నిర్భయ ఉదంతం.. అతని మొహాన్ని చూపించండి.. నిర్భయ తల్లిదండ్రులు
posted on Nov 26, 2015 @ 5:08PM
ఢిల్లీ నిర్భయపై జరిగిన అత్యాచారం గురించి అందరికి తెలిసిందే. అది అంత తొందరగా మరిచిపోయే ఘటన కూడా కాదు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులందరికి శిక్ష పడింది కాని ఒక్కడికి తప్ప. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిలో అందరూ మేజర్లు కాగా ఒక్కడు మాత్రం మైనర్ అనే ఒక కుంటి సాకుతో శిక్ష నుండి తప్పించుకున్నాడు. దీంతో అప్పటి నుండి జైలులోనే ఉంటూ ఈ ఘటనకు పాల్పడినందుకు అనుభవించాల్సిన శిక్ష కంటే చాలా తక్కువ శిక్షను అనుభవిస్తూ జైల్లో ఉన్నాడు. అయితే అప్పుడు మైనర్లుగా పరిగణించే వయో పరిమితి కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. కానీ అది మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాడు ఆ దుర్మార్గుడి మొహం చూపించింది కూడా లేదు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి నిర్భయ తల్లిదండ్రులు జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతగాడి ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించాలంటూ వారు జాతీయ మానవహక్కుల కమిషనర్ని అభ్యర్థించారు. జైల్లో ఉన్న అతనికి తీవ్రవాదంపై దృష్టి పడిందని. ఇలాంటి దుర్మార్గుడి ముఖం అందరికి తెలిస్తే ఎవరి జాగ్రత్తలో వారు ఉంటారని కమిషనర్ని కోరినట్టు తెలుస్తోంది. మరి పోలీసులు వారి అభ్యర్ధనని విని ఆ దుర్మార్గుడి మొహాన్ని చూపిస్తారో లేదో చూడాలి.