నివేదికల తేదీల్లో తేడా తప్ప మరేమీ లేదు.. పట్టాభి
posted on Aug 23, 2022 @ 10:36AM
అమెరికా చెబితేగాని మనవాళ్లు దేన్ని నమ్మేట్టు లేరు. గోరంట్ల మాధవ్ వీడియోకి సంబంధించి అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫోర్డ్ నివేదికకు, అంతకుముందు తాము విడుదల చేసిన నివేదికకు తేదీ తప్ప మరే తేడా లేదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఆయన ఈ చిన్న విషయానికి సీఐడీ అధికారి సునీల్ కుమార్ తాము అమెరికా ల్యాబ్ నివేదికలు మార్చేశామని, కేసులు పెడతామని హెచ్చ రించడం అర్ధరహితమని పట్టాభి అన్నారు. ఇదంతా గోరంట్లను కాపాడుకోవడానికి చేస్తున్న కుట్రలని పట్టాభిరామం మీడియాతో అన్నారు.
అమెరికా ల్యాబ్ నివేదికలో నిజాలు బయటపడతాయని అంటున్నవారు మరి ఇపుడు ఆ నివేదికను బహి ర్గతం చేయాలని ఆయన సవాల్ చేశారు. వాస్తవానికి తాము వీడిమో పంపిన తేదీని అందులో పేర్కొన లేదని, దీన్ని ఐ ఫోన్‌కి చెందిన ఫేస్ టైమ్ వీడియో కాల్ అని నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్నారని అన్నారు. చిత్రమేమంటే తాము వీడియోను పంపిన తేదీని నివేదికలో పేర్కొనలేదని పట్టాభి ఆరో పించారు. అయితే అదేమంత పెద్ద పని కాదుగనుక జిమ్ స్టాఫోర్డ్ సిబ్బంది ఆ మార్పులు చేసి పంపారన్నారు. అయి తే తన సిబ్బంది చేసినది తెలియక స్టాఫోర్డ్ అసలా మార్పులు తాము చేయలేదని సీఐడీకి తెలియజేశారు.
ఇక్కడ చిత్రమేమంటే ఫేస్ టైం వీడియో కాల్ అనకుండా వీడియో కాల్ అని ఉంటే నివేదిక సారాంశం మారిపోతుందా? కానీ స్టాఫోర్డ్ మాత్రం తాను ఇచ్చిన నివేదికలో ఎలాంటి మార్పుచేర్పులు లేవనే అంటు న్నారు. సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్‌కు అన్ని విషయాలు స్పష్టంగా తెలుసునని, ఆయన నిజా యితీగా ఉంటే తాము విడుదల చేసిన కాపీని, తనకు అంది నివేదిక కాపీని విడుదల చేసి తేడాని ఆయనే వివరిం చాలని పట్టాభి కోరారు. కానీ అధికారి ఎందుకు వెనకడుతువేస్తున్నారో తెలియదని విమర్శించారు.
బాధ్యత గల ఎంపీ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తే నిజానిజాలు తేల్చడానికి ప్రభు త్వం ముందుకు రానప్పుడు, ప్రధాన ప్రతిపక్షంగా తమ విధిని నిర్వర్తించామన్నారు. ఎంపీని కాపాడటానికి వైసీపీ దిగజారి ప్రవర్తించిందని విమర్శించారు.