Read more!

English | Telugu

స్పీడ్ పెంచిన రజనీకాంత్

వయసు మళ్లే కొద్దీ, రజనీ స్పీడ్ పెరుగుతోంది. స్పీడ్ గా సినిమా తర్వాత సినిమా సైన్ చేస్తూ దూకుడు పెంచాడు. ఇప్పటికే విజయ్ డైరెక్షన్లో చేస్తున్న కబాలీ షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తూ, తర్వాత శంకర్ డైరెక్షన్లో రోబో 2 సెట్స్ కు వెళ్లబోతున్న రజనీ, తాజాగా మరో సినిమా సైన్ చేసినట్లు సమాచారం. మళయాళంలో సూపర్ హిట్టైన భాస్కర్ ది రాస్కెల్ సినిమా రీమేక్ కు రజనీ సై అన్నాడట. భాస్కర్ లో మమ్ముట్టి, నయనతారలు కలిసి యాక్ట్ చేశారు. ఈ సినిమాను తమిళ్, తెలుగు రెండింటిలోనూ రిలీజ్ చేసే విధంగా డైరెక్టర్ సిద్ధిక్ ప్లాన్ చేశాడట.

పెళ్లి తర్వాత విడిపోయిన జంట మధ్య ప్రేమ ఇంకా ఉంటుందంటూ భాస్కర్ ది రాస్కెల్ లో కాన్సెప్ట్. ప్రస్తుతం మాఫియా నేపథ్యంలో కబాలీ, సైఫై జానర్లో రోబో 2 చేస్తున్న సూపర్ స్టార్ ఫ్యామిలీ డ్రామా చేసి చాలా కాలమైంది..అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం. రోబో 2 షూటింగ్ పూర్తవ్వగానే వచ్చే ఏడాది ఈ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట రజనీ. కానీ ఏళ్లకు ఏళ్లు షూటింగ్ చేసే శంకర్, రజనీ అప్పటికి వదిలేస్తాడా అన్నది మాత్రం అనుమానమే..