ఎవరి ఏడుపు వారిది..
posted on Jun 29, 2016 @ 3:53PM
హైదరాబాద్ నుండి ఏపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున అమరావతికి తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 27 నాటికి ఏపీ ఉద్యోగులందరూ ఏపీకి రావాల్సిందే అని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అందరూ రాజధానికి తరలివస్తున్నారు. ఈరోజు ఐదు బస్సులో హైదరాబాద్ నుండి బయలుదేరిన ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు రాజధాని చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఉద్యోగులు హర్షధ్వానాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజధాని పరిధిలోని వెలగపూడిలో నిర్మితమైన తాత్కాలిక సచివాలయం ఐదో బ్లాకును ప్రారంభించారు.
ఇదిలా ఉంటే మరోపక్క తెలంగాణ ఉద్యోగ సంఘాలు దర్నా చేపడుతున్నాయి. ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సెక్రటేరియట్ కు పంపాలని ఏపీ సచివాలయం భవనం ముందు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ధర్నా చేస్తున్నాయి. ఏపీ సచివాలయంలో 234 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న తెలంగాణ నేటివ్ గా ఉన్న వారున్నారని, వారందరినీ రిలీవ్ చేసి తమ సచివాలయానికి పంపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక పక్క తెలంగాణ నుండి ఉద్యోగులు హ్యాపీగా రాజధాని వెళ్లగా.. ఇక్కడ మాత్రం తెలంగాణ ఉద్యోగులు దర్నా చేస్తూ కూర్చున్నారు. ఒకపక్క ఉద్యోగుల రాకతో ఏపీ రాజధాని కళకళలాడిపోతుంటే తెలంగాణ ఉద్యోగుల మాత్రం దర్నా చేస్తూ తమ కడుపు మంటను చూపిస్తున్నట్టున్నారు.