ప్రతిష్ట కోసమే .. ప్రజారోగ్యం పై దృష్టి
posted on Jul 14, 2022 @ 11:53AM
ఏ ప్రభుత్వానికయినా ప్రజారోగ్యం కీలకం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగానే వుంది. ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఆరోగ్య శ్రీ కార్డుకు విలువలేకపోవడం గమనార్హం. జగన్ పాలనలో ఆస్పత్రుల్లో రోగులకు ఎలాంటి సమస్యలూ వుండబోవని ప్రచారం చేయించుకున్నారు. కానీ వాస్తవానికి పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. ప్రభుత్వ ఆరోగ్యపథకాలు, కార్డులు వల్ల ప్రజలు ఏమాత్రం తమకు ఆస్పత్రులపట్ల ధీమా ఇవ్వలేకపోయాయి. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం అయింది కానీ ఆస్పత్రులు, మందుల లభ్యత, మందుల్లో నాణ్యత అనే అనేకానేక అంశాల్లో లోపాల గురించీ నిరం తరం విపక్షాలు, ప్రజలు గోడు పెడుతూనే వున్నారు. కానీ అవన్నీ పట్టనట్టే వ్యవహరిస్తూ, సంబంధిత మంత్రి, అధికారులు మాత్రం ప్రజల ఆవేశాన్ని తగ్గించే తీపి మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. సమస్య ను పరిష్కరించాల్సిన వారు కేవలం పథకాలు ప్రకటించడంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడానికే ఇపుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యం తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల సంఖ్యను మరింత పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. పెంచదలచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ఏర్పా ట్లు చేయాలన్నారు. కానీ ఆస్పత్రులకు వెళుతున్న రోగులు వారి రోగాలు ఆ పథకంలో పేర్కొన్నజాబితాలో లేవని డాక్టర్లు, ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో రోగులు హతాశులవుతున్నారు. ఆరోగ్య శ్రీ అంటూ ధైర్యాన్నిస్టున్నట్టు భ్రమ కల్పించ డం ఏ మేరకు సమంజసమో ప్రభుత్వం చెప్పాలి. కాగా ఇప్పుడు రాజకీయ అవసరాలకు ప్రజారోగ్యం జగన్ టీమ్‌కు గుర్తొచ్చింది అన్న ఆరోపణలు వినపడుతున్నాయి.
చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేస్తామ న్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాల యంలో సీ.ఎం బుధవారం వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేయడానికి పూనుకున్నారు. ఆరోగ్యశాఖ రివ్యూ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకు న్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్లినిక్‌లు, పీహెచ్‌సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలని ముఖ్య మంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కిందచడబ్బు నేరుగా రోగి బ్యాంకు ఖాతాలోకి, అక్కడి నుంచి ఆస్పత్రికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా అగీకార పత్రం, చికిత్స పూర్తయిన తర్వాత ధృవీకరణ పత్రం, అందులో ప్రభుత్వం నుంచి అందిన సహా యం వివరాలు స్పష్టం గా వుండాలని సీఎం ఆదేశించారు. అంతేగాక, రోగులకు ఆరోగ్య ఆసరా సహాయం వివరాలు సేకరించా లని జగన్ సూచించారు. రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా, ఉచి తంగా వైద్యం చేశారా మొదలైన వివరాలు కూడా వీలు కల్పించాలన్నారు. ఎవరైనా లంచం అడిగినా, అధికంగా ఫీజులు వసూ లు చేసినా, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఏసీబీకీ ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పిం చాలని స్పష్టం చేశా రు. 108, 104 లాంటి సర్వీసుల్లోనూ లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసు కోవాలని, ఆ వాహనా లపై కూడా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలని ముఖ్య మంత్రి జగన్ స్పష్టం చేశారు. ఈనెల చివరినాటికల్లా సిబ్బంది నియామకాలు పూర్తిచేయాలని ఆదేశిం చారు. పీహెచ్ సీ మొదలు, బోధనాసుపత్రి వరకూ సరి పడా వైద్యులు, సిబ్బంది ఉండాలన్నారు. నాణ్య మైన వైద్యం అందించాలన్న ఉద్దేంతోనే ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని అధికారులకు వివరిం చారు. పేదలకు వైద్యం అందించే విషయంలో ఎవ్వరూ నిర్లక్ష్యం వహించినా, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.