రెండు అరెస్టులు... రగులుతున్న విద్వేషాలు!
posted on Aug 23, 2022 @ 2:56PM
కక్షసాధింపు చర్యలకు ఇటీవలి రాజకీయపరిస్థితులు అద్దంపడున్నాయి. తెలంగాణాలో రాజ కీయ పరి స్థితుల్లో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అందుక్కారణం. ఇటీవలి కాలంలో ఊహిం చని విధంగా టీఆర్ ఎస్, బీజేపీల మధ్య రగులుతోన్న నిప్పు మరింత రాజేసినట్టయింది. అది మరింత రగులు కుని రెండు అరెస్టులు, రెండు పార్టీల మధ్య వైషమ్యాలు మరింతగా పెంచాయి. బీజేపీ నేతలు రాజాసింగ్, బండి సంజయ్ అరెస్టులు ఇపుడు రెండు పార్టీలను యుద్ధానికి మరింత సన్నధం చేశాయి.
హైదరాబాద్ పాతనగరానికి చెందిన బీజేపీ నేత రాజాసింగ్‌ను మంగళవారం (ఆగష్టు 23) అరెస్టు చేశారు. ఆయన మహమ్మద్ ప్రవక్త గురించి కామెంట్ చేయడం అందుక్కారణం అన్నారు. గతంలోనూ రాజా సింగ్ ఈ విధంగా ఒక మతాన్ని ద్వేషిస్తూ చేసిన ప్రసంగాలు బీజేపీనీ ఇబ్బందిపెట్టాయి. ఇది హైదరాబాద్ పాత నగరంలో విద్వేషాలకు దారితీసే విధంగా ఉన్నాయి. బీజేపీ నాయకులకు ఇలాంటి రచ్చ చేయడం పరి పాటిగా మారింది. ఎన్నికల సమయానికి ముందు, మరేదయినా కీలక సమావేశాలకు ముందు తప్పకుం డా ఏదో రకంగా గొడవలు సృష్టించడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది.
కాగా రాజాసింగ్ ఆగ్రహాని కి కారణం స్టాండప్ కమెడియన్ మునావర్ హిందువులను, భారతీయతను అప హాస్యం చేసే విధంగా అత ని షోలు ఉంటున్నాయని రాజాసింగ్ ఆరోపణ. వాటిని ఏవిధంగానూ కొనసాగిం చరాదని ఆయన నినదిం చారు. అలాంటివారిని ప్రోత్సహించడం హిందువులను కించ పరచడంతో సమానమని భావించే మునా వర్ మీద బీజేపీ నేత మండిపడ్డారు. అయితే బీజేపీ నేత వ్యవహరించిన తీరువల్ల మతవిద్వేషాలు రేగుతున్నాయన్న ఆందోళన పట్టుకుంది.
నగరంలో రెండువర్గాల మధ్య విభేదాలు మళ్లీ తలెత్తి గొడవలు, విధ్వంసాలకు దారితీసే పరిస్థితులను అణిచివేయడానికే బీజేపీ నేతను అరెస్టు చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణాలో మతసామ రస్యం వెల్లివిరుస్తోందని, కలిసిమెలసి జీవిస్తున్నారన్నది అందరికీ తెలిసిన సత్యం. కాగా బీజేపీ నేత మాత్రం ప్రమాదకర కామెంట్లతో ఆ సహృత్ భావ వాతావరణాన్ని దెబ్బతీసేలా చేస్తున్నారన్న విమర్శలు చాలాకాలం నుంచే ఉన్నాయి. బీజేపీవారికి కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఉంది. కనుక పాలనలో, ఇతర అంశాల్లోనూ అడ్డుకునే మార్గాలకే బీజేపీ ప్రాధాన్యత నిస్తోందన్నది విమర్శకుల మాట. గొడవలు సృష్టించడం ఆ తర్వాత ప్రభుత్వం నిరుపయోగం అన్నది జాతీయ చిత్రపటం మీద ప్రదర్శించడం బీజేపీ ఒక ఆనవాయితీగా పెట్టుకుంది. ఈ విబేదాలు సృష్టించే తత్వమే ఇక్కడ ప్రభుత్వంతో, మరీ ముఖ్యంగా కేసీ ఆర్ తో గొడవలు ముదరడానికి పరిస్థితులు దారి తీశాయి.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీసు లు అరెస్ట్ చేశారు. దీంతో జనగాంలో ఆయన పాదయాత్ర శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా పోలీసుల మోహరించి బండిని అరెస్టు చేశారు. బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రం గా ప్రతి ఘటించారు. పోలీసులు అటువైపు వచ్చేందుకు వీలు లేకుండా పక్కా వ్యూహాన్ని పన్నారు పార్టీ శ్రేణులు. ఆయన చుట్టూ భద్రతా వలయంగా కార్యకర్తలు ఏర్పడ్డారు. వాళ్లను పక్కకు లాగిపడేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్‌ను తీసుకెళ్తున్నంత సేపు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియుకుండా పోయింది.
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కవిత టార్గెట్‌గా బీజేపీ ఆగ ష్టు 22న ఎదురు తాడి చేసింది. సాయంత్రానికి బీజేపీకి చెందిన మహిళా నేతలు... కవిత ఇంటి ముట్ట డి కి యత్నించారు. స్కాంలో ఇరుక్కున్న ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు. వారిని అరెస్టు చేసిన పోలీసులు... వారిపై కేసులు పెట్టారు.
బీజేపీ శ్రేణులపై పెట్టిన కేసులపై భగ్గుమన్నారు బీజేపీ లీడర్లు. వెంటనే కేసులు ఉపసంహరించు కోవా ల్సిందేనంటూ పట్టుపట్టారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు నిరసనకలకు బీజేపీ రాష్ట్రాధ్య క్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అంతే కాదు తమ శ్రేణులు, నేతలపై అక్రమ కేసులు పెడుతు న్నారంటూ తానే స్వయంగా దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రస్తుతం జనగామలో పాదయాత్రలో ఉన్న బండిసంజయ్ అక్కడే దీక్ష చేసేందుకు రెడీ అయ్యారు. కేసీ ఆర్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్మ దీక్ష పేరుతో నిరసన చేపడుతున్నట్టు ప్రకటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి అంతా జనగామలో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం వరకు దీక్ష చేసి మధ్యాహ్నం తర్వాత పాదయాత్ర కంటిన్యూ చేయాలని నిర్ణయించారు.
ధర్మ దీక్షకు కూర్చుంటున్న టైంలో జనగామ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసుల రంగప్రవేశంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అరెస్టు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణు లు వలయాలుగా ఏర్పడి... బండికి రక్షణ గోడలా నిలబడ్డారు. పోలీసులు అటువైపు రాకుండా జాగ్రత్త ప డ్డారు. వారందర్నీ పక్కకు నెట్టేస్తూ పోలీసులు బండిని అదుపులోకి తీసుకున్నారు. కానీ జీపులో ఆయ న్ని ఎక్కించుకొని అక్కడి నుంచి బయటపడేందుకు మాత్రం శ్రమ పడాల్సి వచ్చింది.
ఢిల్లీలో బయటపడిన లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ తనయ కవిత తదితరుల పేర్లు బయటికి రావడంతో బీజే పీ నాయకులు తెలంగాణాలో ఎక్కడికక్కడ కేసీఆర్ వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఊహిం చని విధంగా కవిత, కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా దీనికి సంబంధించిన వ్యవహారంలో భాగస్తులే అన్నది బయటపడింది. ఆమె అక్కడి అధికారులతో సమావేశం కావడం సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు ఆమె ఇటీవలి కాలంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేకపోవడం కూడా గమనార్హం. పైగా కేసీఆర్ గుజరాత్ పర్యటన వెనక కూడా కథనాలు వినవచ్చాయి.
పంజాబ్‌లో ఇటీవలి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాగా ఆ ఎన్నికల వ్యయం కేసీఆర్ ఏర్పాటు చేశారన్న వార్త ప్రచారంలో ఉంది. దీన్ని గురించి రాష్ట్రంలో బీజేపీ మరింతగా టీఆర్ ఎస్ ప్రభుత్వం మీద ఉద్యమిస్తూండడం కేసీఆర్‌కు మింగుడుపడటం లేదు. ఈ కారణంగానే బీజే పీ నేతలు ఎక్కడ ఏ కార్య్రకమం నిర్వహించుకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. ఈ కక్షలో భాగంగానే ఈ కక్షలో భాగంగానే బండిసంజయ్‌ను అరెస్టు చేయడం జరిగిందన్నది విమర్శకుల మాట.
కక్ష సాధింపు చర్యలు ఒకరికి మించి మరొకరు చేపట్టడం బీజేపీ, టీఆర్ ఎస్ ఈ విధంగా ప్రజలకు తెలియ జేశారు. కేవలం టీవీ టాక్ షోలు, బహిరంగ సభల్లో, పాదయాత్రల్లో భారీ విమర్శలు చేసుకోవ డంతో ఆగక అరెస్టులపర్వానికి తెరలేపింది టీఆర్ ఎస్. ఇది బీజేపీ పట్ల టీఆర్ ఎస్‌కి రగులు తోన్న ఆగ్రహానికి నిద ర్శనం.