలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఇంత త్వరగా కనుమరుగై పోవడం ఒక విధంగా రాజకీయ పండితులకు కూడా అంతు చిక్కని ప్రశ్నగానే నిలిచింది. రాష్ట్ర విభజనకు ముందు వరకూ కూడా తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ సహా అనేక  జిల్లాల్లో కొంత బలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు రాష్ట్ర విభజన తర్వాత ఇచు మించుగా పట్టు కోల్పోయాయి. అంతే కాకుండా, ఎర్ర జెండాకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా నిలించి నేతలు, కుటుంబాలు కుడా ఈ ఎనిమిదేళ్ళ కాలంలో జెండా మార్చేశారు. ఎర్ర జెండా పక్కన పెట్టి,  గులాబీ జెండాకు జై కొడుతున్నారు. ఇది కొంత చిత్రంగా కనిపించినా నిజం.  ఒకప్పడు, శాసన సభలో సిపిఎం పక్ష నేతగా, రాష్ట్ర విభజను తీవ్రంగా వ్యతిరేకించిన నోముల నరసింహయ్య, చివరకు తెరాసలో చేరారు. అదే పార్టీ టికెట్ పై నాగార్జు సాగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దురదృష్ట వశాస్తూ ఆయన కన్ను మూశారు. ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు నోముల భగత్, తెరాస టికెట్ మీద పోటీచేసి గెలిచారు. అలాగే, సిపిఐ సీనియర్ నేత, ఒకప్పుడు శాసన మండలిలో ఆ పార్టీ నేత పువ్వాడ నాగేశ్వర రావు కుమారుడు, పువ్వాడ అజయ్ కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి, తెరాసలో చేరి మంత్రి అయ్యారు.. మరో సీనియర్ నాయకుడు, సీహెచ్ రాజేశ్వర రావు, ఎప్పుడొ  ఎర్రచొక్కా విప్పేశారు. తెలుగు దేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తదనంతరం ఆయన కుమారుడు, చెన్నమనేని రమేష్ తెరాస తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే, 2014 ఎన్నికల్లో  గెలిచిన ఏకైక  సిపిఐ  ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కూడా తెరాస తీర్ధం పుచ్చుకున్నారు. ఏపీలో అయితే, అసలు గెలిచిందే లేదు కాబట్టి, పార్టీని వదిలి పోయారనే చింత లేకుండా పోయింది. అయినా ఎపీలోనూ ఒకప్పడు ఎర్ర జెండాల నీడన ఎదిగిన కుటుంబాలు, పాలక పక్షాల గూటికి చేరిపోయాయి. అదలా ఉంటే వామపక్ష పార్టీలు ముఖ్యంగా తెలంగాణలో మళ్ళీ మరోమారు, తమ ఉనికిని కాపడుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేని వాస్తవాన్ని గుర్తించి, పొత్తుల వైపు మొగ్గు చూపుతున్నాయి. నిజానికి గతంలోనూ వామపక్ష పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, తెరాస ఇలా అన్నిపార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నాయి. అయితే  ఇప్పుడు సిపిఐ, సిపిఎం ఒకే పార్టీతో పొత్తు పెట్టుకుంటాయా? లేక ఎవరి దారిన వారు, వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారా, అనేది ఇంకా స్పష్టం కాలేదు. కానీ,  కాంమ్రేడ్ల కన్ను  కారు వైపు  ఉందన్న సంకేతాలు అయితే స్పష్టమవుతున్నాయి. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నాయకులతో ఇప్పటికే తెరాస అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విడత చర్చలు జరిపారు.  , ఒక నిర్ణయానికి అయితే ఇంకా రాలేదు. కానీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నాయకత్వం, పొత్తుల విషయంలో  స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర పార్టీలే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి. ఈ నేపధ్యంలో టీవీ చర్చల్లో పాల్గొంటున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల మాటలను బట్టి కామ్రేడ్లు తెరాస వైపు చూస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.మరోవంక కాంగ్రెస్, బీజేపీల నుంచి గట్టిపోటీ ఎదుర్కుంటున్న తెరాస కూడా వామపక్ష పార్టీలతో పొత్తుకు సిద్దంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సో ... కమ్యూనిస్ట్ పార్టీలు కారెక్కే.. చాన్సెస్ కాసింత ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

‘జగనన్న అమ్మ ఒడి’ ఖాళీ..

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల ప్రచారంలో  జగన్ సర్కార్ డొల్లతనం బయటపడిపోయింది. మీట నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు కుమ్మరించేస్తున్నామంటూ జగన్ చేసుకుంటున్న ప్రచారం పైన పటారం లోన లొటారంలా తయారైందని రుజువైపోయింది. ఇందుకు తాజా నిదర్శనమే జగనన్న అమ్మ ఒడి పథకం. ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించిన ప్రభుత్వం స్వయంగా తానే అర్హులైన లబ్ధిదారులు అంటూ ప్రకటించిన జాబితాలో వారికి కూడా ఖాతాలలో సొమ్ములు సమయానికి పడటం లేదు. జగన్ స్వయంగా గత నెల 27న శ్రీకాకుళంలో బహిరంగ సభ పెట్టి మరీ లబ్ధిదారుల ఖాతాలలోకి సొమ్ములు జమ చేశామంటూ మీట నొక్కారు. మీట అయితే నొక్కేశారు కానీ అక్కౌంట్లలో డబ్బులు పడలేదు. దాదాపు సగం మంది లబ్దిదారులకు సైతం ఇంత వరకూ ఖాతాలలో సొమ్మలు పడిన దాఖలాలు లేవు. అర్హుల జాబితాలో పేర్లు ఉన్నా ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడలేదంటూ వారంతా వాలంటీర్ల చుట్లూ తిరిగే పరిస్థితి. ఇంతకూ కారణమేమిటంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. డబ్బులు ఉన్నప్పుడు విడతల వారీగా అమ్మ ఒడి సొమ్ములకు ఖాతాలలో జమ చేస్తున్నారు. ఇంత మాత్రం దానికి బహిరంగ సభ పెట్టి మరీ మీట నొక్కాను మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయి చూసుకోండి అంటూ గప్పాలెందుకని జనమే ప్రశ్నిస్తున్నారు. గత నెలలో లిక్కర్ బ్యాండ్లు తనఖా పెట్టి మరీ తెచ్చిన అప్పులు జాతీలకే సరిపోయాయి. అలా సరిపోగా మిగిలిన సొమ్మును లబ్దిదారుల ఖాతాలలో వేశారు. అవి సగం మందికి కూడా సరిపోలేదు. మిగిలిన వారికి ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వేస్తామని అధికారులు చెబుతున్నారు. బాండ్ల వేలంతో గత మంగళవారం అంటే ఈ నెల 5 ఆర్బీఐ నుంచి మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు సంపాదించిన ప్రభుత్వం ఆ సొమ్ములో కొంత జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత విధించడమే కాకుండా, మిగిలిన లబ్ధిదారులకు సైతం సకాలంలో అమ్మఒడి సొమ్ములు అందించడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. దీంతో ముందు ముందు ఈ పథకం కొనసాగేనా, ప్రభుత్వం కొనసాగించగలదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

బండి పని మొదలెట్టేశారా!?

తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి చరిత్రను బయటపెడతామంటూ జాతీయ కార్యవర్గ సమావేశాల ముంగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ దిశగా పని మొదలెట్టేశారా అంటే ఔననే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఎలుకను పడతారో లేదో తెలియదు కానీ కొండను తవ్వే పని మాత్రం ప్రారంభించేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇంత కాలం చెబుతూ వచ్చిన బండి సంజయ్ ఇప్పుడు వాటిని బయట పెట్టడం సంగతి అటుంచి సమాచారం కావాలంటూ ఆర్టీఐకి దరఖాస్తులు చేశారు.   ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ బండి సంజయ్ ఆర్టీఐకి దాదాపు 80  దరఖాస్తులు చేశారు. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరుతూ ఈ దరఖాస్తులు చేశారు. ప్రజా కోర్టులో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆర్టీఐ ద్వారా సమాచార సేకరణ ఏంత వరకూ పనికొస్తుందని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి సమాచారం ఆర్టీఐ దరఖాస్తులతో బయటకు వస్తుందని భావించడమే సరికాదని అంటున్నారు.   అయినా అవీనితిపై ఆధారాలున్నాయంటూ ఇంత కాలం చెబుతూవచ్చిన బండి సంజయ్ ఇప్పుడు కొత్తగా ఆర్టీఐ దరఖాస్తుల పేరుతో హడావుడి చేయడమే ఆయన వద్ద ఎటువంటి ఆధారాలూ, సమాచారమూ లేదనడానికి నిదర్శనమని పరిశీలకులు సైతం సెటైర్లు వేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ దేశ వ్యాప్తంగా తమ రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ విషయంలో మాత్రం అటువంటి హడావుడి చేయకపోవడం, కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని బట్టయబలు చేస్తాం... ఆధారాలున్నాయి అంటూ ప్రసంగాలతో చెలరేగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు సమాచారం కోరుతూ ఆర్టీఐని ఆశ్రయించడం చూస్తుంటే.. బీజేపీ, టీఆర్ఎస్ లు పరస్పర విమర్శలూ, ఆరోపణలూ ఏదో రాజకీయ డ్రామాగానే కనిపిస్తున్నాయని శిశ్లేషకులు అంటున్నారు.  

జగన్ సంక్షేమం ఉట్టి మాట.. దోపిడీయే అసలు బాట!.. మదనపల్లె మినీ మహానాడులో చంద్ర నిప్పులు..

జగన్ సర్కార్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగన్ చెబుతున్న సంక్షేమం అంతా ఉట్టి మాటేననీ, ఆయన అసలు బాట దోపిడీయేనని మండి పడ్డారు. మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో చంద్రబాబు చేసిన ప్రసంగానికి భారీ స్పందన లభించింది. ముఖ్యంగా స్కూళ్ల విలీనం, వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడం, జగన్ బ్రాండ్ మద్యం, ధరల బాదుడే బాదుడుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.స్కూళ్ల విలీనంపై చంద్రబాబు జగన్ ను నిలదీశారు. పేద పిల్లలు చదువులకు దూరమయ్యేలా జగన్ చర్యలు ఉన్నాయని విమర్శించారు. హేతుబద్ధీకరణ అంటూ ఏనిమిదివేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం రాష్ట్రంలో విద్యను సర్వనాశనం చేయడమేనని మండిపడ్డారు. తన హయాంలో కిలోమీటర్ కు ఒక స్కూలు, మండలానికో కాలేజీ ఏర్పాటు చేస్తే జగన్ ఇప్పుడు స్కూళ్లను మూసేసి రాష్ట్రంలో విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలనీ, తిరగబడాలనీ పిలుపునిచ్చారు.కేవలం అర్ధ శాతం అప్పుకోసం జగన్ స్కూళ్లు మూసేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ చదువుకోలేదు కనుకనే ఇతరులు చదువుకోవడాన్ని భరించలేకపోతున్నాడని చంద్రబాబు అన్నారు. గతంలో అధికారం కోసం పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌.. ఇప్పుడు పన్నుల పేరుతో పిడు గుద్దులు గుద్దుతున్నారని ఎద్దేవా చేశారు.    రైతులు వినియోగించే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పారు.    . అప్పులు తెచ్చుకోవడం కోసమే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని సమస్యలూ సృష్టించి జనాలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.   మినీ మహానాడుకు జనం రాకుండా పుంగనూరులో వైసీపీ నాయకులు అడ్డుకున్నారన్నారు. తాను కన్నెర్ర చేస్తూ ఇళ్లల్లోంచి బయటకు రాలేరని వైసీపీ నేతలను హెచ్చరించారు.   రాష్ట్రంలో జే బ్రాండ్‌ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో జగన్‌ చెలగాటమాడుతున్నారనీ,  బూమ్‌ బూమ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రాగోల్డ్‌ వంటి పేర్లతో ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తున్నాడనీ విమర్శించారు. జే బ్రాండ్ మద్యంలో కెమికల్స్ ఉన్నాయని   రుజువైందన్నారు. జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  అద్దాల్లా ఉన్న రోడ్లు ఇప్పుడు గుంతల మయమయ్యాయన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులపై ఎటువంటి అరెస్టులు చేయకూడదని సుప్రీంకోర్టు  స్పష్టంగా చెప్పినా రాష్ట్రంలో 600 కేసులు పెట్టారు. 180 మందిని అరెస్టు చేశారన్న చంద్రబాబు కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. అటువంటి వారిపై మేం అధికారంలోకి వచ్చాకా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఆర్టీసీ ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. నేను దీపం పథకం ప్రవేశపెడితే జగన్‌ దానిని ఆర్పివేస్తూ గ్యాస్‌ ధరలు పెంచారు. ప్రస్తుతం వంట గ్యాస్‌ కొనే స్థితిలో మహిళలు లేరు, మళ్లీ కట్టెల పొయ్యిలే దిక్కయ్యేలా ఉన్నాయి. కోడిగుడ్లు, చికెన్‌ ధరలు కూడా సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ముస్లిం మైనారిటీల పెళ్లి ఖర్చులకు మేం దుల్హన్‌ పథకాన్ని ప్రవేశపెడితే జగన్‌ రద్దు చేశాడు. అన్న క్యాంటీన్లు,  చంద్రన్న బీమా, సంక్రాంతి కానుక.. అన్నింటినీ తీసేశాడు. జగన్ ది రద్దుల, విధ్వంసాల పాలన అని చంద్రబాబు అన్నారు.

బీజేపీ నష్ట నివారణ చర్యలు.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అబ్బాస్ నఖ్వీ?

నూపుర్‌ శర్మ వ్యాఖ్యల ద్వారా ఇస్లామిక్‌ దేశాల్లో, దేశంలోని ముస్లింలలో చెలరేగిన అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీజేపీ నడుంబిగించింది.. ముస్లింల ఆగ్రహాన్ని తగ్గించేందుకు ముఖ్తార్ అబ్బాస్ నక్విని ఎన్డీయే ఉపరాష్ట్ర అభ్యర్థిగా ప్రకటించనుంది. నక్వీని ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా ముస్లింలలో రగులుతున్న అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు చల్లారుతాయి అని బీజేపీ భావిస్తున్నది.   నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి నక్వీ రాజ్యసభ సభ్యత్వం గురువారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి బుధవారమే రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు ఆయన బీజేపీ జాీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ ఉభయ సభల్లో ఆరునెలలలోగా సభ్యడిగా లేకుంటే మంత్రిగా కొనసాగకూడదన్న నిబంధన మేరకే నక్వీ రాజీనామా చేశారని చెబుతున్నా.. ఆయనను దేశంలోని రెండో అత్యున్నత రాజ్యాంగ పదవికి పంపే  ఉద్దేశంతోనే  బీజేపీ ఆయనను  మళ్లీ రాజ్యసభకు పంపలేదని పరిశీలకులు అంటున్నారు. అలాగే గతంలో ఆయన  ప్రాతినిధ్యం వహించిన రాంపూర్‌  లోక్‌సభ నియోజకవర్గానికి ఇటీవల ఉప ఎన్నిక లు జరిగినప్పటికీ ఆయనను అక్కడ పోటీకి దింపలేదు. వీటన్నిటినీ బట్టి చూస్తే నక్వీని ఉపరాష్ట్రపతిని చేయాలని బీజేపీ నిర్ణయించుకుందని చెబుతున్నారు. నుపుర్ వ్యాఖ్యల వల్ల కేంద్రంలోని ముస్లింలలో మోడీ సర్కార్ పై గూడుకట్టుకున్న వ్యతిరేకతను, అలాగే ప్రభుత్వంపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను  నక్వీని ఉపరాష్ట్రపతిగా నియమించడం  తొలగించుకోవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించిన రెండు అంశాలు పౌరసత్వ సవరణ బిల్లు, ట్రిపుల్‌ తలాక్‌ అంశాల్లో నక్వీ మోడీ సర్కార్ కు అనుకూలంగా నిలిచారు. వాటిని సమర్ధించారు. దీంతో విధేయత పరంగా చూసినా కూడా నక్వీ  ఉపరాష్ట్రపతిగా పంపించడానికే బీజేపీ మొగ్గు చూపుతుందని అంటున్నారు.

రాష్ట్రపతి కోటా రాజ్యసభ సభ్యుల్లో దక్షిణాదికి అగ్రతాంబూలం

బీజేపీ దక్షిణాదిలో వేళ్లూనుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విదంగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా నలుగురు దక్షిణాది వారికి నామినేట్ చేసింది. ప్రముఖ తెలుగు సినీ రచయత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, అలాగే పరుగుల రాణి, ఒలింపిక్ పతక విజేత పీటీ ఉష, ధర్మస్థల ధర్మాధికారి  వీరేంద్ర హెగ్డేలను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ట్వీట్ చేసి తెలిపారు. రాష్ట్రపతి కోటా కనుక వీరంతా నేరుగా రాజ్యసభకు నామినేట్ అయినట్లే ఎటువంటి పోటీ ఎన్నిక ఉండదు. తెలుగు సినిమా రచయత  విజయేంద్ర ప్రసాద్ దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి. దాదాపు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకూ ఆయనే రచయత. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ బజరింగీ  భాయీజాన్ కు కథ అందించింది కూడా విజయేంద్ర ప్రసాదే. ఇక తమిళనాడుకు చెందిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి పరిచయమే అవసరం లేదు. ఎన్నో సుమధుర గీతాలకు సంగీతం అందించిన లబ్ధ ప్రతిష్టుడాయన. భారత్ కు ఒలింపిక్ మెడల్ అందించిన కేరళకు చెందని పరుగుల రాణి పీటీ ఉష. దేశంలో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన స్పోర్ట్స్ ఉమన్.   అలాగే కర్నాటకకు చెందిన వీరేంద్ర హెగ్. ఆయన కర్ణాటకలోని ప్రసిద్ధ అధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థల ధర్మాధికారి. వీరందరూ నామినేటెడ్ ఎంపీలే అయినా మిగిలిన రాజ్యసభ సభ్యులలాగే ఆరేళ్ల పదవీ కాలం ఉంటుంది. రాష్ట్రపతి కోటాలో వివిధ రంగాల్లో ప్రముఖులైన వారిని రాజ్యసభకు పంపిస్తూ ఉంటారు.  బీజేపీ ఈ సారి ఏకంగా నలుగురు దక్షిణాది వారిని రాజ్యసభకు నామినేట్ చేసి దక్షిణాదిలో బలోపేతం కావాలన్న లక్ష్యాన్ని బలంగా చాటింది.   

మరో వివాదం..మరో ప్రమాదం!

మత సంబందమైన సున్నిత అంశాలకు సంబందించి మాట్లాడే సమయంలో ఎవరైనా, కొంత జాగ్రత్త వహించడం అవసరం. అయితే, ఈ మధ్య కాలంలో  దేశంలో, ఇలాంటి అంశాలు వివాదం అవుతున్నాయి. వివాదం అవడమే కాదు, విషాద పరిణామాలకు దారి తీస్తున్నాయి. అయినా, రాజకీయ ప్రముఖులు. మీడియా, చివరకు నాయవ్యవస్థ, న్యాయమూర్తులు కూడా,లక్ష్మణ రేఖ, దాతుతున్నారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. భావప్రకటన స్వేచ్ఛ పేరిట చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పరస్పర విరుద్ధ వాదనలు, వివాదాలు టీవీ చానల్స్ స్టూడియోలో పురుడు పోసుకుంటున్నాయి.  ఇప్పుడు ఇదే క్రమంలో మరో వివాదం తెర మీదకు వచ్చింది. ఒక ప్రముఖ టీవీ చానల్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా, కాళీమాత గురించి వ్యక్తపరిచిన అభిప్రాయలు, ఆమె   చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. ప్రముఖ దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై కాళీ పేరిట ఒక లఘు చిత్రం తీశారు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌’ ను విడుదల చేశారు. ఈ పోస్టర్’లో కాళీ మాత ధూమపానం చేస్తునట్లు చూపించడం వివాదంగా మారింది. ఓ వంక ఆ వివదం అలా నడుస్తున్న సమయంలోనే, జాతీయ టీవీ చానల్ ‘ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న, మహువా వివాదానికి రాజకీయ వివాదానికి తెర తీశారు.   అఫ్కోర్స్,  టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగానే ఆమె స్పందించారు. అయితే,ఇప్పటికే దేశంలో ఒక విధమైన మత ఉద్రిక్తలకు పురిగొలిపే, వాతావరణం నెలకొన్న నేపధ్యంలో, ఆమె సమాధానాన్ని దాటవేసి ఉంటే. లేదా మరికొంత సున్నితంగా జవాబు ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, ఆమె  అదేమీ పట్టించుకున్నట్లు లేదు. ఆమె తమ సహజ ధోరణిలో స్పందించారు. ఆమె స్పందించిన తీరుకు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సొంత పార్టీ టీఎంసీ కూడా ఆమె మాటలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలతో, పార్టీకి సంబంధం లేదని, అధికారికంగా ప్రకటించింది. అయినా, మహువా మాత్రం తమ వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని అంటూనే వివరణ ఇచ్చారు. ఏ చిత్రానికి, ఏ పోస్టర్‌కు మద్దతు ఇవ్వలేదన్నారు. అలాగే, ధూమపానం అనే పదాన్ని వాడలేదని అన్నారు. అదే సమయంలో ఆమె, ఈ పరిణామాల మధ్యనే ఆమె టీఎంసీ అధికారిక ట్విటర్ ఖాతాను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవంక మతపరమైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. సినిమా పోస్టర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన నేపధ్యంలో ఆమెను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు, పోలీసులు ఆమె ఆపై కేసు నమోదు చేశారు.  మరోపక్క తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి మహువా నిరాకరించారు. బెంగాలీలు ఆరాధించే దేవతామూర్తి నిర్భయమైందంటూ ట్వీట్ చేశారు.‘నేను కూడా కాళీ మాత ఆరాధకురాలినే. మీ గుండాలకు, మీ పోలీసులకు, మరీ ముఖ్యంగా మీ ట్రోల్స్‌కు..  దేనికీ నేను భయపడను. నిజం చెప్పేందుకు ఇతర శక్తుల మద్దతు అవసరం లేదు’ అంటూ గట్టిగా బదులిచ్చారు. ఇప్పటికే, బీజేపీ మాజీ నేత నృపూర్ శర్మ, ముహ్మద్ ప్రవక్తకు సంబంధించి  చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఉద్రిక్తతలు సృష్టిస్తున్న నేపధ్యంలో, మహువా వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయి అనేది సామాన్యుల నుంచి మేథావుల వరకు అందరినీ ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు.

త‌మిళ‌నాటా ఓ షిండే : బిజెపి

తమిళ‌నాడు రాజ‌కీయాల్లో ఏ క్ష‌ణానైనా ఏద‌న్నా జ‌ర‌గ‌వ‌చ్చున‌ని, ఇక్క‌డ కూడా ఒక షిండే త‌లెత్త‌వ‌చ్చ‌ని త‌మిళ‌నాడు బిజెపి అధ్య‌క్షుడు కే. అన్నామ‌లై అన‌డం ఇపుడు అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. మ‌హా రాష్ట్ర లో మాదిరిగా ఇక్క‌డా రాజ‌కీయ ప‌రిస్థితులు మారే అవ‌కాశాలున్నాయ‌ని బిజెపి చూచాయిగా ఈ ప్ర‌స్థావ‌న చేసింది. అయితే డిఎంకే సీనియ‌ర్ నేత‌, పార్టీ నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి ఆర్.ఎస్‌. భార‌తి మాత్రం అన్నామ‌లై మాట‌ల‌ను పెద్ద‌గా సీరియ‌స్‌గా ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌న్నారు.  మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడుల‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను గురించి ప్ర‌స్థావిస్తూ, శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు దివంగత బాల్‌థాక్రే పెద్ద కుమారుడు బిందుమాధ‌వ్ సినీరంగ ప్ర‌వేశం అచ్చం త‌మిళ‌నాడు మాజీ ముఖ్య మంత్రి ఎం.క‌రుణానిధి కుమారుడు ముత్తు సినీరంగ ప్ర‌వేశం ఒకేలా వుంద‌ని అంటూ, వారిద్దరి తొలి సిని మాలూ పెద్ద‌గా ఆడ‌లేద‌ని అన్నామ‌లై అన్నారు.   బుధ‌వారం మ‌ద్రాసులో జ‌రిగిన బిజెపీ ర్యాలీలో అన్నామ‌లై మాట్లాడుతూ రెండు రాష్ట్రాల  మ‌ధ్య ప‌రిస్థితు ల‌ను స‌రిపోల్చారు.  థాక్రే రెండ‌వ కుమారుడు జ‌య‌దేవ్ కుటుంబానికి దూర‌మ‌య్యాడ‌ని, క‌రుణానిధి రెం డ‌వ కుమారుడు అల‌గిరీ కూడా అంతేన‌న్నారు. థాక్రే మూడ‌వ కుమారుడు ఉద్ధ‌వ్ మ‌హారాష్ట్ర ముఖ్య మంత్రి అవ‌కాశం అందిపుచ్చుకున్న‌ట్టే ఇక్క‌డ స్టాలిన్ కూడా అధికారంలోకి వచ్చార‌ని అన్నారు.   ఇక్క‌డ ఒక్క సంగ‌తి గ‌మ‌నించాలి, రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను  ఈ విధంగా స‌రిపోల్చుకుం టున్న బిజెపి మ‌రి త‌మిళ‌నాడులో కూడా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన‌ట్టు అధికార పార్టీలో ఎవ‌రో ఒక‌రు తిరుగు   బావుటా ఎగరేసే అవ‌కాశాలున్నాయ‌న్న అనుమాన బీజం నాటిన‌ట్టే అనుకోవాలి. బిజెపి వ‌ర్గీయులు ఇలాంటి వాటిలో సిద్ధ‌హ‌స్తుల‌నుకోవాలా? ఏమో  ఎవ‌రో ఒక‌రికి అలాంటి స్వేచ్ఛా రెక్క‌ల్ని బిజేపీ అందించినా  పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు. ద‌క్షిణాదిన బిజెపీ ప‌ట్టు సాధించాల‌ని ఎప్ప‌టి నుంచో తీవ్ర య‌త్నాలు చేస్తూనే వుంది. అది కేవ‌లం ప‌ట్టు విడుపుల్లానే సాగుతోంది. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో  సాధించిన విజయోత్సాహంతో  త‌మిళ‌నాట కూడా ఏదో ఒక పెద్ద ఎత్తుగ‌డ‌తోనే గంద‌ర‌గోళం సృష్టించి స్టాలిన్‌కు పెద్ద షాక్ ఇవ్వొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఆల్బ‌ర్ట్‌.. పుట్టుక‌తో సంగీత‌విద్వాంసుడు

కాస్త విన‌సొంపుగా పాడుతూంటే ఓ క్ష‌ణం వినాల‌నిపిస్తుంది.. ఎవ‌ర‌న్నా ఫ్లూటో, వీణో వాయిస్తుంటే వీనుల విందుగా వుంటే .. మ‌రో పాట‌నో, కీర్త‌న‌నో వాయించ‌మ‌ని కోరుతూంటారు.  పాడ‌టం, వాద్య నైపుణ్యాలు స‌ర‌స్వ‌తీ క‌టాక్షం అంటారు పెద్ద‌లు. అది అంద‌రికి అబ్బే విద్య‌ కాదు. వంద‌ మంది పాడేవారుండ‌వ‌చ్చు.. ఏ ఇద్ద‌రు ముగ్గురి గొంతో అమృతం పోసిన‌ట్టు వుంటుంది. అలానే వాద్య నైపుణ్యం కూడా.   కొంద‌రు పిల్ల‌ల‌కు ఊహించ‌ని విధంగా పాటో, ఏదో వాద్య నైపుణ్య‌మో స‌హజంగా వుంటుంది. ఇలాంటివి అక్క‌డో ఇక్క‌డో ఎవ‌రో ఒక‌రు గ‌మ‌నించే వుంటారు. ఒక పిల్ల‌వాడు హ‌ఠాత్తుగా పియానో అద్భుతంగా వాయిం చ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఐదేళ్ల ఆ పిల్ల‌వాడి పేరు ఆల్బ‌ర్టో క‌ర్టూసియా. వాడు వాయించింది ఏదో సినిమా పాటో, ట్యూనో కాదు.. ఏకంగా మొజార్ట్ గీతం!  దాన్ని ఒక  క‌ళాపిపాసి వీడియో తీసేడు. 3.8  మిలి య‌న్ల మంది ఆ వీడియోను వీక్షించి బుడ‌తడిని  ఆశీర్వదించారు.  ఏద‌న్నా వాద్య‌ ప‌రిక‌రం ప‌ట్ల ఆస‌క్తి క‌ల‌గ‌వ‌చ్చు, నేర్చుకోవ‌చ్చు. కానీ  అంద‌రినీ క‌ట్టిప‌డేసేంత  గొప్ప నైపు ణ్యం ప్ర‌ద‌ర్శించ‌డం చాలా చాలా అద్భుతం.  ఐదేళ్ల ఆల్బ‌ర్టో విష‌యంలో ఆ విశేష‌ణ స‌రైన‌దే. పియానో పై మోజార్ట్ గీతాన్ని వినిపించ‌డం అంత సుల‌భ‌ సాధ్యం కాదు. కానీ అది చేసి చూపాడు ఐదేళ్ల ఆల్బ‌ర్టో. అందుకే వీడిని బార్న్ మ్యూజీషియ‌న్ అంటున్నారు. అచ్చం మ‌న మంగ‌ళంప‌ల్లి బాల‌ముర‌ళీకృష్ణ‌ను యావ‌త్ సంగీత లోకం ప్ర‌శంసించిన‌ట్టు.

నీకు నేను..నాకు నువ్వు.. ఒకరికొకరం నువ్వూ నేనూ!

అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. కాలం క‌టువుగానే సాగుతూంటుంది. ఏది ఎప్పుడైనా జ‌ర‌గ‌వ‌చ్చు. నిన్న‌టి ప్రేమికులు ఏదో కార‌ణంతో విడిపోవ‌చ్చు. పిల్ల‌లు త‌ల్లిదండ్రుల‌ను విడిచీ పోవ‌చ్చు. కాలం విలువ‌ల్ని మార్చేస్తుంటుంది. ఊహ‌లోకంలో విహ‌రించ‌డం కృష్ణ‌శాస్త్రిగారి క‌విత‌ల్లోనే సాగుతుంది. వాస్త‌వం శ్రీ‌శ్రీ చెప్పి న‌ట్టుగానే వుంటుంది. కానీ ఎక్క‌డో ఎప్పుడో ఒక్క‌రు మాత్రం ఆదుకోవ‌డానికి అమాంతం అమృత‌హ‌స్తం అందించ‌వ‌చ్చు. ఒక‌వంక తుపాను గాడ్పుల‌కు వూరు వూరంతా వొణికిపోతూంటే ఈ  గువ్వ‌లు త‌మ‌ను తాము ర‌క్షించుకుంటున్నాయి. ఇదే బంధ‌మంటే. కాలు జారితే దూర‌మ‌వుతుంద‌న్న భీతి రెండింటిలోనూ వుంది. అందుకే.. ఒక‌టి వొణికి  ప‌డ‌బోతోంటే రెక్క‌తో ద‌గ్గ‌రికి లాక్కుంటోంది రెండోది.  అదీ అంతే ..నీకు నేను న్నానంటూ అదీ త‌న రెక్క‌తో ద‌గ్గ‌రికి తీసుకుంటోంది!  ఇలాంటి తోడొకటి చాలదూ జీవితానికి.   

దేశానికి ఉగ్ర ముప్పు .. భ‌య‌పెడుతోన్న అస్సోం ఘ‌ట‌న‌

దేశ‌ర‌క్ష‌ణ అంశాన్ని ప‌రిశీలిస్తే ఒకింత భ‌య‌మేస్తుంది. మ‌నం నిజంగానే  సుర‌క్షితంగా వున్నామా అన్న ప్ర‌శ్న పెద్ద‌ద‌యి వొణికిస్తోంది.  దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉగ్ర‌దాడుల‌కు ఆస్కారం వుంటోం ది. ఒక‌దాని  త‌ర్వాత మ‌రొక‌టి పెనుముప్పులు పొంచి వుంటున్నాయి. ప్ర‌భుత్వాలు మారినా, సైన్యం మూడు విభాగాలూ ఎంతో అప్ర‌మ‌త్తంగా వున్నన్నా..  ఉగ్ర‌దాడుల ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది.  కేంద్రం లో బిజెపి ప్ర‌భుత్వం దేశ ర‌క్ష‌ణ అంశంలో ఎంతో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, సైన్యాన్ని బ‌లోపేతం చేయ‌డానికే కొత్త సైనిక‌రంగ ప‌థ‌కాలు అమ‌లుచేస్తున్నామ‌ని భారీ ప్ర‌చారం చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ దేశంలో ఏదో ఒక మూల ఉగ్ర‌దాడి చిన్న‌దో పెద్ద‌దో జ‌రుగుతూనే వుంది.  భార‌త దేశంలోని కొన్ని న‌దులు, ఆన‌క‌ట్ట‌లు, ఇత‌ర క‌ట్ట‌డాల‌కు ముప్పు పొంచి వుంద‌ని నిపుణుల అంచ నా.  ఇటువంటి వార్త‌లు వింటున్న‌పుడు ఒక్క‌సారి వెన్నులో వొణుకు రావ‌డం ఖాయం.  ఒక‌టి రెండు సార్లు భారీ ఉగ్ర‌దాడుల‌కు దేశం ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చిందో జనం ఇంకా మరచిపోలేదు. ఉగ్ర‌సంస్థ‌లు ఏదో విధంగా దేశం లోకి   ప‌క్క దేశాల నుంచి దాదాపు నిరంతరంచొచ్చుకురావ‌డం గ‌మ‌నిస్తూనే వున్నాం. ముఖ్యంగా  పాకి స్తాన్ ప్ర‌భుత్వం త‌మ త‌ప్పేమీ లేద‌ని వాద‌న చేస్తున్న‌ప్ప‌టికీ, భార‌త్‌తో శాంతినే కోరుకుంటున్నా మ‌ని నీతులు చెబుతున్న‌ప్ప‌టికీ దాడులు మాత్రం ఏదో ఒక చోట‌, ఏదోవిధంగా జ‌రుగుతూనే వున్నాయి. వాటిలో పాల్గొన్న‌వారు త‌ప్ప‌కుండా పాక్ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు చెంద‌న‌వారే వుండ‌డం గ‌మ‌నార్హం. అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద భార‌త్ ఎంత గొంతు చించుక‌న్న‌ప్ప‌టికీ పాక్ విష‌యంలో అంత‌ర్జాతీయ సంస్థ ల‌న్నీ గ‌ట్టిగా హెచ్చ‌రించిన‌ట్టు న‌టిస్తున్నాయంతే.   అసోంను వ‌ర‌ద‌లు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. అయితే  అది ప్ర‌కృతి వైప‌రీత్యం కాద‌నే అనుమానా లు తలెత్తుతున్నాయి. బ‌రాక్ న‌ది క‌ట్ట‌ను కావాల‌నే కూల్చేశారు. అసోంలో వరద బీభత్సం భయానకంగా ఉంది.  ప్ర‌భుత్వం స‌కాలంలో స్పందించి వంద‌లాదిమంది ప్రాణాల‌ను కాపాడింది.  ఇది కేవ‌లం ప్ర‌కృతి వైప‌రీ త్యం కాద‌ని, దుండ‌డులు చేసిన దారుణ కృత్య‌మ‌ని ఆన‌క తెలిసి  దేశం భ‌యంతో వొణికింది.  ఇదే కాదు సిల్చార్ వ‌ర‌ద‌ల‌కు కార‌ణ‌మైన బ‌రాక్ న‌ది క‌ట్ట కూల‌డం వెనుక మిదున్ హుసేన్ ల‌ష్క‌ర్‌, కాబుల్ ఖాన్ ల‌నే ఉగ్ర‌వాదుల ప‌నే అని తేలింది.  వారిని కాచ‌ర్ ప్రాంత పోలీసులు అరెస్టు చేశారు.  క‌ర‌క‌ట్ట‌ల సంర‌క్ష‌ణ క‌ట్టుదిట్టం చేయ‌డం ఒక్క‌టే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌ను  అడ్డుకుంటుందా?  నిత్య నిఘా ఏర్పాట్లు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే విధ‌మైన జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూండ‌ట‌మే ప్ర‌భుత్వం చేయ‌ద‌గ్గ ప‌ని.  ఎందుకంటే ఎవ‌రు ఏ స‌మ‌యంలో దాడి చేస్తున్నార‌న్న‌ది ప్రతిసారి ముంద‌స్తు స‌మాచారం అంద‌డం, నిఘాసంస్థలు కనిపెట్టడం అన్నది సులభ సాధ్యం కాదు. ఘటన జ‌రిగిన త‌ర్వాత అతిజాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కంటే  ముందుగా ప‌టిష్ట భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం మేలు. ఈ దిశగా  ప్ర‌భుత్వాలు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని హామీలు యిస్తున్న ప్పటికీ  ఇటువంటి సంఘ‌ట‌న‌లు  ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను వెక్కిరిస్తూనే వున్నాయి. క‌నుక ప్ర‌జ‌లూ అప్ర‌మ త్తంగా వుండ‌డం అవ‌స‌ర‌మ‌న్న నినాదాలు ప్ర‌చార‌మ‌వుతున్నాయి. ఉగ్ర‌దాడు ల‌తో ఇళ్లు కూల‌డం  మ‌నుషుల ప్రాణం పోవ‌డం ఇంత‌వ‌ర‌కూ వింటున్నాం, చూస్తున్నాం.  కానీ  జ‌ల వ‌న రుల మీద జ‌రిగే ఇటువంటి దాడులు ఇప్పుడు ఉగ్రమూకల కొత్త ఎత్తుగడగా కనిపిస్తోంది.    దేశ జ‌ల‌శ‌క్తిని రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలసిన అవసరాన్ని అసోం ఘటన ఎత్తి చూపుతోంది.   ఏది ఏమైనా అసోం ఘటన దేశానికి విద్రోహ శక్తుల నుంచి ఏ స్థాయిలో ప్రమాదం పొంచి ఉందో తేటతెల్లం చేసింది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం కావలసిన ఆవశ్యకతను ఈ సంఘటన గట్టిగా చెబుతోంది.