శాంతి దూతకు అవమానం.. కెనడాలో గాంధీ విగ్రహ ధ్వంసం
posted on Jul 14, 2022 @ 2:26PM
పుట్టినవూరు, దేశం దాటి అంతర్జాతీయ ఖ్యాతిగాంచినవారిని ముఖ్యంగా శాంతిపథానికి ప్రతినిధిగా వున్న మహోన్నతులను అన్ని ప్రభుత్వాలూ ఆదరిస్తాయి. దేశంలో ఏదో ఒక ప్రధాన నగరంలో విగ్రహం ఏర్పా టు చేసి ఆ మహావ్యక్తి పట్ల తమ ప్రత్యేక అభిమానాన్ని ప్రకటించుకుంటారు. ఇలా ప్రపంచ దేశాల్లో అత్యంత ఆదరణ పొందిన మహోన్నతుడు గాంధీజీ. ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో ఆయన పట్ల ఎంతో అభిమానం వుంది. భారత స్వాతంత్య్రోద్యమ నాయకునిగా ప్రపంచదేశాలను ఆకట్టుకున్న గొప్ప నాయకుడు మహాత్మా గాంధీజీ. కాలంతో పాటు ప్రపంచ రాజకీయవాతావరణం కూడా ఎంతో మారిపోయిం ది. ఏ దేశంలోనూ శాంతికాముకులకు ఆదరణ అంతగా లభించని దుస్థితి ఏర్పడింది. అందుకు తాజా ఉదాహరణే కెనడాలో గాంధీ విగ్రహాన్ని విద్రోహులు కూల్చివేయడం.
కెనడా లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు కుల్చేసారని భారత రాయభార కార్యాలయం తెలి పింది. కెనడా లో వున్న మహత్మా గాంధీ విగ్రహాన్ని కుల్చేయడాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. కెనడాలో ఉన్న భారతీయులని భయపెట్టడానికి చేసిన చర్య గా అనుమానిస్తున్నారు. కెనడాలోని ఒంటా రియో నగరం లోని యోంగే స్ట్రీట్ లో ప్రాంతం లో విష్ణు మందిరం ప్రాంతం లో ఉన్న గాంధీ విగ్రహాన్ని ద్వంసం చేసినట్టు అక్కడ పోలీస్ అధికారులు వెల్లడించారు. విచారణ కోసం భారత ప్రభుత్వం బుధ వారం నాడు కెనడా గవర్నమేంట్ ని కోరింది.
ఒంటారియో నగరం లోని యోంగే స్ట్రీట్ లో ప్రాంతం లో విష్ణు మందిరం ప్రాంతంలో ని గాంధీ విగ్రహాన్ని ద్వంసం చేసినట్టు కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది. ఈ విద్వంసకరచర్యని అక్కడి భారతీయ సమాజం తీవ్రం గా ఖండించింది.భారతీయుల మనో భావాలూ దెబ్బతినేలా ఉందని,దీనిపై చర్యకి అక్కడ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని భారత కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేసారు. భారతీయ ప్రజలని భయ భ్రాంతులకి గురిచేయడానికి చేసిన విద్వేషపురిత చర్య అని ఒట్టావా లోని హైకమిషన్ తెలిపింది. నేరస్తులని వెంటనే న్యాయస్థానం ముందు ఉంచాలని భారతప్రభుత్వం కోరి నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.భారత రాయభార కార్యాలయం కుడాదీన్ని తీవ్రం గా ఖండించింది, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఖలిస్తాన్ యార్క్ రింజాల్ పోలీసు ప్రతినిధి అమీ బౌడ్రూ గాంధీ విగ్రహాన్నిఎవరో గ్రాఫిక్ పదాలతో వక్రీ కరించారని రాశారు. విగ్రహంపై ఖలిస్తాన్, అబ్శబ్ద్ అని రాసి ఉన్నాయన్నారు. యార్క్ పోలీసులు ఎలాంటి నేరాలను సహించరని, జాతి, జాతీయ లేదా జాతి మూలాల ఆధారంగా నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బౌడ్రూ చెప్పారు. ఈ విగ్రహం ముప్పై సంవత్సరాలకు పైగా రిచ్‌మండ్ హిల్‌లోని విష్ణు దేవాలయ ప్రాంతంలో మహాత్మా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ పెద్ద సంఖ్య లో భారతీయులు నివసిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రిడ్జ్‌మండ్‌లో చాలా ఏళ్లుగా మేం ప్రశాంతంగా జీవిస్తున్నామని, అయితే అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని భారతీయ సంతతి ప్రజలు చెబుతున్నారు.