దిల్ రాజు జడ్జిమెంట్ కు ఏమైంది..?
ఇండస్ట్రీలో చాలా తెలివైన ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకు పేరుంది. అతని జడ్జిమెంట్ తప్పదని చాలా మంది నమ్మకం. అందుకే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా, లేక ప్రొడ్యూస్ చేసినా, ఆ సినిమాలకు మాంచి క్రేజ్ వస్తుంది. సినిమాలో ఏదో ఉందిరా అని అందరూ అనుకునేలా ఉంటుంది. కానీ గత కొంత కాలంగా, దిల్ రాజు లెక్క ఘోరంగా తప్పుతోంది. సీతమ్మ వాకిట్లో సినిమా తర్వాత, ఈ సినిమా హిట్టెహే అని అనుకునే విధంగా దిల్ రాజుకు సినిమా పడలేదు