గింజుపల్లి అభిమానం హిమవత్పర్వత సమానం
posted on Oct 8, 2022 @ 4:40PM
అభిమానం కొండతోనే పోలుస్తారు. ఇక అంతకంటే వీరాభిమానం ఉండదని. కొందరు తమ అభిమాన నటుడు చిత్రం వందరోజులు ఆడాలని తిరుమలకి వెళతారు, మరికొందరు ధోనీ సిక్స్ కొట్టి గెలిపించా లని ఉపవాసదీక్షపడతారు, ఇంకొందరు పార్టీ గెలవాలని చెప్పుల్లేకుండా ఎంతదూరమయినా నడు స్తారు. గింజుపల్లి శివప్రసాద్ అనే పెద్దాయన మాత్రం ఏకంగా వయసుకు, శక్తికీ మించి ఏకంగా హిమాల యాన్ని అవరోధించారు. వీరాభిమానం అలానే ఉంటుంది.. సచిన్ కయినా, టీడీపీ అధినేత చంద్ర బాబుకయినా!
ప్రజల నాయకునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన నాయ కునిగా నారాచంద్రబాబునాయుడికి నిస్సందేహంగా లెక్కలేనంతమంది వీరాభిమానులు ఉన్నారు. టీడీపీ స్థాపించి దేశ రాజకీయాల్లో ఒక ఒరవడిని సృష్టంచిన ఎన్టీఆర్ అడుగుజాడల్లో పయనిస్తూ ఎన్నో ఒడుదు డుకులను అధిగమిస్తూ సుదీర్ఘ పాలకునిగా ప్రతిష్ట, ప్రజాదరణ పొందిన నాయకుడు చంద్రబాబు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ప్రజలే కోరు కుంటున్నారు. పరిస్థి తులు ఊహించనివిధంగా మారిపోయాయి. వైసీపీ ప్రభుత్వం ప్రజలు అంతగా ఆశించడంలేదు. మూడేళ్ల పాలనకే విసిగెత్తారు. ప్రజలు, ప్రతినిధులకు కూడా అసంతృప్తే ఉంది. హామీలు అన్నీవదిలేసి స్వార్ధ రాజకీయాలతో కాలం గడిపేస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ అభిమా నులు రాష్ట్ర పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా చంద్రబాబు పాలనే చాలా మెరుగు అంటున్నారు. ఆయనే తిరి గి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసికెళ్లాలని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. పార్టీ గ్రామ గ్రామాల్లో మళ్లీ బలం పుంజుకుని, కొత్త శక్తితో ఉరకలు వేస్తోంది. ఇక బాబు రాక అనివార్యమ న్నదే అందరి మనసులో మాట.
అభిమానాన్ని కొలవలేం. మనసులో బొమ్మయిన పాలకుడు దేవుడయినపుడు దేవుడు శిఖరాగ్రాన మెరిసి పోతూండాలి, అందరినీ చల్లగా చూడాలి అన్న దృష్టితోనే చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలన్న తలపు అంతటా వినపడుతోంది. అదే మనసులోని భావాన్ని అదే ఆకాంక్షను గింజుపల్లి శివప్రసాద్ ఏకంగా హిమాలయాల మీదకి వెళ్లి అక్కడ తెలుగుదేశం ఫ్లెక్సీని ప్రదర్శించి లోకా నికి తెలియ జేశారు. వయసు 80 ఉండవచ్చు, కానీ మనసు అభిమాన నాయకునికి అర్పించారు, అదే బలం, శక్తినీ ప్రసాదించింది, అందుకే గింజుపల్లి కేవలం 24ఏళ్ల కుర్రాడిలా మంచుపర్వతాన్ని అమాం తం ఎక్కి తన హిమవత్పర్వతం అంత అభిమానాన్ని ప్రదర్శించారు.
తన అభిమాని అందునా వయసు మళ్లీనా ఊహించని ఘనకార్యాన్ని చేయడం తెలుసుకుని టీడీపీ అధి నేత చంద్రబాబు ఎంతో ముచ్చటపడ్డారు. గింజుపల్లి సాధించిన ఘనతను తెలుసుకుని చంద్రబాబు ఎంతో ఆనందంతో ట్వీట్‌లో స్పందించారు
గింజుపల్లి శివప్రసాద్ వయసు 80 ఏళ్లని తెలిపారు. ఆ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల ఎత్తు వరకు అధిరోహించారని, అక్కడ టీడీపీ ఫ్లెక్సీని ప్రదర్శించారని వివరించారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్ గారికి అభినందనలు తెలుపుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.
తాను గతంలో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర చేపట్టానని తెలిపిన చంద్రబాబు... ఆ పాదయాత్రలో శివప్రసాద్ తనతో కలిసి అడుగులేశారని గుర్తు చేసుకున్నారు. సంకల్పం ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచారని శివప్రసాద్ను కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.
కాగా, ఆ వీడియోలో శివప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రం కష్టాల్లో ఉందని అన్నారు. విజన్ ఉన్న చంద్రబాబు వంటి సమర్థుడైన నాయకుడిని గెలిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.