శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్
టర్కీలోని అటాటర్క్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌పై దాడి..అనంతరం హైదరాబాద్‌లో ఐఎస్ సానుభూతిపరులు పట్టుబడటంతో జంట నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ, ఐబీ, ఎన్ఐఏ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. విజిటర్ల ప్రవేశంపై అంక్షలు విధించారు. డొమెస్టిక్, ఇంటర్నేషన్ ప్రయాణికులు ప్రయాణ సమయానికి ముందుగానే విమానాశ్రయానికి చేరుకుని తనిఖీల, ఇతర భద్రతాపరమైన అంశాలలో సహకరించాలని ఎయిర్‌పోర్ట్ భద్రతా విభాగం ప్రకటించింది. త్వరలో రంజాన్, బోనాలు ఇతర పండుగలు ఉన్నందున ఎయిర్‌పోర్ట్‌తో పాటు పరిసరాలలో భద్రతను పటిష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి, కాచిగూడ తదితర ప్రాంతాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.