విద్యుత్ బకాయిలపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ హెచ్చరిక
posted on Aug 23, 2022 @ 11:22AM
చుట్టంలాగా వచ్చాడని చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పకుండా ఎలా ఉంటారు. మనవాడు మనసు గాయపడుతుంది, ఇంటికి వెళ్లాక తీరిగ్గా చెబుతామంటే అదేమన్నా చిన్న సమస్యా.. అందుకే నిక్కచ్చిగా తేల్చి చెప్పారు, కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ సింగ్.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ఈసారి గట్టిగానే మొట్టికాయలు తినే వచ్చారనాలి. ప్రధాని మోదీని కలిసి బొకే ఇచ్చి చిర్నవ్వులు చిందించినా, ఆ తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ మాత్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు విద్యుత్ బకాయిలు 75 రోజుల్లో చెల్లిం చా లని లేకపోతే విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతాయని మంత్రి హెచ్చరించారు.
సోమవారం (ఆగష్టు 22)ఢిల్లీలో ఆర్కేసింగ్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. సుమారు అర్ధగంట పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. అనంతరం.. ఆర్కేసింగ్ విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ రంగా నికి సబంధించిన పలు సమస్యలపై ఇద్దరం చర్చించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు రూ.6 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావలసి ఉందని ఈ సమస్య తొందరగా పరిష్క రించేందుకు చొరవ చూపాలని జగన్ కోరారని తెలిపారు.
అయితే ప్రస్తుతం ఈ విషయం సొలిసిటర్ జనరల్ వద్ద ఉదందని, త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసు కుంటామని హామీ ఇచ్చారు. చట్ట ప్రకారం ఎవరు బకాయిలు చెల్లించాలనే దానిని పరిష్కరిస్తామని కూడా చెప్పారు. పవర్ ఎక్స్చేంజీల్లో కొనుగోళ్ల బకాయిలపై సమాచారంలో పొరపాట్లు లేవని ఆర్కే సింగ్ స్పష్టం చేశారు.