ఇసుక విధానంపై శ్వేత పత్రం విడుదల చేసిన చంద్రబాబు..
posted on Nov 26, 2015 @ 1:34PM
ఇసుక విధానం పై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2015 నవంబర్ నాటికి మొత్తం 387 ఇసుక రీచ్ లు నమోదయ్యాయని తెలిపారు. ఇసుక అమ్మకం ద్వారా రూ 821.21 కోట్ల ఆదాయం వచ్చిందని.. అత్యధికంగా తూ.గోజిల్లాలో రూ. 143 కోట్లు ఆదాయం కృష్ణా రూ. 140 కోట్లు, గుంటూరు రూ. 134కోట్లు, ప. గో జిల్లాలో రూ.118 కోట్లు అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 12. 79 కోట్లు ఆదాయం వచ్చిందని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. 4,023స్వయం సహాయక సంఘాలు ఇసుక రీచ్ లను నిర్వహించాయని అన్నారు. మొత్తం రెండు కోట్ల, 82లక్షల 8వేల 132క్యూబిసెక్ ల ఇసుకను తవ్వి తీశామని.. కోటి 37 లక్షల 89 వేల మందికి ఇసుక విక్రయాలు జరిగాయని తెలిపారు. అంతేకాదు ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం ఉపయోగించామని.. అన్ని జిల్లాల్లోని రీచ్ లలో తవ్వకాలను తెలుసుకునేందుకు విజయవాడలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇసుక అక్రమాలకు తావు లేకుండా వాహనాలకు జీపిఎస్ విధానంతో నియంత్రణ చేపట్టామని పేర్కొన్నారు.