రంభ కారు ప్రమాదం..,కుమార్తె సీరియస్
posted on Nov 1, 2022 @ 11:20AM
మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఒకప్పటి టాప్ హీరోయిన్ రంభ కుటుంబ సమేతంగా వెళుతోన్న కారు ప్రమాదానికి గురయింది. మంగళవారం కెనడాలో జరిగిన ఈ ప్రమాదంలో అందరికీ గాయాలయ్యాయని, రంభ కుమార్తె నాషా మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నారని సమాచారం.
రంభ కొంతకాలం నుంచీ తన కుటుంబంతో కెనడాలో ఉంటున్న సంగతి తెలిసిందే. కారులో ఉన్న రంభ, ఆమె పెద్ద కూతురు, అలాగే ఆమె నాన్నికి స్పల్ప గాయాలు అయ్యాయి. కానీ చిన్న కూతురు సాషాకి తీవ్రగాయాలు అవ్వడంతో హాస్పిటల్‌కి తరలించారు. సాషాకి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయం తెలిపుతూ నటి రంభ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో.. కూతుర్లను స్కూల్ నుంచి తీసుకొస్తుండగా.. ఓ జంక్షన్ వద్ద మా కారుని మరో కారు ఢికొట్టింది. అప్పుడు నేను నా పిల్లలు, అలాగే నా నానీ కూడా నాతోనే ఉన్నారు. అందరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. కానీ నా కూతురు సాషా ఇంకా హాస్పిటల్‌లోనే ఉంది. మా బ్యాడ్ టైమ్. దయచేసి మా కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలు మాకు చాలా ముఖ్యమన్నారు.