Read more!

English | Telugu

బాహుబలి యూనిట్ కు కండిషన్లు

సినిమా తీసేప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వాళ్లను రానివ్వరు హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్. ఇండియా డైరెక్టర్లలో ఎన్.శంకర్ కూడా అలాగే ఉంటాడు. బాహుబలితో వీళ్ల లిస్ట్ లో తనూ చేరిపోయాడు దర్శక జక్కన్న రాజమౌళి. మొదటి భాగం షూటింగ్ టైం లో ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాడో, అంతే స్ట్రిక్ట్ గా రెండో భాగాన్ని షూట్ చేస్తున్నాడు. యూనిట్ క్రూ అందరికీ ఐడీ కార్డులు ఇష్యూ చేశాడు. ఓన్లీ ఈ కార్డ్స్ ఉంటేనే బాహుబలి సెట్లోకి ప్రవేశం ఉంటుంది.

ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేయాలనుకునే డైరెక్టర్లందరికీ ఉండే క్వాలిటీ ఇది. షూటింగ్ నుంచి కనీసం చిన్న ఫోటోను కూడా లీకవ్వకుండా చూసుకుంటారు. తాజాగా తనకిచ్చిన ఐడీ కార్డు ఫొటోను చూపిస్తూ, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఫోటో పెట్టడంతో ఈ విషయం బయటికొచ్చింది. ఎంతైనా రాజమౌళి స్టైలే వేరు అంటున్నారు ఇది చూసిన సినీ జనాలు.