నీటి తత్వం మారిందా..ఎందుకిలా పోటెత్తుతోంది!
posted on Jul 14, 2022 @ 10:55AM
మనిషి మనసుకి నీటికి అలాగే మనిషి మనసుకి చంద్రుడికి సంబంధం ఉంది. ఎలాగైతే మనసు ఆలోచ నలు త్వరగా మారుతాయో అలాగే నీరు కూడా ముందుకి వెన్నక్కి వెళతాయి.కానీ ఇప్పుడు వున్నా పరిస్టితి పౌర్ణమి వచ్చిన సందర్బంలోనే వరదలు రావడం, ఆ నీరు వెన్నక్కి రావడం జరుగుతోంది
ప్రకృతిలో జరిగే విపత్తులని సముద్రంలో జరిగే అలజడులననుసరించి ముందే శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. అలాంటి సముద్ర తీరంలో మార్పులు దేనికి సంకేతాలు. వరదలకి సూపర్ మూన్ కి సంబంధం ఉందా అంటే అవుననే అంటున్నారు ఖగోళశాస్త్రవేత్తలు. దానివల్లే వరదనీరు సముద్రంలోకి వెళ్ళకుండా వెన క్కి మరులుతోందని, భూమి పై వాతావరణాన్ని సముద్రాలూ ఎంతో ప్రభావితం చేస్తాయనీ అంటున్నా రు. ఋతుపవనాలు తూఫాన్ కి సముద్రాలే పుట్టిల్లు. సముద్ర అంతర్గతంగా ప్రవహించే ఉష్ట లేదా శీతల పవనాలు సమీప ప్రదేశాలలో ఉష్ణోగ్రతలని ప్రభావితం చేస్తాయి.
మాములుగా ప్రతి అమావాస్య, పౌర్ణమికి సముద్రంలో ఆటుపోట్లు వస్తాయి. కానీ ఈసారి వచ్చే పౌర్ణమి ఎంతో శక్తి వంతమైనది గా కనిపిస్తోంది. ఈ పౌర్ణమి ప్రభావం సముద్రం పై ఎక్కువగానే ఉంది. గురు త్వాక ర్షణ శక్తి కారణంగా వర్షాలతో పోటెత్తుత్తున్న వరద నీటిని కూడా తనలో కలవనివట్లేదు సాగరం. దానివల్ల పోట్లు ఎక్కువై వరదనీరు వెనక్కి వచ్చి ముంపు గ్రామాలకు వరద ముప్పు ఎక్కువగా వుంది. అద్భుత సన్నివేశానికి భూలోకం సాక్షిగా ఉంటుం దనే అనందం కన్నా దీని వల్ల వరద నీరు సముద్రంలో కలవ కుండా వెనకకి రావడం కలవర పెడుతోం ది.
సముద్రంలో ఈ ఆటుపోట్లు ఎంతకాలం ఉంటాయనేది కూడా ప్రశ్నార్ధకం గా మారింది. సముద్రంలో కలవాల్సిన వరద నీరు గురత్వాకర్షణ కారణంగా వెనక్కి వస్తోంది. చంద్రుడి లో వుండే గురుత్వాకర్షణ శక్తి అధికం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది, ఈ సమయం లో తీరప్రాంతాలలో వర్షాలు తుఫాన్ లు వచ్చి వరదలకి దారితీస్తాయని ఖగోళ శాస్తవేత్తలు భావి స్తున్నారు. చంద్రుడు భూమికి అత్యం త దగ్గరకి వచినప్పుడు చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ గా ఉంటుంది.ఆ సమయం లో సముద్రం లో అలలు సాదారణ స్థితి కంటే ఎక్కువగా పోటు ఎత్తుతాయి.ఆ అమయం లో సముద్రం ముందుకు దూసుకు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వున్నాయి.ఏది ఏమైనా ప్రకృతిలో వచ్చే విపత్తులకి మానవ తప్పిదాలే ఎక్కువ గా కనిపిస్తున్నాయి అనేది మాత్రం స్పష్టం.