నో పాంట్స్ డే...ఇదో కొత్త ట్రెండ్!
posted on Aug 23, 2022 @ 12:01PM
చలికాలం రాగానే స్వట్టర్లు, మఫ్లర్లు మార్కెట్‌లో వాటికి పెద్ద డిమాండ్. అవి లేకుండా బయటికి పిల్లల్ని, పెద్దవారిని అస్సలు పంపించరు. చలిగాలి అంతగా లేకుంటే మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు టూ వీలర్ల మీద తెగ తిరిగేస్తుంటారు. చల్లో చలిగాలిలో అలా సరదాగా గడపడంలో ఏదో ఆనందం వారిది. కానీ న్యూయార్క్‌లో మాత్రం యువత చాలా కొత్త తరహా ప్రయాణాలకు నాంది పలికారు.
మామూలుగానే కొత్తరకం డ్రస్‌లు వేస్తేనే వీలయినంతమంది వింతగా చూడటమో, కామెంట్ చేయడమో జరుగుతుంది. ఆమధ్య వరకూ చొక్కాకు బొత్తాలు సరిగా పెట్టుకోకుండా ఉండడం, క్రాఫ్‌లో సరికొత్త పోకడ లు పెద్ద ఫ్యాషన్‌గా మారింది. అమ్మాయిలు అబ్బాయిల్లా కేర్ లెస్‌గా వ్యవహరించడం కూడా ఒక ఫ్యాషన్గా మారిపోయిన కాలంలో దుస్తులు ధరించడంలో మార్పులు, చేర్పులు పెద్ద లెక్కలోకి రావేమో!
కాలేజీ సెమిస్టర్ పూర్తి చేసిన ఆనందమో, లేక ఇలా సరదాగా ప్రయాణించి జనాన్ని ఆకట్టుకోవాలన్న కొత్త ఆలోచనో తెలీదుగాని అమ్మాయిలు, అబ్బాయిలూ పాంట్లు ధరించకుండా ప్రయాణం చేసేసారు. సబ్ వే రైల్లోకి రాగానే ఒక్కరిద్దరే అనుకున్నారు ప్రయాణీకులు. ఏకంగా ఇరవయి మంది అలా పాంట్లు లేకుండా కేవలం చొక్కాలు, స్వటర్లు, కోటులూ ధరించి వచ్చేశారు. ఇదేవిట్రా నాయనా అని ఓ పెద్దాయన అడిగితే మా సెమిస్టర్ పూర్తి అయిన ఆనందంలో ఇలా సరదాగా గడపాలని అనుకున్నాం.. ఇందులో వేరే ఆలోచనేమీ లేదండీ.. అన్నాట్ట ఓ కుర్రాడు.
సెమిస్టర్ పూర్తి కావడం అంటే అదేమన్నా మహాద్భుతమా? చాలాకాలం తర్వాత రైలెక్కిన ఆనందంలో పిల్లలు చేసే గోల కంటే ఇలాంటి హడావుడి విద్యార్ధులను ఎవరు ఒప్పు కుంటారు. కానీ ఆ ప్రయాణీకు లకు తప్పలేదు. వారు వెళ్లాల్సిన గమ్యం చేరుకునేవరకూ ఇలాంటివి చూసి తరించాల్సిందే మరి!
కాగా ఇపుడు ఒక కొత్త భయం పట్టుకుంది. అదేమంటే ఒకవేళ దీన్నే ఒక సంప్రదాయంగా పాటిస్తే మాత్రం ప్రమాదమే. నో పాంట్స్ డే అంటూ మొదలెడితే ఇక అన్ని దేశాలకూ విస్తరించకా పోదు. అనుమానమే మంటే, ఇప్పటికే ఈ పిచ్చి కెనడా, ఫ్రాన్స్, స్వీడన్, ఆస్ట్రేలియా, ఫిన్‌లాండ్, యుకేలకు పాకిందని.