ఎవరెస్ట్ ఎక్కకుండానే ఫొటోలు మార్ఫింగ్.. మహారాష్ట్ర దంపతుల ఘనకార్యం..
posted on Jun 29, 2016 @ 4:18PM
తమ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఏకంగా తాము ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించామని చెప్పుకున్నారు ఓ జంట. దినేష్, తారకేశ్వరీ రాథోడ్ గుర్తుండే ఉంటారు.ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి జంటగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. వీరిద్దరి ఆకాశానికి ఎత్తేస్త్తూ పలు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది వీరిద్దరూ అసలు పర్వతం ఎక్కకుండానే మార్ఫింగ్ ద్వారా ఎవరెస్ట్ ఎక్కామని చెప్పుకున్నట్టు నిజం బయటపడింది. అసలు సంగతేంటో చూద్దాం.. మహారాష్ట్రకు చెందిన దినేష్, తారకేశ్వరీ రాథోడ్ 'సమ్మిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్' పేరిట సదస్సు జరుగగా... దాని ద్వారా ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి వెళ్లారు. అయితే వారు మాత్రం వెళ్లలేదు. కానీ ఫొటో మార్ఫింగ్ చేసి వెళ్లామని చెప్పుకున్నారు. దీనికి గమనించి.. అంజలీ కులకర్ణి, శరద్ కులకర్ణి, సురేంద్ర షల్కే, ఆనంద్ బన్సోడే తదితర పర్వతారోహకులు మహారాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. దీంతో దినేష్ దంపతులను కమిషనర్ రష్మీ శుక్లా దీనిపై విచారణకు ఆదేశించారు.