తన ప్రేయసిని రేప్ చేశాడని..స్నేహితుడని కూడా చూడకుండా
posted on Jul 1, 2016 @ 10:41AM
తన ప్రేయసిని రేప్ చేశాడని స్నేహితుడని కూడా చూడకుండా అతని తల నరికాడు ఒక వ్యక్తి. అమెరికాకు చెందిన థార్సెన్ అనే వ్యక్తికి హైమన్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. స్వల్పకాలంలోనే వారిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. థార్సెన్‌కు ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. ఒక రోజు థార్సెన్ గర్ల్‌ఫ్రెండ్ వద్దకు వెళ్లిన హైమన్ ఆమెపై అత్యాచారం చేశాడు.
తనపై జరిగిన దారుణాన్ని ఆమె థార్సెన్‌కు చెప్పింది. వీరు ముగ్గురు డ్రగ్స్‌కు కట్టుబానిసలు. అలా ఒకరోజు ఫుల్లుగా డ్రగ్స్ సేవించి కారులో వెళుతున్నారు. కారు చెకింగ్ కోసమని హైమన్ కిందకు దిగడంతో వెనుక నుంచి థార్సెన్ బేస్ బాల్ బ్యాట్ తో బలంగా కొట్టాడు. అనంతరం కత్తితో అతడిని పొడిచి తల నరికేసి అడవిలో విసిరేశాడు. తర్వాత ఏం తెలియనట్టు తన పని చూసుకున్నాడు. అడవుల్లో తల.. ఒక కారులో తల లేని మొండి లభించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించారు. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను సినిమా స్టైల్లో వెంటాడి థార్సెన్‌ను అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు.