ఓడిపోయినందుకు ఉత్తమ్ తెగ ఫీలవుతున్నారట..

తెలంగాణ వరంగల్ ఉపఎన్నికల రిజల్ట్ చూసి అన్నిపార్టీలు షాకయ్యాయి. అయితే రాజకీయాల్లో గెలుపు, ఓటములు కామన్ కాబట్టి నాయకులు కూడా వాటిని లైట్ తీసుకొని ఎప్పటిలాగే వారి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ ఈ వరంగల్ ఫలితాల వల్ల ఒక నేత మాత్రం బయటకి రావడానికి కూడా ఇష్టపడటం లేదట. అతను ఎవరనుకుంటున్నారా.. టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికులు జరిగి.. ఫలితాలు వచ్చి దాదాపు నాలుగు రోజులు పైన అవుతున్నా ఆయన మాత్రం ఇప్పటి వరకూ ఇంటి నుండి బయటకు రాలేదు.. ఎటువంటి మీడియా సమావేశాల్లో పాల్గొనలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయిన కారణంగా ఉత్తమ్ బయటకు రావడానికి కూడా ఇష్టపడటం లేదట. వరంగల్ ఉపఎన్నిక అభ్యర్ధి దగ్గర నుండి.. ఎన్నిక ప్రచారం వరకూ ఉత్తమ్ బాగానే కష్టపడ్డారు. మరో పక్క రాజయ్య ఉదంతం. ఎన్నిఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమిస్తూ పోటీ చేశారు. అంతేకాదు ఈ ఉప ఎన్నిక కోసం తన సొంత డబ్బును కూడా ఉత్తమ్ ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. కానీ అంత శ్రమించినా ఫలితం చూస్తే శూన్యం. దీంతో ఉత్తమ్ ఈ ఓటమిని వ్యక్తిగతంగా తీసుకొని తెగ ఫీలైపోతున్నారట.

కోర్టు చుట్టూ తిరుగుతా కానీ.. సారీ చెప్పను.. రాహుల్ గాంధీ

రాజకీయ నేతలు అప్పుడప్పుడు ఆవేశంగా నోరు జారడం పరిపాటే. అలా ఆవేశంగా మాట్లాడుతారు.. తరువాత ఇబ్బందులు పడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు డోంట్ కేర్ అంటున్నాడు. అసలు సంగతేంటంటే.. రాహాలు గాంధీ మహాత్మాగాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమంటూ ఈ మధ్యన ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్ఎస్ఎస్ నేతలు రాహుల్ గాంధీపై మండిపడుతున్నారు. తమపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మహారాష్ట్రలోని బివాండీ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో సంఘ్ నేతలు పిటీషన్ వేశారు. అయితే దీనికి రాహుల్ గాంధీ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు అవసరమైతే కోర్టు చుట్టూ తిరుగుతాను కానీ.. సారీ మాత్రం చెప్పేది లేదని తేల్చిచెప్పారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.

అమీర్ ఖాన్ కు పాకిస్థాన్ టికెట్లు బుక్..

అమీర్ అసహనం పై గోల రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకపక్క అమీర్ ఖాన్ పై విమర్శలు చేసేవాళ్లు చేస్తుంటే.. మరోపక్క ఆయనకు సపోర్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అమీర్ ఖాన్ కు ఏకంగా పాకిస్థాన్ కు రెండు టికెట్లు బుక్ చేసి మరీ దానిని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఒక జర్నలిస్టు అమీర్ ఖాన్ కుటుంబం పాకిస్థాన్ కు వెళ్లేందుకు వీలుగా మూడు ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసినట్లుగా హిందూసేన ప్రకటించి వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా ఎప్పూడూ వివాదస్పద వ్యాఖ్యలు చేసే శివసేన కూడా అమీర్ వ్యాఖ్యలకు స్పందించింది. దీనిలో భాగంగానే అమీర్ ను చెంపదెబ్బ కొడితే లక్ష రూపాయలు ఇస్తానని.. ప్రతి చెంప దెబ్బకి ఒక లక్ష ఇస్తామని.. అంతేకాదు అతనిని దేశభక్తుడిగా కీర్తిస్తామంటూ వ్యాఖ్యాలు చేసింది. మరి అమీర్ ఖాన్ వ్యవహారం ఎక్కడివరకూ దారి తీస్తుందో చూడాలి.

పార్లమెంట్ లో రాజ్యాంగంపై చర్చ.. రాజ్యాంగంపై వెంకయ్య

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండురోజు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా రాజ్యాంగంపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్బంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని వ్యాఖ్యానించారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన అంబేద్కర్ జీవితంలో ఎన్నో సమస్యలు, సవాళ్లను  అధిగమించారని చెప్పారు. ప్రజలకు స్వేచ్చ అనేది చాలా ముఖ్యమని.. సమాజంలో అస్పృశ్యత, అసమానతలపై అంబేద్కర్ పోరాటం చేశారని అన్నారు. నైతికంగా, సామాజికంగా ప్రజలు అభివృద్ది చెందాలని అంబేద్కర్ తపించేవారు.. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అంబేద్కర్ గట్టిగా విశ్వసించేవారు.. ఆదిశలో ఇప్పటికీ మనం ముందడుగు వేయలేకపోతున్నామని అన్నారు. బ్రిటిష్ పాలన సమయంలో దేశ పునర్నిర్మాణానికి అంబేద్కర్ కృషి చేశారని.. అంబేద్కర్ ఎప్పుడూ పదవులు ఆశించలేదని.. ప్రజల సంక్షేమం కోసమే పరితపించేవారని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటు ఉన్నందుకే ప్రత్యేకో హోదా అండిగాం.. ప్రత్యేక హోదా అంశం నీతి అయోగ్ కమీటీ పరిశీలనలో ఉంది.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని నేనూ ఆకాంక్షిస్తున్నా.. అని అన్నారు. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నాయి.. అభివృధ్ది చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకుంటున్నాయి.. దేశ సమగ్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

కేసీఆర్ హామీ ఇప్పుడప్పుడే నెరవేరదా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇవ్వడంలో దిట్ట. అవి తొందరగా నెరవేరుతాయా లేదా అన్నది కూడా ఆలోచించకుండా హామీలు ఇవ్వడంలో ఆయన తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు ఆయన చేసిన హామీలు అంత తొందరగా నెరవేరవు అని చాలాసార్లు నిరూపితమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అది నిజమని నిరూపితమైంది. అది కేసీఆర్ ఇచ్చిన కొత్త జిల్లాల హామీ విషయంలో. తెలంగాణలో ప్రస్తుతం 10 జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటికి తోటు ఇంకో పద్నాలుగు జిల్లాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించి ఏయే జిల్లాల్లో ఇంకా అదనంగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారో కూడా తెలిపారు. కానీ ఇప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అంత సులభం కాదని చెపుతున్నారు ప్రభుత్వ అధికారులు. అసలు వచ్చే సంవత్సరం.. తెలంగాణ ఆవిర్భావదినోత్సవం రోజు కల్లా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు కావాలని కేసీఆర్  అధికారులను ఆదేశించారు.. దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా కేసీఆర్ ఆదేశాల మేరకూ ఆగమేగాల మీద కొత్త జిల్లాల ఏర్పాటు నివేదికను తయారుచేయడంలో బిజీ అయింది. అయితే దీనివల్ల అధికారులకు తెలసిన విషయం ఏంటంటే  ప్రస్తుతం రెవెన్యూ శాఖ దగ్గర ఇంకా నిజాం కాలం నాటి సర్వే రికార్డులే ఉన్నాయని… వాటి ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం కష్టమని. దీంతో ప్రస్తుతం ఉన్న భూమి రికార్డులను పూర్తిగా డిజిటైలైజ్ చేసిన తరువాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయొచ్చని.. దీనికి రెండు సంవత్సరాలైన పట్టవచ్చని కేసీఆర్ కు తెలిపినట్టు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడప్పుడే నెరవేరేలా లేదని మరోసారి రుజువైంది.

చంద్రబాబు ప్లాన్.. త్వరలో జగన్ కు సూపర్ ఝలక్

ఏపీలో అధికార ప్రభుత్వం ప్రస్తుతానికి అమరావతి పనుల్లో.. వాటికి సంబంధించిన కాంట్రాక్టు పనులు, సమావేశాలు, అభివృధ్ది ప్రాజెక్టులు అంటూ చాలా బిజీగా ఉంది. ఇక ఈ ప్రాజెక్టుల పుణ్యమా అంటూ అటు కాంట్రాక్టర్లు కూడా చేతి నిండా పనులతో.. రెండు రాళ్లు వెనుకేసుకోవచ్చు అన్న ధోరణిలో ఉన్నారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ సంగతి బానే ఉన్నా ప్రతిపక్ష పార్టీ పరిస్థితే బాలేదని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆపార్టీలో ఉన్న నేతలు. ఒక పక్క అధికార పార్టీతో సంబంధాలు ఉన్నవారు టెండర్లు దక్కించుకుంటుంటే..ఇప్పుడు ఆందోళనలు, ధర్నాలు చేసుకుంటూపోతే ఒరిగేదిలేదని.. ఇందులో భాగంగానే వైసీపీ నేతలు కొంతమంది టీడీపీ లీడ‌ర్లతో మంతనాలు కూడా జరుపుతున్నారు. ఎలాగూ ఇప్పుడప్పుడే ఏపీలో ఎన్నికలు లేవు.. ఒకవేళ 2019 ఎన్నికల్లో అయినా వైసీపీ గెలస్తుందో లేదో తెలియదు.. అందుకనే ఇప్పుడే టీడీపీలోకి మారి నాలుగు రాళ్లు  రాళ్లు వెనుకేసుకోవ‌చ్చ‌ని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సై అంటున్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా చంద్రబాబు వచ్చే జనవరి నుండి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ప‌చ్చ జెండా ఊప‌బోతు న్నారట‌! దీని ద్వారా వైసీపీ లో ఉన్నకీలక నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి రానున్న రోజుల్లో టీడీపీయే కాదు ఆయన పార్టీ నేతలు కూడా జగన్ కు గట్టి ఝలక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

నిర్భయ ఉదంతం.. అతని మొహాన్ని చూపించండి.. నిర్భయ తల్లిదండ్రులు

ఢిల్లీ నిర్భయపై జరిగిన అత్యాచారం గురించి అందరికి తెలిసిందే. అది అంత తొందరగా మరిచిపోయే ఘటన కూడా కాదు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులందరికి శిక్ష పడింది కాని ఒక్కడికి తప్ప. ఈ దుర్మార్గానికి  పాల్పడిన వారిలో అందరూ మేజర్లు కాగా ఒక్కడు మాత్రం మైనర్ అనే ఒక కుంటి సాకుతో శిక్ష నుండి తప్పించుకున్నాడు. దీంతో అప్పటి నుండి జైలులోనే ఉంటూ ఈ ఘటనకు పాల్పడినందుకు అనుభవించాల్సిన శిక్ష కంటే చాలా తక్కువ శిక్షను అనుభవిస్తూ జైల్లో ఉన్నాడు. అయితే అప్పుడు మైనర్లుగా పరిగణించే వయో పరిమితి కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. కానీ అది మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాడు ఆ దుర్మార్గుడి మొహం చూపించింది కూడా లేదు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి నిర్భయ తల్లిదండ్రులు జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతగాడి ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించాలంటూ వారు జాతీయ మానవహక్కుల కమిషనర్ని అభ్యర్థించారు. జైల్లో ఉన్న అతనికి తీవ్రవాదంపై దృష్టి పడిందని. ఇలాంటి దుర్మార్గుడి ముఖం అందరికి తెలిస్తే ఎవరి జాగ్రత్తలో వారు ఉంటారని కమిషనర్ని కోరినట్టు తెలుస్తోంది.  మరి పోలీసులు వారి అభ్యర్ధనని విని ఆ దుర్మార్గుడి మొహాన్ని చూపిస్తారో లేదో చూడాలి.

అగ్రిగోల్డ్ కేసు.. మానవత్వంతో ఆలోచించండి.. హైకోర్టు

అగ్రిగోల్డ్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తి అమ్మకాలకు సంబంధించి సీ1 ఏజెన్సీ 0.5 శాతం కమీషన్ ఇవ్వాలని హైకోర్టును అడిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల సొమ్ము విషయంలో మానవత్వంతో ఆలోచించాలని.. సీ1 ఏజెన్సీకి కమీషన్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే కోల్ కతాకు చెందిన ఎంఎస్టీసీ ఏజేన్సీ కి అప్పగిస్తానన్న హైకోర్టు స్పష్టం చేసింది. కాగా దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన సూర్యారావు కమిటీ జనవరి 1 నుండి అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మాలను హైకోర్టుకు సూచించింది. హైకోర్టు కూడా కమిటీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

ఇక నుండి రెండురోజులు చంద్రబాబు హైదరాబాద్లో.. కారణం అదేనా?

రాష్ట్రం విడిపోయిన కొత్తలో  ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో ఉండే ఏపీ కార్యకలాపాలు చూసేవారు. తరువాత వారానికి మూడు రోజులు విజయవాడలో ఉంటూ.. మూడు రోజులు హైదరాబాద్లో ఉంటూ పాలన సాగించేవారు. అనంతరం మొత్తానికే విజయవాడకి మకాం మార్చి అక్కడే ఉంటూ.. అక్కడి నుండే అన్ని చక్కదిద్దుతున్నారు. ఆయన హైదరాబాద్లో ఉన్న సచివాలయానికి వచ్చి కూడా చాలా రోజులే అయింది. ఒకవేళ హైదరాబాద్ వచ్చినా తన నివాసానికి వెళ్లి, మళ్లీ అక్కడినుండి నేరుగా విజయవాడకే తిరిగి వస్తున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుండి హైదరాబాద్లో కూడా రెండు రోజులు ఉండి ఇక్కడ ఉన్న పార్టీ కార్యకలాపాల గురించి చూసుకోవాలని నిర్ణయించుకున్నారట. కానీ చంద్రబాబు ఇంత సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఈ నిర్ణయం వెనుక అసలు కారణం.. గ్రేటర్ ఎన్నికలని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో పట్టు కోల్పోకూడదని తనే స్వయంగా పార్టీ బాధ్యతలు దగ్గరుండి చూసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయి.. దీనిలో భాగంగానే హైదరాబాద్ లో రెండు రోజులు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సారి ఎలాగైనా గ్రేటర్ లో అత్యధిక స్థానాలు సాధించాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ నేతలకు గుర్తు చేసినట్టు సమాచారం. మొత్తానికి చంద్రబాబు హైదరాబాద్లో ఉండటానికి నిర్ణయించుకున్నారు. గతంలో అంటే కేసీఆర్ విమర్శించేవారు.. ఇప్పుడు కేసీఆర్ కూడా విమర్శించడం తగ్గించారు కాబట్టి.. చంద్రబాబుకు ఇక ఆ సమస్యలేదు.

మధ్యపానం నిషేదానికి మూహుర్తం ఖరారు చేసిన నితీశ్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. గత శాసన సభ ఎన్నికల సమయంలో తనకి కనుక ఇంకోసారి అవకాశం ఇస్తే బీహార్లో సంపూర్ణ మధ్యపానం నిషేదం చేస్తానని హామి ఇచ్చారు. ఇప్పుడు నితీశ్ కుమార్ ఆ హామీలను నేపవేర్చడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి సంపూర్ణ మద్యపానం నిషేధం అమలులో ఉంటుందని నితీశ్ కుమార్ చెప్పారు అంతేకాదు ఇప్పటి నుండే మద్యం నిషేధం అమలు చెయ్యడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారట. మరి నితీశ్ ఇప్పడైతే హామీ ఇచ్చారు. మరి అప్పటివరకూ ఈ విషయం గుర్తుంటుందో లేదో చూడాలి.

త్వరలో టీడీపీలో చేరుతాం.. ఆనం బ్రదర్స్

ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడీ టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు జోరుగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలకి ఆనం బ్రదర్స్ బ్రేక్ వేసి తాము త్వరలో టీడీపీలోకి చేరుతామని స్పష్టం చేశారు. ఆనం రాంనారాయణరెడ్డి ఈరోజు పలు నియోజక వర్గాల కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన ఉదయగిరి, కావలి, సర్వేపల్లి తదితర ప్రాంతాల కార్యకర్తల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో టీడీపీలో చేరుతామని ప్రకటించారు. కాగా ఇప్పటికే పార్టీ ఎంట్రీకి సంబధించి టీడీపీ అధినేతతో ఆనం బ్రదర్స్ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా వారు డిసెంబర్ 5 న టీడీపీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు రాజకీయ వర్గాలు చర్చింటుకుంటున్నాయి.

ఇసుక విధానంపై శ్వేత పత్రం విడుదల చేసిన చంద్రబాబు..

ఇసుక విధానం పై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2015 నవంబర్ నాటికి మొత్తం 387 ఇసుక రీచ్ లు నమోదయ్యాయని తెలిపారు. ఇసుక అమ్మకం ద్వారా రూ 821.21 కోట్ల ఆదాయం వచ్చిందని.. అత్యధికంగా తూ.గోజిల్లాలో రూ. 143 కోట్లు ఆదాయం కృష్ణా రూ. 140 కోట్లు, గుంటూరు రూ. 134కోట్లు, ప. గో జిల్లాలో రూ.118 కోట్లు అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 12. 79 కోట్లు ఆదాయం వచ్చిందని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. 4,023స్వయం సహాయక సంఘాలు ఇసుక రీచ్ లను నిర్వహించాయని అన్నారు. మొత్తం రెండు కోట్ల, 82లక్షల 8వేల 132క్యూబిసెక్ ల ఇసుకను తవ్వి తీశామని.. కోటి 37 లక్షల 89 వేల మందికి ఇసుక విక్రయాలు జరిగాయని తెలిపారు. అంతేకాదు ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం ఉపయోగించామని.. అన్ని జిల్లాల్లోని రీచ్ లలో తవ్వకాలను తెలుసుకునేందుకు విజయవాడలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇసుక అక్రమాలకు తావు లేకుండా వాహనాలకు జీపిఎస్ విధానంతో నియంత్రణ చేపట్టామని పేర్కొన్నారు.

అంబేద్కర్ కృషి ఎనలేనిది.. రాజ్ నాథ్ సింగ్

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈనేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కి ఖర్గేకి మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కృషి ఎనలేనిది అని అన్నారు. భారత్ ను సంఘటితం చేసిన ఘనత సర్దార పటేల్ కి దక్కుతుందని.. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు.అవమానాలు ఎదురైనప్పటికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశం విడిచి వెళ్లిపోతానని వ్యాఖ్యానించలేదని అమీర్ ఖాన్ కు కౌంటర్ ఇచ్చారు.

ఆనం బ్రదర్స్ చంద్రబాబ్ ఆపర్స్ ఎంటో?

ఆనం బ్రదర్స్.. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్లో ముఖ్య భూమిక పోషించారన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేని కారణంగా ఆనం బ్రదర్స్ పార్టీ కార్యక్రమాల్లో కూడా అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నేతలు ఒకవేళ టీడీపీలోకి వెళితే వారికి ఎలాంటి పదవులు దక్కుతాయి అన్న విషయంపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీకి వచ్చే ఆనం బ్రదర్స్ కోసం రెండు పదవుల్ని సైతం సిద్దం చేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు వారికి ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా చూడాలన్న మాటను పార్టీ వర్గాలకు  బాబు ఇప్పటికే చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆనం వివేకానందరెడ్డి కుమారుడికి నెల్లూరు రూరల్ పార్టీ ఇన్ ఛార్జ్ బాధ్యతలు.. చిన్నోడైన ఆనం రాంనారాయణ రెడ్డికి.. పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. కాగా ఆనం బ్రదర్స్ డిసెంబరు 5న టీడీపీలోకి చేరేందుకు ముహుర్తంగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

అగ్రిగోల్డ్ పై విచారణ.. మీడియాను నిరోధించాలన్న లాయర్లు.. నిరోధింలేమన్న హైకోర్టు

అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు నేపథ్యంలో ఏర్పరిచిన రిటైర్డ్ జడ్జి సూర్యారావు కమిటీ కొన్నిరికమెండేషన్స్ చేసింది. దీనిలో భాగంగానే జనవరి 1 నుండి అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయాలని సూర్యారావు కమిటీ హైకోర్టును సూచించింది.  హైకోర్టు కూడా కమిటీ రికమెండేషన్స్ స్వీకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే బాధితుల ఆందోళనతో హైకోర్టు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో మీడియాను నిరోధించాలని అగ్రిగోల్ట్ తరపు లాయర్లు హైకోర్టును కోరడం జరిగింది. కానీ హైకోర్టు మాత్రం మీడియాను నిరోధించలేమని తేల్చి చెప్పింది. కాగా దీనిపై విచారణను మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాయిదా వేశారు. మరోవైపు ఈ విషయంపై కారెం శివాజీ అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందుతులను అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నోరు విప్పడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బీనామీలను మేమే బయటపెడతామని హెచ్చరించారు. 46 లక్షల మంది బాధితులు రోడ్డున పడ్డారని.. వారిని వెంటనే ఆదుకోవాలని.. వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన పసునూరి దయాకర్

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభయ్యాయన్న సంగతి తెలిసిందే. ఈ రోజు నుండి వచ్చే నెల 23 వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వరంగల్ ఉపఎన్నికల్లో అత్యధిక మెజార్టీ పొంది లోక్ సభ సీటు గెలుచుకున్న పసునూరి దయాకర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దయాకర్ తో పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన సభ్యులు కొత్తగా ఎంపికైనా ఎంపీలకు అభినందనలు తెలిపారు. అనంతరం ఉభయ సభల స్పీకర్లు స్పీకర్ సుమిత్రా మహాజన్, హమీద్ అన్సారీ సభలను ప్రారంభించారు.

అమీర్ భార్య కిరణ్ రావ్ ది తెలంగాణనా?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ దేశ అసహనంపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. తన భార్య కిరణ్ రావు దేశం విడిచి వెళ్లిపోదాం అని తనతో అన్నదని అమీర్ చెప్పడంతో అమీర్ ఖాన్ తో పాటు ఆమె భార్య కిరణ్ రావు కూడా వార్తల్లోకి ఎక్కారు. అంతకుముందు ఎక్కడా పెద్దగా వార్తల్లోకి ఎక్కని కిరణ్ రావు తన భర్త అమీర్ ఖాన్ తో చేసిన వ్యాఖ్యలవల్ల ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోదామన్న ప్రతిపాదన తెచ్చిన కిరణ్ రావుది అసలు ఏ దేశమనే విషయంపై ఫోకస్ పెట్టారు. అయితే దీనిలో ఆసక్తికర విషయం ఏంటంటే కిరణ్ రావుకి తెలంగాణకి చెందిన మాలాలు ఉన్నట్టు తెలిసింది. ఆమె పూర్వీకులు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజవంశీకులన్న కొత్త విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కిరణ్ రావు తాత మహబూబ్ నగర్లోని వనపర్తి రాజవంశీకులు కుటుంబానికి చెందిన వారు. కిరణ్ తండ్రిది కూడా తెలంగాణ ప్రాంతమే. కాకపోతే కిరణ్ తండ్రి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో భాగంగా బెంగళూరు.. కోల్ కతా.. ముంబయి మహానగరాల్లో స్థిరపడాల్సి వచ్చింది. దీంతో.. కిరణ్ రావ్ కూడా చిన్నప్పటి నుండి అక్కడే పెరిగి చదువుసంధ్యలు కూడా అక్కడే సాగడంతో ఈ ప్రాంతానికి దూరం కావాల్సి వచ్చింది. ఈ వివాదం వల్ల కిరణ్ రావ్ తెలంగాణ వాసి అనే ఓ కొత్త విషయం తెలిసింది. మొత్తానికి కిరణ్ రావ్ తన మాటను చెప్పడమేమో కాని అమీర్ ఖాన్ ను మాత్రం ఒక్క మాటతో వివాదాల్లోకి నెట్టేసింది.

మరికాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

మరికాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ శీతాకాలంలో వేడి వేడిగా చర్చలు జరిపేందుకు అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రలతో సిద్దమయ్యాయి. ఇవాళ రేపు రాజ్యాంగం పై చర్చించనున్నారు. అంతేకాదు ఈ సమావేశాల్లో ప్రధాన బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు చర్చలు జరగాలంటే సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని సర్కార్ అన్ని పార్టీలను కోరింది. కాగా ఈ రోజు నుండి డిసెంబర్ 23 వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 34 బిల్లులపై చర్చలు జరపాలని అఖిలపక్షం నిర్ణయించింది. మరి ఎన్ని బిల్లులు చర్చకు వస్తాయో.. ఎన్ని బిల్లులకు అందరి ఆమోదం లభిస్తుందో చూడాలి.

బొత్స.. అక్కడ కింగ్.. ఇక్కడ?

బొత్స సత్యనారాయణ కాంగ్రస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి.. ఆ పార్టీ వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించి కింగ్ లా ఓ చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పార్టీ మారిన తరువాత సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే బొత్స కాంగ్రెస్ ను వీడి వైకాపాలోకి రావడానికి ముందే జగన్ కు, బొత్సకు కొన్ని ఒప్పందాలు జరిగాయట. అయితే పార్టీలోకి మారిన తరువాత జగన్ ఇప్పుడు వాటిని విస్మరిస్తున్నారని బొత్స ఫీలవుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైకాపాలోకి చేరిన కొత్తలో బొత్స బాగానే హడావుడి చేశారు. పార్టీలోకి చేరిన కొద్ది రోజుల్లోనే బొత్స ఏది చెబితే అది చేసేవారు జగన్ కూడా. దీంతో ఆయన హడావుడితో పార్టీలో ఉన్న నేతలు సైతం ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడే అనుకున్నారు కూడా. అయితే అదంతా కొద్ది రోజుల వరకే అన్న సత్యం తెలుసుకోలేకపోయాడు బొత్స. ఉత్తరాంధ్రలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం తానే చూసుకోవాలని.. అంతేకాదు  కోస్తాంధ్ర‌లోనూ కూడా తన పెత్త‌నమే ఉండాలని ఆశించార‌ట‌ బొత్స.. జగన్ అంత ఛాన్స్ ఇస్తాడా.. జ‌గ‌న్ త‌న త‌రువాత ఏ ఒక్క లీడ‌ర్నీ ఆ.. స్థాయిలోకి రానివ్వ‌డంలేద‌ట... అంతేకాదు ఇక పార్టీలో ఉన్న పాత రెడ్లు.. కొత్త కాపుల నుంచి చుక్కెదుర‌వుతోంద‌ట‌. దీంతో బొత్స అనవసరంగా  పార్టీ మారి దెబ్బైపోయామే అని వాపోతున్నారట. పాపం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని మనిషిగా పేరు తెచ్చుకొన్న బొత్సకు ఇప్పుడు జగన్ రూపంలో ఝలక్ తగిలే సరికి తట్టుకోలేకపోతున్నారు. సొంత సోదరి విషయంలోనే ఖాతరు చేయని జగన్ అంత తేలిగ్గా నేతలను ఎదగనిస్తాడా.. ఇప్పుడు బొత్స విషయంలో కూడా అదే జరిగింది.