వాణిజ్యం పై రూపాయి విలువ తరుగుదల ప్రభావం...చర్చించనున్న పార్లమెంటరీ కమిటీ
posted on Nov 1, 2022 @ 12:33PM
వాణిజ్యం పై రూపాయి విలువ తరుగుదల ప్రభావం గురించి చర్చించడానికి పార్లమెంటరీ ప్యానల్ సంసిద్ధత వ్యక్తం చేయనుంది. అయితే దీని గురించి బిజేపీ సభ్యులు వ్యతిరేకించవచ్చుననే అభిప్రా యాలు లేకపోలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ నాయకత్వంలో వాణిజ్య వ్యవహారాలపై పార్టమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేక అంశాలు చర్చించేందుకు సోమవారం సమావేశ మయింది. కమిటీ కొత్తగా రూపొందించిన తర్వాత సమావేశం కావడం ఇదే తొలిసారి. సమావేశంలో సంఘ్వీ వాణిజ్యంపై రూపాయి విలువ తరుగుదల ప్రభావం కూడా చర్చించా ల్సిన అంశంగా ప్రతి పాదించారు.
అయితే సంఘ్వీ ప్రతిపాదనను ప్యానల్ సభ్యుడు, బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే వ్యతిరేకించారు. రూపా యి విలువ తరగడమన్నది శాశ్వతం కాదు, కేవలం తాత్కాలికమే గనుక ఆ అంశం కంటే వాణిజ్యానికి సంబందించిన ఇతర కీలకాంశాలు చర్చించడమే మేలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఇతర బీజేపీ ఎంపీలు రాజు బిస్త, రాజకుమార్ చాహార్, దీపక్ ప్రకాష్ సమర్ధించారు. కానీ ఇతర ప్రతిపక్ష ఎంపీలందరూ సంఘ్వీ ప్రతిపాదించాల్సినది చర్చించాల్సిన అంశమేనని అన్నారు. కనుక వాణిజ్యం సంస్థలు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ఈ అంశంలో తమ అభిప్రాయాలను కోరవచ్చు. వారి అభిప్రాయాలు, సూచనల ఆధారంగానే చర్చ జరగవచ్చు.
ఈ ఏడాది ఆరంభం నుంచే రూపాయి విలువ తరుగుదలకు గురవుతూనే ఉంది. యు. ఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుదల తర్వాత విదేశీ నిధుల ప్రవాహానికి దారితీసిన తరువాత ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో కలిసి రూపాయి ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఒత్తిడిలో ఉంది. దేశీయ కరెన్సీ అక్టోబర్‌లో యు. ఎస్ డాలర్‌తో పోలిస్తే దాని జీవితకాల కనిష్ట స్థాయి 83కి పడిపోయింది మరియు ఇది రు.82 పైన కొనసాగుతోంది.