గుడ్ మార్నింగ్ సీఎం సార్.. జనసేన హ్యాగ్ టాగ్ డిజిటల్ క్యాంపెయిన్

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ డిజిటల్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తోంది  #GoodMorningCMSir హాష్ ట్యాగ్‌తో.. ఏపీలోని రోడ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమంలో షేర్‌ చేస్తున్నారు జనసేన  శ్రేణులు. శుక్రవారం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన శ్రీణులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఆందళనలు సైతం నిర్వహించారు.   కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద జనసేన శ్రేణులు ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆయన  ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు జనసేన పార్టీ శ్రేణులు. జనసేన నేతలను పోలీసులు అడ్డుకుకోవడంతో కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్యా తోపులాట జరిగింది. గోతులమయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలోనే ధర్నా నిర్వహించారు జనసేన కార్యకర్తలు. మొద్దు నిద్రపోతున్న సీఎం మేలుకోవాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు.. 

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి విశ్వరూపం

ఉగ్ర గోదావరి విశ్వ రూపం దాల్చింది. భద్రాచలం రామాలయాన్ని చుట్టుముట్టింది. వరద గోదారి భద్రాచలం పరిసర ప్రాంతాలను జలదిగ్బంధం చేసింది. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 70 అడుగులకు చేరింది. అర్ధరాత్రి సమయానికి ఇది 75 అడుగులకు చేరు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.1986 తరువాత గోదావరికి ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటి సారి. వరద ప్రవాహం 80 అడుగులకు చేరితే మొత్తం భద్రాచలం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. గోదావరి నీటి మట్టం 75 అడుగులకు చేరితే వంతెన పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది.   వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆర్మీ సహాయాన్ని కోరింది.  సాధారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.   భద్రాచలం వద్ద ఎంతటి భయానక పరిస్థితి నెలకొంటే మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి దాదాపు 18 అడుగుల ఎత్తున గోదావరి ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది.   ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ఫోన్ లో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అలాగే పువ్వాడతోనూ ఫోన్ లో మాట్లాడి భద్రాచలంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.

జగన్ కాబినెట్ లో సీనియర్ల చిటపటలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రులంతా సమానమే.  సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరికీ పెద్దగా అధికారాలు ఏమీ ఉండవు. అందుకే మంత్రులు ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా మాటకు ముందోసారి మాట చివరన మరోసారీ, జగన్ నామస్మరణ చేస్తుంటారని అంటారు. అది నిజమే. మొన్నీ మధ్య రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన, మంత్రులు, మాజీ మంత్రులు అంతా అదే పనిచేశారు.అఫ్కోర్స్ , పనిలో పనిగా టీడీపీ, జన సేన నాయకులను తిట్టి పోశారనుకోండి, అది వేరే  విషయం.  చివరకు ప్లీనరీ  పెట్టిందే అందుకు, అన్నట్లుగా మంత్రులు , మాజీలు జగనన్నకు చెవి విందు చేశారు, జగన్ రెడ్డి చిద్విలాసంగా నవ్వుకుంటూ, ఎంజాయ్ చేశారు.   అయితే, జగన్ రెడ్డి మంత్రివర్గంలో  మంత్రులంతా సమానమే అయినా, జూనియర్లు కొంచెం ఎక్కువ సమానమనే మాట ఒకటి కొత్తగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, 2019 ఎన్నికలలో గెలిచిన  తర్వాత మంత్రి వర్గం కూర్పులో, ఒక ‘విచిత్ర’ ‘వికృత’ ప్రయోగం చేశారు. మంత్రి పదవులు ఆశించిన సీనియర్లు చాలా మందిని పక్కన పెట్టారు.  ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. అంతే కాదు, మంత్రి వర్గం పదవీ కాలాన్ని రెండు ముక్కలు చేశారు. మంత్రి వర్గం తొలి సమావేశంలోనే, మీరు పదవిలో ఉండేది రెండున్నర సంవత్సరాలే, రెండున్నర  సంవత్సరాలు అయిపోగానే, మీరంతా మాజీలు అయిపోతారు. సెకండ్ బ్యాచ్ మినిస్టర్స్ వస్తారని మొహమాటం లేకుండా మంత్రుల ముఖం మీదనే చెప్పేశారు.   అనుకున్నట్లుగా ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలకు కాక పోయినా, ఓ మూడు  నాలుగు నెలలు కొవిడ్ ఎక్స్టెన్షన్ ఇచ్చి, ఏప్రిల్ 11 న  మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ చేశారు. అంతకు ముందే మంత్రులంతా రాజీనామా చేశారు. సో.. ముందుగా అనుకున్న విధంగా మంత్రులంతా మాజీలు అయిపోతారని ప్రచారం జరిగినా, చివరకు జగన్ రెడ్డి, 14 మంది కొత్తవారిని తీసుకుని. 11 మంది పాతవారికి  మళ్ళీ అవకాశం కల్పించారు.  అయితే, అలా మళ్ళీ తీసుకున్న వారిలో కొందరికి మాత్రమే ప్రాధాన్యత గల శాఖలను ఇచ్చారు, ఇంకొందరిని ఎందుకనో సైడ్ ట్రాక్ చేశారని, అంటారు. అలా సైడ్ ట్రాక్ చేసిన మంత్రులలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  అంతకు ముందు రాజధాని వ్యవహారాలను చక్కపెట్టే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక  శాఖను ఇచ్చిన బొత్సకు, సెకండ్ హాఫ్’లో ఆయనకు అస్సలు రుచించని, విద్యా శాఖను ఇచ్చారు. అదొకటి చాలదన్నట్లుగా, ఇప్పుడు అక్కడ కూడా పొమ్మనకుండా పొగపెట్టే ప్రయత్నం ఏదో జరుగుతోందని అనుమానాలు  పార్టీ సర్కిల్స్ లో గుప్పు మంటున్నాయని  అంటున్నారు.  విద్యా శాఖ అధికారులు, మంత్రిని పక్కన పెట్టేసి తమ పని తాము చేసుకుపోతున్నారు. దాంతో  విద్యా శాఖలో ఏమి జరుగుతోందో, విద్యా శాఖ మంత్రికి తెలియని ఒక విచిత్ర పరిస్థితి నెలకొందని అంటునారు. జీవోలు వచ్చేస్తున్నాయి. ఎలా వస్తాయంటే.. అది అంతే, అనే సమాధానం వస్తోందని, మంత్రి అనుచరులు ముఖాలు మాడ్చుకుంటున్నారు. అంతేకాదు, మంత్రిగారి ఆదేశాలను అధికారులు పట్టిచుకోవడం లేదని అంటున్నారు.  ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పాఠశాలల విలీనంపై చాల పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో మంత్రి బొత్స విలీనం ప్రక్రియను వెంటనే అపేయాలని అధికారులను ఆదేశించారు. అయితే  అధికారులు మంత్రి ఆదేశాలను పట్టించుకోలేదు సరి కదా పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి రివ్యూ మీటింగ్ పెడితే, సగం మంది అధికారులు అసలు రాలేదు. వచ్చిన సగం మంది మంత్రి ఆదేశాలు అక్కడే చెత్త బుట్టలో పడేసి చక్కా పోయారని, సెక్రటేరియట్ వర్గాల సమాచారం. ఇలా మంత్రిని అధికారులు పట్టించుకోవడం లేందంటే, ముఖ్యమంత్రి నుంచి అలాంటి మౌఖిక ఆదేశాలు వచ్చి ఉంటాయని, లేదంటే, అధికారులు మంత్రిని అంతలా చిన్నచూపు చూడరని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు, అన్నట్లుగా బొత్స సహా మరి కొందరు సీనియర్ మంత్రులు తమకు విలువలేకుండా పోయిందనే కంటే, రాజకీయాల్లో ఇంకా పూర్తిగా బొడ్డయినా ఉడని కుర్ర మంత్రుల హవా చూసి కొంచెం చాలా అవమానం ఫీల్ అవుతున్నారని అంటున్నారు.  ఆరోగ్య మంత్రి విడదల రజనీ వయసు బొత్స సత్యనారాయణ అనుభవం అంత ఉండదు, అయినా, ఆమె రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీకి వెళ్లినా.. అధికారులు బారులు తీరి నిలబడుతున్నారు. సమీక్ష సమావేశం అంటే, చెప్పిన సమయానికంటే ముందుగానే వచ్చి చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. అదే బొత్సా వారో మరో సీనియర్ మంత్రో ఆకస్మిక తనిఖీ ఆలోచనే చేయలేని పరిస్థితి ఉందని, అందుకే,  వెళ్లి పదిమంది ముందు తమను తాము బయటేసుకోవడం ఎందుకనో ఏమో అలాంటి ఆలోచనలే చేయడం లేదని అంటున్నారు. సమీక్షలు కూడా మొక్కుబడిగా, పిచ్చాపాటి మాటలతో సరిపుచ్చడమే కానీ,  సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం అనేది మంత్రులు మరిచి పోయారని అంటున్నారు.   అయితే బొత్స సహా కొందరు సీనియర్లను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని, ఈ విషయంపై   సీనియర్ మంత్రులు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అయితే, అలవి  కాని చోట అధికులం అనరాదు అనే ఇంగిత జ్ఞానంతో విద్యామంత్రి బొత్స మౌనంగా, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు. అయితే. ముఖ్యమంత్రి ఎందుకు సీనియర్ మంత్రులకంటే జూనియర్ మంత్రులకు ప్రధాన్యత ఇస్తున్నారంటే, అభద్రతాభావం అనే సమాధానమే వస్తోంది. నిజానికి పార్టీలో, ప్రభుత్వంలో మరో అధికార బిందువు ఉండరాదనే జగన్ రెడ్డి చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను పొరుగు రాష్ట్రానికి పంపించారు, అలాగే బోత్సవంటి సీనియర్లను పక్కన పెట్టారని అంటున్నారు.

బీజేపీ గాలి తీసేసిన ఆత్మ‌సాక్షి స‌ర్వే

పెళ్లిళ్ల‌లో పెద్ద బావ‌గారిలా హ‌డావుడి చేసినంత మాత్రాన అన్నీ అయిపోవు, అత్త‌రూ రాయ‌రు. కేంద్రంలో అధికారంలో వున్నంత మాత్రాన బిజెపి అన్ని రాష్ట్రాల్లోనూ ద‌బాయించి అధికారం చేజిక్కించుకోవ‌చ్చ‌న్న ధోర‌ణిలో మ‌రీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కానీ తెలంగాణాలో ఇటీవ‌లి స‌ర్వే మాత్రం ఆ దూకుడుతో  కమలం బోర్లా ప‌డే అవ‌కాశాలే చాలా వున్నాయ‌ని తేల్చింది.   ఇప్పుటికిప్పుడు ఎన్నికలు వచ్చినా  తెలంగాణాలో బిజెపి మూడో స్థానానికే పరిమితమౌతుందని ఆత్మ‌సాక్షి స‌ర్వే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది.   ఈ స‌ర్వే  తెలంగాణ‌లో గులాబీ పార్టీకి ఈ సారి 39.5 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని అంచనా వేసింది. అంటే 56 నుంచి 59 ఎమ్మెల్యే స్థానాల‌ను గెలుచుకుంటుందని పేర్కొంది.  అలాగే కాంగ్రెస్ పార్టీకి సీట్లు  పెరిగే అవ‌కాశం ఉందని సర్వే పేర్కొంది. 31.5 శాతం ఓట్లు వ‌స్తాయనీ,  37 నుంచి 39 స్థానాలలో ఆ  పార్టీ విజయం సాధించే అవకాశాలున్నాయనీ అంచనా వేసింది. ఇక బీజేపీకి కూడా    21 శాతం ఓట్లు ప‌డే అవకాశం ఉందనీ, సీట్ల పరంగా   14 నుంచి 16 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందనీ ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది.  రాష్ట్రంలో మొత్తం మీద  టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే  ప్ర‌ధాన పోటీ ఉంటుందని సర్వే తేల్చేసింది.   ఇక ఎంఐఎం కు 2.75 శాతం ఇతరులకు  3.25 శాతం ఓట్లు ప‌డ‌నున్నాయి.  సర్వే  కోసం రాష్ట్ర వ్యాప్తంగా   1.88 ల‌క్ష‌ల మంది అభిప్రాయాల‌ను సేక‌రించింది ఆత్మసాక్షి. స‌ర్వేలో  రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, ధ‌ర‌ణి, వ‌డ్ల కొనుగోలు, ఎంప్లాయిమెంట్, శాంతి, అడ్మినిస్ట్రేష‌న్, పరిపాల‌న తీరు వంటి 40 అంశాల‌పై ప్ర‌శ్న‌లు రూపొందించినట్లు ఆత్మసాక్షి గ్రూప్ సంస్థ  సీఈవో మూర్తి  తెలిపారు. తాము ఇంతవ‌ర‌కు 18 రాష్ట్రాల్లో ఇలా స‌ర్వేలు చేశామ‌ని చెప్పారు. అయితే అందులో 16 రాష్ట్రాలలో  త‌మ స‌ర్వే కచ్చితమైన ఫలితాలను వెల్లడించిందని వివరించారు. . కేవ‌లం రెండు రాష్ట్రా ల్లో మాత్ర‌మే తమ అంచ‌నాలు త‌ప్పాయ‌ని పేర్కొన్నారు. ఈ స‌ర్వే మొత్తం జూన్ 30వ తేదీ నాటికి పూర్త‌యింది.   టీఆర్ఎస్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన ద‌ళిత బంధు ప‌థ‌క‌మే ఆ పార్టీకి  కొంత ఓటు బ్యాంకు ను దూరం చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయనీ, ఈ ప‌థ‌కం పూర్తి స్థాయిలో  అమలు కాకపోవడం వల్ల  ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు 1.5 శాతం మంది ద‌ళితులు గులాబీ పార్టీకి దూరంగా జ‌రిగారనీ సర్వే పేర్కొంది.   వ‌డ్లు కొనుగోలు జాప్యం, ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుదల‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే కారణమని   తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు సర్వే లో తేలిందని ఆత్మసాక్షి పేర్కొంది.  

భీమవరం నుంచే జనసేనాని పోటీ!

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నది సామెత. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే సామెతను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలలో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం,  విశాఖ జిల్లా గాజువాకల నుంచి అసెంబ్లీ బరిలోకి దిగారు. అయితే రెండు చోట్లా ఆయన పరాజయం పాలయ్యారు. దీంతో ఈ సారి ఆయన తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. పలు సందర్భాలలో జనసేని వర్గాలు  ఆ విషయాన్ని దాదాపు ఖరారు చేసినట్లే మాట్లాడారు. కానీ తాజా సమాచారం మేరకు వచ్చే ఎన్నికలలో ఆయన మళ్లీ భీమవరం నియోజకవర్గం నుంచే బరిలోకి దిగనున్నారు. 2014 ఎన్నికలలో జనసేన బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంది. అయితే 2019 ఎన్నికలలో మాత్రం బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో పొత్తును, మైత్రిని కటీఫ్ చేసుకుని ఒంటరిగా బరిలోకి దిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీలో నిలిచారు.  అయితే ఆ ఎన్నికలలో జనసేనకు ఘోర పరాజయం ఎదురైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించగా, పోటీ చేసిన మిగిలిన అన్ని స్థానాలలోనూ పరాజయం పాలైంది. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ ఏ పార్టతో పొత్తు పెట్టుకుంటుందన్నది ఖరారు కాలేదు. అయితే జనసేన మాత్రం ఈ సారి ఎన్నికలలో విజయంపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంగా పవన్ కల్యాణ్ సురక్షిత స్థానం కోసం చేసిన అన్వేషణలో తిరుపతి నుంచి అయితే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చినట్లు ఇప్పటి వరకూ పార్టీ శ్రేణులు చెబుతూ వచ్చాయి. అయితే అవన్నీ ఊహాగానాలేననీ, పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలలో భీమవరం నుంచే పోటీ చేస్తారనీ జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 17న పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించనున్నారు. ఆ పర్యటనలోనే పవన్ కల్యాణ్ భీమవరం నుంచే తన పోటీ అని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని  జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

అరాచ‌క రాజ్యం .. ఖాకీ వ‌నం

పోలీసు, ఆర్మీ జ‌వాను అనగానే ఎందుకో అపార‌గౌర‌వ భావ‌నే క‌లుగుతుంది. ఇటీవ‌ల సినిమాల్లోనూ పోలీస్ అధికారి అన‌గానే ఆయ‌న్ను దేవుడితో స‌మానంగా చూపిస్తున్నారు. పోలీస్ అధికారి అమ‌లాపురం నుంచి అమెరికా, నైజీరియా కూడా వెళ్లి డ్ర‌గ్‌పెడ్ల‌ర్‌ను ప‌ట్టుకురావ‌డం ఎంతో భ‌క్తిభావ‌న‌తో చూసి త‌రిం చాం. ఇక్క‌డిదాకా బాగానే వుంది. కానీ ఆ డిపార్ట్‌మెంట్‌కి మ‌ర‌క తెచ్చేవారూ త‌యార‌వుతున్నారు. ర‌క్ష‌కుడే భ‌క్ష‌కుడైతే వంటి క‌థ‌నాలు అపుడ‌పుడూ వింటున్నాం. మ‌రీ దారుణ‌మేమంటే  ఇటీవ‌ల ఆ శాఖ‌లోనూ రేపిస్టులు త‌యార‌యారు. ఇది ఎవ‌రికీ మింగుడు ప‌డ‌ని సంగ‌తి. ఎవ‌రిక‌యినా అన్యాయం జ‌రిగితే ముందు  గుర్తొచ్చేదే పోలీసులు. ఇపుడు ఓ పోలీసాయ‌నే అరాచ‌కాల‌కు పాల్ప‌డుతుంటే జ‌నం ఏం  కావాలి.  పోలీస్ స్టేష‌న్ మీద న‌మ్మ‌కం త‌గ్గితే శాఖ‌మే ప‌రువు న‌ష్టం.  త‌మ శాఖ‌లో అలాంటి కీచ‌కుల‌ను వారే గ‌ట్టిగా శిక్షించాలన్న నినాదాలు విన‌ప‌డుతున్నాయి. చ‌ట్టాల అమ‌లులో సామాన్య జ‌నానికి, పోలీసుల‌కు వేరు వేరు విధానాలు వుంటే అస‌లు పోలీసు శాఖ‌ను దేవుడు కూడా న‌మ్మ‌డు.  రాష్ట్రంలో ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులపై  ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక లావా దేవీలు, స్థిరాస్తి వ్యాపారాలు, కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు పెరుగుతుండటంతో వాటి ద్వారా లబ్ధి పొందేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా తెలంగాణా లో జరిగిన ఉదంతాలే  ఉదాహ రణ. పోలీస‌లు ముఖ్యంగా భూ లావాదేవీలకు సంబంధించి పోలీసులపై ఎక్కువగా ఆరోపణలు  వస్తున్నా యి. అలాగే ఏదో  ఓ అవసరం మీద స్టేషన్‌కు వచ్చే మహిళలను ఆకట్టుకునో, బెదిరించో లోబరుచుకుం టున్న కేసులూ పెరుగుతున్నాయి  తెలంగాణలో. మొన్న నాగేశ్వరరావు, నిన్న విజయ్‌.. ఇప్పుడు భవానీ సేన్‌.  ఈ మూడు కేసులూ వివాహేతర సంబంధాలకు సంబంధించినవే కావడం గమనార్హం. కానీ  పోలీసు లే వేధింపులకు పాల్పడుతుండటం, వివాహేతర సంబంధాలకు పాల్పడటం అధికారులకు మింగుడు పడటంలేదు. ఇటీవల నగర పోలీసు అధికారుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు అత్యాచారం కేసులో ఇరుక్కోగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి ఓ యువతిని మోసం చేసిన ఘటనలో మల్కాజ్‌గిరిలో సీసీఎస్‌ ఎస్‌ఐ విజయ్ పై కేసు నమోదైంది. అలాంటి అదికారులని కేవలం తాత్కాలికంగా స‌స్పెండ్ చేయ‌డంగాకుండా  విధుల నుంచి  తొలగించా లని, మళ్ళీ విధు ల్లో  చేరకుండా చేయాలనీ ప్రజల ఆకాంక్ష. ప్రజా సంఘాలు, మానవహక్కుల సంఘా లు, మహిళా సంఘాలు, కోర్టులు వెంట‌నే  కేసు ని సుమోటో గా స్వీకరించి నిందితులని సత్వరమే విచా రించడానికి  ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి కరుడు కట్టిన నేరస్తుల విషయం లో ఉన్న చట్టాల కన్నా కొత్త చట్టాలు రూపొందించి నేరం నిరూపితమైతే, కఠిన శిక్షలు అమలు చేస్తే తప్ప అరాచకాలు ఆగ బోవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

నరేష్, పవిత్ర అనుబంధం వెనుక కథేంటి?

హీరోగా కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత క్యారెక్టర్ యాక్టర్ గా సెటిలైన నరేష్ ఆ మధ్యలో రాజకీయాలలో కూడా కొంత హడావుడి చేశారు. బీజేపీలో చేరి ఆ పార్టీ యువ నాయకుడి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి వరకూ ఎదిగారు. 2009 ఎన్నికలలో హిందూపూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బిజెపికి రాజీనామా చేశారు.  ఆ తరువాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చురుకుగా వ్యవహరించారు. అక్కడా వివాదాస్పదంగా మారారు. అయితే అప్పుడెప్పుడూ రానంత పాపులారిటీ నటుడు నరేష్ కు ఇటీవలి కాలంలో వచ్చింది. అందుకు ప్రధాన కారణం ఆయనకు, పవిత్రా లోకేష్ కు ఉన్న సంబంధం, అనుబంధమే. వారిరువురి సఖ్యతపై మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. ఆ కథనాలలోని ఔచిత్యాన్ని పక్కన పెడితే.. పవిత్రా లోకేష్ తో నరేష్ అనుబంధం మాత్రం కేవలం సినీ వర్గాలలోనే కాకుండా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ పవిత్రా లోకేష్ ఎవరు? నరేష్ తో ఆమె అనుబంధం ఏమిటన్న వివరాల్లోకి వెళితే.  కర్ణాటకలోని  మైసూర్‌లో జన్మించిన పవిత్ర లోకేశ్ తండ్రి కన్నడ నటుడు లోకేష్. ఆయన పవిత్ర లోకేష్ చిన్నతనంలోనే మరణించారు. దీంతో పవిత్ర లోకేష్ తండ్రి సినీవారసత్వాన్ని కొనసాగించారు. ఒక వైపు నటిస్తూనే శ్రద్ధగా చదువుకుని డిగ్రీ పూర్తి చేశారు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. ఆ తరువాత సీనిమాలనే కెరీర్ గా ఎంచుకున్నారు. కన్నడ నాట హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించినా పెద్దగా పాపులర్ కాలేదు.  కన్నడలో హీరోయిన్ గా అయితేనేం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితేనేం దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. పలు అవార్డులు సైతం అందుకున్నారు. ఆమె భర్త సుచీంద్ర ప్రసాద్ కూడా కన్నడ నటుడే. అయితే సుచీంద్ర ప్రసాద్ కంటే ముందు ఆమెకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం అయ్యింది. ఆ తరువాత ఆయనతో విడాకులు తీసుకుని కన్నడ నటుడు సుచీంద్ర ప్రసాద్ లో సహజీవనం చేశారు. 2018 లో ఆయన నుంచి విడిపోయారు. కాగా ఆ తరువాత ఆమె తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. తొలుత రవితేజ హీరోగా నటించిన దొంగోడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పవిత్రా లోకేష్ ఆ తరువాత తెలుగు సినిమాలలో తల్లి, అత్త వంటి క్యారెక్టర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఈ క్రమంలోనే నటుడు లోకేష్ కు దగ్గరయ్యారు. వీరిరువురూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  

విపక్షాల ఐక్యతకు కేసీఆర్ మరో యత్నం

కేంద్రంతో పోరు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకే కదులు తున్నారు. జాతీయ స్థాయిలో ఏ పార్టీ కలిసి రాకపోయినా ఆయన మాత్రం వెనకడుగు వేయడంలేదు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్ ను గద్దె దింపాల్సిందే అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు. దేశవంలో సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను  కాపాడాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే అన్న నిశ్చయంతో ఉన్న కేసీఆర్ ఆ దిశగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు తాజాగా మరో ప్రయత్నం ప్రారంభించారు. దేశంలో ప్రమాదంలో పడిన ఫెడరల్, సెక్యులర్, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించడమే ధ్యేయంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీల నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాలలో విపక్ష నేతలతో శుక్రవారం ఫోన్ లో సంభాషించారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తున్న కేంద్రం వైఖరిని ప్రజలలో ఎండగట్టడమే లక్ష్యంగా కలిసి వచ్చే పార్టీలను సమన్వయం చేసుకుంటూ మోడీ సర్కార్ పై సమర శంఖాన్ని పూరించడానికి తన సన్నాహాలను కేసీఆర్ మరింత వేగవంతం చేశారని తేటతెల్లమౌతోంది. ఈ నెలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాల వేదికగా మోడీ సర్కార్ పై పోరు మొదలు పెట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. పార్లమెంటు వేదికగా విపక్షాలన్నీ ముక్తకంఠంతో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించేలా వ్యూహం రూపొందించడమే లక్ష్యంగా ఆయన శుక్రవారం పలు పార్టీల నేతలతో జరిపిన సంభాషణ సాగిందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో, ల్లీ ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రీవాల్ తో, తమిళనాడు సీఎం స్టాలిన్ సన్నిహితులతో, బీహార్ ఆర్జెడీ నేత తేజస్వీయాదవ్ తో , యుపీ విపక్ష నేత, జేడీయూ అధినేత  అఖిలేశ్ యాదవ్ తో, మరాఠా యోధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో  ఈ దిశగా సమాలోచనలు జరిపిన కేసీఆర్ మరో సారి జాతీయ స్థాయిలో బీజేపీయేతర నేతలతో ఫోన్ లో ముచ్చటించారు.   ఇతర జాతీయ విపక్ష నేతలతో స్వయంగా ఫోన్లో స్వయంగా మాట్లాడిన  సిఎం కెసిఆర్. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై కేసీఆర్ ప్రతిపాదనలకు పలు రాష్ట్రాల సీఎంలు విపక్ష పార్టీల నేతలు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.     అటు వరదలనుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూనే ఇటు బిజెపి అప్రజాస్వామిక విధానాల విపత్తు నుంచి దేశాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయిలో పోరాటనానికి విపక్షాల ఐక్యత కోసం కేసీఆర్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

ముర్మూజీ .. మీకే మా మ‌ద్ద‌తు

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మంగ‌ళ‌వారం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము  ఆంధ్ర ప్ర‌దేశ్ లో  ప‌ర్య‌టించారు. వాస్త‌వానికి  ఆమె తెలంగాణా కూడా ప‌ర్య‌టించాల్సి వుంది. కానీ  స‌మ‌యం అంతగా లేక‌పోవ‌డంతో ఆమె త‌న ప‌ర్య‌ట‌నను ఆంధ్రాతో ముగించి వెనుదిరిగారు.  కాగా బీజేపీ నేత రాజా సింగ్‌, ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ గురువారం గోవా వెళ్లి ద్రౌపది ముర్ముతో సమావేశమై ఆమెకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.  గిరిజ‌నుల జ‌నాభా గురిం చి ఆమె తెలుసుకోవాల‌నుకున్నారు. ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో  గిరిజ‌న జ‌నా భా అధికంగా ఎక్క‌డున్న ది త‌న‌ను క‌లిసిన తెలంగాణా నాయ‌కుల నుంచి తెలుసుకున్నారు. ఆమె ఒరి స్సా గిరిజ‌నుల తెగ‌కు చెందిన వారు. గిరిజ‌నుల‌కు తాను భ‌విష్య‌త్తులో మేలు చేయాల‌ని ఆశించి వుండ వచ్చు. గురువారం త‌న‌ను క‌లిసిన బిజెపి నాయ‌కుల  ద్వారా  తెలంగాణ, ఏపీల్లో గిరిజనుల స్థితిగతులపై వివరా లు తెలుసుకునేందుకు ఆమె ఆసక్తి చూపి నట్లు స‌మాచారం. తెలంగాణాలో గిరిజ‌నుల గురించి తెలం గాణా బిజెపి ఎమ్మె ల్యేలు వివ‌రించి వారి సంక్షే మానికి తోడ్పడాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది.  దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో తాను, ఈటల రాజేందర్‌ గెలిచిన తీరును ద్రౌపది ముర్ముకు వివ రించినట్లు ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించార‌ని తెలిసింది.  తెలంగాణలో రాజకీయ పరిస్థి తులను ద్రౌపది ముర్ముకు  ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు. ఇదిలా వుండ‌గా, అస‌లు ఆమె గ‌తంలో ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా వున్న‌పుడు గిరిజ‌నుల‌కు ప్ర‌త్యేకించి ఎలాంటి స‌హాయ‌క చ‌ర్య‌లూ చేప‌ట్ట‌లేద‌న్నది బిజెపీ యేత‌ర పార్టీల ఆరోప‌ణ‌లు.  ఏమ‌యిన‌ప్ప‌టికీ, ఇపుడు ప్ర‌చారంలో భాగంగా వచ్చి ప్ర‌త్యేకించి గిరిజ‌నుల గురించి వాక‌బు చేయ‌డం త‌ప్ప‌కుడా ఆమె భ‌విష్య‌త్తులో వారికి మేలు చేయా ల‌న్న ఆలోచ‌న‌లోనే వున్న‌ట్టు అర్ధంచేసుకోవాలి. 

ఉద‌యం తొమ్మిదింటికే  కోర్టు.. కాబోయే  సుప్రీం సి.జె  సూచ‌న‌

అన్నింటికీ స‌మ‌య పాల‌న అవ‌స‌రం. స‌మ‌యానుకూలంగా ఇంటి ప‌నులు అవుతున్న‌పుడు ప్ర‌భుత్వ కార్యాల‌యాలు అలానే ఎందుకు జ‌ర‌గ‌డం లేదు.. ఇది చాలాకాలం నుంచి చాలామందికి వున్న పెద్ద అనుమానం. ప్ర‌భుత్వ కార్యాల‌యం అన‌గానే ప్ర‌త్యేకించి గడియారాన్ని ప‌ట్టించుకోరు. అనాదిగా అదో బ‌ద్ధ‌క‌పు ప‌ద్ధ‌తి అల‌వాట‌యింది.  పిల్ల‌ల  బ‌డి ఉద‌యాన్నే ఏడుగంట‌ల‌కో, ఎనిమిది గంట‌ల‌కో ఖ‌చ్చితంగా ఆరంభ‌మ‌వుతుంది. అలాంట పుడు కోర్టులు కూడా ఎందుకు అలా  కాస్తంత ఉద‌యాన్నే కార్య‌క‌లాపాలు  ఆరంభించ‌కూడ‌దు? ఈ  ప్ర‌శ్న వ‌చ్చింది మ‌రెవ‌రికో కాదు ఆగ‌స్టులో సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కానున్న జ‌స్టిస్ యు.యు. ల‌లిత్‌కి వ‌చ్చింది.    మామూలుగా  కోర్టు  కార్య‌క‌లాపాలు  ఉద‌యం ప‌దిన్న‌ర‌కి ఆరంభ‌మ‌వుతాయి. కానీ శుక్ర‌వారం ఉద‌యం తొమ్మిదిన్న‌ర‌కే  సుప్రీం కోర్టు కార్య‌క‌లాపాలు ఆరంభ‌మ‌య్యాయి. అదీ ముగ్గురు న్యాయ‌మూర్తుల బెంచ్ కార్య‌క‌లాపాలు ఆరంభించ‌డంతో. ఈ  సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని జ‌స్టిస్ ల‌లిత్  ఒక  సూచ‌న చేశా రు. అదేమంటే పిల్ల‌ల స్కూలు ఉద‌యం ఏడింటికే ఆరంభ‌మ‌వుతున్న‌పుడు న్యాయ‌మూర్తులు,  న్యాయ వాదులూ  కోర్టుకి  ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కే రాలేరా?  అని అన్నారు. మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ్త‌గీ ఈ సూచ‌న విని  హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  మ‌రి ల‌లిత్  ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా  ప‌ద‌విని అలంక‌రించ గానే త‌మ  ఆలోచ‌న‌ను అమ‌లుచేస్తార‌నే  అనుకోవాలి. 

సర్వేల వెనుక చీకటి కోణాలు! ఆరా సర్వే అసలు కథేంటి?

తెలంగాణలో ఇప్పుడు సర్వేల సీజన్ నడుస్తోందా? ఎన్నికల వ్యూహ కర్తల హవా  నడుస్తోందా? రాష్ట్రంలో సర్వే జనులు, ఎన్నికల వ్యూహకర్తలకు డిమాండ్ పెరుగుతోందా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అయితే, అదే సమయంలో, ప్రతి సర్వే వెనక ఒక చీకటి కోణం దాగుందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.   గత మూడు నాలుగు రోజులగా ఆరా మస్తాన్ సర్వే చుట్టూ సాగుతున్న చర్చ రచ్చ వివాదం వెనక కూడా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల చీకటి కోణం దాగుందని, కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నట్లు తెసుస్తోంది.   కొద్దిరోజుల క్రితం టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ హైర్ చేసుకున్నఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ మొదలు బీజేపీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న, ఆరా మస్తాన్ వరకు అందరు చేసిన సర్వేలలో కాంగ్రెస్ నెంబర్ వన్ ప్లేస్’లో ఉందని, చెప్పు కొచ్చారు. అయితే, సర్వేల ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ అందరి సర్వే నివేదికలు, తనకు ఎక్కడి  నుంచి వచ్చాయో, ఎవరు ఇచ్చారో మాత్రం చెప్పలేదు. అయితే,రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి వంటి నాయకులు తమ అభద్రతా భావాన్ని, భయాన్ని  కప్పిపుచ్చుకునేందుకు  సర్వేలను అడ్డుపెట్టుకుని గంభీర ప్రకటనలు చేయడం కొత్త విషయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పుడప్పుదు ఇలాంటి విన్యాసాలు చేస్తూనే ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏదో గాలి కబురుగా కాకుండా, సర్వే సంస్థలు, సర్వే సంస్థల యజమానుల పేర్లు కూడా  తీసుకున్నారు.  ఆ నివేదికలు అన్నీ, తన కళ్ళతో తాను చూసినట్లే చెప్పుకొచ్చారు. ఒక విధంగా,  విత్ అల్ డ్యూ రేస్పెక్ట్స్ టూ కేఏ పాల్ , అయన స్టైల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసిందని, తాను ముఖ్యమంత్రి అయిపోయాననే భ్రమలు సృష్టించే ప్రయత్నం చేశారు. బహుశా, ఆ సంస్థలేవీ తమను పట్టించుకోవని అనుకున్నారో  ఏమో కానీ, సర్వే సంస్థల పేర్లు చెప్పి మరీ జబ్బలు చరుచు కున్నారు.  అయితే, కాంగ్రెస్ ‘బలుపు’కు రేవంత్ ఆధారంగా చూపిన ఆరా మస్తాన్’ రేవంత్ రెడ్డి తమ  సంస్థ పేరు తీసుకునందున, వివరణ ఇచ్చేదుకు స్వయంగా  తెరమీదకు వచ్చారు. ఆయన, తమ సంస్థ జరిపిన సర్వేకి సంబంధించి రేవంత్ చెప్పింది తప్పని చెప్పారు. ఆయన వెర్షన్ అయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో కాదు థర్డ్ పొజిషన్  లో ఉందని తమ సర్వే నివేదికను బయట పెట్టారు. అక్కడితో అగ్గి రాసుకుంది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు చేయని చౌకీదార్ చోర్  వ్యాఖ్యలను చేసినట్లు ప్రచారం చేసి, చివరకు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పినట్లు, ఆరా మస్తాన్ కోర్టుకు వెళితే రేవంత్  రెడ్డి కూడా క్షమాపణలు చెప్పవలసి వస్తుందని అనుకున్నారో ఏమో కానీ, రేవంత్ రెడ్డి అనుచరులు ఎదురు దాడి ప్రారంభించారు.   అప్పుడు గానీ, రేవంత్ రెడ్డి ఎక్కడ తప్పులో కాలేశారో ఆయనకు, కాంగ్రెస్ పార్టీలో ని ఆయన వర్గానికి తెలిసినట్లు లేదు. అయితే, రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం వెంటనే సన్నాయి నొక్కులు ప్రారంభించింది. రేవంత్ రెడ్డి తమ ఇమేజ్ ని పెంచుకునేందుకు పార్టీ ఇమేజ్ ని దెబ్బతీశారని లోపాయికారిగా దెప్పిపొడవడం  ప్రారంభించారు. అసత్యాలు, అర్థ సత్యాలు  చెప్పి కాంగ్రెస్ పార్టీ పరువు తీశారని కాంగ్రెస్  సీనియర్లు  ఢిల్లీకి  వర్తమానం చేర వేశారు. అదే సమయంలో, రేవంత్ వర్గం డ్యామేజి కంట్రోల్ చర్యల్లో భాగంగా, ఆరా మస్తాన్ పుట్టు పూర్వోత్తరాలు, బయటకు తీసి ఆయనకు బీజేపీతో ఉన్న సంబంధాలను బయట పెట్టారు. ఆయన భావజలాం లోతులు తవ్వి ఆయన సంఘీయుడు అని తేల్చారు. కావచ్చును, అయనకు బీజేపీతో సంబంధాలు ఉన్న మాట నిజం కావచ్చును. ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో సంబంధాలు ఉంటే ఉండ వచ్చును, ఆమాటకొస్తే, రేవంత్ రెడ్డి రాజకీయ మూలాలను తవ్వి తీసినా ఆయన కూడా  సంఘీయుడే. ఏబీవీపీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలైందని అంటారు.  అయితే, పార్టీ వర్గాల సమాచారం మేరకు, ఎందుకోసమో, ఎందు కోసమో ఏముంది లెండి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సొంతగా జరిపించిన సీక్రెట్ సర్వే లో కాంగ్రెస్ పరిస్థ్తితి ఏమంత బాగలేదని తేలిందని, ఢిల్లీకి సమాచారం చేరినట్లు తెలుస్తోంది. అలాగే, రేవంత్ రెడ్డి పీసీసి చీఫ్ గా కొనసాగితే, పెద్ద సంఖ్యలో రెబెల్ అభ్యర్ధులు బరిలో దిగే ప్రమాదముందని, ఆయన తమ వర్గం వారికే టికెట్లు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని, అదే జరిగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని సీనియర్లు నేరుగా అధిష్టానానికి నివేదికలు సంర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే రేవంత్ రెడ్డి  సర్వే నివేదికలను అడ్డు పెట్టునికి తనను తానూ రక్షించుకునే ప్రయత్నం చేశారని,  విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, అది ఎవరి వ్యుహమో, ఎవరితో ఎవరి చీకటి ఒప్పందమో ఏమో కానీ, ఆరా మస్తాన్ తెర మీదకు రావడంతో రేవంత్ కథ అడ్డం తిరిగిందని, అంటున్నారు.

ప్ర‌తీ చినుకూ  కాయిత‌ప్ప‌డ‌వ‌ల  జ్ఞాప‌కం!

వర్షాకాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎంత‌ ఆహ్లాదకరంగా ఉంటుందో!  పిల్ల‌లంద‌రూ ఒక్క‌చోట చేరి గోల‌గోల‌గా ఆడ‌తారు. చిందులేస్తారు, డ్యాన్సులూ చేస్తారు.. త‌డ‌వ‌డంలో ఆనందానికి అంతే ఉండ‌దు.  మన చిన్ననాటి రోజులను తిరిగి పొందేందుకు అవకాశం దొరికినప్పుడల్లా వదులుకోవడానికి ప్రయత్నిం చాలి. వ‌ర్షాకాలం బ‌డికి వెళ్ల‌క్క‌ర్లేదు, త‌డ‌వ‌చ్చు, స్నేహితుల‌తో క‌లిసి చిందులు వేయ‌వ‌చ్చు. అన్నింటి కంటే ముఖ్యం రోడ్డుమీదో, ఇంటి ఆవ‌ర‌ణ‌లోనో నిలిచిన నీళ్ల‌లో కాయితం ప‌డ‌వ‌ల పోటీ పెట్టుకోవ‌చ్చు. ఇదో గొప్ప‌స‌ర‌దా! వీల‌యిన‌న్ని పాత నోట్‌బుక్స్ అన్నీ ప‌డ‌వ‌ల‌యిపోతాయి, ఆ ప‌డ‌వ‌ల్లో ఆనంద‌పు చిను కులు మోసికెళుతూ పిల్ల‌ల‌ని ఒక్క‌టి చేస్తుంటాయి ఆ చిన్న‌ప‌డ‌వ‌లు. ఇందులోనూ ఫ‌స్టు, సెకెండూ వుం టాయి!  త‌ల త‌డుస్తుంది, బ‌ట్ట‌లు త‌డుస్తాయి వెర‌సి ముద్ద‌వుతారు.. ద‌గ్గుతుంటారు, త‌మ్ములూ  ప‌ట్టి వ‌దల‌వు. కానీ ఆ చిందులు మాత్రం మాన‌రు.  చినుకుల్లో చిందులు వ‌ర్ణించ‌లేని అనుభూతినిస్తాయి.  ప్ర‌తీ ఏడూ.. ఎన్నాళ్ల‌యినా.. వ‌య‌సు పెరిగినా.. వాటి జ్ఞాప‌కాల ఉప‌శ‌మ‌నానికి విలువ  క‌ట్ట‌లేం. మీరుచూస్తున్న ఫోటోలో ఒకే గొడుగులోకి ఆరుగురు పిల్ల‌లు చేరి ఆడుతున్నారు. ఇలాంటి దృశ్యాలు గతం లో చూసేవుంటారు, మీరూ ఇలా చేసే వుంటారు. కానీ ఆ జ్ఞాప‌కాల దొంత‌ర్ల‌లో గ‌డ‌చిన బాల్యాన్ని ఒక్క‌సారి మ‌నోఫ‌ల‌కం మీద త‌ర‌చి చూసుకోవ‌డంలో పెద్ద‌వారికి వారి బాల్యం, స్నేహాలు, బంధుత్వాల‌న్నీ గుర్తొ స్తా యి.  గుండె బ‌రువెక్కుతుంది. ఆ రోజులు మ‌ళ్లీ రావ‌ని ఒక్క మాట మ‌న‌సులోనే అనేసుకుంటారు. ఒక్క సారి దూరంగా వున్న‌వారిని ప‌ల‌క‌రించాల‌నిపిస్తుంది. బాల్యం ఎవ‌రికైనా ఎప్ప‌టికీ బంగార‌మే.  వ‌ర్షంలో త‌డ‌వ‌డానికి, కుసింత ఆడేందుకు వ‌య‌సుతో సంబంధం లేదు. పిల్ల‌ల్ని, కుర్రాళ్ల‌ని చూసిన పెద్ద వ‌య‌సువారూ ఓ క్ష‌ణం ఎవ్వ‌రూ చూడ‌కుండా త‌డ‌వాల‌నో, రెండు గెంతులు గెంతాల‌నో అనిపిస్తుం ది. ప్ర‌కృతి మ‌హిమ‌!  గ్రామాల్లో ఇప్ప‌టికీ గొడుగుల కంటే పెద్ద పెద్ద అరిటాకుల్ని గొడుగులుగా చేసుకుని తిరుగుతూంటారు. వాటినే నెత్తిన పెట్టుకుని ప‌రుగులు తీస్తుంటారు. గొడుగుల కంటే వాటితో ప‌రిగెట్ట డంలో ఆనంద‌మేమిటంటే వాస్త‌వానికి వారూ చెప్ప‌లేరు. కానీ ఆ అనుభ‌వాన్నే ఆస్వాదిస్తారు, అదే కోరు కుంటారు. 

లంక గ్రామాలది  గోదారి

 వరదల్లో లంక గ్రామాలకు సంబందాలు తేగిపోయాయీ  అని  పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్  చెప్పారు. గోదావరి వరదల్లో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 44 లంక గ్రామాలూ ముంపుకు  గురికావడంతో ప్రజలని ఏలూరు జిల్లాలోని పునరావాస కేంద్రాలకి పంపారు.చాలా కుటుంభాలు దగ్గరలోని కొండల పైకి వెళ్ళిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా చివరి గ్రామలో బుదవారం వరదనీరు గ్రామాలలోకి చేరడంతో అక్క డ ప్రజల పరిస్థితి దారుణం గా ఉంది. అన్ని లంక గ్రామాలకి సంబంధాలు తెగిపోయాయి  అని అధికార్లు చెప్పారు.165 మంది పిలలని3,239 మంది భాదితులని సురక్షిత ప్రాంతాలకి  తరలించినట్టు ఏలూరు జిల్లా  కలెక్టర్  వి.ప్రసన్న కుమార్ చెప్పారు. ప్రజలని తరలించడానికి మోటార్ బోట్స్ ని ఏర్పాటు చేసా మని, అవసరం ఐతే మరికొంతమందిని తరలిస్తామని చెప్పారు.కొండల మీదకి వెళ్ళిన వారికీ తర్పలిన్లు, తాగునీరు, పాలు, ఆహరం, సోలార్ లిఘ్త అందచేసిన‌ట్టు కలెక్టర్ చెప్పారు.  వేలేరుపాడు, కుకునూరు, మండలాల్లో చిగురుమామిడి, కొత్తూరు, రేపాకగొమ్ము, రుద్రమకోట గ్రామాలలో వరద ఉదృతి ఎక్కువగా ఉంది. ప్రజల తరలింపుకు కోసం 9 పడవలని ఎర్పాటుచేసారు. 48 వైద్య శిబి రాలు, 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు ప్రసన్న కుమార్ తెలిపారు. ఆర్.డి.ఓ, నీటిపారుదల, గిరిజన సంక్షేమశాఖ, వైద్యఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితి సమీక్షించిమరింతమందిని సహాయక శిబి రాలకి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభావిత గ్రామాల ప్రజలని దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీ, ఉప్పేరు నివాసం, శివకాశీపురం, పల్లపుగూడెం, కైవాక, నెమలిపురం పునరావాస కాలనీలకు మార్చా రని కలెక్టర్ చెప్పారు . పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి నర్సాపురం,ఎలమంచిలి,ఆచంట మండలాల్లోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు.దొడ్డిపట్ల గ్రామం వద్ద ఉన్న నదీ పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకున్నారు. ధవళే శ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద మూడవ హెచ్చరిక జారీ చేస్తే  ముంపుకి గురి అయ్యే గ్రామాల ప్రజలని సహాయక శిబిరాలకు తరలిస్తాము అని శ్రీమతి ప్రశాంతి చెప్పారు. కనకాయలంక, బాడవ, ఎస్టీ కాలనీ, పాత నర్సాపురం కాలనీ తదితర ప్రాంతాల్లో వరద ప్రభావం ఉంటుందని, వాటిని తరలించేం దుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.కోనసీమ జిల్లాలోని తూర్పు, మధ్య గోదావరి డెల్టా పరిధిలోని చాలా మండలాల్లోకి బుధవారం వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. గోదావరి దాని శాఖలయిన వృద్ధ గౌతమి, వశిష్ట , వైనతేయ  యాభై-ఒక్క లంక గ్రామాలూ ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నుండి విడుదలవుతున్న వరద నీరు గ్రామాలలోకి చేరుకుంటోంది.ఎస్‌ఏసీ బ్యారేజీ నుంచి15.7లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని విడుదల చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తునందునరానున్న 48 గంటలలో ఇన్ ఫ్లో పెరిగే అవకాసం ఉందని రివర్ కన్జ ర్వేటర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు  ఆర్‌.కాశీ విశ్వనాధ్ తెలిపారు. ఎన్ఏసి బ్యారేజీ  ఇన్ ఫ్లో 17.75 లక్షల క్యూ సెక్కులు వచ్చినప్పుడు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 18 వరద ప్రభావిత మండలాలలో సహాయక శిబిరాలు ఏర్పాటు చేయడం తో పాటు ఆహరం,ప్రాదమిక అవసరాలు అందిస్తున్నామని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చెప్పారు.

 పెళ్లిపీట‌ల మీద‌కి ..లాహిరి..లాహిరి!

గోదారి క‌న్నెర్రజేసింది. ఉప్పొండి పొర్లి ప్ర‌వ‌హిస్తోంది. కోన‌సీమ ఓ గ్రామంలో మాత్రం ఓ అమ్మాయిని పెళ్లికి త‌ర‌లించ‌డంలో ఆనందోత్సాహంలో వున్నారు. బాజాబ‌జంత్రీల‌తో పెళ్లింటికి వెళ్ల‌డం ఆన‌వాయితీ. కానీ ప్ర‌శాంతి అనే అమ్మాయి మాత్రం చ‌క్క‌గా న‌వ్వుతూ ప‌డ‌వ‌లో ప్ర‌యాణ‌మైంది.  వ‌ర్షాలు ముంచెత్తుతున్న ఈ స‌మ‌యంలో మ‌రి ముహూర్తాన్ని కాద‌నుకోలేరుగ‌దా. అంతా  సిద్ధ‌మైన త‌ర్వాత  ప్ర‌కృతీ స‌హ‌క‌రిస్తుంద‌నే ధైర్యం పెళ్లింటా వుంది. ముహూర్త‌బ‌లం బ‌ల‌మైన‌ది.. ప్ర‌శాంతి చ‌క్క‌గా పెళ్లి చేసుకోవ‌డానికి ప‌డ‌వ ప్ర‌యాణం చేసింది. పూల‌తో చూడ‌ముచ్చ‌ట‌గా అలంక‌రించిన కారులో వెళ్ల‌డం కంటే ఇలా వెళ్ల‌డంలో ఆమెకీ ఎంతో స‌ర‌దాగా వుంది. అయితే ఇది త‌ప్ప‌ని ప‌రిస్థితి. భారీ వర్షా ల‌తో జిల్లా అంతా త‌డిసి ముద్ద‌వుతున్న స‌మ‌యంలో కాస్తంత తెరిపివ్వ‌గానే ఇలా పెళ్లికూతు బ‌య‌లు దేరింది. ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోన‌సీమ జిల్లాలో దృశ్యం.  ప్ర‌శాంతి, అశోక్‌ల పెళ్లి నిజానికి ఈపాటికే జ‌ర‌గాల్సింది. కానీ జిల్లాలో, రాష్ట్రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా ముహూర్తం మార్చుకోవ‌ల‌సి వ‌చ్చింది. ఆగ‌స్టులో సాధార‌ణంగా వ‌ర్షాలు ప‌డ‌తాయ‌నుకుని జూలైకి తేదీని మార్చుకున్నారు. కానీ ఈ అకాల వ‌ర్షం రెండు కుటుంబాల‌ను కాస్తంత ఖంగారుపెట్టింది. ముహూర్తాలు పెట్టుకున్నాం గ‌నుక ఎలాగ‌యినా చేసేద్దామ‌ని అంతా ప‌ట్టుబ‌ట్టారు. అంత‌కుమించి అంద‌రూ స‌హాయం చేశారు. జిల్లాలో వ‌ర్షం కాస్తంత తెరిపివ్వ‌డంతో ఇలా ప‌డ‌వ‌లోనే అమ్మాయిని తీసికెళుతున్నారు.  అబ్బాయి గ్రామం ద‌గ్గ‌రే కావ‌డంతో ఇలా ప‌డ‌వ‌లో వెళ్ల‌డంలో అదో ఆనందం, స‌ర‌దా. మామూలుగా అయితే కారులోనో, ప్ర‌త్యేకించి బ‌స్సు ఏర్పాటుచేసుకునో బంధువులంద‌రూ క‌లిసి వెళ్లేవారు. ఇప్పుడు ప‌డ‌వ‌లో అంద‌రూ త‌ర‌లివెళుతున్నారు. ఇది ఊహించ‌ని ఆనందం. కానీ ఒక్కింత భ‌య‌మూ వారికి లేక‌పోలేదు. బోటు షికారు వేరు, ఇలా వెళ్ల‌డం వేరు గ‌దా. మొత్తానికి అంతా శుభంగానే జ‌రిగింది. అంద‌రూ ఈ ప్రయాణం గురించి చెప్పుకుంటారు. పెళ్లి జంట కూడా ఆన‌క పిల్ల‌ల‌కీ ఈ సంగ‌తి చెప్పి న‌వ్వుకుంటారేమో.

పవన్ కళ్యాణ్ పయనమెటు?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో, అందరికంటే అధికంగా కష్టాల్లో ఉన్న నాయకుడు ఎవరంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,  అనో .. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. అనో .అనుకుంటే అదిపొరపాటే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే, అందరికంటే అవస్థలు పడుతోంది.. అయోమయానికి గురవుతోంది. అవమానాలను ఫేస్ చేస్తోంది ఆ ఇద్దరూ కాదు. ఆ ఇద్దరికి ఎవరి వ్యూహం వారికుంది, ఎవరి ప్రణాళికలు వారికున్నాయి. కానీ, ఒక నిర్దిష్ట వ్యూహం, ఒక ప్రణాళిక, ఒక  లక్ష్యం ఏదీ స్పష్టంగా లేకుండా, అయోమయంగా దిక్కులు చూస్తున్న నాయకుడు,ఎవరైనా ఉన్నారంటే అది, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. అవును, ఏపీ రాజకీయాల్లో అందరి కంటే అధికంగా మధన పడుతున్న నాయకుకుడు పవన్ కళ్యాణ్. ఆయనకు ఏవేవో ఆలోచనలున్నాయి.కానీ,ఆ ఆలోచనల ఆచరణకు అవసరమైన ఆలంబన లేదు. పవన్ కళ్యాణ్ కు పార్టీ వుంది, కానీ పార్టీ నిర్మాణం లేదు. అయినా కూడా నటుడిగా ఆయనకున్న ఇమేజ్ కారణంగానో లేక క్యాస్ట్ బేస్ ఆధారంగానో ఆయనకు కొంత ప్రజాబలం, ఓటు బలం వుంది.  అయినా, రాజకీయాల్లో మాత్రం ఆశించిన రీతిలో పవన్ ముందడుగు వేయలేక పోతున్నారు. ఆయన అడుగులు ముందుకు పడడం లేదు.  అదలా ఉంచి ప్రస్తుతంలోకి వస్తే, గడచిన నాలుగైదు నెలల్లో పవన్ కళ్యాణ్ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు. కానీ, ఆదే సమయంలో ఆయన ఇటు రాజకీయాల్లో, అటు అభిమానులు, ప్రజల్లో కూడా పలచన అవుతున్నారు. నిజానికి, సమయం సందర్భంగా లేకుండా ఆయన పొత్తుల తేనె తుట్టెను కదిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానంటూ చాలా గంభీర ప్రకటన చేశారు. అంతే కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంచేందుకు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించే బాధ్యత కూడా ఆయన ఎంతో విశ్వాసంగా భుజానికి ఎత్తు కున్నారు. అలాగే, బీజేపే జాతీయ నాయకత్వం ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చుస్తున్నానని మరో పొంతన లేని ప్రకటన చేశారు.   అయితే, అప్పటి  నుంచి ఇప్పటి వరకు, బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన్ని పిలిచిందీ లేదు. మాట్లాడిందీ లేదు. ఎప్పుడో మూడు నెలల క్రితం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ కోరారు. కానీ ఇంతవరకు, ప్రధాని కార్యాలయం నుంచి జవాబు లేదు. ఒక్క ప్రధాని మోడీ మాత్రమే కాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా ఆ పార్టీ జాతీయ నాయకులు ఎవరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. బీజేపీ నాయకులు ఎవరూ పవన్ ఆశించిన రోడ్ మ్యాప్ ఊసే ఎత్తడం లేదు. అయితే రాష్ట్ర నాయకులు మాత్రం మీడియా చర్చల్లో ఇప్పటికీ, జనసేనను మిత్ర పక్షం గానే, పేర్కొంటున్నారు. ఇద్దరం కలిసి దుమ్ము దులుపుతామని గంభీర ప్రకటనలు చేస్తున్నారు.  అందుకే, రాజకీయ విశ్లేశకులు ఒకరు, రాష్ట్రంలో బీజేపీకి ఎదిగే అవకాశం, ఆశ రెండూ లేవు కాబట్టి తమ లాగే, జనసేన కూడా ఎదగరాదని అనుకుంటున్నట్లుదని అన్నారు.  సరగాగానే కావచ్చును ఆయన, బీజేపే ధోరణి. వెనకటికో బాల్య వితంతు బామ్మ గారు, కొత్త పెళ్లి కూతురును,నాకు లాగా వర్ధిల్లమని దీవించి నట్లుందని,అన్నారు. అదే విధంగా బీజేపీ మిత్ర పక్షం ముసుగులో జనసేన ఎదుగుదలకు అడ్డుపడుతున్నట్లు ఉందని అంటున్నారు. అదొకటి అలా ఉంటే, జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటనలలో పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా అయినా పలకరించ లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన సందర్భంగా, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని, జన సైనికులు రోడ్డెక్కి మరీ  డిమాండ్ చేశారు. ప్రదర్శనలు నిర్వహించారు. అయినా,  నడ్డా ఆ డిమాండ్ ను అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర పర్యటనలో ఎక్కడా నడ్డా బీజేపీ, జనసేన పొత్తు గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. అసలు పవన్ కళ్యాణ్ పేరు కూడా నడ్డా ప్రస్తావించలేదు.  అలాగే, పుండు మీద కారం చల్లిన విధంగా, ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు శత జయంతి  ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యకమానికి, చిరంజీవి సహా చాలా మందికి ఆహ్వానాలు అందాయి, కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం పిలుపు రాలేదు. అంతే కాదు, ప్రధాని మోడీ స్వయంగా చిరంజీవి దగ్గరకు వెళ్లి, ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించారు. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ ను హర్ట్ చేసిందని, అంటున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ మరో సోదరుడు, నాగ బాబు, అల్లూరి జయంతి వేడుకల స్టేజి మీద ఒక్క చిరంజీవి తప్ప అందరు అద్భుతంగా నటించారని, ట్వీట్ చేసి, వివాదానికి తెర తీశారు. జనసేన పార్టీలో క్రియాశీలంగా ఉన్న నాగబాబు, ప్రధానిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే, వివాదంగా మారాయి. నాగబాబు వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుందని అంటున్నారు.   అదలా ఉంటే, మరీ రీసెంట్ గా బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ ను మరోమారు అవమానించిందని , జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. బీజేపీ/ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్ము ఏపీ పర్యటన సందర్భంగానూ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను పట్టించుకోలేదు.ప్రాక్టికల్ గా కాకపోయినా టెక్నికల్ గా జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అదీ కాక పోయినా, మిత్ర పక్ష అధ్యక్షునిగా అయినా, ఆయన్ని పిలిస్తే, బీజేపీకి పోయేదేమీ లేదు. కానీ, పిలవలేదు. ఇది కూడా జనసేన అధినేత గుండెల్లో గుచ్చుకుందని, ఇలా అవమానాలు భరిస్తూ బెజేపీతో కలిసి కాపురం చేసేకంటే, వదిలేసి తమదారి తాము చుకోవడం ఉత్తమమనే ఆలోచన పవన్ కళ్యాణ్  చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ తమ సన్నిహితుల వద్ద, బీజేపీకి తమ అవసరం లేదేమో, అని అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో  పవన్ కళ్యాణ్ మరోమారు, బీజేపీతో కటీఫ్ కు రంగం సిద్దచేసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. దసరా పండగ తర్వాత,అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర యాత్ర మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అదే సమయానికి బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. నిజానికి, పవన్ కళ్యాణ్, మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ క్యాడర్ ముందు మూడు ఆప్షన్స్ ఉంచారు. ఇక ఇప్పుడు, రాష్ట్రంలో వైసీపీ, జగన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించేందుకు, 2024 ఎన్నికలలో, తెలుగు దేశం  పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే నాల్గవ ఆప్షన్ ముందుకు తెస్తున్నారని అంటున్నారు. నిజం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నా, జనసేన అసెంబ్లీలో అడుగు పెట్టలన్నా అది టీడీపీతో పొత్తుతో మాత్రమే సాధ్యమవుతుంది, కానీ  బీజేపీతో పొత్తు వలన అయ్యే పని కాదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అందుకే పవన్ కళ్యాణ్  అక్టోబర్ యాత్రకు ముందే, కమలానికి గుడ్ బై చెప్పి సైకిల్ తో జట్టు కటడం ఖాయమని అటు పార్టీ వర్గాలు, ఇటు రాజకీయ పరిశీలకులు కూడా గట్టిగా భావిస్తున్నారు.

జ‌గ‌న్మోహ‌నా.. నీ పాల‌న‌కు నీవే బాధ్యుడ‌వు

ఎవ‌ర‌న్నా జీవితంలో వృద్ధిలోకి రావాల‌నే కోరుకుంటారు. అందుకు క‌ష్ట‌ప‌డ‌తారు, సాధించిన త‌ర్వాత ప్ర‌తిష్ట‌ను కాపాడుకోవ‌డానికి మంచి ప‌నులు చేస్తూ కుటుంబాన్ని, జ‌నాన్ని ఆక‌ట్టుకుంటారు. పాపం జ‌గ‌న్ రెడ్డికి ఇవేమీ బొత్తిగా మింగుడుప‌డ‌ని సూక్తులు. వై.ఎస్ రాజ‌కీయ వార‌సునిగా 2019లో జ‌గ‌న్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయ్యారు.  కానీ అయ్యవారికి మంత్రులు, స‌ల‌హాదారులు, ఇంటా బ‌య‌టా ర‌వ్వంత అభిమానించే వారి మాట‌లేవీ రుచించ‌లేదు.  అధికార‌పీఠం ఎక్క‌గానే విప‌క్షాల‌మీద విరుచుకుప‌డ‌ట‌మే త‌ప్ప ప్ర‌త్యేకిం చి వారి అనుభ‌వాన్నుంచీ తెలు సుకున్న‌ది, నేర్చుకున్న‌దేమీ లేదు. తండ్రి అడుగు జాడ‌ల్లో వెళ‌తాడ‌ని గంపెడాశ‌లు పెట్టుకున్న కుటుం బాన్ని కూడా ఖంగుతినిపించారు  సీఎం జ‌గ‌న్‌.  పార్టీ అధినేత‌గా, రాష్ట్ర సీఎంగా వున్నామ‌న్న ధ్యాస కంటే విప‌క్షాల‌ను ఎన్నిర‌కాలుగా వేధించ‌వ‌చ్చు, తిట్ట వచ్చ‌న్న‌దే ప్ర‌ధానంగా భావించి త‌న తీరుతెన్నులు, భాషాప్ర‌యోగం అన్నింటా మార్పు బాగా స్ప‌ష్టం చేశా రు. ఆయ‌న‌తో పాటు మంత్రిమండ‌లిలో వున్న‌వారూ కూడా నాయ‌కుని అడుగుజాడ‌ల‌నే  అనుస‌రించ డం పెద్ద వింతేమీ కాదు. నోటి దుర‌ద అదేదో ఆకుతో కాకుండా అర్ధం ప‌ర్ధంలేని వ్యాఖ్య‌ల‌తో, తిట్ల‌తో వ‌ది లించుకోవ‌చ్చ‌న్న గొప్ప సూత్రాన్ని పాటించ‌డం అల‌వ‌ర్చుకున్నారు. విష‌యం కంటే విషం క‌క్క‌డం సులువు గ‌దా.. అదే అనుస‌రించారు. మూడేళ్ల పాల‌నా కాలం ముగిసింది. తీరా వెన‌క్కి తిరిగి చూసుకుంటే  ఏమీ లేదు.. ప్ర‌జ‌ల అస‌హ‌నం, విప‌క్షాల మండిపాటు, సంక్షేమాన్ని కోరుకున్న‌వారి నుంచి నొస‌టి విరుపు లూ.. అంతే!  కానీ అవ‌న్నీ చాలా వివ‌రంగా తెలిసేట్టు చేసినా జ‌గ‌న్‌లో జ‌ర్రంత‌యినా మార్పు రాలేదు. పైగా మ‌రింత దారుణంగా మంత్రుల‌చేత విప‌క్షం మీద విరుచుకుప‌డేందుకు అవ‌కాశం క‌ల్పించారు.  అస‌లు ఏ ప‌థ‌క‌మూ ప్ర‌జాసంక్షేమ హితం కాదు. ఏ ఆలోచ‌నా ప్ర‌జ‌ల‌కు ప్ర‌శాంత‌త ఇవ్వ‌డం లేదు. దీనికి తోడు మంత్రులు, ఎమ్మెల్యేల‌కు  ఇదిగాద‌న్నా.. అని చెప్పే అవ‌కాశం, స్వేచ్ఛా అస్స‌లు  లేక‌పోవ‌డం మ‌రింత విడ్డూరంగా మారింది. ఆర్ధిక ప‌రిస్థితులు, రాష్ట్ర హోదా అంశం, మ‌ద్య‌పాన  నిషేధం ఏవీ  కూడా  ప్ర‌చారాల‌, హామీల ఆవ‌ర‌ణ దాట‌నే లేదు. కేవ‌లం అన్నింటికీ  న‌వ్వు న‌టించ‌డం త‌ప్ప చేసిందేమీ లేద న్న‌ది చిత్రంగా ఆయ‌న‌కీ తెలుసు. ఈ ప‌రిస్థితుల‌ను  గ్ర‌హించి హిత‌వు చెప్పే ధైర్యం లేక మంత్రులు కాస్తంత వెన‌గ్గానే వుంటున్నారా లేక మ‌న‌కెందుకులే అన్న ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారా అన్న‌ది వారికి కాకున్నా ప్ర‌జ‌ల‌కు బాగా తెలిసింది.  గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తి దాడి జరిగినప్పుడు, ఆ దాడి కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సానుభూతి కోసం స్వయంగా చేయించుకున్నారని ఆరోపిస్తూ కోడి కత్తి కహాని సినిమా కూడా బాగానే ఆడిందని తెలుగుదేశం పార్టీ సెటైర్ వేసింది.  కాగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా జ‌గ‌న్ కేంద్రానికి ముద్దుబిడ్డ‌గా మారేడ‌న్న మాట అం త‌టా విన‌ప‌డుతోంది. వారికి ఈయ‌న‌తో అవ‌స‌రం అందువ‌ల్ల జ‌గ‌న్‌ను పెంచి పోసిస్తున్నార‌న్నది విప‌క్షా లు అంటున్నాయి. అందుకే హామీలు, ప్రాజెక్టుల గురించి చ‌ర్చించి, వాదించి ఏదో ఒక‌టి సాధిద్దా మ‌ని ఢిల్లీ  వెళుతోన్న ప్ర‌తీ సారీ కేవ‌లం ఫోటోల‌కే ప‌రిమితం కావ‌డం అంద‌ర్నీ విసిగెత్తిస్తోంది. యావ‌త్ ప్ర‌యా ణం వ్య‌ర్ధ‌మే అవు తోంది. కేవ‌లం ఇంట ర‌గులుతున్న కాగ‌డా వేడి త‌ప్పించుకోవ‌డానికే ఆయ‌న అలా త‌ప్పించుకు తిరుగు తున్నారు. అన్నింటికి మించి బాబాయి వివేకానంద హ‌త్య కేసు మ‌రీ త‌ల‌భారాన్ని పెంచింది. ఇటు విప క్షాలు, అటు సిబిఐ  కూడా  అదేమ‌యింది, ఇదేమి చేశార‌న్న ప్ర‌శ్న‌ల బాణాలు, తూటాల‌తో ఇబ్బంది ప‌డ‌డం క‌న్నా త‌ప్పించుకొనువాడు ధ‌న్యుడ‌న్నది పాటించ‌డ‌మే జ‌గ‌న్ అనుస‌రిస్తు న్న మార్గం.  దీనికి తోడు  ఇటీవ‌ల పార్టీ ప్లీన‌రీ పేరుతో త‌ల్లి విజ‌య ల‌క్ష్మిని పార్టీ గౌర‌వాధ్య‌క్షురాల‌న్న ప‌ద‌వి నుంచి త‌ప్పిం చేసి త‌న‌ను శాశ్వ‌త అధ్య‌క్షునిగా ప్ర‌క‌టించుకున్నారు. దీంతో కుటుంబ క‌ల‌హాలు 70 ఎంఎం తెర మీద‌కి వ‌చ్చేశాయి. అటు ష‌ర్మిల తెగ క‌ష్ట‌ప‌డుతోంది, ఆమెకు సహాయ‌ప‌డ‌ట‌మే ఇప్ప‌టి రాజ ధ‌ర్మం అను కున్న జ‌గ‌న్ త‌ల్లిగారు ష‌ర్మిల పంచ‌కి చేరిన‌ట్టే. అయితే దీన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వ స‌ల‌హాదా రుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి,  ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అనేక రంగులతో గొప్ప చిత్రంగా మార్చి ప్ర‌జ‌ల‌కు చూపించే య‌త్నం చేస్తూ నే వున్నారు. కానీ ఇవేవీ ప్ర‌జ‌ల‌కు బొత్తిగా రుచించ‌డం లేదు. ఎవ‌రి టేస్టు వారిది. ఇక మిగిలిన కాల‌మంతా కృష్ణా, రామా అనుకుంటూ గ‌డిపేయ‌డంలో వున్న సౌఖ్యం దేనిలోనూ వుండ‌ద‌ని పెన్ష‌న్ జీవులు అనుకుంటారు. జ‌గ‌న్ కూడా ఇక మిగిలిన కాల‌మంతా మోదీయే నాకు తండ్రి, అన్న‌, జీవ‌ము, జీవిత‌మూనూ.. అనుకుంటూ మోడీ నామ‌స్మ‌ర‌ణ‌తో పాల‌నాకాలం ముగించేయవ‌చ్చు. మూడేళ్ల త‌ర్వాత మంత్రిమండ‌లిలో కొత్త ముఖాల‌ను తీసుకువ‌చ్చినంత మాత్రాన గొప్ప‌గా సాధించేదీ  ఏమీ వుండ‌దు.  రాష్ట్ర‌ప్ర‌జ‌లు, వైఎస్ కుటుంబం ఒక‌టి త‌లిస్తే.. జ‌గ‌న్ మ‌రోటి త‌లిచారు.. కాలం చాలా ప‌వ‌ర్‌ఫుల్ బ్రో!

టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్!

టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్.. కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే సర్కార్ ఏర్పడిన నాటి నుంచి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఇదే. గత ఎనిమిదేళ్లుగా దేశంలో బీజేపీ ఏం చేసినా తన వ్యతిరేకులను ఇరుకున పెట్టడం, ఇబ్బందుల పాలు చేయడం, సరెండర్ అయ్యేలా చేసుకోవడం. ఈ త్రిసూత్ర పథకంతోనే ముందుకు సాగుతోంది.  తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా బీజేపీ తీరు అదే. రాష్ట్ర విభజన నాటి నుంచీ తీసుకుంటే.. తమకు కొరుకుడు పడని తెలుగు రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టేసైనా సరే అక్కడ పాగా వేయాలన్నదే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన సమయంలో  తెలంగాణ ఎంపీలను ఉద్దేశించి, అప్పట్లో సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను ఒక సారి గుర్తు చేసుకుంటే.. ఆ పార్టీ విధానమేమిటన్నది తేలిపోతుంది. ‘పెద్దమ్మ’(సోనియా గాంధీ)నే కాదు ‘చిన్నమ్మ’ (సుష్మా స్వరాజ్)ను కూడా గుర్తుంచుకోండి.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్య తెలంగాణ ఏర్పాటుకు తాము అన్ని విధాలుగా సహకరించామని చెప్పడమే. అయితే ఆ తరువాత ఇన్నేళ్లకు మోడీ రాష్ట్ర విభజన అస్తవ్యస్థంగా జరిగిందంటూ అదే లోక్ సభ సాక్షిగా ఒక ప్రకటన చేశారు. అంటే రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందనీ, దానికి తాము పూర్తి మద్దతు ఇచ్చామనీ చెప్పకనే చెప్పినట్లే కదా. అయితే అప్పట్లో అన్ని విధాలుగా రాష్ట్ర విభజన బిల్లు  పార్లమెంటు ఆమోదం పొందేందుకు సహకరించినా బీజేపీకి తెలుగు రాష్ట్రాలలో అనుకున్న గుర్తింపు రాలేదు. రాజకీయంగా ప్రయోజనమూ చేకూరలేదు. అప్పట్లో రాజ్యసభ ముందుకు బిల్లు వచ్చినప్పుడు అప్పటికి బీజేపీ ఎంపీ అయిన వెంకయ్యనాయుడు ఏపీకి ప్రత్యేక హోదా కోరారు. ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చినా అది నెరవేరలేదు. ఆ సంగతి పక్కన పెడితే హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 జూన్ 2తో హైదరాబాద్ కు ఉమ్మడి రాజధాని హోదా పోతుంది. హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఇక్కడే కేంద్రం కొత్త ఎత్తుగడతో ముందుకు వస్తోంది. ఎవరూ కోరకుండానే హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా కొనసాగించబోతోంది. ఆ మేరకు ఇప్పటికే బీజేపీ టాప్ లీడర్ షిప్ ఒక నిర్ణయానికి వచ్చేసిందని అంటున్నారు. ఈ వర్షాకాల సమావేశాలలోనే అందుకు సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకునే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి.  ఈ నిర్ణయంతో ఒకే సారి ఇటు కేసీఆర్ కు.. అటు జగన్ కు చెక్ పెట్టవచ్చని బీజేపీ భావిస్తోంది. అదెలాగంటే.. అటు మూడు రాజధానులు అంటూ జగన్ ప్రదర్శిస్తున్న దూకుడుకు బ్రేక్ వేయడం.. ఇటు మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఆంధ్రప్రదేశ్ తో పంచుకోక తప్పని పరిస్థితిని కేసీఆర్ కు కల్పించడం. అంతే కాకుండా ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు ఉన్న విచక్షణాధికారాలను, శాంతి భద్రతలపై గవర్నర్ ఆజమాయిషీని గట్టిగా అమలు చేయడం ద్వారా కేసీఆర్ కు కళ్లెం వేయడం. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా రెండు ప్రభుత్వాలనూ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడమే వ్యూహంగా ఉమ్మడి రాజధాని అంశాన్ని బలంగా తెరపైకి తీసుకువచ్చేందుకు బీజేపీ కృత నిశ్చయంతో ఉందని బీజేపీ జాతీయ నాయకులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.  సరే అదే జరిగితే  ఏమౌతుంది. ముందుగా ఏపీ విషయాన్ని తీసుకుంటే.. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లంటూ మూడు రాజధానుల విషయంలో కోర్టుల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ముందుకు వెళుతున్న జగన్ కు ఇక అడుగు ముందుకు వేసే అవకాశం ఉండదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో పదేళ్ల పాటు ఉంటుంది కనుక ఇప్పటికిప్పుడు మూడు రాజధానుల కోసం హడావుడి ఎందుకు గమ్మునుండని బ్రేక్ వేయడానికి అవకాశం లభిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఏపీతో రాజధానిని పంచుకోవడానికి కేసీఆర్ సుతరామూ అంగీకరించరు. ఇప్పటికే జలాల విషయంలో ఏపీతో ఉన్న తగవులు చాలవన్నట్లు ఇప్పుడు రాజధాని విషయంలో కూడా తగాదాలు పడాల్సి వస్తే ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రులు టీఆర్ఎస్ కు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆయన తెలంగాణ రాజధానిగా వరంగల్ ను ముందుకు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కాకుండా యూనియన్ టెరటరీగా మార్చాలని గతంలో తాను ఆమోదించిన ప్రతిపాదననే తెరమీదకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా బీజేపీ కోరుకునేది కూడా అదే. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలూ తమ హామీలను నెరవేర్చలేని స్థితికి వెళ్లి.. ఆ రెండు రాష్ట్రాలలోనూ బలపడాలన్న రాజకీయ ప్రయోజనాన్ని సాధించడం కోసం బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాలు పన్నుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో అడుగు ముందుకు వేయలేక.. అమరావతిని నిర్వీర్యం చేసి జగన్ ప్రజల ముందు దోషిలా నిలబడే పరిస్థితిని అటు ఏపీలో.. ఇటు తనంత తానుగా హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అన్న డిమాండ్ చేసి, తెలంగాణ ప్రజలలో కేసీఆర్ ను పలుచన అయ్యే పరిస్థితిని ఇటు తెలంగాణలో తీసుకురావడం ద్వారా రెండు రాష్ట్రాలలోనూ ప్రగతికి, సమస్యల పరిష్కారానికీ బీజేపీ అయితేనే అవకాశం ఉంటుందన్న భావన జనంలో కలిగించి రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జ‌గ‌న్  దృష్టిలో .. మ‌ద్యం అనారోగ్యం కాదు రాబ‌డి వ‌న‌రు 

ఏ ప్ర‌భుత్వ‌మైనా ప్ర‌జాసంక్షేమాన్నే ప్ర‌ధానంగా దృష్టిలో పెట్టుకుంటుంది. సంక్షేమ ప‌థ‌కాల‌కే పెద్ద పీట వేస్తుంది. అంతే త‌ప్ప ప్ర‌భుత్వానికి, ఖ‌జానాకీ లాభ‌సాటిగా వుంటుంద‌ని ఇబ్బందిక‌ర ప‌థ‌కాల‌ను ప‌ని గ‌ట్టుకుని అమ‌లు చేయ‌రు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అదే చేస్తోంది. ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించ‌డానికి మ‌ద్య‌పాన నిషేధాన్ని బ్ర‌హ్మాస్త్రంగా ఉప‌యోగించిన వైసీపి ఆ త‌ర్వాత దాన్నే కీల‌కంగా చేసుకుంది. ఒక్క మేలు త‌ల‌పెట్ట‌వోయి అన్నారు గాని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు చేస్తున్న మేలు ఊహించ‌డానికీ  ఇబ్బందిక‌రంగా వుంది.   అస‌లు మ‌ద్య‌పాన నిషేధానికి  స‌రికొత్త  అర్ధం చెప్పిన ఘ‌న‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంది. ఒక వంక నిషేధం అంటూనే బార్ల‌కు కొత్త పాల‌సీతో అవ‌కాశం క‌ల్పించ‌డం, మందుబాబుల‌కు రిహాబిలిటే ష‌న్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తామ‌న‌డం సిఎం గా జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు చేస్తున్న మేలు బ‌య‌ట‌పెడుతోంది.   ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరైనప్పటికీ రిస్క్ తీసుకుని మద్యం రేట్లను పెంచుతామని చెప్పిన  వైసీపీ అధినేత, మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల శిక్ష విధించేలా చట్ట సవరణ చేస్తామనీ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆ హామీలు అన్ని గాలికి వదిలేసి కల్తి మద్యం మార్కెట్ లోకి తెచ్చి ప్రజల ప్రాణా లతో చలగాటం ఆడుతూ, ఇప్పుడు కొత్త మద్యం పాలసీ ని తెచ్చారు. ఏపీలో మద్యనిషేధానికి తూట్లు పొడుస్తున్నారన్న విపక్షాల విమర్శల్ని నిజం చేస్తూ ప్రభుత్వం  బార్ల పాలసీని విడుదల చేసింది. అదీ వచ్చే మూడేళ్ల కాలానికి ఈ విధానం అమల్లో ఉంటుంది. ఇప్పటికే మద్యంపై ఆదాయాన్ని చూపుతూ భారీ ఎత్తున అప్పులు తెస్తున్న ప్రభుత్వం ఇక తాము ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన కీలక హామీని అట కెక్కించడం ఖాయమని తేలిపోయింది. ప్రభుత్వం  ప్రకటించిన బార్ల విధానంలో కీలక అంశాలున్నాయి. ఏపీలో కొత్త బార్ల విధానాన్ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల కాలానికి వర్తిం చేలా ఈ విధానాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి తెస్తున్నారు.  ఇప్పటికే బార్లకు ఇచ్చిన లైసె న్స్ లను ఆగస్టు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం మరో నిర్ణయం ప్రకటించింది. దీంతో సాంకేతిక ఇబ్బందు లు రాకుండా ప్రయత్నించినట్లు తెలుస్తోంది..  మద్యపాన నిషేదాని కి మూడు దశల ప్రణాళిక రూపొందించామన్న వైఎస్ జగన్ సర్కార్ తొలి దశలో మద్యం దుకాణాల సంఖ్యను భారీగా తగ్గించడంతో పాటు ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెంచుతామని, అంతేకాదు మద్యం మహమ్మారి వల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయో వివరిస్తూ సినిమా థియేట ర్లు, టీవీల్లో ప్రకటనలు ఇస్తామన్నారు.  రెండో దశలో మద్యపాన వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారి కోసం ప్రతి జిల్లాలో రీ హాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి మంచి జీవితాన్ని అందిస్తామని చెప్పారు. ఇక చివరి దశలో మద్యం కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు.  హామీలు అన్ని అధికారం కోసమే అని, ప్రజలకోసం కాదని, మద్యపాన నిషేధం  అనే మాట కూడా అధి కారం కోసమే చెప్పిన మాటేన‌ని మరోసారి నిరూపితమైంర‌ని  ప్రతిపక్షాలు మండిప‌డుతున్నాయి. మద్యం తాయారు చేస్తే  ఏడేళ్ల శిక్ష అని చెప్పిన జగన్ ముందు వాళ్ల  పార్టీ వాళ్ళనే  అరెస్ట్ చేయసివస్తుందని  దాని ఊసే ఎత్తడం లేదు. కల్తి మద్యం తో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అని ప్రజలు గోల పెడుతు న్నా,  తమకేమి పట్టనట్టు  కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టడం  జగన్ మోహనరెడ్డి అరాచక పాలన కి నిద ర్శ‌నం.  కొంత కాలం పొతే గడప గడపకి మద్యం అనే కొత్త పాలసీ కూడా తెస్తారని, అసలు మద్యం నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానా లోకంటే,  ప్రభూత్వ పెద్దల ఖజనాలలోకి ఎక్కువ వెళ్తున్నాయ‌ని, వాటి లెక్క ల్ని బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ప్రభుత్వాల స‌మ‌యంలో మద్యం ద్వారా తొమ్మిది వేల కోట్ల  ఆదాయం వస్తే వైసీపీ  అధికారంలోకి వచ్చాక మద్యం  ఆదాయం రూ.22 వేల కోట్లకు పెరిగిందని విప‌క్షాల మాట‌.  మద్యంపై వచ్చే ఆదాయం గతంలో కన్నా ఎన్నో రెట్లు పెరిగిందని, వచ్చే ఎన్నికల సమయానికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే లిక్కర్ అమ్ముతామని, అప్పుడే ఓట్లు అడుగుతామని చెప్పిన ప్రభుత్వం అసలు మద్య నిషేధం చేయ బోమని హమీ ఇచ్చి అప్పులు తెచ్చుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది

వారం రోజుల వర్షాలకే కాళేశ్వరం ఎత్తిపోయింది!

ఇంజనీరింగ్ అద్బుతంగా, టీఆర్ఎస్ ప్రభుత్వ ఘన విజయంగా కేసీఆర్ ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వస్తున్న కాళేశ్వరం బండారం భారీ వర్షాలకు బట్టబయలైంది. చాలా కాలంగా కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరం అవినీతి మయం అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎమ్ అంటూ దుయ్యబడుతూనే ఉన్నారు. ఆ విమర్శలను, ఆరోపణలనూ ఇంత కాలం ఖండిస్తూ వచ్చిన టీఆర్ఎస్ ఇటీవలి వర్షాలకు కాళేశ్వరం పంప్ హౌస్ మునిగిపోయి నీటిని ఎత్తిపోయడానికి వీల్లేనంతగా ధ్వంసమవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ సర్కార్ డిఫెన్స్ లో పడింది. చాలా కాలంగా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరు చెప్పి కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శిస్తూ వస్తున్న విపక్షాలు ఇప్పుుడు వారి విమర్శలకు మరింత పదును పెట్టాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు కేసీఆర్ అవినీతిని బ్లాక్ అండ్ వైట్ లో బయటపెట్టేశాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాళేశ్వరం పంప్ హౌజ్ మునిగిపోయి మరో మూడు నాలుగేళ్ల వరకూ ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాళేశ్వరం మునకకు ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతే కారణమని ధ్వజమెత్తారు. వరద ముంపులో బాధితులు అష్టకష్టాలూ పడుతున్నా రాష్ట్రం వారికి సహాయ సహకారాలందించే విషయంలో మొద్దు నిద్ర పోతోందని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణుులు వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గురువారం మీడియాలో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైందనీ, బాధితులను ఆదుకునేందుకు వెంటనే తక్షణ సాయం కోసం కేంద్రానికి లేఖ రాయాలనీ డిమాండ్ చేశారు. వరద ప్రబావిత ప్రాంతాలలో తాను ఈ నెల 17న పర్యటిస్తానని రేవంత్ చెప్పారు. అంతకు ముందు రాహుల్ చేపట్టనున్న భారత్ జోడో యాత్రపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ సర్కార్ దేశాన్ని మతాలు, కులాల వారీగా విభజించి విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 150 రోజుల పాటు 3600 కిలోమీటర్లు సాగే రాహుల్ గాంధీ జోడో యాత్ర మక్తల్ వద్ద తెలంగాణలో ప్రవేశించి జుక్కల్ మీదుగా నాందేడ్ కు వెళుతుందన్నారు. రాహుల్ యాత్రను తెలంగాణలో బ్రహ్మాండంగా నిర్వహిస్తామని రేవంత్ అన్నారు.  కేసీఆర్ ను విమర్శిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎందుకు ఆగ్రహం వస్తోందో ప్రజలు గ్రహించాలన్నారు. ఆ రెండూ పార్టీలూ కలిసే రాజకీయ డ్రామాలాడుతున్నాయన్నారు. బండి సంజయ్ కార్యక్రమం పెట్టుకున్న సమయంలోనే రేవంత్ కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించడమేమిటని బండి సంజయ్ విమర్శించడాన్ని రేవంత్ తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో క్రియాశీలంగా ఉందనీ, ఎవరి కోసమే కాంగ్రెస్ తన కార్యాచరణను ఆపదని స్పష్టం చేశారు.