పార్లమెంట్ లో రాజ్యాంగంపై చర్చ.. రాజ్యాంగంపై వెంకయ్య
posted on Nov 27, 2015 @ 10:57AM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండురోజు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా రాజ్యాంగంపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్బంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని వ్యాఖ్యానించారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన అంబేద్కర్ జీవితంలో ఎన్నో సమస్యలు, సవాళ్లను అధిగమించారని చెప్పారు. ప్రజలకు స్వేచ్చ అనేది చాలా ముఖ్యమని.. సమాజంలో అస్పృశ్యత, అసమానతలపై అంబేద్కర్ పోరాటం చేశారని అన్నారు. నైతికంగా, సామాజికంగా ప్రజలు అభివృద్ది చెందాలని అంబేద్కర్ తపించేవారు.. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అంబేద్కర్ గట్టిగా విశ్వసించేవారు.. ఆదిశలో ఇప్పటికీ మనం ముందడుగు వేయలేకపోతున్నామని అన్నారు. బ్రిటిష్ పాలన సమయంలో దేశ పునర్నిర్మాణానికి అంబేద్కర్ కృషి చేశారని.. అంబేద్కర్ ఎప్పుడూ పదవులు ఆశించలేదని.. ప్రజల సంక్షేమం కోసమే పరితపించేవారని వెంకయ్య వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటు ఉన్నందుకే ప్రత్యేకో హోదా అండిగాం.. ప్రత్యేక హోదా అంశం నీతి అయోగ్ కమీటీ పరిశీలనలో ఉంది.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని నేనూ ఆకాంక్షిస్తున్నా.. అని అన్నారు. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నాయి.. అభివృధ్ది చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకుంటున్నాయి.. దేశ సమగ్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.