రాంచీలో రెచ్చిపోయిన శ్రేయస్, కిషన్...రెండో వన్డేలో భారత్ విజయం
posted on Oct 9, 2022 @ 9:43PM
రాంచీలో బ్యాటర్లు హెండ్రిక్స్, మార్కరమ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ విన్యాసం ఝార్ఖండ్ క్రికెట్ అభిమానులకు ధోనీ ధనాధన్‌ను గుర్తు చేశారు. ధోనీ తర్వాత వారికి అంతటా అద్భుత డాషింగ్ బ్యటింగ్ ఆ నలుగురూ ప్రదర్శించడం చూసి తీరాల్సిందే! శ్రేయస్ సెంచరీ దంచడం, కిషన్ దూకుడు బ్యాటింగ్‌తో 96 పరుగులతో భారత్ రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ధాటి తర్వాత భారత్ అంత స్కోర్ అధిగమిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమ య్యాయి.కానీ ఇషాన్, శ్రేయస్ దంచికొట్టడం మర్కరమ్, హెండ్రిక్స్‌ల పరుగుల వరదను ప్రేక్షకులు మర్చిపోయారు. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేయగా భారత్ 3 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
ఇక్కడ భారత్ తో తలపడిన రెండో వన్డే లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసింది. మర్క రమ్ 79, హెండ్రిక్స్ 74 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ ఆరంభం బెరుగ్గానే ఉంది. భారత్ పేసర్ సిరాజ్ బ్యాటర్లను ఖంగారు పెట్టా డు. మొదటి మ్యాచ్‌లో అదరగొట్టిన డీకాక్ కేవలం 5 పరుగులకే సిరాజ్‌కు దొరికాడు. జట్టు స్కోర్ పది పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. మొదటి ఐదు ఓవర్లలో దక్షిణాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. మొదటి పవర్‌ప్లే 10 ఓవర్ ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. అప్పటికి జట్టు స్కోర్ పరుగులెత్తి స్తున్న మలాన్ వెను దిరిగాడు. అతను 31 బంతుల్లో 25 పరుగులు చేశాడు. 12 వ ఓవర్‌కి 50 పరుగులు పూర్తి చేసింది. అపుడు వచ్చాడు మర్క రమ్ రంగం లోకి. వస్తూనే ధాటిగా ఆడటం మొద లెట్టా డు. ఫలితంగా జట్టు 15 ఓవర్లకు 60 పరుగులు చేసింది. 20 ఓవర్లు అయ్యే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వంద పరుగులు 20 ఓవర్లలో పూర్తిచేసింది. హెండ్రిక్స్, మర్క రమ్ కలిసి 50 పరుగులు 60 బంతుల్లో చేశారు.26 ఓవర్లలో దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 130 పరుగు లు చేసింది. అందుకు ప్రధానం గా హెండ్రిక్స్ వీరబాదుడు తోడయింది. అతను భారత్‌పై మొదటి అర్ధసెంచరీని 58 బంతుల్లో చేశాడు. కాగా 39వ ఓవర్లో జట్టు స్కోర్ 200 పరుగులు దాటింది. ఆ వెంటనే మర్కరమ్ ఎట్టకేలకు వెనుదిరిగాడు. అతను 88 బంతుల్లో 79 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్ అతనిలో ఎవ్వరూ నిలబెట్టలేకపోయారు. 40 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగుల చేసిం ది. 45వ ఓవర్‌కి 252 పరుగులు చేసింది. 50 ఓవర్ పూర్తయ్యే సరికి దక్షిణా ఫ్రికా 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో సిరాజ్ 3.8 ఓవర్ల లో 3 వికెట్లు తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 6.67 రన్‌రేట్‌తో 60 పరుగు లిచ్చాడు.
భారత్ 279 పరుగుల లక్ష్యంతో దిగింది. మొదటి ఓవర్లో పరుగులు చేయలేదు కానీ రెండో ఓవర్నుంచీ పరుగులు సాధించారు. భారత్ 28 పరుగుల వద్ద కెప్టెన్ ధావన్ వెనుదిరిగాడు. అతను కేవలం 13 పరుగులే చేశాడు. రెండో వికెట్ గా గిల్ 26 పరుగులకే జట్టు స్కోర్ 48 వద్ద పెవిలియన్ చేరాడు. వీరిద్దరి స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మెరుపులు ప్రదర్శించారు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఆడుకున్నారు. ఎవరు ఎలా వేయాలో అర్ధంగాని పరిస్థితి ఏర్పడింది. ఫీల్డర్లు చమటో ర్చారు కానీ భారత్ ద్వయం ధాటిని నిలువరించలేకపోయారు. భారత్ పది ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 41పరుగులు చేసింది. 15 ఓవర్లకు భారత్75పరుగులు చేసింది. 21ఓవర్లో భారత్ వందపరుగులు పూర్తి చేసింది. అప్పటికి అయ్యర్ 26, కిషన్ 42 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 50 పరుగులు 72 బంతుల్లో చేశారు. ఆ తర్వాత కిషన్ మరింత దూకుడు పెంచి తన మొదటి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే అయ్యర్ కూడా పూర్తి చేశాడు. అయ్యర్‌కి ఇది 6 ఇన్నింగ్స్‌లో 5వ అర్ధసెంచరీ. ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను బౌలింగ్ మర్చేలా బాదారు. ఇద్దరూ 3వ వికెట్‌కు 107 బంతుల్లో 100 పరుగులు చేశారు. భారత్ 150 పరుగులు 27 ఒవర్లలో పూర్త య్యాయి. భారత్ సూపర్స్టార్స్ ఇద్దరూ 140 బంతుల్లో 150 పరుగులను ఇన్నింగ్స్ 31ఓవర్లో పూర్తిచేయడంలో అద్భుత ప్రతిభ కనపర్చారు. భారత్ 200 పరుగులు 33వ ఓవర్లో పూర్తయ్యాయి. 35వ ఓవర్లో ఓవర్లో ఇషాన్ కిషన్ వెనుదిరిగాడు. తన సెంచరీకి ఏడు పరుగుల దూరంలో అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 209 పరుగులు. ఆ తర్వాత అయ్యర్ మరింత రెచ్చిపోయి విజయాన్ని అందించాడు. అయ్యర్ 113 పరు గులు తన వన్డే కెరీర్‌లో రెండవ అత్యధిక స్కోర్. శ్రేయస్ అయ్యర్ 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. కిషన్, అయ్యర్ ఇద్దరూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు.