చంద్రబాబు ప్లాన్.. త్వరలో జగన్ కు సూపర్ ఝలక్
posted on Nov 27, 2015 @ 9:52AM
ఏపీలో అధికార ప్రభుత్వం ప్రస్తుతానికి అమరావతి పనుల్లో.. వాటికి సంబంధించిన కాంట్రాక్టు పనులు, సమావేశాలు, అభివృధ్ది ప్రాజెక్టులు అంటూ చాలా బిజీగా ఉంది. ఇక ఈ ప్రాజెక్టుల పుణ్యమా అంటూ అటు కాంట్రాక్టర్లు కూడా చేతి నిండా పనులతో.. రెండు రాళ్లు వెనుకేసుకోవచ్చు అన్న ధోరణిలో ఉన్నారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ సంగతి బానే ఉన్నా ప్రతిపక్ష పార్టీ పరిస్థితే బాలేదని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆపార్టీలో ఉన్న నేతలు. ఒక పక్క అధికార పార్టీతో సంబంధాలు ఉన్నవారు టెండర్లు దక్కించుకుంటుంటే..ఇప్పుడు ఆందోళనలు, ధర్నాలు చేసుకుంటూపోతే ఒరిగేదిలేదని.. ఇందులో భాగంగానే వైసీపీ నేతలు కొంతమంది టీడీపీ లీడర్లతో మంతనాలు కూడా జరుపుతున్నారు. ఎలాగూ ఇప్పుడప్పుడే ఏపీలో ఎన్నికలు లేవు.. ఒకవేళ 2019 ఎన్నికల్లో అయినా వైసీపీ గెలస్తుందో లేదో తెలియదు.. అందుకనే ఇప్పుడే టీడీపీలోకి మారి నాలుగు రాళ్లు రాళ్లు వెనుకేసుకోవచ్చని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అంతేకాదు దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సై అంటున్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా చంద్రబాబు వచ్చే జనవరి నుండి ఆపరేషన్ ఆకర్ష్‌కు పచ్చ జెండా ఊపబోతు న్నారట! దీని ద్వారా వైసీపీ లో ఉన్నకీలక నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి రానున్న రోజుల్లో టీడీపీయే కాదు ఆయన పార్టీ నేతలు కూడా జగన్ కు గట్టి ఝలక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.