ఓడిపోయినందుకు ఉత్తమ్ తెగ ఫీలవుతున్నారట..
posted on Nov 27, 2015 @ 12:16PM
తెలంగాణ వరంగల్ ఉపఎన్నికల రిజల్ట్ చూసి అన్నిపార్టీలు షాకయ్యాయి. అయితే రాజకీయాల్లో గెలుపు, ఓటములు కామన్ కాబట్టి నాయకులు కూడా వాటిని లైట్ తీసుకొని ఎప్పటిలాగే వారి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ ఈ వరంగల్ ఫలితాల వల్ల ఒక నేత మాత్రం బయటకి రావడానికి కూడా ఇష్టపడటం లేదట. అతను ఎవరనుకుంటున్నారా.. టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికులు జరిగి.. ఫలితాలు వచ్చి దాదాపు నాలుగు రోజులు పైన అవుతున్నా ఆయన మాత్రం ఇప్పటి వరకూ ఇంటి నుండి బయటకు రాలేదు.. ఎటువంటి మీడియా సమావేశాల్లో పాల్గొనలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయిన కారణంగా ఉత్తమ్ బయటకు రావడానికి కూడా ఇష్టపడటం లేదట.
వరంగల్ ఉపఎన్నిక అభ్యర్ధి దగ్గర నుండి.. ఎన్నిక ప్రచారం వరకూ ఉత్తమ్ బాగానే కష్టపడ్డారు. మరో పక్క రాజయ్య ఉదంతం. ఎన్నిఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమిస్తూ పోటీ చేశారు. అంతేకాదు ఈ ఉప ఎన్నిక కోసం తన సొంత డబ్బును కూడా ఉత్తమ్ ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. కానీ అంత శ్రమించినా ఫలితం చూస్తే శూన్యం. దీంతో ఉత్తమ్ ఈ ఓటమిని వ్యక్తిగతంగా తీసుకొని తెగ ఫీలైపోతున్నారట.