ఆగ్రహానికి అమ్మమ్మ బలి!
posted on Oct 8, 2022 @ 9:57PM
రాను రాను మనిషిలో సహనం పోతోందా లేక ఆగ్రహం రాజ్యం చేస్తోందా అన్నది తేల్చుకోలేని కాలంలో ఉన్నాం. చిన్న చిన్న విషయాలకీ కోపతాపాలు ప్రదర్శి స్తున్నారు. చిన్నపాటి అవగా హనాలోపానికి బీపీలు పెంచు కుని ప్రాణాలు తీసుకోవడమో, తీయడమో చేస్తున్నారు. మరి చదువు, సంస్కారం, నీతి సూత్రా లు, ప్రవచనాల ప్రయోజనం లేదనుకోవాలా? ఏమోగాని చిన్న విషయంలో ఒక కుర్రాడు అమ్మమ్మను కొట్టి చంపేసేడు! ఆమె వాడిని బాల్యంనుంచి ఎత్తు కుని తిప్పే ఉంటుంది, అమ్మో, నాన్నో కొడితే దూరంగా తీసికెళ్లి ఏ చాక్లెట్‌తోనో వాడిని ఆనందపరిచి అటూ ఇటూ తిప్పి ఇంటికి తీసుకువచ్చే ఉంటుం ది. జ్వరం వస్తే తిండి మానేసి వాడి మంచం దగ్గరే రెప్పవేయకుండా కూచునే ఉంటుంది. ఇన్నేళ్ల సేవలకు వాడిచ్చిన ప్రేమ పూర్వక బహుమతి మరణం!
బెంగుళూరులో ఓ చిన్నకుటుంబం..శశికళ, సంజయ్, శాంతకుమారి..తల్లి, కొడుకు, అమ్మమ్మ. 2016లో ఓ దుర్ఘటన. సరదా గా ఓ రోజు సంజయ్ బయటినుంచీ మంచూరియా తెచ్చాడు. ఇంట్లో చిరుతిళ్లు బోర్ కొ్ట్టి తెచ్చాడనే అనుకోవాలి. రవ్వం త రుచి చూసి వదిలేసి ఉంటే బాగుండేది. కానీ ఆ పెద్దామె అసలు రుచి చూడకుండానే, బయటినుంచి తెచ్చింది తినడమే మిటని ఆమె ఛాదస్తం అంతా ప్రదర్శించి దాన్ని పారేసింది. అంతే సంజయ్‌కి కోపం వచ్చింది. మాటా మాటా పెరిగింది. కోపం నషాళా నికి ఎక్కింది. ఆ వెర్రి కోపంలో పెద్దామె తనను చిన్నప్పటినుంచీ ఆడించిన అమ్మమ్మ అనే ప్రేమ కూడా వదిలేసుకుని కర్ర తీసుకుని విచక్షణా రహితంగా కొట్టాడు. శాంతకుమారి తన మనవడి వల్ల చనిపోయింది. సంజయ్ మరొక స్నేహితుడితో, తల్లితో కలిసి శాంతకుమారి శవాన్ని సినిమాల్లో చూపించినట్టు గోడపగలగొట్టి అందులో పెట్టి మళ్లీ గోడను కప్పే రంగులు వేయించాడు. బీరువాలో పుస్తకం దాచి తీరిగ్గా ఆ సంగతి వదిలేశారు. కొద్దిరోజుల తర్వాత ఆ యిల్లు వదిలి వెళి పోయారు శశికళ, సంజయ్.
ఇంటి యజమాని 2017లో ఆ ఇల్లు అమ్మకానికో, మళ్లీ అద్దెకి ఇవ్వడానికో తాళం తీసి గోడ వ్యవహారం అనుమానించి పగుల గొడితే అలమార్లోంచి బొమ్మలా పెద్దామె శవం కిందపడింది. అంతే అంతా ఖంగారుపడ్డారు. పోలీసులు చాలారోజులు, చాలా ప్రయత్నాలు అయ్యాకగాని సంజయ్ మహానుభావుడు, మహామనవడు దొరకలేదు. ఏందిరా అయ్యా.. అని నాలుగు పీకి అడిగితే.. అసలు సంగతి చెప్పాడు. పోలీసులు, స్టేషన్ సెల్లో ఉన్న ఇతరులు ఆశ్చర్యపోయారు. కోపానికి కళ్లు మూసుకు పోతాయా అని. ఏదో ఆవేశంలో చేశాడు..రిపెంట్ అయ్యాడనుకున్నారంతా.. అదేమీ లేదు. ఏమీ ఎరగనట్టే ఉన్నాడు సంజయ్.. కటకటాల్లో.