ఎస్‌.పి వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ ఇక‌లేరు

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ,యూపీ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాద‌వ్‌ కన్నుమూశారు. గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం సోమవారం (అక్టోబర్ 10) ఉదయం 8.30 గంటలకు మరణించారు.  ఆయన వయస్సు 82 ఏళ్లు.  ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 22వ తేదీన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నమూలాయం ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. 1939 నవం బర్ 22వతేదీన యూపీలో జన్మించిన ములాయం యూపీ సీఎంగా మూడుసార్లు పని చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రిగానూ  పనిచేశారు.   ములాయం మ‌ర‌ణ‌వార్త విన‌గానే ప్ర‌ముఖ రాజ‌కీయ‌నాయ‌కులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాళులు అర్పించారు.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో, దేశ రాజ‌కీయాల్లోనూ ములాయం సింగ్ ఎన్న‌ద‌గ్గ రాజ‌కీయ‌వేత్త  అని  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తన సంతాప సందేశంలో తెలిపారు.  ముఖ్యంగా ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ప్ర‌జాస్వామ్య విలువ‌లు కాపాడుతూ ఆయ‌న చేసిన పోరాటం ఎంతో  కీల‌క‌మ‌ని శ్లాఘించారు.  ర‌క్ష‌ణ మంత్రిగా ఎంతో సేవ‌చేశార‌ని, పార్ల‌మెంటు స‌భ్యునిగా అనేక కీల‌కాంశాల్లో ఆయ‌న ఆలోచ‌న‌లు, సూచ‌న‌లు ప్ర‌జాహితంగా ఉన్నాయ‌ని ప్ర‌ధాని ట్వీట్ చేశారు.   స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ర‌క్ష‌ణ‌మంత్రి ములాయంసింగ్ యాద‌వ్ మృతి ప‌ట్ల కాంగ్రెస్ పార్టీ త‌న ట్విట‌ర్ హాండిల్‌లో సంతాపం ప్ర‌క‌టించింది. ఆయ‌న లేని లోటు పూడ్చలేనిద‌ని  పేర్కొన్న‌ది.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ స‌తీష్ మ‌హాన ములాయం మృతికి సంతాపం వ్య‌క్తం చేస్తూ, మాజీ ముఖ్య మంత్రి మృతి ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.  ఇటీవ‌లే ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డుతోంద‌ని తెలుసు కున్నామ‌ని ఇంత‌లో ఈ విషాద వార్త విన‌వ‌ల‌సివ‌స్తుంద‌నుకోలేద‌ని ఆయ‌న అన్నారు. అధికారంలో ఉన్న‌ా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ములాయం  రాజ‌కీయాల్లో ఎంతో కీల‌క‌పాత్ర పోషించారని శ్లాఘించారు.   ములాయం సింగ్ యాద‌వ్‌జీ మ‌ర‌ణ‌వార్త ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పేర్కొన్నారు. ఆయ‌న‌తో త‌న‌కు నాలుగు ద‌శాబ్దాల అనుబంధం ఉంద‌ని, సోద‌రుడిని కోల్పోయాన‌ని ఆయ‌న ట్విట్ చేశారు. వెనుక బ‌డిన త‌ర‌గ‌తుల మ‌హానేత‌గా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఎన‌లేని సేవ‌లు చేశార‌ని, ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయ‌న గొప్ప స్పూర్తి ప్ర‌దాత అంటూ శ్లాఘించారు. మృదుస్వ‌భావి, సామాజిక న్యాయం కోసం పాటుబ‌డుతూ ల‌క్ష‌లాదిమంది జీవితాలకు వెలుగునిచ్చిన మాస్ నాయ‌కునిగా ఆయ‌న ఎన‌లేని కీర్తి గ‌డించార‌ని అన్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని భవగంతుడ్ని కోరుతున్నానన్నారు.

శివసేన పిట్ట పోరును ఈసీ తీర్చింది!

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్నచందంగా  మహారాష్ట్రలో రెండుగా చీలిన శివసేన విషయంలో జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం అదే చేసింది. శివసేన పార్టీ పేరును, పార్టీ గుర్తును ఇద్దరికీ కాకుండా తాత్కాలికంగా సీజ్ చేసింది. అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3 వ తేదీన జరిగే ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో  కేంద్ర ఏన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3 ఉప ఎన్నికలో ఏ పార్టీ పేరున, ఏ గుర్తు పై పోటీ చేయాలనుకుంటున్నాయో, ప్రాధాన్యతా క్రమంలో సోమవారం (అక్టోబర్ 10) నాటికి తెలియచేయాలని ఎన్నికల సంఘం చీలిక వర్గాలు రెంటినీ  ఆదేశించింది. కాగా, గత జూన్ లో శివసేన రెండుగా చీలి  షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి, ఇటు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే వర్గం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం అసలు శివసేన తమదేనని, తమ వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి, పార్టీ గుర్తును తమకు కేటాయించాలని కోరుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కోరిన సమాచారం ఇచ్చేందుకు థాకరే వర్గం  పదే పదే గడవు పొడిగింపు కోరడంతో, ఎన్నికల సంఘం నిర్ణయం ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రావడంతో ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, పార్టీ ఎన్నికల  చిహ్నాని స్తంభింప చేసింది.రెండు వర్గాలకు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తాత్కాలికంగా పార్టీ పేరును, గుర్తును ప్రాధాన్యతా క్రమంలో కోరింది.  ఇదలా ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి షిండే వర్గం స్వాగతించింది. అయితే, మాజీ ముఖ్యమంత్రి థాకరే వర్గం మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయాని తప్పు పట్టింది. అన్యాయంగా పేర్కొంది. అయినా చివరకు సత్యమే గెలుస్తుందని థాకరే వర్గం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.  అదలా ఉంటే, శివసేనలో చీలిక వచ్చిన అనంతరం జరుగతున్న తొలి ఎన్నిక కావడంతో, అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక ప్రాధాన్యతను సంతరించుకుంది. శివసేన సిటింగ్ ఎమ్మెల్యే రమేష్ లట్కే ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన థాకరే వర్గం అభ్యర్హ్దిగా ఆయన సతీమణిని రుజుత లట్కేను  బరిలో దింపింది. మహా వికాస్ ఘటబంధన్ భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ ఆమెకు మద్దతు ప్రకటించాయి. మరోవంక  షిండే వర్గం తరపున, బీజేపీ కార్పొరేటర్ ముర్జి పటేల్,ను బరిలో దింపుతోంది. నవంబర్ 3 న పోలిగ్ జరుగుతుంది, నవంబర్ 6 న ఫలితం వెలువడుతుంది. ప్రజలు ఎటున్నారో తేలిపోతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం.. బోయినపల్లి అభిషేక్ అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఈ స్కాం కు సంబంధించి తెలంగాణలొ తొలి అరెస్టు జరిగింది. తెరాస అగ్రనేతలకు సన్నిహితుడైన బోయనపల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్ కు చెందిన బొయినపల్లి అభిషేక్ అరెస్టు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ లో బోయినపల్లి అభిషేక్ ను అదుపులోనికి తీసుకున్న సీబీఐ ఆయనను ఢిల్లీకి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించినంత వరకూ తెలుగు రాష్ట్రాలలో జరిగిన తొలి అరెస్టు ఇది. రాబిన్ డిస్టలరీస్ లో డైరెక్టర్ గా ఉన్న అభిషేక్ రావు, హైదరాబాద్ కు చెందిన   లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. అంతే కాకుండా దాదాపు 9 కంపెనీల్లో అబిషేక్ రావు డైరెక్టర్ గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఢిల్లీ లిక్కర్ స్కింఇటీవల హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, చెన్నై, పంజాబ్, ఢిల్లీలలో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సోదాలు ముగిసిన క్రమంలో అభిషేక్ రావును అరెస్ట్ చేయడం చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్‌ నేతలతో అభిషేక్ రావుకు సంబంధాలు ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు  అభిషేక్ రావు అరెస్ట్ తెలంగాణలో సంచలనంగా మారింది. దసరా తురువాత ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో సీబీ, ఈడీ దూకుడు పెంచాయి.  హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, చెన్నై, పంజాబ్, ఢిల్లీలలో పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిం పలు కీలక ఆధారాలు సేకరించింది.  ఈ సోదాల  నేపథ్యంలోనే అభిషేక్ రావును అరెస్ట్  చేసింది. 

రాంచీలో రెచ్చిపోయిన శ్రేయ‌స్‌, కిష‌న్‌...రెండో వ‌న్డేలో భార‌త్ విజ‌యం

రాంచీలో  బ్యాట‌ర్లు హెండ్రిక్స్‌, మార్క‌ర‌మ్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ బ్యాటింగ్ విన్యాసం ఝార్ఖండ్ క్రికెట్ అభిమానుల‌కు ధోనీ ధ‌నాధ‌న్‌ను గుర్తు చేశారు. ధోనీ త‌ర్వాత వారికి అంత‌టా అద్భుత డాషింగ్ బ్య‌టింగ్ ఆ న‌లుగురూ ప్ర‌ద‌ర్శించ‌డం చూసి తీరాల్సిందే! శ్రేయ‌స్ సెంచ‌రీ దంచ‌డం, కిష‌న్ దూకుడు బ్యాటింగ్‌తో 96 ప‌రుగుల‌తో భార‌త్ రెండో వ‌న్డేలో 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ ధాటి త‌ర్వాత భార‌త్ అంత స్కోర్ అధిగ‌మిస్తుందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌ య్యాయి.కానీ ఇషాన్‌, శ్రేయ‌స్ దంచికొట్ట‌డం మ‌ర్క‌ర‌మ్‌, హెండ్రిక్స్‌ల ప‌రుగుల వర‌ద‌ను ప్రేక్ష‌కులు మ‌ర్చిపోయారు. ద‌క్షిణాఫ్రికా 50 ఓవ‌ర్ల‌లో  6 వికెట్ల న‌ష్టానికి 278 ప‌రుగులు చేయ‌గా భార‌త్ 3 వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు చేసింది. ఇక్క‌డ భార‌త్ తో త‌ల‌ప‌డిన రెండో వ‌న్డే లో ద‌క్షిణాఫ్రికా  భారీ స్కోర్ చేసింది. మ‌ర్క ర‌మ్ 79, హెండ్రిక్స్ 74 ప‌రుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆరంభం బెరుగ్గానే ఉంది. భార‌త్ పేస‌ర్ సిరాజ్ బ్యాట‌ర్ల‌ను ఖంగారు పెట్టా డు. మొద‌టి మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన డీకాక్ కేవ‌లం 5 ప‌రుగుల‌కే సిరాజ్‌కు దొరికాడు. జ‌ట్టు స్కోర్ ప‌ది ప‌రుగుల‌కే మొదటి వికెట్ కోల్పోయింది. మొద‌టి ఐదు ఓవ‌ర్ల‌లో ద‌క్షిణాఫ్రికా ఒక వికెట్ న‌ష్టానికి 19 ప‌రుగులు చేసింది. మొదటి ప‌వ‌ర్‌ప్లే 10 ఓవ‌ర్ ముగిసే సమ‌యానికి 2 వికెట్లు కోల్పోయి 40 ప‌రుగులు చేసింది. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ ప‌రుగులెత్తి స్తున్న మ‌లాన్ వెను దిరిగాడు. అత‌ను 31 బంతుల్లో 25 ప‌రుగులు చేశాడు. 12 వ ఓవ‌ర్‌కి 50 ప‌రుగులు పూర్తి చేసింది. అపుడు వ‌చ్చాడు మ‌ర్క ర‌మ్ రంగం లోకి. వ‌స్తూనే ధాటిగా ఆడ‌టం మొద లెట్టా డు. ఫ‌లితంగా జ‌ట్టు 15 ఓవ‌ర్ల‌కు 60 పరుగులు చేసింది. 20 ఓవ‌ర్లు అయ్యే స‌రికి ద‌క్షిణాఫ్రికా 2 వికెట్ల న‌ష్టానికి 91 ప‌రుగులు చేసింది. వంద ప‌రుగులు 20 ఓవ‌ర్ల‌లో పూర్తిచేసింది. హెండ్రిక్స్‌, మ‌ర్క ర‌మ్ క‌లిసి 50 ప‌రుగులు 60 బంతుల్లో చేశారు.26 ఓవ‌ర్ల‌లో ద‌క్షిణాఫ్రికా 2 వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగు లు చేసింది. అందుకు ప్ర‌ధానం గా హెండ్రిక్స్ వీరబాదుడు తోడ‌యింది. అత‌ను భార‌త్‌పై మొద‌టి అర్ధ‌సెంచ‌రీని 58 బంతుల్లో చేశాడు. కాగా 39వ ఓవ‌ర్లో జ‌ట్టు స్కోర్ 200 ప‌రుగులు దాటింది. ఆ వెంట‌నే మ‌ర్క‌ర‌మ్ ఎట్ట‌కేల‌కు వెనుదిరిగాడు. అత‌ను 88 బంతుల్లో 79 ప‌రుగులు చేశాడు. కానీ ఆ త‌ర్వాత జ‌ట్టు ఇన్నింగ్స్ అత‌నిలో ఎవ్వ‌రూ నిల‌బెట్ట‌లేక‌పోయారు. 40 ఓవ‌ర్ల‌కు 5 వికెట్లు కోల్పోయి 221 ప‌రుగుల చేసిం ది. 45వ ఓవ‌ర్‌కి 252  ప‌రుగులు చేసింది. 50 ఓవ‌ర్ పూర్త‌య్యే స‌రికి ద‌క్షిణా ఫ్రికా 7 వికెట్ల న‌ష్టానికి 278 ప‌రుగులు చేసింది. భార‌త్ బౌల‌ర్ల‌లో సిరాజ్ 3.8 ఓవ‌ర్ల లో 3 వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ అత్య‌ధికంగా 6.67 ర‌న్‌రేట్‌తో 60 ప‌రుగు లిచ్చాడు.  భార‌త్  279 ప‌రుగుల ల‌క్ష్యంతో దిగింది. మొద‌టి ఓవ‌ర్లో ప‌రుగులు చేయ‌లేదు కానీ రెండో ఓవ‌ర్నుంచీ ప‌రుగులు సాధించారు. భార‌త్ 28 ప‌రుగుల వ‌ద్ద  కెప్టెన్ ధావ‌న్ వెనుదిరిగాడు. అత‌ను కేవ‌లం 13 ప‌రుగులే చేశాడు. రెండో వికెట్ గా గిల్ 26 ప‌రుగుల‌కే జ‌ట్టు స్కోర్ 48 వ‌ద్ద పెవిలియ‌న్ చేరాడు. వీరిద్ద‌రి స్థానంలో వ‌చ్చిన శ్రేయాస్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్ మెరుపులు ప్ర‌ద‌ర్శించారు. దక్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను ఆడుకున్నారు. ఎవ‌రు ఎలా వేయాలో అర్ధంగాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఫీల్డ‌ర్లు చ‌మటో ర్చారు కానీ భార‌త్ ద్వ‌యం ధాటిని నిలువ‌రించ‌లేక‌పోయారు. భార‌త్ ప‌ది ఓవ‌ర్ల‌కు 2 వికెట్లు కోల్పోయి 55 ప‌రుగులు చేసింది. ఇదే స‌మ‌యంలో ద‌క్షిణాఫ్రికా 2 వికెట్ల న‌ష్టానికి 41ప‌రుగులు చేసింది. 15 ఓవ‌ర్ల‌కు భార‌త్‌75ప‌రుగులు చేసింది. 21ఓవ‌ర్లో భార‌త్ వంద‌ప‌రుగులు పూర్తి చేసింది. అప్ప‌టికి అయ్య‌ర్ 26, కిష‌న్ 42 ప‌రుగుల‌తో ఉన్నారు. ఇద్ద‌రూ క‌లిసి 50 ప‌రుగులు 72 బంతుల్లో చేశారు. ఆ త‌ర్వాత కిష‌న్ మ‌రింత దూకుడు పెంచి త‌న మొద‌టి అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేశాడు. ఆ వెంట‌నే అయ్య‌ర్ కూడా పూర్తి చేశాడు. అయ్య‌ర్‌కి ఇది 6 ఇన్నింగ్స్‌లో 5వ అర్ధ‌సెంచ‌రీ. ఇద్ద‌రూ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను బౌలింగ్ మ‌ర్చేలా బాదారు. ఇద్ద‌రూ 3వ వికెట్‌కు 107 బంతుల్లో 100 ప‌రుగులు చేశారు. భార‌త్ 150 ప‌రుగులు 27 ఒవ‌ర్ల‌లో పూర్త‌ య్యాయి. భార‌త్ సూప‌ర్స్టార్స్ ఇద్ద‌రూ 140 బంతుల్లో 150 ప‌రుగుల‌ను ఇన్నింగ్స్ 31ఓవ‌ర్లో పూర్తిచేయ‌డంలో అద్భుత ప్ర‌తిభ క‌న‌ప‌ర్చారు. భార‌త్ 200 ప‌రుగులు 33వ ఓవ‌ర్లో పూర్త‌య్యాయి. 35వ ఓవ‌ర్లో ఓవ‌ర్లో ఇషాన్ కిష‌న్ వెనుదిరిగాడు. త‌న సెంచ‌రీకి ఏడు ప‌రుగుల దూరంలో అవుట‌య్యాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ 209 ప‌రుగులు. ఆ త‌ర్వాత అయ్య‌ర్ మ‌రింత రెచ్చిపోయి విజ‌యాన్ని అందించాడు. అయ్య‌ర్ 113 ప‌రు గులు త‌న వ‌న్డే కెరీర్‌లో రెండ‌వ అత్య‌ధిక స్కోర్‌. శ్రేయ‌స్ అయ్య‌ర్ 113 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. కిష‌న్, అయ్య‌ర్ ఇద్ద‌రూ  ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు.

గుక్కెడు మంచినీళ్ల‌కోసం..ప్రాణాల‌కు తెగించిన పెద్దాయ‌న‌

చింటూకి అమ్మ మంచినీళ్లు తాగి స్తుంది, అత్త‌గారికి కోడ‌లు గ్లాసు తో ఇస్తుంది, మీ ఊళ్లో మంచినీళ్ల చెరువో, బావో ఉండొచ్చు. కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హ‌మీర్‌పూర్ గ్రామ‌ స్తులు గుక్కెడు మంచినీళ్లు తేవ‌డానికి ప్రాణాల‌కు తెగించా ల్సివ‌స్తోంది. ఉత్తర ప్రదేశ్ హమీర్ పూర్ జిల్లా సిసోలార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బచా కహానీ గ్రామ‌స్తులు మాత్రం చావో గ్లాసుడు మంచినీళ్లో అని నిత్యం మంచినీటికోసం యుద్దం చేస్తు న్నారు...ఊబితో! ఇక్క‌డి నీళ్లు తెచ్చుకోవ‌డానికి ప్రతిరోజూ చాలా మంది తమ ప్రాణాలను పణం గా పెట్టవలసి వ‌స్తోంది. ఒక పెద్దాయ‌న నడుము లోతుగా ఊబిలో మునిగిపోవడం చూడవచ్చు, అయితే ఒక వ్యక్తి చెక్క కర్రను పట్టుకోమని చెప్పి అతనిని బయటకు తీయడా నికి ప్రయత్నించాడు. వృద్ధుడి పక్కనే ఒక స్టీల్ బిందె కనిపిస్తుంది, దానితో అతను నీటిని సేకరించడానికి నదికి వెళ్ళాడు. అనేక ప్రాంతాలలో ఇటువంటి పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు ప్రతి ఇంటికి కుళా యి నీటిని ఇస్తామని ప్రభుత్వం చేసిన వాగ్దానంపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశ్నలను లేవనెత్తారు. ఒక పోలీసు కూడా నవ్వుతూ తన ఫోన్‌లో రెస్క్యూ ప్రయత్నాన్ని రికార్డ్ చేయ‌డం విమర్శలకు దారితీసింది. వైరల్ వీడియో హమీర్‌పూర్ జిల్లాలోని సిసోలార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బచా కహానీ గ్రామానికి చెందినది. ఈ కుళాయి నీరు ఉప్పుమ‌యం కావ‌డంతో తాగడానికి పనికిరాదని, దీంతో గ్రామస్తులు నది నుంచి నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. నమామిగంగే మిషన్‌కు సంబంధించి రాష్ట్ర జలశక్తి మంత్రి ఇటీవల హమీర్‌పూర్‌ను సందర్శిం చారని, త్వరలో కుళాయి నీరు అందుతుందని స్థానికులకు హామీ ఇచ్చారని మరో స్థానికుడు సూచించారు. ఇది ఎలా కార్యరూపం దాల్చుతుందో ఖచ్చితంగా తెలియద‌ని అతను చెప్పాడు.

తెరాస, కాంగ్రెస్ ఎంపీల జంప్? కేటీఆర్, రేవంత్ జోస్యం

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరు మార్పు, మునుగోడు ఉప ఎన్నిక, రాష్ట్రంలోకి  ప్రవేశిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర ... ఈ మూడు ప్రధాన రాజకీయ పరిణామాలు నేపధ్యంగా తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ ఉష్ణోగ్రతలు రోజుకు   పెరుగుతున్నాయి. తెరాస పేరు మార్పు వ్యవహారం అనుకున్నట్లుగా సాగడం లేదు. వినాయకుడి పెళ్ళికి వెయ్యి విఘ్నాలు అన్నట్లుగా, ఏవేవో విఘ్నాలు ఎదురవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో మునుగోడు నుంచి బీఆర్ఎస్ పతాకంపై భారత యాత్రకు శ్రీకారం చుట్టాలనుకున్నతెరాస వ్యూహం బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. ఇక రాహుల్ గాంధీ యాత్ర విషయానికి వస్తే, ఈ నెల (అక్టోబర్) 24న రాష్ట్రంలో  ప్రవేశిస్తోంది. రాహుల్ రాష్ట్రంలో ఉండగానే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుంది. సో .. రాహుల యాత్ర మునుగోడు ఫలితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠ రేకిస్తోంది.    ఇదలా ఉంటే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాహుల గాంధీ యాత్ర రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందే, ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెపుతారని సంచలన జోస్యం చెప్పారు. ఉన్న ముగ్గురు ఎంపీల్లో రేవంత్ రెడ్డిని తీసేస్తే మిగిలినది ఉత్తమ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి. ఇద్దరూ పార్టీ మారుతున్నారని కేటీఆర్ చెప్పకనే చెప్పారు.  నిజానికి,  కోమటి రెడ్డి వెంకట రెడ్డి సోదరుడు రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన (వెంకటరెడ్డి) కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు కొనసాగుతారు అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అంతే కాకుండా, రాజగోపాల రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడం లేదు. ఈ నేపధ్యంలో ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే, రాహుల్ గాంధీ యాత్రకు ముందే ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారతారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌, ఉత్తమ కుమార్ రెడ్డి పార్టీ  నిబద్ధత, నిజాయతీ గురించి మాత్రమే గొప్పగా చెప్పుకొచ్చారు కానీ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేరును మాత్రం తీసుకోలేదు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే, ‘గాంధీ భవన్’ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉత్తమ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కానీ, కోమటి రెడ్డి రాలేదు. నిజానికి ఉత్తమకుమార్ రెడ్డి మనసులో ఏమున్నా, మునుగోడు ప్రచారంలో పాల్గొనడంతో పాటుగా, పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో, కేటీఆర్ జ్యోతిషం సగమే నిజమయ్యేలా ఉందని అంటున్నారు. ఇద్దరు కాకున్నా ఒకరు చేయి వదలడం ఖాయంగానే కనిపిస్తోందని అంటున్నారు.    అదలా ఉంటే మంత్రి కేటీఆర్ జ్యోతిష్యానికి కౌంటర్గా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజ్యసభలో తెరాస పక్షం బీజేపీలో  విలీనం కాబోతోందని జోస్యం చెప్పారు. అదికూడా ప్రగతి భవన్ కేంద్రంగా నడిచే రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహిత బంధువు సంతోష కుమార్, సారధ్యంలో జరుగుతుందని,  ఐదుగురు తెరాస ఎంపీలు  బీజేపీలో చేరడం ఖాయమని పేర్కొనారు. రాజ్యసభలో తెరాసకు ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇప్పటికే నలుగురు సిద్ధంగా ఉన్నారని, ఇంకొకరు ముందుకొస్తే విలీనం తథ్యమన్నారు. బీజేపీలో విలీనానికి సిద్ధపడ్డవారి జాబితాలో కేకే, సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ల పేర్లు లేవని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.  అయితే, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ఎంపీల గురించి చెప్పిన జ్యోతిషంలానే,  రేవంత్ రెడ్డి చెప్పిన తెరాస రాజ్యసభ ఎంపీల జంప్ జ్యోతిషం కూడా పూర్తిగా కొట్టివేయడం కుదరదని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే, జ్యోతిషం నిజమయ్యే వరకు మాత్రం ఇప్పుడే ఎవరు ఎవరు జంప్ చేస్తున్నారన్న జ్యోతిషం చెప్పలేమని అంటున్నారు.

కోహ్లీ, మ‌ళ్లీ ఆ మెరుపులు ప్ర‌ద‌ర్శించాలి..చాపెల్‌

ఒక‌ప్పుడు స‌చిన్‌, గంగూలీ. ఆ త‌ర్వాత ధోనీ,గంభీర్‌..ఇపుడు కింగ్ కోహ్లీ, శ‌ర్మ‌...భార‌త్ విజ‌ యాల్లో కీల‌క‌పాత్ర పోషిం చారు, పోషిస్తున్నారు.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను మెరుపు వేగంతో బౌండ‌రీలు దాటిస్తున్నారు. ఆ మ‌ధ్య కాస్తంత వెన‌క‌బ‌డినా కింగ్ బ్యాక్ ఇన్ ఫామ్ అంటూ కోహిలోత్సాహంతో వీరాభిమానులు కింగ్ ఆల్వేస్ కింగ్ అంటూ ప్రోత్స‌హిస్తు న్నా రు. ఆసీస్ మాజీ కెప్టెన్‌ ఇయా న్ చాపెల్  కూడా అదే అభిప్రా యం వ్య‌క్తం చేశాడు.. కోహ్లీ దూకుడు మ‌ళ్లీ ఆ మెరుపులు ప్ర‌ద‌ర్శించాలంటున్నాడు. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లి, జో రూట్, బాబర్ అజామ్ అత్యుత్తమ రోజుల్లో అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్న కోహ్లిని అధిగమిం చడం చాలా కష్టమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నాడు. విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, మార్నస్ లాబుషాగ్నే, బాబర్ ఆజం. ఈ ఆధునిక దిగ్గజాలు క్రికెట్‌ని చూడ టం అనుభవాన్ని సంపూర్ణంగా చేస్తారు. అభిమానులు వీరిలో ఎవరు బెస్ట్  అని చర్చించుకుంటూ ఉంటారు. అత్యుత్తమ బ్యాటర్ గా రన్‌అవే ఫేవరెట్ అయిన కోహ్లీ, నవంబర్ 2019 తర్వాత ఫామ్‌ను కోల్పోయాడు. అప్పటి నుంచీ అతను ఒక్క సెంచరీని నమోదు చేయడంలో విఫలమయ్యాడు. చివరకు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆసియా కప్‌లో డ్రై స్పెల్‌ను బద్దలు కొట్టాడు , అదే అతని మొదటి టీ 20 సెంచరీ. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఈ ఆటగాళ్లందరినీ పరిశీలించాడు.  ఆయ‌న మాటల్లో చెప్పాలంటే..ఈ ఆటగాళ్లలో అత్యు త్తమ రోజులలో, అత్యంత పోటీ తత్వం ఉన్న కోహ్లీని అధిగమించడం కష్టం కోహ్లీ గొప్ప స్ట్రోక్ రేంజ్, అత్యంత పోటీతత్వ స్వభావం, బ్యాటింగ్‌లో ఆలోచనాత్మకమైన విధానం కలిగిన మంచి ఆటగాడు.  ప్రతిభావంతులైన గ్రూప్ నుండి ఉత్తమ ఆటగాడిని ఎంచుకోవడం కష్టం. కొంతమంది పాత-టైమర్లు గుర్తించబడిన ఉత్తమ బ్యాటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ కంటే విక్టర్ ట్రంపర్ యొక్క కళాత్మక శైలిని ఇష్టపడతారని మీరు పరిగణించినప్పుడు, కష్టం ఆశ్చర్యం కలిగించదు. ఈ ఆటగాళ్లలో అత్యుత్తమ రోజులలో, అత్యంత పోటీతత్వం ఉన్న కోహ్లీని అధిగమించడం కష్టం. 2014 లో అడిలైడ్ ఓవల్‌లో విఫలమైన కానీ ధైర్యవంతమైన విజయ ప్రయత్నంలో అతని జంట సెంచరీలు ఈ గ్రూప్ నిర్మించిన వాటిలో త‌న‌కు ఇష్ట మైన ఇన్నింగ్స్‌గా మిగిలిపోయాయ‌న్నాడు. మాజీ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ ఇప్పుడు ఈ బ్యాటర్లలో రన్-చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాడు.ఈ ఏడాది ప్రారంభంలో అతను సుదీర్ఘమైన ఫార్మాట్‌లో 10  వేల‌ పరుగుల మార్క్‌ను కూడా అధిగమించాడు. రూట్ చేసిన పరుగులు, చేసిన సెంచరీ లు రెండింటిలోనూ సునాయాసంగా అగ్రస్థానంలో ఉన్నాడు. అత్యధిక ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. అతను స్కోర్ చేయాలనే కోరికను కలిగి ఉన్నాడు, విస్తారమైన షాట్‌లతో వికెట్ మొత్తంలో పరుగులు సేకరిస్తాడు. అతను సెంచరీలు చేయడంలో పేరు గాంచాడు. అయితే ఈ కాలంలో వందల సంఖ్యలో రెండంకెల స్కోరు సాధించిన ఏకైక ఆటగాడు అతనేన‌ని చాపెల్ అన్నాడు. ఏదేమైనప్పటికీ, ఆస్ట్రేలియాలో మొత్తం 27 ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ అతను సెంచరీ చేయలేకపోయాడు. అతను తొమ్మిది సందర్భాలలో 50 పరుగులు చేశాడు. వాటిలో దేనినీ సెంచరీగా మార్చలేదు. దక్షిణాఫ్రికా బలమైన పేస్‌కి వ్యతిరేకంగా స్వదేశం లో తక్కువ స్కోర్ల వరుస. ఈ సంవత్సరం దాడి కూడా ఒక హెచ్చరిక అన్నారాయన.

రాజకీయ నిధులపై బీజేపీ  గుత్తాధిపత్యం!

నోటు చూపితేనే డెత్ స‌ర్టిఫికెట్‌.. నోటు ఇస్తేనే ప్ర‌భుత్వాఫీసుల్లో ఫైలు క‌దిలేది, అంతా ధ‌న‌మిదం జ‌గ‌త్‌! పాత సినిమాల్లో అంతా డ‌బ్బు మ‌యం అని గుమ్మ‌డి బాధ‌ప‌డ్డ‌ట్టే ఇప్ప‌టికీ ప‌ల్లెల్లో రైతూ బాధ‌ప‌డుతున్నాడు. డ‌బ్బుంటే ఇల్లు క‌ట్టుకుంటారు, కొంటా రు. డ‌బ్బుంటేనే అధికారం, దాంతోనే లోకాధిప‌త్యం ఇదీ వాస్త‌వం. నీతులు నీతిశ‌త‌కంలో ఉంటాయి, డ‌బ్బులో లోకం తూగుతుం ది. రాజ‌కీయాలు ఆ కాయితాల మీద‌నే సాగుతూన్నాయి. ఇది  వేదాంతం వారి సినిమా డైలాగ్ కాదు.. అనాదిగా మ‌న‌కు తెలిసీ, తెలీన‌ట్టు నంగిగా ఓట్లేయిస్తున్న రాజ‌కీయ తంత్రం.  పార్టీలు ఎల‌క్టొర‌ల్ బాండ్లు(ఈబీ)ల ద్వారా రూ. 10,000 కోట్ల కంటే ఎక్కువ అనామక విరాళాలు పొందాయి, వీటిలో బీజేపీ మూ డింట రెండు వంతుల కంటే ఎక్కువ పొందింది. ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ‘చీకటి డబ్బు’ ఒక సమస్య. నిజానికి, రాజకీ య నిధులలో ‘పారదర్శకత’ పేరుతో నరేంద్ర‌ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీ కారణంగా ఇది యు ఎస్‌ లో కంటే భారత ఎన్ని కలలో, రాజకీయాలలో మరింత పెద్ద,  ప్రమాదకరమైన అంశంగా మారింది. రాజకీయ పార్టీ కోసం అపరిమిత రహస్య డబ్బును పొందడం బహుశా ప్రపంచంలోనే అత్యంత తెలివైన పథకం. ఈ సంవత్సరం ఆగస్టులో, యుఎస్‌ మీడియా ఆ దేశంలో వెలుగులోకి వచ్చిన అతి పెద్ద రహస్య రాజకీయ విరాళాన్ని బట్ట బయ లు చేసింది... ఒక రిపబ్లికన్ పార్టీ కార్యకర్తకు ప్రస్తుత కన్జర్వేటివ్-ఆధిపత్యం గల యుఎస్‌ సుప్రీంను నిర్మించడంలో సహాయం చేసిన ఒక రిక్లూజివ్ బిలియనీర్ $1.6 బిలియన్లను అందించాడు. న్యూయార్క్ టైమ్స్ జో బిడెన్, మొక్రాట్‌లు నిజానికి ట్రంప్క్యాంప్ను, రిపబ్లికన్‌లను వారి స్వంత ఆటలో  సంపాదించడం, ఉపయోగించడంలో ఎలా ఓడించారో బయట పెట్టింది.  2017లో ఈబీలను అనుమతించడానికి బహుళ చట్టాలకు సవరణలు ప్రవేశపెట్టిన దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గత పాల నలో, కార్పొరేట్లు, ధనవంతుల అక్రమ నగదు విరాళాలు ఎన్నికలను మరియు విధాన రూపకల్పనను భ్రష్టు పట్టిం చాయని పార్లమెంటు, దేశానికి చెప్పారు. ఈబీల ద్వారా రాజకీయ విరాళాల్లో పారదర్శకతను ప్రవేశపెట్టడం ద్వారా బీజేపీ వ్యవ స్థను ప్రక్షాళన చేస్తుందని ఆయన అన్నారు. వాస్తవానికి, ఈబీలు బేరర్ బాండ్‌లు, అందువల్ల నగదు వలె మంచివి. ఓటరుగా, ఈ ఈబీని ఎవరు ఇస్తున్నారో  తెలియక పోతే, మన రాజకీయ పార్టీలకు ఎవరు నిధులు సమకూరు స్తు న్నారో వాటికి ప్రతిఫలంగా వారు ఏమి పొందుతున్నారు లేదా ఈ దాతలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలరా అనే విషయంలో పౌరులకు తెలివి లేదు.  రాజకీయ పార్టీలు ఈబీల ద్వారా 2018 నుంచి రూ.10,000 కోట్లకు పైగా అనామక విరాళాలు పొందాయి. ఇందులో బీజేపీ మూడింట  రెండొంతులకు పైగా.. అంటే దాదాపు రూ.7,000 కోట్లు సంపాదించింది. ఈ విరాళాలలో 95% కంటే ఎక్కువ  ఒక్క కోటి విలువ కలిగినవి. సహజంగానే, మీరు, నా లాంటి వ్యక్తులు అలాంటి డబ్బును విరాళంగా ఇవ్వడం కాదు, కార్పొరేట్లు, ధనవంతు లు మూలాధారంగా పంపుతున్నారు. దాత దాని రసీదుపై పన్ను మినహాయింపును పొందుతాడు, కానీ దాత అతను డబ్బు ఎవరికి, ఎంత ఇచ్చాడో వెల్లడించాల్సిన అవసరం లేదు. ఎవరు డబ్బు ఇచ్చారో పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు.  2019 లో, ఈబీలు అధికార పార్టీ కోసం ఈతగా పనిచేయడం ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత, మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించింది (దీని ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన మొదటి రెండేళ్లలో రూ. 1.84 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పో యింది. పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం). ఈ వాస్తవాలు, బీజేపీకి ఈబీ విరాళాల మధ్య మ‌రికొన్ని అంశాలు ప‌రిశీలించాలి. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాల్లో బిజెపియేతర ప్రభుత్వాలు 2018 తర్వాత పడిపోయాయి, బిజెపియేతర అధికార పార్టీలకు చెందిన పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తమ పార్టీలను విడిచిపెట్టి బిజెపికి సహాయం చేస్తున్నారు. ఎన్నికల్లో గెల వలేని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా నాటి అధికార పార్టీకి అనా మకుడిగా చేరడం ఆందోళన కలిగించే అంశం. ముందుగా, ముందుగా చట్టవిరుద్ధంగా పరిగణించబడే వాస్తవం - రాజకీయ పార్టీకి అనామక లేదా రహస్య విరాళాల విరాళాలు - ఇప్పుడు చట్టబద్ధం చేయబడ్డాయి. పార్టీలకు నిధులు ఇవ్వడానికి ఇష్టపడే మార్గంగా మారింది. ఈబీలు రాజకీయ నిధులపై ఎక్కువ లేదా తక్కువ అధికార పార్టీ గుత్తాధిపత్యానికి దారితీశాయి, తద్వారా ప్రతిపక్షానికి వ్యతిరేకం గా సమతుల్యతను నిర్ణయాత్మకంగా వంచి, మన బహుళ-పార్టీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. నిజానికి, ఇది ఎలా సాధించబడిందనే కథ ఆందోళనకరంగా ఉంది, బహుళ-పార్టీ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి అవినీతి నిరోధక డ్రైవ్ లు, రాజ కీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడం అనే బోగీ ఎలా ఉపయోగించబడుతుందో చూపిస్తుంది. డీమోనిటైజేషన్‌తో ఈ కథ మొద లైంది. 

ఇంతై ..ఇంతింతై..కేసీఆర్ ప్రధాని 369!

 చిన్న మేడ ఇంట్లో మేడెక్కి కొండ‌ని చూసి అక్క‌డున్న ఇల్లు కోరుకున్నాడు చిన్నెంక‌డు, మాయాద‌ర్పంలో సావిత్రికి నాగేశ్రావు ఆప‌డ్డాడు, కొండెక్కిన సైనికుడికి ఆకాశం క‌నిపించింది, చిరూకి విల‌న్ క‌నిపించాడు.. త‌న నివాసంలో పేద్ద కుర్చీలో కూర్చున్న బీఆర్ ఎస్ అధినేత‌కు కిటికీలోంచే ధిల్లీ కుర్సీ అగుపడింది.. అంతే ఒక్క ఉదుట‌న లేచి అమాంతం అద్దం ముందు నుంచున్నారు.. అమాంతం భ‌విష్య‌త్ ద‌ర్శ‌న‌మ‌యింది..తాను ప్ర‌ధాని, త‌న‌వాళ్లంతా అన్ని రాష్ట్రాల్లోనూ చ‌క్కం తిప్పేయ‌గ‌ల సీఎంలు, ఐఏఎస్‌లూ అయి ద‌ర్శ‌న‌మిచ్చారు! ల‌క్ష్యం మంచిదేరా అబ్బాయ్‌.. కాకుంటే లక్ష‌ణంగా ఉన్నోడివి కోరి క‌ష్టాలెందుకు అంటుంది పెద్ద‌వ్వ‌. క‌ల ల‌క్ష్యంగా మారింత‌ర్వాత  కేసీఆర్ కుర్చీకే అంటిపెట్టుకుంటారా?  ఎన్నాళ్లీ కుర్చీలో కూర్చుంటాం..కొడితే కుంభ‌స్థ‌లాన్నే కొట్టాలన్న డైలాగ్ ఆయ మ‌న‌సు ను మ‌రింత గిల్లింది. రాష్ట్రాన్ని ఆల్‌రెడీ లైట్‌గా తీసుకున్నందువ‌ల్ల కాళ్ల‌కు బ‌ల పాలు వ‌దిలేసి ఏకంగా చ‌క్రాలు క‌ట్టేసుకుని సూప ర్ ఫాస్ట ఎక్స్‌ప్రెస్ మించి వేగంగా ప‌రుగుపెట్ట‌డం ఆరంభించారు. ఈ వేగంలో టీడీపీ చంద్ర‌బాబు, లోకేష్‌, బీజేపీ బండి, ఈటెల‌, కాంగ్రెస్ భ‌ట్టి,రేవంత్ అంతా వెనక్కి ప‌రిగెడుతున్నట్టే క‌న‌ప‌డుతున్నారు. సుదూరం నుంచి ఆదిలో ఆయ‌న ప్రేమించిన ఎన్టీఆర్ పాటే.. ముందులే మంచి కాలం.. విన‌ప‌డుతోంది. ఇక ఎవ‌ర్ని ప‌ట్టించుకుంటారు బీఆర్ ఎస్ అధినేత‌గా కేసీఆర్‌. ఇపుడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆస‌లా మాట‌కు వ‌స్తే యావ‌త్ తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని 369 సినిమా చూపాల‌న్న‌దే ఆయ‌న తాప‌త్ర‌యం.ఆయ‌న కాల యంత్రం మీట‌రేసింది ఇప్పుడే అనిపించారు. కానీ అది స్టార్ట్ అయి శానా కాల‌మైంది! కాకుంటే ఆయ‌న భ‌విష్య‌ద్ద‌ర్శిని ఏకంగా అంత‌ర్జాతీయ నాయ‌కుల‌నే భ‌య‌పెట్టేంత‌గా ఆయ‌న రూపు, పార్టీ ప‌తాకం వైశాల్యం పెంచి చూపింది!  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమతి(టీఆర్ఎస్)ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చేశారు. తెలంగాణ మోడల్ ను దేశమంతటా విస్తరించడమే లక్ష్యంగా ప్రకటించేశారు. కేసీఆర్ భరాసపై సామాజిక మాధ్య మంలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. బీఆర్ఎస్ తరువాత ఆయన లక్ష్యం ప్రపంచ రాష్ట్ర సమితి (డబ్ల్యుఆర్ఎస్) అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్రం సంధించాడు. భవిష్యదర్శిని అంటూ  2030 నాటికి కేసీఆర్ డబ్ల్యుఆర్ఎస్ ప్రకటన వేడుకగా జరుగుతుం దంటూ సెటైర్లు గుప్పించాడు.   ఈరోజున ప్రపంచం అంతా గొప్ప హడావుడిగా ఉంది. ఈరోజు ఉదయమే భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక గొప్ప తీర్మానం చేసింది. భారత ప్రధాని మరియు భారాస సిధ్ధాంత కర్త కల్వకుంట్ల చంద్రశేఖర‌ రావు గారి ఆలోచన ప్రకారం బీఆర్ ఎస్‌ పార్టీని అంతర్జాతీ య రాజకీయ పార్టీగా మార్చటం జరిగింది. ఈమేరకు భారాస సర్వసభ్యసమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధానమంత్రి నివాసం ప్రగతి భవన్లో బ్లహ్మాండమైన భారాస సర్వసభ్యసమావేశం జరిగింది. సభాద్య క్షులు చంద్రశేఖర రావు గారు అద్భుతమైన ప్రారంభోపన్యాసం చేసారు. ప్రపంచపరిస్థితులు ఏమీ బాగోలేవు. అస్తమానం ఏవేవో దేశాలు గిల్లికజ్జాలతో ప్రపంచశాంతిని భంగపరుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు.  ఇలా ఐతే ప్రపంచం త్వరలోనే నాశనం అవుతుంది. అమెరికా చైనా రష్యా లాంటి పెద్దదేశాలూ బుధ్ధిలేకుండా ప్రవర్తించటం ఏమి టని ఆ దేశాలను చంద్రశేఖర రావు గారు నిలదీశారు. యుధ్ధాలను నివారించవలసిన ఐక్యరాజ్య సమితి ఆచరణలో సంపూర్ణం గా విఫలం ఐనదని అది ఇంక కాలంచేసిందని నేనే ప్రకటిస్తున్నాను అన్నారు. బాగా ఆలోచించి తాను ఒక మంచి నిర్ణయం తీసు కున్నాననీ దాని ప్రకారం భారాసను అంతర్జాతీయ పార్టీగా మార్చటం యావ త్తు ప్రపంచానికీ అతిముఖ్యమైన అవసరం ఆనీ అన్నారు. భారాస ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎందరో ఏవేవే అన్నారనీ తుదకు భారాస ద్వారానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మధ్యన,అలాగే చాలా రాష్ట్రాల మధ్య వివాదాలూ సానుకూలంగా పరిష్కరించబడ్డాయనీ అదేవిధంగా ప్రరాస ద్వారా దేశాల మధ్య వివాదాలు కూడా బ్రహ్మాండంగా పరిష్కారం చేసెయ్యవచ్చును అనీ ఆసత్తా తమ సొత్తు ఆనీ అన్నారు. క్రమంగా అన్ని ముఖ్యదేశాలలోనూ మన పార్టీని అధికారంలో నిలబెట్టటం ద్వారా యుధ్ధాలను నివారించి ప్రపంచంలో శాంతినీ సుస్థిరతనూ నెలకొల్పవచ్చు అనీ చంద్రశేఖర రావు గారు వక్కాణించారు.అందుకే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భారాస పార్టీని ప్రపంచ రాజ్య సమితిగా మార్చుతూ సభవారు తీర్మానం చేయాలని ఆదేశపూర్వకంగా సూచించారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు తీర్మానాన్ని ప్రతిపాదించారు.ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత గారు ఆ తీర్మానాన్ని బలపరిచారు.మహారాష్ట్ర గవర్నర్ సంతోష్ రావు గారూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హరీష్ రావు గారూ కూడా ఆ తీర్మానాన్ని బలపరచారు.అనంతరం సభాద్యక్షులు ప్రధానమంత్రి శ్రీ కల్వకుర్తి చంద్రశేఖర రావు గారు భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ తీర్మానాన్ని సభవారు ఏకగ్రీవంగా ఆమోదించారని ప్రకటించారు. దాని కొత్త పేరు ప్రపంచ రాజ్య సమితి అని వెల్లడించారు. త్వరలోనే జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థి నిలబడబోతున్నాడని ప్రకటించారు. అమెరికా దేశంలో భారతీయులు ఎంతో సంఖ్యాబలం కలిగి ఉన్నారనీ, వారిలో తెలుగు వారు అందునా మన తెలంగాణా వారు అత్యధికులు అనీ అన్నారు. వారంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తే మన పార్టీ వాడు అమెరికా అద్యక్షుడు కావటం తథ్యం. దానిని ఆపే మొనగాడు పుట్టలేదు - పుట్టబోడు అనీ కరతాళధ్వానాల మధ్యన సగర్వంగా అన్నారు.  ఈవార్త వెలువడిన వెంటనే అమెరికాలో భారతీయుల సంబురాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియా నుండీ మరికొన్ని దేశాల నుండీ కూడా తమ దేశాల్లోనూ ప్రరాస తప్పకుండా అధికారం చేపట్టాలని కోరుతూ తీర్మానం చేశాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చును. మాది ఫ్రీ కంట్రీ అని అమెరికా అద్యక్షులు వ్యాఖ్యానించారు. రష్యా ఈవిషయంలో స్పందించటానికి ఆసక్తి చూపలేదు. చైనా మాత్రం ఇదంతా ఒక తమాషా అని కొట్టిపారేసింది. ఆస్ట్రేలియా స్పందన ఇంకా తెలియరాలేదు. వారూ స్వాగతిస్తున్నారనే వినబడుతోంది. ఐక్యరాజ్య సమితి కాలంచేసింది అనటాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తప్పు పట్టారు. ఐతే ఐక్యరాజ్య రాజ్యసమితిలో భారత ప్రతినిధి భారతప్రధాని వ్యాఖ్యలను సమర్ధించారు. ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే సమయం ఆసన్నం అయినదనీ చంద్రశేఖర రావు తప్ప నేడు ప్రపంచశాంతి సుస్థిరతలను నెలకొల్పగల మహానాయకుడు ఎవరూ ముల్లోకాల్లోనూ లేరని భారతప్రతినిధి ఉద్ఘాటించారు.

హైదరాబాద్ లో వర్ష బీభత్సం

భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని వణికించింది. నాలుగు గంటల వ్యవధిలో షేక్ పేట్ లో అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కురిసిన కుంభవృష్టికి రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. శివారు ప్రాంతాలు చిగురుటాకుల్లా వణికాయి. పలు చోట్ల డివైడర్లు సైతం మునిగిపోయాయి. కొన్ని చోట్ల డివైడర్లు మునిగిపోయాయి. వర్ష ఉధృతికి ఎదురుగా ఏముందో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాలలో రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. మాదాపూర్‌ లో 12.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉపరితల ద్రోణికి తోడు క్యుములోనింబస్ మేఘాలు తోడవ్వడంతో వాతావరణ శాఖ అంచనాలకు సైతం అందనంత స్థాయిలో హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది.  ఉదయం నుంచీ పొడిగానే ఉన్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా మారిపోయింది.  సాయంత్రం 5.10 గంటలకు ప్రారంభమైన వాన.. ఎడతెరిపి లేకుండా నాలుగు గంటల పాటు కురిసింది.   శేరిలింగంపల్లి, బాచుపల్లి, మియాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, మణికొండ, అత్తాపూర్‌, లంగర్‌హౌజ్‌, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్‌, షేక్‌పేట్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, టోలీచౌకీ సహా  పలు ప్రాంతాలలో అతి భారీ వర్షం కురిసింది.   నీట మునిగిన ఐటీ కారిడార్‌కుండపోత వర్షానికి ఐటీ కారిడార్‌ జలమయమైంది. మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట ప్రాంతాల్లో వరదనీరు చేరింది. శేరిలింగంపల్లి రైల్వే అండర్‌ పాస్‌ వద్ద భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలను జీహెచ్‌ఎంసీ అధికారులు నిలిపివేశారు.   రానున్న రెండు రోజులూ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణి కారణంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతవరణ శాఖ హెచ్చరికతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని నగర పౌరులకు సూచించింది.  

తుగ్లక్ చేష్టలకు హేతువేంటి?

ఒకరు సాధించిన నేత.. మరొకరు దానం చేసిన దాత.. వారిపై జగన్ రెడ్డి అంత పగ ఎందుకు పెంచుకున్నారో అర్థం కాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. తుగ్లక్ పాలనలో కూడా ఇంతటి వికృత చర్యలు చూడలేదంటున్నారు. ఈ అరాచక పాలనకు అడ్డూ అదుపూ లేదా.. మహనీయుల పేర్లు మార్చడమేంటి? అంటూ ఏపీ జనం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. జగన్ చెప్పిన అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఆయా సంస్థలకు ఉన్న పేర్లను మార్చడమేనా అని ప్రతిపక్ష నాయకులు నిలదీస్తున్నారు. జగన్ తుగ్లక్ చర్యలకు అవాక్కవుతున్నారు ఆంధ్రా జనం.  గతంలో 17 ఎకరాల భూమిని ఇచ్చిన అశోక్ గజపతి రాజు తండ్రి పీవీజీ రాజు పేరుతో 1983లో విజయనగరం ఆస్పత్రికి మహారాజా ఆస్పత్రిగా పేరుపెట్టారు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఈ ఆస్పత్రికి మహారాజా పేరు తొలగించిన జగన్ సర్కార్ 'ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి'గా మార్చడాన్ని చూసి జిల్లా జనం  భగ్గుమంటున్నారు.  విపక్ష నేతల కుటుంబీకుల పేర్లతో ఉన్న సంస్థలను వైసీపీ సర్కార్ టార్గెట్ చేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పేరు మార్చడం కక్షపూరిత చర్య అని,  ప్రముఖుల పేర్లపైనే ఇలా పగబట్టినట్టు వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోందని నిప్పులు చెరుగుతున్నారు. దశాబ్దాల నుంచి ప్రభుత్వ సంస్థలకు ఉన్న ప్రముఖుల పేర్లను ఒక్కొక్కటిగా వైసీపీ సర్కార్ తొలగిస్తుండడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతల కుటుంబీకుల పేర్లతో ఉన్న సంస్థలను జగన్ సర్కార్ టార్గెట్ చేయడాన్ని తూర్పారపడుతున్నారు.  విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును జగన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల మార్చేసిన సంగతి తెలిసిందే. వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టింది. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో టీడీపీ నేత పి. అశోక్ గజపతిరాజు వంశీయుల పేరుతో ఉన్న మహారాజా జిల్లా కేంద్ర ఆసుపత్రి పేరును రాత్రికి రాత్రే మార్చేశారు. అర్ధరాత్రి ఉన్నట్టుండి మహారాజా పేరు తొలగించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అంటూ బోర్డు పెట్టేశారు. ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు 1983లో విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్ గజపతి రాజు తండ్రి పీవీజీ రాజు భూములు ఇచ్చారు. దీంతో మహారాజా జిల్లా ఆసుపత్రిగా అప్పట్లో దానికి పేరు పెట్టారు. వైద్య విధాన పరిషత్ లోకి వచ్చిన తర్వాత కూడా మహారాజా జిల్లా ఆసుపత్రిగానే దాని పేరును కొనసాగించారు. విజయనగరంలోని ఆసుపత్రి మొదట తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉండేది. అది ఇరుకుగా ఉండటంతో అభివృద్ధికి అవకాశం లేకపోయింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి కోసం 17 ఎకరాల స్థలాన్ని 1983లో పీవీజీ రాజు ఇచ్చారు. ఇందులోనే ప్రస్తుత జిల్లా కేంద్ర ఆసుపత్రి, భోధనాసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, డీసీహెచ్ఎస్ కార్యాలయం, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఇంజనీరింగ్ విభాగం, క్షయవ్యాధి నివారణ కార్యాలయం, వాక్సినేషన్లు భద్రపర్చే భవనం, ఆయుర్వేద ఆసుపత్రి ఉన్నాయి. ఇలా అనేక విభాగాలు మహారాజా ఆసుపత్రి ప్రాంగణంలో నడుస్తున్నాయి.  టీడీపీ నేతల కుటుంబీకులపేర్లను తొలగిస్తుండడంతో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగింది. అధికార వైసీపీలో కూడా అభ్యంతరం వ్యక్తమైంది. అయినా పేర్ల మార్పు రాజకీయాన్ని   ప్రభుత్వం  కొనసాగిస్తుండడం  జగన్ తుగ్లక్ పాలనకు మరో నిదర్శనం అంటున్నారు.

ప్రజా ఆరోగ్యానికి అదనంగా 12 వేల కోట్లు..

ప్రజారోగ్యానికి ఒడిషా ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైద్యం సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారీగా కేటాయింపులు పెంచింది. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యానికి ప్రాముఖ్యత పెంచడానికి నిర్ణయించుకుంది. ప్రజారోగ్యంలో ఆయుర్వేదం ప్రాముఖ్యతను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.   వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా మరో 12 వేల కోట్ల రూపాయల కేటాయింపులు పెంచింది. ఈ మేరకు ఒడిషా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వైద్య ఆరోగ్య శాఖకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఆయుర్వేదం వేల సంవత్సరాలుగా ప్రభావమంతంగా పని చేస్తోందనీ, సాంప్రదాయ ఆయుర్వేదానికి అనుభవం, ఆధునికతను జోడిస్తే ఆరోగ్య వ్యవస్థ మరింత ప్రభావమంతంగా పని చేస్తుందని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. ప్రజా ఆరోగ్యం విషయంలో 5టీ విధానాన్ని(టీం వర్క్,ట్రాన్స్ పరెన్సీ, టెక్నాలజీ, టైంమేనేజ్ మెంట్, ట్రాన్స్ఫర్మేషన్) అనుసరించాలని  వైద్య అధికారులకు నవీన్ పట్నాయక్ సూచించారు. 5టీ విధానాన్ని అనుసరిస్తే వైద్య రంగం పురోభివృద్ధి చెందడమే కాకుండా వైద్య చికిత్స వ్యయ భారం తగ్గి సామాన్యుడికి అందుబాటులోకి వస్తుందని పట్నాయక్ అన్నారు.   ప్రపంచ దేశాలకు దీటుగా నాణ్య మైన వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని,    వైద్యఖర్చులు పెరగడంతో  వైద్యం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నదని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా  వైద్య ఆరోగ్య శాఖ కు నిధులు పెంచుతూనే ఉన్నామని, ఇప్పుడు మరో ముందడుగు వేసి గతంతో పోలిస్తే రెండింతలు నిధులు పెంచామనీ, అదే గత మూడేళ్లతో పోలిస్తే ప్రణాళికలో అదనంగా  6శాతం నిధులు చేర్చామని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రలో కొనసీమ సీన్ రిపీట్ కు వైసీపీ యత్నాలు

ఏదో విధంగా అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఇందుకోసం అవసరమైతే అంబేడ్కర్ పేరు విషయంలో కోనసీమలో జరిగిన విధ్వంసం సీన్ ను ఉత్తరాంధ్రలో రిపీట్ చేయడానికైనా వెనుకాడని విధంగా వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగానే మూడు రాజధానుల వ్యవహారంపై వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు డ్రామాలు మొదలు పెట్టేశారు. అమరావతే ఏపీకి ఏకైక   రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న అమరావతి టూ అరసవిల్లి పాదయాత్రతో వైసీపీ నేత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతల  గుండెల్లో రైళ్లు పరుగుపెడుతున్నాయి. దీంతో వారేం మాట్లాడుతున్నారో వారికే తెలియని విధంగా వారి మాటలు, ప్రసంగాలు ఉంటున్నాయి.   పాదయాత్ర  ఉత్తరాంధ్రలో ప్రవేశించకుండా అడ్డుకోవాలన్న  ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.  మూడు రాజధానులకు అనుకూలంగా ఉద్యమం అంటున్నారు. పదవులకు రాజీనామాలంటున్నారు. ఈ క్రమంలోనే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వికేంద్రీకరణ సాధన కోసం ఏర్పడిన జేఏసీ ప్రతినిధులకు ధర్మశ్రీ అందజేశారు. అదీ కూడా తప్పుడు ఫార్మాట్‌లో ఉంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.,.టీడీపీ కి వ్యతిరేకంగా మూడు రాజధానుల నిర్ణయానికి అనుగుణంగా రాజీనామా చేస్తున్నానని లేఖ ఇచ్చారు.  రాజీనామా చేసే ఎమ్మెల్యే తన లేఖలో రాజీనామా చేస్తున్నా అని మాత్రమే చేయాలి. వేరే ఏ ఫార్మాట్‌లో రాజీనామా చేసినా అది చెల్లదు. కానీ ధర్మశ్రీ.. కారణాలు, ఉద్దేశాలు రాజీనామా లేఖలో రాశారు. అదికూడా నేరుగా స్పీకర్ కు కాకుండా వికేంద్రీకరణ జేఏసీ ప్రతినిథులకు ఇచ్చారు.   ఇక అంతకు ముందు అమరావతి రైతుల పాదయాత్రపై విద్యాశాఖ మంత్రి, ఉత్తరాంధ్రకే చెందిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ  ఎవరి కోసం ఈ పాదయాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.   మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని మరోసారి చెప్పారు. అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కూడా తన వంతు పాత్ర పోషించారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడం చంద్రబాబుకు, ఆయన అనుచరులకు ఇష్టం లేదంటూ విమర్శించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతే ఏకైక రాజధాని అంటూ మహా పాదయాత్రగా వస్తున్న వారిని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనివ్వబోమంటూ హెచ్చరికలు చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు అవసరమైతే పదవులకు రాజీనామా చేయడానికైనా సిద్ధమంటూ కృష్ణదాస్ చెబుతున్నారు. ఇక కృష్ణదాస్ సోదరుడు, ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా జగన్ అనుమతి ఇస్తే.. విశాఖ రాజధానికి అనుకూలంగా తాను మంత్రి పదవికి రాజీనామా చేసి, వికేంద్రీకరణ ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. విశాఖ రాజధానికి అడ్డొచ్చే వారిని రాజకీయంగా చితక్కొట్టాలంటూ పిలుపు కూడా ఇచ్చారు. ఉత్తరాంధ్ర పీక కోసేందుకే అమరావతి నుంచి అరసవిల్లికి యాత్రగా వస్తున్నారని ధర్మాన మండిపాటు ప్రదర్శించారు. చెన్నై నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్ కు రాజధాని వెళ్తే నోరెత్తని వారు విశాఖకు రాజధాని వస్తుంటే అడ్డు చెబుతారా? అని నిలదీస్తున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటైతేనే ఉత్తరాంధ్రకు భవిష్యత్తు అంటూ ఆ ప్రాంత ప్రజలను మెస్మరైజ్ చేసేందుకు యత్నించారు.  మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ మరో అడుగు ముందుకేసి అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు పోటీగా మరో పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించారు. వివాదాస్పదం అయిన అమరావతి రైతుల పాదయాత్ర ఆపేయాలని అమర్నాథ్ అంటున్నారు.  అమరావతిలోనే రాజధాని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతా వారు కూడా ప్రత్యేక రాష్ట్రాలు కోరతారంటూ ఓ వితండ వాదాన్ని ఆయన తెరపైకి  తెచ్చారు. ఇక వైసీపీ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అయితే..   ‘పాదయాత్ర పేరుతో దండయాత్రకు వచ్చే వారిని అడ్డుకోవాలి’అంటూ పిలుపునిచ్చేందుకు తెగించారు. మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంద్రకు చెందిన వైసీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెట్టేసరికి అలజడులు సృష్టించే విధంగా వైసీపీ నేతలు, మంత్రులు అడ్డగోలు యత్నాలు చేస్తున్నారు. వికేంద్రీకరణకు అనుకూలంగా రాజీనామా చేస్తామని ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు ప్రకటన చేశారు. అయితే వైసీపీ ఎంతగా రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా మహాపాదయాత్రకు ప్రజామద్దతు విశేషంగా లభిస్తోంది. గోదావరి జిల్లాల్లో మూడు రాజధానులకు మద్దతుగా, అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు ఎవరికీ పట్టని తేనీటి సమావేశాల్లా మిగిలిపోవడంతో.. ఇక అలజడులు సృష్టించైనా సరే మహాపాదయాత్రను అడ్డుకోవాలన్న నిర్ణయానికి వైసీపీ వచ్చినట్లు కనిపిస్తున్నది. రెచ్చగొట్టే ప్రకటనల అనంతరం.. కొనసీమ సీన్ ను ఉత్తరాంధ్రలో రిపీట్ చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ ఉన్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తూ వైసీపీ స్పాన్సర్డ్ అల్లర్లు జరిగిన విధంగానే ఇప్పుడు మహాపాదయాత్రను అడ్డుకోవడానికి మరో సారి అలాంటి స్పాన్సర్డ్ అల్లర్లకు వైసీపీ వ్యూహరచన చేస్తున్నదా అన్న అనుమానాలు ప్రజలలో వ్యక్తమౌతున్నాయి.  

రాహుల్ అడుగుజాడల్లో మంత్రి కేటీఆర్?

అడుసు తొక్కనేల,  కాలు కడగనేల అన్నది అందరికి తెలిసిన పాత సామెత.  అయితే, రాజకీయాల్లో ఉన్నవారు, ముఖ్యంగా, తెలంగాణ మంత్రి  కల్వకుట్ల తారక రామారావు (కేటీఆర్) వంటి యంగ్ పోలిటిషియన్స్ తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానంతో తమ అజ్ఞానాన్ని బయటపెట్టు కుంటారు. నిజానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తరచు విమర్శించే రాహుల్ గాంధీ నుంచి ఈ విషయంలో కొత్తగా రాహుల్ గాంధీతో పోటీకి దిగుతున్నకేటీఆర్ వరకు చాలా మందికి, ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలియక పోవచ్చును. అందుకే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ, బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ అనే భ్రమల్లో బీజేపీతో పాటుగా ఆరఎస్ఎస్ ను అదే గాటన కట్టి అసందర్భ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, మహత్మా గాంధీ హత్య ఆర్ఎస్ఎస్ చేసిందని చేసిన ఆరోపణలకు కోర్టు విచారణను ఎదుర్కున్నారు. చివరకు, ఎన్నికల ప్రచార వేడిలో చేసిన విమర్శగా పేర్కొంటూ కోర్టు క్షమాపణ కోరి బయట పడ్డారు. అయినా  ఆయన  దోరణి మారలేదనుకోండి అది వేరే విషయం.  అయితే ఇప్పుడు కొత్తగా  రాహుల్ గాంధీకి దీటుగా జాతీయ నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న కేటేఆర్ ఆరఎస్ఎస్ విషయంలో రాహుల్ గాంధీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. నిజానికి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే కాదు, సంఘ్ వ్యవస్థ, కార్య పద్దతులు, విధి విధానాలు, ఇంకా చాలా సంగతులు  బయటి వారికి అంత  సులభంగా అర్థం కావని అంటారు. అందుకే  ఏడుగురు గుడ్డివారు ఏనుగును చేతులతో తడిమి, వారు తాకిన ఏనుగు శరీర అవయావాల ఆధారంగా ఏనుగును, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వర్ణించిన విధంగా ఆర్ఎస్ఎస్ ను విమర్శించే వారి విమర్శలుంటాయని అంటారు.ఇప్పుడు కేటీఆర్  ఆర్ఎస్ఎ అధినేత మోహన్ భగవత్ గురించి చేసిన  వ్యాఖ్యలు, విమర్శలు కూడా అదే కోవకు చెందుతాయనిపిస్తోందని, ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్నవారు అంటున్నారు.  అదలా ఉంటటే రాహుల్ గాంధీ చరిత్రను మాత్రమే విస్మరిస్తే, కేటీఆర్ నడుస్తున్న చరిత్రను కూడా విస్మరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు. కానీ జాతీయవాద రాజకీయాలను సమర్ధిస్తుంది. ప్రత్యక్ష రాజకీయ కార్యకలాపాలలో ఆర్ఎస్ఎస్ అధినేత కాదు సామాన్య  స్వయం సేవకులు (కార్యకర్తలు) కూడా పాల్గొనరు. ఇది  ఆర్ఎసఎస్ గురించి కనీస అవగాహన ఉన్న ఎవరికైనా తెలిసిన విషయమే. కానీ, మంత్రి కేటీఆర్ కు మాత్రం ఆ మాత్రం అవగాహన కూడా లేనట్లుంది లేదా జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధితో పోటీ పడాలంటే ఆర్ఎస్ఎస్ గురించి ఆ మాత్రంగా అయినా అసత్యాలు ప్రచారం చేయాలని అనుకున్నారో ఏమో కానీ, అందుకే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఎవరని ప్రశ్నించారు. ఆయన, కౌన్సిలర్ గా కూడా గెలవలేదని  గేలి చేశారు, కౌన్సిలర్ గా గెలిచి ఆ తర్వాతనే ఆయన దేశం గురించి మాట్లాడాలని, కేటీఆర్ ఆర్ఎస్ఎస్ అధినేతను దుయ్యబట్టారు.  అయితే నిజంగానే మోహన భగవత ఎవరో తెలియకుండానే కేటీఆర్ ఆయనపై విరుంచు పడ్డారా? ఆయనకున్న శక్తి ఏమిటో తెలియకుండానే కేటీఆర్ ఆయన్ని టార్గెట్ చేశారా? నిజమే మోహన్ భగవత్ కౌన్సిలర్ గా గెలవడం కాదు పోటీకూడా చేయలేదు. ఆయనే కాదు  వందేళ్ళు పూర్తి చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ చరిత్రలో సంఘ అధినేతలు, బాధ్యులు  ఎవరూ ఎన్నికలలో పోటీ చేయలేదు. సంఘ అధినేతలే కాదు, జీవితాలను సంఘ కార్యానికి అంకితం చేసిన వేలాది, లక్షలాది మంది ప్రచారకులు, విభిన్న సామాజిక కార్యక్షేత్రాలలో పనిచేస్తున్న పూర్తి సమయ కార్యకర్తలు ఎవరూ రాజకీయ పదవులను ఆశించలేదు. పోటీ పడలేదు. కానీ, కేవలం రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ప్రస్తుత 303 స్థానలకు బీజేపీ చేరిందంటే, ఆ విజయం వెనక ఉన్నది సంఘ్ శక్తి. ఈ విషయం తెలియకుండా ఆర్ఎస్ఎస్ అధినేతని కౌన్సిలర్ గాకూడా గెలవలేదని గేలి చేయడం  అయితే అది వారి అజ్ఞానం అవుతుంది. కాదంటే, అమాయకత్వం అనిపించుకుంటుంది. సంఘ్ రాజకీయ పార్టీ కాదు,  సంఘ్ శక్తి కేంద్రం. విభిన్న క్షేత్రాలలో వెలుగులు నింపే శక్తి కేంద్రం అంటారు.

ఆగ్ర‌హానికి అమ్మ‌మ్మ బ‌లి!

రాను రాను మ‌నిషిలో స‌హ‌నం పోతోందా లేక ఆగ్ర‌హం రాజ్యం చేస్తోందా అన్న‌ది తేల్చుకోలేని కాలంలో ఉన్నాం. చిన్న చిన్న విష‌యాల‌కీ కోప‌తాపాలు ప్ర‌ద‌ర్శి స్తున్నారు. చిన్న‌పాటి అవ‌గా హ‌నాలోపానికి బీపీలు పెంచు కుని ప్రాణాలు తీసుకోవ‌డ‌మో, తీయడ‌మో చేస్తున్నారు. మ‌రి చ‌దువు, సంస్కారం, నీతి సూత్రా లు, ప్ర‌వ‌చ‌నాల ప్ర‌యోజ‌నం లేద‌నుకోవాలా? ఏమోగాని చిన్న విష‌యంలో ఒక కుర్రాడు అమ్మ‌మ్మ‌ను కొట్టి చంపేసేడు! ఆమె వాడిని బాల్యంనుంచి ఎత్తు కుని తిప్పే ఉంటుంది, అమ్మో, నాన్నో కొడితే దూరంగా తీసికెళ్లి ఏ చాక్లెట్‌తోనో వాడిని ఆనంద‌ప‌రిచి అటూ ఇటూ తిప్పి ఇంటికి తీసుకువ‌చ్చే ఉంటుం ది. జ్వ‌రం వ‌స్తే తిండి మానేసి వాడి మంచం ద‌గ్గ‌రే రెప్ప‌వేయ‌కుండా కూచునే ఉంటుంది. ఇన్నేళ్ల సేవ‌ల‌కు వాడిచ్చిన ప్రేమ‌ పూర్వ‌క బ‌హుమ‌తి మ‌ర‌ణం!  బెంగుళూరులో ఓ చిన్నకుటుంబం..శ‌శిక‌ళ‌, సంజ‌య్‌, శాంత‌కుమారి..త‌ల్లి, కొడుకు, అమ్మ‌మ్మ‌. 2016లో ఓ దుర్ఘ‌ట‌న‌. స‌ర‌దా గా ఓ రోజు సంజ‌య్ బ‌య‌టినుంచీ మంచూరియా తెచ్చాడు. ఇంట్లో చిరుతిళ్లు బోర్ కొ్ట్టి తెచ్చాడ‌నే అనుకోవాలి. ర‌వ్వం త రుచి చూసి వ‌దిలేసి ఉంటే బాగుండేది. కానీ ఆ పెద్దామె అస‌లు రుచి చూడ‌కుండానే, బ‌య‌టినుంచి తెచ్చింది తిన‌డ‌మే మిట‌ని ఆమె ఛాద‌స్తం అంతా ప్ర‌ద‌ర్శించి దాన్ని పారేసింది. అంతే సంజ‌య్‌కి కోపం వ‌చ్చింది. మాటా మాటా పెరిగింది. కోపం న‌షాళా నికి ఎక్కింది. ఆ వెర్రి కోపంలో పెద్దామె త‌నను చిన్న‌ప్ప‌టినుంచీ ఆడించిన అమ్మ‌మ్మ అనే ప్రేమ కూడా వ‌దిలేసుకుని క‌ర్ర తీసుకుని విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్టాడు. శాంత‌కుమారి త‌న మ‌న‌వ‌డి వ‌ల్ల చ‌నిపోయింది. సంజ‌య్‌ మ‌రొక స్నేహితుడితో, త‌ల్లితో క‌లిసి శాంత‌కుమారి శ‌వాన్ని సినిమాల్లో చూపించిన‌ట్టు గోడ‌ప‌గ‌ల‌గొట్టి అందులో పెట్టి మ‌ళ్లీ గోడ‌ను క‌ప్పే రంగులు వేయించాడు. బీరువాలో పుస్త‌కం దాచి తీరిగ్గా ఆ సంగ‌తి వ‌దిలేశారు. కొద్దిరోజుల త‌ర్వాత ఆ యిల్లు వ‌దిలి వెళి పోయారు శ‌శిక‌ళ‌, సంజ‌య్‌.  ఇంటి య‌జ‌మాని 2017లో ఆ ఇల్లు అమ్మ‌కానికో, మ‌ళ్లీ అద్దెకి ఇవ్వ‌డానికో తాళం తీసి గోడ వ్య‌వ‌హారం అనుమానించి ప‌గుల గొడితే అల‌మార్లోంచి బొమ్మ‌లా పెద్దామె శవం కింద‌ప‌డింది. అంతే అంతా ఖంగారుప‌డ్డారు. పోలీసులు చాలారోజులు, చాలా ప్ర‌య‌త్నాలు అయ్యాక‌గాని సంజ‌య్ మ‌హానుభావుడు, మ‌హామ‌న‌వ‌డు దొర‌క‌లేదు. ఏందిరా అయ్యా.. అని నాలుగు పీకి అడిగితే.. అస‌లు సంగ‌తి చెప్పాడు. పోలీసులు, స్టేష‌న్ సెల్లో ఉన్న ఇత‌రులు ఆశ్చ‌ర్య‌పోయారు. కోపానికి క‌ళ్లు మూసుకు పోతాయా అని. ఏదో ఆవేశంలో చేశాడు..రిపెంట్ అయ్యాడ‌నుకున్నారంతా.. అదేమీ లేదు. ఏమీ ఎర‌గ‌న‌ట్టే ఉన్నాడు సంజ‌య్‌.. క‌ట‌క‌టాల్లో.

మహిళల ఆసియా కప్: బంగ్లాను చిత్తుచేసి సెమీస్ చేరిన‌ భారత్ 

షఫాలీ వర్మ 44 బంతుల్లో ఆకర్షణీయమైన 55 పరుగులతో మరోసారి తన మ్యాచ్ విన్నింగ్ పరాక్రమాన్ని కనబరిచారు, భారత్ 59 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి తన నాలు గో మ్యాచ్‌లో గెలిచి శనివారం ఇక్కడ జరిగిన మహిళల ఆసి యా కప్  టీ 20 లో సెమీ-ఫైనల్ స్థానాన్ని కైవసం చేసుకుంది. పాకిస్తాన్‌తో జరిగిన ఓటమిలో ఉదాసీనమైన బ్యాటింగ్ ప్రదర్శన తర్వాత, విమెన్ ఇన్ బ్లూ మెరుగైన ప్రదర్శనతో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. షఫాలీ, కెప్టెన్ స్మృతి మంధాన (38 బం తుల్లో 47) మధ్య 96 పరుగుల భాగ‌స్వామ్యం వారి ప‌దునైన బ్యాటింగ్ స‌త్తా ప్ర‌ద‌ర్శించింది. బంగ్లాదేశ్ 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేయగలిగింది, విజయం కోసం వేటలో ఉన్నట్లు కనిపించ లేదు. ఐదు గేమ్‌లలో 8 పాయింట్లతో, రౌండ్ రాబిన్ దశలో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఏడు జట్ల పట్టికలో అగ్రస్థానం లో ఉంది. వారి మొత్తం టీ20 చరిత్రలో 142 కంటే ఎక్కువ టోటల్‌ను ఎన్నడూ ఛేజ్ చేయలేకపోయిన బంగ్లాదేశ్ తమ వంతు ప్రయత్నం చేసింది, కానీ పటిష్టమైన భారత బౌలింగ్ దాడికి వ్యతిరేకంగా ఊపందుకోలేకపోయింది. పాకిస్తాన్‌పై నాసిరకం ఫీల్డింగ్ ప్రయ త్నం తర్వాత, స్టోర్‌లో తేలికైన పరుగులు లేనందున అది రోజులో రెండు పాయింట్లు మెరుగుపడింది. ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్ల లో 50 పరుగులు కూడా చేయలేకపోయింది మరియు బ్యాక్-10లో 110 కంటే ఎక్కువ పరుగులు చేయడం వారికి వాస్తవంగా అసాధ్యం. స్నేహ రాణా (3 ఓవర్లలో 1/17), దీప్తి శర్మ (4 ఓవర్లలో 2/13) ఎప్పటిలాగే నిష్పక్షపాతంగా ఉండటంతో భారత బౌలర్లలో ఎవరూ మెరుగైన లక్ష్యాన్ని సాధించలేదు. షఫాలీ  లూపీ లెగ్-బ్రేక్‌లు (4 ఓవర్లలో 2/10) కూడా ఆడలేనట్లు అనిపించింది. ట్రాక్ నెమ్మదించడం వల్ల స్పిన్నర్లు పేస్ మారవచ్చు, చాలా బంతులు బ్యాట్‌పైకి రావడం లేదు. ఇద్దరు ఓపెనర్లు ఫర్గానా హోకీ (40 బంతుల్లో 30), ముర్షిదా ఖతున్ (25 బంతుల్లో 21) తొలి తొమ్మిది ఓవర్లలో 45 పరుగులు మాత్రమే జోడించగలిగారు, బంగ్లాదేశ్ నిజానికి ఆ దశలో పోటీ నుండి నిష్క్రమించింది. అంతకుముందు, షఫాలీ ఐదు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు కొట్టినందున ఈ ఫార్మాట్‌లో అత్యంత విధ్వంసక బ్యాటర్‌లలో ఒకరిగా ఎందుకు ఉందో చూపించింది. టీ20 లలో తన నాల్గవ అర్ధ సెంచరీ, షఫాలీ ఫార్మాట్‌లో 1000 పరుగులు కూడా పూర్తి చేసింది. సారథి మంధానతో కలిసి ఈ జంట కేవలం 12 ఓవర్లలో 96 పరుగులు జోడించింది. మంధాన యథావిధిగా ఆరు స్ఫుటమైన బౌండరీలతో మైదానంలో మెరుపులు మెరిపించింది. రివర్స్ స్లాగ్‌కు ప్రయత్నించిన మంధాన, షఫాలి ఇద్దరూ ఔట్ అయిన తర్వాత, బంగ్లాదేశ్ స్కోరింగ్‌కు కొంతకాలం బ్రేకులు వేయ గలిగింది, అయితే ఫామ్‌లో ఉన్న జెమీమా తన క్రికెట్‌లో తెలివిని ఉపయోగించి అంతరాలను కనుగొంది, ఆమె, దీప్తి శర్మ కేవలం 2.3 ఓవర్లలో 29 పరుగులు జోడించి లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఆమె...ఎవరు వదిలిన బాణం ?.. షర్మిల టార్గెట్ ఎవరు?

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో చాలా మంది చాలా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఏపీలో  సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా,ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు?  అనే చర్చ విస్తృతంగా జరిగింది. అప్పట్లోనే  ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’ అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పడు అదొక రకంగా ముగిసిన అధ్యాయం. అక్కడి నుంచి ఆమె చాలా దూరం ‘నడిచి’ వచ్చారు. వైఎస్సార్ టీపీ పేరిట పార్టీని ఏర్పాటు చేశారు.  ఆమె బాటలో ఆమె రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ మరోమారు అదే ప్రశ్న.  షర్మిల ఎవరు విసిరిన బాణం అనే ప్రశ్న మళ్ళీ తెరమీదకు వచ్చింది. అలాగే ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి?  ఆమె రియల్  టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.   నిజానికి ఆమె వెంట ఎవరన్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని పక్కన పెడితే, వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. అంతే కాదు రాష్ట్రంలో కాలు పెట్టింది మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత,  మేనల్లుడు హరీష్ రావు, మరో ఇంటి చుట్టం సంతోష కుమార్ ఇలా రాజకీయాల్లో కీలకంగా ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి  ప్రధాన స్రవంతిలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే ఎక్కువగానే షర్మిల తెరాస ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తున్నారు. మంత్రి కేటీఆర్ రేపెప్పుడో ప్రధాని మోడీ బట్టలు ఊడదీసి నడిబజార్లో నిలబెడతామని అంటున్నారు. కానీ షర్మిల తెరాస ప్రభుత్వం బట్టలు రోజు విప్పుతూనే ఉన్నారు.  అదలా ఉంటే  ప్రజా ప్రస్థానం  పాదయత్ర నుంచి ఆమె ఓ చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళారు. రహస్యంగా ఎవరిని కలిశారో ఏమో కానీ, ప్రత్యక్షంగా మాత్రం సీబీఐ డైరెక్టర్ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలపైనే కాకుండా ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డినిపైనా అవినీతి ఆరోపణలు చేశారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక లక్షా 20 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిబిఐకి ఫిర్యాదు చేశారు. అలాగే, మిషన్ భగీరథ సహా తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు అన్నిట్లోనూ అవినీతి ప్రవహించిందని, ఆన్నిటి పైనా, సిబిఐ విచారణ కోరినట్లు చెప్పారు. నిజానికి, ఆమె ఇప్పడు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కొత్తగా చెప్పిన విషయమంటూ ఏదీ లేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాళేశ్వరం అవినీతి గిరించి ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఇదరినీ మించి మాజీ మంత్రి నాగం జనార్ధన రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి ఎకంగా ఒక బృహత్ గ్రంధానికి సరిపడినంత సమాచారాన్ని మీడియా ముందుంచారు. అసలు ఎవరి దాకానో ఎందుకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంతటివాడు  కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అయినా ఇంతవరకు ఏమీ జరగలేదనుకోండి అది వేరే విషయం.అలాంటప్పుడు షర్మిల ఇంత హఠాత్తుగా సాగుతున్న పాద యాత్రకు బ్రేక్ చెప్పి మరీ ఢిల్లీ ఎందుకెళ్ళారు? సిబిఐకి ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ, ఆమె టార్గెట్ చేసింది ఎవరిని? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  షర్మిల సిబిఐకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం పైనే అయినా, ఆమె టార్గెట్ మాత్రం, బ్రదర్ జగన్ రెడ్డి అనే అనుమానాలు ఇటు తెలంగాణ, అటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో కొంచెం గట్టిగానే వినవస్తున్నాయి. అందుకే, జగన్ రెడ్డికి అత్యంత అప్తుడిగా భావించే మేఘా కృష్ణా రెడ్డిని షర్మిల టార్గెట్ చేశారని అంటున్నారు. అలాగే, సమయ సందర్భాలను బట్టి చూస్తే, బీజేపీ పెద్దలు కేసీఆర్’ను ఇరకాటంలోకి నెట్టేందుకు షర్మిలను రంగంలోకి  దించారని అంటున్నారు. అయితే గతంలో కేఎ పాల్ కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రిని కలిసిన తర్వాతనే కాళేశ్వరం సహా తెరాస ప్రభుత్వ అవినీతికి సంబంధించి సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు షర్మిల అమిత్ షా ను ప్రత్యక్ష్యంగా కలవక పోయినా ఆయన, ఇతర బీజేపీ పెద్దల సూచనల మేరకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టార్గెట్ గా ఇద్దరి అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్న మేఘా కృష్ణా రెడ్డిపై ఆరోపణలు చేశారని అంటున్నారు. అందుకే ఇప్పుడు షర్మిల ఎవరు వదిలిన బాణం? షర్మిల టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి.

గుడ్డి ప్రేమ‌.. గ‌డ్డీ మోయిస్తుంది!

ప‌చ్ఛ‌గ‌డ్డికోసేటి ప‌డుచుపిల్లా... అంటూ నాగేశ్వ‌ర్రావు వాణిశ్రీ‌ని ఆట‌పట్టించే పాట అప్ప‌ట్లో చెవులు కోసు కుని వినేవారు, ఆ ఒక్క‌పాట కోస‌మే జ‌నం వీల‌యిన‌న్నిసార్లు చూశారు. ఆ ప్రేమ పొలంలో గ‌డ్డికోయిస్తూ పెరి గింది. కానీ ఎక్క‌డో ఆస్ట్రేలియాలో లాప్‌టాప్‌మీద చ‌క్క‌గా వేళ్ల‌ను నొప్పుల్లేకుండా టైప్ చేయాల్సిన అమ్మా యి హ‌ర్యానా ప‌ల్లెలో గ‌డ్డిమోసేంత ఫ్రేమ‌లో ప‌డింది!  ప్రేమ‌కు ఏదీ అడ్డులేదు..దేశ స‌రిహ‌ద్దులూ చెరిగిపోతున్నాయి. ఈరోజుల్లో ఎవ‌రు ఎవ‌ర్నయినా ప్రేమించి పెళ్లాడేస్తున్నారు. ప్రేమ పుట్టాలే గాని ప‌క్కింటి రామ‌ల‌క్ష్మ‌యినా, మెల్‌బోర్న్ కోర్ట్‌నీ అయినా దేశాలు దాటా ల్సిందే!  చిత్ర‌మేమంటే మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల్ని విదేశీయులు అమాంతం ఇష్ట‌ప‌డ‌టం, వీల యితే  ఫాలో అవుతున్నారు. చాలామంది విదేశీయులు భార‌త్‌లో ప‌ల్లెల్లో తిర‌గ‌డానికి ఎంతో ఇష్ట‌ప‌డుతు న్నారు. వాళ్ల‌కి న‌గ‌రాల్లో తిరిగి తిరిగి, తిని తినీ  మ‌న ప‌ల్లెల్లోకి వ‌చ్చి ఇడ్లీలు, మిర‌ప‌కాయ బ‌జ్జీలు అంటే నాలిక కోసుకుంటున్నారు! దీనికి తోడు ప్రేమ‌లో ప‌డితే వెంట‌నే మెల్‌బోర్న్‌నీ వ‌దిలి బుందేల్‌ఖండ్ అయినా ప‌రిగెట్టి వ‌చ్చేస్తామంటున్నారు. అదీ సంగ‌తి అదీ ప్రేమ శ‌క్తి, అదే కోర్ట్‌నీని బీహార్‌కి లాక్కొచ్చింది! ల‌వ్లీన్ అనే హ‌ర్యానా కుర్రాడి భార్య కోర్ట్‌నీ. ఆమె త‌న భ‌ర్త‌తో హ‌ర్యానా గ్రామంలోనే ఉండ‌డానికి ఇష్ట‌ప‌డి వ‌చ్చేసింది. అత్త‌మామ‌ల‌కు హిందీ త‌ప్ప మ‌రోటి రాదు. ఈమెకు ఇంగ్లీషు.. మ‌ధ్య‌లో ట్రాన్స్‌లేట‌ర్‌గా భ‌ర్త‌.. ఎన్నాళ్లు జోడు ప‌ద‌వులు న‌డుపుతాడో మ‌రి. కానీ అతి త్వ‌ర‌లోనే అమ్మాయికి ఎంతో కొంత హిందీ నేర్పితే పెద్ద‌వాళ్లిద్ద‌రూ బ‌తికిపోతారు. ప్ర‌స్తుతానిక‌యితే పొలాలు, పంట‌లు పండించ‌డం, కోత‌లు రైతాంగం గురించి అబ్బాయిగారు త‌న ఇంగ్లీషు భార్యామ‌ణికి చాలానే చెప్పేశాడ‌ట‌. అందుకే ఆమె అత్యుత్సాహంతో పొలంలో వాణిశ్రీ‌లా గ‌డ్డిమోపు త‌ల‌మీదెట్టుకుని మ‌రీ న‌డ‌వ‌డం బాగా ప్రాక్టీస్ చేసింది. కొత్త ఎప్పుడూ వింతే! గ‌డ్డి, గ‌డ్డిమోపులు, గేదెలు, పొలాలు మ‌న‌కి పాత‌, కాస్తంత చిరాకేమో.. ఆ పిల్ల‌కి మాత్ర మ‌హా స‌ర‌దా!

గింజుపల్లి అభిమానం హిమ‌వ‌త్ప‌ర్వ‌త స‌మానం

అభిమానం కొండ‌తోనే పోలుస్తారు. ఇక అంత‌కంటే వీరాభిమానం ఉండ‌ద‌ని. కొంద‌రు త‌మ అభిమాన న‌టుడు చిత్రం వంద‌రోజులు ఆడాల‌ని తిరుమ‌ల‌కి వెళ‌తారు, మ‌రికొంద‌రు ధోనీ సిక్స్ కొట్టి గెలిపించా ల‌ని ఉప‌వాస‌దీక్ష‌ప‌డ‌తారు, ఇంకొంద‌రు పార్టీ గెల‌వాల‌ని చెప్పుల్లేకుండా ఎంత‌దూర‌మ‌యినా న‌డు స్తారు. గింజుప‌ల్లి శివ‌ప్ర‌సాద్ అనే పెద్దాయ‌న మాత్రం ఏకంగా వ‌య‌సుకు, శ‌క్తికీ మించి ఏకంగా హిమాల‌ యాన్ని అవ‌రోధించారు. వీరాభిమానం అలానే ఉంటుంది.. స‌చిన్ క‌యినా, టీడీపీ అధినేత చంద్ర‌ బాబుక‌యినా! ప్ర‌జ‌ల నాయ‌కునిగా, రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా, నిరంత‌రం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుప‌డిన నాయ‌ కునిగా నారాచంద్ర‌బాబునాయుడికి  నిస్సందేహంగా లెక్క‌లేనంత‌మంది  వీరాభిమానులు ఉన్నారు. టీడీపీ స్థాపించి దేశ రాజ‌కీయాల్లో ఒక ఒర‌వ‌డిని సృష్టంచిన ఎన్టీఆర్ అడుగుజాడ‌ల్లో ప‌య‌నిస్తూ ఎన్నో ఒడుదు డుకుల‌ను అధిగ‌మిస్తూ సుదీర్ఘ పాల‌కునిగా ప్ర‌తిష్ట, ప్ర‌జాద‌ర‌ణ పొందిన నాయ‌కుడు చంద్ర‌బాబు.  ప్ర‌స్తుత రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆయ‌న అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌జ‌లే కోరు కుంటున్నారు. ప‌రిస్థి తులు ఊహించనివిధంగా మారిపోయాయి. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌లు అంత‌గా ఆశించ‌డంలేదు. మూడేళ్ల పాల‌న‌కే విసిగెత్తారు. ప్ర‌జ‌లు, ప్ర‌తినిధుల‌కు కూడా అసంతృప్తే ఉంది. హామీలు అన్నీవ‌దిలేసి స్వార్ధ రాజకీయాల‌తో కాలం గ‌డిపేస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ అభిమా నులు రాష్ట్ర ప‌రిస్థితుల‌ను ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా చంద్ర‌బాబు పాల‌నే చాలా మెరుగు అంటున్నారు. ఆయ‌నే తిరి గి వ‌చ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసికెళ్లాల‌ని కొండంత ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. పార్టీ గ్రామ గ్రామాల్లో మ‌ళ్లీ బ‌లం పుంజుకుని, కొత్త శ‌క్తితో ఉర‌క‌లు వేస్తోంది. ఇక బాబు రాక అనివార్య‌మ న్న‌దే అంద‌రి మ‌న‌సులో మాట‌.  అభిమానాన్ని కొల‌వ‌లేం. మ‌న‌సులో బొమ్మ‌యిన పాల‌కుడు దేవుడ‌యిన‌పుడు దేవుడు శిఖ‌రాగ్రాన మెరిసి పోతూండాలి, అంద‌రినీ చ‌ల్ల‌గా చూడాలి అన్న దృష్టితోనే చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రి పీఠం మీద కూర్చోబెట్టాల‌న్న త‌ల‌పు అంత‌టా విన‌ప‌డుతోంది. అదే మ‌న‌సులోని భావాన్ని అదే ఆకాంక్ష‌ను గింజుప‌ల్లి శివ‌ప్ర‌సాద్ ఏకంగా హిమాల‌యాల మీద‌కి వెళ్లి అక్క‌డ తెలుగుదేశం ఫ్లెక్సీని ప్ర‌ద‌ర్శించి లోకా నికి తెలియ జేశారు. వ‌య‌సు 80 ఉండ‌వ‌చ్చు, కానీ మ‌న‌సు అభిమాన నాయ‌కునికి అర్పించారు, అదే బ‌లం, శ‌క్తినీ ప్ర‌సాదించింది, అందుకే గింజుప‌ల్లి కేవ‌లం 24ఏళ్ల కుర్రాడిలా మంచుప‌ర్వ‌తాన్ని అమాం తం ఎక్కి త‌న హిమ‌వ‌త్ప‌ర్వ‌తం అంత అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించారు.   త‌న అభిమాని అందునా వ‌య‌సు మ‌ళ్లీనా ఊహించ‌ని ఘ‌న‌కార్యాన్ని చేయ‌డం తెలుసుకుని టీడీపీ అధి నేత చంద్ర‌బాబు ఎంతో ముచ్చ‌ట‌ప‌డ్డారు. గింజుప‌ల్లి సాధించిన ఘ‌న‌త‌ను తెలుసుకుని చంద్ర‌బాబు  ఎంతో ఆనందంతో ట్వీట్‌లో స్పందించారు గింజుపల్లి శివప్రసాద్ వయసు 80 ఏళ్లని తెలిపారు. ఆ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల ఎత్తు వరకు అధిరోహించారని, అక్కడ టీడీపీ ఫ్లెక్సీని ప్రదర్శించారని వివరించారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్ గారికి అభినందనలు తెలుపుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.  తాను గతంలో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర చేపట్టానని తెలిపిన చంద్రబాబు... ఆ పాదయాత్రలో శివప్రసాద్ తనతో కలిసి అడుగులేశారని గుర్తు చేసుకున్నారు. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచారని శివప్రసాద్ను కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.  కాగా, ఆ వీడియోలో శివప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రం కష్టాల్లో ఉందని అన్నారు. విజన్ ఉన్న చంద్రబాబు వంటి సమర్థుడైన నాయకుడిని గెలిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.