కోర్టు చుట్టూ తిరుగుతా కానీ.. సారీ చెప్పను.. రాహుల్ గాంధీ
posted on Nov 27, 2015 @ 11:49AM
రాజకీయ నేతలు అప్పుడప్పుడు ఆవేశంగా నోరు జారడం పరిపాటే. అలా ఆవేశంగా మాట్లాడుతారు.. తరువాత ఇబ్బందులు పడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు డోంట్ కేర్ అంటున్నాడు. అసలు సంగతేంటంటే.. రాహాలు గాంధీ మహాత్మాగాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమంటూ ఈ మధ్యన ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్ఎస్ఎస్ నేతలు రాహుల్ గాంధీపై మండిపడుతున్నారు. తమపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మహారాష్ట్రలోని బివాండీ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో సంఘ్ నేతలు పిటీషన్ వేశారు.
అయితే దీనికి రాహుల్ గాంధీ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు అవసరమైతే కోర్టు చుట్టూ తిరుగుతాను కానీ.. సారీ మాత్రం చెప్పేది లేదని తేల్చిచెప్పారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.