గుడ్డి ప్రేమ.. గడ్డీ మోయిస్తుంది!
posted on Oct 8, 2022 @ 5:06PM
పచ్ఛగడ్డికోసేటి పడుచుపిల్లా... అంటూ నాగేశ్వర్రావు వాణిశ్రీని ఆటపట్టించే పాట అప్పట్లో చెవులు కోసు కుని వినేవారు, ఆ ఒక్కపాట కోసమే జనం వీలయినన్నిసార్లు చూశారు. ఆ ప్రేమ పొలంలో గడ్డికోయిస్తూ పెరి గింది. కానీ ఎక్కడో ఆస్ట్రేలియాలో లాప్‌టాప్‌మీద చక్కగా వేళ్లను నొప్పుల్లేకుండా టైప్ చేయాల్సిన అమ్మా యి హర్యానా పల్లెలో గడ్డిమోసేంత ఫ్రేమలో పడింది!
ప్రేమకు ఏదీ అడ్డులేదు..దేశ సరిహద్దులూ చెరిగిపోతున్నాయి. ఈరోజుల్లో ఎవరు ఎవర్నయినా ప్రేమించి పెళ్లాడేస్తున్నారు. ప్రేమ పుట్టాలే గాని పక్కింటి రామలక్ష్మయినా, మెల్‌బోర్న్ కోర్ట్‌నీ అయినా దేశాలు దాటా ల్సిందే! చిత్రమేమంటే మన సంస్కృతీ సంప్రదాయాల్ని విదేశీయులు అమాంతం ఇష్టపడటం, వీల యితే ఫాలో అవుతున్నారు. చాలామంది విదేశీయులు భారత్‌లో పల్లెల్లో తిరగడానికి ఎంతో ఇష్టపడుతు న్నారు. వాళ్లకి నగరాల్లో తిరిగి తిరిగి, తిని తినీ మన పల్లెల్లోకి వచ్చి ఇడ్లీలు, మిరపకాయ బజ్జీలు అంటే నాలిక కోసుకుంటున్నారు! దీనికి తోడు ప్రేమలో పడితే వెంటనే మెల్‌బోర్న్‌నీ వదిలి బుందేల్‌ఖండ్ అయినా పరిగెట్టి వచ్చేస్తామంటున్నారు. అదీ సంగతి అదీ ప్రేమ శక్తి, అదే కోర్ట్‌నీని బీహార్‌కి లాక్కొచ్చింది!
లవ్లీన్ అనే హర్యానా కుర్రాడి భార్య కోర్ట్‌నీ. ఆమె తన భర్తతో హర్యానా గ్రామంలోనే ఉండడానికి ఇష్టపడి వచ్చేసింది. అత్తమామలకు హిందీ తప్ప మరోటి రాదు. ఈమెకు ఇంగ్లీషు.. మధ్యలో ట్రాన్స్‌లేటర్‌గా భర్త.. ఎన్నాళ్లు జోడు పదవులు నడుపుతాడో మరి. కానీ అతి త్వరలోనే అమ్మాయికి ఎంతో కొంత హిందీ నేర్పితే పెద్దవాళ్లిద్దరూ బతికిపోతారు. ప్రస్తుతానికయితే పొలాలు, పంటలు పండించడం, కోతలు రైతాంగం గురించి అబ్బాయిగారు తన ఇంగ్లీషు భార్యామణికి చాలానే చెప్పేశాడట. అందుకే ఆమె అత్యుత్సాహంతో పొలంలో వాణిశ్రీలా గడ్డిమోపు తలమీదెట్టుకుని మరీ నడవడం బాగా ప్రాక్టీస్ చేసింది. కొత్త ఎప్పుడూ వింతే! గడ్డి, గడ్డిమోపులు, గేదెలు, పొలాలు మనకి పాత, కాస్తంత చిరాకేమో.. ఆ పిల్లకి మాత్ర మహా సరదా!